సువార్తను పంచుకొనుటలో ఆనందమును కనుగొనుట
మన జీవితాలను మన చుట్టూ ఉన్నవారి జీవితాలను దీవించుటకు ఆయన వైపు తిరుగుటకు మన కొరకు ఎదురు చూస్తున్న ప్రేమగల పరలోకమందున్న తండ్రిని మనము కలిగియున్నాము.
నా ప్రియమైన ప్రాధమిక పాటలలో ఒకటి ఈ మాటలతో ప్రారంభమగును:
యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘానికి నేను చెందియున్నాను.
నేను ఎవరినో నాకు తెలుసు.
దేవుని ప్రణాళిక నాకు తెలుసు.
విశ్వాసమునందు నేను ఆయనను అనుసరిస్తాను.
నేను రక్షకుడైన, యేసు క్రీస్తునందు విశ్వసిస్తున్నాను.1
అవి మనము నమ్మే సత్యములను గూర్చిన ఎంతటి సరళమైన, అందమైన వ్యాఖ్యానములు!
యేసు క్రీస్తు యొక్క కడవరి పరిశుద్ధుల సంఘ సభ్యులుగా, మనము ఎవరమో మనకు తెలుసు. “దేవుడు మన ఆత్మలకు తండ్రి అని మనకు తెలుసు. మనము … ఆయన పిల్లలము, మరియు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. భూమి మీదకు [రాకముందు] [పరలోకములో ఆయనతో] . . . మనం జీవించాము.”
మనం దేవుని ప్రణాళికను ఎరుగుదుము. ఆయన దానిని సమర్పించినప్పుడు అక్కడ ఆయనతో మనం ఉన్నాము. మన పరలోకతండ్రి యొక్క “పూర్తి ఉద్దేశము—ఆయన కార్యము, ఆయన మహిమ—ఆయన దీవెనలన్నిటినీ ఆనందించుటకు మనలో ప్రతీఒక్కరికి సాధ్యపరచుట. ఆయన … తన ఉద్దేశమును నెరవేర్చుటకు ఒక పరిపూర్ణమైన ప్రణాళికను అందించారు. మనం భూమి మీదకు రాకముందు, ఈ … సంతోషము, … విమోచన, … రక్షణ, ప్రణాళికను మనము గ్రహించి, అంగీకరించాము.
“యేసు క్రీస్తు దేవుని యొక్క ప్రణాళికకు కేంద్రము. ఆయన ప్రాయశ్చిత్తఃము ద్వారా యేసు క్రీస్తు తన తండ్రి యొక్క ఉద్దేశమును నెరవేర్చెను, అమర్త్యత్యము, ఉన్నతస్థితిని ఆనందించుటకు మనలో ప్రతీఒక్కరి కొరకు దానిని సాధ్యపరచెను. సాతాను, లేక దయ్యము, ఆరంభము నుండి దేవుని యొక్క ప్రణాళికకు శత్రువుగా ఉన్నది.
“స్వతంత్రత, లేక ఎన్నుకొను సామర్ధ్యము, ఆయన పిల్లలకు దేవుడు ఇచ్చిన మిక్కిలి గొప్ప వరాలలో ఒకటి. … మనం యేసు క్రీస్తును లేక సాతానును అనుసరించుటకు తప్పక ఎంపిక చేయాలి.”2
ఇవి మనం ఇతరులతో పంచుకోగల సాధారణమైన సత్యములు.
మా అమ్మ కేవలము మాట్లాడటానికి సమ్మతించి, ఒక అవకాశమును గుర్తించుట ద్వారా అటువంటి సాధారణమైన సత్యములను పంచుకొన్నప్పటి సమయము గురించి నేను మీకు చెప్తాను.
అనేక సంవత్సరాల క్రితం, మా అమ్మ మా తమ్ముడితో పాటు అర్జెంటీనాకు తిరిగి వెళ్ళుచున్నది. మా అమ్మ విమాన ప్రయాణము ఎన్నడూ నిజంగా ఇష్టపడలేదు, కనుక నా కుమారులలో ఒకరిని, ఆదరణ, భద్రతల కొరకు తనకు ఒక దీవెన ఇమ్మని అడిగింది. అతడు తన మామ్మకు, సువార్తను గూర్చి నేర్చుకొనుటకు అనేకమంది హృదయాలను బలపరచి, స్పర్శించుటకు పరిశుద్ధాత్మ నుండి ప్రత్యేక నడిపింపును, మార్గాన్ని చూపమని దీవించుటకు కూడా ప్రేరేపించబడ్డాడు.
