2010–2019
నడిపించు ఆత్మలు
అక్టోబర్ 2018


నడిపించు ఆత్మలు

ప్రేమతో మనం ఇతరులను సమీపిస్తాము ఎందుకంటే దీనిని చెయ్యమనే మన రక్షకుడు మనకు ఆజ్ఞాపించెను.

ఇటీవల నా స్నేహితునితో జరిగిన సంభాషణలో- తాను సంఘములో క్రొత్తగా బాప్తీస్మము పొందిన యువకునిగా ఉన్నప్పుడు, అకస్మాత్తుగా తన వార్డులో తాను స్వాగతించబడని వానిగా భావించానని నాతో చెప్పాడు. తనకు బోధించిన మిషనరీలు దూరముగా బదిలీ అయ్యారని, ఎవరు తనను పట్టించుకోవడం లేదని అతడు భావించాడు. వార్డులో స్నేహితులు లేకపోవడం వలన, అతడు తన పాత స్నేహితులను కనుగొని, వారితో కలిసి వేర్వేరు కార్యక్రమాలలో నిమగ్నమై యుండటం వలన, సంఘములో అతడు పాల్గొనలేకపోయాడు-ఎంతగానంటే అతడు చేసుకొన్న ఎంపికలు అతడ్ని సంఘమునుండి దూరము చేసాయి. తన తోటి వార్డు సభ్యుడు ఒకరు తన స్నేహ హస్తమును అందించి తిరిగి రమ్మని మనఃపూర్వకముగా, సంఘటితముగా ఆహ్వానించినందుకు ఎంతో కృతజ్ఞత కలిగియున్నానని అతడు కన్నీళ్లతో వివరించాడు. కొన్ని నెలలలోనే, సంఘములో చురుకుగా పాల్గొనుచు, ఇతరులను, తనను బలపరుచుకోసాగాడు. ఎల్డర్ కార్లోస్ ఏ. గోడోయ్ అనే ఈ యువకుని కొరకు వెదకిన బ్రెజిల్‌లో ఉన్న ఆ సంఘ సభ్యునికి మనమెంత కృతజ్ఞత కలిగియున్నాము, అతడు ఇప్పుడు డెబ్బది యొక్క అధ్యక్షత్వములో సభ్యునిగా నా వెనుక కూర్చొనియున్నారు.

అటువంటి చిన్న ప్రయత్నాలు నిత్య పరిణామాలు కలిగియుండగలవు అనుట విశేషమైనది కాదా? ఈ సత్యము సంఘ పరిచర్య ప్రయత్నాలకు కేంద్రము. పరలోక తండ్రి మన సామాన్యమైన, అనుదిన ప్రయత్నాలను ఆశ్చర్యకరముగా మార్చగలరు. “మనం ఒకరినొకరు సంరక్షించుకొను విధానములో ప్రభువు కొన్ని ముఖ్యమైన సర్దుబాట్లు చేసెను”1 అని, “ఇతరులను సంరక్షించి, పరిచర్యచేయుటలో మనం ఒక క్రొత్తదైన, పరిశుద్ధమైన విధానాన్ని అమలుచేద్దాం. ఈ ప్రయత్నాలను మనం “పరిచర్య చేయుట’”2 అని సూచిద్దాం అని వివరిస్తూ అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ప్రకటించి ఆరు నెలలు మాత్రమే అయ్యింది.

“ప్రభువు యొక్క యధార్థమైన, సజీవమైన సంఘము యొక్క ముఖ్యమైన లక్షణమేదనగా ఎల్లప్పుడు దేవుని యొక్క పిల్లలలో ప్రతి ఒక్కరికి మరియు వారి కుటుంబాలకు పరిచర్య చేయుటకు క్రమమైన, నిర్దేశితమైన ప్రయత్నము అని కూడా అధ్యక్షులు నెల్సన్ వివరించారు. అది ఆయన సంఘము గనుక, ఆయన సేవకులుగా మనము ఆయనవలె ఒక్కొక్కరికి పరిచర్య చేస్తాము. ఆయన నామమునందు, ఆయన శక్తి మరియు అధికారముతో, ఆయన ప్రేమగల దయతో మనం పరిచర్య చేస్తాము.”3

ఆ ప్రకటన చేసినప్పటి నుండి, మీ స్పందన అద్భుతము! సజీవులైన మన ప్రవక్త చేత నడిపించబడుచున్నట్లుగా ప్రపంచములో ఉన్న దాదాపు ప్రతి స్టేకులో ఈ మార్పులను అమలుపరచుటలో గొప్ప విజయము సాధించిన నివేదికలను మేము పొందియున్నాము. ఉదాహారణకు, పరిచర్య చేయు సహోదరులు సహోదరీలు కుటుంబాలకు నియమించబడెను, యువకులు యువతులతో కలిపి సహవాసములు ఏర్పాటు చేయబడెను మరియు పరిచర్య మౌఖిక పరీక్షలు జరుగుచున్నవి.

