2010–2019
అవిశ్వాసిగా కాక, విశ్వాసముతో నుండుము
2019 అక్టోబర్ సర్వసభ్య సమావేశము


2:3

అవిశ్వాసిగా కాక, విశ్వాసముతో నుండుము

ప్రతీరోజు లోకము నుండి వేరుచేయబడి, పరలోకముతో సంబంధము కలిగియుండుటకు మనము ఉద్దేశ్యపూర్వకంగా సమయాన్ని కేటాయించాలి.

కొంతకాలం క్రితం నేను మేల్కొని, లేఖనాలను అధ్యయనము చేయుటకు సిద్ధపడాను. నేను నా స్మార్ట్ ఫోను తీసుకొని, సువార్త గ్రంధాలయముల యాప్ తెరచే ఉద్దేశముతో, నా మంచం ప్రక్కన ఉన్న కూర్చిలో కూర్చోన్నాను. నా ఫోను తెరిచి చదవటం ప్రారంభిస్తుండగా, రాత్రి వచ్చిన సందేశాలు, ఈ-మెయిల్స్ గల అరడజను ప్రకటనలను నేను చూసాను. నేనిలా అనుకున్నాను, “నేను త్వరగా ఆ సందేశాలను పరిశీలించి, తరువాత, లేఖనాలను చదువుతాను.” అయితే, రెండు గంటల తరువాత కూడా నేనింకా సందేశాలు, ఈ-మెయిల్స్, సంక్షిప్త వార్తలు, సామాజిక మీడియా పోస్టులు చదువుతూనే ఉన్నాను. సమయము ఎంతైందో నేను గ్రహించినప్పుడు, నేను ఆ రోజు కొరకు సిద్ధపడటానికి పిచ్చిగా పరుగెత్తాను. ఆ ఉదయము నా లేఖన అధ్యయనమును కోల్పోయాను, తత్ఫలితంగా నేనాశించిన ఆత్మీయ పోషణను నేను పొందలేదు.

ఆత్మీయ పోషణ

మీలో అనేకులకు అలాంటి అనుభవాన్ని కలిగియుంటారని భావిస్తున్నాను. ఆధునిక సాంకేతికతలు మనల్ని అనేక విధాలుగా దీవించాయి. అవి మనల్ని స్నేహితులు, కుటుంబము, సమాచారము, ప్రపంచమంతటా ప్రస్తుతపు సంఘటనలతో గూర్చిన వార్తలతో మనల్ని సంబంధింపచేస్తాయి. అయినప్పటికినీ, అవి మిక్కిలి ముఖ్యమైన సంబంధమైన: పరలోకముతో మన సంబంధము నుండి మనల్ని అంతరాయపరుస్తున్నాయి.

మన ప్రవక్త అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ చెప్పిన దానిని నేను మరలా చెప్తాను: “మనము చిక్కైన మరియు హెచ్చగుచున్న వివాదస్పదమైన లోకములో జీవిస్తున్నాము. సామాజిక మీడియా నిరంతరము లభ్యమగుట, 24-గంటలు వార్తల చక్రము మనల్ని పట్టువిడువని సందేశాలతో ముంచివేస్తుంది అనేక భిన్న అభిప్రాయములను, సత్యమును ముట్టడి చేయు మనుష్యుల వేదాంతములను జాగ్రత్తగా పరిశీలించుటనుండి బయటకు రావలని ఆశించిన యెడల, మనము బయల్పాటును పొందటం నేర్చుకోవాలి.”

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్, కొనసాగిస్తూ హెచ్చరించారు, “రాబోయ దినములలో, పరిశుద్ధాత్మ నడిపింపును, నిర్ధేశాన్ని, ఆదరించే నిరంతర ప్రభావము లేకుండా, ఆత్మీయంగా బ్రతికియుండుట సాధ్యము కాదు.”1

సంవత్సరాల క్రితం, అధ్యక్షులు బాయిడ్ కే. పాకర్ జింకల మంద గురించి చెప్పారు, విపరీతంగా మంచు కురియటం వలన, అవి వాటి సహజమైన ఆవాసము బయట చిక్కుబడి, ఆకలిని ఎదుర్కొన్నాయి. కొంతమంది మంచి వ్యక్తులు, జింకలను కాపాడే ప్రయత్నములో, ప్రాంతము చుట్టూ, ట్రక్కులతో నిండిన గడ్డిని వదిలారు—అది సాధారణంగా జింకలు తినేది కాదు, కానీ అది జింకలకు శీతాకాలమంతా సరిపోతుందని వారు ఆశించారు. విచారకరంగా, తరువాత జింకలలో అనేకం చనిపోయాయి. అవి గడ్డిని తిన్నాయి, కానీ అది వాటిని పోషించలేదు, వాటి కడుపులు నిండినా అవి మాత్రం ఆకలితో చనిపోయాయి.2

సమాచారపు యుగములో మనము నిరంతరము పొందు అనేక సందేశాలు, ఆత్మీయంగా జింకలకు గడ్డిని ఆహారంగా ఇచ్చుటతో సమానమైనవి—మనము దానిని రోజంతా తినవచ్చు, కానీ అది మనల్ని పోషించదు.

