2010–2019
మన సిలువ నెత్తికొనుట
2019 అక్టోబర్ సర్వసభ్య సమావేశము


2:3

మన సిలువ నెత్తికొనుట

మీపైన మీ సిలువల నెత్తుకొని రక్షకుని అనుసరించడమంటే ప్రభువు మార్గములో విశ్వాసముతో కొనసాగడం మరియు లోకసంబంధమైన అలవాట్లకు గురికాకుండా ఉండడం.

గడిచిన రెండు దినాలలో మన నాయకులనుండి అద్భుతమైన బోధనలను మనం పొందాము. మన జీవితాలలో ఈ ప్రరేపించబడిన, కాలానుగుణ బోధనలను అన్వయించుకొనుటకు శ్రమపడినట్లైతే, ప్రభువు తన కృపచేత మనలో ప్రతి ఒక్కరికి మన సిలువను మోసుకొనుటకు సహాయము చేసి, మన భారాలను తేలిక చేస్తారని నేను మీకు సాక్ష్యమిస్తున్నాను. 1

ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములో ఉన్నప్పుడు, ఆయన యెరూషలేములో ఉన్నపెద్దలచేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను హింసలు పొందునని రక్షకుడు తన శిష్యులకు బయలుపరచెను. ఆయన ముఖ్యముగా తన మరణము మరియు మహిమకరమైన పునరుత్థానము గురించి వారికి బోధించెను.2 ఆ సమయములో, ఆయన శిష్యులు భూమిపైన ఆయన దైవిక నియమితకార్యమును పూర్తిగా అర్థము చేసుకొనలేదు. పేతురు స్వయంగా రక్షకుడు చెప్పినది వినిన తరువాత ఆయనను ప్రక్కకు తీసుకొని వెళ్ళి, “ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీ కెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగెను”3

ఆయన కార్యము పట్ల భక్తి చూపించుటకు సమర్పణ మరియు భాధ కూడా అవసరమని తన శిష్యులు అర్థము చేసుకొనుటలో సహాయము చేయుటకు రక్షకుడు బలంగా ఇలా ప్రకటించెను:

“ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను.

“తన ప్రాణమును రక్షించు కొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించు కొనును.

“ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించు కొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి యియ్యగలడు?”4

ఈ ప్రకటన ద్వారా ఆయనను వెంబడించగోరిన వారందరు తమను తాము ఉపేక్షించుకొని, వారి కోరికలను, ఇచ్ఛలను, ఉద్రేకములను నియంత్రించుకొని, సమస్తమును అవసరమైతే ప్రాణాన్ని కూడా త్యాగముచేసి, ఆయన చేసినట్లే తండ్రి చిత్తానికి పూర్తిగా లోబడి ఉండవలెనని రక్షకుడు ఉద్ఘాటించెను. 5 వాస్తవానికి ఆత్మను రక్షించుకొనుటకు చెల్లించవలసిన వెల ఇదే. ప్రభువు హేతువునకు కావలసిన త్యాగము మరియు భక్తికి నిజమైన భావము ఏమిటో ఉత్తమంగా అర్ధము చేసుకొనుటలో తన శిష్యులకు సహాయము చేయుటకు యేసు ఉద్దేశపూర్వకముగా, ఉపమానరీతిగా సిలువ గుర్తును ఉపయోగించెను. ఆయన శిష్యులకు, రోమా సామ్రాజ్య నివాసులకు సిలువ రూపము బాగా తెలుసు ఎందుకంటే సిలువ వెయ్యబడు దోషులు బహిరంగముగా తమ సిలువను లేదా సిలువ దుంగను వారి శిక్ష అమలు చేయబడు స్థలము వరకు మొయ్యాలని రోమావారు బలవంతము చేసారు.6

ఆయన పునరుత్థానము చెందిన తరువాత మాత్రమే ఆయన గురించి వ్రాయబడిన సమస్తము 7 మరియు అప్పటినుండి వారినుండి ఏమి కోరబడినదో గ్రహించుటకు వారి మనస్సులు తెరువబడెను. 8

అదే విధంగా సహోదర, సహోదరిలమైన మనమందరము మనపైన మన సిలువలెత్తుకొని ఆయనను వెంబడించడం యొక్క ఔచిత్యమును మరింత సంపూర్ణముగా అర్థము చేసుకొనుటకు మన మనస్సులను, హృదయాలను తెరువవలసిన అవసరమున్నది. ఎవరైతే తమ సిలువనెత్తికొనుటకు కోరికగలిగి ఉంటారో వారు యేసు క్రీస్తును ఏవిధంగా ప్రేమిస్తారంటే వారు సమస్త భక్తిహీనతనుండి మరియు ప్రతి లోకసంబంధమైన వాంఛలను నుండి తమను తాము నిరాకరించుకొని ఆయన ఆజ్ఞలను పాటిస్తారని లేఖనాల ద్వారా మనం నేర్చుకుంటాము. 9

