2010–2019
యువతను బలోపేతం చేయడానికి సర్దుబాట్లు
2019 అక్టోబర్ సర్వసభ్య సమావేశము


2:3

యువతను బలోపేతం చేయడానికి సర్దుబాట్లు

ఎక్కువమంది యువకులు మరియు యువతులు ఈ సవాలుకు అనుకూలంగా వ్యవహరిస్తారని మరియు యువతపైన ఎక్కువ దృష్టి పెట్టడంవలన నిబంధన మార్గములో ఉంటారని మేము ధైర్యముగా ఉన్నాము.

బాప్తీస్మము ఇచ్చే సమయంలో సాక్షులకు సంబంధించి సంతోషకరమైన బయల్పాటుసంబంధిత నడిపింపు కొరకు మరియు యువతను బలపరచి, వారి పవిత్రమైన సామర్థ్యమును బలపరచుటలో సహాయపడుటకు కావలసిన దిశనిర్దేశమును మేము పంచుకోవాలని అడిగినందుకు అధ్యక్షులు నెల్సన్ మీకు ధన్యవాదాలు.

ఈ సర్దుబాట్లను నేను పంచుకొనేముందు, కొనసాగుతున్న సువార్త పునఃస్థాపన యొక్క అభివృద్ధి పనులలో ఊహించని రీతిలో సభ్యులు స్పందించిన దానికొరకు మా హృదయపూర్వక ప్రశంసలు తెలియజేస్తున్నాము. గత సంవత్సరము అధ్యక్షులు నెల్సన్ సలహా ఇచ్చినట్లుగా జరగబోయే పెద్ద మార్పుల కొరకు మీరు సిద్ధపడ్డారు!1

మీరు సంతోషముగా నా వెంబడి రండి అనే కార్యక్రమాన్ని మీ ఇంటిలో అధ్యయనము చేసారు.2 సంఘములో సర్దుబాట్లకు కూడా మీరు స్పందించారు. పెద్దల సమూహము యొక్క సభ్యులు మరియు ఉపశమన సమాజము సహోదరిలు రక్షణ కార్యమును ఐకమత్యముతో చేస్తున్నారు.3

మేము మిక్కిలి కృతజ్ఞత కలిగియున్నాము.4 మన యువత బలంగాను, విశ్వాసముగాను ఉండుటను కొనసాగిస్తున్నందుకు మేము మరి ముఖ్యముగా కృతజ్ఞత కలిగియున్నాము.

ఉత్తేజకరమైనదే కాని సవాలుతో కూడిన కాలములో మన యువత జీవిస్తున్నారు. అందుబాటులో ఉన్న ఎంపికలు చాలా నాటకీయముగా ఉన్నాయి. ఒక ఉదాహరణ: ఆధునిక స్మార్ట్ ఫోన్ కుటుంబ చరిత్ర మరియు పరిశుద్ధ లేఖనాలతో పాటు అతి ముఖ్యమైన, పైకెత్తు సమాచారమునకు ప్రవేశాన్ని కలిగిస్తున్నాయి. మరోవైపు అది మునుపెన్నడు లభ్యము కాని మూర్ఖత్వమును, అపవిత్రతను మరియు కీడును కలిగియున్నది.