సాల్ట్‌లేక్ విమానాశ్రయము వద్ద, మా అమ్మ, తమ్ముడు, ఒక ఏడు- సంవత్సరాల బాలికను కలిసారు, ఆమె తన కుటుంబముతో స్కీయింగ్ యాత్ర నుండి ఇంటికి తిరిగి వెళ్ళుచున్నది. ఆమె చాలాసేపు మా అమ్మ, తమ్మునితో మాట్లాడుతున్నదని గమనించిన ఆమె తల్లిదండ్రులు, వారితో చేరటానికి నిర్ణయించుకున్నారు. వారు తమను, తమ కూతురిని ఎడ్వార్డొ, మారియా సుసానా మరియు జియాడా పోల్‌లుగా పరిచయం చేసుకున్నారు. అక్కడ ఈ ప్రియమైన కుటుంబముతో సహజమైన, అప్యాయతగల అనుబంధం ఏర్పడింది.
ఇరువురు కుటుంబాలు బ్యునో ఎరిస్, అర్జెంటీనాకు ఒకే విమానములో కలిసి ప్రయాణించుటకు ఉత్సాహపడ్డారు. వారి సంభాషణ కొనసాగినప్పుడు, ఆ క్షణము వరకు వారు యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సంఘము గురించి ఎన్నడూ వినలేదని మా అమ్మ గమనించింది.
సుసానా అడిగిన మొదటి ప్రశ్నలలో ఒకటి, “పైన బంగారు ప్రతిమగల ఆ అందమైన మ్యూజియమ్ గురించి మీరు నాకు చెప్తారా?”
ఆ అందమైన నిర్మాణము మ్యూజియమ్ కాదు కానీ ప్రభువు యొక్క దేవాలయమని, అక్కడ ఒకరోజు ఆయనతో జీవించుటకు మనం తిరిగి వెళ్ళునట్లు దేవునితో నిబంధనలు చేస్తామని మా అమ్మ వివరించింది. సాల్ట్‌లేక్‌కు వారి ప్రయాణానికి ముందు, దేనివలననైనా తన ఆత్మను బలపరచమని తాను ప్రార్థించానని సూసానా మా అమ్మతో చెప్పింది.
విమానమందు, మా అమ్మ సువార్తను గూర్చి తన సరళమైన, బలమైన సాక్ష్యమిచ్చింది, తన స్వంత ఊరిలో మిషనరీలను కనుగొనమని సుసానాను ఆహ్వానించింది. “నేను వారిని ఎలా కనుగొనగలను?” అని సుసానా మా అమ్మను అడిగింది.
“నీవు వారిని చూడకుండా ఉండలేవు; తెలుపు చొక్కాలు, టైలు ధరించిన ఇద్దరు యువకులు లేక స్కర్టులు ధరించిన ఇద్దరు యువతులు, వారు తమ పేరు, ‘యేసు క్రీస్తు యొక్క కడవరి పరిశుద్ధుల సంఘము’ పేరు కూడా చూపు ఒక టాగ్‌ను ఎల్లప్పుడు ధరిస్తారు,” అని మా అమ్మ జవాబిచ్చింది.
కుటుంబాలు ఒకరినొకరి ఫోను నెంబర్లు తీసుకున్నారు మరియు బ్యునో ఎరిస్ విమానాశ్రయం వద్ద వీడ్కోలు చెప్పారు. అప్పటినుండి నాకు మంచి స్నేహితురాలైన సుసానా, విమానాశ్రయం వద్ద మా అమ్మను విడిచి వెళ్ళుటకు తాను చాలా విచారించానని ఆమె అనేకసార్లు నాకు చెప్పింది. “మీ అమ్మ చాలా సంతోషంగా ఉన్నదని, ఆమె చెప్పింది. నేను వివరించలేను, కానీ ఆమె తన చుట్టూ వెలుగును కలిగియున్నది, ఆమెను విడిచిపెట్టుట నాకిష్టం కాలేదు.
సుసానా తన స్వంత నగరానికి వెళ్లిన వెంటనే, ఆమె, ఆమె కూతురు జియాడా, వారి ఇంటికి రెండు వీధుల అవతల నివసిస్తున్న సుసానా తల్లితో ఈ అనుభవాన్ని చెప్పటానికి వెళ్ళారు. వారు ప్రయాణిస్తున్నప్పుడు, మా అమ్మ వివరించినట్లుగా ధరించిన ఇద్దరు యువకులు వీధిలో నడవడాన్ని సూసానా చూడటం జరిగింది. ఆమె వీధి మధ్యలో తన కారును ఆపి, బయటకు దిగి, ఆ యిద్దరు యువకులను అడిగింది, “మీరు యేసు క్రీస్తు యొక్క సంఘమునకు చెందిన వారా?”
