2010–2019
నిరంతరము ప్రార్ధనయందు కనిపెట్టియుండుడి
2019 అక్టోబర్ సర్వసభ్య సమావేశము


2:3

నిరంతరము ప్రార్ధనయందు కనిపెట్టియుండుడి  (ఆల్మా 34:39; మొరోనై 6:4; లూకా 21:36)

నిర్లక్ష్యాన్ని, యాధృచ్చికతను నివారించడానికి స్థిరమైన అప్రమత్తత అవసరం.

మనమంతా కలిసి సంతోషించి, ఆరాధించినప్పుడు మీ కొరకు, నా కొరకు పరిశుద్ధాత్మ సహాయము కొరకై నేను మనఃపూర్వకంగా ప్రార్థిస్తున్నాను.

1976 ఏప్రిల్ లో, ఎల్ఢర్ బాయడ్ కె. పాకర్ సర్వసభ్య సమావేశంలో ప్రత్యేకంగా యౌవనస్తుల కొరకు మాట్లాడారు. “ఆత్మీయ మొసళ్లు,” అను శీర్షిక కలిగిన ఆయన యొక్క అధ్బుతమైన సందేశంలో, ఆఫ్రికాలో ఆయనకివ్వబడిన పనియందు, ఆయన చక్కగా దాగియున్న మొసళ్లు అనుమానించని బాధితులను సంహరించుటకు వేచియుండుటను ఆయన గమనించారు. తరువాత ఆయన ఆ మొసళ్లను పాపం యొక్క భయంకరమైన స్వభావాన్ని దాచిపెట్టుట ద్వారా, పరాకుగానున్న యవ్వనులను వేటాడే సాతానుతో పోల్చారు.

ఎల్డర్ పాకర్ ఆ ప్రసంగాన్ని చేసినప్పుడు నేను 23 సంవత్సరాల వాడను, మరియు కొద్ది రోజుల్లో సూజన్, నేను మా మొదటి బిడ్డయొక్క జననాన్ని ఎదురుచూస్తున్నాము. ఆయన సందేశం యొక్క సారాంశమైన పాపాన్ని తప్పించుకొనుట, మరియు ఒక ముఖ్యమైన ఆత్మీయ పాఠమును బోధించుటకు ఆయన ఉపయోగించిన జంతువుల యొక్క సాధారణ ప్రవర్తనను చాలా నైపుణ్యమైన విధానముతో మేము ముగ్దులమయ్యాము.

సూజన్, నేను కూడా అనేక పనులపై ఆఫ్రికా ప్రయాణించాం. ఆ ఖండంలో నివసించే అద్భుతమైన జంతువులను చూచే అవకాశాలు మాకు కలిగాయి. మా జీవితాలలో ఎల్డర్ పాకర్ ప్రసంగము యొక్క ప్రభావమును జ్ఞాపకం చేసుకుంటూ, ఆఫ్రికాలోని వన్యప్రాణులను ప్రవర్తనను గమనిస్తూ మరియు వాటినుండి పాఠాలను నేర్చుకోవడానికి మేము ప్రయత్నించాం.

సూజన్, నేను చూచిన రెండు చిరుతపులులు వాటి ఎరను వేటాడినప్పుడు వాటి గుణాలను, కుతంత్రాలను వివరించాలని, మరియు మేము గమనించిన వాటిలో కొన్నింటిని యేసుక్రీస్తు సువార్తను ప్రతిదినం జీవించుటలో సంబంధింప చేయాలని నేను కోరుతున్నాను.

చిరుతలు మరియు జింక

చిరుతలు భూమిపైనున్న అత్యంత వేగంగా పరుగెత్తే జంతువులు, అవి గంటకు 75 మైళ్ల (గంటకు 120 కిలోమీటర్లు) వేగాన్ని చేరుకోగలవు. ఈ అందమైన జంతువులు మూడు సెకన్లలోపు మూడు సెకన్లలోపు అవి నిశ్చలముగా నిలబడిన స్థితినుండి గంటకు 68 మైళ్ల వేగాన్ని పెంచగలవు. చిరుతలు వేటాడే జంతువులు, అవి వాటి ఎరపై దొంగతనంగా చొరబడి, వెంటాడి ముట్టడి చేయుటకు స్వల్ప దూరం వేగంగా పరిగెత్తును.

