యేసు క్రీస్తు యొక్క నామమును మనపై తీసుకొనుట
ఆయన చూచినట్లుగా చూచుట ద్వారా, ఆయన సేవ చేసినట్లుగా సేవ చేయుట ద్వారా-- ఆయన కృప సరిపోవునని నమ్ముట ద్వారా మనము విశ్వాసముగా యేసు క్రీస్తు యొక్క నామమును మనపై తీసుకొందుము గాక.
ఇటీవల, సంఘమును దాని బయల్పరచబడిన పేరు చేత పిలవమన్న అధ్యక్షలు రస్సెల్ ఎమ్. నెల్సన్ యొక్క ఉత్తరువును నేను ధ్యానించినప్పుడు, సంఘము యొక్క పేరు గురించి నీఫైయులకు రక్షకుడు ఉపదేశించిన చోటకు నేను తిరిగాను. 1రక్షకుని యొక్క మాటలను నేను చదివినప్పుడు, “క్రీస్తు యొక్క నామమును మీరు మీపైన తీసుకొనవలెను” 2అని కూడా ఆయన చెప్పినప్పుడు, నేను ఆశ్చర్యపడ్డాను. నావైపు నేను చూసుకొని “ఆయన నన్ను చేయమన్నట్లుగా రక్షకుని యొక్క నామమును నాపై నేను తీసుకొనుచున్నానా?”3 అని ప్రశ్నించినట్లు చేసింది. ఈరోజు నా ప్రశ్నకు జవాబులో నేను పొందిన భావనలలో కొన్నిటిని పంచుకోవాలని నేను కోరుచున్నాను.
మొదట, క్రీస్తు యొక్క నామమును మనపై తీసుకొనుట అనగా దేవుడు చూసినట్లుగా చూచుటకు మనము విశ్వసనీయంగా ప్రయాసపడుట.4 దేవుడు ఎలా చూస్తాడు? జోసెఫ్ స్మిత్ ఇలా చెప్పాడు, “మానవ జాతిలో ఒక భాగము మరొకదానిని కనికరము లేకుండా విమర్శించి మరియు నిందించుచుండగా, విశ్వము యొక్క తండ్రి సమస్త మానవ కుటుంబముపై తండ్రి ప్రేమను మరియు తండ్రి అభిమానముతో చూస్తున్నాడు,” ఏలయనగా “ఆయన ప్రేమ అపారమైనది.” 5
కొన్ని సంవత్సరాల క్రితం మా అక్క చనిపోయింది. ఆమె జీవితము కష్టమైనది. ఆమె సువార్తతో ప్రయాసపడింది మరియు ఎన్నడూ నిజముగా చురుకుగా లేదు. ఆమె భర్త వారి వివాహమును విడిచిపెట్టాడు మరియు పెంచటానికి నలుగురు చిన్న పిల్లలతో అమెను వదిలివేసాడు. ఆమె చనిపోయే సాయంత్రము ఆమె పిల్లలున్న గదిలో, శాంతిగా ఇంటికి తిరిగి వెళ్లాలనే ఒక దీవెనను నేను ఆమెకిచ్చాను. ఆ క్షణమందు నేను చాలా తరచుగా మా అక్క జీవితాన్ని తన శ్రమలు మరియు చురుకుగా లేకపోవుట వంటి పదాలతో వివరించాను. ఆ సాయంత్రము ఆమె తలపై నేను చేతులు ఉంచినప్పుడు, ఆత్మనుండి తీవ్రమైన గద్దింపును నేను పొందాను. నేను ఆమె మంచితనమును చాలా గ్రహించినట్లు చేయబడ్డాను, సువార్త మరియు జీవితముతో ప్రయాసపడిన ఎవరో ఒకరిగా కాకుండా దేవుడు చూచినట్లుగా చూచుటకు, నాకు లేని కష్టమైన సమస్యలతో వ్యవహరించిన ఒకరిగా చూచుటకు నేను అనుమతించబడ్డాను. గొప్ప అడ్డంకులు లక్ష్యపెట్టకుండా, నలుగురు అందమైన, అద్భుతమైన పిల్లలను పెంచిన అద్భుతమైన తల్లిగా నేను చూసాను. మా నాన్న చనిపోయిన తరువాత మా అమ్మకు స్నేహితురాలిగా, ఆమెను కావలికాయుటకు సమయాన్ని తీసుకొన్న, ఒక సహవాసిగా ఆమెను నేను చూసాను.
