2010–2019
స్థిరమైన, స్థితిస్థాపకమైన నమ్మకము
2019 అక్టోబర్ సర్వసభ్య సమావేశము


2:3

స్థిరమైన, స్థితిస్థాపకమైన నమ్మకము

ప్రభువునందు నమ్మకముంచుట ఆయన సమయమందు నమ్మకముంచుటను కలిగియున్నది మరియు జీవితపు కష్టాలను దీర్ఘకాలము మనగల ఓపిక మరియు సహనము అవసరము.

ఆఫ్రికాలో తన మిషనుపై ఉన్న మా కుమారుడు డేన్ చాలా అస్వస్థత చెందాడు, పరిమితమైన వనరులతో నున్న ఒక ఆస్పత్రికి తీసుకొనిపోబడ్డాడు. అతడు అస్వస్థత తరువాత మాకు వ్రాసిన అతడి మొదటి లేఖను మేము చదివినప్పుడు, అతడు నిరాశ చెందియుంటాడని మేము ఊహించాము, కానీ బదులుగా అతడు ఇలా వ్రాసాడు, “అత్యవసర గదిలో నేను పడుకొన్నప్పుడు, నేను శాంతిని అనుభవించాను. నా జీవితంలో నేను ఎన్నడూ అంత స్థిరమైన స్థితిస్థాపకమైన సంతోషంగా లేను.”

నేను, నా భార్య ఈ మాటలను చదివినప్పుడు, మేము భావోద్వేగము చెందాము. స్థిరమైన స్థితిస్థాపకమైన సంతోషము. సంతోషము ఆ విధముగా వర్ణించబడుట మేము ఎన్నడూ వినలేదు, కానీ అతడి మాటలు సత్యముగా ధ్వనించాయి. అతడు వర్ణించిన సంతోషము కేవలము ఉల్లసించుట కాదు, లేక కృత్రిమమైన మానసిక స్థితి కాదు, కానీ దేవుని శక్తి మరియు ప్రభావమునకు మనల్ని మనం అప్పగించుకొని లేక లోబడి అన్ని విషయాలందు1 ఆయనయందు మన నమ్మకముంచినప్పుడు, వచ్చు శాంతి మరియు ఆనందము. జీవితము కష్టమైనదిగా, అస్థిరమైనదిగా కనబడినప్పుడు క్రీస్తునందు నిరీక్షణ కలిగియుండునట్లు చేసి, దేవుడు మా ఆత్మలతో శాంతితో మాట్లాడిన అటువంటి సమయాలను మా జీవితాలలో మేము కూడా కలిగియున్నాము.2

ఆదాము మరియు హవ్వలు పడిపోని యెడల, “ఆనందములేక వారు అమాయకపు స్థితిలో ఉండేవారు, ఎందుకనగా వారు దైన్యము నెరుగరు; …

“కానీ ఇదిగో, సకల కార్యములను ఎరిగిన ఆయన యొక్క వివేకమందు అన్ని వస్తువులు చేయబడినవి.

“ఆదాము మనుష్యులుండునట్లు పతనమాయెను, మరియు మనుష్యులు సంతోషమును కలిగియుండునట్లు వారు ఉన్నారు.”3

మనము ప్రభువుయందు, మన కొరకైన ఆయన ప్రణాళికయందు నమ్మకముంచిన యెడల, ఒక విరుద్ధమైన విధానములో, బాధలు, విచారము సంతోషమును అనుభవించుటకు మనల్ని సిద్ధపరచును. ఈ సత్యము 13 వ శతాబ్ధపు కవి చేత మనోహరంగా వ్యక్తపరచబడింది: “విచారము మిమ్మల్ని సంతోషము కొరకు సిద్ధపరచును. అది మీ గృహం నుండి అన్నిటినీ బలవంతముగా తీసివేయును, ఆవిధంగా క్రొత్త సంతోషము ప్రవేశించుటకు స్థలమును కనుగొనగలదు. అది మీ హృదయపు శాఖ నుండి పసుపు ఆకులను తీసివేయును, ఆవిధంగా క్రొత్తవి, పచ్చని ఆకులు వాటి స్థలములో ఎదగగలవు. అది కుళ్లిపోయిన వేర్లను లాగివేస్తుంది, ఆవిధంగా, క్రింద దాగియున్న క్రొత్త వేర్లు ఎదుగుటకు స్థలము కలిగియుంటాయి. మీ హృదయము నుండి విచారము తీసివేయబడినప్పుడు, చాలా మంచి విషయాలు వాటి స్థానములో వస్తాయి.”4

