2010–2019
రెండవ గొప్ప ఆజ్ఞ
2019 అక్టోబర్ సర్వసభ్య సమావేశము


రెండవ గొప్ప ఆజ్ఞ

మన సహోదరులకు మరియు సహోదరిలకు సహాయము చేసినప్పుడు మనకు గొప్ప సంతోషము కలుగుతుంది.

నా ప్రియమైన సహోదర, సహోదరిలారా, భూమిపైన, పరలోకములోను ఇశ్రాయేలీయులను పోగుచేయుటలో సహాయము చేయుటకు, మీ కుటుంబాలను బలపరచుటకు మరియు అవసరతలో ఉన్నవారి జీవితాలను దీవించుటకు మీరు చేస్తున్న సమస్తమునకు కృతజ్ఞతలు. యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులుగా జీవిస్తున్నందుకు కృతజ్ఞతలు.1 దేవుని ప్రేమించుము మరియు మీ పొరుగవారిని ప్రేమించుము అనే ఆయన యొక్క రెండు గొప్ప ఆజ్ఞలు మీకు తెలుసు మరియు వాటిని గైకొనుటకు మీరు ఇష్టపడతున్నారు.2

గత ఆరు సంవత్సరాలలో, మేము మధ్య మరియు దక్షిణ అమెరికా, పసిఫిక్ ద్వీపాలు, సంయుక్త రాష్ట్రాలలో అనేక నగరాలకు ప్రయాణించినప్పుడు మేము వేల కొలది పరిశుద్ధులను కలిసాము. మేము ప్రయాణిస్తున్నప్పుడు మీ విశ్వాసాన్ని నిర్మించాలన్నదే మా ఆకాంక్ష. ఐనప్పటికి మేము తిరిగివచ్చినప్పుడు మేము కలిసిన సభ్యులు, స్నేహితులచేత ఎల్లప్పుడు మా విశ్వాసము బలపరచబడింది. మా ఇటీవల అనుభవాలనుండి మూడు అర్థవంతమైన సందర్భాలను నేను మీతో పంచుకోవచ్చునా ?

చిత్రం
న్యూజిలాండ్‌లో అధ్యక్షులు నెల్సన్
చిత్రం
న్యూజిలాండ్‌లో అధ్యక్షులు నెల్సన్

మేలో, నేను, సహోదరి నెల్సన్ ఎల్డర్ గెరిట్ డబ్ల్యూ. గాంగ్ మరియు సహోదరి సూజన్ గాంగ్‌తో కలిసి దక్షిణ పసిఫిక్‌కు ప్రయాణం చేసాము. మేము ఆక్‌లాండ్‌, న్యూజిలాండ్‌లో ఉండగా న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ లో రెండు మసీదు పెద్దలను కలిసే గౌరవం దక్కింది, అక్కడ అప్పటికి రెండు నెలల ముందు భయంకరమైన హింసాకాండలో అమాయకులైన భక్తులు తుపాకీతో కాల్చబడ్డారు.

వేరొక విశ్వాసమునకు చెందిన ఈ సహోదరులకు మా సానుభూతిని తెలిపి, మత స్వేచ్ఛకు పరస్పర నిబద్ధతను పునరుద్ఘాటించాము.

ఈ మసీదులు తిరిగి కట్టుటకు స్వచ్ఛందసేవను, కొంత ఆర్థిక సహాయాన్ని మేము ఇస్తామని చెప్పాము. ఈ ముస్లిం నాయకులతో మా కలయిక, సహోదరత్వమునకు మృదువైన భావవ్యక్తీకరణతో నిండియుండెను.

చిత్రం
అర్జెంటీనాలో చక్రాలకుర్చీల గ్రహీతలు
చిత్రం
అర్జెంటీనాలో చక్రాలకుర్చీల గ్రహీతలు

ఆగష్టులో నేను, సహోదరి నెల్సన్ ఎల్డర్ క్వింటన్ ఎల్. కుక్ మరియు సహోదరి మేరీ కుక్ కలిసి బ్యూనోస్ ఎయ్‌ర్స్, అర్జెంటైనాలో వ్యక్తులను కలిసాము—వారిలో చాలామంది మన విశ్వాసానికి చెందినవారు కారు-మన కడవరి దిన పరిశుద్ధుల దాతృత్వసేవల ద్వారా చక్రాలకుర్చీలు అందించబడి వారి జీవితాలు మార్చబడ్డాయి. వారు క్రొత్తగా కనుగొన్న వారి చలనసాధనము గురించి సంతోషముతో కూడిన కృతజ్ఞతను వారు వ్యక్తపరచినప్పుడు మేము ప్రేరేపించబడ్డాము.