ఎల్డర్ మరియు సహోదరి బెడ్నార్ చేత గమనించబడిన చిరుతలు

చిరుతలు ఆఫ్రికాలో చాలా సాధారణమైన బాగా విస్తరించిన ఒక పెద్ద దుప్పుల గంపును వెంటాడుటను సూజన్, నేను సుమారు రెండు గంటలు గడిపాము. ఆఫ్రికాలో ఎత్తైన, ఎండు గడ్డి బంగారు గోధుమ రంగులో ఉండి, ఈ మాంసాహారులు ఆ దుప్పుల గుంపును వెంటాడినప్పుడు దాదాపు పూర్తిగా అస్పష్టం చేసింది. చిరుతలు 100 గజాల (91 మీటర్లు) దూరంలో ఒక దానినుండి మరొకటి వేరుగా విడిపోయినా చాలా సామరస్యంగా పనిచేసాయి.

ఒక చిరుత గడ్డిలో నిటారుగా కదలకుండా కూర్చుండగా, మరొక చిరుత నేలకు దగ్గరగా వంగి నెమ్మదిగా ముందుకు ప్రాకుచూ అనుమానించని దుప్పులకు దగ్గరగా వెళ్లింది. అప్పుడు అప్పటివరకు కూర్చున్న చిరుత గడ్డిలో మాయమైపోయింది, సరిగ్గా అదే సమయానికి రెండవ చిరుత నిటారుగా కూర్చోవడం జరిగింది. ఈ విధమైన ప్రత్యామ్నాయ పద్ధతిలో ఒక చిరుత క్రిందకు వంగి ముందుకు ప్రాకడం, రెండవ చిరుత కూర్చోవడం చాలాసేపటి వరకు కొనసాగింది. ఈ రహస్యమైన, జిత్తులమారి వ్యూహం రాబోతున్న ఆపదనుండి దుప్పులకు పరధ్యానం కలుగజేసి, సమీపిస్తున్న ప్రమాదము నుండి వాటి ఆసక్తిని ప్రక్కదారి పట్టించుటకు ఉద్దేశించబడింది. సహనంతో, స్థిరముగా ఆ రెండు చిరుతలు వాటి తదుపరి ఆహారాన్ని భద్రపరచుకోవటానికి జట్టుగా ఆహారాన్ని సంపాదించుకున్నాయి.

ఆ గొప్ప దుప్పుల మందకు మరియు సమీపిస్తున్న చిరుతల మధ్యలో అనేకమైన పెద్దవి, బలమైనటువంటి దుప్పులు కాపలాదారులుగా చెదలపుట్టలపై నిలబడియున్నాయి. ఆ చిన్న దిబ్బల పైనుండి స్పష్టంగా కనబడే గడ్డి మైదానం ఆ కాపలాకాసే దుప్పులకు ఆపద చిహ్నాలను కనుగొనడానికి సులభం చేసింది.

అయితే హఠాత్తుగా, ఆ చిరుతలు వాటికి దగ్గరగా వచ్చినప్పుడు, ఆ మొత్తము దుప్పుల గుంపు తిరిగి పారిపోయాయి. ఆ పెద్దమందతో ఆ కాపలా దుప్పులు అసలు సంభాషించాయో లేదా ఎలా సంభాషించాయో నాకు తెలియదు, కానీ వాటికి ఎదోవిధంగా ఒక హెచ్చరిక ఇవ్వబడింది, మరియు దుప్పులన్నీ సురక్షితమైన ప్రదేశానికి చేరుకున్నాయి.

