![](https://www.churchofjesuschrist.org/imgs/https%3A%2F%2Fassets.churchofjesuschrist.org%2F64%2Fe1%2F64e1209679c73d26af0a1c03c31bea125cfab51c%2F64e1209679c73d26af0a1c03c31bea125cfab51c.jpeg/full/!250,/0/default)
ప్రియమైన కుమార్తెలు
యువతుల కార్యక్రమంలో మేము ప్రధానంగా చేసేది ప్రభువైన యేసు క్రీస్తునందు అచంచలమైన విశ్వాసమును సంపాదించుటకు మీకు సహాయపడాలని మా కోరికయైన్నది.
నా ప్రియమైన సహోదరిలారా, మీతో ఉండుట సంతోషకరమైనది! మనము ఆత్మీయ ప్రయత్నము, సంతోషపరచు రెండింటి యొక్క సమృద్ధియైన బయల్పాటును ప్రత్యక్షంగా చూస్తున్నాము.
మనము ప్రారంభించినప్పుడు, కొందరు స్నేహితులకు మిమ్మల్ని పరిచయము చేయాలని నేను కోరుతున్నాను; వారు ప్రతిభ, సంప్రదాయము, వ్యక్తిగత మరియు కుటుంబ పరిస్థితియందు ప్రత్యేకంగా ఉన్న యువతులు. మీ అందరివలే వారిలో ప్రతీఒక్కరు, నా హృదయాన్ని భావావేశంగా ప్రభావితం చేసారు.
మొదట, బెల్లాను కలవండి. ఆమె ఐస్‌లాండ్‌లో తన శాఖలో ఏకైక యువతిగా బలముగా నిలిచియున్నది.
ఆఫ్రికా నుండి సమర్పించబడిన జోసఫిన్‌ను కలవండి, ఆమె ప్రతీరోజు మోర్మన్ గ్రంధమును అధ్యయనం చేయటానికి తిరిగి ఒడంబడిక చేసుకున్నది. ఆమె ఈ సాధారణమైన, విశ్వాసమైన క్రియ నుండి వచ్చే శక్తిని, దీవెనలను కనుగొనుచున్నది.
మరియు చివరిగా, నా ప్రియమైన స్నేహితురాలు ఆష్టిన్‌ను కలవండి, ఆమె ఆరు-సంవత్సరాలు కాన్సరుతో పోరాడిన తరువాత చనిపోయిన అసాధారణమైన యువతి. యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తమును గూర్చి ఆమె బలమైన సాక్ష్యము నా హృదయములో ఇంకా ప్రతిధ్వనిస్తున్నది.
మీరు అందరూ అసాధారణమైన యువతులు. మీరు ప్రతీఒక్కరు మీ స్వంత వరములు, అనుభవాలతో ప్రత్యేకమైనవారు, అయినప్పటికినీ చాలా ముఖ్యమైన, శాశ్వతమైన విధానములో ఒకేరీతిగా ఉన్నారు.
మీరు నిజంగా పరలోక తల్లిదండ్రుల యొక్క ఆత్మ కుమార్తెలు, వారి ప్రేమ నుండి, మీ రక్షకుని యొక్క ప్రేమనుండి మిమ్మల్ని ఏదీ వేరు చేయలేదు.1 మీరు ఆయనకు దగ్గరగుటకు, చిన్నబిడ్డల వలే ముందుకు తప్పటడుగులను వేస్తున్నప్పుడు కూడా, మన రక్షకుడైన, యేసు క్రీస్తు యొక్క విశ్వాసులైన శిష్యులుగా మీ ఆత్మలోనికి స్థిరపడే శాశ్వతమైన సమాధానమును మీరు కనుగొంటారు.
“(మీ) పరిశుద్ధ వ్యక్తిగత సాధ్యతను అభివృద్ధి చేయుటకు”2 మీకు సహాయపడునట్లు మరియు మీ నీతిగల ప్రభావము పెంపొందించుటకు కొన్ని ప్రేరేపించబడిన మార్పులను నన్ను పంచుకోమని మన మిక్కిలి ప్రియమైన ప్రవక్త, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ అడిగారు. ఈరాత్రి నాలుగు ప్రాంతాలలో సవరణలను నేను ప్రసంగిస్తాను.
