2010–2019
సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెను
అక్టోబర్ 2018


సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెను

మనల్ని మార్చి, దీవించగల రక్షకుని సువార్త యొక్క శక్తి దాని సిద్ధాంతము, సూత్రములు, మరియు ఆచరణల యొక్క వేర్వేరు విషయముల సంబంధమును గ్రహించి, అన్వయించుట నుండి ప్రవహించును.

ఒక త్రాడు ముఖ్యమైన సాధనము, దానితో మనందరికి పరిచయమున్నది. త్రాళ్లు వస్త్రము, మొక్కలు, తీగ, లేక ఒక్కొక్కటిగా చుట్టబడి లేక కలిపి అల్లబడిన ఇతర వస్తువుల నుండి చేయబడినవి. ఆసక్తికరంగా, చాలా అసాధారణమైన పదార్ధములు కలిపి అల్లబడవచ్చును మరియు అనూహ్యంగా బలమైనది కావచ్చు. ఈవిధంగా, సాధారణమైన వస్తువులను సమర్ధవంతంగా జతపరచి, కట్టుట ఒక అసాధారణమైన సాధనమును ఉత్పత్తి చేయగలదు.

చిత్రం
త్రాడుగా అల్లబడిన పోగులు

ఒక త్రాడు విడివిడి ప్రోగుల నుండి దాని బలమును పొందినట్లుగా, “పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవే గాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెను”1 అనిన పౌలు యొక్క హితబోధను మనము లక్ష్యముంచినప్పుడు, యేసు క్రీస్తు యొక్క సువార్త సత్యము యొక్క గొప్ప దర్శనమునిచ్చును మరియు బహు గొప్ప దీవెనలను ఇచ్చును. ముఖ్యముగా, ఈ కీలకమైన సత్యమును సమకూర్చుట ప్రభువైన యేసు క్రీస్తుపై కేంద్రీకరించబడి మరియు దృష్టిసారించబడును, ఎందుకనగా ఆయనే, “మార్గమును, సత్యమును, జీవమును.”2

సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చు సూత్రము మన అనుదిన జీవితాలలో ఆయన పునఃస్థాపించబడిన సువార్తను నేర్చుకొని, జీవించుటకు అచరింపదగిన విధానాలలో ఎలా అన్వయిస్తుందో మనము ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్మ మనలో ప్రతీ ఒక్కరికి జ్ఞానము కలిగించాలని నేను ప్రార్థిస్తున్నాను.

బయల్పాటు పొందే సమయము

పునఃస్థాపించబడిన యేసు క్రీస్తు యొక్క సంఘములో అసాధారణమైన మరియు బయల్పాటు పొందే సమయములో మనము జీవిస్తున్నాము. ఈరోజు ప్రకటించబడిన చారిత్రాత్మక సవరణలు ఒకేఒక విస్తృత ప్రయోజనమును కలిగియున్నవి: పరలోకపు తండ్రియందు, ఆయన ప్రణాళికనందు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తునందు మరియు ఆయన ప్రాయశ్చిత్తమునందు విశ్వాసమును బలపరచుట. ఆదివారపు సమావేశ ప్రణాళిక కేవలము తగ్గించబడలేదు. మేలుగా, మనము ఇప్పుడు గృహమందు మరియు సంఘమందు సబ్బాతును మనోహరమైనదిగా మెరుగుపరచుటకు మన సమయాన్ని ఉపయోగించుటకు వ్యక్తులుగా మరియు కుటుంబాలుగా హెచ్చింపబడిన అవకాశాలు మరియు బాధ్యతలను కలిగియున్నాము.

గత ఏప్రిల్‌లో, యాజకత్వపు కోరముల సంస్థాగత నిర్మాణము కేవలం మార్చబడలేదు. మేలుగా, మన సహోదర, సహోదరీలకు, పరిచర్య చేయు ఉన్నతమైన, పరిశుద్ధమైన విధానమునకు ప్రాధాన్యత మరియు బలమివ్వబడినవి.