మూడవ అమూల్యమైన గడియ ఇక్కడ సాల్ట్‌లేక్ సిటీలో కొన్ని వారాల క్రితం జరిగింది. నా పుట్టినరోజున 14 సంవత్సరాల వయస్సు కలిగిన ఒక యువతి పంపిన ఒక విశిష్టమైన లేఖ ద్వారా అది జరిగింది-ఆమెకు మేరీ అని పేరుపెడతాను.

ఆమెకు నాకు ఉమ్మడిగా ఉన్న సంగతుల గురించి మేరీ వ్రాసింది: మేము పదిమంది పిల్లలము. మీరు మేండరిన్ మాట్లాడతారు. మా కుటుంబములో నాతోకలిపి ఏడుమంది చైనానుండి దత్తతు తీసుకోబడ్డాము కాబట్టి మేండరిన్ మా మాతృభాష. మీరు గుండె శస్త్రవైద్యులు. నా సహోదరికి రెండుసార్లు గుండె శస్త్రచికిత్సలు జరిగాయి. మీరు రెండు గంటల సంఘాన్ని ఇష్టపడతారు. మేము రెండు గంటల సంఘాన్ని ఇష్టపడతాము. మీకు పరిపూర్ణమైన స్వరస్థాయిని కలిగియున్నారు. నా సహోదరుడు కూడా పరిపూర్ణమైన స్వరస్థాయిని కలిగియున్నాడు. అతడు నాకువలె అంధుడు.”

మేరీ మాటలు నన్ను బలంగా తాకాయి, అవి తనకున్న గొప్ప ఆత్మతో పాటు తన తల్లిదండ్రులకు గల అంకితభావమును తెలియజేస్తున్నాయి.

యేసు క్రీస్తు యొక్క ఇతర అనుచరులవలె కడవరి దిన పరిశుద్ధులు ఎల్లప్పుడు ఇతరులకు సహాయము చేయుటకు, పైకెత్తుటకు, ప్రేమించుటకు మార్గాలు వెతుకుతూ ఉంటారు. ప్రభువు జనులుగా పిలువబడని వారు “ఒకరి భారములు ఒకరు భరించుటకు, … దుఃఖించు వారితో దుఃఖపడుటకు, … ఆదరణ యొక్క అవసరములో ఉన్నవారిని ఆదరించుట[కు]” సమ్మతికలిగినవారు.3

వారు యధార్థముగా మొదటి మరియు రెండవ గొప్ప ఆజ్ఞలను పాటించుటకు వెదకుతారు. మన పూర్ణ హృదయాలతో మనం దేవుని ప్రేమించినప్పుడు, ఆయన మన హృదయాలను ఇతరుల మేలు కొరకు మనోహరమైన, నీతిమంతమైన వలయము వైపునకు త్రిప్పుతారు.

ప్రతి రోజు, ప్రతి సంవత్సరము ప్రపంచమంతటా కడవరి దిన పరిశుద్ధులు చేయు సేవను లెక్కించుట అసాధ్యమే కాని సహాయము అవసరమైన పురుషులను, స్త్రీలను—బాలురను, బాలికలను దీవించుటకు ఒక సంస్థగా సంఘము చేయు మంచిని లెక్కించుట సాధ్యమే.

సంఘము యొక్క మనవతాసేవా కార్యక్రమము 1984లో ప్రారంభించబడింది. తరువాత తూర్పు ఆఫ్రికాలో తీవ్ర కరువుతో ప్రభావితమైన వారికి సహాయము చేయుటకు సంఘములోని సభ్యులందరు పాల్గొని నిధులు సమకూర్చుటకు ఉపవాసము చేసారు. ఆ ఒక్క ఉపవాస దినమున సంఘ సభ్యులు 6.4 మిలియన్ డాలర్లు విరాళమిచ్చారు.