యువతుల కూడికల నేపథ్యము
మొదట, యువతుల కూడికయందు మేము చేయు సమస్తములో ప్రధానమైనది ప్రభువైన యేసు క్రీస్తునందు అచంచలమైన విశ్వాసమును,3 దేవుని కుమార్తెగా మీ దైవిక గమ్యమును గూర్చి ఒక స్థిరమైన జ్ఞానమును పొందటానికి మీకు సహాయపడుట మా కోరికైయున్నది.
ఈరాత్రి, నేను యువతుల నేపథ్యమునకు ఒక సవరణను ప్రకటించాలని నేను కోరుతున్నాను. క్రొత్త నేపథ్యమును నేను చెప్పినప్పుడు ఈ మాటల యొక్క సత్యమును గూర్చి పరిశుద్ధాత్మ సాక్ష్యమిచ్చుట మీరు భావిస్తారని నేను ప్రార్ధిస్తున్నాను:
దైవిక స్వభావము, నిత్య గమ్యముతో,5 నేను పరలోక తల్లిదండ్రుల యొక్క ప్రియమైన కుమార్తెను.4
యేసు క్రీస్తు యొక్క శిష్యురాలిగా, 6 నేను ఆయనవలే అగుటకు ప్రయాసపడతాను.7 వ్యక్తిగత బయల్పాటును నేను వెదకి,8 ఆ ప్రకారము చేసి, ఆయన పరిశుద్ధ నామములోఇతరులకు పరిచర్య చేస్తాను.9
నేను అన్ని సమయాలందు, అన్ని విషయాలందు, అన్ని స్థలములందు దేవునికి ఒక సాక్షిగా నిలబడతాను.10
మహోన్నత స్థితి కొరకు నేను యోగ్యత కలిగియుండుటకు ప్రయాసపడినప్పుడు, 11 పశ్చాత్తాపము యొక్క వరమును నేను ఆనందిస్తాను,12 ప్రతీరోజు మెరుగుపరచుకొనుటకు కోరతాను.13 విశ్వాసముతో,14 నేను నా గృహమును, కుటుంబమును బలపరుస్తాను,15 పరిశుద్ధ నిబంధనలను చేసి పాటిస్తాను,16 పరిశుద్ధ దేవాలయము యొక్క విధులను, దీవెనలను17 పొందుతాను.18
“మేము” నుండి “నేను” మారుట గమనించండి. ఈ సత్యములు వ్యక్తిగతంగా మీకు అన్వయిస్తాయి. నీవు పరలోక తల్లిదండ్రుల యొక్క ఒక ప్రియమైన కుమార్తె. నీవు మన రక్షకుడైన, యేసు క్రీస్తు యొక్క నిబంధన శిష్యురాలివి. ఈ మాటలను అధ్యయనం చేసి, ధ్యానించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు ఆవిధంగా చేస్తున్నప్పుడు, వాటి యధార్ధతను గూర్చి సాక్ష్యమును మీరు పొందుతారని నేను ఎరుగుదును. ఈ సత్యములను అర్ధము చేసుకొనుట మీరు సవాళ్లను ఎదుర్కొను విధానమును మార్చును. మీ గుర్తింపు, ఉద్దేశమును తెలుసుకొనుట, రక్షకునితో మీ చిత్తమును క్రమంలో ఉంచుటకు మీకు సహాయపడును.
మీరు యేసుక్రీస్తును వెంబడించినప్పుడు, సమాధానము మరియు నడిపింపు మీదగును.