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించారు, “రక్షకుడు (మనకు) ఇచ్చు సంతోషము … స్థిరమైనది, మన ‘బాధలు స్వల్ప క్షణముంటాయి’ [సిద్ధాంతము మరియు నిబంధనలు 121:7] మన ప్రయోజనము కొరకు సమర్పించబడునని, అని మనకు అభయమిచ్చును.”5 మన శ్రమలు మరియు బాధలు గొప్ప సంతోషము కొరకు స్థలాన్ని ఇస్తాయి.6

సువార్త యొక్క శుభవార్త ఏదనగా, జీవితం విచారము, శ్రమ లేకుండా ఉండదనే వాగ్దానము కాదు, కానీ అర్ధము, ఉద్దేశము నిండిన జీవితము—మన విచారములు, బాధలు “క్రీస్తు యొక్క సంతోషమందు హరించవేయబడగల,”7 జీవితము. రక్షకుడు ప్రకటించాడు, “లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.”8 ఆయన సువార్త నిరీక్షణగల సందేశము. యేసు క్రీస్తునందు నిరీక్షణతో జతపరచబడిన విచారము శాశ్వతమైన సంతోషము యొక్క వాగ్దానమును కలిగియున్నది.

వాగ్దాన దేశమునకు జెరడీయుల ప్రయాణము యొక్క వృత్తాంతము మర్త్యత్వము గుండా మన ప్రయాణము కొరకు ఒక ఉపమానముగా ఉపయోగించబడవచ్చు. జేరెడ్ యొక్క సహోదరుడు మరియు అతడి జనులకు ప్రభువు ఇలా వాగ్దానమిచ్చాడు, ఆయన “భూమి యొక్క సమస్త దేశముల కన్న శ్రేష్ఠమైన ఒక దేశములోనికి, (వారికి) ముందు వెళ్లెదను.”9 ఆయన వారిని పడవలను నిర్మించమని ఆజ్ఞాపించాడు, మరియు ప్రభువు యొక్క సూచనల ప్రకారము వారు లోబడి వాటిని కట్టసాగారు. అయినప్పటికినీ, పని వృద్ధి చెందినప్పుడు, జెరెడ్ యొక్క సహోదరునికి పడవల కొరకు ప్రభువు యొక్క నమూనా గురించిన సందేహాలు కలిగాయి. అతడు మొర్రపెట్టాడు:

“ఓ ప్రభువా నీవు నాకు ఆజ్ఞాపించిన పనిని నేను నెరవేర్చితిని, నీవు నన్ను నిర్ధేశించినట్లుగా నేను పడవలను చేసితిని.

“మరియు, ఇదిగో, ఓ ప్రభువా, వాటిలో ఎట్టి వెలుగు లేదు.”10

“ఓ ప్రభువా, మేము ఈ గొప్ప జలమును చీకటిలో దాటుటకు నీవు అనుమతించెదవా?”11

మీరు ఎప్పుడైనా ఆవిధంగా దేవునికి మీ ఆత్మను క్రుమ్మరించారా? ప్రభువు ఆజ్ఞాపించినట్లుగా జీవించుటకు ప్రయాసపడి, ఈ జీవితములో నీతిగల ఆశలు తీరనప్పుడు, నడిపింపు లేకుండా ఈ జీవితం గుండా ప్రయాణించాలా అని మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపడ్డారా?12

తరువాత జెరెడ్ యొక్క సహోదరుడు పడవలలో బ్రతికియుండుటకు వారి సామర్ధ్యమును గూర్చి ఇంకా ఎక్కువ చింతను వ్యక్తపరిచాడు. “మేము నశించిపోవుదుము కూడ, ఏలయనగా వాటిలో ఉన్న గాలి తప్ప వాటిలో మేము ఊపిరి పీల్చలేము,”13 అని అతడు మొర్రపెట్టాడు. జీవితపు కష్టాలు ఎప్పుడైన మీరు ఊపిరి పీల్చుట కష్టముగా చేసి, రోజును మీరు ఎలా గడపాలో, మీ పరలోకపు గృహమునకు తిరిగి ఒంటరిగా ఎలా వెళ్లాలో అని మీరు ఆశ్చర్యపడునట్లు చేసాయా?

