మన విశ్వాస పరీక్ష తరువాత
దేవుని స్వరమును మరియు ఆయన నిబంధన బాటను మనము అనుసరించినప్పుడు, ఆయన మన శ్రమలందు మనల్ని బలపరచును.
నేను చిన్నవానిగా ఉన్నప్పుడు, ఒక సంఘ సభ్యుడు నా కుటుంబము ప్యుర్టో రికొ నుండి సాల్ట్‌లేక్ సిటీకి ప్రయాణించుటకు సహాయము చేస్తానని అడిగాడు, ఆవిధంగా మేము దేవాలయములో బంధింపబడగలము, కానీ త్వరలో ఆటంకాలు కనబడసాగాయి. నా సహోదరీలలో ఒకరైన, మారివిడ్, అస్వస్థత చెందింది. పరిష్కరించలేక, నా తల్లిదండ్రులు ఏమి చేయాలని దానిగూర్చి ప్రార్ధించారు మరియు ఇంకను ప్రయాణం చేయటానికి ప్రేరేపణను భావించారు. ప్రభువు యొక్క ప్రేరేపణను వారు విశ్వాసముగా అనుసరించినప్పుడు, మా కుటుంబము కావలికాయబడును మరియు దీవించబడునని వారు నమ్మారు—మేము అక్కడున్నాము.
జీవితంలో ఏ అడ్డంకులను మనము ఎదుర్కొన్నప్పటికినీ లక్ష్యపెట్టకుండా, మనము విశ్వాసముతో నడిచినప్పుడు, యేసు క్రీస్తు ముందుకు ఒక మార్గమును సిద్ధపరుస్తారని మనము నమ్మగలము. ఆయనతో వారు చేసిన నిబంధనల ప్రకారము విశ్వాసముగా జీవించు వారందరు, ఆయన కాలములో ఆయన వాగ్దానము చేసిన దీవెనలన్నిటిని పొందుతారని దేవుడు వాగ్దానము చేసాడు. ఎల్డర్ హాలండ్ బోధించారు, “కొన్ని దీవెనలు వెంటనే వస్తాయి, కొన్ని ఆలస్యంగా వస్తాయి, కొన్ని పరలోకములో వెళ్లే వరకు రావు; కాని యేసు క్రీస్తు సువార్తను హత్తుకొనువారికి, అవి వస్తాయి.”1
“విశ్వాసము నిరీక్షింపబడిన మరియు చూడలేని సంగతులున్నవని; కాబట్టి వాదములాడ వద్దు, ఏలయనగా మీ విశ్వాస పరీక్ష తరువాత వరకు మీరు ఎట్టి సాక్ష్యమును పొందరు,”2 అని మొరోనై బోధించాడు.
మన ప్రశ్న ఏదనగా, మన మార్గములో వచ్చు శ్రమలను ఉత్తమంగా ఎదుర్కొనుటకు మనము ఏమి చేయాలి?”
2018 జనవరి 16న, సంఘము యొక్క అధ్యక్షునిగా తన మొదటి బహిరంగ ప్రసంగములో, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించారు: “క్రొత్త అధ్యక్షత్వముగా మేము, మన అంతిమ లక్ష్యముతో ప్రారంభించాలని కోరుతున్నాము. ఈ కారణము వలన, మేము దేవాలయము నుండి ఈ రోజు మీతో మాట్లాడుతున్నాము. మనలో ప్రతీఒక్కరు ప్రయాసపడే లక్ష్యము ప్రభువు యొక్క మందిరములో శక్తితో దీవించబడుట, కుటుంబాలుగా బంధింపబడుట, దేవుని యొక్క మిక్కిలి గొప్ప వరమైన—నిత్యజీవము కొరకు మనల్ని అర్హులుగా చేయునట్లు దేవాలయములో చేయబడిన నిబంధనలకు విశ్వాసముగా ఉండుట. దేవాలయము యొక్క విధులు అక్కడ సంఘ సభ్యులైన మీరు చేయు నిబంధనలు మీ జీవితము, మీ వివాహము, కుటుంబమును మరియు అపవాది యొక్క ముట్టడులను ఎదురించుటకు మీ సామర్ధ్యమును బలపరచుటకు ముఖ్యమైనవి. దేవాలయములో మీ ఆరాధన, మీ పూర్వీకుల కొరకు అక్కడ మీ సేవ మిమ్మల్ని హెచ్చించబడిన వ్యక్తిగత బయల్పాటుతో దీవించును, నిబంధన బాటపై నిలిచియుండుటకు మీ నిబద్ధతను పటిష్టపరచును.”3
దేవుని స్వరమును మరియు ఆయన నిబంధన బాటను మనము అనుసరించినప్పుడు, ఆయన మన శ్రమలందు మనల్ని బలపరచును.