ఒక త్రాడు యొక్క అల్లబడిన పోగులు, ఒక శక్తివంతమైన మరియు మన్నికైన సాధనమును ఉత్పన్నము చేసినట్లుగా, అంతర్ సంబంధిత చర్యలన్నియు దాని ప్రధానమైన మిషనుతో రక్షకుని యొక్క పునఃస్థాపించబడిన సంఘము యొక్క దృష్టిని, వనరులను, మరియు కార్యమును సమరేఖలో ఉంచే ఏకీకృతమైన ప్రయత్నములో భాగముగా ఉన్నాయి: ఆయన పిల్లల యొక్క రక్షణను, ఉన్నత స్థితిని తెచ్చుటకు ఆయన కార్యములో దేవునికి సహాయపడుట. దయచేసి ప్రకటించిన దానిని భౌతికంగా ఎలా బయటకు తీసుకొనిరావాలనే ఆలోచనలపై ముఖ్యంగా దృష్టిసారించవద్దు. ఇప్పుడు చేయబడిన ఈ మార్పుల విస్తృతమైన ఆత్మీయ కారణములను అస్పష్టపరచుటకు ఎలా చేయాలనే వివరాలను మనము అనుమతించరాదు.

మన కోరిక ఏదనగా, భూమియందు తండ్రి ప్రణాళిక మరియు రక్షకుని యొక్క విమోచన మిషను యందు విశ్వాసము వృద్ధి చెందుట మరియు దేవుని యొక్క శాశ్వతమైన నిబంధన స్థాపించబడుట.3 మన ఏకైక ఉద్దేశములు ప్రభువుకు నిరంతరమూ మార్పు చెందుటను సులభతరం చేయుట మరియు మన సహోదర, సహోదరీలను మరింత సంపూర్ణంగా ప్రేమించుట మరియు మరింత ప్రభావవంతంగా సేవ చేయుట.

విభజన మరియు వేరు చేయుట

కొన్నిసార్లు సంఘ సభ్యులుగా మనము విభజింపబడతాము, వేరు చేయబడతాము, మరియు అధ్యయనము చేయుటకు వ్యక్తిగత విషయాలు మరియు నెరవేర్చుటకు పనుల యొక్క సుదీర్ఘమైన తనిఖీ జాబితాలను కల్పించుట ద్వారా మన జీవితాలలో సువార్తను అన్వయిస్తాము. కానీ అటువంటి పద్ధతి మన అవగాహనను మరియు దర్శనమును సమర్ధవంతంగా పరిమితం చేయవచ్చు. మనము జాగ్రత్తగా ఉండాలి ఎందుకనగా చెక్‌లిస్టులపై పరిసయ్యులు కలిగియున్న దృష్టి ప్రభువుకు దగ్గరగుట నుండి మనల్ని దూరము చేయగలవు.

ఉద్దేశము మరియు శుద్ధి చేయబడుట, సంతోషము, ఆనందము, నిరంతరము మార్పు చెందుట మరియు “దేవునికి (మన) హృదయములను లోబరచుట”4 మరియు “(మన) ముఖములందు ఆయన స్వరూపమును (పొందుట)”5 నుండి వచ్చు భద్రత మనము చేయాల్సిన ఆత్మీయమైన విషయాలన్నిటినీ కేవలము నెరవేర్చుట మరియు తనిఖీ చేయుట ద్వారా సంపాదించబడవు. మేలుగా, మనల్ని మార్చి, దీవించగల రక్షకుని సువార్త యొక్క శక్తి దాని సిద్ధాంతము, సూత్రములు, మరియు ఆచరణల యొక్క వేర్వేరు విషయముల సంబంధమును గ్రహించి, అన్వయించుట నుండి ప్రవహించును. ఆయనపై స్థిరమైన దృష్టితో సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చినప్పుడు మాత్రమే, మనము సువార్త సత్యములు సమన్వితంగా దేవుడు మనము కావాలని కోరినట్లుగా అగుటకు,6 ధైర్యముగా అంతము వరకు సహించుటకు మనకు సాధ్యపరచును.7