నిజమైన ఆత్మీయ పోషణను మనము ఎక్కడ కనుగొనగలము? చాలా తరచుగా, అది సామాజిక మీడియాలో ప్రసిద్ధి చెందలేదు. నిబంధన బాటపై “(మన) మార్గములో ముందుకు సాగి,” వెళ్లినప్పుడు, “నిరంతరము ఇనుపదండము అంచును గట్టిగా పట్టుకొని,” జీవవృక్ష ఫలమును తీసుకొన్నప్పుడు, మనము దానిని కనుగొంటాము.3 దీని అర్ధము ప్రతీరోజు లోకము నుండి వేరుచేయబడి, పరలోకముతో సంబంధము కలిగియుండుటకు మనము ఉద్దేశ్యపూర్వకంగా సమయాన్ని కేటాయించాలి.

తన స్వప్నములో, ఫలమును తీసుకొన్నా, గొప్ప విశాలమైన భవనము, లోకము యొక్క గర్వముల ప్రభావము వలన దానిని విడిచిపెట్టిన జనులను లీహై చూసాడు.4 యౌవనులు కడవరి-దిన పరిశుద్ధ గృహములో పెంచబడుటకు, సరైన సంఘ సమావేశాలకు, తరగతులకు హాజరై, దేవాలయములో విధులందు పాల్గొన్నాక కూడా, “నిషేధించబడిన దారులలో పడి, నశించిపోవుట”5 సాధ్యము. ఇది ఎందుకు జరుగుతుంది? అనేక సందర్భాలలో ఇది ఎందుకు జరుగుతుందనగా, వారు బాహ్యకరమైన ఆత్మీయ విషయాలను చేస్తున్నప్పటికినీ, వారు నిజముగా మార్పు చెందలేదు. వారు ఆహారమివ్వబడ్డారు కానీ పోషకాహారమివ్వబడలేదు.

యువత ప్రోత్సాహకార్యక్రమము

వ్యతిరేకంగా, నేను బలమైన, ప్రకాశవంతమైన, విశ్వాసులైన యౌవన కడవరి దిన పరిశుద్ధులైన మీలో అనేకమందిని కలిసాను. మీరు దేవుని కుమారులు మరియు కుమార్తెలని, ఆయన మీరు చేయాల్సిన కార్యమును కలిగియున్నారని మీరు ఎరుగుదురు. మీరు మీ పూర్ణ “హృదయము, శక్తి, మనస్సు, మరియు బలముతో,”6 దేవునిని ప్రేమిస్తున్నారు. మీరు మీ నిబంధనలు పాటిస్తున్నారు, మరియు ఇంటిలో ప్రారంభించి, ఇతరులకు సేవ చేస్తున్నారు. మీరు విశ్వాసమును సాధన చేసి, పశ్చాత్తాపపడి, ప్రతీరోజు మెరుగుపరచుకుంటారు, ఇది మీకు శాశ్వతమైన సంతోషమును తెస్తుంది. మీరు దేవాలయ దీవెనలు కొరకు సిద్ధపడుచున్నారు, రక్షకుని నిజమైన అనుచరులుగా మీరు ఇతర అవకాశాలను కలిగియుంటారు. అందరిని క్రీస్తునొద్దకు రమ్మని, ఆయన ప్రాయశ్చిత్తః శక్తి యొక్క దీవెనలు పొందమని ఆహ్వానిస్తూ, రెండవ రాకడ కొరకు లోకమును సిద్ధపరచుటకు మీరు సహాయపడుతున్నారు. మీరు పరలోకముతో అనుసంధానించబడియున్నారు.

యువత దేవాలయ ప్రయాణము

అవును, మీరు సవాళ్లను ఎదుర్కొంటారు. ప్రతీ తరము ఆవిధముగా ఉన్నది. ఇవి మన దినములు, మనము అవిశ్వాసులుగా కాక, విశ్వాసము కలిగియుండాలి. ప్రభువు మన సవాళ్ళను గూర్చి ఎరిగియున్నాడని, అధ్యక్షులు నెల్సన్ నాయకత్వము ద్వారా, వారిని కలుసుకోవటానికి ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడని నేను సాక్ష్యమిస్తున్నాను. గృహము-కేంద్రంగా సంఘము మద్ధతుతో ఇటీవల ప్రవక్త ఇచ్చిన పిలుపు మన భవనములందు మనము చేయు దానితో బలపరచబడి,7 ఈ ఆత్మీయ పోషకాహార లోపముగల దినములలో—బ్రతికి—వృద్ధి చెందుటకు మనకు సహాయపడునట్లు ప్రణాళిక చేయబడిందని నేను నమ్ముచున్నాను.

