2010–2019
అపవాదిని జయించుటకు శక్తి
2019 అక్టోబర్ సర్వసభ్య సమావేశము


2:3

అపవాదిని జయించుటకు శక్తి

మనము ఈ శాంతిని ఎలా కనుగొనగలము, మనము ఎవరమో ఎలా జ్ఞాపకముంచుకోగలము, మరియు అపవాది యొక్క మూడు డీలను ఎలా జయించగలము?

యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులుగా అగుటకు మరియు పరిశుద్ధ దేవాలయము యొక్క దీవెనలు ఆనందించుటకు మీరు, మరియు ఇతరులకు సహాయపడుటకు మీరు చేయు సమస్తము కొరకు మీకు ధన్యవాదములు.. మీ మంచితనము కొరకు మీకు ధన్యవాదాలు. మీరు అద్భుతమైన వారు, మీరు అందమైన వారు.

మనము దేవుని యొక్క పిల్లలమని పూర్తిగా గ్రహించగలిగినప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క నిర్ధారించు ప్రభావమును మనము గుర్తించాలని నేను ప్రార్ధిస్తున్నాను. “కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన,” ఇలా వివరించును: “పురుషుడు, స్త్రీ—దేవుని యొక్క స్వరూపములో సృష్టించబడ్డారు. ప్రతీఒక్కరు, పరలోక తల్లిదండ్రుల యొక్క ప్రియమైన ఆత్మ కుమారుడు లేక కుమార్తె, మరియు దీనివలన ప్రతీఒక్కరు ఒక దైవిక స్వభావమును మరియు గమ్యమును కలిగియున్నారు.”1 మనము “గొప్ప కడవరి దిన కార్యము యొక్క పునాదులను వేయుటలో పాలుపంచుకునే సంపూర్ణ కాలములందు ముందుకు వచ్చుటకు దాచబడ్డాము.”2 అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ప్రకటించారు: “ఈ కడవరి దినాలలో తరువాతి భాగమందు మీరు ఎదుర్కొనబోయేది ఏదైనా, మరియు సమస్తము కొరకు మిమ్మల్ని సిద్ధపరచుటకు ఆత్మ లోకములో మీరు బోధింపబడ్డారు. (D&C 138:56). మీరు బోధింపబడినది మీలో నిలుచును.”3

మీరు ఏర్పరచబడిన దేవుని కుమారులు మరియు కుమార్తెలు. అపవాదిని ఎదురించుటకు మీరు శక్తి కలిగియున్నారు. అయినప్పటికినీ, అపవాది మీరు ఎవరో ఎరిగియున్నాడు. అతడు మీ దైవిక వారసత్వమును ఎరిగియున్నాడు మరియు క్రింది మూడు డీలను ఉపయోగించుట ద్వారా, మీ భూలోక, పరలోకపు సాధ్యతను పరిమితం చేయుటకు వెదకుచున్నాడు.

  • మోసము

  • పరధ్యానపరచుట

  • నిరాశ

మోసము

అపవాది మోషే కాలములందు మోసగించే సాధనము ఉపయోగించాడు. ప్రభువు మోషేతో ప్రకటించాడు:

“ఇదిగో, నీవు నా కుమారుడవు. …

“నేను నీ కొరకు ఒక కార్యమును కలిగియున్నాను, … మరియు నీవు నా అద్వితీయ కుమారుని ప్రతిరూపములో ఉన్నావు.”4

ఈ మహిమకరమైన దర్శనము తరువాత, సాతాను మోషేను మోసగించుటకు ప్రయత్నించాడు. అతడు ఉపయోగించిన మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి: “మోషే, మనుష్య కుమారుడా, నన్ను ఆరాధించుము.”5 ఆ మోసము సాతానును ఆరాధించమనే ఆహ్వానములో మాత్రమే లేదు, కానీ మనుష్య కుమారునిగా మోషేను వర్ణించిన విధానములో కూడా ఆ మోసమున్నది. జ్ఞాపకముంచుకొనుడి, అప్పుడే ప్రభువు మోషేతో దేవుని కుమారుడని, అద్వితీయుని ప్రతిరూపములో సృష్టించబడెనని చెప్పాడు.

