2010–2019
మోర్మన్ గ్రంధము యొక్క శక్తి ద్వారా కనుగొనబడ్డాను
2019 అక్టోబర్ సర్వసభ్య సమావేశము


2:3

మోర్మన్ గ్రంధము యొక్క శక్తి ద్వారా కనుగొనబడ్డాను

అందరూ మోర్మన్ గ్రంధములో ఉన్న సత్యముల శక్తి చేత కనుగొనబడాలి మరియు అనుభూతి చెందాలి.

మార్పు చెందిన వారి గృహాలను నేను దర్శించినప్పుడు, వారిని అడుగుటకు తరచుగా నాకిష్టమైన ప్రశ్నలలో ఒకటి, వారి కుటుంబాలను సంఘము గురించి మరియు వారు ఎలా బాప్తీస్మము తీసుకున్నారని అడుగుట. ఆ క్షణమందు ఆ వ్యక్తి చైతన్యముగల సభ్యుడు లేక అనేక సంవత్సరాలుగా సంఘానికి హాజరు కాని వ్యక్తి అయినప్పటికినీ అది ముఖ్యము కాదు. జవాబు ఎల్లప్పుడు ఒకేవిధంగా ఉన్నది: ఒక చిరునవ్వుతో, వారి ముఖము ప్రకాశిస్తూ, వారు ఎలా కనుగొన్నారో వృత్తాంతమును చెప్పుట వారు ప్రారంభిస్తారు. వాస్తవానికి, మార్పు చెందిన వృత్తాంతము ఎల్లప్పుడు మనము ఎలా కనుగొనబడ్డామనే వృత్తాంతముగా కనబడును.

యేసు క్రీస్తు తానే తప్పిపోయిన వాటి యొక్క ప్రభువు. ఆయన తప్పిపోయిన వాటి కొరకు శ్రద్ధ తీసుకొంటాడు. నిశ్చయముగా అందుకే ఆయన మూడు ఉపమానములు బోధించాడు, వాటిని మనము లూకా 15 వ అధ్యాయములో కనుగొంటాము: తప్పిపోయిన గొఱ్ఱె, పోగొట్టుకొనబడిన నాణెము, మరియు, చివరిగా, తప్పిపోయిన కుమారుని ఉపమానము. ఈ వృత్తాంతములన్నీ ఉమ్మడి సాధారణాంశమును కలిగియున్నాయి: అవి ఎందుకు కోల్పోబడినవో ముఖ్యమైనది కాదు. అవి పోగొట్టుకొనబడినవని వారు ఎరుగుట కూడా ముఖ్యమైనది కాదు. “మీరు నాతో కూడ సంతోషించుడి; తప్పిపోయిన[ది] నా గొఱ్ఱె దొరికినది”1 అని ఆశ్చర్యపడు సంతోషము యొక్క మహోన్నత భావన ఇక్కడ ప్రబలును. ముగింపులో, నిజానికి ఆయనకు ఏదీ కోల్పోలేదు.2

నాకు మిక్కిలి ప్రశస్తమైన విషయాలలో ఒకటైన—నాకై నేను ఎలా కనుగొనబడ్డానో కధను—ఈ మధ్యాహ్నాము మీతో పంచుకొనుటకు నన్ను అనుమతించండి.

నాకు 15 సంవత్సరాలు రాకముందు, అమెరికాలో తనతో, తన కుటుంబముతో కొంత సమయాన్ని గడపటానికి మా మావయ్య మాన్యుల్ బుస్టోస్ చేత నేను ఆహ్వానించబడ్డాను. కొంత ఆంగ్లము నేర్చుకోవటానికి నాకు ఇది గొప్ప అవకాశముగా ఉండును. అనేక సంవత్సరాల క్రితం మా మావయ్య సంఘానికి మార్పు చెందాడు, మరియు అతడు గొప్ప మిషనరీ ఆత్మను కలిగియున్నాడు. అందుకే బహుశా మా అమ్మ, నాకు తెలియకుండా అతడితో మాట్లాడి, అతడి సంఘము యొక్క సభ్యునిగా మారటానికి అతడు నన్ను ఒప్పించడనే: ఒక షరతుపై ఆహ్వానమునకు తాను సమ్మతిస్తానని చెప్పింది. మేము కాథలిక్కులము, మరియు మేము తరములుగా ఉన్నాము, మారాటానికి ఏ కారణము లేదు. మా మావయ్య పూర్తిగా అంగీకరించాడు మరియు అతడు తన మాట నిలబెట్టుకున్నాడు, సంఘము గురించి సాధారణమైన ప్రశ్నలకు జవాబిచ్చుటకు కూడ అతడు ఇష్టపడలేదు.

