2010–2019
నీ తల పైకెత్తి ఆనందించుము
అక్టోబర్ 2018


నీ తల పైకెత్తి ఆనందించుము

ప్రభువు యొక్క విధానములో కష్టమైన విషయాలను మనము ఎదుర్కొన్నప్పుడు, మన తలలు పైకెత్తి, మనము ఆనందించవచ్చు.

1981లో నేను నా తండ్రి, ఇద్దరు సన్నిహిత స్నేహితులు అలస్కాలో సాహసయాత్రకు వెళ్లాము. సుదూరప్రాంతములో ఉన్న సరస్సులో దిగి, తరువాత ఎత్తైన అందమైన ప్రదేశానికి మేము ఎక్కివెళ్లాలి. మేము మాతో తీసుకొని వెళ్లవలసిన వస్తువుల బరువు తగ్గించుకోవడం కోసం, మా వస్తువులను పెట్టెలలో పెట్టి, దూదివంటి పదార్థముతో చుట్టి, పెద్ద రంగుల కాగితాలను అంటించి, మా చిన్న విమానపు కిటికీలోనుండి మేము చేరవలసిన గమ్యస్థానములో పడవేసాము.

అక్కడకు చేరుకున్న తరువాత, మేము చాలా వెతికాము కాని మా నిరాశ కొలది ఆ పెట్టెలలో దేనిని మేము కనుగొనలేకపోయాము. చివరకు ఒకదానిని మేము కనుగొన్నాము. దానిలో చిన్న గ్యాస్ స్టవ్, కీలుచాప, కొన్ని మిఠాయిలు, హేమ్‌బర్గర్ ముడిసరుకులు గల ఒకజత పొట్లాలు ఉన్నాయి గాని హేమ్‌బర్గర్లు లేవు. బాహ్యప్రపంచముతో మాట్లాడుటకు మాకు ఎటువంటి వసతి లేదు మరియు ఒక వారము తరువాతే మమ్మల్ని తీసుకొని వెళ్లడానికి వస్తారు.

ఈ అనుభవము ద్వారా నేను రెండు విలువైన పాఠాలు నేర్చుకున్నాను: మొదటిది కిటికీలోనుండి మీ ఆహారాన్ని పడవేయరాదు. రెండవది, కొన్నిసార్లు మనం కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది.

తరచుగా, కష్టాలు వచ్చినప్పుడు మన మొదటి స్పందన “నాకే ఎందుకు కష్టాలు వస్తున్నాయి?” అయినప్పటికిని, ఎందుకని అడగడం మన కష్టాలను తీసివేయవు. సవాళ్లను మనం జయించాలని ప్రభువు కోరుచున్నారు, మరియు “ఈ సంగతులన్నీ [మనకు] అనుభవమును ఇచ్చునని, అవి [మన] మేలు కొరకని ”1 ఆయన సూచించారు.

కొన్నిసార్లు కష్టమైన పనులు చెయ్యమని ప్రభువు మనల్ని అడుగుతారు మరియు కొన్నిసార్లు మన సవాళ్ళు మన వలన లేదా ఇతరులు వారి స్వతంత్రతను ఉపయోగించడం వలన సృష్టించబడతాయి. ఈ రెండు సందర్భాలను నీఫై అనుభవించెను. లేబన్ నుండి పలకలు తీసుకొని రమ్మని తన కుమారులను అడిగినప్పుడు, లీహై ఇలా చెప్పెను, “అయితే నీ సహోదరులు, నేను వారి నుండి కోరినదొక కష్టమైన కార్యమని చెప్పుచూ సణుగుచున్నారు; కానీ దీనిని వారి నుండి నేను కోరలేదు, ఇది ప్రభువు యొక్క ఆజ్ఞయై ఉన్నది.”2 ఇంకొక సందర్భములో నీఫై సహోదరులు వారి స్వతంత్రతను ఉపయోగించి అతని స్వతంత్రతను పరిమితము చేసారు: “నాపై తమ చేతులు వేసి, నన్ను త్రాళ్ళతో కట్టివేసి, నా ప్రాణమును తీసివేసి కౄరమృగములు తినివేయునట్లు అరణ్యములో నన్ను వదలివేయుటకు ప్రయత్నము చేసిరి.”3

లిబర్టి చెరశాలలో జోసెఫ్ స్మిత్ కష్టాన్ని ఎదుర్కొన్నాడు. తన పరిస్థితినుండి విడుదల పొందుట సమీపంలో లేదని భావించి, నిరాశతో జోసెఫ్ ప్రార్థించెను, “ఓ దేవా, నీవెక్కడ ఉన్నావు?”4 ఏ సందేహము లేదు, జోసెఫ్ భావించినట్లే మనలో కొందరు భావించి ఉంటారు.