శ్రమలను, మన ఆత్మల యొక్క బలహీనతను లేదా ఆయన బోధనలను వ్యతిరేకించు సాంఘిక ఒత్తిళ్ళు మరియు లౌకిక సిద్ధాంతములను ఎదుర్కొంటున్నప్పటికి, దేవుని చిత్తానికి వ్యతిరేకముగా ఉన్న దేనిని అనుసరించక, మనం అడుగబడిన సమస్తమును త్యాగము చేసి, ఆయన బోధనలను అనుసరించుటకు మనకున్న దృఢనిశ్చయమే యేసు క్రీస్తు సువార్త మార్గములో సహించుటకు మనకు సహాయపడుతుంది.

ఉదాహారణకు, ఇంకా తమ నిత్యసహచరుని కనుగొనని వారు ఒకవేళ ఒంటరిగా, ఆశారహితముగా భావిస్తున్నవారికి లేదా విడాకులు తీసుకొనియున్నవారు విడిచిపెట్టబడినవారిగా, మరిచిపోయినవారిగా భావిస్తున్నవారికి నేను అభయమిస్తున్నది ఏమిటంటే మీపైన మీ సిలువలెత్తుకొని ఆయనను వెంబడించమన్న రక్షకుని ఆహ్వానాన్ని అంగీకరించడమంటే ప్రభువు మార్గములో విశ్వాసముతో కొనసాగుట, గౌరవముగా జీవించుట మరియు దేవుని ప్రేమ, కరుణయందు మన నిరీక్షణను చివరకు తీసివేయు లోకసంబంధమైన అలవాట్లకు గురికాకుండా ఉండుట.

మీలో స్వలింగ ఆకర్షణను అనుభవిస్తూ, నిరాశ నిస్పృహలతో ఉన్నవారికి కూడా ఈ సుత్రము వర్తిస్తుంది. ఈ కారణము చేత మీలో కొందరు యేసు క్రీస్తు యొక్క సువార్త ఇక ఎంత మాత్రము మీకు వర్తించదని భావిస్తు ఉండవచ్చును. కారణం ఇదే అయితే, తండ్రియైన దేవునియందు ఆయన సంతోషకర ప్రణాళికయందు, యేసు క్రీస్తునందు మరియు ఆయన ప్రాయశ్చిత్త త్యాగమునందు, వారి ప్రేమపూరిత ఆజ్ఞలను జీవించుటయందు ఎల్లప్పుడు నిరీక్షణ కలదని నేను ప్రకటిస్తున్నాను. ఆయన యొక్క పరిపూర్ణమైన జ్ఞానములో, శక్తిలో, న్యాయము మరియు కరుణలో, ప్రభువు మనల్ని తనవారిగా ముద్రించవచ్చును తద్వారా ఆయన ఆజ్ఞలు పాటించుటలో మనం స్థిరముగాను, నిలకడగాను ఉండి10 ఎల్లప్పుడు మంచి పనులలో సమృద్ధిగా ఉన్నయెడల 11 మనం ఆయన సన్నిధికి తేబడి, నిత్య రక్షణను పొందుతాము.

తీవ్రమైన పాపాలు చేసినవారికి, ఈ ఆహ్వానాన్ని అంగీకరించడమంటే, ఇతర విషయాలతో పాటు దేవుని యెదుట మిమ్మల్ని మీరు తగ్గించుకొనుట, సరియైన సంఘ నాయకులతో సలహా తీసుకొనుట మరియు పశ్చాత్తాపపడి, మీ పాపాల్ని విడిచిపెట్టుట. ఈ విధానము నల్లమందు, మాదక ద్రవ్యాలు, మద్యము, అశ్లీలచిత్రాలతో పాటు బలహీనపరచు వ్యసనాలతో పోరాడుచున్నవారిని కూడా దీవిస్తుంది. ఈ చర్యలు తీసుకొనడం వలన మిమ్మల్ని రక్షకుని యొద్దకు తీసుకువస్తుంది, నిందాభావము, దుఃఖము, ఆత్మీయ, భౌతిక బానిసత్వమునుండి ఆయన చివరకు మిమ్మల్ని విడుదల చేయగలరు. అదనంగా సంఘ నాయకలు నుండి సహకారాన్ని పొందుటతో పాటు, మీ కుటుంబము, స్నేహితులు, సమర్థులైన వైద్య మరియు సలహా నిపుణుల సహకారాన్ని పొందుటకు కోరవచ్చును.

