2010–2019
నిబంధనకు చెందుట
2019 అక్టోబర్ సర్వసభ్య సమావేశము


నిబంధనకు చెందుట

దేవునికి చెందినవారై యుండి, ఆయన నిబంధనల మార్గములో ఒకరితో ఒకరు కలిసి నడుచుటయే నిబంధనకు చెందుట వలన కలిగే దీవెన.

ప్రియమైన సహోదర, సహోదరిలారా, ప్రార్థించడం నేర్చుకొంటున్న ఒక ప్రాథమిక బిడ్డ గురించి ఒక కథ చెప్పబడింది. “అక్షరము ఏ, అక్షరము బి, … అక్షరము జి కొరకు ధన్యవాదాలు.” ఆ బిడ్డ ప్రార్థించుట కొనసాగించెను, “అక్షరము ఎక్స్, వై, జెడ్ కొరకు ధన్యవాదాలు.” ప్రియమైన పరలోక తండ్రి, అంకె ఒకటి, అంకె రెండు కొరకు ధన్యవాదాలు.” ప్రాథమిక బోధకురాలు కలవరపడతున్నది కాని తెలివిగా వేచియుండెను. ఆ బిడ్డ “అంకె 5, అంకె 6 కొరకు ధన్యవాదాలు—మరియు నా ప్రాథమిక బోధకురాలు కొరకు ధన్యవాదాలు. నా ప్రార్థనను ముగించనిచ్చిన వ్యక్తులలో ఏకైక వ్యక్తి ఆమె.”

పరలోక తండ్రి ప్రతి బిడ్డ ప్రార్థనను పరిపూర్ణముగా వినును. అనంత ప్రేమ కలిగి, ఆయన సంఘములో భాగమగుటకు వచ్చి, నమ్మి నిబంధనలు చేసుకొమ్మని ఆయన ప్రోత్సాహిస్తున్నారు.

ఈ లోకము ఎండమావులు, వంచన, చేతి గారడీతో నిండియున్నది. చాలా వరకు క్షణికమైనది, పైపైన ఉండేదిగా అనిపిస్తుంది. మనం మోసపూరిత రూపాలను, నటలను, సాంఘిక మాధ్యమాలలో అంగీకరించబడటం మరియు తిరస్కరించబడటం ప్రక్కన పెట్టినప్పుడు, అస్థిరమైన, బాహ్య ఆకర్షణలను, స్వల్పకాల సంబంధాలను లేదా నెరవేరని లోకసంబంధమైన ఆవశ్యక స్వయం ఆసక్తుల కంటే ఎక్కువ అపేక్షిస్తాము. కృతజ్ఞతపూర్వకముగా, ఆ విషయానికి జవాబిచ్చే ఒక మార్గము కలదు.

నిబంధనపూర్వకముగా దేవుని మరియు మన చుట్టూ ఉన్నవారిని ప్రేమించమని చెప్పే దేవుని యొక్క గొప్ప ఆజ్ఞలను పాటించినప్పుడు, దానిని అపరిచితునిగా లేదా అతిధిగా చెయ్యము కాని ఇంటివద్ద ఉన్న ఆయన బిడ్డగా చేస్తాము.1 ప్రాచీన కాలపు విపరీతార్థము ఇప్పటికి నిజమే. నిబంధనకు చెందుటకు మన లోకసంబంధమైన వ్యక్తిని కోల్పోవుట ద్వారా మన నిత్యసంబంధమైన శ్రేష్టమైన వ్యక్తిని కనుగొంటాము2—స్వేచ్ఛగా, సజీవముగా, యదార్థముగా—మారతాము మరియు మనకు అతిముఖ్యమైన సంబంధాలను నిర్వచిస్తాము. నిబంధనకు చెందుట అనగా పరిశుద్ధ విధుల ద్వారా దేవునికి, ఒకరికొకరు యాధార్థమైన వాగ్దానాలు చేసుకొని, పాటించుట మరియు మన జీవితాలలో ప్రత్యక్షపరచబడునట్లు ఆ వాగ్దానాలు దైవత్వపు శక్తిని ఆహ్వానిస్తాయి.3 మనం ఉన్నట్లుగా నిబంధన చేసినప్పుడు, మనం ఉన్నదానికంటే ఎక్కువగా అవుతాము. అవిధంగా అగుటకు నిబంధనకు చెందుట ఒక స్థానాన్ని, వివరణను, శక్తిని ఇస్తుంది. జీవానికి, రక్షణకు కావలసిన విశ్వాసాన్ని అది ఉత్పత్తిచేస్తుంది.4

