2010–2019
తండ్రి
అక్టోబర్ 2018


తండ్రి

మనలో ప్రతీఒక్కరము తండ్రి వలే కాగల సాధ్యతను కలిగియున్నాము. ఆవిధంగా చేయుటకు, మనము కుమారుని యొక్క నామములో తండ్రిని ఆరాధించాలి.

నా భార్య మెలిండా, తన జీవితకాలమంతా, యేసు క్రీస్తు యొక్క విశ్వాసురాలైన శిష్యురాలిగా ఉండుటకు తన పూర్ణ హృదయముతో ప్రయత్నించింది. అయినప్పటికీ, తన యౌవనారంభంలో, ఆమె ఆయన స్వభావమును అపార్థము చేసుకున్నది కనుక, ఆమె పరలోకపు తండ్రి యొక్క ప్రేమ మరియు దీవెనలకు అయోగ్యురాలిగా భావించింది. అదృష్టవశాత్తూ, మెలిండా, తాను పొందిన విచారమును లక్ష్యపెట్టకుండా, ఆజ్ఞలను పాటించుట కొనసాగించింది. తన పిల్లల కొరకు ఆయన ప్రేమ, ఆయన పనిని చేయుటకు మన అపరిపూర్ణమైన ప్రయత్నాల కొరకు ఆయన కృతజ్ఞతతో కలిపి దేవుని స్వభావమును బాగా గ్రహించుటకు కొన్ని సంవత్సరాల క్రితం ఆమెకు కలిగిన అనుభవాల పరంపర ఆమెకు సహాయపడింది.

ఇది ఆమెను ఎలా ప్రభావితం చేసిందో ఆమె వివరించింది: “తండ్రి యొక్క ప్రణాళిక పని చేస్తుందని, ఆయన మన విజయములో వ్యక్తిగతంగా పెట్టుబడి పెట్టారని, ఆయన సన్నిధికి తిరిగి వెళ్లుటకు మనకవసరమైన పాఠములు మరియు అనుభవాలను మనకు ఇస్తారని నిశ్చయముగా నేనిప్పుడు భావిస్తున్నాను. నన్ను మరియు ఇతరులను దేవుడు మనల్ని చూసినట్లుగా నేను చూస్తున్నాను. నేను తల్లిగా బోధించి, ఎక్కువ ప్రేమతో మరియు తక్కువ భయముతో సేవ చేయగలను. ఆందోళన, అభద్రత కంటే మేలుగా శాంతిని, విశ్వాసమును అనుభూతి చెందుతున్నాను. విమర్శించబడినట్లుగా భావించుటకు బదులుగా, నేను బలపరచబడుతున్నాను. నా విశ్వాసము ఎక్కువ నిశ్చయమైనది. నేను నా తండ్రి యొక్క ప్రేమను ఎక్కువ తరచుగా మరియు ఎక్కువ లోతుగా అనుభవిస్తున్నాను.” 1

“ఉన్నతస్థితిని పొందుటకు తగినంత విశ్వాసమును సాధన చేయుటకు (పరలోక తండ్రి యొక్క) స్వభావము, పరిపూర్ణతలు, మరియు లక్షణాలను గూర్చి ఖచ్చితమైన ఆలోచనను” కలిగియుండుట ఆవశ్యకమైనది.2 పరలోక తండ్రిని గూర్చి సరైన అవగాహన మనల్ని, ఇతరులను మనం చూసే విధానమును మార్చగలదు మరియు ఆయన పిల్లల కొరకు దేవుని యొక్క అద్భుతమైన ప్రేమను, ఆయన వలే అగుటకు మనకు సహాయపడాలనే ఆయన గొప్ప కోరికను గ్రహించుటకు మనకు సహాయపడును. ఆయన స్వభావమును గూర్చి సరికాని దృక్పథము ఆయన సన్నిధికి తిరిగి వెళ్లుటకు మనము ఎప్పటికీ సమర్థులము కాదని భావించునట్లు చేయవచ్చు.

