2010–2019
నమ్ముడి, ప్రేమించుడి, ఆయన చెప్పినట్లుగా చేయుడి
అక్టోబర్ 2018


నమ్ముడి, ప్రేమించుడి, ఆయన చెప్పినట్లుగా చేయుడి

యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యుడగుట ద్వారా---ఆయన మార్గములను అనుసరించుట ద్వారా, ఆయన కార్యములో పూనుకొనుట ద్వారా మనము సమృద్ధియైన జీవితమును సాధిస్తాము.

నా ప్రియమైన సహోదర, సహోదరిలారా, ఈరోజు, ఈ అద్భుతమైన సర్వసభ్య సమావేశములో మీతో ఉండుట అటువంటి అద్భుతమైన సందర్భము: ప్రేరేపించబడిన సందేశాలు వినుటకు; ఈ అద్భుతమైన, ప్రపంచమంతటా అనేక వేలమంది మిషనరీలకు ప్రతినిధులుగా అద్భుతమైన గాయక బృందమును వినుటకు—మన కుమార్తైలు, మన కుమారులు---మరియు నేడు ప్రత్యేకంగా మన విశ్వాసముతో ఏకము చేయబడుటకు, మరలా మన ప్రియమైన అధ్యక్షుడు మరియు ప్రవక్త, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్, ప్రథమ అధ్యక్షత్వము, మరియు సంఘములో ప్రధాన అధికారులను ఆమోదించుటకు. ఈరోజు మీతో ఉండుటకు ఎటువంటి ఆనందకరమైన దినము.

ప్రాచీన కాలపు రాజైన సొలొమోను చరిత్రలో, అత్యంత బాహాటంగా విజయవంతులైన మానవులలో ఒకడు.1 అతడు ---ధనము, రాజ్యాధికారము, ఆరాధన, గౌరవము, ప్రతీది కలిగియున్నట్లుగా కనబడెను. కాని కొన్ని దశాబ్దాలు తన ఇష్టానుసారంగా, విలాసవంతంగా జీవించిన సొలొమోను రాజుకు చివరికి మిగిలింది ఏమిటి?

“సమస్తము వ్యర్ధము,”2 అతడు అన్నాడు.

ఈ మనుష్యుడు సమస్తమును కలిగియుండి, సమస్తము తన ఇష్టానుసారముగా నడచుచున్నప్పటికి, చివరికి విరక్తి చెంది, నిరాశావాదిగాను విచారగ్రస్తునిగాను మిగిలిపోయాడు.3

జర్మన్ భాషలో ఒక మాట కలదు, వెల్ట్ష్ మెర్జ్. మామూలుగా చెప్పాలంటే దీని భావం, మన అంచనాలకు భిన్నంగా ప్రపంచం పాడైపోవుచున్నది అనే విచారం లేక వైరాగ్యం అని చెప్పవచ్చు.

బహుశ మనందరిలోను కాస్త వెల్ట్ష్ మెర్జ్ లేక వైరాగ్యం ఉందని చెప్పవచ్చును.

మనకు తెలియకుండా విచారమును అనుభవిస్తున్నప్పుడు. రాత్రి, పగలంతా మనము బలమైన విచారమును భావించినప్పుడు. మనము ప్రేమించువారి జీవితాలందు కలిపి మనకు ఏదైన విషాదము లేక అన్యాయము జరుగుతున్నప్పుడు. మన జీవితాలలో దురదృష్టకరమైనవి ఎక్కువగా జరుగుతున్నాయని, మిగిలిన వారికంటే మనము ఎక్కువ కష్టములు కలిగియున్నామని మనము భావించుట, మనము శాంతిని అనుభవించాల్సినప్పుడు నిరాశ చెందినట్లు భావించునట్లు చేసినప్పుడు---జీవితము వ్యర్ధమని మరియు అర్ధములేనిదని సొలొమోనుతో అంగీకరించుటకు మనము శోధింపబడవచ్చు.

గొప్ప నిరీక్షణ

మంచి వార్త ఏదనగా, నిరీక్షణ ఉన్నది. శూన్యమైన, వ్యర్ధమైన వెల్ట్ష్ మెర్జ్ జీవితానికి పరిష్కారం కలదు. మీరు అనుభవించే లోతైన నిరాశకు, నిస్పృహకు కూడా పరిష్కారం ఉన్నది.

