అందరూ తండ్రి చేత ఇవ్వబడిన నామమును వారిపై తీసుకోవాలి
రక్షకుని యొక్క నామము ప్రత్యేకమైనది మరియు ముఖ్యమైన శక్తిని కలిగియున్నది. అది ఒక్కటే నామము రక్షణను సాధ్యపరచును.
కొన్నివారాల క్రితం, నేను ఎనిమిదేళ్ళ వయస్సు గల అనేకమంది పిల్లల బాప్తీస్మములో పాల్గొన్నాను. వారు తమ తల్లిదండ్రుల నుండి, బోధకుల నుండి యేసు క్రీస్తు సువార్తను నేర్చుకోవడం ప్రారంభించారు. ఆయన యందు వారి విశ్వాసపు విత్తనం ఎదగడం ఆరంభమైంది. ఇప్పుడు పునఃస్థాపించబడిన ఆయన సంఘ సభ్యులు కావడానికి బాప్తీస్మపు జలములలోనికి వెళ్ళాలని వారు కోరుకున్నారు. వారి నిరీక్షణను నేను గమనించినప్పుడు, వారి బాప్తీస్మపు నిబంధనలో ఒక ముఖ్యభాగమైన యేసు క్రీస్తు నామమును తమపై తీసుకొనుటకు వారి ఒడంబడికను, వారు ఎంత వరకు అర్థం చేసుకున్నారోనని నేను ఆశ్చర్యపడ్డాను.
ఆది నుండి, మన కోసం ఆయన ప్రణాళికలో యేసు క్రీస్తు నామము యొక్క ఆధిక్యతను దేవుడు ప్రకటించారు. “మీరు చేసే సమస్తమును కుమారుని నామమున చేయుడి, మరియు మీరు పశ్చాత్తాపపడి, ఎల్లప్పుడూ కుమారుని నామమున దేవునిని పిలువుడి,”1 అని ఒక దేవదూత మన మొదటి తండ్రియైన ఆదాముకు బోధించెను.
“మరేయితర నామము లేక ఏ ఇతర మార్గము లేక సాధనము ద్వారా రక్షణ రాదని,”2 మోర్మన్ గ్రంథ ప్రవక్తయైన రాజైన బెంజిమెన్ తన జనులకు బోధించారు.
“ఇదిగో, యేసు క్రీస్తు అను నామము తండ్రి చేత ఇవ్వబడెను, మనుష్యుడు రక్షించబడుటకు మరే ఇతర నామము ఇవ్వబడలేదు”3 అనే సత్యాన్ని ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్‌కు ప్రభువు పునరుద్ఘాటించారు.
మన కాలములో, అధ్యక్షులు డాల్లిన్ హెచ్. ఓక్స్ మనకు బోధించారు, “యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామమందు విశ్వాసాన్ని అభ్యసించి, . . . . ఆయన నిబంధనలో ప్రవేశించువారు. . . యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తః త్యాగములో హక్కు పొందగలరు.”4
మన పరలోక తండ్రి తన కుమారుడైన యేసు క్రీస్తు నామము కేవలము అనేక నామములలో ఒకటి కాదని ఖచ్చితంగా స్పష్టం చేయాలనుకుంటున్నారు. రక్షకుని నామము ప్రత్యేకమైన, ఆవశ్యకమైన శక్తిని కలిగియున్నది. ఈ నామము ద్వారా మాత్రమే రక్షణ సాధ్యమవుతుంది. ప్రతీ యుగములో ఈ సత్యాన్ని నొక్కి చెప్పుట ద్వారా, ఆయన వద్దకు తిరిగి వెళ్ళడానికి ఒక మార్గముందని మన ప్రియమైన పరలోక తండ్రి ఆయన పిల్లలందరికి అభయమిస్తున్నారు. కానీ, ఒక నిశ్చయమైన మార్గము లభ్యమగుట అనగా అర్థము యాంత్రికంగా మనము తిరిగి వెళ్ళిపోగలమని హామి కాదు. మన క్రియ దానికి అవసరమని దేవుడు మనకు చెప్పుచున్నాడు: “కాబట్టి, మనుష్యులందరు (మరియు స్త్రీలు) తండ్రి చేత ఇవ్వబడిన నామమును తమపైకి తప్పక తీసుకోవాలి.”5
క్రీస్తు యొక్క నామము ద్వారా మాత్రమే వచ్చు రక్షించు శక్తిని చేరుకొనుటకు బదులుగా, మనము,“ దేవుని యెదుట (మనల్నిమనము) తగ్గించుకొని. . . విరిగిన హృదయము, నలిగిన ఆత్మతో ముందుకు వచ్చి. . . మరియు యేసు క్రీస్తు నామమును (మనపైకి) తీసుకొనుటకు సమ్మతించాలి,” ఎనిమిదేళ్ళ వయస్సు గల నా స్నేహితుల వలే, “బాప్తీస్మము ద్వారా ఆయన సంఘములోనికి స్వీకరించబడుటకు,”6 అర్హులవుతారు.