దైవిక నిబంధనలు దేవుని కొరకు, దేవుని నుండి కలుగు ప్రేమకు మూలాధారముగా మారి, తద్వారా ఒకరి కొరకు ఒకరు, ఒకరితో ఒకరుగా మారుతుంది. పరలోక తండ్రియైన దేవుడు మనం మనల్ని ప్రేమించిన దానికంటే ఎక్కువ ప్రేమిస్తున్నారు, మన గురించి మనకు తెలిసిన దానికంటే ఆయన ఎక్కువ తెలియును. యేసు క్రీస్తునందు విశ్వాసము, వ్యక్తిగత మార్పు (పశ్చాత్తాపము) కృపాకటాక్షములను, క్షమాపణను తెచ్చును. ఇవి మర్త్యత్వమునందు మనం అనుభవించే బాధ, ఒంటరితనము, అన్యాయమునకు ఓదార్పునిస్తాయి. మన పరలోక తండ్రి దేవుడైయుండి, మనం దేవుని యొక్క వరములలో కెల్లా గొప్పవరమైన—ఆయన ఆనందము, ఆయన నిత్యజీవమును పొందాలని మనల్ని కోరుతున్నారు. 5

మన దేవుడు నిబంధనల దేవుడు. ఆయన స్వభావమును బట్టి, ఆయన “నిబంధనలను పాటించును, కరుణ చూపించును.”6 ఆయన నిబంధనలు “కాలము ఉన్నంతవరకు లేదా భూమి నిలుచునంత వరకు లేదా భూమిపైన రక్షింపబడుటకు ఒక మనుష్యుడు ఉన్నంతవరకు” నిలుచును.”7 మన మర్త్య ఉనికి అనిశ్చితతోను, సందేహముతోను తిరుగులాడుటకు మనం లేము కాని “మరణ పాశములకంటే బలమైన”8 నిబంధన బంధములను హృదయములో ఉంచుకొనుటకు మనం ఉన్నాము.

దేవుని విధులు మరియు నిబంధనలు అవసరములో ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి, వ్యక్తిగతముగా అవకాశము కలిగిస్తాయి. దేవుని నిష్పక్షపాతము వలన రక్షించు విధులను ప్రతి స్థలములో, కాలములో ఉన్న ప్రతి వ్యక్తి పొందవచ్చును. కతృత్వము వర్తిస్తుంది—వారికి ఇవ్వజూచిన విధులు అంగీకరించాలా వద్దా అని వ్యక్తులు ఎంచుకుంటారు. దేవుని విధులు ఆయన నిబంధనల మార్గమునకు త్రోవచూపు స్తంబాలను సమకూరుస్తాయి. ఆయన పిల్లలను గృహానికి చేర్చు దేవుని ప్రణాళికను విమోచన ప్రణాళిక, రక్షణ ప్రణాళిక, సంతోషకర ప్రణాళిక అని పిలుస్తాము. యేసు క్రీస్తు ఈ “పరిపూర్ణ ప్రాయశ్చిత్తమును చేసెను” గనుక విమోచన, రక్షణ, సిలెస్టియల్ సంతోషము సాధ్యమయ్యాయి. 9

దేవునికి చెందినవారై యుండి, ఆయన నిబంధనల మార్గములో ఒకరితో ఒకరు కలిసి నడుచుటయే నిబంధనకు చెందుట వలన కలిగే దీవెన.

మొదట, నిబంధనకు చెందుట అనేది “నూతన నిబంధనకు మధ్యవర్తిగా”10 ఉన్న యేసు క్రీస్తునందు కేంద్రీకృతమై ఉంటుంది. మనం “తండ్రి యొక్క నిబంధనలో … క్రీస్తునందు పరిశుద్ధులు” 11 అయినప్పుడు సమస్తము మన మంచికొరకు పనిచెయ్యగలవు. అంతము వరకు నమ్మకముగా ఉండువారికి సమస్తమైన మంచి మరియు వాగ్దానము చెయ్యబడిన దీవెనలు ఇవ్వబడతాయి. “దేవుని ఆజ్ఞలు పాటించువారి సంతోషకరమైన స్థితి” ఏదనగా “వారు ఐహికమైన మరియు ఆత్మసంబంధమైన రెండింటియందు ఆశీర్వదించబడియున్నారు,” మరియు “దేవునితో ఎన్నడును అంతముకాని సంతోషము యొక్క స్థితిలో నివసించెదరు.” 12