మా అక్కతో ఆ చివరి సాయంత్రము, దేవుడు నన్ను ఇలా అడుగుతున్నాడని నమ్ముతున్నాను, “నీ చుట్టూ ఉన్న ప్రతీఒక్కరిని ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా నీవు చూడలేవా?”
బ్రిగమ్ యంగ్ బోధించెను:
“మీలాగా వారిని అర్ధము చేసుకొనక, పురుషులు మరియు స్త్రీలను వారివలే చూడమని . . . పరిశుద్ధులను అర్ధించాలని నేను కోరుతున్నాను.” 6
“ఇది ఎంత తరచుగా ఇది చెప్పబడింది —‘ఆ వ్యక్తి తప్పు చేసాడు మరియు అతడు ఒక పరిశుద్ధునిగా ఉండలేడు. ’ . . . కొందరు దుర్భాష వాడటం మరియు అబద్ధాలాడటం మనము వింటాము . . . (లేక) సబ్బాతును ఉల్లంఘించుట . . . అటువంటి వ్యక్తులను విమర్శించకుము, ఎందుకనగా వారి కొరకు ప్రభువు కలిగియున్న ప్రణాళికను మీరు ఎరుగరు . . . బదులుగా వారితో ఓపికగా ఉండుము.”7
మీరు, మీ భారములు ఆయన చేత గుర్తించబడకుండా మన రక్షకుడు చేయుట మీలో ఎవరైనా ఊహించగలరా? రక్షకుడు సమరయుని, వ్యభిచారిని, పన్ను వసూలు చేయు అధికారిని, కుష్టురోగిని, మానసికంగా రోగియైన వానిని, మరియు పాపిని అదే కన్నులతో చూసాడు. అందరూ ఆయన తండ్రి యొక్క పిల్లలు, మరియు అందరూ విమోచింపదగినవారు.
దేవుని యొక్క రాజ్యములో వారి స్థానము గురించి సందేహాలు గల ఎవరినైనా లేక ఏవిధంగానైనా బాధింపబడిన వారినుండి ఆయన తిరిగిపోవుటను మీరూహించగలరా? 8 నేనూహించలేను. క్రీస్తు యొక్క నేత్రములలో, ప్రతీ ఆత్మ అంతులేని విలువైనది. ఏ ఒక్కరూ విఫలమగుటకు ముందుగా నియమించబడరు. నిత్య జీవము అందరికీ సాధ్యమైనది.9
మా అక్క మంచము ప్రక్కన ఆత్మ గద్దింపు నుండి, నేను ఒక గొప్ప పాఠమును నేర్చుకున్నాను: ఆయన చూచినట్లుగా మనము చూచినప్పుడు, మనది రెట్టింపు విజయము---మనము ప్రభావితం చేసేవారి యొక్క విమోచన మరియు మన యొక్క విమోచన.
