2010–2019
ప్రయత్నించండి, ప్రయత్నించండి, ప్రయత్నించండి
అక్టోబర్ 2018


15:60

ప్రయత్నించండి, ప్రయత్నించండి, ప్రయత్నించండి

రక్షకుడు మీ హృదయాలలో తన నామమును ఉంచుతున్నాడు. మరియు మీరు ఇతరుల కొరకు, మీ కొరకు క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమను అనుభవిస్తున్నారు.

నా ప్రియమైన సహోదరీ, సహోదరులారా, మీతో మాట్లాడే అవకాశమునకు నేను కృతజ్ఞత కలిగియున్నాను. ఈ సమావేశము నన్ను పైకెత్తి, నాకు జ్ఞానాభివృద్ధిని కలుగజేసెను. పాడబడిన సంగీతము, మాట్లాడబడిన వాక్యములు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలలోనికి మోసుకొనిపోబడినవి. అదే ఆత్మచేత నేను చెప్పేవి మీకు తెలియజేయబడాలని నేను ప్రార్థిస్తున్నాను.

అనేక సంవత్సరాల క్రితం, తూర్పు సంయుక్త రాష్ట్రాలలో ఒక జిల్లా అధ్యక్షునికి నేను మొదటి సలహాదారుడ్ని. మా చిన్న శాఖలను దర్శించుటకు ప్రయాణిస్తున్నప్పుడు ఒకటి కంటే ఎక్కువ సార్లు ఆయన నాతో ఇలా చెప్పారు, “హాల్, మనం ఎవరినైనా కలిసినప్పుడు, వారు కష్టాలలో ఉన్నవారిగా వారితో ప్రవర్తిస్తే, సగం కంటే ఎక్కువసార్లు అది నిజం అవుతుంది.” ఆయన చెప్పింది ఒప్పు మాత్రమే కాదు ఆయన అంచనా వేసింది చాలా తక్కువ కూడా. మీరు ఎదుర్కొనే కష్టాలలో మీకు ధైర్యము చెప్పాలని నేడు నేను ఆశపడుచున్నాను.

మన మర్త్య జీవితము మనలో ప్రతి ఒక్కరికి ఒక పరీక్షగా, అభివృద్ధికి ఒక మూలాధారముగా ఉండుటకు ప్రేమగల దేవునిచేత రూపించబడింది. లోకము సృష్టించబడినప్పుడు ఆయన పిల్లల గురించి దేవుని మాటలను మీరు జ్ఞాపకముచేసుకోండి: వారి దేవుడైన ప్రభువు వారికి ఆజ్ఞాపించిన సంగతులన్నిటిని వారు గైకొందురో లేదోనని మనము వారిని పరీక్షించెదము. “1

ఆరంభము నుండీ, ఆ పరీక్షలు అంత సులభమైనవిగా లేవు. మర్త్య శరీరములు కలిగియుండుట వలన వచ్చు శ్రమలను మనం ఎదుర్కొంటాము. సత్యమునకు, మన సంతోషమునకు వ్యతిరేకముగా సాతాను యొక్క యుద్ధము మరింత తీవ్రమగుచున్న ప్రపంచములో మనమందరము జీవించుచున్నాము. లోకములో, మీ జీవితములో గందరగోళము ఎక్కువగుచున్నట్లుగా మీకనిపించవచ్చును.

నేను దీనిని మీకు అభయమిస్తున్నాను: ఈ పరీక్షలను మీ జీవితంలో అనుమతించిన ప్రేమగల దేవుడు వాటిని జయించుటకు ఒక ఖచ్చితమైన మార్గాన్ని ఏర్పాటుచేసెను. పరలోక తండ్రి లోకమును ఎంతో ప్రేమించెను కాగా మనకు సహాయము చేయుటకు ఆయన తన ప్రియమైన కుమారుని పంపెను. 2 ఆయన కుమారుడైన, యేసు క్రీస్తు మన కొరకు తన ప్రాణమునర్పించెను. గెత్సేమనే తోటలో మరియు సిలువపైన యేసు క్రీస్తు మన పాపభారాన్ని భరించెను. జీవితములో ప్రతి పరీక్షలో మనల్ని ఆదరించి, బలపరచగలుగుటకు ఆయన ప్రతి వేదనను, బాధను, మన పాపముల యొక్క పరిణామాలను అనుభవించెను. 3