చిత్రం
ఇథియోపియాలో అప్పటి ఎల్డర్ బ్యాలర్డ్

ఈ పవిత్రమైన నిధులు ఏవిధంగా ఉపయోగించవచ్చునో అంచనావేయుటకు ఎల్డర్ ఎమ్. రస్సెల్ బ్యాలర్డ్ మరియు సహోదరుడు గ్లెన్ ఎల్. పేస్ ఇథియోపియాకు పంపబడ్డారు. తరువాత ఈ ప్రయత్నము కడవరి దిన పరిశుద్ధుల దాతృత్వసేవలుగా పిలువబడ సంస్థకు ఆరంభమని నిరూపించబడినది.

ఆ సమయము నుండి, కడవరి దిన పరిశుద్ధుల దాతృత్వసేవలు రెండు బిలియన్ డాలర్లకంటే ఎక్కువ నిధులను ప్రపంచమంతటా అవసరతలో ఉన్నవారికి సహాయము చేయుటకు సమకూర్చెను. ఈ సహాయము సంఘముతో సంబంధము లేకుండా, జాతీయత, జాతి, లింగబేధము, లింగము లేదా రాజకీయ ఒత్తిళ్ళకు అతీతముగా గ్రహీతలకు ఇవ్వబడింది.

ఇది మాత్రమే కాదు. అవసరతలో ఉన్న ప్రభువు యొక్క సంఘ సభ్యులకు సహాయము చేయుటకు, ప్రాచీన ఉపవాస చట్టమును మేము ఇష్టపడతాము మరియు పాటిస్తాము.4 ఆకలిగొన్నవారికి సహాయము చెయ్యుటకు మనము అన్నపానములు చెయ్యము. అవసరతలో ఉన్నవారికి సహాయము చేయుటకు ప్రతి నెల ఒకరోజు ఆహరము తినకుండా ఉండి, ఆ ఆహారానికి అయ్యే ఖర్చును (ఇంకా ఎక్కువే) విరాళముగా ఇస్తాము.

1986లో పశ్చిమ ఆఫ్రికాకు నా మొదటి పరామర్శను నేనెప్పుడు మరిచిపోను. మా కూడికలకు పరిశుద్ధులు గొప్ప సంఖ్యలో వచ్చారు. వారికి భౌతికవనరులు చాలా తక్కువ ఉన్నప్పటికి, ఎక్కువమంది మరకలేని తెల్లని దుస్తులు ధరించి వచ్చారు.

అంత తక్కువ వనరులు కలిగిన సభ్యులను ఆయన ఏవిధంగా సంరక్షిస్తున్నారని స్టేకు అధ్యక్షునిని అడిగాను. బిషప్పులకు వారి జనులు బాగా తెలుసని ఆయన సమాధానమిచ్చారు. సభ్యులు రెండు పూటలా భోజనము సమకూర్చుకోగలిగితే వారికి ఏ సహాయము అవసరం ఉండదు. కాని వారు—తమ కుటుంబ సహాయముతో కలిపి—ఒక భోజనము లేదా అంతకంటే తక్కువ సమకూర్చుకోగలిగితే, బిషప్పులు ఉపవాస కానుకగా ఇవ్వబడినదానినుండి ఆహారమును సమకూరుస్తారు. తరువాత ఆయన ఈ గమనించదగ్గ అంశాన్ని చెప్పారు: వారి ఉపవాస కానుకలు సాధారణంగా వారి ఖర్చులకంటే ఎక్కువగా ఉంటాయి. తరువాత మిగులు ఉపవాస కానుకలు వేరే ప్రదేశంలో వారి కంటే ఎక్కువ అవసరతలో ఉన్నవారికి పంపబడతాయి. పరాక్రమముగల ఆ ఆఫ్రికా పరిశుద్ధులు చట్టము యొక్క శక్తి మరియు ఉపవాసము యొక్క స్ఫూర్తి గురించి ఒక గొప్ప పాఠాన్ని నేర్పించారు.

సంఘ సభ్యులుగా ఏవిధంగానైనా బాధపడతున్నవారిని అర్థముచేసుకొంటాము.5 దేవుని యొక్క కుమారులు, కుమార్తెలుగా మనందరము సహోదరులము మరియు సహోదరిలము. పాతనిబంధన ఉపదేశమును మనం అనుసరిస్తాము: “నీ సహోదరులగు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీ కాజ్ఞాపించు చున్నాను.”6

మత్తయి 25లో లిఖించబడిన ప్రభువైన యేసు క్రీస్తు బోధనలను అనుసరించి జీవించుటకు మనం ప్రయత్నిస్తాము:

“నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని, నన్ను చేర్చుకొంటిరి. . . .