గృహ కేంద్రీకృత పాఠ్యాంశాలు
యువత కార్యకలాపాలు

ఈ అందుబాటులో ఉన్న ఎంపికలలో నుండి సరైన ఎంపికలు చేసుకొనుటలో మన యువతకు సహాయపడుటకు, సంఘము మూడు గంభీరమైన, సమగ్రమైన ప్రథమయత్నాలను సిద్ధపరచింది. మొదటిది, పాఠ్యాంశము బలపరచబడి, గృహమునకు వ్యాపింపచేయబడినది. రెండవది, ప్రోత్సాహకరమైన కార్యక్రమాలు, వ్యక్తిగత అభివృద్ధి వాటిలో కలిగియున్న ఒక పిల్లలు మరియు యువత కార్యక్రమము గత ఆదివారమే అధ్యక్షులు నెల్సన్, అధ్యక్షులు బాలర్డ్ మరియు ప్రధాన అధికారులచేత సమర్పించబడినది. మూడవ ప్రథమ యత్నము ఏదనగా మన బిషప్పులు మరియు ఇతర నాయకులు యువతపై మరింత ప్రాముఖ్యంగా దృష్టి పెట్టుటకు సంస్థాగత మార్పులు. ఈ దృష్టిసారింపు ఆత్మీయంగా శక్తివంతమైనదిగా ఉండాలి మరియు మన యువత ఏమి అవ్వాలని అధ్యక్షులు నెల్సన్ వారిని కోరారో ఆ యువ పటాలముగా అగుటకు వారికి సహాయము చెయ్యాలి.

పరస్పర సంబంధము గల నమూనాలు

ఈ ప్రయత్నాలు మరియు గత రెండు సంవత్సరాలలో ప్రకటించబడిన వాటితో పాటు అవి సంబంధము లేని మార్పులు కావు. సర్దుబాట్లలో ప్రతిదీ కూడా పరిశుద్ధులను దీవించుటకు, దేవుని కలుసుకొనుటకు వారిని సిద్ధపరచుటకు పరస్పర సంబంధము గల నమూనాలలో అంతర్భాగమై యున్నవి.

ఆ నమూనాలో ఒక భాగము యువతరమునకు సంబంధించినది. తల్లిదండ్రులు మరియు నాయకులు వారికి సహాయము చెయ్యకుండా యువత వారికొరకు వారంతట వారు ఏమి చేసుకోగలరో—యుక్తవయస్సులో మరింత వ్యక్తిగత బాధ్యతను తీసుకోవాలని మన యువత అడగబడుచున్నారు.5

ప్రకటన

యువతకు వార్డు మరియు స్టేకు స్థాయిలలో నిర్వహణపరమైన మార్పులను నేడు మేము ప్రకటించుచున్నాము. అధ్యక్షులు నెల్సన్ వివరించినట్లుగా, సహోదరి బొన్నీ హెచ్. కార్డన్ యువతుల కొరకు మార్పులను ఈరోజు రాత్రి చర్చిస్తారు. ఇప్పుడు నేను చర్చించబోయే మార్పులకు ఒక ఉద్దేశము అహరోను యాజకత్వము కలిగియున్నవారు, సమూహములు మరియు సమూహ అధ్యక్షత్వములను బలపరచుట. సిద్ధాంతము మరియు నిబంధనలు 107:15, తో మన ఆచరణతో ఈ మార్పులు సమరేఖలో ఉంటాయి, అది ఈ విధంగా చెప్పబడును: “బిషప్రిక్కు ఈ యాజకత్వము యొక్క అధ్యక్షత్వమైయుండి దాని తాళపుచెవులను లేక అధికారమును కలిగియున్నారు.”

బిషప్పు యొక్క లేఖన బాధ్యతలలో ఒకటి ఏమిటంటే యాజకులపైన అధ్యక్షత్వము వహించుట, వారితో సలహాసభలో కూర్చొని, వారికి వారి స్థానము యొక్క బాధ్యతలను బోధించుట.6 అదనముగా, బిషప్రిక్కులోని మొదటి సలహాదారుడు బోధకుల కొరకు, రెండవ సలహాదారుడు పరిచారకుల కొరకు నిర్థిష్టమైన బాధ్యతను కలిగియుంటారు.

అదేవిధంగా, సిద్ధాంతము మరియు నిబంధనలలో ఉన్న ఈ బయల్పాటుతో అనుగుణంగా ఉండుటకు వార్డు స్థాయిలో యువకుల అధ్యక్షత్వములు నిలిపివేయబడతాయి. ఈ విశ్వాసులైన సహోదరులు ఎంతో మంచిని చేసారు మరియు వారిని మేము ప్రశంసిస్తున్నాము.

