2010–2019
రండి, నన్ను వెంబడించుము—వ్యతిరేక వ్యూహమును ఎదుర్కొనుటకు ప్రభువు యొక్క వ్యూహము మరియు క్రియాశీల ప్రణాళిక
2019 అక్టోబర్ సర్వసభ్య సమావేశము


2:3

రండి, నన్ను వెంబడించుము—వ్యతిరేక వ్యూహమును ఎదుర్కొనుటకు ప్రభువు యొక్క వ్యూహము మరియు క్రియాశీల ప్రణాళిక

అపవాది యొక్క ముట్టడులకు వ్యతిరేకంగా ప్రభువు తన జనులను సిద్ధపరుచును. రండి, నన్ను వెంబడించుము వ్యతిరేక వ్యూహమును ఎదుర్కొనుటకు ప్రభువు యొక్క వ్యూహము మరియు క్రియాశీల ప్రణాళిక.

యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క ఈ గొప్ప సర్వసభ్య సమావేశములో కలిసి సమావేశమగుటలో మేము కలిసి ఆనందిస్తున్నాము. ఆయన ప్రవక్తలు మరియు అపొస్తులుల బోధనల ద్వారా ప్రభువు యొక్క మనస్సును మరియు చిత్తమును పొందుట ఒక దీవెన. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ప్రభువు యొక్క జీవిస్తున్న ప్రవక్త. ఈ రోజు పొందిన ఆయన ప్రేరేపించబడిన సలహా మరియు నడిపింపు కొరకు మనము ఎంత కృతజ్ఞత కలిగియున్నాము.

ఇంతకు ముందు పంచుకున్న వారితో నా సాక్ష్యమును నేను చేరుస్తున్నాను. మన నిత్యుడైన తండ్రి దేవునిని గూర్చి నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన జీవిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు మనపై కావలికాస్తున్నాడు. ఈ మర్త్య జీవితం మరియు ఆయన సన్నిధికి మనము తిరిగి వెళ్లు దీవెనను ఆయన సంతోషము యొక్క ప్రణాళిక సమకూర్చును.

యేసు క్రీస్తును గూర్చి కూడా నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన దేవుని యొక్క అద్వితీయ కుమారుడు. ఆయన మరణము నుండి మనల్ని రక్షించాడు, మరియు మనము ఆయనయందు విశ్వాసమును సాధన చేసినప్పుడు మరియు పశ్చాత్తాపపడినప్పుడు పాపము నుండి మనల్ని ఆయన విడిపించును. మన తరఫున ఆయన ప్రాయశ్చిత్తః త్యాగము అమర్త్యత్వము మరియు నిత్యజీవము యొక్క దీవెనలను తెచ్చును. వాస్తవానికి, “ఆయన దైవిక కుమారుని యొక్క సాటిలేని వరము కొరకు దేవునికి కృతజ్ఞతలు” (“జీవముగల క్రీస్తు: అపొస్తులుల యొక్క సాక్ష్యము,” Liahona, May 2017, inside front cover).

ప్రపంచమంతటా కడవరి-దిన పరిశుద్ధులు యేసు క్రీస్తును ఆయన దేవాలయములందు ఆరాధించుటకు దీవించబడ్డారు. ఆ దేవాలయములలో ఒకటి ప్రస్తుతం కెనడా, విన్నిపెగ్ లో నిర్మాణములో ఉన్నది. నా భార్య, ఆన్ని మారీ, మరియు నాకు ఈ సంవత్సరం ఆగష్టులో నిర్మాణ స్థలమును దర్శించుటకు అవకాశము కలిగింది. దేవాలయము అందముగా ప్రణాళిక చేయబడింది మరియు పూర్తి చేయబడినప్పుడు నిశ్చయముగా అద్భుతముగా ఉండును. అయినప్పటికినీ, మీరు బలమైన, మరియు పటిష్టమైన పునాది లేకుండా, విన్నిపెగ్ లేక ఎక్కడైనా మీరు అద్భుతమైన దేవాలయమును కలిగియుండలేరు.