వారు “అవునని,” చెప్పారు.
“మిషనరీలా?” అని ఆమె అడిగింది.
“అవును మేము మిషనరీలము!” అని వారిద్దరు జవాబిచ్చారు.
అప్పుడు ఆమె ఇలా అన్నది, “నా కారు లోపలికి రండి; నాకు బోధించటానికి మీరు మాయింటికి వస్తున్నారు.”
రెండు నెలల తరువాత, మారియా సుసానా బాప్తీస్మము పొందెను. ఆమె కుమార్తె జియాడా కూడా తొమ్మిది సంవత్సరాలు రాగానే బాప్తీస్మము పొందింది. మేమింకా ఎడ్వార్డోకు సహాయపడుతున్నాము, ఏమైనప్పటికినీ మేము ప్రేమిస్తున్నాము.
అప్పటినుండి, సుసానా, నేను ఎప్పటికీ కలిసిన గొప్ప మిషనరీగా మారింది. ఆమె మోషైయ కుమారుల వలే, క్రీస్తు వద్దకు అనేక ఆత్మలను తెస్తున్నది.
మా సంభాషణలలో ఒక దానిలో, నేను ఆమెనిలా అడిగాను, “నీ రహస్యమేమిటి? ఇతరులతో సువార్తను నీవు ఎలా పంచుకుంటావు?”
ఆమె నాతో , “అది చాలా సాధారణమైనది. ప్రతీరోజు నా ఇంటిని విడిచి నేను బయటకు వెళ్లేముందు, వారి జీవితంలో సువార్త అవసరమైన వారి వద్దకు నన్ను నడిపించమని అడుగుతూ మన పరలోకమందున్న తండ్రికి నేను ప్రార్థిస్తాను. కొన్నిసార్లు నేను వారితో పంచుకోవటానికి మోర్మన్ గ్రంథము లేక మిషనరీల నుండి సంఘ సమాచారముగల చిన్న కార్డులను తీసుకొనివెళ్తాను—నేను ఎవరితోనైనా మాట్లాడటం ప్రారంభించినప్పుడు, వారు సంఘము గురించి విన్నారా అని మాత్రమే నేను అడుగుతాను” అని చెప్పింది.
సుసానా మరలా, “మిగిలిన సమయాలలో, రైలు కోసం ఎదురుచూస్తున్నప్పుడు నేను కేవలము చిరునవ్వు నవ్వుతాను అని చెప్పింది. ఒకరోజు ఒక వ్యక్తి నా వైపు చూసి, ‘మీరు దేని గురించి నవ్వుతున్నారు?’ అని అడిగాడు. అతడు నన్ను ఆశ్చర్యపరిచాడు.
“నేను జవాబిచ్చాను, ‘నేను సంతోషంగా ఉన్నాను కనుక నేను నవ్వుతున్నాను!’
“అప్పుడు అతడు ఇలా అన్నాడు, ‘మీరు దేని గురించి అంత సంతోషంగా ఉన్నారు?’
“నేనిలా జవాబిచ్చాను, ‘నేను యేసు క్రీస్తు యొక్క కడవరి పరిశుద్ధుల సంఘ సభ్యురాలిని, మరియు అది నన్ను సంతోషపరుచును. మీరు దాని గురించి విన్నారా?’”
అతడు లేదని చెప్పినప్పుడు, ఆమె అతడికి సంఘ సమాచారముగల కార్డుని ఇచ్చి రాబోయే ఆదివారపు కార్యక్రమాలకు హాజరుకమ్మని అతడిని ఆహ్వానించింది. తరువాత ఆదివారము, ఆమె అతడిని తలుపు వద్ద పలుకరించింది.
అధ్యక్షులు డాల్లిన్ హెచ్. ఓక్స్ బోధించారు:
సువార్తను పంచుకొనుటకు సభ్యులందరూ చేయగల మూడు విషయాలున్నాయి. …
“మొదటిది, రక్షణ కార్యములో ఈ ముఖ్యమైన భాగముతో సహాయపడే కోరిక కొరకు మనమందరం ప్రార్థించాలి. …
“రెండవది, మనము ఆజ్ఞలను పాటించాలి. … విశ్వాసులైన సభ్యులు యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్తను పంచుకొనే గొప్ప కార్యములో పాల్గొనుటకు వారు కోరినప్పుడు, … ఎల్లపుడు రక్షకుని ఆత్మను వారితో కలిగియుంటారు.
