2010–2019
జాగ్రత్తకు ప్రతిగా తేలికగా తీసుకొనుట
2019 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము.


2:3

జాగ్రత్తకు ప్రతిగా తేలికగా తీసుకొనుట

లోకము యొక్క ప్రభావములు చెడును హత్తుకొనుట ఎక్కువైనప్పుడు, రక్షకుని వద్దకు క్షేమంగా మనల్ని నడిపించు మార్గములో స్థిరంగా నిలిచియుండేందుకు సమస్త శ్రద్ధతో మనము ప్రయాసపడాలి.

ఒకసారి నేను ఒక అంగడి కిటికిలో “సంతోషము, $15.00 ” అని చెప్పబడిన సూచనను చూసాను. $15.00 తో నేనెంత సంతోషమును కొనగలనో తెలుసుకోవాలని చాలా ఆతృతగా లోపలికి వెళ్లాను. నేనక్కడ చూసినవి చాలా రకాల చవకైన ఆభరణాలు, జ్ఞాపికలు--- నేను చూసిన ఒక్క వస్తువు కూడా సూచిక ఉద్దేశించిన సంతోషాన్ని నాకివ్వలేకపోవచ్చు. అనేక సంవత్సరాలుగా, ఆ సూచిక గురించి, చవకైన లేక తాత్కాలికమైన వస్తువులలో సంతోషం కోసం వెదకడం ఎంత సులభంగా ఉండవచ్చనో అనేకసార్లు ఆలోచించాను. యేసు క్రీస్తు యొక్క కడవరి -దిన పరిశుద్ధుల సంఘ సభ్యులుగా, నిజమైన సంతోషము ఎక్కడ, ఎలా కనుగొనబడుతుందో తెలుసుకోవడానికి మనము దీవించబడ్డాము. మన ప్రభువును, రక్షకుడునైన యేసు క్రీస్తు చేత స్థాపించబడిన సువార్తను జాగ్రత్తగా జీవించడంలో, ఆయన వలే మారటానికి ప్రయాసపడడంలో అది కనుగొనబడుతుంది.

మాకు రైలు ఇంజనీరుగా పనిచేస్తున్న ప్రియ మిత్రుడు ఒకరున్నారు. ఒకరోజు అతడు తన దారిలో రైలు నడుపుతుండగా, అతడి ఎదురుగా పట్టాలమీద ఒక కారు ఆగి ఉండడం గమనించాడు. ఆ కారు ఇరుక్కొని, పట్టాలను దాటలేకపోయిందని వెంటనే గ్రహించాడు. అతడు వెంటనే రైలును అత్యవసర క్రమానికి మార్చాడు, అది 6,500 టన్నుల (5,900 మెట్రిక్ టన్నుల) బరువును మోస్తూ ఇంజను వెనుక ఒక మైలులో మూడొంతుల దూరము విస్తరించిన అన్ని రైలు పెట్టెల బ్రేకుల పైన పని చేసింది. కారును ఢీకొనకముందు రైలు ఆగడానికి అక్కడ ఏలాంటి అవకాశము లేదు, అలాగే జరిగింది. అదృష్టవశాత్తూ కారులో ఉన్న వ్యక్తులు, రైలు కూతను విని అంతకుముందే కారు నుండి తప్పించుకున్నారు. పరిశోధిస్తున్న పోలీసు అధికారితో ఇంజనీరు మాట్లాడుతున్నప్పుడు, కోపముగా ఉన్న ఒకావిడ వారిని సమీపించింది. జరిగినదంతా నేను చూసానని అరుస్తూ, తరువాత కారును తప్పించేలా రైలు తిప్పడానికి ఇంజనీరు కనీసము ప్రయత్నించ లేదని సాక్ష్యమిచ్చింది.

స్పష్టముగా, మా స్నేహితుడు ప్రమాదం తప్పించడానికి ప్రక్కకు తిప్పి పట్టాలను దాటినట్లయితే అతడు, అతడి రైలు మొత్తం పట్టాలు తప్పి రైలు ముందుకు వెళ్ళకుండా ఆగిపోయి ఉండేది. అదృష్టవశాత్తూ అతడికి, అతడి రైలు పరుగెత్తిన రైలు పట్టాలు, రైలు చక్రాలు అతడి మార్గములోని అడ్డంకులను లక్ష్యపెట్టకుండా దాని గమ్యమువైపు క్షేమంగా కదిలాయి. అలాగే మనము, కూడా ఒక మార్గములో అనగా, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యులుగా బాప్తీస్మము పొందినప్పుడు, మనము ఒడంబడిక చేసుకున్న ఒక నిబంధన మార్గంలో ఉన్నాము. ఆ మార్గము వెంబడి మనం అప్పుడప్పుడు అడ్డంకులను ఎదుర్కొన్నప్పటికీ ఈ బాటమీద స్థిరంగా నిలిచియున్నట్లైతే, మనకు వరమివ్వబడిన నిత్య గమ్యము వైపు అది మనల్ని నడిపిస్తుంది.