ప్రభువు ఆయన దాసులకు ఇలా చెప్పారని మీరు జ్ఞాపకము చేసుకొంటారు:

“తండ్రి నేను ఏకమైయున్నాము. నేను తండ్రియందును, తండ్రి నా యందును ఉన్నాము; మీరు నన్ను చేర్చుకొనిన యెడల, మీరు నాయందును, నేను మీయందును ఉందును.

“కాబట్టి, నేను మీధ్యనున్నాను, నేను మంచి కాపరియు, ఇశ్రాయేలునకు బండనై యున్నాను. ఈ బండమీద కట్టబడువాడు ఎప్పటికి పడిపోడు.”4

మన ప్రవక్తయైన అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ కూడా ఆ అభయాన్నే ఇచ్చారు. అంతేకాకుండా, ఆ బండపైన మనం నిర్మించబడుటకు మరియు మన కష్టాలలో మనకు దారి చూపించుటకు మన హృదయాలపై ప్రభువు యొక్క నామమును ఉంచుటకు ఒక విధానమును ఆయన వివరించారు.

ఆయన ఇలా చెప్పారు: “మీరు తాత్కాలికముగా అధైర్యపడవచ్చును, కాని జీవితము సులభముగా ఉండుటకు ఉద్దేశించబడలేదని గుర్తుంచుకోండి. మార్గము వెంబడి శ్రమలను అనుభవించాలి, దుఃఖాన్ని భరించాలి. ‘దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్ధకము కానేరదు’ (లూకా 1:37), మీరు జ్ఞాపకము చేసుకున్నప్పుడు, ఆయన మీ తండ్రి అని మీరు తెలుసుకోవాలి.” మీరు ఆయన స్వరూపమందు సృష్టించబడిన ఒక కుమారుడు లేదా కుమార్తై, మీ యోగ్యత ద్వారా మీ నీతికరమైన ప్రయత్నాలలో సహాయపడుటకు కావలసిన బయల్పాటును పొందుటకు అర్హులు. ప్రభువు యొక్క పరిశుద్ధ నామమును మీపైన తీసుకొనవచ్చును. దేవుని యొక్క పరిశుద్ధ నామములో మాట్లాడుటకు మీరు అర్హులు కాగలరు (see సి మరియు ని 1:20).”5 ().”5

అధ్యక్షులు నెల్సన్ యొక్క మాటలు సంస్కార ప్రార్థనలో చేయబడు వాగ్దానమును మనకు జ్ఞాపకము చేయును, అది మనం వాగ్దానము చేసిన ప్రకారము నడుచుకొన్నప్పుడు, మన పరలోక తండ్రి నెరవేర్చు ఒక వాగ్దానము.

ఆ మాటలను ఆలకించండి: “ఓ దేవా, నిత్య తండ్రీ, మీ కుమారుడైన యేసు క్రీస్తు నామములో ఈ రొట్టెను, దానిలో పాలుపొందుచున్న వారందరి ఆత్మల కొరకు ఆశీర్వదించి, పరిశుద్ధపరచమని మిమ్ములను అడుగుచున్నాము; తద్వారా మీ కుమారుని శరీరము యొక్క జ్ఞాపకార్థము వారు దానిని తిని, ఓ దేవా, నిత్య తండ్రీ, తద్వారా వారు మీ కుమారుని నామమును తమపైకి తీసుకొనుటకును, ఎల్లప్పుడు ఆయనను జ్ఞాపకము చేసుకొనుటకును, ఆయన వారికిచ్చిన ఆయన ఆజ్ఞలను పాటించుటకును సమ్మతించుచున్నామని మీకు సాక్ష్యమిచ్చెదరు; తద్వారా వారు ఎల్లప్పుడు ఆయన ఆత్మను తమతో కలిగియుందురు గాక. ఆమేన్.”6