“గృహములో మరియు సంఘములో సువార్త బోధన మధ్య ఒక క్రొత్త సమతుల్యతను మరియు సంబంధమును”4 నిన్న బయల్పరచబడిన ప్రకటనకు ఆరు నెలలకు ముందుగా పరిచర్య చేయుటపై బయల్పరచబడిన ప్రకటన యాదృచ్ఛికమైన సంఘటన అని నేను అనుకోను. జనవరి ప్రారంభంనుండి, మన సంఘ ఆరాధనలో ఒక గంట తక్కువ గడిపినప్పుడు, పరిచర్య చేయుటలో మనము నేర్చుకున్న సమస్తము, కుటుంబము మరియు ప్రియమైన వారితో ఉన్నతమైన, గృహ కేంద్రీకరితమైన సబ్బాతు దినమును అనుభవించుటలో శూన్యతను సరిచూచుటకు మనకు సహాయపడును.

నిర్మాణాత్మక వ్యవస్థ క్రమములో ఉండగా, “ప్రభువు మార్గములో మనం పరిచర్య చేయుచున్నామని మనకేవిధంగా తెలుసు? మంచి కాపరి ఉద్దేశించిన విధానములో మనం ఆయనకు సహాయం చేయుచున్నామా?”

ఇటీవల అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్‌తో జరిగిన చర్చలో, ఈ గమనించదగని మార్పులకు అలవాటుపడుచున్న సభ్యులను ఆయన అభినందించారు, అంతేకాదు పరిచర్య చేయడం అనేది కేవలం “కేవలం మర్యాదగా ఉండుట” కంటే ఎక్కువని సభ్యులు గుర్తిస్తారని ఆయన తన హృదయపూర్వక ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. మర్యాదగా ఉండుట ముఖ్యము కాదని చెప్పడం లేదు కాని, పరిచర్య చేయు నిజమైన ఆత్మను అర్థం చేసుకున్నవారు అది కేవలం మర్యాదగా ఉండుట కంటే అతీతమైనదని వారు తెలుసుకుంటారు. ప్రభువు యొక్క విధానములో చేయబడి, అది ఎల్డర్ గోడోయ్‌కు చేసినట్లే మంచి కొరకు నిత్యత్వమంతా కొనసాగునటువంటి శాశ్వతమైన ప్రభావాన్ని పరిచర్య చేయుట కలిగియుండగలదు.

“రక్షకుడు ప్రేమతో సేవ చేసిన విధంగా, పరిచర్య చేయడమంటే ఏమిటో తన మాదిరి ద్వారా చూపించెను. . . ఆయన. . . తన చుట్టూ ఉన్నవారికి బోధించెను, వారి కొరకు ప్రార్థించెను, ఆదరించెను, దీవించెను మరియు ఆయనను వెంబడించమని అందరిని ఆహ్వానించెను. సంఘ సభ్యులు [ఉన్నతమైన, పరిశుద్ధమైన మార్గములో] పరిచర్య చేసినప్పుడు ఆయన చేసినట్లే-‘సంఘమును ఎల్లప్పుడు కావలికాయుటకు, వారితో ఉండి వారిని బలపరచుటకు’ ‘ప్రతి సభ్యుని గృహమును దర్శించుటకు’మరియు ప్రతీ ఒక్కరు యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులగుటలో సహాయము చేయుటకు వారు ప్రార్థనాపూర్వకముగా వెదుకుతారు.” 5

నిజమైన కాపరి తన గొర్రెలను ప్రేమించునని, వాటిని పేరు పేరున ఎరుగునని వాటియందు “వ్యక్తిగత ఆసక్తిని కలిగియున్నాడని,”6 మనము గ్రహించాము.

