2010–2019
మేఘం మరియు సూర్యరశ్మి ద్వారా, ప్రభువా, నాతో నివసించుము!
2019 అక్టోబర్ సర్వసభ్య సమావేశము


మేఘం మరియు సూర్యరశ్మి ద్వారా, ప్రభువా, నాతో నివసించుము!

“మేఘం మరియు సూర్యరశ్మి ద్వారా,” ప్రభువు మనతో నివసించునని, మన “బాధలు క్రీస్తు యొక్క సంతోషమందు హరించివేయబడ(గలవు)” అని నేను సాక్ష్యమిస్తున్నాను.

మన ప్రియమైన కీర్తనలలో ఒకటి “మేఘం మరియు సూర్యరశ్మి ద్వారా, ప్రభువా, నాతో నివసించుము!”1 అను మనవిని వ్యక్తపరచును. ఒకసారి ఒక విమానము ఒక పెద్ద తుఫానును సమీపించినప్పుడు దానిలో నేను ఉన్నాను. కిటికీ బయటకు చూస్తూ, నేను మా క్రిందున్న మేఘముల దట్టమైన దుప్పటిని నేను చూడగలిగాను. అస్తమిస్తున్న సూర్యుని కిరణాలు, తీవ్రమైన ప్రకాశముతో వాటిని ప్రకాశించునట్లు చేస్తూ మేఘాలపై ప్రతిబింబిస్తున్నాయి. త్వరలో, విమానము దట్టని మేఘాల గుండా క్రిందకు దిగింది, మరియు హఠాత్తుగా మేము దట్టని చీకటిలో చుట్టబడ్డాము అది కేవలం క్షణాల క్రితం మేము ప్రత్యక్షంగా చూసిన తీవ్రమైన వెలుగుకు మమ్మల్ని పూర్తిగా మరచిపోవునట్లు చేసింది. 2

చిత్రం
సూర్యస్తమయములోని కిరణాలు
చిత్రం
దట్టని మేఘాలు

మన జీవితాలలో కూడ నల్లని మేఘాలు ఏర్పడవచ్చు, అవి దేవుని యొక్క వెలుగును మనము మరచిపోవునట్లు చేయగలవు మరియు ఇంకా ఆ వెలుగు మనకింకా ఉన్నదా అని ప్రశ్నించేలా మనల్ని చేస్తాయి. ఆ మేఘాలలో కొన్ని నిస్పృహ, ఆందోళన, మరియు మానసిక, భావావేశ బాధల ఇతర రూపములు. అవి మనల్ని, ఇతరులను, మరియు దేవునిని కూడ మనము గ్రహించే విధానమును మోసకరమైన విధానములోకి మార్చగలవు. అవి ప్రపంచములోని అన్ని మూలలలో అన్ని యుగములకు చెందిన స్త్రీ, పురుషులను ప్రభావితం చేయును.

అదేవిధంగా నష్టపరిచేది సంశయము యొక్క సున్నితత్వతము లేని మేఘము, అది ఈ సవాళ్లను అనుభవించని ఇతరులను ప్రభావితం చేయగలదు. శరీరంలో ఏ భాగము వలే, మెదడు వ్యాధి, గాయము మరియు రసాయన అసమతుల్యతకు లోబడును. మన మనస్సులు బాధపడుతున్నప్పుడు, దేవుని నుండి, మన చుట్టూ ఉన్నవారి నుండి, మరియు వైద్య, మానసిక ఆరోగ్య నిపుణులనుండి సహాయము కోరుట యుక్తమైనది.