ఈరోజు తండ్రి గురించి ముఖ్యమైన సిద్ధాంతపరమైన విషయాలను బోధించుట నా లక్ష్యము, అది మనలో ప్రతీఒక్కరిని, ప్రత్యేకంగా దేవుడు వారిని ప్రేమిస్తున్నాడా అని ఆశ్చర్యపడువారిని, ఆయన నిజమైన స్వభావమును సరిగ్గా గ్రహించుటకు మరియు ఆయన, ఆయన కుమారునియందు, మన కొరకు ఆయన ప్రణాళికయందు గొప్ప విశ్వాసమును సాధన చేయుటకు అనుమతించును.

మర్త్యత్వమునకు ముందు లోకము

మర్త్యత్వమునకు ముందు లోకములో, మనము పరలోకపు తల్లిదండ్రులకు ఆత్మలుగా జన్మించాము మరియు ఒక కుటుంబముగా వారితో జీవించాము.3 వారు మనల్ని ఎరిగి, మనకు బోధించి, మనల్ని ప్రేమించారు. 4 మనము మన పరలోకపు తండ్రి వలె ఉండాలని ఎక్కువగా కోరుకున్నాము. అయినప్పటికీ, ఆవిధంగా చేయుటకు మనమిలా చేయాలని గుర్తించాము:

  1. మహిమపరచబడిన, అమర్త్యమైన, భౌతిక శరీరాలను పొందాలి; 5

  2. వివాహము చేసుకోవాలి, యాజకత్వము యొక్క ముద్రణాధికారముచేత కుటుంబాలను ఏర్పరచుకోవాలి;6 మరియు

  3. సమస్త జ్ఞానము, శక్తి మరియు దైవిక లక్షణాలను సంపాందించాలి.7

తత్ఫలితంగా తండ్రి ఒక ప్రణాళికను సృష్టించారు, అది నిర్ధిష్టమైన షరతులపై8 పునరుత్థానములో అమర్త్యమైన మహిమపరచబడిన భౌతిక శరీరాలను పొందుటను సాధ్యపరచును; మర్త్యత్వములో వివాహము చేసుకొని, కుటుంబాలను రూపించాలి లేదా అవకాశములేని విశ్వాసులు మర్త్యత్వము తరువాత; 9 పరిపూర్ణతవైపు వృద్ధి చెందుతారు; చివరకు మన పరలోక తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్లి, వారితో మరియు మన కుటుంబాలతో మహోన్నత స్థితి మరియు నిత్య సంతోషము యొక్క స్థాయిలో జీవిస్తాము. 10

లేఖనాలు దీనిని రక్షణ ప్రణాళిక అని పిలుస్తాయి.11 ఈ ప్రణాళిక కొరకు మనము చాలా కృతజ్ఞత కలిగియున్నాము, అది మనకు సమర్పించబడినప్పుడు, మనము సంతోషముతో కేకలు వేసాము.12 దైవిక లక్షణాలను వృద్ధి చేయడానికి మనకు సహాయపడు మర్త్య అనుభవాలు మరియు సవాళ్ళతోపాటు, ప్రణాళిక యొక్క షరతులను మనలో ప్రతీఒక్కరం అంగీకరించాము.13