విన్నిపెగ్‌లో గడ్డకట్టిన నేలను పదేపదే కరగించుట మరియు విస్తృతపరచు నేల పరిస్థితులు దేవాలయ పునాదిని సిద్ధపరచుటకు కష్టమైనదిగా చేసింది. కాబట్టి, ఈ దేవాలయము కొరకు పునాది కాంక్రీటుతో కప్పబడిన 70 ఉక్కు దూలాలను కలిగియుండాలని తీర్మానించబడింది. ఈ దూలాలు పొడవు 60  అడుగుల పొడుగు మరియు 12 నుండి 20  అంగుళాలు (30 నుండి 50 సెమీ) వ్యాసము కలిగియుంటాయి. ఉపరితలము నుండి దాదాపు 50  అడుగులు (15 మీ) దిగువన పునాది రాయిని తాకేవరకు అవి భూమిలోనికి గెంటబడతాయి. ఈ విధానములో, 70  దులాలు, అందముగా ఉండబోయే విన్నిపెగ్ దేవాలయమునకు దృఢమైన, స్థిరమైన పునాదిని ఇస్తాయి.

కడవరి దిన పరిశుద్ధులుగా, మనము మన జీవితాలలో అదేవిధమైన దృఢమైన మరియు స్థిరమైన పునాదిని వెదకుతాము—మర్త్యత్వము ద్వారా మరియు మన పరలోక గృహమునకు తిరిగి మన ప్రయాణము కొరకు అవసరమైన ఒక ఆత్మీయమైన పునాది. ప్రభువైన యేసు క్రీస్తుకు మన మార్పు యొక్క స్థిరమైన పునాదిపై ఆ పునాది స్థాపించబడినది.

మోర్మన్ గ్రంధము నుండి హీలమన్ యొక్క బోధనలను మనము గుర్తు చేసుకుందాము: “మరియు ఇప్పుడు నా కుమారులారా, జ్ఞాపకముంచుకొనుడి. అపవాది అతని బలమైన గాలులను, అవును సుడిగాలి యందు అతని బాణములను ముందుకు పంపునప్పుడు, అవును, అతని సమస్త వడగళ్లు మరియు అతని బలమైన గాలివాన మీ పైన కొట్టునప్పుడు, మనుష్యులు వారు కట్టిన పడిపోని ఆ పునాది ఒక నిశ్చయమైన పునాది. మీరు కట్టబడిన బండను బట్టి, దౌర్భాగ్యపు అఘాథము మరియు అంతములేని శ్రమకు మిమ్ములను క్రిందికి లాగుకొని పోవుటకు అది మీపైన ఏ శక్తి కలిగియుండకుండునట్లు, మీరు మీ పునాదిని కట్టవలయును. అది దేవుని యొక్క కుమారుడు క్రీస్తె. మన విమోచకుని యొక్క బండపైన అయ్యున్నదని జ్ఞాపకముంచుకొనుడి,” హీలమన్ 5:12.

కృతజ్ఞతపూర్వకంగా, రక్షకుడైన యేసు క్రీస్తును గూర్చి మనకు బోధించు ప్రవక్తలు మరియు అపొస్తులున్నప్పుడు సమయములో మనము జీవిస్తున్నాము. వారి సలహాను అనుసరించుట క్రీస్తునందు ఒక స్థిరమైన పునాదిని స్థాపించుటకు మనకు సహాయపడును.

గత అక్టోబరు సర్వసభ్య సమావేశంలోతన ప్రారంభ ప్రసంగములో అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్, ఈ ప్రకటనను, హెచ్చరికను ఇచ్చారు: “సభ్యులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన ప్రాయశ్చిత్తంపై వారి విశ్వాసాన్ని పెంపొందించుటలో, దేవునితో నిబంధనలను చేయుటలో, వాటిని పాటించుటలో, వారి కుటుంబాలను బలపరచి, ముద్రించుటలో సహాయపడుటయే సంఘం యొక్క ధీర్ఘకాల లక్ష్యం. నేటి చిక్కైన లోకములో, ఇది సులభం కాదు.అపవాది విశ్వాసముపై, మనపై మరియు మన కుటుంబాలపై అతి వేగంగా తన ముట్టడులను హెచ్చిస్తున్నాడు. ఆత్మీయంగా బ్రతుకుటకు, మనకు వ్యతిరేక వ్యూహమును ఎదుర్కొనుటకు వ్యూహము మరియు క్రియాశీల ప్రణాళికలు” (“Opening Remarks,” Liahona, Nov. 2018, 7; emphasis added).