“పురుషుడు, స్త్రీ—మానవులందరు—దేవుని యొక్క స్వరూపములో సృజించబడిరి. ప్రతీఒక్కరు, పరలోక తల్లిదండ్రుల యొక్క ప్రియమైన ఆత్మ కుమారుడు లేక కుమార్తె, మరియు … ప్రతీఒక్కరు ఒక దైవిక స్వభావమును మరియు గమ్యమును కలిగియున్నారు.”3 మన పరలోక తల్లిదండ్రులు, మన రక్షకుని వలే, మనము భౌతిక శరీరమును కలిగియున్నాము4 మరియు భావోద్వేగములను అనుభవిస్తాము.5

నా ప్రియమైన సహోదరిలారా, అప్పుడప్పుడు విచారము లేక ఆందోళన చెందుట సాధారణమైనది. విచారము, ఆందోళన సహజమైన మానవ భావావేశాలు.6 అయినప్పటికినీ, మనము నిరంతరము విచారముగా ఉండి మన బాధ మన పరలోక తండ్రి, ఆయన కుమారుడు మరియు పరిశుద్ధాత్మ యొక్క ప్రభావమును అనుభూతి చెందుటకు మన సామర్ధ్యమును ఆటంకపరచిన యెడల, అప్పుడు మనము నిస్పృహ, ఆందోళన లేక ఇతర భావావేశ పరిస్థితినుండి మనము బాధపడుతుండవచ్చు.

ఒకసారి మా కుమార్తై వ్రాసింది: ”ఒకానొక సమయంలో … నేను ఎప్పుడూ తీవ్రంగా విచారముగా ఉన్నాను. విచారము ఏదో సిగ్గుపడాల్సినదని, మరియు అది బలహీనతకు సూచనగా ఉన్నదని నేను ఎల్లప్పుడు అనుకున్నాను. కనుక నా విచారము గురించి నేను ఎవరికీ చెప్పలేదు. … నేను పూర్తిగా నిరూపయోగంగా భావించాను.”7

ఒక స్నేహితురాలు దానిని ఈవిధంగా వర్ణించింది: “నా బాల్యము నుండి, నేను నిరాశ, చీకటి, ఒంటరితనము, భయము మరియు నేను విరిగియున్నాను లేక లోపము కలిగియున్నాననే భావనలతో నిరంతరం పోరాటాన్ని ఎదుర్కొన్నాను. నా బాధను దాయటానికి నేను అభివృద్ధి చెంది, బలముగా ఉన్నాననే భావనను ఇచ్చుటకు నేను సమస్తము చేసాను.”8

నా ప్రియమైన స్నేహితులారా, అది మనలో ఎవరికైనా జరగవచ్చు—ప్రత్యేకంగా, సంతోషము యొక్క ప్రణాళికలో విశ్వాసులుగా, మనము ఇప్పుడే పరిపూర్ణముగా ఉండాలని ఆలోచించుట ద్వారా మనపై అనవసర భారములను ఉంచుతాము. అటువంటి ఆలోచనలు ముంచి వేయబడవచ్చు. పరిపూర్ణతను సాధించే ప్రక్రియ మన మర్త్య జీవితకాలమంతా మరియు దాటి—మరియు యేసు క్రీస్తు యొక్క కృప ద్వారా మాత్రమే జరుగును.9

వ్యతిరేకంగా, మన భావావేశ సవాళ్ల గురించి బయటకు చెప్పి, మనము పరిపూర్ణులము కాదని ఒప్పుకొనినప్పుడు, ఇతరులు వారి ప్రయాసలను పంచుకొనుటకు మనము ఇతరులకు అనుమతిస్తున్నాము. కలిసి మనము నిరీక్షణ ఉన్నదని, మనము ఒంటరిగా బాధపడనవసరం లేదని గ్రహిస్తాము.10

చిత్రం
రెండవ రాకడయందు నిరీక్షణ

యేసు క్రీస్తు యొక్క శిష్యులుగా, మనము “ఒకరి భారములు ఒకరు భరించుటకు ఇష్టపడుచున్నందున,” మరియు “దుఃఖించు వారితో దుఃఖపడుటకు”11 దేవునితో నిబంధన చేసాము. భావోద్వేగ వ్యాధులను గూర్చి తెలుసుకొనుట, ఈ ప్రయాసలు తీర్చుటకు సహాయపడగల వనరులను కనుగొనుట, మరియు చివరకు మనల్ని మనం, ఇతరులను గొప్ప వైద్యుడైన క్రీస్తునొద్దకు తెచ్చుటను కలిపియున్నది.12 ఇతరులు అనుభవిస్తున్న దానితో ఎలా సంబంధము కలిగియుండాలో మనకు తెలియనప్పుడు కూడ, వారి బాధ నిజమైనదని నిర్ధారించుట గ్రహింపును మరియు స్వస్థతను కనుగొనుటలో ముఖ్యమైన మొదటి మెట్టు కాగలదు.13

