2010–2019
రక్షకుని నిజమైన శిష్యులు
2019 అక్టోబర్ సర్వసభ్య సమావేశము


2:3

రక్షకుని యొక్క నిజమైన శిష్యులు

మన జీవితాలను ప్రభావితం చేయు నిర్ణయాలను చేస్తున్నప్పుడు మనము పరిగణించాల్సిన ముఖ్యమైన విషయాలు మన రక్షకుడు మరియు ఆయన సువార్త అయినప్పుడు, మనము శాశ్వతమైన ఆనందమును అనుభవించగలము.

పాత నిబంధనలో దాచబడిన హగ్గయి గ్రంధము ఎల్డర్ హాల్లెండ్ సలహాని ఉపయోగించుకొనియుండగల జనుల గుంపును గూర్చిన వర్ణన కలిగియున్నది. వారు క్రీస్తును వారి జీవితాలు, వారి సేవలకు కేంద్రముగా ఉంచకపోవటం వలన వారు తప్పుగా అర్ధం చేసుకున్నారు. జనులు ప్రభువు మందిరమును నిర్మించుటకు బదులుగా వారి సౌకర్యముగల ఇండ్లలో నివసిస్తున్నందుకు తీవ్రంగా మందలిస్తూ హగ్గయి కొంత ఆలోచనాపూర్వకమైన పద చిత్రాలను గీసాడు:

“ఈ మందిరము పాడైయుండగా, మీరు సరంబీ వేసిన యిండ్లలో నివసించుటకు ఇది సమయమా?

“కాబట్టి సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా; మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి.

“మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది.

“సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా; మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి.”1

దేవుని సంగతులకు పైగా నిత్య విలువలు కలిగిలేని సంగతులకు ప్రాధాన్యతనిచ్చు వ్యర్ధమైన వివరణలను మీరు ప్రేమించరా?

ఇటీవల నేను హాజరైన ఒక సంస్కార సమావేశంలో, తిరిగి వచ్చిన మిషనరీ ఈ ఆలోచనను ఒక తండ్రి తన పిల్లలకు పరిపూర్ణంగా సంక్షిప్తపరచుటను వ్యాఖ్యానించాడు, “ఇక్కడ మనకవసరమైనది తక్కువ వై-ఫై, మరియు ఎక్కువ నీఫై!”

ఐదు సంవత్సరాలు పశ్చిమ ఆఫ్రికాలో నివసించిన నేను, సహజంగా, నిస్సంకోచంగా సువార్తకు ప్రాధన్యత ఇచ్చిన జనుల యొక్క అనేక మాదిరులను చూసాను. అటువంటి ఉదాహరణ ఒకటి ఘానాలో టైరు మరియు చక్రాలను మరమత్తు చేయు వ్యాపారము యొక్క పేరు. యజమాని దానికి “నీ చిత్తమును విలీనము చేయుట,” అని పేరు పెట్టాడు.

మన రక్షకుడు, ఆయన సువార్త మన జీవితాల చుట్టూ మనము కట్టుకొనే చట్రము అయినప్పుడు మనము శాశ్వతమైన ఆనందమును2 అనుభవించగలము. అయినప్పటికినీ, మన జీవితాలను ప్రభావితం చేయు నిర్ణయాలను చేస్తున్నప్పుడు మనము పరిగణించాల్సిన ముఖ్యమైన విషయాలు లోక విషయాలు అయినప్పుడు, సువార్త, లేక కేవలము ఆదివారములు రెండు గంటలు సంఘానికి హాజరుగట ఐచ్ఛికమైనదిగా మారును. ఈ సందర్భములో, అది మన జీతాలను “చినిగిపోయిన సంచిలో,” వేసినట్లుగా ఉన్నది.