ప్రతీఒక్కరు కష్టాలను ఎదుర్కొంటారు: మనం ప్రేమించే వారి యొక్క మరణము, విడాకులు, దారితప్పిన బిడ్డ, అనారోగ్యము, విశ్వాసాన్ని పరీక్షించు శ్రమలు, ఉద్యోగము కోల్పోవడము లేదా మరే ఇతర కష్టమైనా కావచ్చు.

పన్నెండుమంది అపొస్తలుల కూటమికు చెందిన ఎల్డర్ నీల్ ఏ. మ్యాక్స్‌వెల్ ఆయన లుకెమియాతో పోరాడుతున్న సమయంలో మాట్లాడాడిన మాటలు విన్న తరువాత నేను శాశ్వతముగా మారాను. ఆయన ఇలా చెప్పారు: “నేను లోతుగా ఆలోచించుచుండగా, ఈ నిర్దేశికమైన, తిరిగి ధైర్యాన్ని కలిగించే మాటలు నా మదిలోకి వచ్చాయి: ‘నువ్వు యథార్థముగా నా జనులకు బోధించునట్లు, నేను నీకు లుకేమియాను ఇచ్చాను.” తరువాత ఆయన ఈ అనుభవము తనను “నిత్యత్వము యొక్క గొప్ప వాస్తవాల యొక్క దృష్టికోణముతో ఏవిధంగా దీవించెనో వ్యక్తపరచెను. . . . నిత్యత్వము గురించి అటువంటి అవగాహన మరో వందడుగులు ముందుకు ప్రయాణించుటకు మనకు సహాయపడగలదు, అది చాలా కష్టమైనదిగా ఉండవచ్చును.”5

మన కష్టాలలో అటువంటి అవగాహనతో అభివృద్ధి చెంది మరియు జయించుటకు మనకు సహాయపడుటకు నేను రెండు విషయాలు సలహా ఇవ్వవచ్చునా. మొదట ఇతరులను క్షమించుట ద్వారా, రెండవది మన చిత్తాన్ని తండ్రి చిత్తానికి లోబరుచుకొనుట ద్వారా మనము కష్టాలను ఎదుర్కోవాలి.

మనకు కష్టాలు కలిగించిన వారిని క్షమించడం, “దేవుని చిత్తానికి [మనల్ని] మనం” 6 సమన్వయపరచుకొనుట చాలా కష్టమైనది కావచ్చు. మన కష్టము కుటుంబ సభ్యుడు, మంచి స్నేహితుడు, లేదా మన ద్వారా కలిగించబడినప్పుడు అది ఇంకా ఎక్కువ గాయపరుస్తుంది.

క్రొత్తగా యౌవన బిషప్పుగా ఉన్నప్పుడు, నాతో నా స్టేకు అధ్యక్షులు బ్రూస్ ఎమ్. కుక్ ఈ కథను పంచుకొన్నప్పుడు క్షమాపణ గురించి నేను నేర్చుకొన్నాను. ఆయన ఇలా వివరించారు:

“1970 ల చివరిలో, నేను నా భాగస్వాములు ఒక వ్యాపారాన్ని ప్రారంభించాము. మేము ఏదీ చట్టమునకు వ్యతిరేకముగా చేయనప్పటికి, కొన్ని బలహీనమైన నిర్ణయాలు, సవాలుతో కూడిన ఆర్థిక పరిస్థితులు కలిసి మా వైఫల్యానికి కారణమయ్యాయి.