రక్షకుని నామమును తమపై తీసుకోవాలని మనఃపూర్వకంగా కోరుకునే వారందరు తప్పక యోగ్యత కలిగియుండాలి మరియు దేవుని యెదుట తమ నిర్ణయానికి భౌతిక సాక్ష్యంగా బాప్తీస్మపు విధిని పొందాలి.7 కానీ, బాప్తీస్మము ఆరంభము మాత్రమే.
తీసుకోవడం అనేది నిష్క్రియాత్మక పదం కాదు. అది అనేక నిర్వచనాలున్న క్రియాత్మక పదము.8 అదేవిధంగా, యేసు క్రీస్తు నామమును మనపైకి తీసుకొనుటకు మన నిబద్ధతకు క్రియ అవసరము మరియు దానికి అనేక కొలతలున్నాయి.
ఉదాహరణకు, తీసుకోవడం అనగా ఒక అర్థము, ఒకరి శరీరంలోనికి తీసుకోవడం లేదా పొందడం, అనగా మనము ఒక పానీయం తీసుకొనుట వంటిది. క్రీస్తు యొక్క నామమును మన పైకి తీసుకోవడం ద్వారా, మనలో ఒక భాగమయ్యేలా ఆయన బోధనలు, ఆయన లక్షణాలు, చివరకు ఆయన ప్రేమను మన అంతర్ లోతులలోనికి తీసుకొనుటకు మనము ఒడంబడిక చేస్తున్నాము. ఆవిధంగా, “(రక్షకుని యొక్క) వివిధ రకాల బిరుదులు, నామాలలో ప్రతీ ఒక్కటి వ్యక్తిగతంగా (వారికి) ఏ అర్థాన్నిస్తుందో గ్రహించడానికి ప్రార్థనాపూర్వకంగా, బలముగా ప్రయత్నించమని,”9 లేఖనాలలో, ప్రత్యేకంగా మోర్మన్ గ్రంథంలో క్రీస్తు యొక్క మాటల విందారగించుటకు యువజనులకు అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారిచ్చిన ఆహ్వానం ముఖ్యమైనది.10
తీసుకోవడానికి మాటకు మరొక అర్థము, ఒక వ్యక్తిని ఒక ప్రత్యేక పాత్రలో అంగీకరించడం లేదా ఒక ఆలోచన లేక సూత్రం యొక్క వాస్తవికతను హత్తుకొనుట. క్రీస్తు నామమును మనపైకి తీసుకున్నప్పుడు, ఆయనను మన రక్షకునిగా అంగీకరించి, మన జీవితాలకు మార్గదర్శిగా ఆయన బోధనలను నిరంతరం మనం హత్తుకుంటాము. మనం చేసే ప్రతి అర్థవంతమైన నిర్ణయంలో, ఆయన సువార్తను సత్యమైనదిగా మనం తీసుకోవచ్చు మరియు మన పూర్ణ హృదయము, మనస్సు, బలముతో దానికి విధేయులుగా జీవించవచ్చు.