అధ్యక్షులు నెల్సన్ యొక్క సందేశము తరువాత, పన్నెండుమంది అపోస్తులుల సమూహము యొక్క ఎల్డర్ క్వింటిన్ ఎల్. కుక్, వ్యక్తులు మరియు కుటుంబము కొరకు రండి, నన్ను వెంబడించుము వనరును పరిచయము చేసారు. ఆయన ప్రసంగము క్రింది వ్యాఖ్యానములను కలిగియున్నది:

  • “క్రొత్త గృహ-అధ్యయనము రండి, నన్ను వెంబడించుము వనరు … సభ్యులు గృహములో సువార్తను నేర్చుకొనుటకు సహాయపడుటకు ప్రణాళిక చేయబడింది.”

  • “ఈ వనరు సంఘములోని ప్రతీ వ్యక్తి మరియు కుటుంబము కొరకైనది” [వ్యక్తులు మరియు కుటుంబము కొరకు—రండి, నన్ను వెంబడించుము (2019), vi].”

  • “మా ఉద్దేశ్యమేదనగా పరలోక తండ్రి మరియు ప్రభువైన యేసు క్రీస్తుకు, విశ్వాసమును, ఆత్మీయతను మరియు లోతైన పరివర్తనను గొప్పగా పెంచు విధానములో సంఘము మరియు గృహ అనుభవాలను సమతుల్యము చేయుట. “పరలోక తండ్రి మరియు ప్రభువైన యేసు క్రీస్తుకు లోతైన, శాశ్వతమైన పరివర్తన,” లియహోనా నవం. 2018, 9-10.)

ఈ సంవత్సరము జనవరిలో ప్రారంభించి, కడవరి-దిన పరిశుద్ధులు ప్రపంచవ్యాప్తంగా, మన మార్గసూచికగా రండి, నన్ను వెంబడించుము తో, క్రొత్త నిబంధను అధ్యయనము చేయుట ప్రారంభించారు. వారాంతపు ప్రణాళికతో, రండి, నన్ను వెంబడించుము లేఖనాలు, సువార్త సిద్ధాంతము మరియు ప్రవక్తలు, అపోస్తులుల బోధనలు అధ్యయనము చేయుటకు మనకు సహాయపడును. అది మనందరికి అద్భుతమైన వనరు.

ఈ ప్రపంచ వ్యాప్త లేఖన అధ్యయన ప్రయత్నము తొమ్మిది నెలల తరువాత, మనము ఏమి చూసాము? ప్రతీచోట కడవరి దిన పరిశుద్ధులు ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసము మరియు భక్తి యందు వృద్ధి చెందుట మేము చూసాము. వ్యక్తులు మరియు కుటుంబాలు మన రక్షకుని యొక్క మాటలు అధ్యయనము చేయుటకు వారమంతా సమయాన్ని కేటాయించుట మేము చూసాము. గృహమందు మనము లేఖనాలను చదివినప్పుడు మరియు సంఘమందు మన అంతర్‌జ్ఞానములను పంచుకొన్నప్పుడు మన ఆదివారపు తరగతులందు సువార్త బోధన మెరుగుపరచబడుట మేము చూసాము. లేఖనాలు చదువుట నుండి లోతైన విధానములో లేఖనాలను అధ్యయనము చేయుటకు మేము మారినప్పుడు గొప్ప కుటుంబ ఆనందము మరియు ఐక్యతను మేము చూసాము.

అనేకమంది కడవరి దిన పరిశుద్ధులను సందర్శించి, రండి, నన్ను వెంబడించుము తో వారి అనుభవాలను ప్రత్యక్షంగా వినుట నా విశేషావకాశముగా ఉన్నది. వారి విశ్వాసపు వ్యక్తీకరణలు నా హృదయమును ఆనందముతో నింపినవి. లోకములో వేర్వేరు భాగాలలో వేర్వేరు సంఘ సభ్యుల నుండి నేను విన్న వ్యాఖ్యానాలలో కొన్ని మాత్రమే ఇక్కడున్నాయి:

  • ఒక తండ్రి పంచుకున్నాడు: “అది నా పిల్లలకు రక్షకుని గూర్చి సాక్ష్యమిచ్చుటకు ఒక అవకాశమిచ్చును గనుక “రండి, నన్ను వెంబడించుమును నేను ఆనందిస్తున్నాను.”

  • మరొక గృహములో, ఒక బిడ్డ చెప్పింది: “నా తల్లిదండ్రులు వారి సాక్ష్యములను పంచుకొనుట వినుటకు ఇది ఒక అవకాశము.”