చిత్రం
పర్వతములందు గొర్రెలు

అనేక సంవత్సరాలుగా తెలిసిన ఒక స్నేహితుడు కఠినమైన రాతి పర్వతాలలో ఆవులను, గొర్రెలను పెంచుతు పశువుల కాపరిగా, తన జీవితమును గడిపెను. గొర్రెలను పెంచుటలో గల సవాళ్ళు, ప్రమాదాల గురించి అతడు ఒకసారి నాతో చెప్పాడు. వసంత కాలపు ఆరంభములో, విశాలమైన పర్వత శ్రేణులలో చాలావరకు మంచు కరిగిపోయినప్పుడు, తన కుటుంబపు గొర్రెల మంద సుమారు 2000 గొర్రెలను వేసవికాలములో అక్కడ ఉంచాడని అతడు వివరించాడు. అక్కడ శరత్కాలము ముగిసే వరకు అవి వేసవి బీడు నుండి శీతాకాలపు బీడు వరకు సంచరించినప్పుడు అతడు గొర్రెలను కాచెను. ఆ పెద్ద గొర్రెల మందను పెంచుట ఎంతో కష్టమని, దానికి వేకువ జాములు మరియు అర్థరాత్రులు అవసరమని, సూర్యోదయము కంటే ముందే లేచి, చీకటిపడిన చాలా సేపువరకు పనిపూర్తిచేయడం అవసరమని అతడు వివరించెను. అతడు ఒక్కడే ఆ పనిని చేయుట అతనికి సాధ్యముకాలేదు.

చిత్రం
గొర్రెతో కాపరి చేయి

మందను పెంచుటకు ఇతరులు కూడా అతడికి సహాయం చేసారు, వారిలో అనుభవము గల కాపరులు మరియు ఆ కాపరులకు సహాయము చేసి-తమ సహచరుల యొక్క జ్ఞానముచేత లాభపడుచున్న-యౌవన కాపరులు కలరు. రెండు వృద్థ గుర్రములు, శిక్షణ పొందుచున్న రెండు యౌవన గుర్రములు, రెండు గొర్రెలను కాచు కుక్కలు, రెండు లేక మూడు గొర్రెలను కాచు కుక్కపిల్లలపైన కూడా అతడు ఆధారపడెను. వేసవికాలములో నా స్నేహితుడు మరియు అతని గొర్రెలు గాలి, తుఫాను, అనారోగ్యము, గాయములు, క్షామము మరియు ఒకరు ఊహించగలిగే ప్రతి ఇతర కష్టాలను ఎదుర్కొన్నారు. కొన్ని సంవత్సరాలు గొర్రెల ప్రాణాలు కాపాడుటకు వేసవికాలమంతా వారు నీటిని తోడవలసి వచ్చేది. తరువాత ప్రతి సంవత్సరము శరత్కాలము ముగిసే వరకు, శీతాకాలపు వాతావరణము మొదలైనప్పుడు, గొర్రెలను పర్వతముల నుండి తీసుకొనివెళ్లి, లెక్కపెట్టినప్పుడు సాధారణముగా 200 కంటే ఎక్కువ గొర్రెలు తప్పిపోవును.

చిత్రం
గొర్రెలను పోషించుట
చిత్రం
గొర్రెల మంద

వసంతకాలపు ఆరంభములో పర్వతాలలో ఉంచబడిన 2000 గొర్రెలు, ప్రతి శరత్కాలము ముగిసేసరికి 1800 కంటే తక్కువగా అయ్యేవి. తప్పిపోయిన వాటిలో చాలా వరకు రోగము లేదా సహజ మరణమువలన కాదు కాని, పర్వతపు సింహాలు లేదా కుక్కలవంటి ఇతర జంతువులను చంపితినే జంతువుల వలన కోల్పోబడును. సాధారణంగా సురక్షితమైన మందనుండి తప్పిపోయిన లేదా తమ గొర్రెల కాపరియొక్క కాపుదలనుండి తప్పించుకున్న గొర్రెలను ఈ ఇతర జంతువులను చంపి తినే జంతువులు కనుగొంటాయి. నేనిప్పుడు వివరించిన దానిని ఒక్క క్షణం మీరు ఆత్మీయ అర్థములో పరిగణిస్తారా? గొర్రెల కాపరి ఎవరు? మంద ఎవరు? గొర్రెల కాపరికి సహాయం చేసేవారు ఎవరు?

