మన వాగ్దానాలు మరియు నిబంధనలు నిలబెట్టుకొనుట
మీ మాటే, మీ వాగ్దానమని తెలుసుకొని ప్రభువుతో మరియు ఇతరులతో మీరు చేయు వాగ్దానాలు, నిబంధనలు గొప్ప చిత్తశుద్ధితో పరిగణించాలని నేను మిమ్ములను ఆహ్వానిస్తున్నాను.
ప్రియమైన సహోదర, సహోదరిలారా, మనం ఈ సమావేశమును ముగించుచుండగా, నేడు యేసు క్రీస్తు సువార్త యొక్క సత్యముల గురించి చెప్పబడిన సాక్ష్యములను మనలో ప్రతిఒక్కరం మన హృదయాలలో నిలుపుకొందుము గాక. మనం ఆయన సేవకులమని, ఆయన మన రక్షకుడని ప్రభువైన యేసు క్రీస్తుకు మనం చేసిన వాగ్దానమును బలపరచుటకు మనందరం కలిసి ఈ పరిశుద్ధమైన సమయాన్ని కలిగియున్నందుకు మనం ధన్యులము.
వాగ్దానాలు మరియు నిబంధనలు చెయ్యడం వాటిని గైకొనడం యొక్క ప్రాముఖ్యత గురించి నేను లోతుగా ఆలోచిస్తున్నాను. మీ మాట నిలబెట్టుకొనుట, నమ్మబడుట, మీరు చేస్తారని చెప్పిన దానిని చేయుట, మీ పరిశుద్ధ నిబంధనలను గౌరవించుటకు శ్రమపడుట, చిత్తశుద్ధిని కలిగియుండుట మీకెంత ప్రాముఖ్యమైనవి? ప్రభువుకు మరియు ఇతరులకు చేసిన మన వాగ్దానాలకు యదార్ధముగా జీవించుట ద్వారా మన పరలోకమందున్న తండ్రి యొద్దకు తిరిగి వెళ్లే నిబంధన మార్గములో మనము నడుస్తాము మరియు మన జీవితాలలో ఆయన ప్రేమను అనుభవిస్తాము.
వాగ్దానాలు మరియు నిబంధనలు చెయ్యడం, వాటిని గైకొనడం విషయంలో మన రక్షకుడైన యేసు క్రీస్తు మనకు గొప్ప మార్గదర్శిగా ఉన్నారు. తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తానని వాగ్దానము చేసి ఆయన భూమిపైకి వచ్చారు. మాటలో, క్రియలో సువార్త సూత్రాలను ఆయన మనకు బోధించారు. మనం తిరిగి జీవించునట్లు మన పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తము చేసారు. ఆయన తన వాగ్దానములలో ప్రతీఒక్కదానిని ఘనపరచెను.
మనలో ప్రతి ఒక్కరి గురించి అదే చెప్పగలరా? మనం కొంచెం మోసం చేసి, శోధనలకు తావిచ్చి లేదా మన వాగ్దానాలను నిలబెట్టుకోనట్లైతే కలిగే అపాయములు ఏమిటి? ఒక వేళ మన నిబంధనలను విడిచిపెడితే? ఇతరులు మన మాదిరి యొక్క వెలుగులో క్రీస్తు యొద్దకు వస్తారా? మీ మాట మీ వాగ్దానముగా ఉన్నదా? వాగ్దానాలను నిలబెట్టుకోవడం ఒక అలవాటు కాదు; అది యేసు క్రీస్తుకు శిష్యునిగా ఉండుటకు కావలసిన ఒక లక్షణము.
మర్త్య జీవితములో మన బలహీనతలు ఎప్పటికప్పుడు గుర్తుంచుకొని, ప్రభువు ఇలా వాగ్దానము చేసారు, “కాబట్టి, భయపడక ధైర్యముగా నుండుడి, ఏలయనగా ప్రభువైన నేను మీతో ఉన్నాను, మీ ప్రక్కన నిలిచెదను.”1 తిరిగి అభయమివ్వబడుట, ఆదరణ, లేక గొప్ప ఆత్మీయ పరిజ్ఞానము లేదా బలము నాకు అవసరమైనప్పుడు, ఆయన సన్నిధిని నేను అనుభూతిచెందాను మరియు ఆయన దివ్యమైన సహవాసము వలన నేను లోతైన వినయునిగా చేయబడ్డాను మరియు కృతజ్ఞత కలిగియున్నాను.
