2024 రండి, నన్ను అనుసరించండి
మే 20-26: “మేము ఆయనతో ఒక నిబంధనలోనికి ప్రవేశించియున్నాము.” మోషైయ 18-24


“మే 20-26: ‘మేము ఆయనతో ఒక నిబంధనలోనికి ప్రవేశించియున్నాము.’ మోషైయ 18-24,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2024)

“మే 20-26. మోషైయ 18-24,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2024)

తప్పించుకుంటున్న లింహై జనులు

మినర్వా టైఛర్ట్ (1888-1976), Escape of King Limhi and His People [లింహై రాజు, అతని జనులు తప్పించుకొనుట], 1949-1951, కృత్రిమ చెక్కపై తైలవర్ణ చిత్రము, 35 7/8 x 48 అంగుళాలు. బ్రిగమ్ యంగ్ యూనివర్సిటీ మ్యూజియం ఆఫ్ ఆర్ట్, 1969.

మే 20-26: మేము ఆయనతో ఒక నిబంధనలోనికి ప్రవేశించియున్నాము

మోషైయ 18-24

మోషైయ 18; 23–24లో ఆల్మా మరియు అతని జనుల యొక్క వృత్తాంతము “దేవుని సముదాయములోనికి వచ్చుట” (మోషైయ 18:8) అనగా అర్థమేమిటో చూపుతుంది. ఆల్మా జనులు బాప్తిస్మము పొందినప్పుడు, వారు “ఆయనను సేవించుదురని మరియు ఆయన ఆజ్ఞలు పాటించుదురని” (మోషైయ 18:10) దేవునితో నిబంధన చేసారు. ఇది దేవునితో చాలా వ్యక్తిగతమైన ఒడంబడిక కాగా, ఇది వారు ఒకరినొకరు ఎలా ఆదరించారో అనేదానికి కూడా సంబంధించినది. అవును, పరలోక తండ్రి వద్దకు తిరిగి వెళ్ళు ప్రయాణము వ్యక్తిగతమైనది మరియు ఏ ఒక్కరు మన కొరకు మన నిబంధనలు పాటించలేరు, కానీ దాని అర్థము మనము ఒంటరివారమని కాదు. మనము ఒకరికొకరం అవసరము. క్రీస్తు సంఘము యొక్క సభ్యులుగా, “ఒకరి భారములు ఒకరు భరిస్తూ” (మోషైయ 18:8–10) మనము మార్గము వెంబడి ఒకరికొకరం సహాయపడడం, సేవ చేయడం ద్వారా దేవునికి సేవ చేస్తామని నిబంధన చేసాము. మనలాగే, ఆల్మా యొక్క జనులు కూడా ఖచ్చితంగా భరించుటకు భారములు కలిగియున్నారు. మనము “(మన) భారములను సునాయాసముగా భరించుటకు”(మోషైయ 24:15) ప్రభువు మనకు సహాయపడే ఒక విధానము ఏమిటనగా, మనము వారి కొరకు చేస్తామని వాగ్దానము చేసినట్లుగా మనతో దుఃఖించుటకు మరియు మనల్ని ఓదార్చుటకు వాగ్దానము చేసిన పరిశుద్ధుల సమాజమును మనకివ్వడమే.

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

సెమినరీ చిహ్నము

మోషైయ 18:1-17

నేను బాప్తిస్మము తీసుకున్నప్పుడు, నేను దేవునితో ఒక నిబంధన చేస్తాను.

మోషైయ 18లో వర్ణించబడిన విశ్వాసులు యేసు క్రీస్తు గురించి ఎంత లోతుగా భావించారో పరిగణించండి. ఆయన గురించి నేర్చుకోవడానికి వారు గొప్ప ప్రమాదంలో రహస్యంగా కలుసుకోవలసి వచ్చింది (3వ వచనం చూడండి). మరియు బాప్తిస్మపు నిబంధన ద్వారా వారి నిబద్ధతను చూపే అవకాశం ఇవ్వబడినప్పుడు, “వారు సంతోషముతో చప్పట్లు కొట్టి—మా హృదయముల యొక్క కోరిక ఇదేనని బిగ్గరగా చెప్పిరి” (మోషైయ 18:11).