సువార్తను జీవించుట గురించి, ఆస్ట్రేలియాలో మేము చెప్పినట్లుగా, “పూర్తిగా యధార్ధముగా ఉండుటను, (ఫెయిర్ డింకమ్)” ఒడంబడికతోయుండమని హగ్గయి మనకు చెప్పుచున్నాడు. వారు చెప్పినట్లుగా వారు ఉన్నప్పుడు జనులు పూర్తిగా యధార్ధముగా ఉన్నారు.

నేను పూర్తిగా యధార్ధముగా ఉండుట గురించి, నా శాయాశక్తులా పనిచేయుట గూర్చి రగ్బీ ఆడుతున్నప్పుడు నేర్చుకున్నాను. నా శాయాశక్తులా నేను ఆడి, నాకు సాధ్యమైనదంతా చేసినప్పుడు, క్రీడలో నా ఆనందము గొప్పగా ఉందని నేను నేర్చుకున్నాను.

తన రగ్భీ జట్టుతో ఎల్డర్ విన్సన్

రగ్బీలో నాకిష్టమైన సమయం ఉన్నత పాఠశాల తరువాత సంవత్సరము. నేను సభ్యునిగా ఉన్న జట్టులో ప్రతిభ గలవారు మరియు నిబద్ధత గలవారు ఉన్నారు. మేము ఆ సంవత్సరము అజేయులముగా నిలిచాము. అయినప్పటికినీ, ఒకరోజు మేము, మాకంటే బలహీనమైన జట్టుతో ఆడాల్సియున్నది, మరియు ఆట తరువాత, పెద్ద కళాశాల వార్షిక నృత్యమునకు వెళ్ళుటకు మా అందరికి భాగస్వాములు ఉన్నారు. ఇది సులభమైన ఆట గనుక, నేను గాయము నుండి నన్ను నేను కాపాడుకోవటానికి ప్రయత్నించాలని, ఆవిధంగా నేను నృత్యమును బాగా ఆనందించగలనని అనుకున్నాను. ఆ ఆటలో, మేము ఇతర ఆటగాళ్ళతో తలపడినప్పుడు మేము ఉండాల్సినంత నిబద్ధతగా లేము, ఆటను మేము కోల్పోయాము. విషయాలు మరింత దిగజార్చటానికి, ఆట ముగిసే సమయానికి నా పెదవిపై గాయమై బాగా వాచిపోయింది, అది నా రూపాన్ని ఏవిధంగాను మెరుగుపరచలేదు. బహుశా నేను ఎదో నేర్చుకోవాల్సియున్నది.

తరువాత జరిగిన ఆటలో చాలా ప్రత్యేకమైన అనుభవము కలిగింది, దానిలో నేను పూర్తి ఒడంబడికను కలిగియున్నాను. ఒక సందర్భములో నేను నిజమైన ఉద్దేశముతో పరుగెత్తి ఇంకొక ఆటగాడిని ఢీకొట్టాను; వెంటనే నా ముఖములో కొంత నొప్పి అన్పించింది. నేను గాయపడినప్పటికినీ, వ్యతిరేక జట్టుకు ఎన్నడూ తెలియనివ్వరాదని మా నాన్న చేత బోధింపబడినందున, నేను ఆటను కొనసాగించాను. ఆ రాత్రి, నేను భోజనం చేస్తుండగా, నేను నమలలేకపోతున్నట్లు కనుగొన్నాను. తరువాత ఉదయము, నేను ఆస్పత్రికి వెళ్లినప్పుడు అక్కడ నా దవడ పగిలినట్లుగా ఎక్స్-రే నిర్ధారించింది. తరువాత ఆరు వారములు నా నోరు వైరుతో కట్టబడింది.

వాచిపోయిన పెదవి, విరిగిన దవడ ఉపమానాల నుండి పాఠములు నేర్చుకోబడినవి. నేను ద్రవ్యములను మాత్రమే తీసుకోగలిగిన ఆ ఆరు వారములందు ఘనాహారము కొరకు తృప్తి చెందని కోరికల జ్ఞాపకాలను లక్ష్యపెట్టకుండా, నా సమస్తమును ఇచ్చివేయుట నుండి కలిగిన నా విరిగిన దవడ గురించి నేను విచారించలేదు. కానీ వాచిన పెదవి గురించి నేను విచారిస్తున్నాను ఎందుకనగా అది నేను వెనుదీయుటకు సూచనగా ఉన్నది.