అయితే చిరుతలు ఆ తర్వాత ఏం చేశాయి? ఎలాంటి ఆలస్యం లేకుండా, ఆ రెండు చిరుతలు వాటి ప్రత్యామ్నాయ పద్దతితో ఒక చిరుత నిటారుగా గడ్డిలో కూర్చోనియుండగా, మరొక చిరుత క్రిందకు వంగి ముందుకు ప్రాకడం మొదలుపెట్టాయి. వాటిని వేటాడే పద్ధతి కొనసాగింది. అవి ఆపలేదు. అవి విశ్రమించలేదు లేదా విరామం తీసుకోలేదు. అవి పరధ్యానం కలుగ జేసి, దారిమళ్లించే వ్యూహాన్ని అనుసరించుటలో కనికరం లేకుండా ఉన్నాయి. సూజన్, నేను దూరంలో దుప్పుల మందకు మరింత దగ్గరగా వెళ్లుచూ ఆ చిరుతలు కనుమరుగైపోవుట చూసాం.

ఆ రాత్రి సూజన్ నేను మేము గమనించి నేర్చుకొనిన దాని గురించి మర్చిపోలేని సంభాషణను జరిపాం. ఈ అనుభవాన్ని మేము మా పిల్లలు, మనవలతో చర్చించాము మరియు అనేక విలువైన పాఠాలను గుర్తించాం. ఇప్పుడు నేను ఆ పాఠాలలో మూడింటిని వివరిస్తాను.

1# పాఠం—దుష్టుని మోసపుచ్చే మారువేషాలను గూర్చి జాగ్రత్తగా వహించుము.

నాకైతే, చిరుతలు సొగసైన ఆకట్టుకునే, ఆకర్షణీయమైన ప్రాణులు. చిరుతల యొక్క పసుపుపచ్చని రంగు నుండి బూడిద రంగు వెంట్రుకల మధ్యలో నల్లని మచ్చలు ఒక అధ్బతమైన మారువేషంగా పనిచేసి, ఈ జంతువులు ఆఫ్రికా గడ్ఢిమైదానాలలో వాటి ఆహారమును వెటాడినప్పుడు దాదాపుగా కనబడకుండా చేస్తుంది.

ప్రకృతి దృశ్యంలో మారువేషంలోని చిరుత

అదే విధంగా, ఆత్మీయంగా అపాయకరమైన ఉపాయాలు, క్రియలు ఆకర్షణీయంగా, కోరదగినవిగా, లేక ఆహ్లాదకరమైనవిగా కనబడవచ్చు. అందువలన, మన సమకాలీన లోకంలో, మనలో ప్రతి ఒక్కరు మోసపుచ్చే చెడు మంచిదిగా నటించుటను గూర్చి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమున్నది. యెషయా హెచ్చరించినట్లుగా, “కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు, వెలుగు చీకటనియు ఎంచుకొను వారికి శ్రమ; చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకొనువారికి శ్రమ!”1

మానవ జీవిత పవిత్రతను ఉల్లంఘించుటను హక్కుగా పేర్కొని, గందరగోళాన్ని స్వేచ్ఛగా వర్ణించే విరుద్ధమైన కాలంలో, పునరుద్ధరించబడిన సువార్త కాంతి మన జీవితంలో ప్రకాశవంతంగా వెలుగునిచ్చి విరోధి యొక్క చీకటి మోసాలు, పరధ్యానాలను గుర్తించడంలో మనకు సహాయపడే ఈ కడవరి-దిన యుగంలో ఉండుటకు మనం ఎంత ఆశీర్వదింపబడ్డాం.

“ఏలయనగా జ్ఞానులు, సత్యాన్ని అంగీకరించిన వారు, మరియు పరిశుద్ధాత్మను వారికి మార్గదర్శిగా తీసుకొన్నవారు, మోసగించబడని వారు—వారు నరకబడి, అగ్నిలో పారవేయబడక, ఆ దినమున బద్దులైయుండెదరని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”2

2# పాఠం—మెలకువగా ఉండి, అప్రమత్తంగా ఉండుడి

ఒక దుప్పికి, క్షణకాలం అజాగ్రత్త లేదా అశ్రద్ధగా ఉండుట ఒక చిరుతనుండి వేగమైన దాడిని ఆహ్వానించవచ్చు. అదేవిధంగా, ఆత్మీయ నిర్లక్ష్యము లేదా యాదృచ్చికత దుష్టుని యొక్క ప్రయత్నాలకు మనల్ని దుర్భలంగా చేయును. ఆలోచనారహితమైన ఆత్మీయత మన జీవితాలలోకి గొప్ప ఆపదను ఆహ్వానిస్తుంది.