తీసుకోవడం అనగా ఒక పేరుతో లేక ఒక కారణంతో ఒకరిని ఒకే సమరేఖలోనికి తెచ్చుట అని కూడ అర్ధము. పనిలో తీసుకొనుట లేక ఒక హేతువు లేక ఉద్యమములో బాధ్యతను తీసుకొనుట వంటి అనుభవం మనలో చాలామందికి ఉన్నది. మనం క్రీస్తు నామమును మనపైకి తీసుకున్నప్పుడు, ఒక నిజమైన శిష్యుని బాధ్యతలను మనపైకి తీసుకుంటాము, ఆయన హేతువుకు న్యాయవాదులమవుతాము, మరియు “(మనము) ఉండు అన్ని సమయాల్లో, అన్ని విషయాల్లో, అన్ని స్థలములలో దేవునికి సాక్షులుగా నిలబడతాము.”11 “ఇశ్రాయేలును సమకూర్చడంలో ప్రభువుకు సహాయపడే యువ సైన్యంలో చేరడానికి ప్రతీ యువతిని, ప్రతీ యువకుడిని” అధ్యక్షులు నెల్సన్ గారు ఆహ్వానించారు.12యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము అని రక్షకుని చేత బయల్పరచబడినట్లుగా, పునఃస్థాపించబడిన ఆయన సంఘము యొక్క పేరును ప్రకటించమనే ప్రవచనాత్మక పిలుపును అందుకోవడానికి మనమందరం కృతజ్ఞులము.13
రక్షకుని నామమును మనపైకి తీసుకొనే ప్రక్రియలో, క్రీస్తు మరియు ఆయన సంఘము రెండిటి ఉద్దేశము ఒకటేనని మనము తప్పక గ్రహిస్తాము. అవి విడదీయబడలేవు. అదేవిధంగా, రక్షకుని పట్ల మన స్వంత శిష్యరికము మరియు ఆయన సంఘంలో క్రియాశీలక సభ్యత్వము విడదీయలేనివి. నిశ్చయముగా పగలు తరువాత రాత్రి వచ్చినట్లుగా, ఒకదానితో మన నిబద్ధతలో మనం తడబడినట్లయితే, మరొకదానిపట్ల మన నిబద్ధత నిశ్చయంగా మసకబారుతుంది.
కొందరు యేసు క్రీస్తు నామమును, ఆయన ఉద్దేశమును తమపైకి తీసుకోవడానికి అయిష్టముగా ఉన్నారు, ఎందుకనగా వారు దానిని మరీ ఇరుకైనదిగా, పరిమితమైనదిగా, నిర్భంధంగా భావిస్తారు. నిజానికి, క్రీస్తు నామమును మనపైకి తీసుకోవడం స్వేచ్ఛను, విస్తరణనిస్తుంది. రక్షకునిలో విశ్వాసం ద్వారా మనం దేవుని ప్రణాళికను అంగీకరించినప్పుడు మనం అనుభవించిన కోరికను అది మేల్కొల్పుతుంది. ఈ కోరిక మన మనస్సులలో జీవించియుండగా, దైవికంగా మనకివ్వబడిన వరములు, నైపుణ్యాల నిజమైన ఉద్దేశాన్ని మనం కనుగొనగలము, స్వేచ్ఛనిచ్చు ఆయన ప్రేమను అనుభవించగలము, మరియు ఇతరుల సంక్షేమం కోసం మన ఆలోచనలో ఎదగగలము. రక్షకుని నామమును మనపైకి తీసుకున్నప్పుడు, మనము నిజంగా ప్రతి మంచి సంగతిని పట్టుకొని, ఆయన వలే అవుతాము.14