ఈ నిరీక్షణ మన ఆత్మల వ్యాధినుండి మనల్ని స్వస్థపరచి మార్చగల యేసు క్రీస్తు సువార్త యొక్క శక్తి లోను, రక్షకుని విమోచనా శక్తిలోను కనుగొనబడును.

“వాటికి జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును, నేను వచ్చితినని యేసు ప్రకటించెను.”4

మన సొంత అవసరాలు లేక మన సొంత విజయాల మీద కేంద్రీకరించకుండా యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులము అగుట ద్వారా—ఆయన మార్గములను అనుసరించుచు, ఆయన కార్యములో నిమగ్నమై యుండుట ద్వారా ఆ సమృద్ధియగు జీవితమును మనము సాధించగలము. మనల్నిమనం మరచిపోయి, క్రీస్తు యొక్క గొప్ప హేతువునందు పూనుకొనుటలో సమృద్ధియైన జీవితమును మనము కనుగొంటాము.

క్రీస్తు సంకల్పం ఏమిటి? ఆయన యందు విశ్వాసముంచుట, ఆయన ప్రేమించినట్లుగా ప్రేమించుట, ఆయన చేసినట్లుగా చేయుట.

యేసు “మేలు చేయుచు సంచరించుచుండెను.”5 ఆయన పేదవారు, వెలివేయబడినవారు, రోగులు, కించపరచబడిన వారి మధ్య నడచెను. శక్తిహీనులకు, బలహీనులకు, దిక్కులేనివారికి, ఆయన పరిచర్య చేసెను. ఆయన వారితో సమయము గడిపెను; ఆయన వారితో మాట్లాడాడు. “మరియు వారినందరిని స్వస్థపరచెను.”6

ఆయన వెళ్ళిన ప్రతిచోట, రక్షకుడు సువార్త యొక్క “మంచి వార్తలను”7 బోధించెను. ప్రజలను ఆత్మీయంగాను, శారీరకంగాను స్వేచ్ఛగా చేయగల నిత్యజీవ సత్యములను ఆయన పంచుకొనెను.

తమ్మును తాము క్రీస్తు యొక్క హేతువులో సమర్పించుకొన్నవారు రక్షకుని యొక్క వాగ్దానములోని సత్యమును కనుగొంటారు: “తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును.” 8

సొలొమోను పొరబడ్డాడు, నా ప్రియమైన సహోదర, సహోదరిలారా—జీవితము “వ్యర్ధము” కాదు. వ్యతిరేకంగా, అది సంకల్పము, భావము, మరియు శాంతితో నిండియుండవచ్చు.

యేసు క్రీస్తు యొక్క స్వస్థపరచు హస్తములు ఆయనను వెదకు వారందరికి చాపబడినవి. దేవుని నమ్ముట, మరియు ప్రేమించుట, క్రీస్తును అనుసరించుటకు ప్రయాసపడుట మన హృదయములను మార్చగలదు,9 మన బాధను ఉపశమింప చేయగలదు, మరియు మన ఆత్మలను “మిక్కిలి గొప్ప ఆనందముతో”10 నింపగలదు అని నేను నిస్సందేహముగా తెలుసుకోగలిగాను.

నమ్ముడి, ప్రేమించుడి, ఆయన చెప్పినట్లుగా చేయుడి

కావచ్చు, మన జీవితాలలో ఈ స్వస్థపరచు ప్రభావమును కలిగియుండుటకు సహజమైన జ్ఞానము కలిగియుండుట కంటే మనము ఎక్కువగా చేయాలి. మనము దానిని మన జీవితాలలోనికి విలీనపరచుకోవాలి----మనమెవరము మరియు మనమేమి చేస్తామో దానిని ఒక భాగముగా చేయాలి.

శిష్యత్వము అనేది, మూడు సామాన్యమైన మాటలతో ప్రారంభమౌతుందని నేను సూచించవచ్చునా:

నమ్ముడి, ప్రేమించుడి, మరియు ఆయన చెప్పినట్లుగా చేయుడి.