మన నిబంధనలు జీవించుటలో మనం చేయగలిగినదంతా చేసినప్పుడు, కొన్నిసార్లు మనం దేవదూతల సహవాసములో ఉన్నామని భావిస్తాము. తెరకు ఇటువైపు ఉండి మనం ప్రేమించే, మనల్ని దీవించేవారు మరియు తెరకు అవతల ఉండి మనల్ని ప్రేమించి, దీవించేవారితో—దేవదూతల సహవాసములో మనం ఉంటాము.

ఇటీవల నేను మరియు సహోదరి గాంగ్ ఒక ఆసుపత్రి గదిలో నిబంధనకు చెందుట యొక్క ప్రేమపూరిత, ప్రధానమైన మాదిరిని చూసాము. ఒక యౌవన తండ్రికి అత్యవసరంగా కిడ్నీ మార్పు చెయ్యవలసిన అవసరం ఉండెను. ఒక కిడ్నీ పొందాలని అతని కుటుంబము కన్నీరువిడిచింది, ఉపవాస ప్రార్థన చేసింది. ప్రాణాన్ని రక్షించే కిడ్నీ అందుబాటులో ఉందని సమాచారం అందినప్పుడు, అతని భార్య మౌనంగా, “ఆ ఇతర కుటుంబము బాగానే ఉండాలని ఆశిస్తున్నాను” అని చెప్పింది. నిబంధనకు చెందుట అనేది “మీకును నాకును కలిగియున్న విశ్వాసముచేత, అనగా మనము ఒకరి విశ్వాసముచేత ఒకరము ఆదరణపొందవలెనని” 13 చెప్పిన అపొస్తలుడైన పౌలు మాటలలో ఉన్నది.

ఈ జీవితములో దేవునియందు మనం విశ్వాసాన్ని కోల్పోతాము కాని ఆయన ఎన్నడు మనయందు విశ్వాసాన్ని కోల్పోరు. ఆవిధంగా గడప ముందర ఆయన దీపము ఎప్పడు వెలుగుతూనే ఉంటుంది. ఆయన మార్గమును చూపే నిబంధనల యొద్దకు రమ్మని లేదా తిరిగి రమ్మని ఆయన ఆహ్వానిస్తున్నారు. మనం “దూరంగా ఉన్నప్పుడే” 14 ఆయన మనల్ని హత్తుకొనుటకు సిద్ధముగా ఉండి వేచిచూస్తారు. మన అనుభవము యొక్క విధానాలు, ముఖ్య జీవనరేఖ లేదా కలిపే బిందువుల కొరకు విశ్వాసపు కన్నుతో చూచినప్పుడు ఆయన యొక్క మృదు కనికరములను, ప్రోత్సాహమును మరి ముఖ్యముగా మన కష్టాలు, కన్నీళ్లు, సవాళ్ళు మరియు మన సంతోషాలలో చూడగలము. ఎంత తరచుగా తొణికి లేదా పడిపోతామో, ఆయన వైపు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, ఒక్కొక్క సారి ఒక్కొక్క అడుగు ముందుకు వేయుటకు ఆయన మనకు సహాయము చేయును.

రెండవది, మోర్మన్ గ్రంథము నిబంధనకు చెందుటకు మన చేతితో పట్టుకోగల భౌతిక సాక్ష్యము. ఒక క్రొత్త నిబంధనగా ప్రవచించబడిన మోర్మన్ గ్రంథము దేవుని పిల్లలను పోగుచేయుటకు వాగ్దానము చెయ్యబడిన సాధనము. 15 మౌనముగా లేదా గట్టిగా మనంతట మనము మరియు ఇతరులతో మోర్మన్ గ్రంథము చదివినప్పుడు, యధార్థ హృదయముతో, నిజమైన ఉద్దేశముతో, క్రీస్తునందు విశ్వాసము కలిగి మనం దేవుని అడగవచ్చును, మరియు మోర్మన్ గ్రంథము నిజమైనదనే దేవుని అభయమును పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పొందవచ్చును. 16 యేసు క్రీస్తు మన రక్షకుడని, జోసెఫ్ స్మిత్ పునఃస్థాపన యొక్క ప్రవక్త అని, ప్రభువు సంఘము ఆయన పేరుతో—యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము అని పిలువబడుననే అభయము కూడా ఇందులో ఇమిడియున్నది. 17