ప్రభువు ఇలా చెప్పారు, “తన పాపములను విడిచిపెట్టి, నా నామమును బట్టి ప్రార్థన చేయుచు, నా మాటకు లోబడి, నా ఆజ్ఞలను గైకొని నా యొద్దకు వచ్చు ప్రతీ ఆత్మ నా ముఖమును చూచి, నేను ఉన్నవాడను అని తెలుసుకొనును.”2 బహుశా ఇది ఆయన వాగ్దానాలన్నింటిలో గొప్పది.
నా మాటపై నిలబడుట యొక్క ప్రాముఖ్యత గురించి నా యౌవనములో నేను నేర్చుకున్నాను. అటువంటి ఒక ఉదాహరణ ఏమిటంటే స్కౌటు ప్రతిజ్ఞ చేయుటకు నేను నిటారుగా నిలబడినప్పుడు. అమెరికా యొక్క బాలుర స్కౌట్లతో మా సహవాసము, ఇప్పుడది ముగిసెను, కాని అది ఎల్లప్పుడు నాకు మరియు ఈ సంఘానికి ముఖ్యమైన వారసత్వము. స్కౌటు సంస్థకు, స్కౌటు నాయకులుగా శ్రద్ధగా పని చేసిన అనేక మంది స్త్రీ పురుషులకు, తల్లులకు—నిజమైన ఘనత వీరికే చెల్లుతుంది—మరియు స్కౌటింగులో పాల్గొన్న యువకులకు, మేము “ధన్యవాదాలు” తెలియజేస్తున్నాము.
ఈ కాలములోనే, మన ప్రియమైన ప్రవక్త, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మరియు ఎల్డర్ క్వింటన్ ఎల్. కుక్ సర్దుబాట్లను ప్రకటించారు, అవి మన ఆసక్తిని తిరిగి మన యువతపైన దృష్టిసారించి మన సంస్థలను బయలుపరచబడిన సత్యముతో సమరేఖలోనికి తెచ్చును. అదనముగా, గత ఆదివారమే, అధ్యక్షులు నెల్సన్ మరియు అధ్యక్షులు ఎమ్. రస్సెల్ బ్యాలర్డ్ మొత్తము సంఘము కొరకు యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము యొక్క పిల్లలు మరియు యువతకు క్రొత్త కార్యక్రమమును వివరించారు. ఇది మన ప్రభువును, రక్షకుడైన యేసు క్రీస్తు పైన దృష్టిసారించబడిన ప్రపంచవ్యాప్త ప్రథమయత్నం. ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహము ఈ క్రొత్త నిర్దేశము విషయములో ఏకమయ్యారు, మరియు మార్గములో మేము తీసుకున్న ప్రతి నిర్ణయములో ప్రభువు మమ్మల్ని నడిపించారని నా వ్యక్తిగత సాక్ష్యమిస్తున్నాను. సంఘము యొక్క పిల్లలు మరియు యువత—గృహములోను, సంఘములోను—సువార్త నేర్చుకోవడం, సేవ మరియు ప్రోత్సాహకార్యక్రమాలు, వ్యక్తిగత అభివృద్ది ద్వారా వారిపై పెట్టిన ఈ ఏకీకృత దృష్టిని అనుభూతి చెందడం గురించి నేను చాలా ఉత్తేజాన్ని పొందుతున్నాను.
ఈ రాబోయే 2020 సంవత్సరానికి యువత కొరకు ఇతివృత్తము, “వెళ్లి, చేయుము”3 అనే నీఫై యొక్క ప్రాచీన వాగ్దానము గురించి మాట్లాడును. అతడు ఇలా వ్రాసెను, “మరియు ఇది జరిగెను, నీఫై అను నేను నా తండ్రితో చెప్పితిని: నేను వెళ్ళి మరియు ప్రభువు ఆజ్ఞాపించిన కార్యములను చేయుదును, ఏలయనగా ప్రభువు మనుష్య సంతానమునకు తాను, వారికి ఆజ్ఞాపించిన కార్యమును వారు నెరవేర్చునట్లు వారి కొరకొక మార్గమును సిద్ధపరచక ఆయన ఎట్టి ఆజ్ఞలను ఇయ్యడని నేనెరుగుదును.”3 ఇది చాలా కాలం క్రితం చెప్పబడినప్పటికినీ, సంఘములో మనము నేడు ఆ వాగ్దానమునకు కట్టుబడి ఉంటాము.