దేవునిని నమ్ముట ఆయనయందు విశ్వాసమునకు, ఆయన వాక్యమునందు విశ్వాసమును పెంపొందించుటకు నడిపించును. విశ్వాసము మన హృదయములను దేవుని కొరకు ఇతరుల కొరకు ప్రేమలో ఎదుగునట్లు చేయును. ఆ ప్రేమ పెరిగే కొలది, శిష్యత్వపు బాటలో మన స్వంత గొప్ప ప్రయాణమును కొనసాగించినప్పుడు రక్షకుని అనుకరించుటకు మనము ప్రేరేపించబడతాము.

“ కానీ,” మీరనవచ్చు. “అది మరీ సామాన్యంగా ఉన్నది. జీవితపు సమస్యలు, నిశ్చయముగా నా సమస్యలు, ఇటువంటి సాధారణ సలహాతో పరిష్కరించుటకు చాలా చిక్కైనవి.నమ్ముడి, ప్రేమించుడి, ఆయన చెప్పినట్లుగా చేయుడి, అను మూడు సాధారణమైన మాటలతో వెల్ట్ష్ మెర్జ్‌ను మీరు బాగుచేయలేరు.

స్వస్థపరచేది సూక్తి కాదు. విడిపించేది, పునరుద్ధరించేది, ఉపశమింపచేసేది, దేవుని ప్రేమయే.

దేవుడు మిమ్మల్ని ఎరుగును. మీరు ఆయన బిడ్డ. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.

ప్రేమించుటకు మీరు తగరని మీరు భావించినప్పుడు కూడా, ఆయన మిమ్మల్ని చేరుకుంటాడు.

ఈ రోజు—ప్రతి రోజు—ఆయన మిమ్మల్ని సమీపిస్తున్నాడు, మిమ్మల్ని స్వస్థపరచుటకు, లేవనెత్తుటకు, మరియు మీ హృదయములోని శూన్యతను తొలగించి, స్థిరమైన సంతోషముతో నింపుటకు కోరుచున్నాడు. మీ జీవితమును కమ్ముకొనిన ఏ చీకటినైనా తుడిచివేసి ఆయన అంతులేని మహిమ యొక్క పరిశుద్ధమైన, ప్రకాశమానమైన వెలుగుతో దానిని నింపవలెనని ఆశించుచున్నాడు.

దీనిని నేను స్వయంగా అనుభవించాను.

దేవుని యొద్దకు వచ్చు వారందరు—నిజముగా నమ్ముచు, ప్రేమించుచు, ఆయన చెప్పినట్లు చేయు వారందరు—దానిని అనుభవించగలరు, మరియు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అపోస్తలునిగా ఇది నా సాక్ష్యము.

మనము నమ్ముచున్నాము

“విశ్వాసము లేకుండా, (దేవునికి) ఇష్టుడైయుండుట అసాధ్యము: దేవునియొద్దకు వచ్చు వాడు ఆయన ఉన్నాడని నమ్మవలెను”11 అని లేఖనాలు మనకు బోధిస్తున్నాయి.

కొందరికి, నమ్ముట కష్టతరమైన చర్య. కొన్నిసార్లు మన గర్వము మనలను ఆటంకపరచును. బహుశా మనము తెలివిగలవారము, విద్యావంతులము, లేక అనుభవము కలిగిన వారమని మనము అనుకుంటాము, మనము కేవలము దేవునిని నమ్మలేము. మరియు మనము మతమును ఒక మూఢ ఆచారముగా చూడసాగుతాము. 12

నా అనుభవంలో, నమ్మకం అనేది మనం కంటితో చూచి మెచ్చుకొని, దాని గురించి చర్చించుటకు, సిద్ధాంతీకరించు ఒక చిత్రపటం వంటిది కాదు. సారూప్యంలో అది మనము పొలములోనికి తీసుకొనివెళ్ళు నాగలిని ఎక్కువగా పోలియున్నది, మరియు మనము చెమటోడ్చి పొలము పని చేసి, దుక్కిపట్టి అరక దున్ని, నేలలో విత్తనములు చల్లి, పంట పండించుటకు నమ్మకం అవసరము.13

దేవునికి దగ్గరగా రండి, మరియు ఆయన మీకు దగ్గరగా వచ్చును.14 నమ్ముటకు కోరు వారందరికి ఇదే వాగ్దానం.