బిషప్పులు యువకుల యొక్క యాజకత్వ బాధ్యతలకు అధిక ప్రాధాన్యత మరియు దృష్టిసారింపు ఇచ్చి, వారి సమూహ బాధ్యతలలో వారికి సహాయము చేస్తారని మేము ఆశిస్తున్నాము. అహరోను యాజకత్వ సమూహపు అధ్యక్షత్వములకు మరియు బిషప్పులకు వారి బాధ్యతలలో సహాయపడుటకు సామర్థ్యము గల వయోజన యువకుల సలహాదారులు పిలువబడతారు.7 ఎక్కువమంది యువకులు మరియు యువతులు ఈ సవాలుకు అనుకూలంగా వ్యవహరిస్తారని మరియు యువతపైన పెట్టు ఈ ఎక్కువ దృష్టిసారింపుతో నిబంధన మార్గములో ఉంటారని మేము ధైర్యముగా ఉన్నాము.

ప్రభువు యొక్క ప్రేరేపించబడిన నమూనాలో వార్డులో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యతను బిషప్పు కలిగియున్నారు. యువత తల్లిదండ్రులను అలాగే యువతను ఆయన దీవిస్తారు. అశ్లీల చిత్రాలతో సతమతమౌతున్న ఒక యువకునికి ఒక బిషప్పు ఉపదేశమిచ్చినప్పుడు అతడు ఆ యువకునికి తన పశ్చాత్తాపములో సహాయము చెయ్యగలిగారు అదేవిధంగా తల్లిదండ్రులు ప్రేమతో, అవగాహనతో స్పంధించుటకు వారికి సహాయము చేసారని ఆయన గమనించారు. ఆ యువకుని స్వస్థత తన కుటుంబానికి స్వస్థతగా ఉండెను, మరియు ఆ కుటుంబమంతటి తరఫున ఆ బిషప్పు పనిచేయ్యడం ద్వారా అది సాధ్యమయ్యింది. ఆ యువకుడు ఇప్పుడు యోగ్యుడైన మెల్కీసెదెకు యాజకత్వము కలిగిన వానిగా, పూర్తి-కాల సువార్తపరిచారకునిగా మారాడు.

ఈ వృత్తాంతము సూచించినట్లుగా, ఈ సర్దుబాట్లు:

  • యువత మరియు ప్రాథమిక పిల్లల పట్ల కలిగియున్న అతిముఖ్యమైన బాధ్యతలపైన దృష్టిసారించుటకు బిషప్పులకు మరియు వారి సలహాదారులకు సహాయపడతాయి.

  • ప్రతి యువకుని యొక్క వ్యక్తిగత జీవితము మరియు లక్ష్యాలకు కేంద్రకముగా అహరోను యాజకత్వము యొక్క శక్తి మరియు బాధ్యతలను ఉంచుతాయి.

ఈ సర్దుబాట్లు ఇంకా:

  • అహరోను యాజకత్వ సమూహపు అధ్యక్షత్వముల బాధ్యతలను మరియు వారు బిషప్పులకు ప్రత్యక్షంగా నివేదించు విధానాన్ని ఉద్ఘాటిస్తాయి.

  • అహరోను యాజకత్వ సమూహపు అధ్యక్షత్వములకు వారి స్థానము యొక్క శక్తి మరియు అధికారమును ఘనపరచుటలో సహాయము చేసి, తర్ఫీదు ఇచ్చుటకు వయోజన నాయకులను ప్రేరేపిస్తుంది.

వివరించినట్లుగా, ఈ సర్దుబాట్లు యువతుల పట్ల బిషప్రిక్కు యొక్క బాధ్యతను తక్కువ చెయ్యవు. అధ్యక్షులు నెల్సన్ ఇప్పుడే చెప్పినట్లుగా, “[బిషప్పు] యొక్క మొదటిది మరియు ముఖ్యమైన బాధ్యత ఎమనగా తన వార్డులోని యువకులు మరియు యువతులను సంరక్షించుట.”8