యువతుల తరగతులు
రెండవ ప్రాంతములో మార్పు యువతుల తరగతులను ప్రభావితం చేస్తాయి. “జీవితములోని శ్రమలు, దుర్దశల నుండి ప్రతీఒక్కరు స్వాగతించబడినట్లు భావించే స్థలములో ఆశ్రయమును పొందుట తరచుగా జనులకు చాలా ఎక్కువగా అవసరమయ్యేదని,” ఎల్డర్ నీల్ ఎ. మాక్స్‌వెల్ చెప్పారు.19 మన తరగతులు తుఫానుల నుండి ఆశ్రయములుగా, ప్రేమ, స్వాగతించబడే భద్రమైన స్థలములుగా ఉండాలి. గొప్ప ఐక్యతను నిర్మించుటకు, స్నేహములను బలపరచుటకు, యువతులలో ఆ చేర్చబడిన భావనను పెంచే ప్రయత్నములో, తరగతి నిర్మాణమునకు మేము కొన్ని సవరణలను చేస్తున్నాము.
దాదాపు 100 సంవత్సరాలకు పైగా, యువతులు ముగ్గురు తరగతులుగా విభజించబడ్డారు. వెంటనే ప్రారంభించి, యువతుల నాయకులు మరియు బిషప్పులు ప్రతీ యువతుల అవసరాలను ప్రార్థనాపూర్వకంగా ఆలోచించమని, వార్డు యొక్క ప్రత్యేక పరిస్థితుల ప్రకారము వాటిని నిర్వహించమని మేము ఆహ్వానిస్తున్నాము. ఇది ఎలా కనిపిస్తుందో ఇక్కడ కొన్ని మాదిరులున్నాయి.
-
మీరు కొంతమంది యువతులను కలిగి ఉన్నయెడల, ప్రతీఒక్కరు కలిసి ఒక యువతుల తరగతిని మీరు కలిగియుండవచ్చు.
-
బహుశా మీరు 12 సంవత్సరాల యువతుల గుంపును పెద్దదిగా కలిగియుండవచ్చు, తరువాత పెద్దవారైన యువతుల చిన్నగుంపును కలిగియుండవచ్చు. మీరు రెండు తరగతులను కలిగియుండుటకు నిర్ణయించవచ్చు: 12 సంవత్సరాల యువతులు మరియు 13–18 సంవత్సరాల వయస్సు గల యువతులు.
-
లేక మీరు 60 మంది యువతులు హాజరవుతున్న పెద్ద వార్డును కలిగియున్న యెడల, ప్రతీ వయస్సు కొరకు ఒకటి చొప్పున, ప్రతి సంవత్సరం వారికి నిర్వహించుటకు ఆరు తరగతులను మీరు కలిగియుండవచ్చు.
మీ తరగతులు ఎలా నిర్వహించబడినప్పటికినీ, యువతులైన మీరు ఐక్యతను నిర్మించుటలో ప్రాముఖ్యత కలిగియున్నారు. మీ చుట్టూ ఉన్నవారికి వెలుగుగా ఉండుము. ఇతరుల నుండి పొందాలని మీరు ఆశించే ప్రేమ మరియు శ్రద్ధ యొక్క వనరులుగా ఉండుము. మీ హృదయములో ప్రార్థనతో, దయచూపుట కొనసాగించి, మంచి కొరకు శక్తిగా ఉండుడి. మీరు ఆవిధంగా చేసినప్పుడు, మీ జీవితం దయతో నింపబడుతుంది. మీరు ఇతరుల పట్ల మంచి భావనను కలిగియుంటారు, తిరిగి వారి మంచితనమును చూచుట ప్రారంభిస్తారు.
యువతుల తరగతి పేర్లు
మూడవది, ఈ క్రొత్త తరగతి నిర్మాణముతో, అన్ని తరగతులు “యువతులు,”20 యొక్క ఐక్యముచేయు పేరు చేత సూచింపబడతారు. “బీహైవ్,” “మీయామెయిడ్,” “లారెల్,” పేర్లను మనము ఉపయోగించుట మానేస్తాము.
తరగతి అధ్యక్షత్వములను బలపరచుట
నేను చెప్పాలని కోరే చివరి ప్రాంతము తరగతి అధ్యక్షత్వముల యొక్క ప్రాధాన్యత. యువతుల తరగతులు ఎలా నిర్వహించబడినప్పటికినీ, ప్రతీ తరగతి ఒక తరగతి అధ్యక్షత్వమును కలిగియుండాలి!{21 దైవిక ప్రణాళిక ద్వారా యువతులు వారి యౌవనంలో నడిపించుటకు పిలవబడ్డారు.