అవును, మా మావయ్య మరియు అతడి అద్భుతమైన భార్య మార్జోరి, వారెవరి వలే ఉన్నారో మానలేకపోయారు.3

నేను ఒక గది ఇవ్వబడ్డాను, దానిలో పుస్తకాలున్న పెద్ద గ్రంధాలయమున్నది. ఆ గ్రంధాలయములో దాదాపు 200 ప్రతుల మోర్మన్ గ్రంధాలు వేర్వేరే భాషలలో, వాటిలో 20 స్పానిష్ లో ఉండుట నేను చూడగలిగాను.

ఒకరోజు, కుతూహలంతో, నేను స్పానిష్ లో ఉన్న మోర్మన్ గ్రంధ ప్రతిని తీసుకున్నాను.

స్పానిష్‌లో మోర్మన్ గ్రంధము

అది మొదటి భాగములో మొరోనై దూత చిత్రముతో, ఆకాశపు నీలం రంగు మెత్తని కవరుతో ఉన్న ప్రతులలో ఒకటి. నేను దానిని తెరచినప్పుడు, మొదటి పేజీలో క్రింది వాగ్దానము వ్రాయబడింది: “మీరు ఈ సంగతులను అందుకొనినప్పడు, ఒకవేళ ఈ సంగతులు సత్యము కాదేమోయని మీరు నిత్యడగు తండ్రియైన దేవునిని, క్రీస్తు యొక్క నామమందు అడుగవలెనని, నేను మిమ్ములను హెచ్చరించుచున్నాను, మరియు ఒకవేళ మీరు ఒక యధార్ధమైన హృదయముతో, నిజమైన ఉద్దేశముతో క్రీస్తునందు విశ్వాసము కలిగి అడిగిన యెడల, ఆయన దాని యొక్క సత్యమును పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మీకు తెలియజేయును.”

అది ఇలా చేర్చును: “పరిశుద్ధాత్మ యొక్క వరము ద్వారా మీరు అన్ని సంగతుల యొక్క సత్యమును తెలుసుకొనగలరు.”4

ఈ లేఖనాలు నా మనస్సు, హృదయముపై కలిగించిన ప్రభావమును వివరించుట కష్టమైనది. నిజానికి, నేను “సత్యము” కొరకు వెదకటం లేదు. నేను ఒక యౌవనుని, తన జీవితంతో సంతోషంగా ఉండి, ఈ క్రొత్త సంప్రదాయాన్ని ఆనందిస్తున్నాను.

అయినప్పటికినీ, మనస్సులో ఆ వాగ్దానమును ఆలోచిస్తూ, నేను ఆ గ్రంధమును రహస్యంగా చదవసాగాను. నేను ఎక్కువ చదివినప్పుడు, దీని నుండి నేను నిజంగా ఏదైనా పొందాలని కోరిన యెడల, నేను ప్రార్ధన చేయుట ప్రారంభించాలని నేను గ్రహించాను. చదవటం మాత్రమే కాదు కానీ మోర్మన్ గ్రంధము గురించి ప్రార్ధించుటకు కూడ మీరు నిర్ణయించినప్పుడు జరుగుతున్నది మనందరికి తెలుసు. సరే, నాకు కూడా కేవలము ఇదే జరిగింది. అది చాలా ప్రత్యేకమైనది మరియు చాలా అద్వితీయమైనది—అవును, ప్రపంచమంతటా మిలియన్ల ఇతరులకు జరిగినట్లుగా అదేవిధంగా ఉన్నది. పరిశుద్ధాత్మ యొక్క వరము ద్వారా మోర్మన్ గ్రంధము సత్యమని నేను తెలుసుకోగలిగాను.