అపవాది మోషేను మోసగించుటకు తన ప్రయత్నములో నిర్విరామంగా పని చేస్తున్నడు, కానీ మోషే ఇలా చెప్తూ ఎదిరించాడు: “సాతానా, నన్ను విడిచి వెళ్ళిపో, ఏలయనగా నేను ఈ దేవునిని మాత్రమే ఆరాధిస్తాను, ఆయనే మహిమగల దేవుడు.”6 మోషే తాను ఎవరో జ్ఞాపకముంచుకొన్నాడు—ఒక దేవుని కుమారుడు.

మోషేకు ప్రభువు యొక్క మాటలు మీకు, నాకు అన్వయిస్తాయి. మనము దేవుని యొక్క స్వంత ప్రతిరూపములో సృష్టించబడ్డాము మరియు ఆయన మనము చేయటానికి ఒక కార్యము కలిగియున్నాడు. మనము నిజముగా ఎవరమో మరచిపోవుట ద్వారా మోసగించుటకు అపవాది ప్రయత్నించును. మనము ఎవరిమో గ్రహించని యెడల, మనము ఎవరివలే కాగలరమో గుర్తించుట కష్టము.

పరధ్యానము

క్రీస్తు మరియు ఆయన నిబంధన బాట నుండి అపవాది మనల్ని పరధ్యానపరచుటకు కూడా ప్రయత్నించును. ఎల్డర్ రోనాల్డ్ ఎ. రాస్బాండ్ క్రింది దానిని తెలిపారు: “ప్రభువు యొక్క కోరిక మనకి జ్ఞానవృద్ధి కలిగించి, ఆయన కార్యములో మనల్ని చేర్చాలనియుండగా, అపవాది యొక్క ప్రణాళిక ఏమనగా, ఆత్మీయ సాక్ష్యముల నుండి మనల్ని అంతరాయపరచుట.”7

మన కాలములో, ట్విట్టర్, ఫేస్‌బుక్, వర్చువల్ రియాలిటీ ఆటలు మరియు అనేకమైనవి కలిపి, అనేక అంతరాయములున్నాయి. ఈ సాంకేతిక అభివృద్ధి అద్భుతమైనది, కానీ మనము జాగ్రత్తగా లేనియెడల, అవి మన దైవిక సాధ్యతను నెరవేర్చుట నుండి మనల్ని పరధ్యానపరచును. వాటిని సరిగా ఉపయోగించుట పరలోకము యొక్క శక్తిని బయటకు తేగలదు మరియు తెరకు ఇరువైపుల చెదరిపోయిన ఇశ్రాయేలును సమకూర్చుటకు మనము వెదకినప్పుడు, అద్భుతాలను చూచుటకు మనకు సాధ్యపరచును.

సాంకేతిక విద్యను ఉపయోగించుటలో మనము మామూలుగా కాదు, జాగ్రత్తగా ఉందాము.8 సాంకేతిక విద్య రక్షకుని వద్దకు మనల్ని దగ్గరగా చేయగల మరియు ఆయన రెండవ రాకడ కొరకు మనము సిద్ధపడినప్పుడు, ఆయన కార్యమును నెరవేర్చుటకు మనల్ని అనుమతించు విధానముల కొరకు నిరంతరము వెదకుము.

నిరాశ

చివరిగా, అపవాది మనము నిరాశ చెందాలని కోరును. మనము ఇతరులతో మనల్ని పోల్చుకొన్నప్పుడు, లేక మన స్వంతము కలిపి, అంచనాలకు అనుగుణంగా జీవించుట లేదని భావించినప్పుడు మనము నిరాశపడతాము.

నా డాక్టరల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినప్పుడు, నేను నిరాశ చెందాను. ఆ సంవత్సరం, ప్రోగ్రామ్ నలుగురు విద్యార్ధులను మాత్రమే అనుమతించింది, మరియు మిగిలిన విద్యార్ధులు మేధావులు. వారికి పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చాయి మరియు సీనియరు మేనేజ్‌మెంట్ స్థానాలలో ఎక్కువ పని అనుభవము కలిగియున్నారు, మరియు వారి సామర్ధ్యములందు వారు విశ్వాసమును వ్యక్తపరిచారు. ప్రోగ్రామ్‌లో నా మొదటి రెండు వారముల తరువాత, నిరాశ మరియు అనుమానపు భావనలు ప్రారంభమై, దాదాపు నన్ను క్షీణింపచేసాయి.