మీ నిబంధనలు మీకు ఎంత ముఖ్యమో ధ్యానించడానికి ఈ వచనాలను చదవడం మంచి అవకాశము కాగలదు. మీరు ప్రత్యేకించి మోషైయ 18:8–14ను చదివినప్పుడు, ఈ విధమైన ప్రశ్నలను పరిగణించండి:

  • బాప్తిస్మమప్పుడు మీరు చేసిన వాగ్దానములను గూర్చి ఈ వచనములనుండి మీరు ఏమి నేర్చుకుంటారు? దేవుడు మీకు చేసిన వాగ్దానమేమిటి? (10, 13 వచనాలు చూడండి).

  • దేవునికి సేవ చేస్తామనే నిబంధన ఒకరికొకరం పరిచర్య చేయుటకు మనం చేసే ప్రయత్నాలతో ఎలా సంబంధం కలిగియుంది? (8–9 వచనాలు చూడండి).

  • మీ ఉద్దేశ్యములో “దేవునికి [సాక్షి]గా నిలబడుట” అనగా అర్థమేమిటి? (9వ వచనము).

  • మీ బాప్తిస్మపు నిబంధనను పాటించుట మీరు “ఆత్మతో నింపబడుటకు” మీకెలా సహాయపడుతుంది? (మోషైయ 18:14). మీ నిబంధనను పాటించుటకు ఆత్మ మీకు ఎలా సహాయపడతాడు?

ఈ ప్రశ్నలకు సమాధానమివ్వడం, దేవునికి నిబంధనలు మరియు విధులు ఎందుకు ముఖ్యమో మీరు ఆలోచించడానికి దారితీయవచ్చు. ఎల్డర్ గెరిట్ డబ్ల్యు. గాంగ్ గారి సందేశము “నిబంధనకు చెందుట” (లియహోనా, నవ. 2019, 80–83) లేదా అధ్యక్షురాలు జీన్ బి. బింగమ్ గారి సందేశము “దేవునితో నిబంధనలు మనల్ని బలపరచి, రక్షించి, నిత్య మహిమ కొరకు సిద్ధపరుస్తాయి” (లియహోనా, మే 2022, 66–69) లో మీరు అంతర్దృష్టులను కనుగొనవచ్చు. మీ నిబంధనల కొరకు మీరు ఎందుకు కృతజ్ఞత కలిగియున్నారు? మీ వాగ్దానములు పాటించుటకు మీరేమి చేస్తున్నారు?

లేఖనాలు మరియు కడవరి దిన ప్రవక్తల నుండి సత్యాన్ని బోధించండి. మీరు బోధించినప్పుడు—నేర్చుకొనేటప్పుడు—క్రీస్తు నందు విశ్వాసాన్ని పెంచుకోవడానికి ఉత్తమమైన ఒక విధానము లేఖనాలు మరియు కడవరి దిన ప్రవక్తల మాటలపై దృష్టికేంద్రీకరించడమని గుర్తుంచుకోండి (మోషైయ 18:19 చూడండి).

మోషైయ 18:17-30

సమకూడి, ఏర్పాటుచేయబడి, ఐక్యత కలిగియుండాలని దేవుడు తన జనులను ఆజ్ఞాపిస్తారు.

మనకు సంఘము ఎందుకు అవసరము అని కొంతమంది ఆశ్చర్యపోతారు? “క్రీస్తు సంఘము”లో (మోషైయ 18:17) సమకూడడంలో ఆల్మా జనులు కనుగొన్న విలువ కొరకు చూస్తూ, మోషైయ 18:17–31ను వెదకండి. ఆల్మా కాలంలో మరియు మన కాలంలో యేసు క్రీస్తు యొక్క సంఘములో మీరు చూసే పోలికలు ఏవి?