చిత్రం
మంచి కాపరి

ప్రభువైన యేసు క్రీస్తు ఇలా చెప్పారు, “నేను గొర్రెల మంచి కాపరిని, నేను నా గొర్రెలను ఎరుగుదును, … మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను.”7

చిత్రం
యేసు తన గొర్రెలను మేపుచున్నాడు

యేసు “తన గొర్రెలను మేపును మరియు ఆయనయందు అవి తమ పచ్చికను కనుగొనును” 8 అని ప్రవక్తయైన నీఫై కూడా అదేవిధంగా బోధించెను. “యెహోవా నా కాపరి” 9 మరియు మనలో ప్రతి ఒక్కరిని ఆయన యెరిగియున్నారు మరియు మనం ఆయన సంరక్షణలో ఉన్నాము అని తెలిసి నేను శాశ్వతమైన సమాధానమును పొందుతాను. జీవితపు కష్టాలు, ఇబ్బందులను, అనారోగ్యము, గాయములు, క్షామమును మనమెదుర్కొన్నప్పుడు, మన కాపరియైన ప్రభువు మనకు పరిచర్య చేయును. మన ఆత్మలను ఆయన పునఃస్థాపించును.

పెద్దవారు మరియు యౌవనులైన కాపరులు, గుర్రములు, గొర్రెలను కాచు కుక్కల సహాయముతో నా స్నేహితుడు గొర్రెలను పెంచినట్లే, ఆయన మందలో ఉన్న గొర్రెలను సంరక్షించే సవాలుతో కూడిన పనిలో ప్రభువుకు సహాయము కావాలి.

చిత్రం
యేసు క్రీస్తు పరిచర్య చేయుట

ప్రేమగల పరలోక తండ్రి యొక్క పిల్లలుగా, ఆయన మందలో గొర్రెలుగా, యేసు క్రీస్తు చేత వ్యక్తిగతముగా పరిచర్య చేయబడే దీవెనను మనం ఆనందిస్తాము. అదేవిధంగా, మనము కూడా గొర్రెల కాపరిగా మన చుట్టూ ఉన్నవారికి పరిచర్య సహకారము అందించే బాధత్యను మనం కలిగియున్నాము. “నీవు నాకు సేవ చేసెదవు మరియు నా నామమందు ముందుకు వెళ్ళి … నా గొర్రెలను కలిపి చేర్చెదవు.”10 అనే ప్రభువు యొక్క మాటలను మనం వింటాము.

గొర్రెల కాపరి ఎవరు? దేవుని రాజ్యములో ప్రతీ పురుషుడు, స్త్రీ మరియు బిడ్డ ఒక గొర్రెల కాపరి. ఏ పిలుపు కూడా అవసరము లేదు. ఆల్మా ఇలా ఉద్ఘాటించాడు: “అనేకమైన గొర్రెలు కలిగిన ఏ కాపరియైనను తోడేళ్ళు ప్రవేశించి అతని మందను తినివేయకుండునట్లు వాటిపైన కావలి కాయకుండునా? అతడు దానిని బయటికి తోలివేయడా?” 11 బాప్తీస్మపు నీటిలోనుండి మనం బయటకు వచ్చిన క్షణం నుండి ఈ పని మనకు అప్పగించబడెను. ప్రేమతో మనం ఇతరులను సమీపిస్తాము ఎందుకంటే దీనిని చెయ్యమనే మన రక్షకుడు మనకు ఆజ్ఞాపించెను. మన పొరుగువారు భౌతికంగా లేదా ఆత్మీయముగా దుఃఖములో ఉన్న ప్రతసారి, వారికి సహాయము చేయుటకు మనం తొందరపడతాము. అవి తేలికగుటకు ఒకరి భారాలు మరొకరు భరిస్తాము. దుఃఖించు వారితో దుఃఖపడతాము. ఆదరణ యొక్క అవసరములో ఉన్నవారిని ఆదరిస్తాము.12 ప్రభువు ప్రేమ పూర్వకముగా దీనిని మననుండి ఆశించును. తన మందకు పరిచర్య చేయుటలో మనం తీసుకొను శ్రద్ధ గురించి ఆయన మనలను జవాబుదారులుగా చేయు దినము వచ్చును.13