రెండవది, క్రీస్తు యొక్క నామమును మనపై తీసుకొనుటకు, మనము దేవుడు చూచినట్లుగా చూచుట మాత్రమే కాదు, మనము ఆయన కార్యమును చేయాలి మరియు ఆయన సేవ చేసినట్లుగా సేవ చేయాలి. మనము రెండు గొప్ప ఆజ్ఞలను జీవిస్తున్నాము, దేవుని యొక్క చిత్తమునకు అప్పగించాలి, ఇశ్రాయలును సమకూర్చాలి, మరియు మన వెలుగు “మనుష్యుల యెదుట ప్రకాశింపనియ్యుడి.”10 ఆయన పునస్థాపించబడిన సంఘము యొక్క నిబంధనలకు మరియు విధులను మనము పొంది, జీవించాలి.11 మనము దీనిని చేసినప్పుడు, మనల్ని మనం, మన కుటుంబాలు, మరియు ఇతరుల యొక్క జీవితాలను దీవించుటకు శక్తితో దేవుడు మనల్ని ఆశీర్వదించును.12 మీకై మీరు ప్రశ్నించుకొనుము, “వారి జీవితాలలో పరలోకపు శక్తులు అవసరములేని వారేవరైనా నేను ఎరుగుదునా?”
మనల్ని మనం పరిశుద్ధపరచుకొన్నప్పుడు, దేవుడు మన మధ్య అద్భుతాలను చేయును.13 మన హృదయాలను శుద్ధి చేసుకొనుట ద్వారా మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటాము.14 మనము ఆయనను విన్నప్పుడు,15 మన పాపములను గూర్చి పశ్చాత్తాపపడినప్పుడు, 16 పరివర్తన చెందినప్పుడు,17 మరియు ఆయన ప్రేమించినట్లుగా ప్రేమించినప్పుడు,18 మన హృదయాలను మనము శుద్ధి చేసుకుంటాము. రక్షకుడు మనల్ని అడిగాడు, “మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును?”19
ఇటీవల ఎల్డర్ జేమ్స్ ఈ. టాల్మేజ్ యొక్క జీవితములో నేను నేర్చుకొన్న ఒక అనుభవము, నా చుట్టూ ఉన్నవారిని నేనేలా ప్రేమించాలి మరియు సేవ చేయాలో నిదానించి ఆలోచించునట్లు చేసింది. ఆయన ఒక అపొస్తులునిగా కాకముందు, యౌవన ప్రొఫెసరుగా ఉండి, 1892 లో ప్రమాదకరమైన డిఫ్తీరియా వ్యాధి చాలా తీవ్రంగా ఉన్న సమయములో, ఆయన ఇంటికి దగ్గరలో నివసిస్తూ, వ్యాధిగ్రస్తులైన, సంఘ సభ్యులు కాని పరాయి కుటుంబమును కనుగొన్నాడు. వ్యాధి సోకిన ఇంటిలోపలికి వెళ్లుట ద్వారా తమను తాము అపాయములో ఉంచుకోవాలని ఎవరూ కోరలేదు. అయినప్పటికినీ, ఎల్డర్ టాల్మేజ్, వెంటనే ఇంటికి వెళ్లాడు. ఆయన నలుగురు పిల్లలను కనుగొన్నాడు: రెండున్నర సంవత్సరాల బిడ్డ మంచంపై చనిపోయి ఉన్నది, ఐదు, పది సంవత్సరాల బిడ్డలు గొప్ప బాధలో, మరియు పదమూడు సంవత్సరాల అమ్మాయి బలహీనమై ఉన్నారు. తల్లిదండ్రులు వేదనతో, అలసటతో బాధపడుచున్నారు.