కొన్ని సందర్ఫాలలో, నిస్పృహ లేక ఆందోళన యొక్క కారణము గుర్తించబడవచ్చు, మిగిలిన సమయాలలో దానిని గ్రహించుట కష్టము కావచ్చు.14 మన మెదడులు ఒత్తిడి 15 లేక అస్థిరమైన అలసట16 వలన బాధపడవచ్చు, దానిని కొన్నిసార్లు ఆహారము, నిద్ర, మరియు వ్యాయామం ద్వారా మెరుగుపరచుకోవచ్చు. మరొక సమయాలలో, చికిత్స లేక మందులు శిక్షణ పొందిన నిపుణుల యొక్క ఆధ్వర్యంలో ఔషధం కూడా అవసరము కావచ్చు.

చికిత్స చేయబడని లేక భావోద్వేగ అనారోగ్యము ఎక్కువైన ఒంటరితనము, అపార్ధములు, చెడిన అనుబంధాలు, స్వీయ-హాని, మరియు ఆత్మహత్యకు దారితీయవచ్చు. అనేక సంవత్సరాల క్రితం ఆత్మహత్య ద్వారా మా స్వంత నాన్న చనిపోయినప్పుడు, నేను దీనిని ప్రత్యక్షంగా ఎరుగుదును. ఆయన మరణము విభ్రాంతి కలిగించింది మరియు నా కుటుంబానికి, నాకు హృదయ విదారకరమైనది. నా వేదన నుండి బయటపడటానికి నాకు సంవత్సరాలు పట్టింది, ఈ మధ్య కాలములో మాత్రమే వాస్తవానికి దానిని ప్రోత్సహించటం కంటే దానిని ఆపటానికి సహాయపడటానికి సరైన విధానాలలో ఆత్మహత్య గురించి మాట్లాడటం నేను నేర్చుకున్నాను.17 ఇప్పుడు నేను మా నాన్న మరణాన్ని నా పిల్లలతో బహిరంగంగా చర్చించాను మరియు తెరకు రెండు వైపుల రక్షకుడు ఇవ్వగల స్వస్థత గురించి సాక్ష్యమిచ్చాను.18

విచారకరంగా, తీవ్రమైన నిస్పృహను అనుభవించు అనేకులు తమ సహ పరిశుద్ధుల నుండి దూరంగా ఉంటారు, ఎందుకనగా వారు ఏదో ఊహాత్మకమైన గుణమునకు తగియుండరని భావిస్తారు. వాస్తవానికి వారు మనకు చెందినవారని వారు తెలుసుకొని, భావించుటకు మనము సహాయపడగలము. నిస్పృహ బలహీనత వలన కలిగినది కాదు లేక సాధారణంగా పాపము ఫలితంగా కలిగింది కాదని గుర్తించుట ముఖ్యమైనది.19 నిస్పృహ “రహస్యంగా ఉంచిన యెడల ఎక్కువవుతుంది, కానీ మనము ఇతరులనుండి సానుభూతిని పొందినప్పుడు తక్కువగును.”20 కలిసి, మనము ఒంటరితనము మరియు కళంకమనే భావనగల మేఘాలను మనము ఛేదించగలము, ఆవిధంగా అవమాన భారము పైకెత్తబడును మరియు స్వస్థపరచు అద్భుతములు సంభవించును.

యేసు క్రీస్తు తన మర్త్య పరిచర్య యందు, రోగులను, బాధలలో ఉన్నవారిని స్వస్థపరచెను, కానీ ప్రతీ వ్యక్తి ఆయనయందు విశ్వాసము సాధన చేసారు మరియు ఆయన స్వస్థతను పొందటానికి అమలు చేసారు. కొందరు సుదూర ప్రాంతాలకు నడిచారు, ఇతరులు ఆయన వస్త్రమును తాకుటకు వారి హస్తమును అందించారు, మరియు ఇతరులు స్వస్థపరచబడుటకు బదులుగా ఆయన వద్దకు మోసుకొనిపోబడ్డారు21 స్వస్థత విషయానికి వస్తే, మనందరికీ ఆయన చాలా అవసరము కాదా? “మనమందరము బిచ్చగాళ్లము కామా?”22