అప్రమత్తమైన దుప్పులు

iStock.com/Angelika

కడవరి దినాలలో సాతాను ఏవిధంగా దేవుని పిల్లలను తప్పుడు భావమైన “శరీర సంబంధమైన భద్రతలోనికి వారిని మోసపుచ్చుచు, దానిని బట్టి వారిట్లందురు. సీయోనులో అంతయు క్షేమమే—అట్లు అపవాది వారి ఆత్మలను మోసపుచ్చుచు, మరియు వారిని జాగ్రత్తగా నరకములోనికి నడిపించి వేయునో,”3 నీఫై వివరించాడు.

నిర్లక్ష్యాన్ని, యాధృచ్చికతను నివారించడానికి నిరంతరం అప్రమత్తంగా ఉండుట అవసరం. అప్రమత్తంగా ఉండుట అనగా సాధ్యమయ్యే అపాయము లేక కష్టముల కొరకు జాగ్రత్తగల కావలిని ఉంచడం. నిఘా ఉంచుట అనేది కాపాడుటకు మరియు రక్షించుటకు మేల్కొని ఉండే చర్యను సూచిస్తుంది. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే, మనం మేల్కొని ఉండి, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణలను మరియు గోపురాలపైనున్న ప్రభువు యొక్క కావలివారి నుండి వచ్చే సంకేతాల గురించి అప్రమత్తంగా ఉండాలి.4

“అవును, మీరు అపవాది యొక్క శోధనల చేత నడిపించబడి వేయబడకుండనట్లు, మీరు నిరంతరము ప్రార్ధనయందు కనిపెట్టియుండుడని కూడ నేను మిమ్ములను హెచ్చరిస్తున్నాను, … ఏలయనగా ఇదిగో, అతడు మీకు ఏ మంచి వస్తువులను బహుమానమియ్యడు.”5

రక్షకునిలో, ఆయన సువార్తపై మన జీవితాలను కేంద్రీకరించినప్పుడు, ఆత్మీయ నిద్రను, సోమరిగా ఉండు ప్రకృతి సంబంధియైన మానవుని యొక్క ధోరణిని జయంచటానికి మనకు సహాయపడుతుంది. మనం చూడటానికి కళ్ళు, వినడానికి చెవులతో ఆశీర్వదించబడినప్పుడు,6 మనం చూడాలని లేదా వినాలని మనం అనుకోకపోయినా లేదా ఏదైనా చూడగలం లేదా వినగలం అని మనం అనుకోలేనప్పుడు పరిశుద్ధాత్మ మనం చూడటానికి, వినడానికి మన సామర్థ్యాన్ని పెంచుతుంది.

“కాబట్టి, మీరు సిద్ధపడియుండునట్లు, కనిపెట్టుకొనియుండుము.”7

3# పాఠం—శత్రువు యొక్క ఉద్ధేశ్యాన్ని గ్రహించుము

చిరుత సహజంగా ఇతర జంతువులను వేటాడి జీవిస్తుంది. ప్రతిరోజు, దినమంతా, చిరుత వేటాడును.

చిరుత వేటాడుట

సాతాను “నీతికి మరియు దేవుని చిత్తమును చేయాలని కోరువారి యొక్క శత్రువు.”8 రోజంతా, ప్రతీ రోజు, దేవుని కుమారులు కుమార్తెలు అతని వలే దౌర్భాగ్యులైయుండవలెననునది అతని ఒకేఒక సంకల్పం, ఏకైక ఉద్ధేశ్యమైయున్నది. 9

తండ్రి యొక్క సంతోష ప్రణాళిక ఆయన పిల్లలకు దిశను అందించడానికి, శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించుటకు వారికి సహాయపడటానికి, పునఃరుత్థానం చేయబడిన, ఉన్నతమైన శరీరాలతో వారిని సురక్షితంగా ఆయన ఇంటికి తీసుకురావడానికి రూపొందించబడింది. దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెలను కలవరపరచి, విచారము కలిగించి, మరియు వారి నిత్యాభివృద్ధికి ఆటంకపరచుటకు సాతాను శ్రమపడుతుంది. అతడు అతిగా ద్వేషించే తండ్రి యొక్క ప్రణాళికలోని అంశాలపై దాడి చేయడానికి విరోధి కనికరం లేకుండా పనిచేస్తాడు.