తరువాత నేను జరిగిన దానిని మరియు నేను బాప్తీస్మము పొందటానికి సిద్ధంగా ఉన్నానని వివరించటానికి మా మావయ్య దగ్గరకు వెళ్లాను. మా మావయ్య తన ఆశ్చర్యాన్ని దాచలేకపోయాడు. అతడు తన కారులో, విమానాశ్రయానికి వెళ్లి, మరియు ఇంటికి తిరిగి వెళ్లటానికి నా విమాన టిక్కెట్టుతో, మా అమ్మకు “దీనితో నాకేమి సంబంధం లేదు!” మాత్రమే వివరణగల నోటుతో, తిరిగి వచ్చాడు.

ఒక విధంగా అతడు సరిగా చెప్పాడు. నేను మోర్మన్ గ్రంధము యొక్క శక్తి ద్వారా నేరుగా కనుగొనబడ్డాను.

ప్రపంచమంతా ఉన్న అద్భుతమైన మిషనరీల ద్వారా, ప్రతీ సందర్భములో అద్భుతమైన విధానాలలో, అనేకమంది కనగొనబడియుండవచ్చు. లేక వారి బాటలో దేవుడు ఉద్దేశ్యపూర్వకంగా ఉంచిన స్నేహితుల ద్వారా కనుగొనబడియుండవచ్చు. వారు ఈ తరములోని ఎవరో ఒకరి చేత లేక వారి పూర్వీకుల ద్వారా కూడ వారు కనుగొనబడియుండవచ్చు.5 సందర్భము ఏదైనప్పటికినీ, నిజమైన వ్యక్తిగత మార్పు వైపు అభివృద్ధి చెందుటకు బదులుగా, తరువాత కంటే మేలుగా ముందుగానే వారందరు మోర్మన్ గ్రంధములో ఉన్న సత్యము ద్వారా కనుగొనబడాలి మరియు అనుభూతి చెందాలి. అదే సమయంలో, వారు ఆయన ఆజ్ఞలను పాటించుటకు ప్రయాసపడుటకు దేవునికి గంభీరమైన ఒడంబడిక చేయుటకు వారు తప్పక వ్యక్తిగతంగా నిర్ణయించాలి.

బ్యునస్ ఎయిరిస్‌కు తిరిగి వచ్చినప్పుడు, నేను నిజంగా బాప్తీస్మము పొందాలని కోరుతున్నానని మా అమ్మ గ్రహించింది. నేను కాస్త తిరుగుబాటు ఆత్మను కలిగియున్నాను కనుక, నాకు వ్యతిరేకించుటకు బదులుగా, ఆమె చాలా తెలివిగా నన్ను ప్రక్కకు తీసుకొనివెళ్ళింది. దానిని ఎరుగకుండానే, ఆమె స్వయంగా నా బాప్తీస్మపు ఇంటర్యూ చేసింది. వాస్తవానికి, మన మిషనరీలు నిర్వహించే దానికంటే ఆమె ఇంటర్యూ ఇంకా ఎక్కువ లోతైనదని నేను నమ్ముతున్నాను. ఆమె నాతో చెప్పింది: “నీవు బాప్తీస్మము పొందాలని కోరిన యెడల, నేను నీకు సహాయపడతాను.” కానీ మొదట నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాను మరియు నీవు గట్టిగా ఆలోచించి నాకు నిజాయితీగా జవాబివ్వాలని నేను కోరుతున్నాను. నీవు ప్రతీ ఆదివారము సంఘానికి ఖచ్చితంగా హాజరగుటకు ఒడంబడిక చేస్తున్నావా?”

“అవును, నేను దానిని చేయబోతున్నాను,” అని నేను ఆమెతో చెప్పాను.

“సంఘము ఎంత సేపు ఉంటుందో నీకేమైనా తెలుసా?”

“అవును, నాకు తెలుసు,” నేను చెప్పాను.

ఆమె జవాబిచ్చింది, “మంచిది, నీవు బాప్తీస్మము పొందిన యెడల, నీవు హాజరైనట్లు నేను నిశ్చయపరుస్తాను.” తరువాత ఆమె ఎప్పటికీ మద్యపానము త్రాగకుండా లేక పొగత్రాగకుండా ఉండటానికి నేను నిజముగా సమ్మతిస్తున్నానా అని నన్ను అడిగింది.