“కొందరు పెట్టుబడిదారులు వారి నష్టాన్ని భర్తీ చేసుకోవటానికి మాపై దావా వేసారు. వారి న్యాయవాది మా కుటుంబము యొక్క బిషప్రిక్కులో ఒక సలహాదారుడుగా ఉండటం జరిగింది. నా జీవితాన్ని నాశనము చెయ్యడానికి ప్రయత్నిస్తున్న అతడిని ఆమోదించడం చాలా కష్టముగా ఉండెను. నేను అతని యెడల నిజమైన పగను పెంచుకొని, అతడిని నా శత్రువుగా భావించాను. ఐదు సంవత్సరాల న్యాయపోరాటము తరువాత, మా ఇంటితోపాటు మేము సంపాదించిన సమస్తమును కోల్పోయాము.

“2002 లో, నేను సలహాదారునిగా పని చేసిన స్టేకు అధ్యక్షత్వము పునర్వవస్థీకరించబడుతుందని నేను నా భార్య తెలుసుకొన్నాము. మేము పిలుపునుండి విడుదల చేయబడకముందు స్వల్పవిరామము కొరకు ప్రయాణించుచుండగా, నేను క్రొత్త స్టేకు అధ్యక్షునిగా పిలవబడితే నా సలహాదారులుగా ఎవరిని నేను ఎంపిక చేస్తానని ఆమె నన్ను అడిగింది. దాని గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు కాని ఆమె పట్టువదలలేదు. చివరకు, నా మనస్సులోకి ఒక పేరు వచ్చింది. తరువాత ఆమె 20 సంవత్సరాల క్రితం మా కష్టాలకు ముఖ్య కారణమైన ఆ న్యాయవాది యొక్క పేరును ప్రస్తావించింది. ఆమె మాట్లాడినప్పుడు, అతడు రెండవ సలహాదారునిగా ఉండాలని ఆత్మ నాకు నిర్ధారించింది. నేను ఆ వ్యక్తిని క్షమించగలనా?

“స్టేకు అధ్యక్షునిగా సేవ చెయ్యాలని ఎల్డర్ డేవిడ్ ఈ. సోరెన్సన్ నాకు పిలుపు ఇచ్చినప్పుడు, నా సలహాదారులను ఎంపిక చేయటానికి ఆయన నాకు ఒక గంట సమయం ఇచ్చారు. కన్నీళ్ళతో, ప్రభువు అంతకుముందే ఆ బయల్పాటును నాకు దయచేసారని నేను సూచించాను. నా శత్రువుగా భావించిన ఆ వ్యక్తి పేరును నేను చెప్పినప్పుడు, నేను కలిగియున్న కోపము, పగ, ద్వేషము అదృశ్యమయ్యాయి. ఆ క్షణంలో, క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా క్షమాపణ వలన కలుగు సమాధానము గురించి నేను నేర్చుకొన్నాను.”

మరోవిధంగా చెప్పాలంటే, పూర్వపు నీఫై వలే మా స్టేకు అధ్యక్షులు అతడిని “యధార్థముగా క్షమించాడు.”7 అధ్యక్షులు కుక్ మరియు అతని సలహాదారుడు ఇద్దరు నీతిమంతులైన యాజకత్వపు నాయకులుగా, ఒకరికొకరు ప్రేమిస్తున్నా వారిగా నేనెరుగుదును. వారిలా ఉండాలని నేను నిశ్చయించుకున్నాను.

అనేక సంవత్సరాల ముందు, అలస్కాలో మా కష్టకాలములో, నేను త్వరగా నేర్చుకొన్నది ఏమిటంటే మన పరిస్థితుల గురించి ఇతరులపైన నిందమోపడం వలన అనగా-వైమానికుడు చీకటిపడుతున్న సమయంలో ఆహారాన్ని విసిరివేయడం-మా సమస్యకు పరిష్కారం కాదు. ఐనప్పటికి, మేము శారీరక అలసట, ఆహారలేమి, అనారోగ్యము, ఒక పెద్ద తుఫాను వచ్చిన సమయంలో కప్పుకోవడానికి కేవలం కీలుచాప మాత్రమే కలిగియుండి నేలపైన పడుకొని శారీరకమైన తీవ్ర అలసటను మేము అనుభవించినప్పుడు “దేవునికి అసాధ్యమైనదేదియు లేదని”8 నేను నేర్చుకొన్నాను.