సాతాను ఒక శరీరాన్ని కలిగిలేడు, మరియు అతని నిత్యాభివృద్ది ఆగిపోయింది. నదీతీరంలో ప్రవహించే నీరు ఆనకట్ట వద్ద ఆగిపోయినట్లే, అపవాదికి భౌతిక శరీరం లేనందు వలన అతని నిత్యాభివృద్ధి నిరోధించబడింది. అతడి తిరుగుబాటు వలన, శరీర మాంసము, ఎముకలు గల గుడారం ద్వారా సాధ్యమయ్యే మర్త్యత్వపు దీవెనలు, అనుభవాలను లూసీఫర్ స్వయంగా నిరాకరించాడు. శక్తివంతమైన లేఖనాత్మక అర్ధాలలో ఒకటైన హేయమైన అనే పదం, మన పరలోకతండ్రి వలే అభివృద్ధి చెందుటను కొనసాగించుటకు, మారడానికి గల అతని అసమర్థతలో వివరించబడింది.

తండ్రి యొక్క సంతోష ప్రణాళికకు, మన ఆత్మీయ అభివృద్ధికి ఒక భౌతిక శరీరం చాలా ముఖ్యమైనది కనుక, లూసిఫర్ మన శరీరాలను తప్పుగా ఉపయోగించమని శోధించడం ద్వారా మన పురోగతిని నిరాశపరచడానికి ప్రయత్నిస్తాడు. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఆత్మీయ భద్రత చివరకు దీనిపై ఉందని బోధించారు, “‘మీరు వెళ్లకూడని చోటుకు, మీరు చేయకూడని పనిని చేయుట వైపు ఎన్నడూ మీ మొదటి ప్రలోభపెట్టే అడుగును వేయకుడి.’ … మనుషులుగా మనమందరం మన మనుగడకు అవసరమైన [భౌతిక] ఆకలిదప్పికలను కలిగియున్నాం. ‘జీవితం యొక్క నిత్యత్వం కొరకు ఈ ఆకలిదప్పికలు ఉండుట ఖచ్చితంగా అవసరం. కావున, అపవాది ఏమి చేస్తాడు?  … అతడు మన ఆకలిదప్పికల ద్వారా మనల్ని ముట్టడిస్తాడు. అతడు మనం తినకూడని వాటిని తినడానికి, మనం తాగకూడని వాటిని తాగడానికి, ప్రేమించకూడని వాటిని ప్రేమించడానికి మనల్ని శోధిస్తాడు!’”10

నిత్యత్వం యొక్క అంతిమ వక్రోక్తులలో ఒకటి, అపవాది భౌతిక శరీరం లేనందున ఖచ్చితంగా ధౌర్భాగ్యడైయుండి, మన శరీరాలను తప్పుగా ఉపయోగించుట ద్వారా అతని ధౌర్భాగ్యంలో పాలుపంచుకొనుటకు మనల్ని ఆహ్వానించి, ప్రలోభపెట్టును. అతనికి లేని మరియు ఉపయోగించలేని సాధనం, శారీరక మరియు ఆత్మీయ నాశనానికి మనలను ఆకర్షించే ప్రయత్నాల యొక్క ప్రాథమిక లక్ష్యం.