ఎల్డర్ టాల్మేజ్ చనిపోయిన వారికి, బ్రతికిన వారికి దుస్తులు ధరింప చేసారు, గదులు తుడిచాడు, మురికి దుస్తులను తీసుకొనివెళ్లాడు, మరియు వ్యాధితో నిండిన మురికి రగ్గులను కాల్చివేసాడు. ఆయన పగలంతా పనిచేసాడు మరియు మరుసటి ఉదయము తిరిగి వెళ్లాడు. ఆ రాత్రి పది సంవత్సరాల బిడ్డ చనిపోయాడు. ఆయన ఐదు సంవత్సరాల బిడ్డను పైకెత్తి, పట్టుకున్నాడు. ఆమె ఆయన ముఖమంతటిపై, దుస్తులపై రక్తపు వాంతి చేసుకుంది. ఆయన ఇలా వ్రాసాడు, “నేను ఆమెను క్రిందకు దించలేకపోయాను,” మరియు ఆమె అతడి చేతులలో చనిపోయేంత వరకు ఆమెను ఎత్తుకున్నాడు. ముగ్గురు పిల్లలను సమాధి చేయటానికి ఆయన సహాయపడ్డాడు మరియు దుఃఖిస్తున్న కుటుంబము కొరకు ఆహారము మరియు పరిశుభ్రమైన దుస్తులను ఏర్పాటు చేసారు. ఇంటికి తిరిగి వెళ్ళాక, సహోదరుడు టాల్మేజ్ తన దుస్తులను పారేసాడు, జింకు రసాయనముతో స్నానము చేసాడు, తన కుటుంబమునకు దూరముగా ఉన్నాడు, మరియు ఆ వ్యాధి స్వల్పంగా సోకి బాధపడ్డారు. 20
మన చుట్టూ ఉన్న అనేక జీవితాలు అపాయములో ఉన్నాయి. పరిశుద్ధులు రక్షకుని యొక్క నామమును వారిపై తీసుకొనుట ద్వారా పరిశుద్ధులగుచున్నారు మరియు వారు ఎవరైనప్పటికినీ లక్ష్యపెట్టకుండా అందరికి పరిచర్య చేయుచున్నారు---మనము ఆవిధంగా చేసినప్పుడు జీవితాలు రక్షించబడినవి.21
చివరిగా, ఆయన నామమును మనపైకి తీసుకొనుటకు మనము ఆయనను విశ్వసించాలని నేను నమ్ముచున్నాను. ఒక ఆదివారము నేను హాజరైన ఒక సమావేశమందు, ఒక యువతి ఈ క్రింది ప్రశ్న అడిగింది: “ఈ మధ్యే నేను నా స్నేహితుడు విడిపోయాము, మరియు అతడు సంఘమును విడిచి వెళ్లుటకు ఎన్నుకున్నాడు. అతడు ఎన్నడూ అంత సంతోషంగా లేడని నాకు చెప్పాడు. ఇది ఎలా సాధ్యము?”
ఆయన నీఫైయులకు చెప్పినప్పుడు, రక్షకుడు ఈ ప్రశ్నకు జవాబిచ్చాడు, “కానీ (మీ జీవితము) నా సువార్తపై కట్టబడని యెడల, మరియు మనుష్యుల యొక్క క్రియల పైన, లేక అపవాది యొక్క క్రియల పైన కట్టబడిన, నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను. వారి క్రియలయందు కొంత కాలము వారు సంతోషము కలిగియుందురు మరియు త్వరలోనే, అంతము వచ్చును.”22 యేసు క్రీస్తు యొక్క సువార్త వెలుపల శాశ్వతమైన సంతోషము లేదు.
అయినప్పటికినీ, ఆ సమావేశములో, నేను గొప్ప భారములతో మరియు వారికి చాలా కష్టమైన ఆజ్ఞలతో ప్రయాసపడుచున్న అనేకమంది మంచి జనులను గూర్చి ఆలోచించాను. నాకై నేను ప్రశ్నించుకున్నాను, “రక్షకుడు వారికింకా ఏమి చెప్పగలడు? 23 ఆయన, “మీరు నన్ను విశ్వసిస్తున్నారా?”24 అని అడుగుతారని నేను నమ్ముచున్నాను. రక్తస్రావముగల స్త్రీతో, ఆయన అన్నారు, “నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవైపొమ్ము.” 25
నా ప్రియమైన లేఖనాలలో ఒకటి యోహాను 4:4, అది “ఆయన సమరయ మార్గమును వెళ్లవలసివచ్చెను,” అని చదవబడును.