మన సమస్తమును ఇచ్చి వేయుట అనగా మనము ఎల్లప్పుడు దీవెనలతో చుట్టబడతామని లేక ఎల్లప్పుడు విజయాన్ని కలిగియుంటామని కాదు. కాని మనము ఆనందమును కలిగియుంటామని దాని అర్ధము. ఆనందము నిలకడలేని ఆనందము కాదు లేక తాత్కాలికమైన సంతోషము కాదు. ఆనందము శాశ్వతమైనది మరియు ప్రభువు చేత అంగీకరించబడిన మన ప్రయత్నములపై కనుగొనబడును.3

అటువంటి అంగీకారము యొక్క మాదిరి ఆలీవర్ గ్రాంగర్ వృత్తాంతము. అధ్యక్షులు బాయిడ్ కె. పాకర్ వివరించినట్లుగా: “పరిశుద్ధులు కర్ట్‌లాండ్ నుండి తరమబడినప్పుడు, … ఆలీవర్ వారి ఆస్తులను తనకు సాధ్యమైన స్వల్పమైనంత తక్కువకు అమ్ముటకు విడిచిపెట్టబడ్డాడు. దానిని సాధించటానికి అతనికి ఎక్కువ అవకాశము లేదు. నిజముగా, అతడు విజయాన్ని పొందలేదు!”4 అసాధ్యమైనది కాకపోయినా, కష్టమైన పని చేయుటకు ప్రథమ అధ్యక్షత్వము చేత అతడు ఆజ్ఞాపించబడ్డాడు. కానీ అతడి విఫలమైన ప్రయత్నాల కొరకు అతడిని ఈ మాటలలో ప్రభువు మెచ్చుకున్నాడు:

“నా సేవకుడైన ఆలీవర్ గ్రాంగర్‌ను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను; ఇదిగో, నేను అతడితో నిశ్చయముగా చెప్పుచున్నాను, అతని పేరు తర తరములు, శాశ్వతంగా, ఎప్పటికీ పరిశుద్ధమైన జ్ఞాపకార్ధములో ఉంచబడునని ప్రభువు చెప్పెను.

“కాబట్టి, నా సంఘ ప్రథమ అధ్యక్షత్వము యొక్క విడుదల కొరకు అతడిని మనఃపూర్వకంగా వాదించనియ్యుము, … అతడు పడిపోయినప్పుడు, అతడు మరలా లేచును, ఏలయనగా అతడి త్యాగము అతడి హెచ్చింపు కంటే నాకు మిక్కిలి పరిశుద్ధమైనదని, ప్రభువు చెప్పెను.”5

అది మనందరికి యధార్ధమైనది కావచ్చు—అది మన విజయములు కాదు కానీ, మన త్యాగము, ప్రయత్నములు, ప్రభువుకు ముఖ్యమైనవి.

యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యునికి మరొక మాదిరి, పశ్చిమ ఆఫ్రికాలో ఐవరీకోస్ట్ లోని మా ప్రియమైన స్నేహితులలో ఒకరు. ఈ అద్భుతమైన, విశ్వాసురాలైన సహోదరి కొంతకాలము తన భర్తనుండి శారీరకమైన, భయంకరమైన మానసికనిందలను అనుభవించింది, మరియు చివరకు వారు విడాకులు తీసుకున్నారు. ఆమె తన విశ్వాసము, మంచితనమునందు ఎన్నడూ సందేహించలేదు, కానీ ఆమె పట్ల అతడి క్రూరత్వము వలన, ఆమె చాలా కాలము తీవ్రంగా బాధపడింది. తన స్వంత మాటలలో, జరిగినది ఆమె వివరించింది:

“నేను అతడిని క్షమించానని చెప్పినప్పటికిని, నేను ఎల్లప్పుడు గాయముతో నిద్రపోయాను; ఆ గాయముతో నేను నా రోజులు గడిపాను. అది నా గుండెలో కాలిన గాయమువలే ఉన్నది. దానిని నా నుండి తీసివేయమని అనేకసార్లు నేను ప్రభువుకు ప్రార్ధించాను, కానీ అది నాకు ఎంతగా బాధ కలిగించిందంటే, నా మిగిలిన జీవితమంతా దానితో గడపాల్సి వస్తుందని నేను బలముగా నమ్మాను. మా అమ్మను, చిన్న వయస్సులో కోల్పోయినప్పటి కంటే అది ఎక్కువ బాధ కలిగించింది; మా నాన్నను, నా కొడుకును కోల్పోయినప్పటి కంటే కూడా అది ఎక్కువ బాధను కలిగించింది. అది నేను ఏ సమయంలోనైనా చనిపోతాననే భావనను నాకిస్తూ, పెద్దదవుతూ, గుండెను కప్పుతున్నట్లుగా కనబడింది.

“మరికొన్నిసార్లు నా పరిస్థితిలో రక్షకుడు ఏమి చేసియుండవచ్చని నన్ను ప్రశ్నించుకున్నాను, ‘ఇది చాలా ఎక్కువ, ప్రభువా’ అని చెప్పాలనుకున్నాను.

“ఒక ఉదయము నా గుండెలో నుండి వచ్చు బాధ, నా ఆత్మలో దాని కొరకు వెదకుతూ, లోతుగా వెళ్లి చూసాను. అది ఎక్కడ కనబడలేదు. ఆ బాధను కలిగించే కారణములన్నిటినీ సమీక్షించుటకు నా మనస్సు త్వరగా కదిలింది, కానీ నేను ఆ బాధను అనుభవించలేదు. నా గుండెలో ఆ బాధ నేను అనుభవిస్తానేమోనని రోజంతా నేను ఎదురుచూసాను; నేను దానిని అనుభవించలేదు. అప్పుడు నేను మోకరించి, నా కొరకు ప్రభువు యొక్క ప్రాయశ్చిత్త త్యాగము పని చేసినట్లు చేసినందుకు దేవునికి ధన్యవాదములు తెలిపాను.”6

ఇప్పుడు ఈ సహోదరి తనను లోతుగా ప్రేమించే అద్భుతమైన విశ్వాసియైన వ్యక్తితో ముద్రించబడింది.

కాబట్టి మనం నిజమైన క్రీస్తు శిష్యులైతే మన వైఖరి ఎలా ఉండాలి? హగ్గయి సూచించినట్లుగా “(మన) ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొని,” నప్పుడు మనకు సువార్త ఎంత విలువైనది?

రాజైన లమోనై తండ్రి చేత చూపబడిన సరైన స్వభావము యొక్క మాదిరిని నేను ప్రేమిస్తున్నాను. లేమనీయులు ద్వేషించే జనులైన—ఒక నీఫైయుడైన, అమ్మోన్‌‌తో పాటు ఉన్న తన కుమారుని చూసిన అతడి కోపము మీకు జ్ఞాపకమొస్తుంది. అతడు తన ఖడ్గమును దూసి అమ్మెన్‌తో పోట్లాడి, త్వరలో అమ్మోన్ ఖడ్గము అతడి స్వంత కంఠముపై ఉంచబడుట చూసాడు. “ఇప్పుడు రాజు తన ప్రాణమును పోగొట్టుకొందునేమోనని భయపడుచూ: నీవు నన్నువదలిన యెడల నీవు అడుగు దేనినైను, రాజ్యములో సగమును కూడ నేను నీకు అనుగ్రహించెదను”7 అని చెప్పెను.