పర్వత శ్రేణులలో గొర్రెలను కావలి కాయుటలో మరొక ముఖ్యమైన అంశాన్ని గొర్రెల కాపరియైన నా స్నేహితుడు చెప్పాడు. తప్పిపోయిన గొర్రెలు మరిముఖ్యముగా జంతువులను చంపితినే జంతువులకు చిక్కే ప్రమాదానికి లోనౌతాయి. వాస్తవానికి అతని మరియు అతని జట్టు యొక్క సమయమంతటిలో 15 శాతం వరకు తప్పిపోయిన గొర్రెలను వెదకటానికి కేటాయించబడుతుంది. తప్పిపోయిన గొర్రెలు అవి మందనుండి చాలాదూరం వరకు వెళ్లేలోపు త్వరగా కనుగొంటే, గొర్రెలకు హాని చెయ్యబడటం చాలా తక్కువగా ఉంటుంది. తప్పిపోయిన గొర్రెలను తిరిగి పొందుటకు చాలా సహనము, క్రమశిక్షణ అవసరము.

కొన్ని సంవత్సరాల క్రితం స్థానికి వార్తాపత్రికలో నేను ఒక వ్యాసాన్ని కనుగొన్నాను అది ఎంత ఆసక్తికరంగా ఉందంటే దానిని నేను దాచియుంచాను. మొదటి పేజీ ప్రధానవార్త ఇలా వ్రాయబడింది, “దృఢచిత్తము గల శునకము తప్పిపోయిన గొర్రెను విడిచిపెట్టదు.”14 నా స్నేహితుడు ఉన్న స్థలానికి దగ్గరలో ఉన్న పశువుల మందకు చెందియుండి, వాటిలో కొన్ని వేసవి కాలాంతములో ఏదోకారణము చేత వెనుక విడిచిపెట్టబడ్డాయని ఈ వ్యాసము వివరించును. రెండు లేక మూడు నెలల తరువాత అవి పర్వతములలో మంచులో చిక్కుకుపోయాయి. ఆ గొర్రెలు వెనుక విడిచిపెట్టబడినప్పుడు, గొర్రెలను కాచు ఆ శునకము వాటితో ఉండెను, ఎందుకంటే గొర్రెలకు కావలి కాచి, వాటిని కాపాడుట దాని బాధ్యత. అది వాటికి కాపలాకాయుట ఆపలేదు. అది అక్కడే ఉండి-శీతలమైన, మంచుతోకూడిన వాతావరణములో నెలల పాటు తప్పిపోయిన గొర్రెల చుట్టూ చక్కర్లు కొట్టుచు పర్వతపు కుక్కలు, సింహాలు లేదా గొర్రెలకు హాని కలిగించు జంతువులను చంపితినే మరేఇతర జంతువుల భారిన పడకుండా వాటికి రక్షణ కవచముగా ఉండెను. గొర్రెల కాపరి మరియు గొర్రెల మంద యొద్దకు సురక్షితముగా చేరేవరకు ఆ మందను నడిపించగలిగే వరకు లేదా కాయగలిగే వరకు అది అక్కడ ఉండెను. ఈ వ్యాసములో మొదటి పేజీలో బంధించబడిన బొమ్మ ఈ గొర్రెలను కాచు శునకము యొక్క సుగుణమును దాని కళ్ళలోను, నడవడిలోను చూచుటకు సాధ్యపరుచును.

చిత్రం
కావలికాయు శునకము యొక్క కళ్ళు మరియు నడవడి యొక్క లక్షణము

తప్పిపోయిన గొర్రెలకు కాపరులుగా, పరిచర్య చేయు సహాదరీ, సహోదరులుగా మన బాధ్యతకు సంబంధించి మరింత పరిజ్ఞానమును అందించే రక్షకుని యొక్క ఉపమానమును, సూచనను క్రొత్త నిబంధనలో, మనం కనుగొంటాము:

“మీలో ఏ మనుష్యునికైనను నూరు గొర్రెలు కలిగి యుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడు తొంబది తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి, తప్పిపోయినది దొరకువరకు దానిని వెదక వెళ్లడా?

“అది దొరకినప్పుడు సంతోషముతో దానిని తన భుజములమీద వేసికొని,

“యింటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతోకూడ సంతోషించుడి; తప్పి పోయిన నా గొర్రె దొరకినదని వారితో చెప్పును గదా.”15

ఈ ఉపమానములో బోధించబడిన పాఠమును క్లుప్తీకరించినప్పుడు, ఈ విలువైన ఉపదేశమును మనం కనుగొంటాము:

  1. మనము తప్పిపోయిన గొర్రెను గుర్తించాలి.

  2. మనము అవి దొరికే వరకు వాటి కొరకు వెదకాలి.