రక్షకుని యొక్క బాటను మనము అనుసరిద్దాము మరియు మన కనికరమును హెచ్చిద్దాము, విమర్శించుటకు మన ధోరణిని తగ్గిద్దాము, మరియు ఇతరుల ఆత్మీయతను పరిశోధించు వారిగా ఉండుటను మానివేద్దాము. ప్రేమతో వినుట మనము ఇవ్వగల గొప్ప బహుమానాలలో ఒకటి, మరియు మన ప్రియమైన వారిని, స్నేహితులను23 ఊపిరాడకుండా చేసే భారమైన మేఘములను తీసివేయుటకు లేక పైకెత్తుటకు సహాయపడగలము, ఆవిధంగా వారు పరిశుద్ధాత్మను మరలా అనుభవించగలరు మరియు యేసు క్రీస్తునుండి వచ్చు వెలుగును గ్రహించగలరు.

మీరు నిరంతరము “అంధకారము యొక్క పొగమంచు,”24 చేత చుట్టబడియున్న యెడల, పరలోక తండ్రి వైపు తిరుగుము. మీరు అనుభవించినది ఏదీ మీరు దేవుని బిడ్డ అని మరియు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడనే సత్యమును మార్చలేదు.25 క్రీస్తు మీ రక్షకుడు మరియు విమోచకుడని, మరియు మీ తండ్రియని జ్ఞాపకముంచుకొనుము. వారు గ్రహించారు. మీకు దగ్గరగా ఉన్నట్లు, వినుచున్నట్లు, బలమిస్తున్నట్లు వారిని చిత్రీకరించుము.26 “(వారు) మీ బాధలందు మిమ్మల్ని ఓదారుస్తారు.”27 మీ శాయశక్తులా చేయుము, మరియు ప్రభువు యొక్క ప్రాయశ్చిత్తః కృపయందు నమ్మకముంచుము.

మీ శ్రమలు మిమ్మల్ని నిర్వచించవు, కానీ అవి మిమ్మల్ని శుద్ధీకరించును. 28 “శరీరములో ముల్లు,” 29 వలన మీరు ఇతరుల పట్ల ఎక్కువ కనికరమును భావించు సామర్ధ్యమును కలిగియుంటారు. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడినట్లుగా, “బలహీనులకు చేయూతనిచ్చుటకు, కృంగిన హస్తములు పైకెత్తుటకు, మరియు దుర్భలమైన మోకళ్లను బలపరచుటకు”30 బదులుగా మీ వృత్తాంతమును పంచుకొనుము.

మనలో ప్రస్తుతం ప్రయాసపడుతున్న లేక ప్రయాసపడుతున్న వారికి సహకరించే వారికి, మనతో ఆయన ఆత్మను ఎల్లప్పుడు కలిగియుండునట్లు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించుటకు మనము సమ్మతిద్దాము.31 మనకు ఆత్మీయ బలము ఇచ్చునట్లు, “చిన్న మరియు సాధారణమైన వస్తువులు”32 మనము చేద్దాము. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ప్రకటించినట్లుగా: “హెచ్చించబడిన శుద్ధత, ఖచ్చితమైన విధేయత, మనఃపూర్వకంగా వెదకుట, మోర్మన్ గ్రంథములో క్రీస్తు యొక్క మాటలపై ప్రతీరోజు విందారగించి, దేవాలయము మరియు కుటుంబ చరిత్ర కార్యమునకు క్రమమైన సమయాన్నికేటాయించుట వంటి కలయక కంటే ఏదీ పరలోకమును తెరవదు.”33

చిత్రం
రక్షకుడు స్వస్థపరచుట

మన రక్షకుడైన, యేసు క్రీస్తు, “శరీరమును బట్టి ఆయన ప్రేగులు కనికరముతో నిండవలెనని, (మన) బలహీనతలను బట్టి తన జనులను ఎట్లు ఆదరించవలెనో శరీరమును బట్టి ఆయన ఎరుగునట్లు ఆయన వారి యొక్క బలహీనతలను తనపైన తీసుకొనును.”34 “నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, … దుఃఖాక్రాంతులను ఓదార్చుటకును, … బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును,”35 ఆయన వచ్చియున్నాడు.