సువార్త సత్యములను నేర్చుకొనుట మరియు జతపరచుట

యేసు క్రీస్తు యొక్క సువార్త సత్యము యొక్క అద్భుతమైన నేత వస్త్రము “పొందికగా అమర్చబడింది” 8 మరియు కలిపి అల్లబడింది. బయల్పరచబడిన సువార్త సత్యములను మనము నేర్చుకొని మరియు కలిపి జతపరచినప్పుడు, మనము ప్రశస్తమైన దృష్టికోణమును మన జీవితాలలో ప్రభువు యొక్క ప్రభావమును నేత్రముల ద్వారా చూడగలుగునట్లు, మరియు ఆయన స్వరమును వినగలుగునట్లు హెచ్చించబడిన ఆత్మీయ సమర్ధతను పొందుటకు దీవించబడ్డాము.9ఆయనయందు కూడ---ఏకముగా సమకూర్చబడే సూత్రము సంప్రదాయమైన తనిఖీలను ఏకీకృతమైన, అనుసంధానితమైన, మరియు పూర్తి సంపూర్ణమైనదిగా మార్చుటలో మనకు సహాయపడగలదు. నేను సూచిస్తున్న దానికి ఒక సిద్ధాంతపరమైన మరియు సంఘ మాదిరిని రెండిటిని నేను మీకిస్తాను.

మాదిరి 1. నాలగవ విశ్వాస ప్రణాళిక క్రీస్తునందు ఏకముగా సమస్తమును సమకూర్చుటలో గొప్ప ఉదాహరణలలో ఒకటి: “సువార్త యొక్క ప్రథమ సూత్రములు మరియు విధులు: మొదటిది, ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసము; రెండవది, పశ్చాత్తాపము; మూడవది, పాపముల పరిహారము నిమిత్తము ముంచుట ద్వారా బాప్తీస్మము; నాలగవది, పరిశుద్ధాత్మ యొక్క వరము కొరకు హస్తనిక్షేపణము.”10

చిత్రం
ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసము

ప్రభువైన యేసు క్రీస్తునందు---దైవికమైన, తండ్రి యొక్క అద్వితీయుడైన కుమారునిగా, ఆయనపై, ఆయనయందు, మరియు ఆయన నెరవేర్చిన విమోచించు మిషనుపై--- దృష్టిసారించుట నిజమైన విశ్వాసము. “ఏలయనగా ఆయన చట్టము యొక్క అంతములకు జవాబిచ్చెను, మరియు ఆయనయందు విశ్వాసము కలిగిన వారినందరినీ ఆయన తీసుకొనును, మరియు ఆయనయందు విశ్వాసము కలిగిన వారు ప్రతి మంచి సంగతిని హత్తుకొందురు; అందువలన, ఆయన మనుష్యుల సంతానము యొక్క హేతువును వాదించును.”11 క్రీస్తునందు విశ్వాసము సాధన చేయుట అనగా, మన రక్షకునిగా నమ్ముట మరియు ఆయనయందు, ఆయన నామముపై, మరియు ఆయన వాగ్దానములందు మన విశ్వాసమునుంచుట.

చిత్రం
పశ్చాత్తాపము

రక్షునియందు నమ్మకముంచుట యొక్క మొదటి సహజమైన పర్యవసానము పశ్చాత్తాపపడుట మరియు చెడునుండి మరలిపోవుట. ప్రభువునందు, ఆయనపై విశ్వాసమును మనము సాధన చేసినప్పుడు, సహజంగా మనము, ఆయనవైపు తిరుగుతాము, వద్దకు వస్తాము, మరియు ఆధారపడతాము. కాబట్టి మనకై మనము చేయలేని దానిని మన కోసం చేయుటకు విమోచకునిపై ఆధారపడుట మరియు నమ్ముటయే పశ్చాత్తాపపడుట. మనలో ప్రతీఒక్కరము “రక్షించుటకు శక్తిమంతుడైన వాని యోగ్యతలపైన పూర్తిగా ఆధారపడుచుండవలెను12 ఎందుకనగా “పరిశుద్ధ మెస్సీయ యొక్క మంచితనము, కనికరము మరియు కృప” 13 ద్వారా మనము క్రీస్తునందు నూతన సృష్టి కాగలము14 మరియు చివరకు దేవుని యొక్క సన్నిధికి తిరిగి వెళ్లి నివసించగలము.