అతడి ప్రతీ సందేహాలను పరిష్కరించటానికి జెరెడ్ యొక్క సహోదరునితో ప్రభువు పని చేసిన తరువాత, అప్పుడు ఆయన వివరించాడు, “ఏలయనగా సముద్రము యొక్క అలలు, ముందుగా వెళ్లిన గాలులు, రాబోవు వరదలకు ముందుగా నేను మిమ్ములను (ఒక మార్గమును) సిద్ధపరచని యెడల, మీరు ఈ గొప్ప ఆగాథమును దాటలేరు.”14

ఆయన లేకుండా వాగ్దాన దేశమునకు జెరెడీయులు చేరలేరని చివరకు ప్రభువు స్పష్టము చేసాడు. వారు అదీనములో లేరు, ఆయనయందు వారు నమ్మకమునుంచుటయే ఆ గొప్ప ఆగాథమును దాటి వారు వెళ్లగల ఏకైక మార్గము. ఈ అనుభవాలు మరియు ప్రభువు నుండి శిక్షణ జెరెడ్ యొక్క సహోదరుని విశ్వాసము హెచ్చించినట్లు కనబడింది, ప్రభువునందు అతడి నమ్మకమును బలపరచింది.

అతడి ప్రార్థనలు ప్రశ్నలు, సందేహాలను నుండి విశ్వాసము, నమ్మకముగల భావవ్యక్తీకరణలుగా ఎలా మారాయో గమనించండి:

“ప్రభువా, నీవు సమస్త శక్తి కలిగియున్నావని, మనుష్యుని యొక్క ప్రయోజనము కొరకు నీవు కోరినదేదైనను చేయగలవని నేనెరుగుదును; …

“ఇదిగో ఓ ప్రభువా, నీవు దీనిని చేయగలవు. మనుష్యుల గ్రహింపునకు చిన్నదిగా కనబడు గొప్పశక్తిని ముందుకు చూపుటకు నీవు సమర్ధుడవని మేమెరుగుదుము.”15

జెరెడీయులు “వారు వారి యొక్క ఓడలు లేక పడవలను ఎక్కిరి … తమ దేవుడైన ప్రభువునకు అప్పగించుకొనుచూ సముద్రములోనికి ముందుకు వెళ్లిరి,”16 అని వ్రాయబడింది. అప్పగించుకొనుట అనగా అప్పగించుట లేక లోబడుట అని అర్ధము. వారి ప్రయాణములో ఏమి జరుతుందో వారికి ఖచ్చితంగా తెలుసు కనుక జెరెడీయులు పడవలోనికి వెళ్లలేదు. వారు ప్రభువు శక్తి, మంచితనము, కనికరమునందు నమ్మకముంచుట నేర్చుకున్నారు కనుక వారు పైకి వెళ్లారు, కాబట్టి వారు తమను తాము, వారికి గల సందేహాలు లేక భయాలను ప్రభువుకు అప్పగించుకొనుటకు సమ్మతించుచున్నారు.

ఈమధ్య మా మనుమడు ఏబ్ పైకి క్రిందకు కదిలే రంగుల రాట్నం జంతువులలో ఒకటి ఎక్కటానికి భయపడ్డాడు. అతడు కదలని దానిని ఇష్టపడ్డాడు. అతడి మామ్మ అది సురక్షితమైనదని చివరికి ఒప్పించింది, కనుక, ఆమెను నమ్ముతూ, అతడు పైకి ఎక్కాడుయ తరువాత అతడు పెద్ద చిరునవ్వుతో చెప్పాడు, “నేను సురక్షితంగా భావించుట లేదు, కానీ నేను సురక్షితంగా ఉన్నాను.” బహుశా జెరెడీయులు ఆవిధంగా భావించియుండవచ్చు. దేవునిని నమ్ముట మొదట ఎల్లప్పుడు సురక్షితంగా భావించకపోవచ్చు, కానీ తరువాత సంతోషము వచ్చును.

రంగుల రాట్నంపై ఏబ్

జెరడీయులకు ప్రయాణము సులభమైనది కాదు. “వారిపైన విరచుకుపడిన అలల పర్వతములు మరియు గాలి యొక్క తీవ్రతను బట్టి,”17 అనేకసార్లు వారు సముద్రము యొక్క లోతులలో సమాధి చేయబడిరి. అయినప్పటికినీ “గాలి వాగ్దానపు దేశము వైపు వీచుటకు ఎన్నడునూ మానలేదు”18 అని వ్రాయబడింది. గ్రహించుటకు కష్టమైనది అయినట్లుగా, అది ప్రత్యేకంగా వ్యతిరేకత బలముగా ఉండి, మన జీవితాలు కష్టమైనప్పుడు, దేవుడు ఆయన అంతములేని మంచితనమునందు మన పరలోకము వైపు ముందుకు సాగుటకు మనకు ఎల్లప్పుడు సహాయపడుతున్నాడని తెలుసుకొనుటలో మనము ఓదార్పును అనుభవించగలము.