  3. అవి దొరికినప్పుడు, వాటిని మన భుజాలపైన వేసుకొని వాటిని మనము ఇంటికి తీసుకొనిరావాలి.

  4. అవి తిరిగి వచ్చినప్పుడు, వాటి చుట్టూ స్నేహితులు ఉండేలా చూడాలి.

సహాదరీ, సహాదరులారా, తప్పిపోయిన గొర్రెలకు పరిచర్య చేయునప్పుడు మనకు గొప్ప సవాళ్ళు, గొప్ప బహుమానాలు వస్తాయి. మోర్మన్ గ్రంథములో సభ్యులు “వారి జనులను కనిపెట్టియుండి నీతిని గూర్చిన వాక్యములతో వారిని పోషించిరి.”16 పరిచర్య చేయడమనేది “ఆత్మచేత నడిపించబడటం, . . . ప్రణాళికలో మార్పుకు సమ్మతముగా ఉండటం మరియు . . . ప్రతి సభ్యుని అవసరాలకు తగినట్లుగా మార్పులు చేయడం” అని మనం జ్ఞాపకం చేసుకొన్నప్పుడు వారి మాదిరిని మనం అనుసరించగలము. “ వ్యక్తులు, కుటుంబాలు వారి తరువాతి విధులకు సిద్ధపడుటలో, [వారి] నిబంధనలు పాటించుటలో. . … , వారు తమ కాళ్ళపై నిలబడునట్లుగా వారగుటలో సహాయము చేయుటకు ప్రయత్నించుట”17 కూడా అత్యవసరము.

పరలోక తండ్రికి ప్రతి ఆత్మ అమూల్యమైనది. పరిచర్య చేయమని ఆయన ఇచ్చిన ఆహ్వానము ఆయనకు అత్యంత గొప్ప విలువైనది, ప్రాముఖ్యమైనది, ఎందుకంటే అది ఆయన కార్యము మరియు మహిమయై యున్నది. అది పూర్తి అక్షరార్థములో నిత్యత్వము యొక్క కార్యము. ఆయన దృష్టిలో ఆయన యొక్క ప్రతి బిడ్డకు అమూల్యమైన సామర్థ్యము కలదు. మీరు గ్రహింపశక్యముకాని ప్రేమతో ఆయన మిమ్ములను ప్రేమిస్తున్నారు. ఆ అంకితభావముగల గొర్రెలను కాచు శునకమువలె, ప్రభువు మిమ్మును గాలి, తుఫాను, మంచు ఇంకా అనేకమైన వాటినుండి రక్షించుటకు పర్వతముపైన నిలిచియుండును.

గత సమావేశములో అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మనకు ఇలా బోధించారు: “ప్రపంచానికి [మరియు “మన పరిచర్య చేయు మందకు”] అని నేను చేర్చవచ్చునా] వారికి మా సందేశము చాలా సరళమైనది, యధార్థమైనది: తెరకు రెండువైపుల ఉన్న దేవుని పిల్లలు రక్షకుని యొద్దకు వచ్చి, పరిశుద్ధ దేవాలయపు దీవెనలు పొంది, శాశ్వత ఆనందాన్ని కలిగియుండి, నిత్యజీవమునకు అర్హులు కావాలని మేము వారిని ఆహ్వానిస్తున్నాము.”18

ఈ ప్రవచనాత్మక దర్శనమునకు అనుగుణంగా మనం ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకొంటామని నేను ఆశిస్తున్నాను, ఆవిధంగా దేవాలయానికి, చివరకు మన రక్షకుడైన యేసు క్రీస్తు యొద్దకు ఆత్మలను నడిపించగలము. మనము అద్భుతాలు చెయ్యాలని ఆయన ఆశించరు. మన సహాదరులను, సహోదరీలను ఆయన యొద్దకు తీసుకొని రమ్మని మాత్రమే ఆయన అడుగుచున్నారు, ఎందుకంటే వారి ఆత్మలను విమోచించుటకు ఆయన శక్తి కలిగియున్నారు. ఆవిధంగా మనం చేసినట్లైతే, ఈ వాగ్దానాన్ని మనం పదిలపరచుకోగలము: “ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు.”19 దీని గురించి మరియు యేసు క్రీస్తు మన రక్షకునిగా మరియు విమోచకునిగా ఆయన గురించి- యేసు క్రీస్తు నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

ముద్రించు