అతడు ఇస్తానన్న దానిని గమనించండి—అతడి ప్రాణము కొరకు తన రాజ్యములో సగభాగము.

కానీ, సువార్తను గ్రహించిన తరువాత, అతడు మరొక దానిని ఇవ్వబోయాడు. “రాజు చెప్పెను: నీవు చెప్పిన ఈ నిత్యజీవమును నేను పొందుటకు నేనేమి చేయవలెను? అవును నేను దేవుని ద్వారా జన్మించుటకు, ఈ దుర్మార్గపు ఆత్మను నా రొమ్ము నుండి బయటికి పెకలించుటకు, నేను ఆనందముతో నింపబడునట్లు ఆయన ఆత్మను స్వీకరించుటకు అంత్యదినమున నేను కొట్టి వేయబడకుండునట్లు నేనేమి చేయవలెను? ఇదిగో, అతడు చెప్పెను, నేను కలిగినదంతయు ఇచ్చివేసెదెను. అవును, నేను ఈగొప్ప సంతోషమును పొందునట్లు నేను నా రాజ్యమును వదలివేసెదను.”8

ఈసారి, అతడు తన సమస్త రాజ్యమును ఇచ్చివేయుటకు సిద్ధపడ్డాడు, ఎందుకనగా సువార్త అతడికి కలిగిన సమస్తము కంటే ఎక్కువ విలువైనది. అతడు సువార్తను గూర్చి పూర్తిగా యధార్ధముగా ఉన్నాడు.

అయితే, మనలో ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవలసిన దేమనగా: మనము కూడా సువార్తను గూర్చి పూర్తిగా యదార్ధముగా ఉన్నామా? సగము-హృదయంతో ఉండుట పూర్తిగా యదార్ధముగా ఉండుట కాదు! దేవుడు నులివెచ్చగా ఉండు వారిపై పొగడ్తను కురిపించడు.9

నిత్య జీవము కంటే ప్రశస్థమైన ఏ అలవాటు, లేక ఏ స్థాయి, లేక ఏ సామాజిక మాధ్యమము, లేక ఏ వీడియో ఆటలు, లేక ఏ క్రీడ, లేక ప్రఖ్యాతిగాంచిన వారితో సహవాసము, లేక భూమి మీది నున్నదేదీ లేదు . కనుక ప్రతీ వ్యక్తికి ప్రభువు సలహా, “మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుడి.”

నీఫై మాటలలో నా భావనలు శ్రేష్టముగా వ్యక్తపరచబడును: “నేను స్పష్టతయందు అతిశయించుచున్నాను; నేను సత్యమునందు అతిశయించుచున్నాను; నేను నా యేసు నందు అతిశయించుచున్నాను, ఏలయనగా ఆయన నా ఆత్మను నరకము నుండి విమోచించియున్నాడు.”10

ఆయన సమస్తమును మన కొరకు ఇచ్చిన ఆయన యొక్క నిజమైన అనుచరులుగా మనము ఉన్నామా? ఆయన మన విమోచకుడు, తండ్రితో మన న్యాయవాదిగా ఉన్నాడు? ఆయన స్వయంగా ప్రాయశ్చిత్తః త్యాగమునందు తనను తాను పూర్తిగా ఒడంబడిక చేసుకొని, ఇప్పుడు ఆయన ప్రేమ, ఆయన కనికరములో, నిత్యజీవము కలిగియుండాలని ఆయన మన కొరకు కోరెను? ఈ మాటలను విని, చదువు వారిందరిని నేను వేడుకుంటున్నాను: ఉనికిలో లేని, రాబోయే సమయము వరకు మీరు దాని చేరుకునేంత వరకు, మీ పూర్తి నిబద్ధతను దయచేసి, దయచేసి ఆలస్యము చేయవద్దు. ఇప్పుడే పూర్తిగా యదార్ధముగా ఉండి, ఆనందమును అనుభవించండి! యేసు క్రీస్తు నామములో, ఆమేన్.