వరుస వైఫల్యాల తరువాత దయచేసి ప్రయత్నించడం ఆపవద్దు మరియు పాపాలు విడిచిపెట్టడానికి , వ్యసనాన్ని జయించడానికి మిమ్మల్ని మీరు అసమర్ధులుగా ఎంచవద్దు. మీరు ప్రయత్నించడం మానినట్లైతే, తరువాత మీరు మీ బలహీనతలో, పాపములో కొనసాగుతారు! రక్షకుడు బోధించినట్లుగా మీ గిన్నెను లోపల శుద్ధిచెయ్యాలనే మీ కోరికను మీ క్రియల ద్వారా ప్రత్యక్షపరచుచు ఎల్లప్పుడు మీరు ఉత్తమంగా చెయ్యుటకు శ్రమించండి.12 కొన్నిసార్లు కొన్ని సవాళ్ళకు పరిష్కారములు నెలలు, సంవత్సరముల నిరంతర ప్రయత్నము ద్వారా వస్తాయి. “మనము సమస్తము చేసిన తరువాత కూడా మనము కృపచేతనే రక్షింపబడియున్నామని” 13 మోర్మన్ గ్రంథములో మనం కనుగొను వాగ్దానము ఈ విషయములో మనందరికి వర్తిస్తుంది. రక్షకుని కృపావరము ఈ లోకములో మనం చెయ్యగలిగినదంతా చేసిన “తరువాత” అనేదానికి పరిమితమై ఉండవలసిన అవసరం లేదని దయచేసి గుర్తుంచుకోండి. మన స్వంత ప్రయత్నాలన్ని చేసినప్పుడు మనం ఆయన కృపను ఇంతకుముందు, ఇప్పుడు, అటుతరువాత పొందగలము. 14

మన సవాళ్లను జయించుటకు నిరంతరము శ్రమించినప్పుడు, స్వస్థపడుటకు మరియు అద్భుత కార్యములు జరుగుటకు కావలసిన విశ్వాస వరములతో దేవుడ మనల్ని దీవించును.15 మనంతట మనం చేసుకోలేని వాటిని ఆయన మనకొరకు చేస్తారు.

అదనముగా, ఎవరైతే చెడుగా, కోపముగా, అభ్యంతరపరచబడినట్లుగా, మీకు జరుగకూడదు మీరు పరిష్కరించుకోలేరు అనుకునే వాటి వలన వేదనలు కలుగుచున్నాయి అని భావించేవారికి, ఒకరి సిలువనెత్తికొని రక్షకుని అనుసరించడమంటే, ఈ భావాలను ప్రక్కన పెట్టి, ప్రభువువైపు తిరుగుట తద్వారా ఆయన మనల్ని ఈ మానసిక స్థితి నుండి విడిపించి, సమాధానము కనుగొనుటకు సహాయము చేయును. దురదృష్టవశాత్తు, మనం ప్రతికూల భావాలకు, భావోద్వేగాలకు అంటిపెట్టుకొని ఉంటే, మన జీవితాలలో ప్రభువు ఆత్మ యొక్క ప్రభావము లేకుండా జీవిస్తున్నట్లు మనం కనుగొంటాము. ఇతరుల కొరకు మనం పశ్చాత్తాపపడలేము, కాని మనకు హాని కలిగించిన వారి గురించి ఆలోచించుట ద్వారా మన జీవితాల్ని నియంత్రించే ఆ ఆలోచనలను తిరస్కరించడం ద్వారా వారిని మనం క్షమించగలము. 16