“దిగంబరినై యుంటిని, నాకు బట్ట లిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి. …

“… మక్కిలి అల్పులైన యీ నా సహోదరు లలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి.”7

రక్షకుని యొక్క ఈ బోధనలను సంఘము ఏవిధంగా అనుసరిస్తుందో చెప్పుటకు నన్ను కొన్ని ఉదాహరణలు ఇవ్వనివ్వండి.

చిత్రం
బిషప్పు నిల్వగృహము

ఆకలిగొన్నవారి ఆకలిని తీర్చుటకు సంఘము ప్రపంచమంతటా 124 బిషప్పు నిల్వకేంద్రాలను నిర్వహిస్తుంది. వాటిద్వారా అవసరతలో ఉన్న వ్యక్తులకు ప్రతి సంవత్సరము దాదాపు 400,000 ఆహారము కొరకు విన్నపాలు నెరవేర్చబడతాయి. నిల్వగృహాలు లేని ప్రాంతాలలో, అవసరతలో ఉన్న వారి సభ్యులకు ఆహారము, సరుకులు సమకూర్చుటకు బిషప్పులు, శాఖాధ్యక్షులు ఉపవాస కానుక నుండి నిధులు తీసుకొని సహాయము చేస్తారు.

ఐనప్పటికి ఆకలి సమస్య సంఘ హద్దులు మీరి అధికముగా ఉంటుంది. అది ప్రపంచమంతటా పెరుగుతున్నది. పౌష్టికాహారము అందని ప్రజలు ప్రపంచంలో ఇప్పుడు 820 మిలియన్ల కంటే ఎక్కువ—లేదా దాదాపు భూమిమీద నివసించేవారిలో తొమ్మిది మందిలో ఒకరు ఉన్నారని సంయుక్త రాష్ట్రాల ఇటీవల నివేదిక సూచిస్తున్నది.8

ఇది చాలా ఆందోళనకరమైన గణాంకము! మీ సహాయము కొరకు మేమెంతో కృతజ్ఞత కలిగియున్నాము. మీ హృదయపూర్వక ఔదార్యము వలన ప్రపంచమంతటా ఉన్న మిలియన్ల ప్రజలు వారికి చాలా అవరమైన ఆహారము, దుస్తులు, తాత్కాలిక వసతి, చక్రాలకుర్చీలు, మందులు, స్వచ్ఛమైన మీరు ఇంకా ఎన్నో పొందుతారు.

ప్రపంచమంతటా ఎక్కువ రోగములు కలుషితమైన నీటివలన వస్తాయి. ఇప్పటి వరకు, సంఘము యొక్క మనవతావాద కార్యక్రమము 76 దేశాలలో వందల కొలది సమాజాలకు స్వచ్ఛమైన నీటిని అందించుటకు సహాయము చేసింది.

కాంగో యొక్క డిమోక్రటిక్ రిపబ్లిక్, లుపుటలో ఒక ప్రాజెక్టు గొప్ప ఉదాహరణ. 100,000 మంది కంటే ఎక్కువ జనాభా ఉన్న ఆ పట్టణములో నీటి సరఫరా లేదు. ప్రజలు సురక్షితమైన నీటి వనరుల కొరకు చాలా దూరము నడవవలసి వచ్చేది. ఆ పట్టణమునుండి 18 మైళ్ళ (29 కిలోమీటర్ల) దూరంలో ఒక పర్వత వాగును కనుగొన్నప్పటికి, ఆ పట్టణ ప్రజలు అనుదినము ఆ నీటిని పొందలేకపోయారు.