చిత్రం
రెండవ రాకడ

“మేఘం మరియు సూర్యరశ్మి ద్వారా” ప్రభువు మనతో నిలిచియుంటారని, మన “బాధలు క్రీస్తు యొక్క సంతోషమందు హరించవేయబడెను”36 మరియు “మనము సమస్తము చేసిన తరువాత కూడ మనము కృప చేతనే రక్షింపబడియున్నామని”37 నేను మీకు సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు “తన రెక్కలయందు స్వస్థత కలిగి,”38భూమి మీదకు తిరిగి వస్తారని నేను సాక్ష్యమిస్తున్నాను. చివరకు, ఆయన “(మన) కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును; దుఃఖము . … ఇక ఉండదు.”39 “క్రీస్తు నొద్దకు వచ్చి, మరియు ఆయన యందు పరిపూర్ణులైన,”40 వారందరి కొరకు “సూర్యుడికను అస్తమింపడు; … .యెహోవాయే (మనకు) నిత్యమైన వెలుగుగా ఉండును, (మన) దుఃఖ దినములు సమాప్తములగును.”41 యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. “Abide with Me!” Hymns, no. 166.

  2. మేము మేఘములపైన ఉన్నప్పుడు, మాకు కొన్ని అడుగుల క్రింద ఉన్న చీకటిని మేము ఊహించలేము, మరియు క్రింద చీకటిలో మేము చుట్టబడినప్పుడు, కేవలము మాకు కొన్ని అడుగుల పైన ప్రకాశించిన సూర్యుని ప్రకాశమును చూచుట కష్టమైనది.

  3. కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన,Liahona, మే 2017, 145.

  4. “ఆత్మ మరియు శరీరము మానవుని యొక్క జీవము” సిద్ధాంతము మరియు నిబంధనలు 88:15. “మీ శరీరము మీ ఆత్మకు దేవాలయము. మీ శరీరమును మీరు ఎలా ఉపయోగిస్తారో మీ ఆత్మను ప్రభావితం చేయును” (Russell M. Nelson, “Decisions for Eternity,” Liahona, Nov. 2013, 107).

  5. ఉదాహరణకు, యెషయా 65:19; లూకా 7:13; 3 నీఫై 17:6–7; మోషే 7:28 చూడుము. మన భావోద్వేగములను గుర్తించి, విలువిచ్చుటను నేర్చుకొనుట, మన రక్షకుడైన, యేసు క్రీస్తు వలె ఎక్కువగా అగుటకు వాటిని నిర్మాణాత్మకంగా ఉపయోగించుటకు మనకు సహాయపడగలవు.

  6. See “Sadness and Depression,” kidshealth.org/en/kids/depression.html.

  7. Hermana Elena Aburto blog, hermanaelenaaburto.blogspot.com/2015/08. ఆమె ఇలా కూడా వ్రాసింది:

    “ఆ శ్రమ నాకు రక్షణ ప్రణాళికయందు నా విశ్వాసమును నిజముగా సాధన చేయటానికి నాకు అవకాశమిచ్చింది. ఏలయనగా నా పరలోక తండ్రి నన్ను ప్రేమిస్తున్నారని, మరియు ఆయన నా కొరకు ఒక ప్రణాళికను కలిగియున్నాడని, మరియు నేను అనుభవిస్తున్న దానిని ఖచ్చితంగా క్రీస్తు గ్రహించాడని నాకు తెలుసు.

    “మీకు నైపుణ్యము లేనప్పుడు దేవుడు మిమ్మల్ని సిగ్గుపరచడు. మీరు మెరుగుపరచుకొని మరియు పశ్చాత్తాపపడుటకు సహాయపడుటకు ఆయన సంతోషంగా ఉన్నాడు. ఒకేసారి అంతా సరిచేయమని ఆయన మిమ్మల్ని ఆశించడు. మీరు ఒంటరిగా దీనిని చేయనవసరం లేదు” (iwillhealthee.blogspot.com/2018/09).

