“ఏప్రిల్ 29–మే 5: ‘గొప్ప మార్పు.’ మోషైయ 4–6,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2024)
“ఏప్రిల్ 29–మే 5. మోషైయ 4-6,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2024)
ఏప్రిల్ 29–మే 5: “గొప్ప మార్పు”
మోషైయ 4–6
ఎవరైనా మాట్లాడడం విని, ఎప్పుడైనా మీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రేరేపించబడినట్లు మీరు భావించారా? బహుశా, మీరు వినిన దానిని బట్టి, కాస్త భిన్నంగా జీవించడానికి—లేదా ఇంకా ఎక్కువ భిన్నంగా జీవించడానికి మీరు నిర్ణయించుకొనియుండవచ్చు. రాజైన బెంజమిన్ యొక్క ప్రసంగము అటువంటి ప్రసంగము మరియు అతడు బోధించిన సత్యములు వాటిని విన్న జనులపై అటువంటి ప్రభావమును కలిగియున్నాయి. అతనికి దేవదూత బోధించిన దానిని, అనగా అద్భుతమైన దీవెనలు “క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త రక్తము” (మోషైయ 4:2) ద్వారా సాధ్యమవుతాయని రాజైన బెంజమిన్ తన జనులతో పంచుకున్నాడు. అతని సందేశము కారణంగా వారు తమ గురించి తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు (మోషైయ 4:2 చూడండి), ఆత్మ వారి కోరికలను మార్చివేసాడు (మోషైయ 5:2 చూడండి) మరియు ఆయన చిత్తమును ఎల్లప్పుడూ చేసెదమని వారు దేవునితో నిబంధన చేసారు (మోషైయ 5:5 చూడండి). ఈవిధంగా రాజైన బెంజమిన్ మాటలు అతని జనులను ప్రభావితం చేసాయి. అవి మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తాయి?
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
యేసు క్రీస్తు ద్వారా, నేను నా పాపముల కొరకు పరిహారమును పొంది, దానిని నిలుపుకోగలను.
కొన్నిసార్లు, మీ పాపముల కొరకు క్షమించబడినట్లు మీరు భావించినప్పుడు కూడా, ఆ భావనను నిలుపుకొనుటకు మరియు నీతి మార్గముపై నిలిచియుండుటకు మీరు ప్రయాసపడవచ్చు. పాప పరిహారమును ఎలా పొందాలో, అదేవిధంగా దానిని ఎలా నిలుపుకోవాలో రెండిటిని రాజైన బెంజమిన్ తన జనులకు బోధించాడు. మీరు మోషైయ యొక్క 4వ అధ్యాయమును చదివినప్పుడు, ఈ విధమైన ప్రశ్నలు అడగడాన్ని పరిగణించండి:
-
1-8 వచనాలు.ఏ షరతుల క్రింద దేవుడు మీ పాపముల కొరకు పరిహారమును దయచేస్తారు? పశ్చాత్తాపపడడానికి మిమ్మల్ని ప్రేరేపించేలా ఆయన గురించి మీరు ఈ వచనాలలో ఏమి నేర్చుకుంటారు? మీరు పశ్చాత్తాపపడ్డారని మీరెలా తెలుసుకోగలరు?
-
11-16 వచనాలు.ఈ వచనాల ప్రకారము, 11వ వచనములో వివరించబడిన విషయాలను మనము చేసిన యెడల మన జీవితాలలో ఏమి జరుగుతుంది? మీరు లేదా మీరు ప్రేమించే వారెవరైనా ఈ మార్పులను ఏవిధంగా అనుభవించారు? ఈ మార్పులను మోషైయ 3:19లో వివరించబడిన మార్పులతో పోల్చండి.
-
16–30 వచనాలు.మీకున్న దానిని ఇతరులతో పంచుకొనుట మీ పాప పరిహారమును నిలుపుకొనుటకు మీకు ఏవిధంగా సహాయపడగలదు? క్రీస్తువలె ఉండుటకు మీరు చేసే ప్రయత్నాలకు 27వ వచనమును మీరు ఎలా అన్వయించుకోగలరు?
ఏ భావనలో మనమందరము బిచ్చగాళ్ళము? ఈ వచనముల ప్రకారము, మనము దేవుని యొక్క పిల్లలందరిని ఎలా ఆదరించాలి? (మోషైయ 4:26 చూడండి). మీ సహాయము ఎవరికి అవసరము?
బెక్రీ క్రేవన్, “మార్పును నిలుపుకొనుము,” లియహోనా, నవ. 2020, 58–60 కూడా చూడండి.
నేను దేవుని యందు విశ్వసిస్తాను మరియు నమ్ముతాను.