యౌవన జనులారా, దేవుడు కష్టమైన సంగతులను మీనుండి కోరుచున్నారు. పధ్నాలుగు సంవత్సరాల యువతి బాస్కెట్‌బాల్ పోటీలో పాల్గొన్నది. తన అక్కలాగే తాను కూడా ఉన్నత పాఠశాల బాస్కెట్‌బాల్‌లో ఆడాలని కలలు కనెను. తన తల్లిదండ్రులు గ్వాటిమాలాలో ఒక మిషనుకు అధ్యక్షత్వము వహించుటకు పిలవబడెనని తరువాత ఆమె తెలుసుకొన్నది.

అక్కడకు చేరుకున్న తరువాత, తన తరగతులలో రెండు స్పానిష్ భాషలో ఉంటాయని తెలుసుకుంది, ఆ భాష అమెకు అప్పటికింకా మాట్లాడటం రాదు. ఆమె పాఠశాలలో ఒక్క బాలికల ఆటల జట్టు కూడా లేదు. చాలా కఠినమైన కాపలా ఉన్న ఒక భవనములో 14వ అంతస్థులో ఆమె నివసించింది. వీటిన్నిటికంటే మించి భద్రత కారణాలవల్ల ఆమె ఒంటరిగా బయటకు వెళ్లలేకపోయింది.

నెలలపాటు నిద్రపోవుటకు ఆమె ఏడ్చుటను తన తల్లిదండ్రులు విన్నారు. ఇది వారికి చాలా విచారాన్ని కలిగించింది! ఉన్నత పాఠశాల కొరకు ఆమె అమ్మమ్మ ఇంటికి పంపించాలని వారు చివరకు నిర్ణయించుకొన్నారు.

మా నిర్ణయాన్ని ఆమెకు తెలుపుటకు నా భార్య మా కుమార్తె గదిలోకి ప్రవేశించినప్పుడు, మోర్మన్ గ్రంథము తన మంచముపైన తెరువబడియుండి, ఆమె మోకాళ్లపైన ప్రార్థన చేసుకోవడం చూసింది. “ఆమె బాగానే ఉంటుందని” ఆత్మ నా భార్యకు మెల్లగా చెప్పగా, నా భార్య నిశ్శబ్ధంగా ఆ గదినుండి బయటకు వచ్చింది.

నిద్రపోవుటకు ఆమె ఏడ్చుటను ఇంకెప్పుడు మేము వినలేదు. దృఢనిశ్చయముతో, ప్రభువు యొక్క సహాయముతో, ఆ మూడు సంవత్సరాలను ఆమె ధైర్యంగా ఎదుర్కొంది.

మా మిషను ముగింపునందు, నా కుమార్తెను నీవు పూర్తికాల మిషను సేవ చేస్తావా అని అడిగినప్పుడు, ఆమె సమాధానం “లేదు నాన్న, నేను ఇంతకుముందే సేవ చేసాను.”

ఆమె నిర్ణయం వలన నాకేమి అభ్యంతరము లేదు! కాని ఆరు నెలల తరువాత, ఒక రాత్రి ఆత్మ నన్ను ఈ ఆలోచనతో నిద్రలేపింది: “నీ కుమార్తెను మిషను సేవ చేయుటకు నేను పిలిచియున్నాను.”

నా స్పందన ఏమిటంటే, “పరలోక తండ్రి, ఆమె చాలా ఇచ్చింది.” ఆత్మచేత నేను వెంటనే సరిదిద్దబడ్డాను మరియు ఆమె మిషను సేవ చేయుట ప్రభువుకు అవసరమని నేను అర్థం చేసుకున్నాను.

వెంటనే నేను నా కుమార్తెను మధ్యాహ్న భోజనానికి తీసుకొని వెళ్లాను. బల్లకు అటువైపు నుండి నేను అడిగాను, “గాంజీ, మనమిక్కడ ఎందుకు ఉన్నామో నీకు తెలుసా?”

“నాకు తెలుసు నాన్న. నేను మిషను సేవ చెయ్యాలని మీకు తెలుసు. నాకు వెళ్లాలని లేదు, కాని నేను వెళ్తున్నాను” అని ఆమె చెప్పింది.