మన ప్రియమైన, కష్టపడి పనిచేయు బిషప్పులు ఈ బాధ్యతను ఏవిధంగా నెరవేరుస్తారు? మీకు జ్ఞాపకమున్నట్లైతే, 2018లో మెల్కీసెదెకు యాజకత్వ సమూహములు మరింత సన్నిహితముగా ఉపశమన సమాజములతో పనిచేయుటకు తద్వారా పెద్దల సమూహములు మరియు ఉపశమన సమాజములు బిషప్పు యొక్క దర్శకత్వములో ముఖ్యమైన బాధ్యతలకు బాధ్యతవహించుటలో సహాయపడుటకు సర్దుబాటు చెయ్యబడినవి, ఆ బాధ్యతలు ఇంతకుముందు అతని సమయములో ఎక్కువ భాగాన్ని ఆక్రమించేవి. ఈ బాధ్యతలలో-వార్డులో9 సువార్త పరిచర్య, దేవాలయము మరియు కుటుంబ చరిత్ర కార్యము—అదేవిధంగా వార్డు సభ్యులకు చాలావరకు పరిచర్య చేయడం ఉన్నాయి.

బిషప్పు బాధ్యతలు

యువత, ఉమ్మడి న్యాయాధిపతి, అవసరతలో ఉన్నవారికి సహాయము చేయుట, ఆర్థిక వ్యవహారాలను మరియు లౌకిక వ్యవహారాలను పర్యవేక్షించుట వంటి కొన్ని బాధ్యతలను బిషప్పు ఇంకొకరికి అప్పగించలేరు. ఐనప్పటికి మనం గతంలో అర్థము చేసుకొన్న వాటికంటే ఇవి చాలా తక్కువ. గత సంవత్సరము మెల్కీసెదెకు యాజకత్వ సమూహములకు సర్దుబాట్లను ప్రకటించుచున్నప్పుడు ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ వివరించినట్లుగా: “వాస్తవానికి బిషప్పు వార్డు యొక్క అధ్యక్షత్వము వహించు ప్రధాన యాజకునిగానే ఉంటారు. [పెద్దల సమూహము మరియ ఉపశమన సమాజము యొక్క]ఈ క్రొత్త అమరిక అతన్ని మెల్కీసెదెకు యాజకత్వము మరియు ఉపశమన సమాజము ఇరువురి కార్యమును చెయ్యవలసిన అవసరం లేకుండా” వాటి కార్యము పైన అధ్యక్షత్వము వహించుటకు అతన్ని అనుమతించాలి.”10

ఉదాహరణకు, ఒక ఉపశమన అధ్యక్షురాలు మరియు పెద్దల సమూహము అధ్యక్షుడు వారికి నియమించబడిన ప్రకారము వయోజనులకు ఉపదేశించే ఎక్కువ బాధ్యతను తీసుకోవాలి—యువతుల అధ్యక్షురాలు యువతులకు ఉపదేశించగలుగునట్లు వారు చెయ్యగలగాలి. కేవలం బిషప్పు మాత్రమే ఉమ్మడి న్యాయాధిపతిగా పనిచెయ్యగలిగి యుండగా, ఉమ్మడి న్యాయాధిపతి అవసరము కాని ఎటువంటి హింసలేకుండా ఉన్న సవాళ్ళ విషయంలో సహాయము చేయుటకు ఈ ఇతర నాయకులు పరలోకము నుండి బయల్పాటును పొందటకు హక్కును కలిగియున్నారు.11

ఒక యువత తన బిషప్పుతోను లేదా తన తల్లిదండ్రులతోను మాట్లాడకూడదని దీని అర్థము కాదు. బిషప్రిక్కు యొక్క దృష్టి యువతపైనే యున్నది! కాని యువతుల నాయకురాలు ఒక యువతి యొక్క అవసరాలు తీర్చుటలో ఉత్తమముగా పనిచెయ్యును అని దీని అర్థము కాదు. యువకుల యెడల ఉన్నట్లే యువతుల పట్ల బిషప్పు శ్రద్ధ కలిగియున్నారు కాని ప్రేమించి, తర్ఫీదు ఇచ్చి, తరగతి అధ్యక్షత్వముల పాత్రలను తీసుకోకుండా, యువత వారి పాత్రలలో సఫలమగుటకు పాటుపడు బలమైన, పనిలో నిమగ్నమైన, ఏకదృష్టితో ఉన్న యువతుల నాయకురాళ్ళనుండి వచ్చు బలమును మేము గుర్తించియున్నాము.