ఆ ప్రార్థన మన తరఫున చేయబడిన ప్రతిసారి మనం ఆమేన్ అని చెప్పినప్పుడు, యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామాన్ని మనపైకి తీసుకొనుటకు అంగీకరిస్తున్నామని, ఆయనను ఎల్లప్పుడు జ్ఞాపకము చేసుకొంటామని, ఆయన ఆజ్ఞలను పాటిస్తామని మనం వాగ్దానము చేస్తున్నాము. తిరిగి, వీటిని మనం చేసినప్పుడు, ఆయన ఆత్మను మనం ఎల్లప్పుడు కలిగియుంటామని మనము వాగ్దానము చేయబడ్డాము. మనం శ్రమలను ఎదుర్కొన్నప్పుడు, రక్షకునిపై ఆధారపడగలము మరియు భయపడము.

నిబంధన పదములను, దానికి సంబంధించి వాగ్దానము చెయ్యబడిన దీవెనలను నేను ధ్యానించినప్పుడు, యేసు క్రీస్తు నామమును మనపైకి తీసుకొనుట అంటే ఏమిటో అని ఆశ్యర్యపడ్డాను.

అధ్యక్షులు డాల్లిన్ హెచ్. ఓక్స్ ఇలా వివరించారు: “మనం సంస్కారములో పాల్గొన్నప్పుడు, యేసు క్రీస్తు నామమును మనపైకి తీసుకుంటామని మనం సాక్ష్యమివ్వటం లేదు అన్నది ముఖ్యమైనది. ఆవిధంగా చేయుటకు సుముఖత కలిగియున్నామని మనం సాక్ష్యమిస్తున్నాము (సి మరియు ని 20:77 చూడుము). మన సుముఖతకు సాక్ష్యమివ్వబోయే వాస్తవం మనం చాలా ముఖ్యమైన అర్ధంలో మనం ఆ పరిశుద్ధ నామమును తీసుకునే ముందు మరేదైనా జరగాలి అని సూచిస్తుంది.”7

ఆయన నామమును “[మనపై] తీసుకొనుటకు సుముఖంగా ఉన్నాము” అనే వ్యాఖ్యానము మనం బాప్తీస్మము తీసుకొన్నప్పుడు మొదట ఆయన నామమును తీసుకొన్నప్పటికి, బాప్తీస్మము వద్ద ఆయన నామమును తీసుకొనుట పూర్తికాలేదని మనకు తెలియజేయును. మనం సంస్కార బల్ల వద్ద నిబంధనలు క్రొత్తవిగా చేసుకున్నప్పుడు మరియు ప్రభువు పరిశుద్ధ దేవాలయములో నిబంధనలు చేయుచున్నప్పటితో కలిపి మన జీవితకాలములంతటా ఆయన నామమును తీసుకొనుటకు మనము నిరంతరము పాటుపడాలి.

కాబట్టి మనలో ప్రతిఒక్కరికి రెండు ముఖ్యమైన ప్రశ్నలు కలవు, “ఆయన నామమును నాపైన తీసుకొనుటకు నేను తప్పక చేయవలసినదేమిటి?” మరియు “నేను అభివృద్ధి చెందుచున్నట్లు నాకేవిధంగా తెలుస్తుంది?”

అధ్యక్షులు నెల్సన్ యొక్క ప్రకటన ఒక సహాయకరమైన జవాబును సూచిస్తుంది. రక్షకుని నామమును మనపైకి తీసుకొనగలము మరియు ఆయన కొరకు మాట్లాడగలము అని ఆయన చెప్పారు. మనము ఆయన కొరకు మాట్లాడినప్పుడు, మనమాయనను సేవిస్తాము. “ఏలయనగా అతడు సేవించియుండని మరియు అతనికి పరదేశియైన అతని హృదయము యొక్క ఆలోచనలు మరియు తలంపుల నుండి దూరముగా ఉన్న యజమానిని ఒక మనుష్యుడు ఎట్లు ఎరుగగలడు?” 8