గృహము కేంద్రంగా

గృహము-కేంద్రంగా సంఘము అనగా అర్ధమేమిటి? ప్రపంచమంతటా గృహాలు చాలా భిన్నంగా కనబడవచ్చు. అనేక తరములుగా సంఘములో ఉన్న ఒక కుటుంబానికి మీరు చెందియుండవచ్చు. లేక మీ కుటుంబములో మీరు ఒక్కరు మాత్రమే సంఘ సభ్యులు కావచ్చు. మీరు వివాహితులు లేక ఒంటరివారు, ఇంట్లో పిల్లలు ఉన్నవారు లేక లేనివారు కావచ్చు.

మీ పరిస్థితులు ఏమైనప్పటికీ, మీరు మీ గృహమును సువార్త నేర్చుకొనుటకు, జీవించుటకు కేంద్రముగా చేయగలరు. దాని అర్ధము కేవలము మీ పరివర్తన, ఆత్మీయ అభివృద్ధి కొరకు వ్యక్తిగత బాధ్యతను తీసుకొనుట. దాని అర్ధము అధ్యక్షులు నెల్సన్ యొక్క “మీ గృహమును విశ్వాసముగల పరిశుద్ధ మందిరముగా [పునర్నిర్మించండి,]”8 అన్న సలహాను అనుసరించుట.

ఆ ఆత్మీయ పోషణ అవసరములేదని, లేక ఎక్కువ మోసకరంగా, అది వేచి ఉండగలదని మిమ్మల్ని ఒప్పించుటకు అపవాది ప్రయత్నించును. అతడు పరధ్యానమునకు యజమాని, ఆలస్యమునకు కర్త. అతడు మిమ్మల్ని అత్యవసరముగా కనబడే ఇతర విషయాలను మీ ఆసక్తిని తెచ్చును, కానీ వాస్తవానికి అవి అంత ముఖ్యమైనవి కాదు. మీరు “అవసరమైన ఒక్కటిని” నిర్లక్ష్యము చేయునట్లు అతడు మీరు “అనేకమైన పనులను గూర్చి చాలా విచారము కలిగి” ఉండునట్లు చేయును.9

నా “మంచివారైన తల్లిదండ్రులకు” 10 నేను ఎంత కృతజ్ఞత కలిగియున్నాను, వారు నిరంతరము ఆత్మీయ పోషణ, ప్రేమగల అనుబంధములు, ఆరోగ్యకరమైన వినోద కార్యక్రమాలు గల గృహములో వారి కుటుంబమును పెంచారు. నా యౌవనంలో వారు అందించిన బోధనలు నాకు చాలా మేలు చేసాయి. తల్లిదండ్రులారా, దయచేసి మీ పిల్లలతో బలమైన అనుబంధాలను కట్టండి. వారికి మీ సమయము చాలా అవసరము, తక్కువ కాదు.

సంఘము బలపరచు

మీరు దానిని చేసినప్పుడు, మిమ్మల్ని బలపరచుటకు సంఘమున్నది. సంఘములో మన అనుభవాలు ఇంటిలో జరుగుచున్న ఆత్మీయ పోషణను బలోపేతం చేస్తాయి. ఈ సంవత్సరము ఇప్పటివరకు, ఆదివారపు బడి, ప్రాధమికలో ఈ విధమైన సంఘ సహకారమును మనము చూసాము. మనము అహరోను యాజకత్వము, యువతుల సమావేశాలలో కూడా దానిని చూస్తాము. ఈ జనవరి నుండి ప్రారంభించి, ఈ సమావేశాల కొరకు గల పాఠ్యప్రణాళిక కాస్త సరిచేయబడుతుంది. అది ఇంకను సువార్త సంబంధిత విషయాలపై దృష్టిసారించును, కానీ ఆ విషయాలు వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు—రండి, నన్ను వెంబడించుము తో విలీనమవుతాయి. ఇది చిన్న మార్పు, కానీ అది యువత యొక్క ఆత్మీయ పోషణపై గొప్ప ప్రభావమును కలిగించును.

సంఘము ఏ ఇతర రకాల సహాయమును అందించును? సంఘము వద్ద మనము సంస్కారమును తీసుకుంటాము, అది ప్రతీవారము రక్షకునికి మన ఒడంబడికను పునఃస్థాపించుటకు మనకు సహాయపడును. సంఘము వద్ద మనము అదే ఒడంబడికలను చేసిన ఇతర విశ్వాసులతో సమావేశమవుతాము. యేసు క్రీస్తు యొక్క సహ శిష్యులతో మనము వృద్ధి చేయు ప్రేమగల అనుబంధములు మన గృహము-కేంద్రంగా శిష్యత్వమునకు శక్తివంతమైన సహకారము కాగలదు.