ఈ సాయంకాలము, సహోదరి కార్డన్ అదనపు ఉత్సాహాన్ని కలిగించు మార్పులను పంచుకొంటారు. ఐనప్పటికి, వార్డు యొక్క యువతుల అధ్యక్షురాళ్ళు ఇప్పుడు వార్డు యొక్క బిషప్పుకు నేరుగా నివేదిస్తారు మరియు కలిసి ఆలోచన చేస్తారని నేను ప్రకటిస్తున్నాను. గతంలో ఈ నియమితకార్యము ఒక సలహాదారునికి అప్పగించవచ్చును కాని ఇకనుండి, యువతులు వార్డు యొక్క తాళపుచెవులను కలిగియున్న వాని యొక్క ప్రత్యక్షబాధ్యతగా ఉండును. ఉపశమన అధ్యక్షురాలు నేరుగా బిషప్పుకు నివేదించుటను కొనసాగిస్తారు.12

ప్రధాన మరియు స్టేకు స్థాయిలలో యువకుల అధ్యక్షులను కలిగియుండటను కొనసాగిస్తాము. స్టేకు స్థాయిలో, ఒక ఉన్నత సలహాదారుడు యువకుల అధ్యక్షునిగా13 ఉంటారు, మరియు యువతులకు, ప్రాథమికకు నియమించబడిన ఉన్నత సలహాదారులతో పాటు స్టేకు యొక్క అహరోను యాజకత్వము-యువతుల కమిటీలో భాగమైయుంటారు. ఈ సహోదరులు ఈ కమిటీ విషయంలో స్టేకు యువతుల అధ్యక్షత్వముతో కలిసి పనిచేస్తారు. స్టేకు అధ్యక్షత్వములోని ఒక సలహాదారుడు ఈ కమిటీని నడిపించువానిగా ఉండగా, ఈ కమిటీ మరింత ఎక్కువ ప్రాధాన్యత కలిగియుంటుంది, ఎందుకంటే క్రొత్తదైన పిల్లలు మరియు యువత ప్రథమయత్నాలలోని కార్యక్రమాలు, ప్రోత్సాహకార్యములు స్టేకు స్థాయిలో ఉంటాయి.

స్టేకు అధ్యక్షత్వము యొక్క దర్శకత్వములో ఈ ఉన్నత సలహాదారులు- వార్డు పెద్దల సమూహములకు ఉన్నత సలహాదారులు సేవ చేసే విధానంలోనే-బిషప్పులకు మరియు అహరోను యాజకత్వ సమూహములకు సేవ చెయ్యగలరు.

వీటికి సంబంధమున్న అంశముగా, మరొక ఉన్నత సలహాదారుడు స్టేకు ఆదివారపు బడి అధ్యక్షునిగా పనిచేస్తారు మరియు అవసరమైనప్పుడు, స్టేకు యొక్క అహరోను యాజకత్వము-యువతుల కమిటీలో సేవచేస్తారు.14

అదనపు నిర్వహణ మార్పులు నాయకులకు పంపబడిన సమాచారములో మరింత వివరించబడుతుంది. ఈ మార్పులలో ఇవి కలవు:

  • బిషప్రిక్కు యువత కమిటీ కూడిక వార్డు యువత సలహామండలిచేత భర్తీ చెయ్యబడుతుంది.

  • “ఉమ్మడి” అనే మాట ఇక ఉపయోగించబడదు మరియు అది “యువతుల ప్రోత్సాహకార్యక్రమాలు,” “అహరోను యాజకత్వ సమూహము ప్రోత్సాహకార్యక్రమాలు,” లేదా “యువత ప్రోత్సాహకార్యక్రమాలుగా” మారును మరియు సాధ్యమైనంతవరకు ప్రతివారము జరుగుతాయి.