ఈ నాలుగు-సంవత్సరాల కార్యక్రమమును నేను పూర్తి చేయాల్సి ఉన్నయెడల, ప్రతీ సెమిస్టరు మోర్మన్ గ్రంథము చదవటం పూర్తి చేయాలని నేను నిర్ణయించాను. ప్రతీరోజు నేను చదివినప్పుడు, పరిశుద్ధాత్మ నాకు అన్ని విషయాలు బోధించునని మరియు అన్ని విషయాలను నాకు జ్ఞాపకం చేస్తుందన్న రక్షకుని యొక్క ప్రకటనను నేను గుర్తించాను.9 అది నేను దేవుని యొక్క కుమారుడినని పునరుద్ఘాటించెను, ఇతరులతో నన్ను పోల్చుకోరాదని నాకు జ్ఞాపకం చేసెను, మరియు విజయాన్ని పొందటానికి నా దైవిక పాత్ర యందు నాకు విశ్వాసమునిచ్చెను.10

నా ప్రియమైన స్నేహితులారా, వేరొకరు మీ సంతోషమును దొంగిలించనీయకుము. ఇతరులతో మిమ్మల్ని పోల్చుకొనవద్దు. రక్షకుని యొక్క ప్రేమగల మాటలను దయచేసి జ్ఞాపకం ఉంచుకొనుము: “శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను: నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను: లోకమిచ్చునట్టుగా నేను మీకనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనియ్యకుడి,వెరవనియ్యకుడి.”11

కాబట్టి దీనిని మనం ఎలా చేస్తాము? మనము ఈ శాంతిని ఎలా కనుగొనగలము, మనము ఎవరమో ఎలా జ్ఞాపకముంచు కోగలము, మరియు అపవాది యొక్క మూడు డీలను ఎలా జయించగలము?

మొదట, మన పూర్ణ హృదయముతోను, పూర్ణాత్మతోను, పూర్ణమనస్సుతోను, దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననుది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ అని జ్ఞాపకముంచుకోవాలి. 12 మనము చేయు సమస్తము ఆయన కొరకు, ఆయన కుమారుని కొరకు మన ప్రేమ చేత ప్రేరేపించబడాలి. వారి కొరకు మన ప్రేమను మనము వృద్ధి చేసినప్పుడు, మనల్ని మనం మరియు ఇతరులను ప్రేమించుటకు మన సామర్ధ్యము ఎక్కువగును. మనము కుటుంబము, స్నేహితులు, మరియు పొరుగువారికి సేవ చేయుట ప్రారంభిస్తాము, ఎందుకనగా మనము వారిని రక్షకుడు చూసినట్లుగా—దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తైలుగా చూస్తాము.13

రెండవది, ప్రతీ రోజు, ప్రతీ పగలు, ప్రతీ దినము, యేసుక్రీస్తు యొక్క నామములో తండ్రికి ప్రార్థన చేయుడి.14 ప్రార్థన ద్వారా మనము దేవుని యొక్క ప్రేమను అనుభూతి చెందగలము మరియు ఆయన కొరకు మన ప్రేమను చూపగలము. ప్రార్థన ద్వారా మనము కృతజ్ఞతను వ్యక్తపరచగలము మరియు దేవుని చిత్తమునకు మన చిత్తమును అప్పగించుటకు బలము మరియు ధైర్యము కొరకు అడగగలము, అన్ని విషయములందు నడిపించబడగలము.

“ఈ ప్రేమతో మీరు నింపబడవలెనని, మీరు దేవుని యొక్క కుమారులు కావలెనని, … ఆయన ప్రత్యక్షమగునప్పుడు మనము ఆయన వలే ఉండునట్లు హృదయము యొక్క సమస్త శక్తితో తండ్రికి ప్రార్థన చేయమని,“ నేను మిమ్నల్ని ప్రోత్సహిస్తున్నాను.15

మూడవది, ప్రతీ రోజు, ప్రతీ పగలు, ప్రతీ దినము, మోర్మన్ గ్రంథమును చదివి, అధ్యయనము చేయుము.16 నా మోర్మన్ గ్రంథ అధ్యయనము, నా మనస్సులో ఒక ప్రశ్నతో చదివినప్పుడు, ఉత్తమంగా కొనసాగుతుంది. ఒక ప్రశ్నతో మనము చదివినప్పుడు, “మోర్మన్ గ్రంథము మరేయితర గ్రంథము కన్నను మిక్కిలి ఖచ్చితమైనదని మరియు మన మతము యొక్క ప్రధానమైన రాయని మరియు ఒక మనుష్యుడు ఏ ఇతర గ్రంథము కన్నను దీని యొక్క సూక్తులననుసరించిన యెడల దేవునికి చేరువగునని“ అతడు ప్రకటించినప్పుడు, ప్రవక్త జోసెఫ్ స్మిత్ సత్యమును మాట్లాడెనని మనము గుర్తించగలము మరియు బయల్పాటును పొందగలము.17 మోర్మన్ గ్రంథము క్రీస్తు యొక్క మాటలను కలిగియున్నది మరియు మనము ఎవరిమో జ్ఞాపకముంచుకొనుటకు మనకు సహాయపడుతుంది.

