సాక్షులు, అహరోను యాజకత్వ సమూహములు మరియు యువతుల తరగతులు
ఇప్పుడు మేము ప్రకటించు సర్దుబాట్లు యువకులు మరియు యువతులు వారి యొక్క పవిత్రమైన వ్యక్తిగత సామర్థ్యమును అభివృద్ధి చేసుకొనుటకు ఉద్దేశించబడినవి.
సహోదర, సహోదరిలారా, సర్వసభ్య సమావేశములో మరల మీతో ఉండుట అద్భుతముగా ఉన్నది. ఈ వారము ఆరంభములో, బాప్తీస్మమునకు మరియు ముద్రణ విధులకు ఎవరు సాక్షులుగా ఉండవచ్చు అనే దాని గురించి విధానములో మార్పుల గురించి సంఘ సభ్యులకు ప్రకటనలు చేయబడ్డాయి. ఆ మూడు అంశాల గురించి నేను ప్రధానంగా చెప్పాలనుకుంటున్నాను.
-
మరణించిన వ్యక్తి యొక్క ప్రాతినిధ్య బాప్తీస్మమునకు సాక్షిగా పరిమిత ఉపయోగ సిఫారసుతో పాటు చెలామణిలో ఉన్న దేవాలయ సిఫారసు ఉన్న ఎవరైనా ఉండవచ్చును.
-
సజీవులకు మరియు ప్రాతినిధ్య ముద్రణ విధులకు సాక్షిగా వరముపొంది చెలామణిలో ఉన్న దేవాలయ సిఫారసు కలిగిన ఏ సభ్యులైనా సేవచెయ్యవచ్చును.
-
సంఘములో బాప్తీస్మము తీసుకొన్న ఏ సభ్యులైన జీవించుచున్న వ్యక్తి యొక్క బాప్తీస్మమునకు సాక్షిగా ఉండవచ్చును. దేవాలయము బయట జరుగు బాప్తీస్మములన్నిటికి ఈ మార్పు వర్తిస్తుంది.
ఈ విధాన సర్దుబాట్లు కార్యనిర్వాహణకు సంబంధించినవి. మూలాధారమైన సిద్ధాంతము మరియు నిబంధనలలో ఎటువంటి మార్పులేదు. అవి అన్ని విధులలో సమానంగా ప్రభావవంతముగా ఉన్నాయి. కుటుంబము ఈ విధులలో పాల్గొనుటను ఈ మార్పులు గొప్పగా వృద్ధిచేయవలెను.
మన యువత మరియు వారి నాయకులకు సంబంధించిన సర్దుబాట్లను పరిచయం చెయ్యాలని ఈ సమయంలో మీతో మాట్లాడాలనుకొంటున్నాను.
యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క యువతను భూమిపైన ఉన్న హేతువులలో గొప్ప హేతువైన-ఇశ్రాయేలీయును పోగుచేయుటకు ప్రభువు యొక్క యువత పటాలములో చేరాలని ఇటీవల నేను ఆహ్వానించానని మీరు జ్ఞాపకము చేసుకుంటారు.1 నేను ఈ ఆహ్వానాన్ని మన యువతకు జారీచేసాను ఎందుకంటే వారు ఇతరులను సమీపించుటకు మరియు వారు నమ్మే సిద్ధాంతాలను ఇతరులను ఒప్పించు రీతిలో పంచుకోగల అసాధారణమైన ప్రతిభను కలిగియున్నారు. ప్రపంచము మరియు దానిలోని ప్రజలు ప్రభువు యొక్క రెండవ రాకడకు సిద్ధపడుటలో వారికి సహాయము చేయుటకు ఇశ్రాయేలీయులను పోగుచేయు హేతువు ఆవశ్యకమైన భాగము.
ప్రతి వార్డులో ప్రభువు యొక్క యువత పటాలము దేవుని యొక్క అంకితము చేయబడిన సేవకుడైన ఒక బిషప్పుతో నడిపించబడుతుంది. అతని యొక్క మొదటిది మరియు ముఖ్యమైన బాధ్యత ఎమనగా తన వార్డులోని యువకులు, యువతులను సంరక్షించుట. బిషప్పు మరియు అతని సలహాదారులు వార్డులోని అహరోను యాజకత్వ సమూహములు, యువతుల తరగతుల యొక్క పనిని నిర్దేశిస్తారు.
ఇప్పుడు మేము ప్రకటించు సర్దుబాట్లు యువకులు మరియు యువతులు వారి యొక్క పవిత్రమైన వ్యక్తిగత సామర్థ్యమును అభివృద్ధి చేసుకొనుటకు ఉద్దేశించబడినవి. అహరోను యాజకత్వ సమూహములు మరియు యువతుల తరగతులను కూడా మేము బలపరచాలనుకుంటున్నాము మరియు యువతరాలకు సేవ చేయుచుండగా బిషప్పులకు మరియు ఇతర పెద్దవారి నాయకులకు సహకారము అందించాలనుకుంటున్నాము.
యువకులకు సంబంధించిన సర్దుబాట్ల గురించి ఎల్డర్ క్వింటన్ ఎల్. కుక్ ఇప్పుడు చర్చిస్తారు. ఈ రాత్రి ప్రధాన స్త్రీల సమావేశములో, యువతుల ప్రధాన అధ్యక్షురాలు సహోదరి బొన్నీ హెచ్. కార్డన్ యువతులకు సంబంధించిన సర్దుబాట్ల గురించి చర్చిస్తారు.
మన యువతను బలపరచుటకు చేయు ఈ ప్రయత్నాలను ఆమోదించుటలో ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది ఏకమైయున్నారు. వారిని మేమెంతగానో ప్రేమిస్తున్నాము మరియు వారి కొరకు ప్రార్థిస్తున్నాము. వారు “ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ, సీయోను సైన్యము, వాగ్దాన దిన పిల్లలై యున్నారు.”2 మన యువతపై పూర్తి నమ్మకాన్ని మరియు వారియెడల మా కృతజ్ఞతను మేము వ్యక్తపరుస్తున్నాము. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో, ఆమేన్.