సంవత్సరాల క్రితం నా కుటుంబ ప్రయాణం కష్టమైనది, కానీ యూటా, సాల్ట్‌లేక్ పట్టణమును మేము చేరుకున్నప్పుడు, మా అమ్మ సంతోషము, విశ్వాసముతో నింపబడి, ఇలా అన్నది, “మనము బాగానే ఉంటాము; ప్రభువు మనల్ని కాపాడతాడు.” మేము ఒక కుటుంబముగా బంధింపబడ్డాము, మరియు నా సహోదరి బాగయ్యింది. ఇది నా తల్లిదండ్రుల యొక్క విశ్వాస పరీక్ష తరువాత మరియు ప్రభువు యొక్క ప్రేరేపేణలను అనుసరించినప్పుడు మాత్రమే జరిగింది.
నా తల్లిదండ్రుల యొక్క ఈ మాదిరి నేటికి మా జీవితాలను ప్రభావితం చేస్తున్నది. వారి మాదిరి సువార్త సిద్ధాంతము ఎందుకో మాకు బోధించింది మరియు సువార్త అర్ధమును, ఉద్దేశమును, అది మనకు తెచ్చు దీవెనలను గ్రహించుటకు మాకు సహాయపడింది. యేసు క్రీస్తు యొక్క సువార్త ఎందుకు అని గ్రహించుట మన శ్రమలను విశ్వాసముతో ఎదుర్కొనుటకు కూడా మనకు సహాయపడగలవు.
చివరకు, దేవుడు మనల్ని చేయమని ఆహ్వానించి, ఆజ్ఞాపించు సమస్తము, మన కొరకు ఆయన ప్రేమ మరియు ఆయన విశ్వాసుల కొరకు దాచబడిన దీవెనలన్నిటిని మనకిచ్చుటకు ఆయన కోరిక యొక్క వ్యక్తీకరణ. మన పిల్లలు సువార్తను వారంతట వారే నేర్చుకోగలరని మనము ఊహించలేము; వారికి బోధించుట మన బాధ్యత. వారి స్వతంత్రతను తెలివిగా ఎలా ఉపయోగించాలో మన పిల్లలకు మనము సహాయపడినప్పుడు, మన మాదిరి, వారి స్వంత నీతిగల ఎంపికలను చేయుటకు వారిని ప్రేరేపించగలదు. వారు విశ్వసనీయంగా జీవించుట వారి పిల్లలు వారికై వారు సువార్త సత్యమును గూర్చి తెలుసుకొనుటకు తిరిగి సహాయపడును.
యువకులు మరియు యువతులారా, ఈరోజు ప్రవక్త మీతో మాట్లాడటం వినండి. దైవిక సత్యములను నేర్చుకొనుటకు వెదకుము మరియు మీకై మీరు సువార్తను గ్రహించుటకు వెదకుము. ఇటీవల అధ్యక్షులు నెల్సన్ ఉపదేశించారు: “మీరు ఏ జ్ఞానము కొదువుగా ఉన్నారు? … ప్రవక్త జోసెఫ్ యొక్క మాదిరిని అనుసరించము. ఒక నిశ్శబ్దమైన స్థలమును కనుగొనుము. … దేవుని యెదుట తగ్గించుకొనుము. మీ పరలోక తండ్రికి మీ హృదయమును క్రుమ్మరించుము. జవాబుల కొరకు ఆయన వైపు తిరుగుము.”4 మీ ప్రేమగల పరలోక తండ్రి నుండి నడిపింపును మీరు కోరి, జీవిస్తున్న ప్రవక్తల ఉపదేశమును విని, నీతిగల తల్లిదండ్రుల యొక్క మాదిరిని గమనించినప్పుడు, మీరు కూడా మీ కుటుంబములో బలమైన బంధముగా మారతారు.
నిబంధన బాటను విడిచిపెట్టిన పిల్లలు గల తల్లిదండ్రులకు, మృదువుగా వెనుకకు వెళ్లండి. సువార్త యొక్క సత్యములను గ్రహించుటకు వారికి సహాయపడుము. ఇప్పుడే ప్రారంభించుము; అది ఎప్పటికీ చాలా ఆలస్యము కాదు.
నీతిగా జీవించు మన మాదిరి గొప్ప భిన్నత్వమును కలిగియుండవచ్చు. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా చెప్పారు: “కడవరి-దిన పరిశుద్ధులుగా, మనము ‘సంఘము’ అనగా ఇంటిలో జరిగే దానిచేత బలపరచబడి, మన సమావేశ గృహాలలో జరిగే దానిగా ఆలోచించుటకు అలవాటుపడ్డాము. ఈ నమూనాకు ఒక సవరణ మనకవసరము. మన బ్రాంచి, వార్డు, స్టేకు భవనాలలోపల జరిగే దాని ద్వారా బలపరచబడి, గృహము-కేంద్రీకరించబడిన సంఘము, కొరకు ఇది సమయము.”5
“బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు, దానినుండి తొలగిపోడు,”6 అని లేఖనాలు బోధిస్తున్నాయి.