శత్రువు యొక్క ఉద్ధేశ్యాన్ని అర్ధము చేసుకొనుట, సాధ్యమయ్యే ముట్టడుల కొరకు ప్రభావవంతమైన సిద్ధపాటుకు ఆవశ్యకము.11 ఖచ్చితంగా కెప్టెన్ మొరోనై లేమనీయుల ఉద్ధేశ్యాన్ని ఎరిగియుండెను కనుక, అతడు వారు వచ్చినప్పుడు ఎదుర్కొనుటకు సిద్ధపడియున్నాడు మరియు విజయాన్ని సాధించాడు.12 అదే సూత్రం మరియు వాగ్ధానం మనలో ప్రతీఒక్కరికీ వర్తిస్తుంది.

“మీరు సిద్దపడియున్న యెడల, మీరు భయపడనక్కరలేదు.

“మీరు అపవాది యొక్క శక్తినుండి తప్పించుకొనగలరు.”13

ఆహ్వానం, వాగ్ధానం, మరియు సాక్ష్యం

చిరుతలు మరియు దుప్పుల ప్రవర్తనను గమనించడం ద్వారా ముఖ్యమైన పాఠాలు నేర్చుకున్నట్లే, మనలో ప్రతి ఒక్కరూ అనుదిన జీవితాలలో జరిగే సాధారణ సంఘటనలలో కనిపించే పాఠాలు, హెచ్చరికల కోసం వెతకాలి. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పరలోక నిర్ధేశాన్ని స్వీకరించడానికి మనస్సును, హృదయాన్ని మనం తెరిచినప్పుడు, అప్పుడు మనం స్వీకరించగలిగే కొన్ని గొప్ప సూచనలు మరియు మనల్ని రక్షించగల చాలా శక్తివంతమైన హెచ్చరికలు మన స్వంత సాధారణ అనుభవాలలోనే ఉద్భవిస్తాయి. శక్తివంతమైన ఉపమానాలు లేఖనాలలో మరియు మన అనుదిన జీవితాలలో రెండిటిలో ఉన్నాయి.

సూజన్, నేను ఆఫ్రికాలో కలిగిన సాహసంలో గుర్తించబడగల అనేక పాఠాలలో మూడింటిని మాత్రమే నేను ప్రస్తావించాను. ఈ చిరుతలు, దుప్పుల కథనంపై పర్యాలోచన చేసి మీకు, మీ కుటుంబానికి అదనపు పాఠాలను గుర్తించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మరియు ప్రోత్సహిస్తున్నాను. మీ గృహం సువార్త అభ్యాసం, జీవనానికి నిజమైన కేంద్రం అని దయచేసి ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.

ఈ ఆహ్వానానికి మీరు విశ్వాసంతో స్పందించినప్పుడు, ప్రేరేపించబడిన ఆలోచనలు మీ మనస్సులలోకి వస్తాయి, మీ హృదయాలలో ఆత్మీయ భావనలు ఉద్భవిస్తాయి, మీరు చేయవలసిన క్రియలను గుర్తిస్తారు లేదా కొనసాగిస్తారు ఆవిధంగా మీరు “చెడు రోజును ఎదిరించగలుగునట్లు, సమస్తము నెరవేర్చినవారై నిలబడగలుగునట్లు, [దేవుని యొక్క] సర్వాంగకవచమును మీరు ధరించుకొనుడి.” 14

మీరు అప్రమత్తతతో, నిరంతరం ప్రార్థనలో కనిపెట్టుకొనియున్నప్పుడు సమర్థవంతమైన సిద్ధపాటు, మరియు ఆత్మీయ రక్షణ యొక్క ఆశీర్వాదాలు మీ జీవితంలోకి ప్రవహిస్తాయని నేను వాగ్దానం చేస్తున్నాను.

నిబంధన మార్గంలో ముందుకు త్రోసుకొని వెళ్లుట మనకు ఆధ్యాత్మిక భద్రతను అందించి, మన జీవితాల్లో శాశ్వతమైన ఆనందాన్ని ఆహ్వానిస్తుందని నేను సాక్ష్యమిస్తున్నాను. పునరుత్థాఃనుడు మరియు సజీవుడైన రక్షకుడు మనలను మంచి మరియు చెడు కాలాలు రెండిటిలోనూ ఆమోదించి, బలపరుస్తాడని నేను సాక్ష్యమిస్తున్నాను. ఈ సత్యాలను గూర్చి నేను ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.