తరగతి అధ్యక్షత్వముల యొక్క పాత్ర, ఉద్దేశము బలపరచబడింది మరియు మరింత స్పష్టంగా నిర్వచించబడింది. రక్షణ కార్యము ఈ ప్రాముఖ్యమైన బాధ్యతలలో ఒకటి, ప్రత్యేకంగా పరిచర్య, మిషనరీ కార్యము, చైతన్యవంతం చేయుట, దేవాలయము మరియు కుటుంబ కార్యము యొక్క ప్రాంతాలందు ఉన్నది.22 అవును, ఇదేవిధంగా మనము ఇశ్రాయేలును సమకూరుస్తాము23—ప్రభువు యొక్క యువ సైనిక దళములో సభ్యులుగా యువతులందరికీ ఒక మహిమకరమైన కార్యము.
మీకు తెలిసినట్లుగా, సంఘము యొక్క ప్రతీ స్థాయిలో, ప్రభువు తన జనులను నడిపించుటకు అధ్యక్షత్వములను పిలుచును. యువతులారా, తరగతి అధ్యక్షత్వములో సభ్యురాలిగా, ఈ ప్రేరేపించబడిన నాయకత్వ మాదిరిలో పాల్గొనుట మీ మొదటి అవకాశము కావచ్చు. పెద్దవారైన నాయకులారా, తరగతి అధ్యక్షత్వములను పిలుచుట ఒక ప్రాధాన్యతగా చేయండి, వారి ప్రక్కన ఉండి నడిపించి, బోధించి, వారికి దారిచూపండి, ఆవిధంగా వారు విజయాన్ని పొందగలరు.24 ఒక తరగతి అధ్యక్షత్వము ఎటువంటి స్థాయి నాయకత్వమును కలిగియున్నప్పటికినీ, వారు ఉన్నచోటనుండే ప్రారంభించండి, నాయకులుగా వారిని దీవించు నైపుణ్యములను విశ్వాసమును వృద్ధి చేయుటకు వారికి సహాయపడండి. వారికి దగ్గరగా ఉండండి, కానీ నియంత్రించవద్దు. మీరు వారిని నడిపించినప్పుడు ఆత్మ మిమ్మల్ని నడిపించును.
బోధకులుగా తల్లిదండ్రులు మరియు నాయకుల యొక్క ముఖ్యమైన పాత్రను వివరించుటకు, నేను మీకు ఒక వృత్తాంతమును చెప్తాను. క్లోయి ఒక తరగతి అధ్యక్షురాలిగా సేవ చేయుటకు పిలవబడింది. ఆమె తెలివైన యాజకత్వ నాయకుడు తన అధ్యక్షత్వము కొరకు పేర్లను సిఫారసు చేయటంలో ప్రభువు యొక్క సహాయమును వెదకమని ఆమెను ప్రోత్సహించాడు. క్లోయి ప్రార్ధన చేసి, తన సలహాదారులుగా ఎవరిని సిఫారసు చేయాలనే ప్రేరేపణ త్వరగా పొందింది. ఒక సెక్రటరీ గురించి ఆమె లోతుగా ఆలోచించి, ప్రార్ధించుట కొనసాగించినప్పుడు, ఆమెను ఆశ్చర్యపరిచిన ఒక యువతి వైపు ఆత్మ ఆమె దృష్టిని పలుమార్లు ఆకర్షించింది—ఆమె సంఘము లేక కార్యక్రమాలకు అరుదుగా వచ్చే వ్యక్తి,
ప్రేరేపణతో కాస్త అభద్రతగా భావిస్తూ, క్లోయి తన తల్లితో మాట్లాడింది, ఆమె మనము పునరావృతమైన ఆలోచనలు పొందుట బయల్పాటులను పొందు విధానాలలో ఒకటి అని వివరించింది. నవీకరించబడిన విశ్వాసముతో, క్లోయి ఈ యువతిని సిఫారసు చేయవచ్చని భావించింది. బిషప్పు పిలుపు ఇచ్చాడు, మరియు ఆ యువతి అంగీకరించింది. నియమించబడిన తరువాత, ఆ ప్రియమైన సెక్రటరీ ఇలా చెప్పింది, “మీకు తెలుసా, నాకు ఒక స్థలమున్నట్లు లేక నేను ఎక్కడైన అవసరమని ఎన్నడూ భావించలేదు. నేను సరిపోతానని నేను భావించలేదు. కానీ ఈ పిలుపుతో, పరలోక తండ్రి ఒక ఉద్దేశము కలిగియున్నారని, నాకొక స్థలమును కలిగియున్నారని నేను భావించాను.” క్లోయి, ఆమె తల్లి సమావేశము విడిచి వెళ్లినప్పుడు, క్లోయి తన తల్లివైపు తిరిగి, తన కళ్లలో కన్నీళ్లతో చెప్పింది, “బయల్పాటు నిజమైనది! బయల్పాటు నిజంగా పనిచేస్తుంది!”