నాకు 14 సంవత్సరాలప్పుడు, మా కుటుంబము ఒక క్రొత్త ప్రాంతానికి మారింది. ఇప్పుడు, అది మీకు పెద్ద విపత్తులా కనిపించకపోవచ్చు, కానీ ఆ సమయమందు నా మనస్సులో, అది చాలా నాశనకరమైనది. దాని అర్ధము నాకు తెలియని జనులతో చుట్టుముట్టబడుట. దాని అర్ధము నా వార్డులోని మిగిలిన యువకులందరు నాకంటే భిన్నమైన పాఠశాలకు హాజరువుతారు. నాకు 14 సంవత్సరాల మనస్సులో, “నా తల్లిదండ్రులు నాకు దీనిని ఎలా చేయగలరు?” అని నేను ఆలోచించాను. నా జీవితం నాశనం చేయబడినట్లుగా నేను భావించాను.

అయినప్పటికినీ, మా యువకుల ప్రోత్సాహకార్యక్రమాల ద్వారా, నేను నా కోరములోని ఇతర సభ్యులతో అనుబంధాలను నిర్మించగలిగాను, వారు నాకు స్నేహితులయ్యారు. అదనముగా, బిషప్రిక్కు, అహరోను యాజకత్వ సలహాదారులు, నా జీవితంలో ఒక ప్రత్యేక ఆసక్తిని తీసుకోసాగారు. వారు నా క్రీడా సంఘటనలకు హాజరయ్యారు. వారు ప్రోత్సాహముగల మాటలను వ్రాసారు, వాటిని నేను ఇప్పటి వరకు దాచుకున్నాను. నేను కళాశాలకు వెళ్ళిన తరువాత, మిషను కొరకు వెళ్ళిన తరువాత నాతో సంప్రదించుట వారు కొనసాగించారు. వారిలో ఒకరు నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు విమానాశ్రయానికి కూడా వచ్చారు. ఈ మంచి సహోదరులు, వారి జతపరచబడిన ప్రేమ, ఉన్నతమైన ఆశయాల కొరకు నేను శాశ్వతంగా కృతజ్ఞత కలిగియున్నాను. వారు నన్ను పరలోకము వైపు సూచించారు, మరియు జీవితం ప్రకాశముగా, సంతోషకరముగా మరియు ఆనందకరముగా అయ్యెను.

యువత నిబంధన బాటలో నడిచినప్పుడు, వారు ఒంటరి వారు కాదని తెలుసుకొనుటకు తల్లిదండ్రులు, నాయకులుగా మనము వారికి ఎలా సహాయపడగలము? వ్యక్తిగత అనుబంధములు నిర్మించుటకు అదనముగా, మనము వారిని పెద్దవి, చిన్న కూడికలు—యౌవనుల బలము కొరకు సమావేశాలు, యువత విడిది నుండి వారాంతపు కోరము లేక తరగతి ప్రోత్సాహకార్యక్రమాలకు ఆహ్వానిస్తాము. బలముగా ఉండుటకు ప్రయత్నించు ఇతరులతో కలిసి నిలబడుట నుండి వచ్చు బలమును ఎన్నడూ తక్కువగా అంచనా వేయకుము. బిషప్పులు, నాయకులారా, దయచేసి మీ వార్డులోని పిల్లలు, యువతను పోషించుటపై దృష్టిసారించండి. వారికి మీ సమయము చాలా అవసరము, తక్కువ కాదు.

మీరు ఒక నాయకుడు, ఒక పొరుగువారు, ఒక కోరము సభ్యుడు, లేక కేవలం ఒక సహ పరిశుద్ధులు అయినప్పటికినీ, ఒక యౌవనుని జీవితమును తాకుటకు మీరు అవకాశమును కలిగియున్న యెడల, పరలోకముతో అనుసంధానింపచేయుటకు అతడు లేక ఆమెకు సహాయపడండి. మీ ప్రభావము ఆ యౌవ్వనునికి అవసరమైన ఖచ్చితమైన “సంఘ సహాయము” కావచ్చు.

సహోదర, సహోదరిలారా, యేసు క్రీస్తు ఈ సంఘానికి శిరస్సు అని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన మన నాయకులను ప్రేరేపించి, కడవరి దినములందు మనుగడకు, వృద్ధి పొందుటకు మనకవసరమైన ఆత్మీయమైన పోషణకు మనల్ని నడిపిస్తున్నాడు. ఆ ఆత్మీయ పోషణ అవిశ్వాసులుగా కాక, విశ్వాసముగా ఉండుటకు మనకు సహయపడునని, యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.