జీవవృక్షము గురించి లీహై యొక్క దర్శనము

తేలికగా తీసుకోవడం వల్ల వచ్చే ప్రభావాలు నిబంధన బాట నుండి మనల్ని ఎలా దూరంగా నడిపించగలవో జీవవృక్ష దర్శనము మనకు చూపుతుంది. ఇనుప దండము, తిన్నని, ఇరుకైన నిబంధన మార్గము నేరుగా జీవవృక్షానికి నడిపిస్తుందని ఆలోచించుము, అక్కడ మన రక్షకుడు, ఆయన ప్రాయశ్చిత్తఃము చేత అందించిన దీవెనలన్నీ విశ్వాసులకు లభ్యమవుతాయి. దర్శనములో లోక కల్మషమును సూచించే నది కూడా చూపబడింది. ఈ నది మార్గము “వెంబడి ప్రవహించెనని,” అదింకను వృక్షము “ప్రక్కగా” మాత్రమే కాని, దాని వైపుకు ప్రవహించలేదని లేఖనాలు వివరిస్తాయి. లోకము అంతరాయాలతో నిండియుంది, అవి నిబంధనల ప్రకారము జీవించడాన్ని తేలికగా తీసుకొనేలా చేస్తూ ఏర్పరచబడిన వారిని కూడా మోసగించగలవు---ఆవిధంగా వారిని వృక్షానికి దగ్గరగా నడిపిస్తాయి, కాని దాని వైపుకి కాదు. ఖచ్చితత్వముతో నిబంధనల ప్రకారం జీవించడంలో మనము జాగ్రత్తగా లేనట్లయితే, మన తేలికైన ప్రయత్నాలు చివరకు మనల్ని నిషేధించబడిన బాటలకు నడిపించవచ్చు లేదా ఇదివరకే గొప్ప విశాలమైన భవనములో ప్రవేశించిన వారితో చేరుటకు నడిపించవచ్చు. జాగ్రత్తగా లేనట్లయితే, మనం కల్మషముగల నది లోతులలోనికి మునిగిపోవచ్చు. 1

సువార్తను జీవించుటతో కలిపి, సమస్తమును చేయుటకు జాగ్రత్తగల విధానము మరియు తేలికైన విధానమున్నది. రక్షకునిపట్ల మన ఒడంబడిక గురించి ఆలోచించినప్పుడు, మనము జాగ్రత్త కలిగి ఉన్నామా లేక తేలికగా ఉన్నామా? మన మర్త్య స్వభావము వలన, కొన్నిసార్లు మన క్రియలు మంచికి, చెడుకు మధ్యలో ఉన్నాయని లేక అంతగా మంచిది కాని దానితో మంచివాటిని కలుపుతూ, మన స్వభావాన్ని సమర్ధించుకోలేదా? మన ప్రవక్తల సలహాను అనుసరించడానికి లేక సువార్తను జాగ్రత్తగా జీవించడానికి దానిని అన్వయించినప్పుడు, ఎప్పుడైనా మనము, “అయినప్పటికీ,” “తప్ప” “కాని” అని చెప్తే, నిజానికి “ఆ సలహా వాస్తవానికి నాకు అన్వయించదని” మనము చెప్తున్నాము. మనము కోరిన సమస్తమును మనము సమర్ధించుకోవచ్చు, కానీ వాస్తవానికి, తప్పు చేయడానికి సరైన విధానమేదీ లేదు!

2019 కొరకు యువకుల ఇతివృత్తం యోహాను 14:15 నుండి తీసుకోబడింది, అందులో ప్రభువు ఇలా సూచించారు: “మీరు నన్ను ప్రేమించిన యెడల, నా ఆజ్ఞలను పాటించండి.” మనము చెప్పినట్లుగా మనం ఆయనను ప్రేమించినట్లయితే, ఆయన ఆజ్ఞలను జీవించడంలో కాస్త జాగ్రత్తగా ఉండడం ద్వారా ఆ ప్రేమను చూపలేమా?