“వెళ్ళి, చేయుము” అనగా లోకవిధానములో కాక ప్రభువు విధానములో చేయుట, వ్యక్తగత బయల్పాటు పొంది, దాని ప్రకారము పనిచేయుట, భవిష్యత్తుపైన నిరీక్షణ మరియు విశ్వాసము కలిగి నీతికరముగా జీవించుట, యేసు క్రీస్తును అనుసరించుటకు నిబంధనలు చేసుకొని, వాటిని పాటించడం తద్వారా లోక రక్షకుడైన ఆయన కొరకు మన ప్రేమను పెంపొందించుట.
ఒక నిబంధన అనేది ప్రభువు మరియు మనకు మధ్య రెండు- వైపుల వాగ్దానము. సంఘ సభ్యులుగా, బాప్తీస్మము పొందు సమయంలో యేసు క్రీస్తు నామమును మనపైకి తీసుకొని, ఆయన జీవించినట్లుగానే జీవిస్తామని నిబంధన చేస్తాము. మోర్మన్ యొక్క జలముల వద్ద బాప్తీస్మము పొందిన వారివలె, “అవి తేలికగునట్లు ఒకరి భారములు ఒకరు భరించుటకు; … “దుఃఖించు వారితో దుఃఖపడుటకు “ఆదరణ యొక్క అవసరములో ఉన్నవారిని ఆదరించుటకు; … అన్ని సమయములలో, అన్ని విషయములలో, అన్ని స్థలములలో దేవునికి సాక్షులుగా నిలబడుటకు”4 ఆయన జనులు అవుతామని మనం నిబంధన చేస్తాము. సంఘంలో మనం ఒకరికొకరం మన పరిచర్య చెయ్యడం వలన ఆ వాగ్దానాలను గౌరవించుటకు మన నిబద్ధతను తెలుపుతుంది.
మనం సంస్కారములో పాలుపొందినప్పుడు, మనపైన ఆయన నామమును తీసుకొంటామన్న ఆ నిబంధనను క్రొత్తదిగా చేస్తాము మరియు మెరుగుపరచుకొనుటకు అదనపు వాగ్దానాలు చేస్తాము. మన అనుదిన ఆలోచనలు, చర్యలు అవి చిన్నవైన, పెద్దవైన ఆయన యెడల మన నిబద్ధతను కనపరుస్తాయి. బదులుగా ఆయన పరిశుద్ధ వాగ్దానమేమనగా, “మీరు ఎల్లప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనిన యెడల, మీరు నా ఆత్మను మీతో కలిగియుందురు.”5
నేడు నా ప్రశ్న ఏమిటంటే, మన వాగ్దానాలను, నిబంధనలను నిలబెట్టుకొంటామా లేదా అవి కొన్నిసార్లు హృదయపూర్వకంగా చేయని వాగ్దానాలు, మామూలుగా చేయబడినవి, అందువలన అవి సులభంగా భగ్నము చేస్తామా? “నేను నీ కొరకు ప్రార్థస్తాను,” అని ఎవరితోనైనా చెప్పినప్పుడు, మనం చేస్తామా? “సహాయము చెయ్యడానికి నేను వస్తాను” అని వాగ్దానము చేసినప్పుడు, మనం చేస్తామా? ఒక అప్పును తీర్చుటకు మనం బద్ధులుగా ఉన్నప్పుడు, మనం తీరుస్తామా? మన తోటి సభ్యుడ్నిఒక క్రొత్త పిలుపులో బలపరచుటకు మన చేతులను పైకి ఎత్తినప్పుడు, దాని అర్ధము సహకారము అందించుట. అలా మనం చేస్తామా?
నా యౌవనములో ఒక సాయంకాలమున, మా అమ్మ నాతోపాటు మంచము చివర కూర్చొని, జ్ఞాన వాక్యమును పాటించవలసిన ప్రాముఖ్యత గురించి నాతో ఉద్రేకముగా మాట్లాడింది. “జ్ఞాన వాక్యమును పాటించకపోవడం వలన కోల్పోవు ఆత్మీయత మరియు సున్నితత్వము అనేక సంవత్సరాల నుండి ఇతరుల అనుభవాలనుండి నాకు తెలుసు,” అని ఆమె చెప్పింది. ఆమె సూటిగా నా కళ్ళలోకి చూసింది, మరియు ఆమె మాటలు నా హృదయంలోనికి చొచ్చుకొనిపోయినట్లు భావించాను: “రోన్నీ (ఆమె నన్ను రోనీ అని పిలిచేది), నీవు ఎల్లప్పుడు జ్ఞాన వాక్యమును పాటిస్తావని ఈ రోజు నాకు వాగ్దానము చెయ్యి.” నేను గంభీరముగా ఆమెకు ఆ వాగ్దానమును చేసాను, మరియు ఇన్ని సంవత్సరాల వరకు దానికి నేను కట్టుబడి ఉన్నాను.