  8. వ్యక్తిగత ఉత్తరప్రత్యుత్తరాలు. ఆమె ఇలా కూడా వ్రాసింది: “నా రక్షకుని ప్రాయశ్చిత్తఃము యొక్క స్వస్థపరచు ఔషధము నా ప్రయాణమంతటా శాంతి మరియు ఆశ్రయము యొక్క మిక్కిలి నిరంతర ఆధారముగా ఉన్నది. నా ప్రయాసయందు నేను ఒంటరిగా భావించినప్పుడు, నా తరఫున నేను అనుభవించుచున్న దానిని ఆయన ఇదివరకే ఖచ్చితంగా అనుభవించాడని నేను జ్ఞాపకం చేయబడ్డాను. … నా భవిష్యత్తు పరిపూర్ణము చేయబడిన, పునరుత్థాన శరీరము ఈ మర్త్య (బాధ) చేత బాధింపబడదని తెలుసుకొనుటలో చాలా నిరీక్షణ ఉన్నది.”

  9. See Russell M. Nelson, “Perfection Pending,” Ensign, Nov. 1995, 86–88; Jeffrey R. Holland, “Be Ye Therefore Perfect—Eventually,” Liahona, Nov. 2017, 40–42; J. Devn Cornish, “Am I Good Enough? Will I Make It?Liahona, Nov. 2016, 32–34; Cecil O. Samuelson, “What Does It Mean to Be Perfect?New Era, Jan. 2006, 10–13.

  10. ఈ సమస్యలను గూర్చి మన గృహాలు, వార్డులు, మరియు సమాజములలో మన పిల్లలు, కుటుంబాలు, మరియు స్నేహితులతో మాట్లాడుట ముఖ్యమైనది.

  11. మోషైయ 18:8-9.

  12. See Russell M. Nelson, “Jesus Christ—the Master Healer,” Liahona, Nov. 2005, 85–88; Carole M. Stephens, “The Master Healer,” Liahona, Nov. 2016, 9–12.

  13. మనవి మరియు ఇతరుల సూచనలు మరియు లక్షణాలను ఎలా గుర్తించాలో తెలుసుకొనుట సహాయపడగలదు. తప్పైన లేక అనారోగ్యకరమైన ఆలోచనా విధానములను గుర్తించుటకు, ఎక్కువ ఖచ్చితమైన మరియు ఆరోగ్యకరమైన వాటితో వాటిని తిరిగి ఎలా ఉంచాలో కూడ మనము నేర్చుకోగలము.

  14. జీవితములో మంచి మార్పుల వలన కూడ నిస్పృహ కలుగవచ్చు—ఒక బిడ్డకు జన్మనిచ్చుట లేక ఒక క్రొత్త ఉద్యోగము వంటివి—మరియు ఒక వ్యక్తి జీవితంలో మంచిగా ఉన్నప్పుడు కలగవచ్చు.

  15. See “Understanding Stress,” Adjusting to Missionary Life (2013), 5–10.

  16. See Jeffrey R. Holland, “Like a Broken Vessel,” Liahona, Nov. 2013, 40.

  17. See Dale G. Renlund, “Understanding Suicide” (video), ChurchofJesusChrist.org; “Talking about Suicide” (video), ChurchofJesusChrist.org; Kenishi Shimokawa, “Understanding Suicide: Warning Signs and Prevention,Liahona, Oct. 2016, 35–39.

