2010–2019
రక్షకుని స్పర్శ
2019 అక్టోబర్ సర్వసభ్య సమావేశము


రక్షకుని స్పర్శ

ఆయనను ఆశ్రయించినచో మనలను స్వస్థపరపరచుటకైనను లేక, ఎట్టి పరిస్థితినైనను ఎదుర్కొను శక్తి నిచ్చుటకైనను దేవుడు మనకు అండగా వచ్చును.

రమారమి రెండు వేల సంవత్సరాల క్రితం, ధన్యతలను మరియు ఇతర సువార్త సూత్రాలను బోధించిన తరువాత రక్షకుడు కొండ దిగి వచ్చెను. ఆయన నడచుచుండగా, కుష్టు వ్యాధిగల ఓక మనుష్యుడు ఆయన యొద్దకు వచ్చెను. ఆ మనుష్యుడు వ్యాదిబాధ నుండి ఉపశమనమునొంద గోరి, భక్తి మరియు గౌరవముతో క్రీస్తు నెదుట మోకరించెను. “ప్రభువా, నీ చిత్తమైతే నన్ను శుద్దునిగా చేయగలవు.,” అనెడి అతని అభ్యర్ధన సాధారణమైనది.

అప్పుడు రక్షకుడు చేయి చాపి అతనిని తాకి ,“నాకిష్టమే, నీవు శుద్దుడవు కమ్ము,” అనెను. 1

కనుక, మన రక్షకుడు ఎల్లప్పుడూ మనలను దీవించ కోరుచున్నాడని మనము తెలుసుకొను చున్నాము. కొన్ని దీవెనెలు వెంటనే రావచ్చును, మరి కొన్ని ఎక్కువ సమయం తీసుకో వచ్చును, ఇంకా కొన్ని ఈ జీవితం ముగిసిన తరువాత రావచ్చును, కాని దీవెనలు తగిన సమయంలో తప్పక వచ్చును.

ఆ కుష్టురోగి వలె మనము ఆయన చిత్తమును అంగీకరించుట, మరియు ఆయన మనలను దీవించ గోరుచున్నాడని గ్రహించుట ద్వారా ఈ జీవితంలో మనము బలమును మరియు ఆదరణను పొందగలము. ఎటువంటి సవాలునైనా ఎదుర్కొనుటకును, ఏ రకమైన శోధనలైనా జయించుటకును, వాస్తవాలను అర్ధంచేసుకొనుటకును భరించుటకును మనము బలమును పొందగలము. ఆయన యొక్క జీవితంలో మిక్కిలి క్లిష్ట సమయాలలో ఒకసారి రక్షకుడు తన తండ్రితో, “నీ చిత్తము నెరవేరును గాక,” అన్నప్పుడు ఆయనలో భరించే శక్తి మరింత లోతుగాబలపడింది.” 2

ఆ కుష్టురోగి తన విన్నపమును నటనతోగాని, దౌర్జన్యంతోగాని చేయలేదు. అతని మాటల వైఖరిలో దీనత్వం, ఉన్నతమైన ఆకాంక్షతో పాటు రక్షకుని చిత్తం నెరవేరాలని హృదయ పూర్వక మైన కోరిక విశదమౌతున్నది మనము క్రీస్తు నొద్దకు రావలసిన వైఖరికి ఒక ఉదాహరణ. రక్షకుని అభిలాష ఇప్పుడు, ఎల్లప్పుడు కూడ మన మర్త్య మరియు అమర్త్య జీవితాలకు అత్యుత్తమమైనదను నిశ్చయతతో ఆయన యొద్దకు రావలెను. మనకు అందనటువంటి అనంత మైన దృష్టి ఆయనకు కలదు. మన అభీష్టము క్రీస్తుయొక్క అభీష్టముచేత ఆవరింపబడవలెననెడి హృదయపూర్వక మైన అభిలాషతో మనము క్రీస్తునొద్దకు రావలెను.3 ఇది మనలను నిత్యజీవమునకు సిద్ధపరచును.