ఆమె తన చిత్తాన్ని పరలోక తండ్రికి సమర్పించింది కనుక, ఆమె తన పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణబలముతో, పూర్ణ శక్తితో ఆయనకు సేవ చేసింది. కష్టమైన పనులు ఏవిధంగా చెయ్యాలో ఆమె తన తండ్రికి నేర్పింది.

యువత కొరకు అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారు నిర్వహించిన ప్రపంచవ్యాప్త ఆరాధనలో, యువతనుండి ఆయన కొన్ని కష్టమైన పనులను కోరారు. అధ్యక్షులు నెల్సన్ ఇలా చెప్పారు: “మీకు నా ఐదవ ఆహ్వానము ఏమిటంటే లోక విధానాలు అనుసరించక, లోకాని కంటే భిన్నంగా ఉండండి. . . . యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యునివలె మీరు కనబడాలి, మాట్లాడాలి, ప్రవర్తించాలి, దుస్తులు ధరించాలని ప్రభువు మిమ్మల్ని కోరుచున్నారు.”9 అది కష్టమైన పని కావచ్చును, ఐనప్పటికి ఆనందంతో--- మీరు దానిని చెయ్యగలరని నాకు తెలుసు.

“మనుష్యులు, సంతోషమును కలిగియుండునట్లు వారున్నారు” 10 అని జ్ఞాపకము చేసుకోండి. లీహై అనుభవించిన సమస్తముతో, అతడింకను ఆనందమును కనుగొనెను. అమ్మోనైహా జనుల వలన ఆల్మా “అధిక దుఃఖముతో కృంగి”11 యుండుటను జ్ఞాపకము చేసుకోండి. ఆ దూత అతనితో ఇలా చెప్పెను, “ఆల్మా నీవు ధన్యుడవు, కావున నీ తలను పైకెత్తి సంతోషించుము. . . . ఏలయనగా ఆయన ఆజ్ఞలను పాటించుటలో నీవు నమ్మకముగా ఉన్నావు.” 12 ఆల్మా ఒక గొప్ప సత్యాన్ని నేర్చుకొనెను: మనము ఆజ్ఞలను పాటించినప్పుడు మనమెల్లప్పుడు సంతోషముగా ఉండగలము. సైన్యాధిపతి మొరోనై కాలములో యుద్ధాలు, సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో “ఈ సమయమున కంటే సంతోషకరమైన సమయము నీఫై జనుల మధ్య ఎన్నడును లేకుండెను” 13 అని జ్ఞాపకము చేసుకొనుము. మనం కష్టాలను ఎదుర్కొన్నప్పుడు సంతోషాన్ని కనుగొనగలము, కనుగొనాలి.

యేసు క్రీస్తు కష్టాలను ఎదుర్కొన్నాడు: “వారి దుష్టకార్యములను బట్టి లోకము ఆయనను పనికి రాని వస్తువుగా తీర్పు తీర్చును. అందువలన, వారు ఆయనను కొరడాతో బాధించినా ఆయన సహించును, ఆయనను కొట్టినా ఆయన సహించును. వారు ఆయనపై ఉమ్మి వేసినా మనుష్య సంతానము యెడల ఉన్న ఆయన కృపాతిశయము మరియు దీర్ఘశాంతమును బట్టి ఆయన సహించును.”14

ఆయన కృపాతిశయము వలన యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తమును అనుభవించెను. దాని ఫలితంగా, మనలో ప్రతి ఒక్కరికి ఆయన ఇలా చెప్పుచున్నారు, “లోకములో మీకు శ్రమ కలుగును;: అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.”15 క్రీస్తు వలన, మనం కూడా లోకాన్ని జయించగలము.

ప్రభువు మార్గములో కష్టాలనెదుర్కొన్నప్పుడు, మనం మన తలలు పైకెత్తి, సంతోషించెదముగాక. లోకమునకు సాక్ష్యమిచ్చుటకు కలిగిన ఈ పరిశుద్ధ అవకాశములో, రక్షకుడు జీవించుచున్నారని, తన సంఘాన్ని నడిపించుచున్నారని నేను ప్రకటిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

ముద్రించు