రక్షకుని నామమును మనపైకి తీసుకోవడమనేది మనము బాప్తీస్మమప్పుడు చేసే నిబంధన మొదలుకొని—ఒక నిబంధన ఒడంబడిక అని గుర్తుంచుకోవడం ముఖ్యమైనది. “ఆయనతో నిబంధనలు చేసి, వాటిని పాటించడం ద్వారా రక్షకుని అనుసరించడానికి (మన) నిబద్ధత ప్రతి ఆత్మీయ దీవెనకు, సాధ్యమైన విశేషాధికారానికి తలుపు తెరుస్తుందని,”15 అధ్యక్షులు నెల్సన్ బోధించారు. బాప్తీస్మము ద్వారా రక్షకుని యొక్క నామమును మనపైకి తీసుకోవడం వల్ల కలిగే అద్భుతమైన విశేషాధికారాల్లో ఒకటి, నిబంధన బాటలో తరువాతి విధియైన మన నిర్థారణ కొరకు అది ప్రవేశమును ఇచ్చును. రక్షకుని నామమును తీసుకోవడమనగా అర్థమేమిటని నేను నా ఎనిమిది సంవత్సరాల స్నేహితులలో ఒకరిని అడిగినప్పుడు, “పరిశుద్ధాత్మను నేను కలిగియుండగలనని దానర్థం,” అని జవాబిచ్చింది. ఆమె సరిగ్గా చెప్పింది.
బాప్తీస్మపు విధి ద్వారా మనము శుద్ధి చేయబడిన తర్వాత, నిర్థారణ ద్వారా పరిశుద్ధాత్మ వరము పొందబడుతుంది. ఈ వరము, పరిశుద్ధాత్మను నిరంతర సహవాసిగా కలిగియుండగల హక్కు మరియు అవకాశము. మనము ఆయన మిక్కిలి నెమ్మదియైన స్వరమును ఆలకించి లోబడినట్లయితే, ఆయన మనల్ని బాప్తీస్మము ద్వారా మనం ప్రవేశించిన నిబంధన బాటలో నిలిపియుంచును, దాని నుండి తొలగిపోవాలని మనం శోధించబడినప్పుడు మనల్ని హెచ్చరించును, మరియు అవసరమైనట్లుగా పశ్చాత్తాపపడమని, సరిచేసుకోమని ప్రోత్సహించును. బాప్తీస్మము తర్వాత నిబంధన బాట గుండా మనం వృద్ధిచెందడాన్ని కొనసాగించేలా పరిశుద్ధాత్మను ఎల్లప్పుడు మనతో ఉంచుకోవడం పైన మనం దృష్టిసారించాలి. మన జీవితాలను శుద్ధిగా, పాపరహితంగా ఉంచుకున్నంత వరకు మాత్రమే పరిశుద్ధాత్మ మనతో ఉండగలదు.
ఈ కారణం వలన, సంస్కారము అనబడే మరొక విధి ద్వారా మన బాప్తీస్మము యొక్క శుద్ధిపరచు ప్రభావాన్ని నిరంతరం క్రొత్తదిగా చేసుకోవడానికి ప్రభువు మనకొక మార్గాన్ని ఏర్పరిచారు. ప్రతీవారము మనము “కుమారుని నామమును (మన) పైన తీసుకొనుటకు ఇష్టపడుతున్నట్లు (మనము) సాక్ష్యమిస్తున్నాము”16 మరలా, ప్రభువు యొక్క శరీరమును మరియు రక్తమును చిహ్నములుగా రొట్టెను, నీటిని తీసుకోవడానికి సమీపించడం ద్వారా --- మరియు వాటిని మన ఆత్మలలోనికి తీసుకోవడం ద్వారా. బదులుగా, మరల శుద్ధిచేయు అద్భుతము పరిశుద్ధాత్మ యొక్క నిరంతర ప్రభావాన్ని కలిగియుండేందుకు మనల్ని అర్హులనుగా చేస్తూ రక్షకుడు నిర్వర్తిస్తారు. కేవలం యేసు క్రీస్తు నామములో కనుగొనబడే అనంతమైన దయకు ఇది రుజువు కాదా? మనము మనపై ఆయన నామమును తీసుకున్నప్పుడు, ఆయన మన పాపాలను, బాధలను తన పైకి తీసుకుంటారు, మరియు ప్రేమగల తన బాహువులలో మనల్ని చుట్టుకొనేందుకు18 ఇంకను ఆయన “కనికరముగల బాహువు చాపబడియున్నది.” 17