మనము ప్రేమిస్తున్నాము

మనము దేవునిని మరియు ఆయన పిల్లల్ని ఎంత ఎక్కువగా ప్రేమిస్తే మన సంతోషము అంత అధికమౌతుంది అని లేఖనములు తెలియచేస్తున్నాయి.15 అయినప్పటికిని, యేసు చెప్పిన ప్రేమ మాత్రం ఒక బహుమతి కార్డు వంటిది కాదు. ఉపయోగించి పడవేసేది కాదు, ప్రేమను అంగీకరించి, మరొకదానిపై దృష్టి మరల్చబడేది కాదు. మాట్లాడబడిన తరువాత మరచిపోబడేదికాదు. “నేనేమైనా చేయగలనేమో తెలుపుమని కపటముగా అడిగేది” కాదు.

దేవుడు మాట్లాడే ప్రేమ, ఉదయాన మనం మేల్కొన్నప్పుడు మన హృదయాలలో ప్రవేశించి, రోజంతా మనతోనే ఉండి, సాయంత్రము ముగిసేసరికి మనము కృతజ్ఞతగల ప్రార్ధనలు చేసినప్పుడు మన హృదయంలో ఉప్పొంగును.

ఇది పరలోక తండ్రికి మనపై గల వర్ణనాతీతమైన ప్రేమ.

అది మనము ఇతరులను వారెవరో మరింత స్పష్టముగా గుర్తించుటకు తోడ్పడే అంతులేని కనికరము. పరిశుద్ధమైన ప్రేమ అనే కటకముగుండా అనంత సాధ్యత మరియు విలువగల అమర్త్యులను మరియు సర్వశక్తి మంతుడైన దేవుని ప్రియమైన కుమారులను, కుమార్తెలను చూడగలము.

ఒకసారి ఆ కటకముగుండా చూసాక, మనము ఎవరిని తగ్గించము, విస్మరించము, లేక వివక్షత చూపలేము.

మనం ఆయన చెప్పినట్లు చేయాలి

రక్షకుని కార్యములో, తరచుగా “చిన్న మరియు సాధారణమైన వస్తువుల ద్వార” “గొప్పక్రియలు జరిగించబడును.” 16

ఎందులోనైనా ప్రావీణ్యము పొందడానికి అనేకసార్లు సాధన చేయుట దానికి అవసరమని మనము ఎరుగుదుము. సాక్సోఫోను వాయించడానికైనా, బంతిని నెట్లోనికి తన్నడానికైనా, ఒక కారును బాగుచేయడానికైనా, లేక విమానమును ఎగరు వేయుట కూడా, సాధన చేయుట ద్వారానే మనము బాగా అభివృద్ది పొందగలము.17

ఆ విధంగా చేయుటకు మనకు సహాయపడుటకు మన రక్షకుడు భూమి మీద స్థాపించిన సంఘము—యేసు క్రీస్తు యొక్క కడవరి దినముల పరిశుద్ధుల సంఘము. ఆయన బోధించిన విధంగా జీవించుటకును ఆయన చేసినట్లుగా ఇతరులను దీవించుటకును, సాధన చేయుటకు ఒక స్థానమును అది మనకు ఇచ్చుచున్నది.

సంఘ సభ్యులుగా మనము పిలుపులు, బాధ్యతలు, మరియు ఇతరులకు పరిచర్య చేయుటకు, కనికరమందు చేరుకొనుటకు అవకాశములు ఇవ్వబడ్డాము.

ఇటీవల, పరిచర్య చేయుట, లేక ఇతరులకు సేవ చేయుట అను విషయములపై సంఘము క్రొత్తగా చేయబడిన ఉద్ఘాటనను ఉంచిది. ఈ ప్రత్యేక ఉద్ఘాటనను మేము ఏమని పిలవాలో నిర్ణయించుటకు గొప్ప ఆలోచన చేయబడింది.

ఆ పేర్లలో ఒకటి, క్రీస్తు ఆహ్వానమును సూచించు సరియైన పదం కావలికాయుట: “నా గొఱ్ఱెలను మేపుము.”18 అయినప్పటికినీ, దానికి కనీసం ఒక ఇబ్బంది కలదు: ఆ పదం ఉపయోగించుట నన్ను ఒక జర్మన్ షెపార్డ్‌ను చేయును. చివరకు, నేను పరిచర్య చేయుట అనే పదముతోనే బాగా తృప్తి చెందాను.