మన రాతి హృదయాలను తీసివేసి నూతన హృదయాలను పొందుటకు మనకు సహాయము చెయ్యమని రక్షకుని ఆహ్వానించుట ద్వారా—ఈ పరిస్థితుల నుండి బయట పడుటకు ఒక మార్గమున్నదని లేఖనాలు మనకు బోధిస్తున్నాయి. 17 ఇది జరగాలంటే, మన బలహీనతలతో మనం ప్రభువు యొద్దకు వచ్చి, ఆయన యెదుట మనల్ని మనం తగ్గించుకొని,18 ఆయన సహాయాన్ని, క్షమాపణను అడగాలి 19 మరి ముఖ్యముగా ప్రతి ఆదివారము మనం సంస్కారము పాలుపొందే పవిత్రమైన సమయములో అడగాలి. ఆయన క్షమాపణను, ఆయన సహాయాన్ని మనం కోరెదము, మరియు మన గాయాలు మానుట మొదలుపెట్టుటకు మనల్ని గాయపరచిన వారిని క్షమించుట ద్వారా ముఖ్యమైన, కష్టమైన అడుగు వేద్దాం. ఆవిధంగా చేయడం ద్వారా, మీరు క్రొత్త అవకాశాలను పొందుతారు, విషయాలు మీకు తేలికౌతాయి మరియు ప్రభువుతో సమాధానముతో ఉన్న మనస్సునుండి వచ్చు ఉపశమనమును మీరు భావించగలుగుతారు.

1839లో లిబర్టి చెరశాలలో ఉండగా, ఈ పరిస్థితులలో మనకు బాగా వర్తించబడు ప్రవచనాలను ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ సంఘ సభ్యులకు ఒక పత్రికను వ్రాసారు. ఆయన ఇలా వ్రాసారు, “సమస్త సింహాసనములు, ప్రభుత్వములు, ప్రధానులు, అధికారములు బయలుపరచబడును యేసు క్రీస్తు సువార్త కొరకు పరాక్రమముతో అంతము వరకు సహించు వారందరిపైన ప్రోక్షించబడును.”20 కాబట్టి, రక్షకుని నామమును తమపైన తీసుకొని, ఆయన వాగ్దానములందు నమ్మకముంచి, అంతము వరకు స్థిరముగా నిలిచియుండు వారందరు రక్షించబడతారు 21 మరియు ఎన్నడు అంతముకాని స్థితిలో దేవునితో జీవిస్తారు.22

సహోదర, సహోదరిలారా, మనందరము మన జీవితాలలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటాము, అవి మనల్ని విచారముగాను, నిస్సహాయులుగాను, నిరాశచెందిన వారిగాను, కొన్నిసార్లు బలహీనులుగా భావించునట్లు చేస్తాయి. ఈ భావాలలో కొన్ని మనం ప్రభువుకు ఈ ప్రశ్న అడుగుటకు దారితీయును, “ఈ పరిస్థితులను నేనెందుకు అనుభవిస్తున్నాను?” లేదా “నేను అనుకొనేవి ఎందుకు జరగడం లేదు? నేను నా సిలువనెత్తికొనుటకు నా శక్తివంచన లేకుండా సమస్తము చేయుచు రక్షకుని అనుసరిస్తున్నాను కదా!”

నా ప్రియమైన స్నేహితులారా, మనపైన ఆయన సిలువనెత్తుకొనుటలో భాగంగా మనల్ని మనం తగ్గించుకొని, దేవునిని, ఆయన అనంత జ్ఞానమును నమ్మడం కూడా ఉన్నాయని మనం గుర్తుంచుకోవాలి. ఆయన మనలో ప్రతి ఒక్కరిని, మన అవసరాలను యెరిగియున్నారని మనం గుర్తించాలి. ప్రభువు సమయము మన సమయము కంటే భిన్నముగా ఉండునన్న వాస్తవాన్ని అంగీకరించడం కూడా అవసరము. కొన్నిసార్లు ఒక దీవెన కొరకు మనం అడిగి, ప్రభువు దానిని నెరవేర్చాలని ఒక కాల పరిమితిని పెడతాము. మన కోరికలకు సమాధానము ఇచ్చుట కొరకు ఆయనకు ఒక గడువు పెట్టుట ద్వారా ఆయన యెడల మనకున్న భక్తికి షరతును విధించలేము. మనం ఆవిధంగా చేసినయెడల, ప్రాచీన కాలములో సందేహించు నీఫైయులను మనం పోలియుంటాము, లేమనీయుడైన శామ్యుల్ చెప్పిన మాటలు నెరవేరు సమయము మించిపోయిందని చెప్పచు, నమ్మిన వారి మధ్య గందరగోళము సృష్టించుచు తమ సహోదరులను హేళనచేసారు.23 ఊరకుండి, ఆయనే దేవుడనని, ఆయనకు అన్ని విషయాలు తెలుసని, ఆయన మనలో ప్రతి ఒక్కరిని యెరిగియున్నారని తెలిసికొనేంతగా ప్రభువును మనం నమ్మాలి. 24