నా యౌవనములో ఉన్నప్పుడు, ఆ తరువాత సంవత్సరాలలో నేను వ్యాపారస్తులతో ఉన్నప్పుడు దారాళముగా మద్యము లభించినప్పుడు ఆ వాగ్దానము నాకు సహాయపడింది. దేవుని చట్టాలు అనుసరించాలని ముందుగానే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, మరియు దానిని పాటిస్తానా అని తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. “నేను సెలవిచ్చిన దానిని మీరు చేసిన యెడల, ప్రభువైన నేను బద్ధుడనైయుందును; కాని నేను సెలవిచ్చినది మీరు చేయని యెడల మీకు ఏ వాగ్దానమైనను ఉండదు”6 అని ప్రభువు చెప్పెను. జ్ఞాన వాక్యమును పాటించు వారికి ఆయన ఏమని చెప్పుచున్నారు? మనం ఆరోగ్యాన్ని, బలాన్ని, తెలివిని, జ్ఞానాన్ని, మనల్నికాపాడటానికి దేవదూతలను కలిగియుంటామనే వాగ్దానమును కలిగియుంటాము.7
కొన్ని సంవత్సరాల క్రితం, సహోదరి రాస్‌బాండ్ మరియు నేను మా కుమార్తెలలో ఒకరి బంధన కొరకు సాల్ట్ లేక్ దేవాలయము వద్ద ఉన్నాము. ఆ మతకార్యమునకు హాజరగుటకు తగిన వయస్సులేని మా చిన్న కుమార్తెతో మేము దేవాలయము బయట నిలబడినప్పుడు, దేవుని యొక్క దేవాలయములో బంధింపబడుట యొక్క ప్రాముఖ్యత గురించి మేము మాట్లాడాము. నా తల్లి అనేక సంవత్సరాల క్రితం బోధించినట్లుగా, మా కుమార్తెతో మేము ఇలా చెప్పాము, “నీవు సురక్షితముగా దేవాలయములో బంధింపబడాలని మేము కోరుతున్నాము, మరియు నీవు నీ నిత్యభాగస్వామిని కనుగొన్నప్పుడు, దేవాలయములో బంధింపబడడానికి అతనితో నీవు ఒక తేదిని నిర్ణయిస్తావని నీవు మాకు వాగ్దానము చేయాలని మేము కోరుతున్నాము.” ఆమె మాకు మాట ఇచ్చింది.
ఆమెతో మాట్లాడటం మరియు ఆమె వాగ్దానము ఆమెను కాపాడిందని, “ఏది అతి ముఖ్యమైనదో” ఆమెకు గుర్తు చేసిందని అప్పటినుండి ఆమె పేర్కోన్నది. తరువాత ఆమె తన భర్తతో దేవాలయములో బంధింపబడినప్పుడు పరిశుద్ధ నిబంధనలు చేసింది.
అధ్యక్షులు నెల్సన్ ఇలా బోధించారు: “మనం … పరిశుద్ధ నిబంధనలు చేసి, ఆ నిబంధనలను ఖచ్చితంగా పాటించినప్పుడు, మన జీవితాలలో రక్షకుని శక్తిని పెంచుకోగలగుతాము. మన నిబంధనలు మనల్ని ఆయనతో బంధించును మరియు మనకు దేవుని శక్తిని ఇస్తాయి.”8
మనం ఒకరినొకరితో చేసిన వాగ్దానాలు నెరవేర్చినప్పుడు, ప్రభువుతో చేసిన వాగ్దానాలను మనము నెరవేర్చే అవకాశము ఎక్కువ ఉంటుంది. ప్రభువు మాటలను జ్ఞాపకము చేసుకోండి: “మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చ యముగా మీతో చెప్పుచున్నాను.”9
లేఖనాలలో ఉన్న వాగ్దానాలకు ఉదాహరణలను గూర్చి నాతో కలిసి ఆలోచించండి. “దేవుని వాక్యమును బోధించుటకు”10 మోర్మన్ గ్రంథములో అమ్మోన్ మరియు మోషైయ కుమారులు నిబద్ధత కలిగియుండిరి. లేమనీయుల సైనికులచేత అమ్మోన్ బంధించబడినప్పుడు, అతడు లేమనీయుల రాజైన లమోనై యొద్దకు తీసుకొనివెళ్ళబడెను. “నేను నీ సేవకునిగా ఉండెదనని”11 అతడు రాజుకు వాగ్దానము చేసెను. రాజు యొక్క గొర్రెలను దొంగిలించుటకు దాడులు జరుపువారు వచ్చినప్పుడు, అమ్మోన్ వారి చేతులను నరికెను. ఆ రాజు ఎంత ఆశ్చర్యపోయెనంటే, అతడు అమ్మోన్ యొక్క సువార్త సందేశమును విని, పరివర్తన చెందెను.