మోర్మన్ గ్రంథము ప్రాచీన మరియు నూతన నిబంధన ద్వారా “ప్రవక్తల పిల్లలైన”18 లీహై పిల్లలైన మీతో మాట్లాడుతుంది. మీ పూర్వులు వారి సంతతివారైన మీరు మోర్మన్ గ్రంథములో దూళినుండి వచ్చిన స్వరమువలె ఒక స్వరాన్ని గుర్తిస్తారని నిబంధన వాగ్దానమును పొందారు. 19 మీరు చదివినప్పుడు మీరు “నిబంధన పిల్లలు”20 అని సాక్ష్యమిచ్చే స్వరాన్ని మీరు భావిస్తారు.

“ఆయన [మనపై] తన ఆత్మను అధిక విస్తారముగా కుమ్మరించినట్లు [మనము] ఆయనను సేవించెదమని, ఆయన ఆజ్ఞలు పాటించెదమని [ప్రభువుతో] ఒక నిబంధనలోకి ప్రవేశించుటకు”21 ఆల్మా మాటలలో మోర్మన్ గ్రంథము మనలో ప్రతి ఒక్కరిని ఆహ్వనిస్తుంది. “నిరాశగా ఉండుట మాని సంతోషమును పొందుటకు సంతోషముగా ఉండుటకు” మేలైన దానికొరకు మనం మారాలనుకొన్నప్పుడు—ఒక వ్యక్త చెప్పినట్లు—నడిపింపును, సహాయమును, బలమును స్వీకరించుటకు మనం సిద్ధముగా ఉంటాము. దేవునితో మరియు నమ్మకమైన విశ్వాసుల సమాజమునకు చెందుటకు ఒక నిబంధనతో మనం వచ్చినప్పుడు, క్రీస్తు సిద్ధాంతములో 22 వాగ్దానము చెయ్యబడిన దీవెనను ఇప్పుడే మనం పొందగలము.

నిబంధనకు చెందుటలో మూడవ పరిమాణము ఏదనగా ఆయన పిల్లలను దీవించుటకు గల పునఃస్థాపించబడిన యాజకత్వ అధికారము . ఈ యుగములో ఆయన యాజకత్వ అధికారమును పునఃస్థాపించుటకు బాప్తీస్మమిచ్చు యోహాను, అపొస్తలులైన పేతురు, యాకోబు మరియు యోహాను దేవుని నుండి మహిమగల దూతలుగా వచ్చారు. 23 దేవుని యాజకత్వము మరియు ఆయన విధులు భూమిపైన సంబంధాలను విలువైనవిగా చేసి, పరలోకములో నిబంధన సంబంధాలను అధికారికముగా ప్రభావము కలిగియున్నవిగా చేయును. 24

యాజకత్వము శబ్దార్థప్రకారము-ఒక చిన్న బిడ్డ పేరుపెట్టుట మరియు దీవెన ఇచ్చుట నుండి సమాధి సమర్పణ వరకు-ఉయ్యాల నుండి సమాధి వరకు దీవించగలదు. యాజకత్వ దీవెన స్వస్థపరుస్తుంది, ఓదార్పునిస్తుంది, ఉపదేశిస్తుంది. ఒక తండ్రి తన కుమారునికి ఒక మృదువైన యాజకత్వ దీవెన ఇచ్చినప్పుడు క్షమించే ప్రేమ కలిగినంత వరకు ఆయన తన కుమారునిపైన కోపముతో ఉండెను. తన కుటుంబములో ఉన్న ఏకైక సభ్యురాలు, ఒక ప్రియమైన యువతి తాను ప్రేరేపించబడిన యాజకత్వ దీవెన పొందేవరకు తన యెడల దేవుని ప్రేమ గురించి అనిశ్చితతో ఉండెను. ప్రపంచమంతటా, గోత్రజనక దీవెనలు ఇచ్చుటకు ఘనులైన గోత్రజనకులు ఆత్మీయంగా సిద్ధపడతారు. గోత్రజనకుడు తన హస్తమును మీ శిరస్సుపై ఉంచినప్పుడు, మీ యెడల దేవుని ప్రేమను ఆయన భావించి, వ్యక్తపరుస్తారు. ఇశ్రాయేలు వంశములో మీ గోత్రమును ఆయన ప్రకటిస్తారు. ప్రభువు నుండి దీవెనలను ఆయన సూచిస్తారు. ప్రత్యేకమైన ఆలోచన కలిగి, తాను, తన కుటుంబము వారి తండ్రి గోత్రజనక దీవెనలు ఇచ్చు దినాలలో ఏవిధంగా ఆత్మను ఆహ్వానిస్తారో ఒక గోత్ర జనకుని భార్య నాతో చెప్పెను.