ఈ కార్యము ప్రతీఒక్కరి కొరకైనది

అవును, ఈ ఉద్ఘాటన కొత్తది కాదు. అది కేవలము “ఒకనిరినొకరు ప్రేమింపవలెను,”19 అను రక్షకుని ఆజ్ఞను సాధన చేయుటకు క్రొత్తగా చేయబడిన మరియు మెరుగుపరచబడిన అవకాశమునిచ్చును, సంఘము యొక్క ఉద్దేశమును అమలుపరచుటకు మరియు ఆచరించుటకు ఒక శుద్ధి చేయబడిన విధానము.,

మిషనరీ కార్యము గురించి ఆలోచించండి; ధైర్యంగా, వినయంగా, ఆత్మవిశ్వాసంతో సువార్తను పంచుకొనుట అనునది, వారు ఎవరైనప్పటికినీ, ఇతరుల ఆత్మీయ అవసరముల కొరకు పరిచర్య చేయుటకు అద్భుతమైన ఉదాహరణ.

లేక దేవాలయ కార్యమును చేయుట–మన పూర్వీకుల పేర్లు వెదకుట మరియు వారికి నిత్యత్వము యొక్క దీవెనలను ఇచ్చుట. ఎటువంటి దైవిక విధానములో పరిచర్య చేయుట.

పేదలను, అక్కరలోనున్న వారిని వెదకుట, కృంగిన చేతులను లేవనెత్తుట, లేక రోగులను, బాధలోనున్నవారిని దీవించు చర్యను పరిశీలించుడి. ఇవి ప్రభువు భూమిమీద నడచినపుడు ఆయన సాధన చేసిన స్వచ్ఛమైన పరిచర్య క్రియలు కావా?

మీరు సంఘ సభ్యుడు కాని యెడల, “వచ్చి చూడమని”20 నేను మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. రండి, మాతో చేరండి. మీరు సంఘ సభ్యులై యుండి, ప్రస్తుతం చురుకుగా పాల్గొనకుండా ఉన్నయెడల, దయచేసి తిరిగి రండి. మీరు మాకు అవసరం!

రండి, మీ శక్తిని మాతో చేర్చుము.

మీ ప్రత్యేక తలాంతులు, సామర్థ్యములు, మరియు మీ వ్యక్తిత్వము వలన, మేము ఉత్తమంగా మారి, సంతోషముగా నుండుటకు మీరు సహాయపడగలరు. తిరిగి, మీరును ఉత్తమంగా మారి, సంతోషముగా నుండుటకు మేము మీకు సహాయపడతాము.

రండి, దేవుని బిడ్డలందరి యెడల స్వస్థత, దయ, కనికరము, కలిగిన ఒక సంస్కృతిని నిర్మించి, బలపరచుటకు మాకు సహాయపడుము. ఏలయనగా మనమందరము నూతన సృష్టి అగుటకు ప్రయాసపడుతున్నాము అక్కడ “పాతవి గతించెను” మరియు “సమస్తమును . . . క్రొత్తవాయెను.”21 ముందుకు మరియు ఉన్నతమునకు సాగిపోవుటకు దేవుడు మనకు మార్గము చూపును. “మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొనుము,”22 అని ఆయన చెప్పుచున్నాడు. మనమందరమూ కలిసి పనిచేసి, దేవుడు ఉద్దేశించిన జనులుగా మారెదము.

యేసు క్రీస్తు యొక్క సంఘమందంతటా ఈ విధమైన సువార్త సంస్కృతిని మేము పెంచి పోషించాలని ఆశిస్తున్నాము. మనము ఒకరినొకరం క్షమించుకొనే ఒక ప్రదేశముగా సంఘమును బలపరచుటకు మనము కోరతాము. అక్కడ తప్పులు వెదకుటకు, ఇతరులపై తప్పుడు ప్రచారము చేయుటకు, ఇతరులను కృంగ దీయాలనే శోధనలను ఎదిరిస్తాము. అక్కడ ఇతరుల యొక్క లోపాలను ఎత్తిచూపుటకు బదులుగా, మనకు సాధ్యమైనంత శ్రేష్టముగా మారుటకు ఒకరినొకరికి సహాయపడతాము.