“ఇప్పుడు వాక్యము యొక్క బోధ న్యాయమైన దానిని చేయుటకు జనులను నడిపించుటకు గొప్ప గుణము కలిగియుండెను. కావున—అవును, ఖడ్గము లేక వారికి సంభవించిన ఇతర వాటి కంటే జనుల యొక్క మనసులపైన అధిక శక్తివంతమైన ప్రభావము కలిగియుండెను—కాబట్టి దేవుని ప్రభావమును వారు ప్రయత్నించుట ప్రయోజనకరమని ఆల్మా తలంచెను,”7 అని కూడా అవి చెప్పెను.
ఒక స్త్రీ తన కొడుకు మిఠాయిని అతిగా తింటున్నాడని కోపగించిన ఆమెను గూర్చి ఒక కధ చెప్పబడింది. మానమని ఆమె ఎంతగా అతడికి చెప్పినప్పటికినీ, అతడు మిఠాయి తినాలనే తన కోరికను తృప్తిపరచుట కొనసాగించాడు. పూర్తిగా విసుగుచెంది, ఆమె తన కుమారుడిని, అతడు గౌరవించే తెలివైన వ్యక్తిని చూడటానికి తీసుకొని వెళ్లుటకు నిర్ణయించింది.
ఆమె అతడిని సమీపించి, “అయ్యా, నా కొడుకు మిఠాయి అతిగా తింటున్నాడు. అది తినటం మానేయ్యమని అతడికి మీరు దయచేసి చెప్తారా?”
అతడు జాగ్రత్తగా విని, తరువాత ఆమె కొడుకుతో ఇలా చెప్పాడు, “ఇంటికి వెళ్లి, రెండు వారములలో తిరిగి రమ్ము.”
ఆమె తన కుమారుడిని ఇంటికి తీసుకొని వెళ్లి, అంత ఎక్కువ మిఠాయి తినవద్దని ఆయన బాలునికి ఎందుకు చెప్పలేదని కలవరపడింది.
రెండు వారముల తరువాత వారు తిరిగి వచ్చారు. ఆ తెలివైన వ్యక్తి బాలుని వైపు నేరుగా చూసి, “అబ్బాయి, నీవు మిఠాయి అతిగా తినటం మానేయ్యాలి. అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు.”
ఆ బాలుడు తల ఊపాడు మరియు మానేస్తానని ప్రమాణం చేసాడు.
బాలుని తల్లి ఇలా అడిగింది, “రెండు వారముల క్రితం మీరు దానిని అతడికి ఎందుకు చెప్పలేదు?”
ఆ తెలివైన వ్యక్తి చిరునవ్వు నవ్వాడు. “రెండు వారాల క్రితం నేను ఇంకా మిఠాయిని తింటున్నాను.”
ఈ వ్యక్తి ఎంత చిత్తశుద్ధితో జీవించాడు అంటే అతడు తన స్వంత సలహాను అనుసరిస్తే తప్ప తన సలహాకు బలము ఉండదని అతడు ఎరుగును.
మన పిల్లలపై మనము కలిగియుండే ప్రభావము మనము నిబంధన బాటపై నడుచుట వారు చూసినప్పుడు ఎక్కువ శక్తివంతమైనది. మోర్మన్ గ్రంధ ప్రవక్త జేకబ్ అటువంటి నీతి యొక్క మాదిరిగా ఉన్నాడు. అతడి కుమారుడైన ఈనస్ తన తండ్రి యొక్క బోధనల ప్రభావమును గూర్చి వ్రాసాడు:
“ఈనస్ అను నేను, నా తండ్రి అతడొక నీతిమంతుడైన మనుష్యుడని ఎరిగియుండి, ఏలయనగా అతడు నాకు తన భాషలో ప్రభువు యొక్క శిక్షణ, ఉపదేశములో కూడ బోధించెను—దాని నిమిత్తము నా దేవుని నామము దీవించబడును గాక. …
“… నేను తరచుగా నా తండ్రి నిత్యజీవము, పరిశుద్ధుల యొక్క సంతోషమును గూర్చి పలుకగా వినిన మాటలు, నా హృదయములో లోతుగా నాటుకున్నవి.”8
యువ యోధుల తల్లులు సువార్తను జీవించారు, మరియు వారి పిల్లలు విశ్వాసముతో నింపబడ్డారు. వారి నాయకుడు తెలియజేసాడు:
“వారు సందేహించని యెడల, దేవుడు వారిని విడిపించునని, వారు వారి తల్లుల చేత బోధింపబడిరి.