  • ఒక తల్లి పంచుకొన్నది: “దేవునిని ప్రధమంగా ఎలా ఉంచాలో మేము ప్రేరేపించబడ్డాము. సమయము ‘లేదని [మేము అనుకున్నది]’ నిరీక్షణ, సంతోషము, శాంతి, మరియు సాధ్యమని మేము అనుకోని విధానాలలో విజయముతో నింపబడింది.”

  • ఒక దంపతులు గమనించారు: “మేము ఇదివరకెన్నడూ చదవని దానికంటే పూర్తి భిన్నంగా లేఖనాలను చదువుతున్నాము. మేము ఇదివరకు ఎన్నడూ నేర్చుకోని దానికంటే ఎక్కువగా మేము నేర్చుకుంటున్నాముు. విషయాలను భిన్నంగా చూడాలని ప్రభువు మమ్మల్ని కోరుతున్నాడు. ప్రభువు మమ్మల్ని సిద్ధపరచుచున్నాడు.”

  • ఒక తల్లి వ్యాఖ్యానించింది: “మేము అదే విషయాలను కలిసి నేర్చుకొనుటను నేను ప్రేమిస్తున్నాను. ముందు, మేము దానిని చదువుతున్నాము. ఈ రోజు, మేము దానిని నేర్చుకుంటున్నాము.”

  • ఒక సహోదరి ఈ తెలివైన దృక్పథమును పంచుకొన్నది: “ముందు, మీకు పాఠమున్నది మరియు దానికి లేఖనాలు అనుబంధంగా ఉన్నాయి. ఇప్పుడు, మీకు లేఖనాలు ఉన్నాయి మరియు దానికి పాఠాలు అనుబంధంగా ఉన్నాయి.”

  • మరొక సహోదరి వ్యాఖ్యానించింది: “నేను చేసే దానిని నేను చేయని దానితో [పోల్చినప్పుడు] తేడాను నేను భావించాను. యేసు క్రీస్తు మరియు మన నమ్మకాలను గూర్చి మాట్లాడుట సులువైనదిగా నేను కనుగొన్నాను.”

  • ఒక మామ్మ వ్యాఖ్యానించింది: “ఆదివారములు నా పిల్లలు, మనుమలకు నేను ఫోను చేస్తాను, మరియు మేము కలిసి రండి, నన్ను వెంబడించుము నుండి మెళకువలను పంచుకున్నాము.”

  • ఒక సహోదరి గమనించింది: “రండి, నన్ను వెంబడించుము రక్షకుడు నాకు వ్యక్తిగతంగా పరిచర్య చేస్తున్నట్లు అనిపిస్తుంది. అది పరలోకము ప్రేరేపించినది.”

  • ఒక తండ్రి వ్యాఖ్యానించాడు: “రండి, నన్ను వెంబడించుము మేము ఉపయోగించినప్పుడు, ద్వారబంధపు పైకమ్మిని గుర్తిస్తూ, నాశకుని ప్రభావమునుండి మా కుటుంబాలను కాపాడుతూ, మేము ఇశ్రాయేలు సంతానము వలే ఉన్నాము.”

సహోదర, సహోదరిలారా, మీతో సందర్శించి, రండి, నన్ను వెంబడించుము తో మీ ప్రయత్నాలు మీ జీవితాలను ఎలా దీవించిందో వినుట ఆనందముగా ఉన్నది. మీ భక్తి కొరకు మీకు కృతజ్ఞతలు.

రండి, నన్ను వెంబడించుముతో మార్గసూచికగా లేఖనాలను చదువుట, యేసు క్రీస్తు మరియు ఆయన సువార్తకు మన మార్పును బలపరచును. ఆదివారమున సంఘములో ఒక గంట తక్కువ ఇంటిలో మరొక గంట లేఖన అధ్యయనము కొరకు మనము వినిమయము చేయటంలేదు. సువార్తను నేర్చుకొనుట వారమంతా ఏకరీతిగల ప్రయత్నమును కలిగియున్నది. ఒక సహోదరి తెలివిగా పంచుకొన్నట్లుగా, “సంఘము ఒక గంట తక్కువగా చేయుట లక్ష్యము కాదు; దానిని ఆరు రోజుల నిడివిగా చేయుట లక్ష్యము!”