చిత్రం
బాప్తీస్మము

పాపముల పరిహారము నిమిత్తము ముంచుట ద్వారా బాప్తీస్మము విధికి ఆయనయందు నమ్మకముంచుట, ఆయనపై ఆధారపడుట. ఆయనను వెంబడించుట అవసరమగును. నీఫై ప్రకటించాడు, “హృదయము యొక్క పూర్ణ ఉద్దేశముతో దేవుని యెదుట ఎట్టి వేషధారణ మరియు మోసము లేకుండా కుమారుని అనుసరించిన యెడల, కానీ నిజమైన ఉద్దేశముతో మీ పాపములకు పశ్చాత్తాపపడుచూ బాప్తీస్మము ద్వారా క్రీస్తు యొక్క నామమును మీపైన ధరించుకొనుటకు మీరు సిద్ధముగా ఉన్నారని తండ్రికి సాక్ష్యమిచ్చుచూ—మరిముఖ్యముగా ఆయన వాక్యానుసారము నీటిలోనికి మీ ప్రభువును మరియు మీ రక్షకుని అనుసరించిన యెడల, ఇదిగో అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుదురని నేనెరుగుదును, మరిముఖ్యముగా అప్పుడు పరిశుద్ధాత్మ యొక్క మరియు అగ్ని యొక్క బాప్తీస్మము వచ్చును.”15

చిత్రం
నిర్ధారణ

పరిశుద్ధాత్మ యొక్క వరము కోసం హస్త నిక్షేపణ చేయు విధికి మనము ఆయనయందు నమ్మకముంచుట, ఆయనపై ఆధారపడుట, ఆయనను వెంబడించుట, మరియు ఆయన పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో ఆయనలో ముందుకు త్రోసుకొను వెళ్లుట అవసరము. నీఫై ప్రకటించినట్లుగా, “మరియు ఇప్పుడు నా ప్రియమైన సహోదరులారా, దీనిని బట్టి జీవముగల దేవుని యొక్క కుమారుని యొక్క మాదిరిని అనుసరించుటలో, మనుష్యుడు అంతము వరకు స్థిరముగా ఉంటేనే తప్ప అతడు రక్షింపబడలేడని నేనెరుగుదును.”16

చిత్రం
క్రీస్తునందు ఏకముగా సమకూర్చుట

నాలగవ విశ్వాస ప్రమాణము పునఃస్థాపించబడిన సువార్త యొక్క ప్రధాన సూత్రములు మరియు విధులను గుర్తించటం మాత్రమే కాదు. మేలుగా, ఈ విశ్వాసములకు చెందిన ప్రేరేపించబడిన వ్యాఖ్యానము సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెను: ఆయనయందు, ఆయనపై నమ్మకముంచుట, ఆయనపై ఆధారపడుట, ఆయనను వెంబడించుట, ఆయనలో---ఆయనతో ముందుకు త్రోసుకొను వెళ్లుట.

మాదిరి 2. సంఘ కార్యక్రమాలు మరియు ప్రతిపాదనలు సమస్తము క్రీస్తునందు ఏకముగా ఎలా సమకూర్చబడతాయో వివరించాలని నేనిప్పుడు కోరుతున్నాను. అనేకమైన అదనపు ఉదాహరణలు కూడా సమర్పించబడవచ్చు; నేను ఎంపిక చేయబడిన కొన్నిటిని మాత్రమే ఉపయోగిస్తాను.

చిత్రం
సీయోనును బలపరుచుము మరియు పెంచుము

1978లో, అధ్యక్షులు స్పెన్సర్ డబ్ల్యు కింబల్, సంఘ సభ్యులను ప్రపంచమంతటా సీయోను యొక్క బలమును పెంచమని ఉపదేశించారు. పరిశుద్ధులు వారి స్వదేశాలలోనే ఉండి, దేవుని యొక్క కుటుంబమును సమకూర్చుట ద్వారా బలమైన స్టేకులను స్థాపించమని మరియు ప్రభువు యొక్క విధానములను వారికి బోధించమని ఆయన వారికి సలహా ఇచ్చారు. తరువాత, ఎక్కువ దేవాలయములు నిర్మించబడునని, పరిశుద్ధులు ప్రపంచమంతటా ఎక్కడ నివసించినప్పటికినీ వారి కొరకు దీవెనలు వాగ్దానమివ్వబడినవని ఆయన సూచించారు.17