ఆ లేఖనమును నేను ఎందుకు ప్రేమిస్తున్నాను? ఎందుకనగా యేసు సమరయకు వెళ్లాల్సిన అవసరము లేదు. ఆయన కాలములోని యూదులు సమరయులను ద్వేషించారు మరియు సమరయ చుట్టూ ఉన్న దారిలో ప్రయాణించారు. కానీ మొదటిసారిగా తానే వాగ్దానము చేయబడిన మెస్సయానని సమస్త లోకము యెదుట ప్రకటించుటకు అక్కడికి వెళ్లుటకు యేసు ఎన్నుకున్నాడు. ఈ సందేశము కొరకు ఆయన బహిష్కరించబడిన గుంపును ఎన్నుకొనుట మాత్రమే కాదు, కాని ఒక స్త్రీని ఎన్నుకున్నాడు---కేవలము ఏ స్త్రీ అయినా కాదు కానీ, పాపములో జీవిస్తున్న స్త్రీ---ఆ సమయమందు మిక్కిలి అల్పురాలిగా భావించిన ఒకరిని. మన భయాలు, మన వ్యసనాలు, మన సందేహాలు, మన శోధనలు, మన పాపములు, మన విడిపోయన కుటుంబాలు, మన నిరాశ మరియు ఆందోళనలు, మన దీర్ఘకాల వ్యాధి, మన పేదరికము, మనము దూషించబడుట, మన నిరాశ, మరియు మన ఒంటరితనము కంటే ఆయన ప్రేమ గొప్పదని మనలో ప్రతీఒక్కరూ గ్రహించునట్లు యేసు దీనిని చేసాడని నేను నమ్ముచున్నాను.26 ఆయన స్వస్థపరచని మరియు శాశ్వతమైన సంతోషమును ఇవ్వని ఎవరూ, ఏదీ లేరని అందరూ తెలుసుకోవాలని ఆయన కోరుతున్నాడు.27
ఆయన కృప సరిపోవును.28 ఆయన ఒంటరిగా సమస్త విషయాల క్రిందుగా దిగివచ్చాడు. ఆయన ప్రాయశ్చిత్తము యొక్క శక్తి మన జీవితములోని ఏ భారమునైనా జయించుటకు శక్తిని కలిగియున్నది.29 బావి వద్ద స్త్రీ యొక్క సందేశమేదనగా ఆయన మన జీవితపు పరిస్థితులను ఎరుగును30 మరియు మనము ఎక్కడ నిలబడినప్పటికినీ, మనము ఎల్లప్పుడు ఆయనతో నడవగలము. ఆమెకు, మనలో ప్రతీ ఒక్కరికి ఆయన చెప్పారు, “నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును.” 31
ఎవరి యొక్క జీవితపు ప్రయాణాలలోనైనా మిమ్మల్ని స్వస్థపరచి, విడిపించుటకు సమస్త శక్తిగల ఏకైక రక్షకుని నుండి మీరెప్పుడైన ఎందుకు మరలిపోతారు? ఆయనను విశ్వసించుటకు మీరు చెల్లించు మూల్యము ఏదైనప్పటికినీ అది విలువైనది. నా సహోదర, సహోదరిలారా, పరలోక తండ్రి మరియు మన రక్షకుడైన, యేసు క్రీస్తునందు మన విశ్వాసమును హెచ్చించుటకు మనము ఎన్నుకుందామా.
యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము రక్షకుని యొక్క సంఘము రక్షకుని యొక్క సంఘమని, నిజమైన ప్రవక్త ద్వారా జీవిస్తున్న క్రీస్తు ద్వారా నడిపించబడుతున్నామని నా ఆత్మ లోతులనుండి సాక్ష్యమిస్తున్నాను. ఆయన చూచినట్లుగా చూచుట ద్వారా, ఆయన సేవ చేసినట్లుగా సేవ చేయుట ద్వారా, మనకు గృహమును, శాశ్వతమైన సంతోషమును ఇచ్చుటకు ఆయన కృప సరిపోవునని విశ్వసించుట ద్వారా--- మనము యేసు క్రీస్తు యొక్క నామమును మనపైకి విశ్వాసముగా తీసుకోవాలని నా ప్రార్థన. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.