ఆయన కొరకు మాట్లాడుటకు విశ్వాససహితమైన ప్రార్థన అవసరము. రక్షకునికి ఆయన కార్యములో సహాయము చేయుటకు మనం ఏ మాటలు మాట్లాడగలమో నేర్చుకొనుటకు పరలోక తండ్రికి తీక్ష్ణమైన ప్రార్థన అవసరము. వాగ్దానము కొరకు మనం అర్హత పొందాలి: “నా నోటి మాట ద్వారా గాని లేదా నా సేవకుల నోటి మాట ద్వారా గాని, అది ఒక్కటే.”9

ఆయన నామమును మనపైకి తీసుకొనుటకు ఆయన కొరకు మాట్లాడుట మాత్రమే సరిపోదు. ఆయన సేవకులుగా అర్హత పొందుటకు మన హృదయములలో మనము కొన్ని భావాలను కలిగియుండాలి.

ఆయన నామాన్ని మనపై తీసుకొనుటకు మనల్ని అర్హులుగా, మనకు సాధ్యపడేలా చేసే భావాలను ప్రవక్తయైన మోర్మన్ వర్ణించాడు. ఈ భావాలలో విశ్వాసము, నిరీక్షణ మరియు క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమ అనగా దాతృత్వము కలవు.

మోర్మన్ ఇలా వివరించెను:

“ఏలయనగా మీ సాత్వీకమును బట్టి, మీరు క్రీస్తునందు విశ్వాసము కలిగియున్నారని నేను తీర్పుతీర్చుచున్నాను. ఏలయనగా మీరు ఆయనయందు విశ్వాసము కలిగియుండని యెడల, మీరు ఆయన సంఘ జనుల మధ్య లెక్కింపబడుటకు యోగ్యులు కారు.

“తిరిగి మరల నా ప్రియమైన సహోదరులారా, నేను మీతో నిరీక్షణను గూర్చి మాట్లాడుదును; మీరు నిరీక్షణ కలిగియుంటే తప్ప, మీరు విశ్వాసమును ఎట్లు అందుకొనగలరు?

“మరియు మీరు నిరీక్షించుచున్నది దేని కొరకైయున్నది? ఇదిగో నేను మీతో చెప్పునదేమనగా — క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము మరియు ఆయన పునరుత్థానము శక్తి ద్వారా నిత్యజీవమునకు లేపబడుటకు మీరు నిరీక్షణ కలిగియుండవలెను; మరియు ఇది వాగ్దానము ప్రకారము ఆయనలో మీ విశ్వాసమును బట్టియే.

“అందువలన ఒక మనుష్యుడు విశ్వాసము కలిగియున్న యెడల, అతడు తప్పక నిరీక్షణ కలిగియుండవలెను. ఏలయనగా, విశ్వాసము లేకుండా ఎట్టి నిరీక్షణ ఉండలేదు.”

“మరియు తిరిగి నేను మీతో చెప్పుచున్నాను, — అతడు సాత్వీకుడు మరియు హృదయమందు దీనత్వమును కలిగియుంటే తప్ప, అతడు విశ్వాసము మరియు నిరీక్షణను కలిగియుండలేడు.”

“అట్లయిన యెడల, అతని విశ్వాసము మరియు నిరీక్షణ వ్యర్థమైనవి. ఏలయనగా హృదయమందు సాత్వీకులు మరియు దీనులు తప్ప, ఎవడును దేవుని యెదుట అంగీకరించబడడు. మరియు ఒక మనుష్యుడు హృదయమందు సాత్వీకుడు మరియు దీనుడైయుండి, యేసే క్రీస్తని పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా ఒప్పుకొనిన యెడల, అతడు దాతృత్వము కలిగియుండవలెను; ఏలయనగా అతడు దాతృత్వము కలిగిలేని యెడల, అతడు ఏమియు కాడు; అందువలన అతడు దాతృత్వము కలిగియుండవలెను.”

దాతృత్వమును వర్ణించిన తరువాత, మోర్మన్ ఇలా చెప్పెను:

“కానీ దాతృత్వము, క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమయైయున్నది; అది నిత్యము నిలుచును మరియు అంత్య దినమున ఎవడు దానిని కలిగియుండి కనబడునో, అది అతనికి మేలుగా ఉండును.