  18. “స్వస్థత యొక్క ప్రారంభానికి పరలోకమందున్న తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నారనే మార్చలేని వాస్తవమునందు మరియు స్వస్థపడుటకు ఒక మార్గమును ఇచ్చారని బిడ్డ వంటి విశ్వాసము అవసరము. ఆయన ప్రియమైన కుమారుడైన, యేసు క్రీస్తు ఆ స్వస్థతను ఇచ్చుటకు తన జీవితమును అర్పించెను. కానీ నివారణ పూర్తి చేయుటకు ఏ ఇంద్రజాలం లేదు, లేక స్వస్థత ఇచ్చుటకు సాధారణమైన ఔషధము లేదు, లేక సులభమైన మార్గము లేదు. నివారణకు యేసు క్రీస్తునందు మరియు స్వస్థపరచు ఆయన అంతములేని సామర్ధ్యమునందు లోతైన విశ్వాసము అవసరము” (Richard G. Scott, “To Heal the Shattering Consequences of Abuse,Liahona, May 2008, 42). ఒక సమస్య ఉన్నప్పుడు, మన ధోరణి ఏమనగా, దానిని సరిచేయాలి. అయినప్పటికినీ, మనము మన యొక్క లేక ఇతరుల యొక్క సమస్యలను సరిచేయు ఏకైక వ్యక్తులు కానవసరంలేదు. సమస్తము మనకై మనం చేయాల్సినవసరం లేదు. నా జీవితంలో ఒకటి కంటే ఎక్కువ సందర్భములో, కష్టమైన సమయాలతో వ్యవహరించుటకు నాకు సహాయపడుటకు నేను నిపుణుల సహాయము కోరాను.

  19. (యోహాను 9:1-7 చూడుము.)

  20. Jane Clayson Johnson, Silent Souls Weeping (2018), 197.

  21. మత్తయి 9:2–7, 20–22; 14:35–36; మార్కు 1:40–42; 2:3–5; 3 నీఫై 17:6–7 చూడుము.

  22. మోషైయ 4:19; Jeffrey R. Holland, “మనమందరం బిచ్చగాళ్లాము కాదా?” కూడా చూడుము. Liahona, Nov. 2014, 40–42.

  23. రోమా 2:19; 13:12; Jeffrey R. Holland, “Come unto Me” (Brigham Young University devotional, Mar. 2, 1997), speeches.byu.edu కూడా చూడుము.

  24. 1 నీఫై 8:23; 1 నీఫై 12:4, 17; 3 నీఫై 8:22 కూడా చూడుము.

  25. కీర్తనలు 82:6; రోమా 8:16–18; సిద్ధాంతము మరియు నిబంధనలు 24:1; 76:24; మోషే 1:1–39 చూడుము.

  26. See Adjusting to Missionary Life, 20 చూడుము; మీకా 7:8; మత్తయి 4:16; లూకా 1:78–79; యోహాను 8:12 కూడా చూడుము.

  27. జేకబ్ 3:1; ఎఫెసీయులకు 5:8; కొలొస్సయులకు 1:10–14; మోషైయ 24:13–14; ఆల్మా 38:5 కూడా చూడుము. మీ గోత్ర జనకుని దీవెన చదువుము లేక ఒక యాజకత్వ దీవెన కొరకు అడుగుము, ఆవిధంగా పరలోక తండ్రి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని దీవించాలని ఎంతగా కోరుతున్నారో మీరు వినగలరు మరియు జ్ఞాపకము చేసుకోనగలరు.

  28. 2 కొరింథీయులకు 4:16–18; సిద్ధాంతము మరియు నిబంధనలు 121:7–8, 33; 122:5–9 చూడుము.

  29. 2 కొరింథీయులకు 12:7.

  30. సిద్ధాంతము మరియు నిబంధనలు 81:5; యెషయా 35:3 కూడా చూడుము.

  31. మొరోనై 4:3; సిద్ధాంతము మరియు నిబంధనలు 20:77 చూడుము.

  32. ఆల్మా 37:6.

  33. Russell M. Nelson, “సంఘము కొరకు బయల్పాటు, మన జీవితాల కొరకు బయల్పాటు,లియహోనా, మే, 2018, 95.

  34. ఆల్మా 7:12; యెషయా 53:4; 2 నీఫై 9:21; మోషైయ 14:4 కూడా చూడుము.

  35. యెషయా 61:1–3; లూకా 4:18 కూడా చూడుము.

  36. ఆల్మా 31:38; ఆల్మా 32:43; 33:23. కూడా చూడుము.

  37. 2 నీఫై 25:23.

  38. మలాకీ 4:2; 3 నీఫై 25:2.

  39. ప్రకటన 21:4.

  40. మొరోనై 10:32.

  41. యెషయా 60:20.

ముద్రించు