“మరియు ఇట్లనుచు, వారి తల్లుల యొక్క మాటలను, వారు నాకు తిరిగి చెప్పిరి: మా తల్లులు దాని నెరుగుదురని మేము సందేహించము.”9
ఈనస్ మరియు యువ యోధులు వారి తల్లిదండ్రుల విశ్వాసము చేత బలపరచబడిరి, అది వారి స్వంత విశ్వాస పరీక్షలను ఎదుర్కొనుటకు వారికి సహాయపడినవి.
మన దినములలో మనము యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్తతో దీవించబడ్డాము, అది మనము నిరాశ చెంది లేక ఇబ్బందులలో ఉన్నప్పుడు మనల్ని పైకెత్తును. మనము మన విశ్వాస పరీక్షల ద్వారా ముందుకు సాగిపోయిన యెడల ప్రభువు యొక్క స్వంత కాలములో మన ప్రయత్నాలు ఫలిస్తాయని మనము అభయమివ్వబడ్డాము.
ప్రాంతీయ అధ్యక్షత్వముతో, నేను, నా భార్య, ఈ మధ్య హాయిటి పొర్టవు-ప్రిన్స్ దేవాలయము యొక్క సమర్పణకు ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ తోపాటు వెళ్లాము. మాతోపాటు వచ్చిన మా కుమారుడు జొర్జ్, తన అనుభవాన్ని గూర్చి ఇలా చెప్పాడు: “అద్భుతము, నాన్నా! ఎల్డర్ బెడ్నార్ సమర్పణ ప్రార్థనను ప్రారంభించిన వెంటనే, గది వెలుగు, వెచ్చదనముతో నింపబడుట నేను అనుభూతి చెందాను. దేవాలయము యొక్క ఉద్దేశమును గూర్చి నా జ్ఞానమునకు ఆ ప్రార్ధన చాలా అధికమును చేర్చింది. అది నిజముగా ప్రభువు యొక్క మందిరము.”
మోర్మన్ గ్రంధములో, దేవుని చిత్తమును తెలుసుకొనుటకు మనము కోరిన యెడల, ఆయన మనల్ని బలపరచునని నీఫై బోధిస్తున్నాడు. అతడు ఇలా వ్రాసాడు, “నీఫై అను నేను మిక్కిలి యవ్వన ప్రాయమందున్నప్పటికినీ, ఆకారమందు పెద్దగా ఉండి, దేవుని మర్మములను తెలుసుకొనవలెనని గొప్ప కోరికలు కలిగియుంటిని; అందువలన, నేను ప్రభువునకు మొర పెట్టితిని, ఇదిగో ఆయన నన్ను దర్శించి, నా హృదయమును మృదుపరచెను; కావున, నా తండ్రి చేత పలుకబడిన మాటలన్నింటిని నేను నమ్మితిని; అందువలన, నా సహోదరుల వలే నేను అతనికి వ్యతిరేకముగా తిరుగబడలేదు.”10
సహోదర, సహోదరిలారా, మన పిల్లలు మన చుట్టూ ఉన్న పిల్లలు దేవుని నిబంధన బాటను అనుసరించుటకు మనము సహాయపడదాం, ఆవిధంగా ఆత్మ వారికి బోధించవచ్చు, వారి జీవితకాలమంతా ఆయనను వెంబడించుటకు కోరుటకు వారి హృదయాలు మృదువుగా చేయబడువచ్చు.
నా తల్లిదండ్రుల మాదిరిని నేను ఆలోచించినప్పుడు, ప్రభువైన యేసు క్రీస్తుయందు మా విశ్వాసము మన పరలోక గృహమునకు తిరిగి మమ్మల్ని సురక్షితంగా తీసుకొని వెళ్ళు మార్గమును మనకు చూపునని నేను గ్రహించాను. మన విశ్వాస పరీక్ష తరువాత అద్భుతాలు కలుగునని నేనెరుగుదును.
యేసు క్రీస్తు, ఆయన ప్రాయశ్చిత్తః త్యాగమును గూర్చి నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయనే మన రక్షకుడు మరియు విమోచకుడని నేను ఎరుగుదును. ఆయన మరియు మన పరలోక తండ్రి 1820 వసంత కాలములో పునఃస్థాపన యొక్క ప్రవక్త, యౌవన జోసెఫ్ స్మిత్‌కు ప్రత్యక్షమయ్యారు. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మన కాలము యొక్క ప్రవక్త. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.