రక్షకుని యొద్దకు వచ్చిన కుష్టురోగి భరిస్తున్న శారీరక మరియు మానసిక బాధను ఊహించడం చాలా కష్టతరము. కుష్టురోగము నరములమీద, చర్మముమీద ప్రభావం చూపుటవలన వికృతాకారమును మరియు అంగవైకల్యమును కలుగును. అంతకుమించిన పెద్ద సాంఘిక కళంకమునకు అది దారితీయును. కుష్టురోగముతో బాధింపబడిన వారెవరైనను తమ ప్రియులను, విడిచిపెట్టి సంఘమునుండి వెలివేయబడి జీవించవలెను. కుష్టురోగులు శారీరకముగాను, ఆత్మీయముగాను అపవిత్రులుగా భావించబడే వారు. ఈ కారణంగా మోషే ధర్మశాస్త్రము, కుష్టురోగులు చినిగిన దుస్తులు ధరించి, వీధులలో నడిచేటప్పుడు, “అపవిత్రులము,” అని కేక వేయవలెనని నిర్దేశించెను.. 4 అస్వస్థులై, తృణీకరిపబడి కుష్టురోగులు పాడుపడిన ఇండ్లలోను, సమాధులలోను నివసిస్తూ జీవితం చాలించేవారు.5 రక్షకుని ఆశ్రయించిన ఆ కుష్టురోగి మనసు విరిగిపోయిన వాడని ఊహించడం కష్టం కాదు.

ఒక్కోసారి, మనం కూడా ఒక విధంగానో మరో విధంగానో మన స్వయంకృతాల వలననో, ఇతరులవలననో, లేక మన ఆధీనంలోలేని పరిస్థితులవలననో మనకు కూడా మనసు విరిగిన భావన కలుగ వచ్చును. అటువంటి స్థితిలో మన చిత్తమును ఆయన చేతులలో పెట్టవచ్చును.

కొన్ని సంవత్సరాల క్రిందట మా బిడ్డలలో ఒకని వివాహమునకు కేవలము రెండు వారాల ముందు నా అర్ధాంగి జుల్మాకు ఒక కష్టతరమైన వార్త అందింది. ఆమెకు పెరోటిడ్ గ్రంధిలో ఒక కణితి ఉన్నది, మరియు అది వేగంగా పెరగసాగింది. ఆమె ముఖం పొంగసాగింది. ఆమె ఒక సున్నితమైన శస్త్ర చికిత్స పొందవలసి యున్నది. ఎన్నో ఆలోచనలు ఆమె మనసులో పరుగులుతీసి ఆమె గుండె బరువయ్యింది. ఆ కణితి ప్రాణంతకమైనదా? తన శరీరం ఏ విధంగా స్వస్థత పొందగలదు? తన ముఖం పక్షవాతానికి గురియౌతుందా? ఆ నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుంది? తన ముఖానికి శాశ్వతమైన మచ్చపడిపోతుందా? ఒకసారి తొలగింపబడిన కణితి తిరిగి వస్తుందా? మా కుమారుని వివాహానికి ఆమె హాజరు కాగలుగుతుందా? ఆపరేషన్ గదిలో ఆమె మనసు విరిగిపోయినట్లనిపించింది.

ఆ అతి ముఖ్యమైన క్షణంలో ఆ తండ్రి చిత్తాన్ని అంగీకరించవలసినదిగా ఆమెతో పరిశుద్ధాత్మ స్వరం నెమ్మదిగా పలికింది. అప్పుడామె దేవుని మీద తన నమ్మకాన్ని నిలిపియుంచాలని నిశ్చయించు కున్నది. ఫలితం ఏమైనప్పటికీ, ఆయన చిత్తమే ఆమెకు ఉత్తమమైనదను భావన ఆమెకు బలముగా కలిగినది. వెంటనే ఆమె శస్త్రచికిత్సాపరమైన నిద్రలోనికి మళ్లింది.

ఆ తరువాత తన దినచర్యలో కవితలా వ్రాసింది: “శస్త్ర చికిత్సకుని బల్లమీద నీ ముందర సాగిలపడితిని, నీ చిత్తమునకు లొంగి, నేను నిద్రపోయితిని. నీ నుండి ఏ చెడుగు రా జాలదని తెలుసుగనుక, నీ వైపు తిరుగగలనని నేను తెలుసుకొంటిని.”

తన చిత్తాన్నిఆ తండ్రి చిత్తానికి లోబరచడంలో ఆమెశక్తిని, ఆదరణను కనుగొన్నది. ఆ రోజు దేవుడు ఆమెను ఘనముగా దీవించెను.

పరిస్థితులు ఏమైనప్పటికీ మన విశ్వాసమును ప్రయోగించి క్రీస్తు నొద్దకు చేరి నమ్మదగిన దేవునిని మనము తెలుసుకొనగలము. నా బిడ్డలలో ఒకడు ఒకసారి వ్రాసినట్లు:

ప్రవక్త ప్రకారం, దేవుని ముఖము సూర్యునికన్నా కాంతివంతమైనది.