  • యువత ప్రోత్సాహకార్యక్రమాలకు వార్డు బడ్జెట్టు ప్రతి సంస్థలో ఉన్న యువత సంఖ్యను బట్టి యువకుల మరియు యువతుల మధ్య సరిసమానంగా పంచబడుతుంది ప్రాథమిక ప్రోత్సాహకార్యక్రమాల కొరకు సరిపడినంత మొత్తము ఇవ్వబడుతుంది.

  • వార్డు, స్టేకు మరియు ప్రధాన—అన్ని స్థాయిలలో “సహాయక” అనే పదానికి బదులు “సంస్థ” అనే పదం ఉపయోగించబడుతుంది. ప్రధాన ఉపశమన సమాజము, యువతులు, యువకుల, ప్రాథమిక మరియు ఆదివారపు బడి సంస్థలకు నాయకత్వము వహించువారు “ప్రధాన అధికారులుగా” పిలువబడతారు. వార్డు మరియు స్టేకు స్థాయిలలో సంస్థలకు నాయకత్వము వహించు వారిని “వార్డు అధికారులు” మరియు “స్టేకు అధికారులు”15 అని పిలువబడతారు.

నేడు ప్రకటించిన సర్దుబాట్లు శాఖలు, వార్డులు, జిల్లాలు మరియు స్టేకులు సిద్ధంగా ఉన్నవేంటనే మొదలౌతాయి కాని 2020 జనవరి 1వ తేది నాటికెల్లా అమలులో ఉండాలి. ఈ సర్దుబాట్లు గతంలో చేసిన సర్దుబాట్లతో కలుపబడి, లీనమైనప్పుడు, నిబంధన మార్గములో మనం పురోగతి చెందుచుండగా, మన రక్షకుడైన యేసు క్రీస్తు మాదిరిని అనుసరించుటకు ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, యువత, మరియు బిడ్డ ప్రతివానికి సహాయము చేయుట ద్వారా వారిని బలపరచి, దీవించాలనే సిద్ధాంతమునకు అనుగుణంగా ఉన్న ఆత్మీయ మరియు నిర్వహణ ప్రయత్నమును సూచిస్తుంది.

ప్రియమైన సహోదర, సహోదరిలారా, అధ్యక్షులు మరియు ప్రవక్తయైన రస్సెల్ ఎమ్. నెల్సన్ యొక్క ప్రేరేపించబడిన నాయకత్వములో ఈ సమగ్రమైన సర్దుబాట్లు సంఘము యొక్క ప్రతి సభ్యుని బలపరచి, శక్తివంతులుగా చేస్తాయని నేను వాగ్దానము చేస్తున్నాము మరియు సాక్ష్యమిస్తున్నాను. మన యువత రక్షకునియందు ఎక్కువ విశ్వాసమును పెంపొందించుకొని, అపవాది యొక్క శోధనలనుండి రక్షించబడతారు మరియు జీవితపు సవాళ్ళను ఎదుర్కొనుటకు సిద్ధపడతారు. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో, ఆమేన్.

వివరణలు

  1. రస్సెల్ ఎమ్. నెల్సన్, “Latter-day Saint Prophet, Wife and Apostle Share Insights of Global Ministry,” Newsroom, అక్టో. 30, 2018, newsroom.ChurchofJesusChrist.org

  2. అదనంగా, అధ్యక్షులు నెల్సన్ బోధంచినట్లుగానే, సంఘము యొక్క సరియైన నామము ఉపయోగించుటకు మరియు దానిని ఆవిధంగా చేసినప్పుడు మన రక్షకుని ప్రేమతో, భక్తితో కూడిన గౌరవముతో జ్ఞాపకము చేసుకొనుటకు నిర్థిష్టమైన ప్రయత్నాలు చేసారు.