“అందువలన నా ప్రియమైన సహోదరులారా, ఆయన కుమారుడు యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులైన వారందరి పైన ఆయన ఉంచిన ఈ ప్రేమతో మీరు నింపబడవలెనని, మీరు దేవుని కుమారులు కావలెనని, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన ఉన్నట్లే మనము ఆయనను చూచెదము; కావున మనము ఆయనవలే ఉండునట్లు, మనము ఈ నిరీక్షణను కలిగియుండునట్లు ఆయన శుద్ధముగా ఉన్నట్లు మనము శుద్ధము చేయబడునట్లు హృదయము యొక్క సమస్త శక్తితో తండ్రికి ప్రార్థన చేయుడి. ఆమేన్‌.”10

నా సాక్ష్యమేమనగా, రక్షకుడు మనల్ని ఏమి చెయ్యాలని కోరుచున్నారో దానిని చేయుటకు సమ్మతిని, కోరికను మనం కలిగియుండేలా ఆయన చేయుచున్నారు. మీలో అనేకులకు, ఆయనయందు మీ విశ్వాసము పెరుగుచున్నది. ఎక్కువ నిరీక్షణను, ఆశావాదమును మీరు భావిస్తున్నారు. ఇతరులకొరకు మరియు మీ కొరకు మీరు క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమను మీరు అనుభూతి చెందుచున్నారు.

ప్రపంచమంతటా సేవ చేయుచున్న సువార్త పరిచారకులందు నేను దానిని చూచుచున్నాను. యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము గురించి తమ స్నేహితులతోను, కుటుంబ సభ్యులతోను మాట్లాడే సభ్యులందు నేను దానిని చూసాను. పురుషులు, స్త్రీలు, యౌవనులు, మరియు పిల్లలు కూడా రక్షకుని కొరకు, వారి పొరుగు వారి కొరకు ప్రేమతో పరిచర్య చేయుచున్నారు.

ప్రపంచమంతటా విపత్తుల మొదటి నివేదికలో, సభ్యులు అడగకుండా, కొన్నిసార్లు సముద్రములకు అవతలి వైపు, విడిపించుటకు వెళ్ళుటకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్నిసార్లు వారు నాశనము చేయబడిన ప్రాంతము వారిని రానిచ్చే వరకు ఆగుట కష్టముగా కనుగొంటున్నారు.

నేడు వినుచున్న మీలో కొందరు మీ విశ్వాసము మరియు నిరీక్షణ మీ కష్టాలచేత జయించబడినట్లుగా భావించుచుండవచ్చును. మరియు ప్రేమను అనుభూతిచెందుటకు మీరు అపేక్షించుచుండవచ్చును.

సహోదరీ, సహోదరులారా, ఆయన ప్రేమను భావించుటకు, పంచుటకు అవకాశాలను ప్రభువు మీ సమీపములో కలిగియున్నారు. ఆయన కొరకు ఎవరినైనా ప్రేమించుటకు మిమ్మల్ని నడిపించమని ప్రభువు కొరకు నమ్మకముతో మీరు ప్రార్థించగలరు. మీవంటి దీనమనస్సుగల స్వచ్ఛంద సేవకుల ప్రార్థనలకు ఆయన జవాబిస్తారు. మీ కొరకు, ఆయన కొరకు మీరు సేవచేయుచున్న వ్యక్తి కొరకు దేవుని ప్రేమను మీరు అనుభూతి చెందుతారు. దేవుని పిల్లలకు వారి కష్టాలలో మీరు సహాయము చేసినప్పుడు, మీ స్వంత కష్టాలు తేలికగా అనిపిస్తాయి. మీ విశ్వాసము, మీ నిరీక్షణ బలపరచబడును.