చిత్రం
మూడు గంటల నిడివి
చిత్రం
కుటుంబ ప్రకటన

స్టేకుల సంఖ్య వృద్ధి చెందినప్పుడు, సభ్య గృహాలు “కుటుంబ సభ్యులు ఉండుటకు ఇష్టపడే (స్థలములుగా) మార్చుటకు, వారు తమ జీవితాలను సంపన్నం చేసుకొని, మరియు పరస్పర ప్రేమ, సహకారము, ప్రశంసను మరియు ప్రోత్సాహమును కనుగొనే”18 అవసరత తీవ్రమయ్యింది. తత్పలితంగా, 1980లో, ఆదివారపు సమావేశాలు “సువార్తను నేర్చుకొనుటకు, జీవించుటకు, మరియు బోధించుటకు వ్యక్తిగత మరియు కుటుంబ బాధ్యతను తిరిగి ఉద్ఘాటించుటకు”19 మూడు గంటల నిడివిగా ఏకీకృతము చేయబడినవి. కుటుంబము మరియు గృహముపై ఈ ఉద్ఘాటన 1995 లో అధ్యక్షులు గార్డన్ బి. హింక్లీ చేత పరిచయము చేయబడిన “కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటనలో”20 ధ్రువీకరించబడినవి.

చిత్రం
దేవాలయ నిర్మాణము

ప్రపంచమంతటా కడవరి దిన పరిశుద్ధులైన వ్యక్తులు మరియు కుటుంబాలకు ప్రభువు యొక్క మందిరములోని పరిశుద్ధ విధులను దగ్గరగా తెచ్చునట్లు, 1998 ఏప్రిల్‌లో, అధ్యక్షులు హింక్లీ అనేకమైన చిన్న దేవాలయ నిర్మాణములను ప్రకటించారు.21 ఈ ఆత్మీయ ఎదుగుదల మరియు అభివృద్ధి కొరకు మెరుగైన అవకాశాలు 2001 లో శాశ్వత విద్యా నిధి పరిచయము ద్వారా ఐహికమైన స్వయం-ఉపాధిలో సంబంధిత పెరుగుదల ఎక్కువ ప్రభావవంతంగా చేయబడినవి.22

చిత్రం
పేదవారు, అవసరతలో ఉన్నవారి కోసం శ్రద్ధ తీసుకొనుట

ఆయన నిర్వహణలో, అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ పరిశుద్ధులను, “విడిపించుటకు” వెళ్ళమని పదేపదే చెప్పారు మరియు పేదవారు, అవసరతలో ఉన్నవారి కోసం శ్రద్ధ తీసుకొనుట సంఘము యొక్క దైవికంగా నియమించబడిన బాధ్యతలలో ఒకటిగా ఉద్ఘాటించారు. భౌతిక సిద్ధపాటుపై ఉద్ఘాటనను కొనసాగిస్తూ, స్వయం-ఉపాధి సేవల ప్రతిపాదన 2012 లో అమలు చేయబడింది.

చిత్రం
సబ్బాతు దినమును ఆనందము కలిగించేదిగా చేయుట

గత కొన్ని సంవత్సరాలకు పైగా, గృహము మరియు సంఘములో సబ్బాతు దినమును ఆనందము కలిగించేదిగా చేయుట గురించి ఆవశ్యకమైన సూత్రములు ఉద్ఘాటించబడినవి మరియు బలపరచబడినవి, 23 ఈవిధంగా ఈ సర్వసభ్య సమావేశములో ప్రకటించబడిన ఆదివార సమావేశపు ప్రణాళిక సవరణ కొరకు మనల్ని సిద్ధపరచును.

చిత్రం
మెల్కీసెదకు యాజకత్వ కోరములు సహాయకములతో క్రమంలో ఉంచబడినవి

ఆరు నెలల క్రితం, మెల్కీసెదకు యాజకత్వ కోరములు బలపరచబడినవి మరియు పరిచర్య చేయుటకు ఉన్నతమైన మరియు పరిశుద్ధమైన విధానమును నెరవేర్చుటకు సహాయకములతో ఎక్కువ శక్తివంతముగా క్రమంలో ఉంచబడినవి.