తరగతి అధ్యక్షత్వములారా, మీరు దేవుని చేత పిలవబడ్డారు, ఆయన కుమార్తెల గుంపును నడిపించుటకు మీరు నమ్మబడ్డారు. “ప్రభువు మిమ్మును ఎరిగియున్నారు. … ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నారు.”25 మీరు యాజకత్వ అధికారము గల వారిచేత నియమించబడ్డారు; దీని అర్ధము మీ పిలుపు యొక్క బాధ్యతలను మీరు నెరవేర్చినప్పుడు, మీరు యాజకత్వ అధికారమును సాధన చేస్తారు. మీరు చేయటానికి ముఖ్యమైన కార్యమును కలిగియున్నారు. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణలకు సున్నితముగా ఉండండి మరియు అమలు చేయండి. మీరు ఆవిధంగా చేసినప్పుడు, మీరు విశ్వాసముతో సేవ చేయగలరు, ఏలయనగా మీరు ఒంటరిగా సేవ చేయరు!
తరగతి అధ్యక్షులారా, మీ జ్ఞానము, స్వరము, మరియు ఈరోజు ఎల్డర్ క్వింటిన్ ఎల్. కుక్ ప్రకటించిన క్రొత్త వార్డు యువత సలహాసభలో మీ శక్తి మాకు అవసరము. మీ సహోదర, సహోదరీల అవసరాలను తీర్చుటకు పరిష్కారములో మీరు ఆవశ్యకమైన భాగము.26
తరగతి నిర్మాణము మరియు నాయకత్వములో ఈ మార్పులు వార్డులు మరియు బ్రాంచీలు సిద్ధపడిన వెంటనే ప్రారంభించబడవచ్చు, కానీ 2020, జనవరి 1 కల్లా వాటి స్థానాల్లో ఉంచబడాలి.
నా ప్రియమైన సహోదరిలారా, ఈరోజు నేను ప్రసంగించిన ఈ సవరణలు ప్రభువు నుండి ప్రేరేపించబడిన నడిపింపు అని నేను సాక్ష్యమిస్తున్నాను. ఈ సవరణలను మనము శ్రద్ధగా అన్వయించినప్పుడు, మన ఉద్దేశమును ఎన్నడూ మనము మరచిపోవద్దని నేను ఆశిస్తున్నాను: యేసు క్రీస్తును అనుసరించుటకు మన తీర్మానమును బలపరచుట మరియు ఇతరులు ఆయన వద్దకు వచ్చుటకు సహాయపడుట. ఇది ఆయన సంఘమని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన పరిశుద్ధమైన కార్యములో చాలా ముఖ్యమైన భాగముగా ఉండుటకు ఆయన మనల్ని అనుమతించినందుకు నేను ఎంతగానో కృతజ్ఞత కలిగియున్నాను.
ఈ సవరణలను నడిపించిన అదే ఆత్మ మీరు నిబంధన బాటపై ముందుకు సాగినప్పుడు మిమ్మల్ని నడిపిస్తుందని నేను ప్రార్థిస్తున్నాను. ఆవిధంగా నేను యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.