మిమ్మల్ని మరొక్కసారి నేను ఆహ్వానిస్తున్నాను. రండి మరియు చూడండి. మాతో చేరండి. మీరు మాకు అవసరము.

అపరిపూర్ణులైన జనులు

ప్రపంచము ఇవ్వగల శ్రేష్టులైన కొందరు జనులతో ఈ సంఘము నిండియున్నదని మీరు కనుగొంటారు. వారు స్వాగతించి, ప్రేమతో, దయతో, నిజాయితీగా ఉన్నారు. వారు కష్టజీవులు, త్యాగము చేయుటకు సమ్మతిస్తున్నారు మరియు కొన్నిసార్లు సాహసవంతులు కూడా.

మరియు వారు చాలా అపరిపూర్ణులుకూడా.

వారు పొరపాట్లు చేస్తారు.

అప్పుడప్పుడు, వారు అనకూడని మాటలు అంటారు. వారు చేయకుండా ఉండాలని కోరే వాటిని చేస్తారు.

కాని, ఇది వారిలో సాధారణమైన గుణం—వారు మెరుగుపరచుకోవాలని మరియు మన ప్రభువైన రక్షకునికి, యేసు క్రీస్తుకు దగ్గర కావాలని కోరతారు.

వారు దానిని సరి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

వారు నమ్ముచున్నారు. వారు ప్రేమిస్తున్నారు. వారు ఆయన చెప్పినట్లు చేస్తున్నారు.

వారు స్వార్ధము తగ్గించుకొని, ఎక్కువ కనికరము కలిగి, ఎక్కువ శుద్ధి చేయబడి, యేసు వలే కావలెనని కోరుకొందురు.

సంతోషమును సంపాదించుటకు సాధనము

అవును, జీవితం కొన్నిసార్లు కష్టతరం కావచ్చు. నిశ్చయముగా మనందరికీ నిరాశ, నిస్పృహ గల సమయాలు కలుగవచ్చును.

కాని, యేసు క్రీస్తు సువార్త మనకు నిరీక్షణను ఇచ్చును. మరియు అభివృద్ధి చెందే స్థలముగా--- యేసు క్రీస్తు యొక్క సంఘంలో, గృహముగా మనవలే భావించే ఇతరులతో మనము చేరవచ్చు---, అక్కడ మనము కలిసి నమ్మి, ప్రేమించి, మరియు ఆయన చెప్పినట్లు చేయగలము.

మన విభేదాలను లక్ష్యపెట్టకుండా, మన ప్రియమైన పరలోక తండ్రి కుమారులు, కుమార్తెలుగా ఒకరినొకరు హత్తుకొనుటకు మనము కోరతాము.

యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము యొక్క సభ్యునిగా ఉన్నందుకు, మరియు సంతోషమును సంపాదించు సాధనమును ఆయన పిల్లలకు ఇచ్చినందుకు మరియు ఈ జీవితములో సంతోషము, ఉద్దేశము కొరకు మరియు రాబోయే జీవితములో మహిమ గదులలో నిత్యానందమును అనుభవించుటకు ఒక మార్గమును ఇచ్చుటకు తగినంతగా దేవుడు వారిని ప్రేమిస్తున్నారని తెలుసుకొన్నందుకు నేను కృతజ్ఞత కలిగియున్నాను.

దేవుడు మన ఆత్మీయ రోగముల నుండి స్వస్థతను, జీవితము యొక్క వెల్ట్ష్ మెర్జ్ నుండి విడుదలను అనుగ్రహించినందుకు నేను కృతజ్ఞత కలిగియున్నాను.

మనము దేవుని యందు నమ్మినప్పుడు, మన పూర్ణ హృదయములతో ఆయనను ప్రేమించి మరియు ఆయన పిల్లల్ని ప్రేమించి, దేవుడు మనకు ఉపదేశించినట్లుగా చేయుటకు మనము ప్రయాసపడినప్పుడు, మనము స్వస్థతను, శాంతిని, సంతోషమును, మరియు అర్ధమును కనుగొనగలమని నేను సాక్ష్యమిచ్చుచున్నాను మరియు నా దీవెనను మీకిస్తున్నాను. యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో, ఆమేన్.

ముద్రించు