వ్యవస్థీకృత సంఘము అవసరమని నమ్మని ఒక స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుని పట్ల మీరు ఎలా స్పందిస్తారు? యేసు క్రీస్తు యొక్క సంఘానికి చెందియుండడం వలన మీరెందుకు కృతజ్ఞత కలిగియున్నారు?

“ఐక్యతయందును, ప్రేమయందును ముడివేయబడునట్లు” మీ వార్డు లేదా శాఖ సభ్యులకు సహాయపడుటకు మీరేమి చేయగలరో ఆలోచించండి (మోషైయ 18:21).

డాలిన్ హెచ్. ఓక్స్, “ఒక సంఘము యొక్క అవసరము,” లియహోనా, నవ. 2021, 24-26 కూడా చూడండి.

మోషైయ 21–24

నా భారములను భరించడానికి దేవుడు నాకు సహాయం చేస్తారు.

వేర్వేరు పరిస్థితులలో అయినప్పటికీ, లింహై యొక్క జనులు మరియు ఆల్మా యొక్క జనులు ఇరువురు దాస్యములో పడిపోయారు. మోషైయ 19–22లో లింహై జనుల యొక్క మరియు మోషైయ 18; 23–24లో ఆల్మా జనుల యొక్క వృత్తాంతములను పోల్చుట ద్వారా మీరేమి నేర్చుకోగలరు? మీరు అలా చేసినప్పుడు, మీ జీవితానికి వర్తించే సందేశాల కొరకు చూడండి. ఉదాహరణకు, “అంచెలంచెలుగా వర్ధిల్లుట” అనగా అర్థమేమిటి? (మోషైయ 21:16). ఈ సూత్రాన్ని మీరేవిధంగా అన్వయించగలరు?

మోషైయ 23:21–24; 24:8–17

నేను ప్రభువును నమ్మగలను.

వారు తమ పాపముల కొరకు పశ్చాత్తాపపడినప్పటికీ, ఆల్మా మరియు అతని జనులు ఇంకా తమనుతాము దాస్యములో కనుగొన్నారు. ప్రభువునందు నమ్మకముంచి, మన నిబంధనలను జీవించడం ఎల్లప్పుడు మన సవాళ్ళను తీసివేయదు, కానీ వాటిని జయించడానికి మనకు సహాయపడగలదని వారి అనుభవాలు చూపుతాయి. మోషైయ 23:21–24 మరియు 24:8–17ను మీరు చదివినప్పుడు, మీ పరిస్థితులను లక్ష్యపెట్టకుండా, ప్రభువు యందు నమ్మకముంచడాన్ని నేర్చుకోవడానికి మీకు సహాయపడే మాటలు మరియు వాక్యభాగములను గమనించండి.

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

మోషైయ 18:7-17

నేను బాప్తిస్మము తీసుకున్నప్పుడు, నేను దేవునితో ఒక నిబంధన చేస్తాను.

  • మీ పిల్లలు బాప్తిస్మము కొరకు సిద్ధపడడానికి సహాయపడే ఒక ముఖ్యమైన విధానము ఏదనగా, వారు బాప్తిస్మము పొందుతున్నప్పుడు వారు చేసే నిబంధన గురించి వారికి బోధించడం. ఇది ఈ వారపు సారాంశం చివరన ఉన్న చిత్రాన్ని చూపడం మరియు మోషైయ 18:9–10లో నిబంధన గురించి వారితోపాటు చదవడమంత సులభమైనది కాగలదు. చిన్నపిల్లలకు దీని గురించి బోధించడానికి ఇదివరకే బాప్తిస్మం పొందిన ఒక బిడ్డను ఆహ్వానించడాన్ని పరిగణించండి. మీ బాప్తిస్మము గురించి వినడాన్ని మీ పిల్లలు ఆనందించవచ్చు. దేవునితో మీ నిబంధనలు పాటించడం మీ జీవితాన్ని ఎలా దీవించింది?