వృత్తాంతం కొనసాగును, “ఆ విధముగా వారు ముందుకు కొట్టుకొనిపోబడిరి, సముద్రము యొక్క ఏ వికృతాకార జంతువు వారిని విరుగగొట్టలేకపోయెను, లేక ఏ తిమింగలము వారిని చెడగొట్టలేకపోయెను, అది నీటిపైన, లేక నీటి క్రింద అయినప్పటికి వారు నిరంతరము వెలుగును కలిగియుండిరి.”19 మరణము యొక్క వికృతాకారపు అలలు, శారీరక, మానసిక వ్యాధి, శ్రమలు, ప్రతీవిధమైన బాధలు మనపై విరచుకొనిపడే ప్రపంచములో మనము జీవిస్తున్నాము. అయినప్పటికినీ, యేసు క్రీస్తునందు విశ్వాసము, ఆయనయందు నమ్మకముంచుటకు ఎంపిక చేయటం ద్వారా, మనము కూడా నీటిపైన లేక నీటి క్రింద నిరంతరము వెలుగును కలిగియుండగలము. మన పరలోక గృహము వైపుగా మనకు గాలి విసరుట దేవుడు ఎన్నడూ మానడనే అభయమును మనము కలిగియుండగలము.

పడవలో అటుఇటు కొట్టబడుచుండగా, జెరెడీయులు, “ప్రభువునకు స్తుతులు పాడిరి; … (వారు) సమస్త దినమంతయు ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను, మరియు రాత్రి వచ్చినప్పుడు, వారు ప్రభువును స్తుతించుట మానలేదు.”20 వారి బాధల మధ్య కూడా వారు ఆనందమును, కృతజ్ఞతాస్తుతులు అనుభవించారు. వారింకను వాగ్దాన దేశములో ప్రవేశించలేదు, అయినప్పటికినీ వారు ఆయనయందు వారి స్థిరమైన మరియు స్థితిస్థాపకమైన నమ్మకము వలన వాగ్దానము చేయబడిన దీవెనలందు వారు ఆనందించారు.21

జెరెడీయులు 344 దినములు తర్వాత నీటిమీదకు తెబడ్డారు.22 మీరు దానిని ఊహించగలరా? ప్రభువునందు నమ్మకముంచుట ఆయన సమయమందు నమ్మకముంచుటను కలిపియున్నది, మరియు జీవితపు కష్టాలను దీర్ఘకాలము మనగల ఓపిక మరియు సహనము అవసరము.23

చివరకు, జెరెడీయులు “వారు వాగ్దానపు దేశము యొక్క ఒడ్డుపైన దిగిరి. వారు వారి పాదములు వాగ్దానపు దేశము యొక్క ఒడ్డులపైన మోపినప్పుడు, వారు క్రిందికి వంగి నమస్కరించిరి, మరియు ప్రభువు యెదుట తగ్గించుకొనిరి. వారిపైన ఆయన మృదు కనికరముల యొక్క సమూహమును బట్టి, ప్రభువు యెదుట ఆనంద బాష్పములు రాల్చిరి.”24

మన నిబంధనలను పాటించుటలో మనము విశ్వాసముగా ఉన్నయెడల, మనము కూడా ఒకరోజు ఇంటికి సురక్షితంగా చేరి, ప్రభువు యెదుట వంగి నమస్కరించి, ఎక్కువ సంతోషము కొరకు స్థలము ఇచ్చిన విచారములు కలిపి, మన జీవితాలలో విస్తారమైన ఆయన మృదువైన కనికరముల కొరకు ఆనంద భాష్పాలను కారుస్తాము.25

ప్రభువుకు మనల్ని అప్పగించుకొని, యేసు క్రీస్తునందు మరియు మన జీవితాలలో ఆయన దైవిక ఉద్దేశ్యములందు స్థిరముగా, స్థితిస్థాపకంగా నమ్మకముంచినప్పుడు, ఆయన మనల్ని అభయములతో దర్శించును, మన ఆత్మలతో శాంతితో మాట్లాడును, మరియు “ఆయనయందు మన విడుదల కొరకు నిరీక్షించునట్లు”26 మనల్ని చేయునని నేను సాక్ష్యమిస్తున్నాను.