సువార్తను జీవించడంలో జాగ్రత్తగా ఉండడమంటే అర్థము క్రమబద్ధంగా లేక కూరుకుపోయినట్లుగా ఉండడం కాదు. యేసు క్రీస్తు యొక్క శిష్యులుగా మన ఆలోచనల్లో, ప్రవర్తనలో తగినట్లుగా ఉండడం అనగా అర్ధమేమిటి. సువార్తను జీవించడంలో జాగ్రత్తగా ఉండడానికి, తేలికగా ఉండడానికి మధ్య తేడాను మనము ధ్యానించినప్పుడు పరిగణించడానికి ఇక్కడ కొన్ని ఆలోచనలున్నాయి:

ప్రతీ వారము సబ్బాతు-దిన ఆరాధనలో, సంస్కారములో పాల్గొనుటకు మన సిద్ధపాటులో మనము జాగ్రత్తగా ఉన్నామా?

మన ప్రార్థనలలో, లేఖన అధ్యయనములో మనము మరింత జాగ్రత్తగా ఉండగలమా, లేక వ్యక్తులు, కుటుంబాల కొరకైన-రండి, నన్ను వెంబడించండి-లో మరింత చురుకుగా పాల్గొనగలమా?

దేవాలయ ఆరాధనలో మనము జాగ్రత్తగా ఉన్నామా, బాప్తీస్మమందు, దేవాలయములో మనము చేసిన నిబంధనల ప్రకారం జాగ్రత్తగా, ఉద్దేశ్యపూర్వకంగా జీవిస్తున్నామా? ప్రత్యేకించి పరిశుద్ధ స్థలములలో, పరిస్థితులలో మన రూపమందు, మన దుస్తులందు మనము నిరాడంబరంగా, జాగ్రత్తగా ఉన్నామా? దేవాలయ వస్త్రాలను ధరించడంలో మనము జాగ్రత్తగా ఉన్నామా? లేక లోక రీతులు మరింత తేలిక స్వభావాన్ని ఆదేశిస్తున్నాయా?

ఇతరులకు పరిచర్య చేయు విధానములో, సంఘములో మన పిలుపులను నెరవేర్చు విధానములో మనము జాగ్రత్తగా ఉన్నామా, సేవ చేయుటకు మన పిలుపునందు మనము భిన్నంగా ఉన్నామా లేక తేలికగా ఉన్నామా?

మనము చదివేది, టివీలో, మన ఫోనులలో చూసే దానియందు మనము జాగ్రత్తగా ఉన్నామా లేక తేలికగా ఉన్నామా? మన భాషయందు మనము జాగ్రత్తగా ఉన్నామా? లేక మనము అనాగరికమైన, దుర్భాషలను తేలికగా అంగీకరిస్తున్నామా?

యౌవనుల బలము కొరకు కరపత్రములో ఉన్న ప్రమాణాలను జాగ్రత్తగా అనుసరించినప్పుడు, అవి గొప్ప దీవెనలను తెస్తాయి, మరియు నిబంధన బాటలో నిలిచియుండేందుకు మనకు సహాయపడతాయి. అది యౌవనుల ప్రయోజనము కొరకు వ్రాయబడినప్పటికిని, యువతీ యువకుల కార్యక్రమాలనుండి మనం పురోభివృద్ధి చెందినప్పుడు ఆ ప్రమాణాలకు కాలం చెల్లదు. అవి మనలో ప్రతీఒక్కరికి, అన్ని సమయాలలో అన్వయిస్తాయి. ఈ ప్రమాణాల సమీక్ష మన సువార్త జీవనంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండగల ఇతర విధానాలను ప్రేరేపించవచ్చు.

మరొకరు సౌకర్యముగా భావించునట్లు లేక వారికి తగియుండునట్లుగా భావించడానికి మనము మన ప్రమాణాలను తగ్గించుకోము. మనము యేసు క్రీస్తు యొక్క శిష్యులము, అటువంటి మనము, ఇతరులను ఉన్నతమైన, పరిశుద్ధ స్థలమునకు లేవనెత్తబోతున్నాము, అక్కడ వారు కూడా గొప్ప దీవెనలు పొందగలరు.

మన నిబంధనలతో మన జీవితాలను మరింత జాగ్రత్తగా విలీనం చేయడంలో మనము ఎటువంటి సవరణలు చేయాలో తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ నడిపింపును వెదకమని ప్రతీఒక్కరిని నేను ఆహ్వానిస్తున్నాను. ఇదే ప్రయాణము చేస్తున్న ఇతరులను గూర్చి మీరు విమర్శించరాదని కూడా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. “తీర్పు నాదియని ప్రభువు చెప్పుచున్నాడు.”2 మనలో ప్రతీఒక్కరము అభివృద్ధి, మార్పుల యొక్క ప్రక్రియలో ఉన్నాము.