“అవును, నేను దానికి కూడ విధేయుడను కాబోతున్నానని,” నేను జవాబిచ్చాను.

దానికి ఆమె ఇలా చేర్చింది, “నీవు బాప్తీస్మము పొందిన యెడల, విధేయుడగునట్లు నేను నిశ్చయపరుస్తాను.” దాదాపు ప్రతీ ఆజ్ఞతో ఆ విధానములో ఆమె కొనసాగించింది.

ఆమెను చింతించవద్దని, త్వరలో నేను ఆసక్తిని కోల్పోతానని, చెప్పటానికి మా మావయ్య మా అమ్మకు ఫోను చేసి చెప్పాడు. నాలుగు సంవత్సరాల తరువాత, యురగ్వేలో సేవ చేయుటకు నేను నా పిలుపును పొందినప్పుడు, ఖచ్చితంగా నేను ఎప్పుడు ఆసక్తిని కోల్పోతానని అతడిని అడగటానికి మా అమ్మ మా మావయ్యకు ఫోను చేసింది. సత్యమేదనగా, నేను బాప్తీస్మము పొందిన సమయమునుండి అమ్మ సంతోషముగల తల్లిగా ఉన్నది.

“ఒక మనుష్యుడు దాని సూక్తులననుసరించిన యెడల దేవునికి చేరువగును”6 అనే వాగ్దానమును ప్రత్యక్షంగా అనుభవించుట ద్వారా మార్పు చెందే ప్రక్రియలో మోర్మన్ గ్రంధము ముఖ్యమైనదని నేను తెలుసుకోగలిగాను.

నీఫై మోర్మన్ గ్రంధము యొక్క ప్రధాన ఉద్దేశమును ఈ విధానములో వివరించాడు:

“ఏలయనగా క్రీస్తునందు విశ్వాసముంచమని మరియు దేవునితో సమాధానపడుడని మా సంతానమును మరియు మా సహోదరులను కూడా ఒప్పించుటకు మేము వ్రాయుటకు శద్ధగా కృషి చేయుచున్నాము. …

“మరియు మేము క్రీస్తు గురించి మాట్లాడుచున్నాము, మేము క్రీస్తునందు ఆనందించుచున్నాము, మేము క్రీస్తు గురించి బోధించుచున్నాము (మరియు) మేము క్రీస్తును గూర్చి ప్రవచించుచున్నాము, … మా పిల్లలు వారి పాపముల యొక్క నివృత్తి కొరకు వారు ఏ మూలాధారమును చూడవలెనో మా సంతానము తెలుసుకొనునట్లు.”7

మోర్మన్ గ్రంధమంతా అదేవిధమైన పరిశుద్ధమైన ఉద్దేశముతో నిండియున్నది.

ఈ కారణము చేత, దానిని గూర్చి ప్రార్ధనాత్మతో, గంభీరమైన అధ్యయనము చేయుటకు ఒడంబడిక చేయు పాఠకుడు ఎవరైనా, క్రీస్తును గూర్చి నేర్చుకొనుట మాత్రమే కాదు కాని క్రీస్తు నుండి—ప్రత్యేకంగా వారు “వాక్యము యొక్క గుణమును ప్రయత్నించుటకు”8 నిర్ణయించిన యెడల మరియు ఇతరులు ఎన్నడూ చదవని విషయాలను గూర్చి చెప్పిన దాని చేత పక్షపాతమైన అపనమ్మకము9 కారణము చేత ముందుగా దానిని తిరస్కరించని యెడల నేర్చుకుంటారు.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ పర్యాలోచన చేసారు: “నేను మోర్మన్ గ్రంధమును గూర్చి ఆలోచించినప్పుడు, నేను శక్తి మాటను గూర్చి ఆలోచిస్తాను. మోర్మన్ గ్రంధము యొక్క సత్యములు మన ఆత్మలను స్వస్థపరచుటకు, ఆదరించుటకు, పునఃస్థాపించుటకు, సహాయపడుటకు, బలపరచుటకు, ఓదార్చుటకు, మరియు ఉల్లాసపరచుటకు శక్తి కలిగియున్నది.”10