  3. “యేసు క్రీస్తు యొక్క సంఘ సభ్యులు ‘మనుష్యుల ఆత్మల రక్షణ కొరకు ద్రాక్షాతోటలో పనిచేయుటకు పంపబడిరి.(సిద్ధాంతము మరియు నిబంధనలు 138:56). ఈ రక్షణ కార్యములో సభ్యుల సువార్తపరిచ్య కార్యము, పరివర్తకులను నిలిపియుంచుట, తక్కువ క్రియాశీలముగా ఉన్నవారిని క్రీయాశీలురుగా చేయుట, దేవాలయము మరియు కుటుంబ చరిత్ర కార్యము, సువార్తను బోధించుట. వార్డు సలహామండలిలో ఇతర సభ్యులచేత సహాకారమందించబడి, వార్డులో ఈ కార్యాన్ని బిషప్రిక్కు నిర్దేశిస్తారు.” (Handbook 2: Administering the Church 5.0, ChurchofJesusChrist.org).

  4. యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క సభ్యులైన మిమ్మును మీ మంచితనానికి, మీ శిష్యత్వానికి మే నాయకులుగా మేము ప్రేమిస్తున్నాము. నిబంధన మార్గములో నడుచుచు—దానిని అంకితభావముతో, సంతోషముతో చేయుచున్న వ్యక్తులు, తల్లులు, తండ్రులు, యువత మరియు పిల్లలకు మా ప్రశంసలు.

  5. 2019లో 11 సంవత్సరాలు పరిచారకుడు సంస్కారమును అందించుటకు మొదలు పెట్టెను మరియు 11 సంవత్సరాలు యువతి యువకులు పరిమిత ఉపయోగ దేవాలయ సిఫారసును పొందారు. గత సంవత్సరము, అధ్యక్షులు నెల్సన్ తెరకు రెండువైపుల ఉన్న చెదిరిన ఇశ్రాయేలీలను పోగుచేయుటకు యువత పటాలములో చేరమని యువకులను, యువతులను సవాలుచేసారు.(“Hope of Israel” [worldwide devotional for youth, June 3, 2018 చూడండి], HopeofIsrael.ChurchofJesusChrist.org). దానికి వచ్చిన స్పందన నాటకీయముగా ఉండెను.

    పూర్తికాల సువార్తపరిచారకులు ఇప్పుడు యుక్తవయస్సులోనే విశేషమైన రీతిలో సేవచేస్తున్నారు. 2012 అక్టోబర్ 6 నుండి, యువకులు 18 సంవత్సరాలకు, యువతులు 19 సంవత్సరాలకు సేవచేయుటకు అర్హులు.

  6. “అహరోను యాజకత్వముపైన అధ్యక్షుని బాధ్యత యేమనగా, నిబంధనలలో బయలుపరచబడినట్లుగా నలుబది ఎనిమిదిమంది యాజకులపైన అధ్యక్షత్వము వహించుట, వారితో సలహాసభలో కూర్చొని, వారికి వారి స్థానము యొక్క బాధ్యతలను బోధించుట. … ఈ అధ్యక్షుడు బిషప్పైయుండవలెను; ఏలయనగా ఈ యాజకత్వపు బాధ్యతలలో ఇది ఒకటి” (సిద్ధాంతము మరియు నిపబంధనలు 107:87–88).

  7. అహరోను యాజకత్వ సమూహ నిపుణులుగా ఉండి కార్యక్రమాలు, ప్రోత్సాహకార్యక్రమాలలో సహాయము చేయుటకు, సమూహ కూడికలు హాజరగుటకు యువజన నాయకులు పిలువబడతారు, తద్వారా బిషప్రిక్కు తరచు యువతుల తరగతులకు, ప్రోత్సాహకార్యక్రమములకు మరియు అప్పుడప్పుడు ప్రాథమికకు హాజరగుటకు వీలౌతుంది. శిబిరము వంటి ఒక నిర్థిష్టమైన కార్యక్రమంలో సహాయము చేయుటకు కొంతమంది నిపుణులను పిలువవచ్చును; సమూహపు సలహాదారులకు సహాయపడుటకు దీర్ఘకాలిక ప్రాతిపదికలో ఇతరులను పిలువవచ్చును. ప్రతి సమూహము యొక్క కూడిక, కార్యక్రమము లేదా ప్రోత్సాహకార్యక్రమములో ఎల్లప్పుడు ఇద్దరు యువజనులైన పురుషులు ఉంటారు. పాత్రలు, బిరుదులు మారినప్పటికి, అహరోను యాజకత్వ సమూహములకు సేవచేసి, సహకారమందించే యువజనుల సంఖ్య తగ్గుతుందని మేము ఊహించడం లేదు.