సహోదరి కలమస్సికి ఎల్డర్ సోరేస్ పరిచర్యచేయుట

నేను ఇటీవల ఫ్రాన్కా కలమస్సి అనే పేరుగల విధవరాలైన సహోదరికి పరిచర్య చేసే అవకాశం కలిగింది, ఆమె ఏఎల్ఎస్ అనగా వెన్నెముఖ పార్శ నాడీరోగముతో బాధపడుచున్నది. సహోదరి కలమస్సి పునఃస్థాపించబడిన యేసు క్రీస్తు సంఘములో తన కుటుంబములో చేరిన మొదటి సభ్యురాలు. ఆమె భర్త ఎన్నటికి బాప్తీస్మము పొందనప్పటికి, సువార్త పరిచారకులతో కలిసి మాట్లాడుటకు అంగీకరించి, తరచు సంఘ కూడికలకు హాజరయ్యెను. ఈ పరిస్థితులు ఉన్నప్పటికి, సహోదరి కలమస్సి విశ్వాసముగా ఉండి, ఆమె నలుగురు పిల్లలను యేసు క్రీస్తు సువార్తలో పెంచెను. తన భర్త మరణించిన ఒక సంవత్సరము తరువాత, సహోదరి కలమస్సి తన పిల్లలను దేవాలయమునకు తీసుకొని వెళ్ళెను మరియు వారు పరిశుద్ధ విధులలో పాల్గొని, ఒక కుటుంబముగా కలిసి ముద్రింపబడ్డారు. ఈ విధులతో మిళితమైయున్న వాగ్దానములు ఆమెకు మరింత నిరీక్షణ, ఆనందము, సంతోషమును తెచ్చాయి, ఆమె తన జీవితములో ముందుకు సాగుటకు అవి సహాయం చేసాయి.

దేవాలయము వద్ద కలమస్సి కుటుంబము

ఆ వ్యాధి యొక్క మొదటి లక్షణము కనిపించడం మొదలు పెట్టినప్పుడు, ఆమె బిషప్పు ఆమెకు ఒక దీవెన ఇచ్చెను. ఆ దీవెన ఏవిధంగా ఉన్నప్పటికి, స్వస్థపడుటకు తనకున్న విశ్వాసాన్ని అదేవిధంగా అంతము వరకు తన రోగాన్ని సహించుటకు తనకు గల విశ్వాసాన్ని వ్యక్తపరచి, ఆ సమయంలో ప్రభువు చిత్తాన్ని అంగీకరించుటకు సిద్ధంగా ఉందని ఆమె తన బిషప్పుకు చెప్పింది.

నా దర్శన సమయంలో, సహోదరి కలమస్సి చేతిని పట్టుకొని, ఆమె కళ్ళల్లో చూస్తున్నప్పుడు, దేవుని ప్రణాళిక యందు ఆమె నమ్మకాన్ని, తండ్రి ప్రేమయందు మరియు ఆమె కొరకు ఆయన ప్రణాళిక యందు నిరీక్షణ యొక్క పరిపూర్ణమైన కాంతిని ప్రతిబింబిస్తున్న-ఆమె ముఖము నుండి వెదజల్లుచున్న దేవదూతల వెలుగును చూసాను.25 ఆమె సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పటికి, ఆమె సిలువనెత్తికొనుట ద్వారా అంతము వరకు తన విశ్వాసములో సహించుటకు ఆమెకు గల ధృఢనిశ్చయమును నేను భావించాను. ఈ సహోదరి జీవితము క్రీస్తు యొక్క సాక్ష్యముగా, ఆయన యెడల ఆమె విశ్వాసము మరియు ఆమె భక్తి యొక్క ఒక ప్రకటనగా ఉన్నది.

ప్రియమైన సహోదర సహోదరీలారా, మన సిలువనెత్తికొని రక్షకుని అనుసరించుటకు ఆయన మాదిరిని అనుసరించి, ఆయనవలె అగుటకు శ్రమపడి, 26 జీవిత పరిస్థితులను సహనముతో ఎదుర్కొనుచు, ప్రకృతిసంబంధియైన మానవుని వాంఛలను తిరస్కరించుచు, తృణీకరించుచు ప్రభువు కొరకు వేచియుండుట అవసరము. కీర్తనకారుడు ఇలా వ్రాసెను:

“ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము.” 27

“ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై యున్నాడు.”28

మన జీవితాలకు చివరకు స్వస్థతనిచ్చువాడైన మన బోధకుని అడుగుజాడలలో నడుచుచు, ఆయన గురించి వేచియుండుట వలన మన ప్రాణాలకు విశ్రాంతినిచ్చి, మన భారాలను తేలికగాను, సులభముగాను చేయును.29 ఈ సంగతుల గురించి యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.