చివరిగా, మనం ప్రభువు యొక్క ప్రవక్తను అనుసరించి, వివాహ నిబంధనతో పాటు నిబంధనలో జీవించుటను ఆనందించినప్పుడు నిబంధనకు చెందుట వలన కలిగే దీవెనలు వస్తాయి. మన సంతోషము కంటే ముందు మన దాంపత్యభాగస్వామి మరియు కుటుంబ సంతోషమును ఎంచుకున్నప్పుడు నిబంధన వివాహము పరిశుద్ధముగా మరియు నిత్యమైనదిగా మారుతుంది. “నేను” అనేది “మనముగా” మారినప్పుడు, మనం కలిసి అభివృద్ధి చెందుతాము. మనం కలిసి వృద్ధులైనప్పుడు, మనం కలిసి యౌవనులౌతాము. మనల్ని మనం మర్చిపోయే జీవితకాలము ఒకర్ని ఒకరు దీవించినప్పుడు, నిశ్శబ్దమైన నిరీక్షణానందములో ఈ లకములో, నిత్యత్వములో మన మిక్కిలి ప్రియమైన కలలు పవిత్రపరచబడతాయని మనం కనుగొంటాము.

పరిస్థితులు వేరువేరుగా ఉన్నప్పటికి, మనం చేయగలిగినదంతా, శ్రేష్ఠముగా మనం చేసి, మార్గములో యదార్థముగా ఆయన సహాయాన్ని అడిగి, వెదకినప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన సమయములో, ఆయన విధానములో ప్రభువు మనల్ని నడిపించును. 25 వివాహ నిబంధనలు వాటిని చేసేవారి పరస్పర ఎంపిక వలన బద్ధత కలిగియుంటాయి—కతృత్వమునకు దేవుని యొక్క, మన యొక్త గౌరవము మరియు మనం పరస్పరము కోరినప్పుడు పొందే ఆయన సహాయమునకు ఒక జ్ఞాపికగా ఉంటాయి.

కుటుంబ తరాలన్నిటిలో నిబంధనకు చెందుట వలన కలిగే ఫలాలు మన గృహాలలో, మన హృదయాలలో భావించబడతాయి. వ్యక్తిగత ఉదాహరణలతో వివరించుటకు దయచేసి నన్ను అనుమతించండి.

నేను, సహోదరి గాంగ్ ప్రేమలో పడి, వివాహము దిశగా వెళ్తున్నప్పుడు, కతృత్వము మరియు నిర్ణయాలు తీసుకొనుట గురించి నేను నేర్చుకున్నాను. కొంత కాలము, మేము వేర్వేరు దేశాలలో, వేర్వేరు ఖండాలలో జీవిస్తున్నాము. దీనివలనే నేను అంతర్జాతీయ సంబంధాలలో డాక్టరేట్ సంపాదించానని నేను నిజాయితీగా చెప్పగలను.

“పరలోక తండ్రి, నేను సూజన్ ను పెళ్ళిచేసుకోవాలా?” అని అడిగాను. నేను శాంతిని భావించాను. కాని, నిజమైన ఉద్దేశముతో ప్రార్థించుటను నేను నేర్చుకున్నప్పుడు, “పరలోక తండ్రి, నేను సూజన్‌ను ప్రేమిస్తున్నాను, ఆమెను వివాహము చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఉండగలిగినంతవరకు ఒక ఉత్తమమైన భర్తగా, తండ్రిగా ఉంటానని నేను వాగ్దానము చేస్తున్నాను”—నేను చర్యచూపించి, నా ఉత్తమమైన నిర్ణయాలను తీసుకున్నప్పుడు, ఆ తరువాతే బలమైన ఆత్మీయ నిర్దారణ వచ్చింది.