దేవుని యందు విశ్వసించడానికి మరియు నమ్మడానికి రాజైన బెంజమిన్ యొక్క ఆహ్వానం ప్రాచీన కాలంలో ఉన్నట్లుగా నేటికీ ముఖ్యమైనది. మీరు మోషైయ 4:5–10 చదివినప్పుడు, ఆయనను నమ్మడానికి కారణాలను ఇచ్చే దేవుని గురించి సత్యాల కొరకు చూడండి. 10వ వచనములో రాజైన బెంజమిన్ ఇచ్చే ఆహ్వానాలను గమనించండి. దేవుని యందు నమ్మకముంచడం రాజైన బెంజమిన్ ఆహ్వానించిన దానిని చేయడాన్ని సులువుగా ఎందుకు చేస్తుంది?
దేవుని లక్షణాలను జాబితా చేయడానికి ఈ అదనపు లేఖనాలలో కొన్నింటిని పరిశోధించడాన్ని పరిగణించండి: యిర్మీయా 32:17; 1 యోహాను 4:8; 2 నీఫై 9:17; ఆల్మా 32:22; మోర్మన్ 9:9; ఈథర్ 3:12; సిద్ధాంతము మరియు నిబంధనలు 19:1–3; 88:41. ఇటువంటి వాక్యాన్ని పూరించడానికి విభిన్నమైన విధానాల కొరకు మీరు మీ జాబితాను ఉపయోగించవచ్చు: “దేవుడు --- అని నాకు తెలిసినందువలన, --- నేను ఆయనను నమ్మగలను.”
ఆయనతో అనుభవాలను కలిగియున్నప్పుడు, దేవుని యందు మన నమ్మకం పెరుగుతుంది. మోషైయ 4:1–3లో, “దేవుని మంచితనమును తెలుసుకోవడానికి” (6వ వచనము) రాజైన బెంజమిన్ యొక్క జనులకు సహాయపడినదేమిటి? దేవునితో మీకు కలిగిన అనుభవాల గురించి ఆలోచించండి. ఈ అనుభవాలు ఆయన గురించి మీకు ఏమి బోధించాయి? దేవుని యందు మీ విశ్వాసాన్ని లేదా నమ్మకాన్ని ఎక్కువ చేసుకోవడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు (లేదా తీసుకోగలరు)?
నేను నా ఆలోచనలు, మాటలు మరియు క్రియలను తప్పక గమనించాలి.
సాధ్యమయ్యే ప్రతీ పాపము యొక్క జాబితాను దేవుడు మనకివ్వరు. మోషైయ 4:29-30 ప్రకారం, దానికి బదులుగా ఆయన ఏమి చేస్తారు? మీ ఆలోచనలు, మాటలు, క్రియలు మిమ్మల్ని మరియు ఇతరులను ఎలా ప్రభావితం చేస్తాయో ధ్యానించండి. దేవునితో మీ సంబంధాన్ని అవి ఎలా ప్రభావితం చేస్తాయి? [మిమ్మల్ని మీరు] ఎలా గమనించుకుంటారు?
ప్రభువు యొక్క ఆత్మ నా హృదయములో గొప్ప మార్పును కలుగజేయగలదు.
“నేను మారలేను. నేను ఎప్పుడూ ఇంతే,” అని జనులు చెప్పుట సర్వసాధారణము. దానికి వ్యతిరేకంగా, రాజైన బెంజమిన్ యొక్క జనుల అనుభవము ప్రభువు యొక్క ఆత్మ మన హృదయాలను నిజముగా ఎలా మార్చగలదో మనకు చూపుతుంది. మీరు మోషైయ 5:1–5 ను చదివినప్పుడు, నిజమైన పరివర్తనకు దారితీసే “గొప్ప మార్పు” మీ జీవితంలో ఎలా జరిగిందో—లేదా జరుగగలదో—ఆలోచించండి. సూక్ష్మమైన, క్రమానుగత మార్పులు, అలాగే “గొప్ప” అనుభవాల గురించి ఆలోచించండి. మీరు శోధనను ఎదుర్కొన్నప్పుడు ఈ అనుభవాలు మీకు ఎలా సహాయపడతాయి?
యెహెజ్కేలు 36:26–27; ఆల్మా 5:14 కూడా చూడండి.
నేను ఆయనతో నిబంధనలు చేసినప్పుడు, నేను క్రీస్తు యొక్క నామమును నాపై తీసుకుంటాను.