మరియు ఆయన తలవెంట్రుకలు హిమముకన్నా తెల్లనివి.

మరియు ఆయన స్వరము నదీ ప్రవాహమువలే ఘోషించును.

మరియు ఆయన ప్రక్కన మానవుడు అల్పుడు. …

నేను కూడా అల్పుడనని గ్రహించినప్పుడు నేను చితికిపోయితిని.

ఆ సమయములో నేను తడబడి నమ్మదగిన ఆ దేవుని త్రోవలో అడుగిడితిని

ఆ సమయములో మాత్రమే నేను నమ్మదగిన ఆ దేవుని కనుగొంటిని. 6

మనము నమ్మదగిన దేవుడు ప్రతి పరిస్థితిలోను మన నిరీక్షణను దృఢపరచును. మనము ఆయనను నమ్మవచ్చునుఎందుకనగా ఆయన మనలను ప్రేమించుచున్నాడు మరియు ప్రతి పరిస్థిటిలోను మనకు ఏది మంచిదో అది కోరుచున్నాడు.

ఆ కుష్టురోగి నిరీక్షణ యొక్క శక్తిచేత ముందుకు వచ్చెను.. ఈ ప్రపంచము అతనికి పరిష్కారము ఇవ్వలేదు, కనీసము ఆదరణ కూడా ఇవ్వలేదు. ఆ విధంగా రక్షకుని మామూలు స్పర్శ, అతని ఆత్మకు ఒక కౌగిలివలే అనుభూతిని కలిగించియుండవచ్చును. రక్షకుని యొక్క స్పర్శ, ప్రధానంగా “నా కిష్టమే, నీవు శుద్దుడవు కమ్ము” అను మాటలు విన్నప్పుడు ఆ కుష్టురోగిలో కలిగిన లోతైన కృతజ్ఞతాభావం మనం ఊహించగలం మాత్రమే .

“వెంటనే అతని కుష్టురోగము శుద్ధిచేయబడెను.” అని ఆ కథ చెప్పుచున్నది.7

మనము కూడా రక్షకుని యొక్క ప్రేమగల స్వస్తపరచు శ్పర్శ యొక్క అనుభూతిని పొందగలము. మనము శుద్దులగుటకు ఆయన సహాయము చేయకోరుచున్నాడని తెలుసుకొనుట వలన ఎంతటి సంతోషము, నిరీక్షణ, మరియు కృతజ్ఞతా భావం మన ఆత్మలకు కలుగునో! స్వస్థపరపరచుటకైనను లేక, ఎట్టి పరిస్థితినైనను ఎదుర్కొను శక్తి నిచ్చుటకైనను మనము ఆయనను ఆశ్రయించి నప్పుడు దేవుడు మన సహాయమునకు వచ్చును.

ఎంతైనా, మన స్వీయ చిత్తము కాకుండా—ఆయన చిత్తమును అంగీకరించుట—మన పరిస్ధితులను మనం అర్దం చేసుకొనుటకు మనకు సహాయము చేయును. దేవునినుండి ఏ విధమైన చెడు రాదు. మనకు ఏది ఉత్తమమో ఆయన యెరిగియున్నాడు. బహుశా ఆయన మన భారములను వెంటనే తొలగించడు. ఆయన ఆల్మా మరియు అతని జనులకు చేసిన విధంగా కొన్నిసార్లు ఆ భారములను తేలికఅనిపించేలా చేయగలడు.8 చిట్టచివరకు, నిబంధనల మూలముగా ఆ భారములు ఎత్తివేయబడతాయి,9 ఈ జీవితములోగాని, లేక పరిశుద్ధ పునరుద్ధానములోగాని..

ఆయన చిత్తము నేరవేరవలెనను మనఃపూర్వక కోరికతోపాటు మన విమోచకుని దైవత్వముయొక్క అవగాహన, మనకు ఆ కుష్టురోగి శుద్దుడగుటకు చూపినటువంటి విశ్వాసమును పెంపొందించుకొనుటకు మనకు సహాయంచేయును. యేసు క్రీస్తు ప్రేమ గల దేవుడు, నిరీక్షణ గల దేవుడు, స్వస్థపరచు దేవుడు, మనలను దీవించకోరుచు మనము శుద్దులగుటకు సహాయము చేయు దేవుడు. మనము పాపములో పడినప్పుడు మనలను కాపాడుటకు ఆయన స్వచ్ఛందంగా ఈ భూమిమీదకు రాకపూర్వము ఆయన కోరినది అదే. పాపపరిహారమునకై వెలచెల్లించుటకుపడు వేదన సమయంలో ఆయన మానవ అంచనాలకు మించిన శ్రమ నెదుర్కొన్నప్పుడు. గెత్సెమనేలో ఆయన కోరినది అదే. ఇప్పుడు ఆయన మన తరపున ఆ తండ్రి ఎదుట వ్యాజ్యమాడు నప్పుడు, ఆయన కోరునది అదే.10 “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును,” అని యేసు యొక్క స్వరము ఇంకనూ ప్రతిధ్వనించుచున్నది ఎందుకంటే, అందుకే.11