ఇప్పుడు, 2018 అక్టోబరు సర్వసభ్య సమావేశమును ప్రారంభించినప్పుడు, మన ప్రవక్త అధ్యక్షులు నెల్సన్ ఇచ్చిన హెచ్చరికను మరలా ఆలోచిద్దాము:

“అపవాది విశ్వాసముపై, మనపై మరియు మన కుటుంబాలపై అతి వేగంగా తన ముట్టడులను హెచ్చిస్తున్నాడు. ఆత్మీయంగా బ్రతుకుటకు, వ్యతిరేక వ్యూహమును ఎదుర్కొనుటకు వ్యూహము మరియు క్రియాశీల ప్రణాళికలు మనకు అవసరము,” (Opening Remarks,” 7).

తరువాత ఆదివారము మధ్యాహ్నాము (దాదాపు 29 గంటల తరువాత), ఆయన ఈ వాగ్దానముతో సమావేశమును ముగించారు: “సువార్త నేర్చుకొను కేంద్రముగా మీ గృహమును పునర్నిర్మించుటకు మీరు శ్రద్ధగా పని చేసినప్పుడు, … మీ జీవితంలో, మీ గృహములో అపవాది యొక్క ప్రభావము తగ్గిపోవును” (“Becoming Exemplary Latter-day Saints,” Liahona, Nov. 2018, 113).

వాస్తవానికి అపవాది యొక్క ప్రభావము తగ్గిపోవుచుండగా, అదే సమయంలో అపవాది యొక్క ముట్టడులు ఎలా అతి వేగమవుతున్నాయి? అది జరగవచ్చు, మరియు సంఘమంతటా అది జరుగుచున్నది, ఎందుకనగా ప్రభువు అపవాది యొక్క ముట్టడులకు వ్యతిరేకంగా తన జనులను సిద్ధపరచుచున్నాడు.రండి, నన్ను వెంబడించుము వ్యతిరేక వ్యూహమును ఎదుర్కొనుటకు ప్రభువు యొక్క వ్యూహము మరియు క్రియాశీల ప్రణాళిక. అధ్యక్షులు నెల్సన్ బోధించినట్లుగా, “క్రొత్త గృహము కేంద్రీకరించిన, సంఘము బలపరచు అనుసంధానీకరించబడిన పాఠ్యప్రణాళిక కుటుంబాల యొక్క శక్తిని విడుదల చేయుటకు సాధ్యత కలిగియున్నది.” అయినప్పటికినీ, దానికి మన శ్రేష్టమైన ప్రయత్నాలు అవసరము; మనము “[మన] గృహమును ఒక విశ్వాస మందిరముగా మార్చుటకు మనస్సాక్షిగా మరియు శ్రద్ధగా (అనుసరించాలి)” (“Becoming Exemplary Latter-day Saints,” 113).

అన్ని తరువాత, అధ్యక్షులు నెల్సన్ కూడ చెప్పినట్లుగా, “మనము ప్రతీఒక్కరం మన వ్యక్తిగత ఆత్మీయ అభివృద్ధి కొరకు బాధ్యత కలిగియున్నాము” (“Opening Remarks,” 8).

రండి, నన్ను వెంబడించుము వనరుతో, ప్రభువు మనల్ని “ఇప్పుడు మనము ఎదుర్కొంటున్న అపాయకరమైన కాలముల కొరకు,” సిద్ధపరచుచున్నాడు (Quentin L. Cook, “Deep and Lasting Conversion,” 10). ఆయన మనము “నిశ్చయమైన పునాది, మనుష్యులు వారు కట్టిన పడిపోని ఆ పునాది ఒక నిశ్చయమైన పునాది” హీలమన్ 5:12—స్థాపించుటకు మనకు సహాయపడుచున్నారు, సాక్ష్యము యొక్క పునాది ప్రభువైన యేసు క్రీస్తుకు మన పరివర్తన యొక్క స్థిరమైన పునాదియందు స్థిరముగా భద్రపరచబడింది.

లేఖనములను అధ్యయనము చేయుటలో మన అనుదిన ప్రయత్నాలు మనల్ని దృఢపరచి, ఈ వాగ్దానము చేయబడిన దీవెనలకు యోగ్యులుగా మనల్ని రుజువు చేయునుగాక. ఆవిధంగా నేను యేసు క్రీస్తు నామములో ప్రార్ధిస్తున్నాను, ఆమేన్.