పాత నిబంధనలో, రూతు తన అత్తకు “నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను”12 అని వాగ్దానము చేసెను. ఆమె తన మాటకు కట్టుబడి ఉండెను. క్రొత్త నిబంధన ఉపమానములో మంచి సమరయుడు, గాయపడిన ప్రయాణికుని సంరక్షించిన యెడల ఆ పూట కూళ్లవానికి “నీవింకేమైనను ఖర్చు చేసినయెడల నేను మరల వచ్చినప్పుడు అది నీకు తీర్చెదను”13 అని వాగ్దానము చేసెను. మోర్మన్ గ్రంథములో నీఫై, అతని సహోదరులతో అరణ్యములోకి వెళ్ళెదనని, జోరమ్ వాగ్దానము చేసెను. “జోరమ్ మాతో ప్రమాణము చేసినప్పుడు, అతనిని గూర్చి మా భయములు తొలగిపోయెను”14 అని నీఫై వివరించెను.
“పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును”15 అని లేఖనాలలో వర్ణించబడినట్లుగా “తండ్రులకు చెయ్యబడిన” ప్రాచీన వాగ్దానము విషయమమేమిటి? పూర్వ-మర్త్య జీవితములో మనం దేవుని ప్రణాళికను ఎన్నుకొన్నప్పుడు, తెరకు ఇరువైపులా ఉన్న ఇశ్రాయేలీయులను సమకూర్చుటకు సహాయపడుటకు మనం వాగ్దానము చేసాము. “ప్రభువుతో మనం భాగస్వామ్యంలోకి చేరాము,” అని ఎల్డర్ జాన్ ఏ.విడ్సోయ్ అనేక సంవత్సరాల క్రితం వివరించారు. “ప్రణాళికను అమలు చెయ్యడం తండ్రి యొక్క కార్యము మరియు రక్షకుని కార్యము మాత్రమే కాదు, కానీ మన కార్యము కూడా.”16
“సమకూర్చుట అనేది ఈరోజు భూమిపైన జరుగుతున్న వాటిలో అత్యంత ముఖ్యమైన విషయము,” అని అధ్యక్షులు నెల్సన్ ఆయన ప్రపంచమంతా ప్రయాణించినప్పుడు చెప్పారు. “ఇశ్రాయేలీయులను సమకూర్చుట గురించి మనం మాట్లాడినప్పుడు, మనం కేవలం ఈ ప్రాథమిక సూత్రాన్ని చెప్పుచున్నాము: తెరకు ఇరువైపులా ఉన్న మన పరలోక తండ్రి యొక్క పిల్లలలో ప్రతీఒక్కరు యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త సందేశమును వినుటకు అర్హులు.”17
ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అపొస్తులునిగా, ఒక ఆహ్వానము మరియు వాగ్దానముతో నేను ముగిస్తాను. మొదట, ఆహ్వానము: మీ మాటే మీ వాగ్దానమని తెలుసుకొని, ప్రభువుతో మరియు ఇతరులతో మీరు చేయు వాగ్దానాలు, నిబంధనలు గొప్ప చిత్తశుద్ధితో పరిగణించాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రెండవది, దీనిని మీరు చేసినప్పుడు, విసుగు చెందని శ్రద్ధతో మీ జీవితాలను, మీ కుటుంబాలను, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘమును నిర్మించుటకు ప్రయాసపడినప్పుడు ప్రభువు మీ మాటలను స్థిరపరచును, మీ క్రియలను అనుమతించును. నా ప్రియమైన సహోదర, సహోదరీలారా ఆయన మీతో ఉంటారు, మరియు మీరు “పరలోకములోనికి చేర్చుకొనబడి దేవునితో ఎన్నడును అంతముకాని సంతోషము యొక్క స్థితిలో [మీరు]నివసించుటకు విశ్వాసముతో ఎదురుచూడగలరు … ఏలయనగా ప్రభువైన దేవుడు దానిని పలికియున్నాడు.”18
దీనిని గూర్చి నేను యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను మరియు వాగ్దానమిస్తున్నాను, ఆమేన్.