ఈ మధ్యాహ్నాకాలము మనలో ప్రతీఒక్కరికి నా ఆహ్వానము, మనము ఎంతకాలము సంఘ సభ్యులమై ఉన్నప్పటికిని, మోర్మన్ గ్రంధము యొక్క సత్యముల శక్తి మనల్ని కనుగొని, ప్రతీరోజు వ్యక్తిగత బయల్పాటును మనము శ్రద్ధగా వెదకినప్పుడు, మరొకసారి మనల్ని హత్తుకొనుటకు అనుమతించాలి. మనము దానిని అనుమతించిన యెడల అది ఆవిధంగా చేయును.

మోర్మన్ గ్రంధము యేసు క్రీస్తు యొక్క సంపూర్ణ సువార్తను కలిగియున్నదని, మరియు మనఃపూర్వకమైన హృదయముతో, వారి ఆత్మ యొక్క రక్షణకు జ్ఞానము వెదకు వారికి సమయము తరువాత సమయము దాని యొక్క సత్యమును పరిశుద్ధాత్మ నిర్ధారించునని నేను గంభీరముగా సాక్ష్యమిస్తున్నాను.11 యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. లూకా 15:6; లూకా 15:9, 32 కూడ చూడుము.

  2. దాని విస్తృత భావనలో, ఇశ్రాయేలులో తప్పిపోయిన గోత్రములను సమావేశపరచుటను గూర్చి మాట్లాడు ప్రవచనాల కొరకు లేఖనాల వృత్తాంతములు (see Russell M. Nelson, “The Gathering of Scattered Israel,” Liahona, Nov. 2006, 79–82). అవి తప్పిపోయినప్పటికినీ, అవి ఆయనకు తప్పిపోలేదు (3 నీఫై 17:4 చూడుము). మరియు, ప్రత్యేకంగా వారు తమ గోత్రజనకుని దీవెనను పొందినప్పుడు వారు కనుగొనబడే సమయము వరకు వారు తప్పిపోయారని వారు గ్రహించలేదని గమనించుట ఆసక్తికరమైనది.

  3. ఎల్డర్ డైటర్ ఎఫ్. ఉక్‌డార్ప్ ఆస్సిసి యొక్క పరిశుద్ధుడైన ఫ్రాన్సిస్ వ్యాఖ్యానించారు,“అన్ని సమయములందు సువార్తను ప్రకటించుము, మరియు అవసరమైన యెడల, మాటలను ఉపయోగించుము” (“Waiting on the Road to Damascus,” Liahona, May 2011, 77; William Fay and Linda Evans Shepherd, Share Jesus without Fear [1999], 22 కూడా చూడుము).

  4. మొరోనై 10:4–5.

  5. మన పూర్వీకుడు మార్పు చెందిన వృత్తాంతము మన స్వంత వృత్తాంతము కూడ. “ప్రతీ కడవరి-దిన పరిశుద్ధుడు వారి పూర్వీకుల వృత్తాంతములను తెలుసుకొంటే అది అద్భుతమైన విషయము” (“Live True to the Faith,” Liahona, May 2014, 97). అందువలన, మనమందరం ఏదోవిధంగా మన పూర్వీకుల ద్వారా లేక నేరుగా కనుగొనబడ్డాము, ఆది నుండి అంతము వరకు ఎరిగిన, మన పరలోక తండ్రికి కృతజ్ఞతలు( అబ్రహాము 2:8 చూడుము).

  6. మోర్మన్ గ్రంధమునకు పీఠిక; ఆల్మా 31:5 కూడా చూడుము.

  7. 2  నీఫై 25:23,  26.

  8. ఆల్మా 31:5.

  9. ఆల్మా 32:28 చూడుము.

  10. రస్సెల్ ఎమ్. నెల్సన్, “మోర్మన్ గ్రంధము: అది లేకుండా మీ జీవితం ఎలా ఉంటుంది?Liahona, Nov. 2017,  62.

  11. 3 నీఫై 5:20 చూడుము.