చిత్రం
ఒక ఏకమైన కార్యము

అనేక దశబ్ధాలుగా ఈ చర్యల క్రమము మరియు సమయము అంతా ఒక ఏకమైన, సమగ్రమైన కార్యమని, స్వతంత్రమైన, మరియు విలక్షణమైన ప్రతిపాదనల పరంపర కాదని గ్రహించుటకు మనకు సహాయపడుతుందని నేను నమ్ముచున్నాను. “దేవుడు వ్యక్తులు మరియు కుటుంబాలకు విధులు, బోధన, కార్యక్రమాలు, గృహముపై దృష్టిసారించి మరియు సంఘము మద్ధతునిచ్చు ప్రోత్సాహకార్యక్రమాల ద్వారా ఆత్మీయ పురోభివృద్ధి యొక్క మాదిరిని బయల్పరిచాడు. వ్యక్తులు, కుటుంబాలను దీవించుటకు ఉన్న సంఘ నిర్మాణములు మరియు కార్యక్రమాలు వాటికవే ముగింపబడవు.” 24

ఎప్పటికీ ఎక్కువగా కుటుంబాలపై దృష్టిసారించి మరియు సంఘము మద్ధతు ఇస్తున్న గొప్ప ప్రపంచవ్యాప్త కార్యముగా ప్రభువు యొక్క కార్యమును మనము గుర్తిస్తామని నేను ప్రార్థిస్తున్నాను. “దేవుని రాజ్యమునకు సంబంధించి అనేకమైన గొప్ప, ముఖ్యమైన విషయాలను ప్రభువు బయల్పరుస్తున్నాడని, మరియు భవిష్యత్తులో ఇంకా బయల్పరుస్తాడని,”25 నేనెరుగుదును మరియు సాక్ష్యమిస్తున్నాను.

వాగ్దానము మరియు సాక్ష్యము

విడివిడి పోగులు చుట్టబడి లేక కలిపి అల్లబడి ఒక త్రాడుగా చేయబడినప్పుడు సృష్టించబడిన బలమును ప్రస్ఫుటంగా చేయుట ద్వారా నా సందేశమును నేను ప్రారంభించాను. అదేవిధంగా, సమస్తమును క్రీస్తునందు--- ఆయన యందు కూడా ఏకముగా సమకూర్చుటకు మనము ప్రయాసపడినప్పుడు, పునఃస్థాపించబడిన యేసు క్రీస్తు యొక్క సువార్తను మనము నేర్చుకొనుట మరియు జీవించుటలో హెచ్చించబడిన దృష్టికోణము, ఉద్దేశము, మరియు శక్తి స్పష్టమగును.

నిత్య పర్యవసానములనుండి ఉద్భవించు దీవెనలు మరియు అవకాశములన్నీ, సాధ్యమైనవి మరియు ఉద్దేశము కలిగియున్నవి, ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా, వలన సహించబడును. ఆల్మా సాక్ష్యమిచ్చినట్లుగా: “మనుష్యుడు రక్షింపబడగల మరే ఇతర మార్గము లేక సాధనము లేదని, కేవలము క్రీస్తునందు మరియు ద్వారనే. ఇదిగో అతడు జీవము మరియు లోకము యొక్క వెలుగైయున్నాడు.”26

నిత్య తండ్రి మరియు ఆయన ప్రియమైన కుమారుడైన, యేసు క్రీస్తు యొక్క దైవత్వము మరియు జీవించుచున్న వాస్తవమును గూర్చి నా సాక్ష్యమును నేను సంతోషంగా ప్రకటిస్తున్నాను. మన రక్షకునియందు మనము ఆనందము కనుగొంటాము. ఆయనయందు మనము “ఈ లోకములో సమాధానము, మరియు రాబోయే లోకములో నిత్య జీవమును”27 గూర్చి అభయమును పొందుతాము. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈవిధంగా సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

ముద్రించు