మర్త్య జీవితము

మర్త్యత్వములో, పరలోకపు తండ్రి ఆయన ప్రణాళిక లోపల వృద్ధి చేయడానికి అవసరమైన షరతులను మనకు దయచేసారు. తండ్రి, యేసు క్రీస్తును శరీరమందు కనియున్నాడు14 మరియు ఆయన మర్త్య పరిచర్యను నెరవేర్చుటకు ఆయనకు దైవిక సహాయమును అందించారు. అదేవిధంగా ఆయన ఆజ్ఞలను పాటించడానికి మనము ప్రయాసపడినట్లైతే, పరలోకపు తండ్రి మనలో ప్రతీఒక్కరికి సహాయపడతారు.15 తండ్రి మనకు కర్తృత్వాన్ని ఇస్తారు. 16 మన జీవితాలు ఆయన చేతులలో ఉన్నాయి, మన “దినములు లెక్కించబడినవి” మరియు “తక్కువగా లెక్కించబడవు.”17 చివరకు ఆయనను ప్రేమించువారి మేలు కొరకు సమస్త విషయాలు పనిచేయునట్లు ఆయన నిశ్చయపరుస్తారు.18

పరలోక తండ్రి మన అనుదిన ఆహారమును మనకిస్తారు,19 అది మనము తినే ఆహారమును, ఆయన ఆజ్ఞలను పాటించుటకు మనకవసరమైన బలమును రెండింటిని కలిగియుంది.20 తండ్రి మంచి వరములను ఇస్తారు.21 ఆయన మన ప్రార్థనలు విని జవాబిస్తారు.22 మనము ఆయనను అనుమతించినప్పుడు పరలోకపు తండ్రి మనల్ని చెడు నుండి విడిపిస్తారు.23 మనము బాధపడినప్పుడు ఆయన మన కొరకు దుఃఖిస్తారు.24 చివరకు, మన దీవెనలన్నీ తండ్రినుండి వస్తాయి.25

పరలోకపు తండ్రి మనకు నడిపింపునిస్తారు మరియు మనము మంచి ఫలమును ఫలించునట్లు మన బలములు, బలహీనతలు, ఎంపికలపై ఆధారపడి మనకవసరమైన అనుభవాలనిస్తారు.26 ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు, కనుక అవసరమైనప్పుడు మనల్ని గద్దిస్తారు.27 ఆయన “ఉపదేశకుడు,”28 మనము అడిగినట్లైతే మనకు ఉపదేశిస్తారు. 29

పరలోకపు తండ్రియే మన జీవితాలలోనికి పరిశుద్ధాత్మ యొక్క ప్రభావమును మరియు వరమును రెండిటిని పంపుతారు.30 పరిశుద్ధాత్మ వరము ద్వారా, తండ్రి యొక్క మహిమ---లేక తెలివి, వెలుగు మరియు శక్తి----మనలో నివసించగలవు.31 మన కళ్ళు దేవుని మహిమపై దృష్టి నిలుపునంత వరకు వెలుగు మరియు సత్యములో వృద్ధి చెందుటకు మనము ప్రయాసపడినట్లైతే, మనకు నిత్యజీవమును ముద్రవేయుటకు మరియు ఈ జీవితంలో లేక తరువాత జీవితంలో---మనకు ఆయన ముఖమును బయల్పరచుటకు పరిశుద్ధాత్మ వాగ్దానమును పరలోక తండ్రి పంపుతారు.32

మర్త్యత్వము తరువాత జీవితము

మర్త్యత్వము తరువాత ఆత్మ లోకములో, పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మను క్రుమ్మరించుటను, సువార్త అవసరమైన వారికి మిషనరీలను పంపుటను కొనసాగిస్తారు. ఆయన ప్రార్థనలకు జవాబిస్తారు మరియు రక్షించే విధులు కొదువుగా ఉన్న వారు వాటిని పొందుటకు సహాయపడతారు.33

తండ్రి, యేసు క్రీస్తును లేపి, పునరుత్థానమును తెచ్చుటకు ఆయనకు శక్తినిచ్చారు,34 దాని ద్వారా మనము అమర్త్య శరీరములను పొందుతాము. రక్షకుని విమోచన మరియు పునరుత్థానము తండ్రి యొక్క సన్నిధికి మనల్ని తిరిగి తెస్తుంది, అక్కడ మనము యేసు క్రీస్తు చేత తీర్పు తీర్చబడతాము.35

“పరిశుద్ధ మెస్సీయా యొక్క మంచితనము, కనికరము మరియు కృప” 36 పై ఆధారపడువారు తండ్రి వలే మహిమగల శరీరాలను పొందుతారు37 మరియు “అంతముకాని సంతోషము యొక్క స్థితిలో” 38 ఆయనతో నివసిస్తారు. అక్కడ, తండ్రి మన సమస్త కన్నీళ్ళను తుడిచివేసి, 39 ఆయన వలే అగు మన ప్రయాణములో కొనసాగుటకు మనకు సహాయపడతారు.