ఆ సత్యమునకు నేను ప్రత్యక్ష సాక్షిని. జీవితకాలమంతా, నా భార్య ప్రభువు గురించి మాట్లాడి, ఆయన కొరకు ప్రజలకు సేవ చేసెను. నేను ఇదివరకు చెప్పినట్లుగా, మా బిషప్పులలో ఒకరు ఒకసారి నాతో ఇలా చెప్పారు, “నేను ఆశ్చర్యపడతాను. వార్డులో కష్టములో ఉన్న ఒక వ్యక్తి గురించి నేను విన్న ప్రతిసారి, సహాయము చేయడానికి నేను త్వరపడతాను. ఐనప్పటికి, నేను అక్కడకు వెళ్లేసరికి, మీ భార్య అప్పటికే అక్కడికి వచ్చి ఉన్నట్లుగా కనబడుచున్నారు.” 56 సంవత్సరాలుగా మేము నివసించిన అన్ని స్థలాలలో అది నిజమై యుండెను.

ఇప్పుడు ఆమే కేవలం కొన్ని మాటలు మాత్రమే మాట్లాడగలదు. ప్రభువు కొరకు ఆమె ప్రేమించిన జనుల చేత ఆమె దర్శించబడుతుంది. ప్రతి ఉదయము, రాత్రి ఆమెతో నేను కీర్తనలు పాడుతాను మరియు మేము ప్రార్థిస్తాము. ప్రార్థనలు మరియు పాటలందు నేను స్వరముగా ఉండాలి. కొన్ని సార్లు ఆమె కీర్తనలలో పదములను ఉచ్ఛరించుటను నేను చూడగలుగుతాను. ఆమె పిల్లల పాటలను ఇష్టపడుతుంది. ఆమెకు శ్రేష్టముగా ఇష్టపడేదిగా కనబడే మనోభావన “నేను యేసువలె అగుటకు ప్రయత్నిస్తున్నాను,”11 అనే పాటలో సంక్షిప్తపరచబడింది.

ఒక రోజు, పల్లవి యొక్క మాటలను పాడిన తరువాత: “యేసు మిమ్మును ప్రేమించినట్లే, ఒకరినొరకు ప్రేమించుడి. మీరు చేసే ప్రతివాటిలో దయ చూపించుటకు ప్రయత్నించండి,” అనే పల్లవిలోని పదములను పాడిన తరువాత, ఆమె మృదువుగా స్పష్టముగా “ప్రయత్నించండి, ప్రయత్నించండి, ప్రయత్నించండి” అని చెప్పెను. ఆమె ఆయనను చూచినప్పుడు, మన రక్షకుడు ఆయన నామమును ఆమె హృదయములో ఉంచెనని, మరియు ఆయనవలె ఆమె అగుటను తాను కనుగొనవచ్చునని నేననుకొనుచున్నాను. మీ శ్రమలలో ఆయన మీకు సహాయము చేయునట్లు, ఆమె శ్రమలలో ఇప్పుడు ఆయన ఆమెకు సహాయము చేయుచున్నారు.

రక్షకుడు మిమ్మును ఎరుగును మరియు ప్రేమించుచున్నారని నేను నా సాక్ష్యమిచ్చుచున్నాను. ఆయన నామమును మీరు ఎరిగినట్లే, మీ నామమును ఆయన యెరుగును. ఆయన మీ కష్టములను ఎరుగును. ఆయన వాటిని అనుభవించాడు. తన ప్రాయశ్చిత్తము ద్వారా ఆయన లోకమును జయించెను. ఆయన నామమును మీపై తీసుకొనుటకు అంగీకరించుట ద్వారా లెక్కలేనంతమంది ఇతరుల భారాలను మీరు తేలిక చేస్తారు. మీరు రక్షకుని ఎక్కువగా తెలుసుకొన్నారని, ఆయనను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నారని చివరకు మీరు తెలుసుకుంటారు. ఆయన నామము మీ హృదయాలలోను ఉండును, మరియు మీ జ్ఞాపకములో స్థిరముగా ఉండును. మీరు పిలవబడిన నామము అది. నా యెడల, నా ప్రియమైన వారిపట్ల మరియు మీపట్ల ఆయనకున్న దయగల ప్రేమ కొరకు కృతజ్ఞతతో దీనిని నేను సాక్ష్యమిస్తున్నాను, యేసు క్రీస్తు నామములో, ఆమేన్.