యేసే క్రీస్తని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన సమస్త సంతోషము యొక్క ఆధారము.27 ఆయన కృప చాలును, మరియు ఆయన రక్షించుటకు బలమైనవాడు.28 ఆయన వెలుగును, సత్యమును, మరియు లోకము యొక్క నిరీక్షణయైయున్నాడు.29 ఆయన మనల్ని నశించిపోనివ్వడు.30 యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. ఆల్మా 36:3; 57:27 చూడుము.

  2. ఆల్మా 58:11 చూడుము.

  3. 2 నీఫై 2:23-25; వివరణ చేర్చబడింది.

  4. See The Mathnawi of Jalalu’ddin Rumi (1925–40), trans. Reynold A. Nicholson, vol. 5, 132.

  5. Russell M. Nelson, “Joy and Spiritual Survival,” Liahona, Nov. 2016, 82.

  6. Neal A. Maxwell, “Plow in Hope,” Liahona, July 2001, 73 చూడుము: “విమోచించు యేసు కూడ ‘మరణమునకు తన ఆత్మను కూడా క్రుమ్మరించెను.’ … మనము అప్పుడప్పుడు వ్యక్తిగత మనవులందు మన ఆత్మలను ‘క్రుమ్మరించినప్పుడు,’ మనము ఆవిధంగా సంతోషము కొరకు ఎక్కువ స్థలమిస్తూ ఖాళీ చేయబడ్డాము!”

  7. ఆల్మా 31:38; see also Neal A. Maxwell, “Brim with Joy” (Brigham Young University devotional, Jan. 23, 1996), కూడ చూడుము: “మనము ప్రతిష్ఠంచబడిన స్థితికి చేరినప్పుడు, మన బాధలు క్రీస్తు యొక్క సంతోషమునందు ఉపసంహరించబడును. దాని అర్ధము మనము బాధలు కలిగియుండమని కాదు, కానీ అవి దృష్టికోణములో ఉంచబడును, అది వాటితో వ్యవహరించుటకు మనల్ని అనుమతించును. ఆనందమును గూర్చి మన స్థిరమైన ప్రయత్నముతో, మరియు హెచ్చించబడిన నీతి యొక్క పరిమాణముతో, ఒక చుక్క తరువాత మరొకటి—ప్రవక్త యొక్క మాటలలో, మన హృదయాలు ‘సంతోషముతో నిండు’ వరకుఆల్మా 26:11 —మనము ఇంకొక చుక్క ఆనందమును అనుభవిస్తాము. ఆఖరికి, ఆత్మ యొక్క కప్పు పొంగి పొర్లును!”

  8. యోహాను 16:33.

  9. ఈథర్ 1:42.

  10. ఈథర్ 2:18–19.

  11. ఈథర్ 2:22.

  12. యోహాను 8:12 చూడుము.

  13. ఈథర్ 2:19; మార్కు 4:38 పోల్చుము; మార్కు 4:35–41 కూడా చూడుము.

  14. ఈథర్ 2:25; వివరణ చేర్చబడినది.

  15. ఈథర్ 3:4–5.

  16. ఈథర్ 6:4; వివరణ చేర్చబడినది.

  17. ఈథర్ 6:6.

  18. ఈథర్ 6:8; వివరణ చేర్చబడింది; 1 నీఫై 18:8 కూడా చూడుము.

  19. ఈథర్ 6:10.

  20. ఈథర్ 6:9; 1 నీఫై 18:16 కూడా చూడుము.

  21. 1 నీఫై 5:5 పోల్చుము. ఇంకా అరణ్యములో ఉన్నప్పటికినీ, లీహై వాగ్దానము చేయబడిన దీవెనలను బట్టి ఆనందించాడు.

  22. ఈథర్ 6:11 చూడుము.

  23. హెబ్రీయులకు 10:36; ఆల్మా 34:41; సిద్ధాంతము మరియు నిబంధనలు 24:8; 64:32 చూడుము.

  24. ఈథర్ 6:12.

  25. 1 నీఫై 1:20; 8:8; ఆల్మా 33:16చూడుము.

  26. ఆల్మా 58:11.

  27. రస్సెల్  ఎమ్. నెల్సన్, “Joy and Spiritual Survival,” 82 చూడుము.

  28. 2 నీఫై 31:19; ఆల్మా 34:18; మొరోనై 10:32 చూడుము.

  29. జీవముగల క్రీస్తు: అపొస్తలుల యొక్క సాక్ష్యం,” చూడండి, లియహోనా, మే 2017, ముఖపేజీ లోపల.

  30. 1 నీఫై 1:14 చూడుము.