  8. Russell M. Nelson, “Witnesses, Aaronic Priesthood Quorums, and Young Women Classes,” Liahona, Nov. 2019, 39, emphasis added; see also Ezra Taft Benson, “To the Young Women of the Church,” Ensign, Nov. 1986, 85.

  9. ఒంటరి యౌవన యువజనులు మరియు తమ స్వంత కుటుంబాలతో బిషప్పులు ఎక్కువ సమయము గడపాలని కూడా మేము ఉపదేశిస్తున్నాము.

  10. Jeffrey R. Holland, general conference leadership meeting, Apr. 2018; see also “Effective Ministering,” ministering.ChurchofJesusChrist.org. బిషప్పు అప్పగించలేని బాధ్యతలేవనగా అహరోను యాజకత్వము సమూహములు మరియు యువతులపైన అధ్యక్షత్వము వహించుట, ఉమ్మడి న్యాయాధిపతిగా ఉండుట, సంఘము యొక్క ఆర్థిక వ్యవహారములు, లౌకిక వ్యవహారములు చూసుకొనుట మరియు బీదలు, అవసరతలో ఉన్నవారిని సంరక్షించుట అని ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ బోధించారు. పెద్దల సమూహము మరియు ఉపశమన సమాజ అధ్యక్షత్వములు మరియు ఇతరులు సువార్తపరిచర్య కార్యము, దేవాలము మరియు కుటుంబ చరిత్ర కార్యము, వార్డులో బోధన యొక్క నాణ్యత మరియు సంఘ సభ్యులను కనిపెట్టుటకు మరియు పరిచర్య చేయుటకు ప్రాథమిక బాధ్యతను తీసుకొనవచ్చును.

  11. ఉమ్మడి న్యాయాధిపతి యొక్క తాళపుచెవులు అవసరమయ్యే పరిస్థితులతో పాటు ఎటువంటి హింసయైనా సంఘ విధానము ప్రకారము బిషప్పుల చేత సంబాళించబడాలి.

  12. స్టేకు ఉపశమన సమాజ అధ్యక్షురాలు నేరుగా స్టేకు అధ్యక్షునికి నివేదించుటను కొనసాగించును.

  13. స్టేకు యువకుల అధ్యక్షుని సలహాదారులు స్టేకు సభ్యత్వమునుండి పిలువవచ్చును లేదా అవసరమైనప్పుడు యువతులకు నియమించబడిన ఉన్నత సలహాదారుడు మరియు ప్రాథమికకు నియమించబడిన ఉన్నత సలహాదారుడు కావచ్చును.

  14. ఆదివారపు బడి అధ్యక్షునిగా పనిచేయు సహోదరునికి ప్రతి నెల రెండు ఆదివారాలు యువత పాఠ్యాంశము యెడల ప్రాముఖ్యమైన బాధ్యత కలదు.

  15. ప్రధాన మరియు స్టేకు స్థాయిలలో ఉపశమన సమాజము, యువతులు, యువకుల, ప్రాథమిక మరియు ఆదివారపు బడి సంస్థల అధ్యక్షత్వములు ప్రధాన అధికారులు మరియు స్టేకు అధికారులు. వార్డు స్థాయిలో, యువకులను బిషప్పు నడిపిస్తారు కాబట్టి యువకుల సలహాదారులు వార్డు అధికారులు కారు.