  • బాప్తిస్మము పొందిన పిల్లలు వారు చేసిన నిబంధనల గురించి తరచు గుర్తుచేసే చిహ్నాలను ఉపయోగించవచ్చు మరియు ప్రతీవారం సంస్కరముతో వాటిని నూతనంగా చేయవచ్చు. బహుశా మీ పిల్లలు మోషైయ 18:8–10లో వివరించబడిన బాప్తిస్మపు నిబంధనను సంస్కార ప్రార్థనలతో (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:77, 79) పోల్చవచ్చు. మన బాప్తిస్మముల వలె సంస్కారమును మనము ఒక ప్రత్యేక, భక్తిపూర్వక సమయంగా ఎలా చేయగలము?

బాప్తిస్మము పొందుతున్న బాలిక

మనం బాప్తిస్మము పొందినప్పుడు, మనం దేవునితో ఒక నిబంధన చేస్తాము.

మోషైయ 18:17-28

నేను బాప్తిస్మము పొందినప్పుడు, నేను యేసు క్రీస్తు సంఘము యొక్క సభ్యునిగా మారతాను.

  • యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యునిగా అవడం అంటే అర్థమేమిటో మీ పిల్లలకు తెలుసా? మోషైయ 18:17-28లో సంఘ సభ్యులు చేసిన వాటిని సూచించే చిత్రాలను కనుగొనడానికి వారికి సహాయపడడం గురించి ఆలోచించండి. ఉదాహరణకు, యాజకత్వ నియామకము మరియు దశమభాగ చెల్లింపు యొక్క చిత్రాలు 18 మరియు 27–28 వచనాలను సూచించవచ్చు. యేసు క్రీస్తు యొక్క సంఘ సభ్యునిగా ఉండడానికి మీరెందుకు కృతజ్ఞత కలిగియున్నారో వారికి చెప్పండి.

  • “ఐక్యతయందును, ప్రేమయందును ముడివేయబడునట్లు” భావించడానికి మీ పిల్లలకు సహాయపడడం (మోషైయ 18:21) వారు తమ జీవితాలంతటా సంఘముతో సంబంధం కలిగియుండడానికి వారికి సహాయపడుతుంది. మోషైయ 18:17-28 చదవడానికి మీ పిల్లలను ఆహ్వానించడాన్ని పరిగణించండి. ఒకరినొకరు ప్రేమించడానికి, సేవచేయడానికి ఆల్మా కాలంలో క్రీస్తు సంఘము యొక్క సభ్యులు ఏమి చేసారు? మన వార్డు, శాఖ లేదా సమాజంలో మనం దీనిని ఎలా చేయగలము?

మోషైయ 24:8-17

దేవుడు నా భారములు తేలికగా చేయగలడు.

  • ఒక సాధారణ వస్తుపాఠము అభ్యాసాన్ని మరింత చిరస్మరణీయంగా చేయగలదు. ఒక సంచిని బరువైన వస్తువులతో నింపండి (భారాలను సూచించడానికి) మరియు ఆ సంచిని పట్టుకోమని ఒక బిడ్డను ఆహ్వానించండి. మీరు మీ పిల్లలతో మోషైయ 24:8–17 చదువుతున్నప్పుడు, వారి భారాల గురించి దేవుని సహాయాన్ని కోరడానికి ఆల్మా మరియు అతని జనులు ఏదైనా చేయడాన్ని వారు వినిన ప్రతీసారి సంచిలో నుండి ఒక వస్తువును తీసివేయమని వారిని అడగండి. మనము ఆయన సహాయాన్ని కోరినప్పుడు, పరలోక తండ్రి మన భారాలను ఎలా తేలిక చేయగలరు అనే దాని గురించి అప్పుడు మీరు వారితో మాట్లాడవచ్చు.

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

బాప్తిస్మము పొందుతున్న జనులు

The Waters of Mormon [మోర్మన్ జలములు], జార్జ్ కొక్కో చేత