ఇప్పుడు మా గాంగ్ మరియు లిన్డ్‌సీ కుటుంబశోధన కుటుంబ వృక్షాలు, కథలు, ఛాయాచిత్రాలు తరతరాల నిబంధనకు చెందుట గురించి జీవించబడిన అనుభవమును తెలుసుకొనుటకు మాకు సహాయపడుతున్నాయి.26 మాకున్న గౌరవముగల పూర్వికులలో వీరు ఉన్నారు:

చిత్రం
ఆలిస్ బ్లావూర్ బాంగెర్టర్

అవ్వ ఆలిస్ బ్లావూర్ బాంగేర్టర్, ఒకే రోజు ముగ్గురు తనను పెళ్లి చేసుకుంటామని అడిగారు, తరువాత ఆమె తన భర్తను వెన్నతీసే యంత్రానికి కాలితో త్రొక్కేలా పిడిని అమర్చమని అడిగింది తద్వారా తాను వెన్న తీయడం, అల్లిక మరియు చదవడం మూడు పనులు ఒకేసారి చెయ్యవచ్చు.

చిత్రం
లోయ్ క్యూయి ఛార్

ముత్తాత అయిన లోయ్ క్యూయ్ చార్ వారు హవాయ్ పెద్ద ద్వీపములో లావా మైదానములను దాటుచున్నప్పుడు తమ కుటుంబము యొక్క సమాన్లు కొన్ని గాడిదపైన వేసి, తన పిల్లలలను తన వీపుపైన మోసుకొని వెళ్ళెను. చార్ కుటుంబము యొక్క తరతరాల నిబద్దత మరియు త్యాగము నేడు మా కుటుంబాన్ని దీవించింది.

చిత్రం
మేరీ ఆలిస్ పోవెల్ లిన్డ్‌సీ

నానమ్మ మేరీ ఆలిస్ పోవెల్ లిన్డ్‌సీ తన భర్త మరియు పెద్ద కుమారుడు కొద్ది దినాల వ్యవధిలో మరణించినప్పుడు ఆమె ఐదుగురు పిల్లలతో ఉండెను. 47 సంవత్సరాల విధవరాలిగా, ప్రాంతీయ నాయకుల, సభ్యుల సహకారమునిచ్చు ప్రేమతో నానమ్మ తన కుటుంబాన్ని పెంచింది. అన్ని ఎక్కువ సంవత్సరాలలో, ఆయన ఆమెకు సహాయము చేస్తే తాను ఎప్పుడు ఫిర్యాదు చెయ్యనని ప్రభువుతో వాగ్దానము చేసింది. ప్రభువు ఆమెకు సహాయం చేసారు. ఆమె ఎప్పుడు ఫిర్యాదు చెయ్యలేదు.

సహాదర, సహోదరిలారా, పరిశుద్ధాత్మ చేత సాక్ష్యము చెప్పబడి, మంచిది మరియు నిత్యమైన సమస్తమును మన నిత్య తండ్రియైన దేవుడు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తము యొక్క సజీవ సాక్ష్యముపైన కేంద్రీకృతమైయున్నది. మన ప్రభువైన యేసు క్రీస్తు మన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. యేసు క్రీస్తు గురించి సాక్ష్యము చెప్పుటయే మోర్మన్ గ్రంథము యొక్క నిబంధన ఉద్దేశము27 నిబంధన మరియు ప్రమాణముచేత, నిబంధన వివాహము, తరతరలా కుటుంబము మరియు వ్యక్తిగత దీవెనలతో కలిపి దేవుని పిల్లలను దీవించుటకు దేవుని పునఃస్థాపించబడిన యాజకత్వ అధికారము ఉద్దేశించబడినది.

“అల్ఫాయు ఓమెగయు ప్రభువైన క్రీస్తును నేనే; ఆదియు అంతమును, లోక విమోచకుడను నేనే” 28 అని మన రక్షకుడు సెలవిచ్చుచున్నాడు.

ఆరంభములో మనతో ఉండి, అంతము వరకు నిబంధనకు చెందియుండుటలో అన్నింటిలో ఆయన మనతో ఉంటారు. ఇవిధంగా యేసు పరిశుద్ధ నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

ముద్రించు