ఆయన మనలను స్వస్థపరచగలడు మరియు లేవనెత్తగలడు ఎందుకనగా ఆలాగు చేయుటకు ఆయనకు సామర్ధ్యము కలదు. ప్రతి విషయములోను మనకు సహాయము చేయగలుగుటకును, మరియు మనలను స్వస్థపరచుటకును మరియు మనలను లేవనెత్తుటకును ఆయన ప్రేవులు కరుణతో నింపబడునట్లు శారీరక, ఆత్మీయ బాధలన్నిటిని ఆయన భరించెను.12 అబీనడై ఉదహరించిన యెషయా మాటలు దానిని అందముగాను, మరియు మనసును కదిలించే విధముగాను ఉన్నవి.

నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. …

“… మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మనదోషములనుబట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్దమైన శిక్ష అతని మీద పడెను అతడుపొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది.”13

ఇదే భావన ఈ కవితలో బోధించబడుచున్నది

“ఓ నజరేతు వడ్రంగీ,

బాగుచేయనలవికాకుండా చితికిన ఈ గుండె

చావుమట్టుకు చెదరిపోయిన ఈ జీవితం

ఆహా, బాగుచేయగలవా, వడ్రంగీ?”

ఆయన జాలిగల మరియు సంసిద్ధమైన హస్తముతో,

మధురమైన తన స్వీయ జీవితం అల్లుకుపోయింది.

చితికిన మన జీవితాలు, నిలబడే వరకు

ఒక క్రొత్త సృష్టి—“సమస్తమును క్రొత్తవి”

“ఆ చెదరిన గుండె యొక్క సంగతి,

ఆశ, అభిలాష, నిరీక్షణ, మరియు విశ్వాసము,

ఉత్తమమైన భాగములోనికి నీవు ఇమిడిపో,

ఓ, నజరేతు వడ్రంగీ!”14

ఏ విధానములోనైనను నీవు అపరిశుద్ధముగా నున్నట్లు నీవు భావించిన యెడల, నీవు చితికిపోయినట్లు భావించినయెడల, నీవు శుద్ధిచేయబడగలవని సంతోషముతో తెలుసుకో. నీవు సరిచేయబడ గలవు. ఆయన యొద్దనుండి ఏ విధమైన కీడు రానేరదని నమ్మవలెను.

ఎందుకనగా ఆయన “అన్ని విషయముల యొక్క లోతుల వరకు అవరోహించియున్నాడు,” మన జీవితాలలో చితికిపోయిన వన్నియు సరియగునట్లు సాధ్యపరచగలడు మరియు ఆ విధముగా, మనము దేవునితో రాజీపడగలము.15 ఆయన ద్వారా, అన్ని విషయాలు సమాధానపడతాయి, భూమిపై ఉన్న విషయాలు మరియు స్వర్గంలో ఉన్నవి రెండూ “ఆయన సిలువ రక్తం ద్వారా శాంతిని” కలిగిస్తాయి.16

అవసరమైన అడుగులువేసి క్రీస్తు నొద్దకు వచ్చెదము. ఈ విధముగా చేయుచు “ప్రభువా, నీ చిత్తమైతే నీవు నన్ను శుద్దునిగా చేయగలవు” అన్నట్లు మన వైఖరి, ఉండవలెను. ఆ విధముగా చేసిన యెడల మనము బోధకునియొక్క స్వస్థపరచు స్పర్శతో పాటు “నాకిష్టమే, శుద్దుడవుకమ్ము.” అను మధురమైన ఆయన స్వరము యొక్క ప్రతిధ్వనిని వినగలము.

ఆ రక్షకుడు మనము నమ్మదగిన దేవుడు. ఆయనే క్రీస్తు, అభిషిక్తుడు, పరిశుద్ధుడైన మెస్సీయ అని యేసు క్రీస్తు పరిశుద్ధ నామముననే సాక్ష్యమిచ్చుచున్నాను., ఆమెన్.

ముద్రించు