చిత్రం
నీటికొరకు ఒక కాలువ త్రవ్వడం

ఈ సవాలు గురించి మన మనవతావాద సువార్తపరిచారకులు నేర్చుకొన్నప్పుడు, ఆ పట్టణమునకు ఏవిధంగా పైపులు వెయ్యాలో శిక్షణనిచ్చుట ద్వారా, సామాగ్రిని సరఫరా చేయుట ద్వారా వారు లుపుట యొక్క నాయకులతో కలిసి పనిచేసారు. అడవి మరియు రాళ్ళతో కూడిన మార్గములో ఒక మీటరు లోతు కాలువను తవ్వుటకు లుపుట ప్రజలు మూడు సంవత్సరాలు గడిపారు. కలిసి పనిచేయుట ద్వారా చివరకు ఆ పట్టణములో ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన మంచి నీరు అందుబాటులోకి వచ్చే సంతోషకరమై దినము వచ్చింది.

చిత్రం
నీటిని మోసుకొని వెళ్ళుట

అంతర్యుద్ధము, ప్రకృతి వైపరిత్యాలు లేదా మతపరమైన హింసకు గురైన శరణార్ధులకు కూడా సంఘము సహాయము చేస్తుంది. 70 మిలియన్ల కంటే ఎక్కువ మంది వారి గృహాలనుండి తరిమివెయ్యబడ్డారు.9

చిత్రం
శరణార్ధులకు పరిచర్య చేయుట

2018 సంవత్సరములోనే, 56 దేశాలలో ఉన్న శరణార్ధులకు అత్యవసర సరుకులను సమకూర్చింది. దానికి అదనముగా, ఈ శరణార్థులు క్రొత్త సమాజాలలో కలిసిపోవుటకు శరణార్ధులకు సహాయము చేయుటకు సంఘ సభ్యులు తమ సమయాన్ని స్వచ్ఛందంగా గడుపుతారు. క్రొత్త గృహాలను ఏర్పరచుకొనుటకు ప్రయత్నిస్తున్నవారికి సహాయము చేయుటకు వెళ్ళుచున్న మీలో ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాము.

చిత్రం
వస్త్రాల పంపకము

సంయుక్త రాష్ట్రాలలో ఉన్న డిసరెట్ పరిశ్రమల అంగళ్ళకు ఉదారముగా ఇచ్చే విరాళాల ద్వారా ప్రతి సంవత్సరము మిలియన్ల కిలోల దుస్తులు సేకరించబడి, వేరుచెయ్యబడతాయి. ప్రాంతీయ బిషప్పులు అధిక సంఖ్యలో ఉన్న ఈ దుస్తులు మరియు ఇతర వస్తువులు అవసరతలో ఉన్నసభ్యులకు సహాయము చేయుటకు ఉపయోగించగా, ప్రపంచ వ్యాప్తముగా వీటిని పంచుటకు అత్యధిక మొత్తము ఇతర దాతృత్వ సంస్థలకు దానంగా ఇవ్వబడతాయి.

మరియు కేవలం గత సంవత్సరము 35 దేశాలలో ఉన్న 300,000 కంటే ఎక్కువ మందికి కంటి సంరక్షణను, అప్పుడే జన్మించిన వారి సంరక్షణను 39 దేశాలలో ఉన్న వేలకొలది తల్లులకు, పసిపిల్లలకు మరియు డజన్ల కొలది దేశాలలో నివసిస్తున్న 50,000 కంటే ఎక్కువ మందికి చక్రాలకుర్చీలు సంఘము సమకూర్చింది.

విషాదము జరిగినప్పుడు సహాయము చేయుటకు ముందుండే వారిలో మన సంఘము ప్రసిద్ధి చెందింది. హరికేన్ ఇంకా రాకముందే, ఆ ప్రభావిత ప్రాంతాలలో సంఘ నాయకులు మరియు సిబ్బంది ఆ తాకిడికి లోనైయ్యే వారికి ఉపశమన సరఫరాలు, స్వచ్ఛంద సేవలు ఏవిధంగా అందివ్వగలరో ప్రణాళికలు చేస్తున్నారు.

చిత్రం
సహాయము చేయు చేతులతో సేవ చేయుట

గత సంవత్సరములోనే, హరికేన్లు, అగ్నిప్రమాదాలు, వరదలు, భూకంపాలు మరియు ఇతర ప్రకృతి వైపరిత్యాల బాధితులకు సహాయము చేయుచు సంఘము ప్రపంచమంతటా 100 కంటే ఎక్కువ విపత్తు-ఉపశమన ప్రాజెక్టులు నిర్వహించింది. సాధ్యమైనప్పుడెల్లా, విపత్తు చేత బాధించబడినవారికి సహాయము చేయుటకు మన సంఘ సభ్యులు పసుపురంగు సహాయ హస్తాల చొక్కాలను ధరించి గొప్ప సంఖ్యలో సంచరిస్తారు. మీలో అనేకులు చేయు ఇటువంటి సేవే పరిచర్య యొక్క అసలైన సారాంశము.