క్రీస్తు యొక్క నామమును మీపై తీసుకొనుట అనగా అర్థమేమిటనే దాని గురించి మోషైయ 5:7–9 నుండి మీరేమి నేర్చుకుంటారు? సంస్కార ప్రార్థనలు (మొరోనై 4–5 చూడండి) దీని గురించి ఏమి బోధిస్తున్నాయి? మీరు రక్షకునికి “చెందిన” వారని మీరు ఎలా చూపగలరు?
డి. టాడ్ క్రిస్టాఫర్సన్, “నిబంధన మార్గము ఎందుకు,” లియహోనా, మే 2021, 116-19 కూడా చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
పశ్చాత్తాపము ఆనందాన్ని తెస్తుంది.
-
పశ్చాత్తాపము యొక్క ఆనందం గురించి బోధించడానికి, మీ పిల్లలు వారి చేతులను బంకగా లేదా మురికిగా చేసుకోవడానికి మీరు అనుమతించి, కడుగుకున్న తరువాత వారు ఎలా భావిస్తారో గమనించవచ్చు. తరువాత మీరు దానిని మోషైయ 4:1-3లో వారి పాపాలు క్షమించబడడానికి ముందు మరియు తరువాత జనులు భావించిన విధానంతో పోల్చవచ్చు. ఆత్మీయంగా మనల్ని శుద్ధిచేయడానికి రక్షకుని శక్తిని గూర్చి మీ సాక్ష్యమును పంచుకోండి.
-
పూర్తిగా మరియు మనఃపూర్వకంగా పశ్చాత్తాపపడడం మీ పిల్లలకు తెలుసా? మోషైయ 4:1– 3, 10లో రాజైన బెంజమిన్ యొక్క జనులు ఏమి చేసారో కనుగొనడానికి వారికి సహాయపడండి. పశ్చాత్తాపమును యేసు క్రీస్తు ఎలా సాధ్యం చేస్తారు?
ఇతరులను ప్రేమతో, దయతో ఆదరించడానికి యేసు క్రీస్తు యొక్క సువార్త నన్ను ప్రేరేపిస్తుంది.
-
ఇతరులకు సేవ చేయడం మనం మంచిగా భావించేలా చేస్తుంది. బహుశా మీ పిల్లలు వారు ఎవరినైనా ప్రేమించిన లేదా సేవ చేసిన సమయం గురించి మరియు ఆ అనుభవం వారిని ఎలా భావించేలా చేసిందో మాట్లాడవచ్చు. జనులు ఇతరులకు సేవ చేయాలని కోరుకోకపోవడానికి గల కొన్ని కారణాలు ఏవి? అవసరంలో ఉన్నవారికి సహాయపడమని ఒకరిని ఆహ్వానించడానికి మనం వారికి ఏమి చెప్పగలము? మోషైయ 4:16–26లో ఉపాయాల కోసం చూడండి.
-
మనం క్రీస్తు నొద్దకు వచ్చి, మన పాప పరిహారమును పొందినప్పుడు, మనం “దేవుని ప్రేమతో నింపబడతామని” (మోషైయ 4:12) రాజైన బెంజమిన్ బోధించాడు. ఇతరుల పట్ల ప్రేమగా, దయతో ఉండడానికి ఇది మనల్ని నడిపిస్తుంది. మీరు, మీ పిల్లలు మోషైయ 4:13–16, 26ను పరిశోధించవచ్చు మరియు మనం ఇతరులకు ఎలా సేవ చేయగలమో వివరించే వాక్యభాగాలను కనుగొనవచ్చు. తరువాత వారు వాటిని నటించి చూపవచ్చు లేదా వాటి బొమ్మలు గీయవచ్చు మరియు ఒకరి వాక్యభాగాలను మరొకరు ఊహించవచ్చు. ఇంటిలో, పాఠశాల వద్ద లేదా సంఘములో మనము ప్రేమ మరియు దయను ఎలా చూపగలము?
నేను దేవునితో నిబంధనలు చేసినప్పుడు, నేను క్రీస్తు యొక్క నామమును నాపై తీసుకుంటాను.
-
మీ పిల్లలు “యేసు క్రీస్తు” నామాన్ని ప్రదర్శించే బ్యాడ్జిలను తయారుచేసి, వాటిని తమ హృదయాలపై ధరించడాన్ని ఆనందించవచ్చు (ఈ వారం ప్రోత్సాహ కార్యక్రమ పేజీ చూడండి). వారు అలా చేస్తున్నప్పుడు, మీరు వారికి మోషైయ 5:12 చదువవచ్చు మరియు దేవునితో నిబంధనలు లేదా వాగ్దానాలు చేయడం ఏవిధంగా క్రీస్తు యొక్క నామము “[మన] హృదయాలలో ఎల్లప్పుడు వ్రాయబడియుండడం” వంటిది అవుతుందో మాట్లాడవచ్చు.