మీరు చూడగలిగినట్లుగా, పరలోకపు తండ్రి ఎల్లప్పుడు మన కొరకు ఉన్నారు. 40

తండ్రి యొక్క స్వభావము

తండ్రివలే కావడానికి మనము ఆయన స్వభావ లక్షణాలను వృద్ధి చేయాలి. పరలోకపు తండ్రి యొక్క పరిపూర్ణతలు మరియు లక్షణాలు క్రింది వాటిని కలిపియున్నవి:

  • తండ్రి “అంతములేని వాడు మరియు నిత్యుడు.” 41

  • ఆయన పరిపూర్ణముగా న్యాయవంతుడు, కనికరము, దయ, దీర్ఘ శాంతము గలవాడు మరియు మన కొరకు శ్రేష్టమైనది మాత్రమే కోరుకొనువాడు. 42

  • పరలోకపు తండ్రి ప్రేమా స్వరూపి. 43

  • ఆయన తన నిబంధనలను నిలుపుకొనును. 44

  • ఆయన మార్పు చెందడు.45

  • ఆయన అబద్ధమాడడు.46

  • తండ్రి పక్షపాతి కాడు.47

  • ఆయన ఆరంభం నుండి----గతము, ప్రస్తుతము, మరియు భవిష్యత్తు-- సమస్త విషయాలను ఎరుగును.50

  • మనందరికంటే49 పరలోకపు తండ్రి మహాజ్ఞాని. 50

  • తండ్రి సమస్త శక్తిని కలిగియున్నారు51 మరియు ఆయన కోరుచున్న సమస్తమును చేయుదురు. 52

సహోదర సహోదరీలారా, మనము తండ్రియందు నమ్మకముంచగలము మరియు ఆధారపడగలము. ఆయన నిత్య దృష్టికోణమును కలిగియున్నారు కనుక, మనము చూడలేని విషయాలను పరలోకపు తండ్రి చూడగలరు. మన అమర్త్యత్వమును, ఉన్నత స్థితిని తెచ్చుటయే ఆయన ఆనందము, కార్యము, మహిమ.53 ఆయన చేయు సమస్తము మన ప్రయోజనము కొరకైనది. ఆయన “(మన) నిత్య సంతోషమును (మన) కంటే ఎక్కువగా కోరుతారు.” 54 ఆయన “(మన) ప్రయోజనము కొరకు లేక (మనము) ప్రేమించు వారి కొరకు ఖచ్చితంగా అవసరమైన దానికంటే ఎక్కువ కష్టమైన ఒక్క క్షణమును అనుభవించుటకు కూడా (మనల్ని) కోరరు.”55 ఫలితంగా, మనము వృద్ధి చెందడానికి సహాయపడడంపై ఆయన దృష్టిసారిస్తారు, కానీ మనల్ని విమర్శించడం మరియు నిందించడం పైన కాదు.56

మన తండ్రి వలే అగుట

దేవుని యొక్క ఆత్మ కుమారులు, కుమార్తెలుగా, మనలో ప్రతిఒక్కరు తండ్రి వలే అయ్యే సాధ్యతను కలిగియున్నారు. ఆవిధంగా చేయడానికి, మనము కుమారుని నామములో తండ్రిని ఆరాధించాలి.57 దీనిని మనము రక్షకుడు చేసినట్లుగా, 58 తండ్రి యొక్క చిత్తమునకు విధేయులగుటకు ప్రయాసపడుట ద్వారా మరియు నిరంతరము పశ్చాత్తాపపడుట ద్వారా చేయగలము.59 ఈ విషయాలను మనము చేసినప్పుడు, మనము తండ్రి యొక్క సంపూర్ణతను పొందేంత వరకు60 “కృప వెంబడి కృపను పొందుతాము” మరియు “ఆయన స్వభావము, పరిపూర్ణతలు, మరియు లక్షణాల”61 తో దీవించబడతాము.