“మూడవది, ఇతరులతో సువార్తను పంచుకొనుటకు మనము చేయగల దానిపై ప్రేరేపణ కొరకు ప్రార్ధించాలి … [మరియు] [మనము] పొందిన ప్రేరేపణను అమలు చేయుటకు ఒక ఒడంబడికతో ప్రార్ధించాలి.”3
సహోదర, సహోదరీలారా, పిల్లలు, యౌవనులారా, నా స్నేహితురాలైన సుసానా వలే మనము కూడా ఉండి, ఇతరులతో సువార్త పంచుకుందామా? మన విశ్వాసమునకు చెందని ఒక స్నేహితుని ఆదివారము మనతో సంఘానికి రమ్మని మనము ఆహ్వానిద్దామా? లేక బహుశా మనం ఒక బంధువు లేక ఒక స్నేహితునితో మోర్మన్ గ్రంథ ప్రతిని పంచుకుందామా? ఇతరులు కుటుంబ పరిశోధనపై వారి పూర్వీకులను కనుగొనుటకు మనం సహాయపడదామా లేక వారమందు రండి, నన్ను వెంబడించుడి అధ్యయనము చేస్తున్నప్పుడు, మనం నేర్చుకున్నదానిని ఇతరులతో పంచుకుందామా? మన రక్షకుడైన, యేసు క్రీస్తు వలే ఉండి, మన జీవితాలకు సంతోషము తెచ్చే దానిని ఇతరులతో పంచుకొందామా? ఈ ప్రశ్నలు అన్నిటికి జవాబు, అవును! మనము దానిని చేయగలము!
“యేసు క్రీస్తు యొక్క సంఘ సభ్యులు ‘మనుష్యుల ఆత్మల రక్షణ కొరకు ఆయన ద్రాక్షతోటలో పనిచేయుటకు’ (సిద్ధాంతము మరియు నిబంధనలు 138:56)} పంపబడ్డారని లేఖనములందు మనము చదివాము. ఈ రక్షణ కార్యము సభ్య మిషనరీ కార్యము, మార్పు చెందిన వారిని నిలుపుకొనుట, తక్కువ- చైతన్యముగల సభ్యులను చైతన్యవంతులుగా చేయుట, దేవాలయము, కుటుంబ చరిత్ర కార్యము, మరియు సువార్తను బోధించుట కలిపియున్నది.”4
నా ప్రియమైన స్నేహితులారా, ఇశ్రాయేలును సమకూర్చుటకు ప్రభువుకు మనమవసరము. సిద్ధాంతము మరియు నిబంధనలలో, ఆయన చెప్పారు, “మీరు ఏమి చెప్పాలో ముందుగా ఆలోచించకుడి; కానీ నిరంతరము మీ మనస్సులలో జీవపు మాటలను దాచుకొనుడి, ప్రతీ మనుష్యునికి కేటాయించబడిన ఆ భాగము, తగిన సమయమందు అది మీకివ్వబడును.”5
అదనముగా, ఆయన మనకు వాగ్దానమిచ్చారు:
“మన దినములన్నియు పశ్చాత్తాపమును బోధిస్తూ పనిచేసి, ఆయనకు ఒక్క ఆత్మను తెచ్చిన యెడల, తండ్రి రాజ్యములో అతనితో మన సంతోషము గొప్పదగును!
“మరియు ఇప్పుడు, తండ్రి యొక్క రాజ్యములోనికి రక్షకుని వద్దకు ఒక్క ఆత్మను తెచ్చినప్పుడు, మన సంతోషము గొప్పదైన యెడల, మనము అనేక ఆత్మలను ఆయన వద్దకు తెచ్చిన యెడల మన సంతోషము ఇంకెంత గొప్పదిగా ఉండును!”6
నేను ప్రారంభించిన ప్రాథమిక పాట ఈ లోతైన వ్యాఖ్యానముతో ముగింపబడును:
రక్షకుడైన యేసు క్రీస్తునందు నేను విశ్వసించుచున్నాను.
ఆయన నామమును నేను ఘనపరచెదను.
నేను సరైన దానిని చేస్తాను;
ఆయన వెలుగును నేను వెంబడిస్తాను.
ఆయన సత్యమును నేను ప్రకటిస్తాను.7
ఈ మాటలు సత్యమని, మన జీవితాలను, మన చుట్టూ ఉన్నవారి జీవితాలను దీవించుటకు ఆయన వైపు తిరగాలని మన కొరకు ఎదురు చూస్తున్న ప్రేమగల పరలోకతండ్రిని, మనము కలిగియున్నామని నేను సాక్ష్యమిస్తున్నాను. మన సహోదర, సహోదరీలను క్రీస్తు నొద్దకు తెచ్చు కోరికను మనము కలిగియుండాలని నేను యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్.