మోర్మన్ గ్రంథములో విశ్వాస భ్రష్టత్వము చెందిన అమ్లిసైయులను గూర్చి చెప్పబడిన వృత్తాంతము నాకు ఆసక్తికరంగా ఉన్నది. వారికి ఇక యేసు క్రీస్తు, ఆయన సంఘముతో సంబంధము లేదని ఇతరులకు చూపునట్లుగా, అందరూ చూసేలా వారు నుదిటిపై ప్రత్యేకమైన ఎరుపు గురుతును పెట్టుకున్నారు.3 దానికి భిన్నంగా, యేసు క్రీస్తు యొక్క శిష్యులుగా మనల్ని మనం ఎలా గుర్తిస్తున్నాము? ఇతరులు మన ముఖములందు ఆయన స్వరూపమును సులభముగా చూడగలుగుతున్నారా, మన జీవితాలను మనము జాగ్రత్తగా నిర్వహించు విధానము ద్వారా మనము ఎవరికి ప్రతినిధులుగా ఉన్నామో తెలుసుకొంటున్నారా?

నిబంధన జనులమైన మనము మిగిలిన లోకముతో కలిసిపోకూడదు. మనము “ప్రత్యేకమైన జనులుగా పిలవబడ్డాము”{4---ఎంతటి పొగడ్త! లోకము యొక్క ప్రభావములు చెడును హత్తుకొనుట ఎక్కువైనప్పుడు, మన నిబంధన జీవితము మరియు లోక ప్రభావాల మధ్య దూరమును పెంచుతూ, ఆయన వద్దకు క్షేమంగా మనల్ని నడిపించు మార్గములో స్థిరంగా నిలిచియుండేందుకు సమస్త శ్రద్ధతో మనము ప్రయాసపడాలి.

శాశ్వతమైన సంతోషాన్ని సంపాదించడం మీద నేను ప్రతిఫలించినప్పుడు, కొన్నిసార్లు మనల్ని మనము మంచి చెడుల మధ్య కనుగొంటామని గ్రహించాను. నిబంధన బాట వెంట మనము ప్రయాణిస్తున్నపుడు, అంధకారపు పొగమంచు అనివార్యమైనది. శోధన, తేలికైన స్వభావము నిబంధన బాటనుండి దూరముగా లోకము యొక్క అంధకారములోనికి మన గమనాన్ని నేర్పుగా మార్చగలదు. ఇది జరిగిన సమయాల్లో, నిబంధన బాటపైకి తిరిగి రమ్మని, ఆవిధంగా త్వరగా చేయమని మన ప్రియమైన ప్రవక్త అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మనల్ని ప్రోత్సహిస్తున్నారు. పశ్చాత్తాప వరము కొరకు, మన రక్షకుని ప్రాయశ్చిత్తపు శక్తి కొరకు నేనెంతో కృతజ్ఞత కలిగియున్నాను.

పరిపూర్ణమైన జీవితమును జీవించుట అసాధ్యమైనది. ఒకేఒక వ్యక్తి ఈ టిలెస్టియల్ గ్రహముపై పరిపూర్ణముగా జీవించగలిగాడు. అది యేసు క్రీస్తు. మనము పరిపూర్ణులము కానప్పటికీ, సహోదర సహోదరిలారా, మనము యోగ్యులుగా ఉండగలము: సంస్కారములో యోగ్యతగా పాల్గొనగలం, దేవాలయ దీవెనలకు యోగ్యులుగా ఉండగలం, వ్యక్తిగత బయల్పాటును పొందడానికి యోగ్యులుగా ఉండగలం.

రక్షకునిని జాగ్రత్తగా అనుసరించు వారికి కలిగే దీవెనలు, సంతోషమును గూర్చి రాజైన బెంజిమెన్ సాక్ష్యమిచ్చాడు: “ఇంకను, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనువారి ఆశీర్వాదకరమైన, సంతోషకరమైన స్థితిని మీరు తలంచవలెనని నేను కోరుచున్నాను. ఏలయనగా ఇదిగో, వారు ఐహికమైన, ఆత్మసంబంధమైన రెండిటియందు అన్ని వస్తువులతో ఆశీర్వదింపబడియున్నారు, వారు అంతము వరకు విశ్వాసముతో స్థిరముగా ఉండిన యెడల వారు పరలోకములోనికి చేర్చుకొనబడుదురు. దానిని బట్టి వారు దేవునితో ఎన్నడూ అంతముకాని సంతోషములో నివసించెదరు.”5

$15.00 తో సంతోషము కొనబడునా? లేదు, అది కొనబడదు. యేసు క్రీస్తు యొక్క సువార్తను ఉద్దేశ్యపూర్వకంగా, జాగ్రత్తగా జీవించడం ద్వారా లోతైన, శాశ్వతమైన సంతోషం వస్తుంది. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.