మర్త్యులుగా మనమేమిటి మరియు పరలోకపు తండ్రి ఏవిధంగా ఉన్నారనే దాని మధ్య తేడాను ఆలోచించినప్పుడు, తండ్రివలే మారుట అసాధ్యమైనదని కొందరు భావించడంలో ఆశ్చర్యం లేదు. అయినప్పటికీ, లేఖనాలు స్పష్టముగా ఉన్నాయి. మనము క్రీస్తును విశ్వాసమందు హత్తుకొని, పశ్చాత్తాపపడి, విధేయత ద్వారా దేవుని కృపను వెదకినట్లైతే, క్రమంగా మనము తండ్రి వలే మారతాము. విధేయులుగా ఉండుటకు ప్రయాసపడువారు “కృప వెంబడి కృపను పొంది, ” చివరకు “ఆయన సంపూర్ణతను పొందుతారు62 అనే వాస్తవంలో నేను గొప్ప ఓదార్పును పొందుతాను. మరొక మాటలలో, మన స్వంతంగా మనము తండ్రి వలే మారము.63 బదులుగా, ఆ మార్పు అనేది కృప యొక్క వరముల ద్వారా వస్తుంది, కొన్ని వరములు పెద్దవి, కాని చాలావరకు చిన్నవిగా ఉండి, మనము సంపూర్ణతను పొందు వరకు అవి ఒక దానితో మరొకటి జతచేరుతాయి. కాని మార్పు వస్తుంది!

మిమ్మల్ని ఎలా ఉన్నత స్థితిలో ఉంచాలో పరలోకపు తండ్రి ఎరుగునని విశ్వసించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను; అనుదినము బలపరచు ఆయన సహాయమును వెదకండి; మీరు దేవుని ప్రేమను భావించలేనప్పుడు కూడా క్రీస్తునందు విశ్వాసముతో ముందుకు త్రోసుకొని వెళ్ళండి.

తండ్రి వలే అగుట గురించి మనము గ్రహించనిది అత్యధికమున్నది.64 కాని తండ్రి వలే అగుటకు ప్రయాసపడుట ప్రతీ త్యాగము కంటే విలువైనదని నిశ్చయముగా నేను సాక్ష్యమివ్వగలను.65 మర్త్యత్వములో మనము చేయు త్యాగములు ఎంత గొప్పవైనప్పటికీ, దేవుని సన్నిధిలో మనము అనుభూతి చెందే లెక్కలేనంత ఆనందము, సంతోషము, ప్రేమకు సాటిరావు.66 మిమ్మల్ని చేయమని అడిగిన త్యాగములను మించి ఇది విలువైనదని నమ్ముటకు మీరు ప్రయాసపడినట్లైతే, రక్షకుడు ఇలా చెప్తూ మిమ్మల్ని పిలుస్తున్నారు, “తండ్రి మీ కొరకు సిద్ధపరిచిన దీవెనలు . . . ఎంత గొప్పవో మీరింకను గ్రహించలేదు; . . . మీరు ఇప్పుడు అన్ని విషయాలను వహించలేరు; అయినప్పటికీ, సంతోషించుడి, ఏలయనగా నేను మీ వెంట ఉండి నడిపించెదను.”67

మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నారని, మరలా మీరు ఆయనతో జీవించాలని కోరుతున్నారని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

ముద్రించు