యేసు క్రీస్తు నామమును మనపై తీసుకోవడమనేది జీవముగల, నిరంతర ఒడంబడిక అని, కేవలం మన బాప్తీస్మపు దినమున ఒక్కసారి జరిగే సంఘటన కాదని ప్రతివారము సంస్కారము మనకు గుర్తు చేస్తుంది.19 మన పాపములు పరిహారమగునట్లు ఆయన శరీరమును, రక్తమును తీసుకోవడాన్ని మనం నిరంతరము, పలుమార్లు ఆనందించగలుగునట్లు చేయు ఆ పరిశుద్ధ అర్పణను మనిషి పూర్తిగా గ్రహించలేడు. 20 క్రీస్తు నామమును తమపై తీసుకొనుట నుండి రాగల శక్తివంతమైన, ఆత్మీయ దీవెనలను దేవుని పిల్లలు అర్థం చేసుకున్నప్పుడు, వారు ఎల్లప్పుడు ఆనందిస్తారని, మరియు ఎల్లప్పుడు తమ దేవునితో నిబంధనలోనికి ప్రవేశించుటకు కోరతారని అనడంలో ఆశ్చర్యం లేదు.21
దైవికంగా రూపొందించబడిన ఈ నిబంధన బాటను మనం అనుసరించినప్పుడు, యేసు క్రీస్తు నామమును మనపై తీసుకోవడానికి మన ఒడంబడిక మరియు ప్రయత్నాలు, “(మన) హృదయాలలో వ్రాయబడిన ఆయన నామమును నిలుపుకొనుటకు”22 మనకు బలాన్నిస్తాయి. మనము దేవునిని, మన పొరుగువారిని ప్రేమిస్తాము, వారికి పరచర్య చేయాలనే కోరిక కలిగియుంటాము. మనము ఆయన ఆజ్ఞలను పాటిస్తాము, ఆయనతో అదనపు నిబంధనలలో ప్రవేశించుట ద్వారా, ఆయన వలె అగుటకు ఆపేక్షిస్తాము. మన నీతిగల కోరికలపైన పనిచేయడానికి బలహీనులుగా, అసమర్థులుగా మనం భావించినప్పుడు, కేవలం ఆయన నామము ద్వారా వచ్చే బలం కోసం మనము వేడుకొంటాము మరియు ఆయన మనకు సహాయపడేందుకు వస్తారు. విశ్వాసముతో మనము సహించినప్పుడు, భవిష్యత్తులో మనం ఆయనను చూస్తాము, ఆయనతో ఉంటాము, మనం ఆయన వలె మారామని కనుగొంటాము, అది తండ్రి యొక్క సన్నిధికి తిరిగి వెళ్ళడానికి మనల్ని అర్హులనుగా చేస్తుంది.
“యేసు క్రీస్తు నామమందు విశ్వాసముంచి, ఆయన నామములో తండ్రిని ఆరాధించి, మరియు ఆయన నామముపై విశ్వాసముతో అంతము వరకు సహించిన వారు” 23 దేవుని రాజ్యములో రక్షించబడతారనే రక్షకుని వాగ్దానము నిశ్చయమైనది. యేసు క్రీస్తు నామమును మనపై తీసుకొనుట ద్వారా సాధ్యము చేయబడిన ఈ అసాధారణమైన దీవెనలను నేను మీతోపాటు ఆనందిస్తున్నాను, ఆయన గురించి, ఆయన నామమున నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.