ప్రియమైన సహోదర సహోదరిలారా, నేను వివరించిన కార్యక్రమాలు యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క పెరుగుచున్న సంక్షేమ మరియు మనవతావాద కార్యక్రమాల యొక్క చిన్న భాగము మాత్రమే.10 మీరేఇదంతా సాధ్యమయ్యేలా చేసారు. మీ మాదిరికరమైన జీవితాలవలన, మీ ఉదార హృదయాలవలన, మీ సహాయ హస్తాల వలన, అనేక సమాజాలు మరియు ప్రభుత్వ నాయకులు మీ ప్రయత్నాలను కొనియాడుచున్నారు.11

నేను సంఘ అధ్యక్షునిగా అయినప్పటినుండి, ఎంతమంది అధ్యక్షులు, ప్రధాన మంత్రులు, రాయబారులు వారి ప్రజలకు చేసిన మనవతావాద సహాయము కొరకు హృదయపూర్వకముగా నాకు కృతజ్ఞతలు తెలిపారో దానికి నేను ఆశ్చర్యపోయాను. నమ్మకమైన, తోడ్పడు పౌరులుగా తమ దేశానికి మన విశ్వాసులైన సంఘ సభ్యులు తెచ్చే బలము గురించి వారు తమ కృతజ్ఞత తెలిపారు.

వారి దేశములలో సంఘము స్థాపించబడాలని తమ ఆకాంక్షను వ్యక్తపరుస్తు ప్రపంచ నాయకులు ప్రథమ అధ్యక్షత్వమును దర్శించుట గురించి కూడా నేను ఆశ్చర్యమును పడ్డాను. ఎందుకు? ఎందుకంటే కడవరి దిన పరిశుద్ధులు వారెక్కడ నివసిస్తారో అక్కడ బలమైన కుటుంబాలను, సమాజాలను నిర్మించుటకు ఇతరులకు తమ జీవితాలను ఉత్తమముగా తీర్చిదిద్దుటకు సహాయపడతారని వారికి తెలుసు.

మనమెక్కడ జీవిస్తున్నప్పటికి, సంఘ సభ్యులు తండ్రి యొక్క పితృత్వము మరియు మానవజాతి యొక్క సహోదరత్వము గురించి ఉత్సాహాన్ని చూపిస్తారు. కాబట్టి, ఈ అద్భుతమైన ప్రపంచములో మనమెక్కడ జీవిస్తున్నప్పటికి మన సహోదర, సహోదరిలకు సహాయము చేసినప్పుడు మనకు గొప్ప ఆనందము కలుగుతుంది.

ఇతరులకు సహాయము చెయ్యుట—మన కొరకు మనం సంరక్షించుకొనుటకంటే ఎక్కువగా ఇతరులను సంరక్షించుటకు నిజాయితీతో మన ప్రయత్నాలు చెయ్యడమే—మన సంతోషము. మరి ముఖ్యముగా, అది మనకు అనుకూలముగా లేనప్పుడు, మనం సాధారణంగా చెయ్యని పనులు చెయ్యవలసివచ్చినప్పుడు అని నేను చెప్పవచ్చును.యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులుగా అగుటకు రెండవ గొప్ప ఆజ్ఞను గైకొనుట కీలకము.

ప్రియమైన సహోదర, సహోదరిలారా. యేసు క్రీస్తు యొక్క బోధనలు అనుసరించుట ద్వారా వచ్చు ఫలాలకు మీరందరు సజీవ సాక్ష్యాలు. నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను! నేను నిన్ను ప్రేమిస్తున్నాను.”

దేవుడు సజీవుడని నేను సాక్ష్యమిస్తున్నాను! యేసే క్రీస్తు. ఆయన సంఘము దానియొక్క దివ్యమైన ఉద్దేశాలు నెరవేర్చబడుటకు ఈ కడవరి దినాలలో పునఃస్థాపించబడినది. ఆవిధంగా నేను యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

ముద్రించు