చివరిగా, ప్రతీ వారము, ప్రతీ వారము, ప్రతీవారము, ప్రార్థనాపూర్వకంగా సంస్కారమును తీసుకొనుము. సంస్కారము కలిపి, యాజకత్వ విధుల ద్వారా, దైవత్వము యొక్క శక్తి మన జీవితాలలో ప్రత్యక్షపరచబడును.18 ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ బోధించారు: “నిజాయితీగా పశ్చాత్తాపపడుటకు మరియు ఆత్మీయంగా క్రొత్తగా చేయబడుటకు సంస్కార విధి పరిశుద్ధమైన మరియు పునరావృతమైన ఆహ్వానము. సంస్కారములో పాల్గొను చర్య , దానికదే, పాపములను పరిహరించదు. కానీ మనము మనస్సాక్షిగా సిద్ధపడి, ఈ పరిశుద్ధ విధిలో విరిగి, నలిగిన ఆత్మతో పాల్గొన్నప్పుడు, తరువాత వాగ్దానమేదనగా, ప్రభువు యొక్క ఆత్మను ఎల్లప్పుడు మనతో కలిగియుండవచ్చు.”19

దీనమనస్సుతో మనము సంస్కారమును తీసుకొన్నప్పుడు, గెత్సెేమనే అని పిలవబడిన పరిశుద్ధమైన వనములో యేసు బాధను అనుభవించుట మరియు సిలువపై ఆయన త్యాగమును మనము జ్ఞాపకముంచుకుంటాము. ఆయన అద్వితీయ కుమారుడు, మన విమోచకుని పంపినందుకు తండ్రికి కృతజ్ఞతను మనము వ్యక్తపరుస్తాము, మరియు ఆయన ఆజ్ఞలను పాటించుటకు మరియు ఆయనను ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకొనుటకు మన సమ్మతిని చూపుతాము.20 సంస్కారముతో ఒక ఆత్మీయ జ్ఞానోదయం జతపడియున్నది---అది వ్యక్తిగతమైనది, అది శక్తివంతమైనది, మరియు అది అవసరమైనది.

నా స్నేహితులారా, దేవుని ప్రేమించుటకు మన పూర్ణ హృదయముతో మనము ప్రయాసపడి, యేసు క్రీస్తు నామములో ప్రార్థించి, మోర్మన్ గ్రంథమును అధ్యయనము చేసి, మరియు సంస్కారములో ప్రార్థనాపూర్వకంగా పాల్గొన్నప్పుడు, అపవాది యొక్క మోసకరమైన ఆచారములను జయించుటకు, మన దైవిక సాధ్యతను పరిమితం చేసే పరధ్యానములను తగ్గించుటకు, మన పరలోక తండ్రి మరియు ఆయన కుమారుని యొక్క ప్రేమను అనుభవించుటకు మన సమర్ధతను తగ్గించు వేయు నిరాశను ఎదిరించుటకు సామర్ధ్యమును మనము కలిగియుంటాము. దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తైలుగా మనము ఎవరమో మనము పూర్తిగా గ్రహించగలుగుతాము.

సహోదర, సహోదరిలారా, మీతో నా ప్రేమను పంచుకొంటున్నాను మరియు పరలోక తండ్రి జీవిస్తున్నాడని, మరియు యేసే క్రీస్తని నేనెరుగుదునని నా సాక్ష్యమును ప్రకటిస్తున్నాను. నేను వారిని ప్రేమిస్తున్నాను. యేసు క్రీస్తు యొక్క కడవరి పరిశుద్ధుల సంఘము భూమి మీద దేవుని యొక్క రాజ్యము. మెస్సయా యొక్క రెండవ రాకడ కొరకు లోకమును సిద్ధపరచుటకు మనము దైవిక నియామకమును కలిగియున్నాము. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.