2010–2019
దీవెనలతో వర్థిల్లుట
2019 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము.


దీవెనలతో వర్థిల్లుట

దేవుడు మనకు ఇవ్వాలనుకొనే దీవెనలలో చాలావాటికి మన చర్య అనగా-యేసు క్రీస్తునందు విశ్వాసముపైన ఆధారపడు మన చర్య అవసరము.

మనలో ప్రతి ఒక్కరిని దీవించాలని పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు ఆశపడుచున్నారు. 1 ఆ దీవెనలను ఏవిధంగా సమీపించి, పొందాలో అనే అంశము అనేక శతాబ్ధాలుగా మతపరమైన వాదన మరియు చర్చగా ఉండెను. 2 ఆ దీవెనలు పూర్తిగా మనమే సంపాదించుకోవాలని కొంతమంది వాదిస్తారు; వాటిని కేవలం మన క్రియల ద్వారా పొందుతాము. ఎవర్ని, ఎలా దీవించాలో దేవుడు ముందే ఎంచుకున్నారు మరియు ఈ దృఢ సంకల్పాలు మార్చలేనివి అని ఇతరులు వాదిస్తారు. రెండు వాదనలలో కూడా ప్రాథమికంగా లోపమున్నది. పరలోక దీవెనలు కష్టపడి పనిచేస్తు “మంచి పనుల టోకెన్లు“ సమకూర్చుకోవడం వలన సంంపాదించుకొనేది కాదు లేదా దీవెనల లాటరీను గెలుస్తామని నిస్సహాయముగా వేచి చూడటం కాదు. అది కానే కాదు, సత్యము ఎక్కువ సూక్ష్మబేధము కలది కాని ప్రేమగల పరలోక తండ్రికి ఆయన వారసులగుటకు సామర్థ్యమున్న మనకు మధ్య ఉన్న సంబంధానికి మరింత సముచితమైనది. దీవెనలు సంపాదించుకొనేవి కాదని కాని మన తరఫున మొదటివి మరియు కొనసాగుచున్నవియునైన విశ్వాస ప్రేరేపిత క్రియలు ఆవశ్యకమైనవని పునఃస్థాపించబడిన సత్యము బయలుపరుస్తున్నది. 3

చిత్రం
కలపరాశి

మనం దేవుని నుండి దీవెనలు ఏవిధంగా పొందుతామో పరిగణించినప్పుడు, పరలోక దీవెనలను పెద్ద కుప్పగా పోసిన కలపతో పోల్చుదాము. మధ్యలో మట్టికుప్పపై మంటపెట్టుటకు చిన్న చిన్న కొయ్య ముక్కలు ఉండుటను ఊహించుకోండి. తరువాత కర్రముక్కలు, చిన్న కొయ్య దుంగలు తరువాత పెద్ద దుంగలు పేర్చబడును. ఈ కలపరాశి, ఎక్కువ మోతాదులో చమురును కలిగియుండి అనేక దినాల వరకు కాంతిని, వెడిని ఉత్పత్తి చేయగలదు. ఆ కలపరాశికి ప్రక్కన గంధకపు మొనతో ఒక అగ్గిపుల్ల ఉండటాన్ని ఊహించుకోండి. 4

చిత్రం
అగ్గిపుల్లతో కలపరాశి

కలపరాశిలో ఉన్న శక్తి విడుదల కావాలంటే, అగ్గిపుల్ల గీయడం, దానిని వెలిగించడం అవసరమ. ఈ వెలిగించడం వలన మంట పుట్టి, పెద్ద కొయ్య దుంగలు కాలేటట్టు చేస్తుంది. ఒకసారి ఈ దహనచర్య మొదలైతే, కలప పూర్తిగా కాలిపోయెవరకు లేదా ఆ మంటకు ఆక్సిజన్ దొరికేంతవరకు అది కాలుతూనే ఉంటుంది.

చిత్రం
కలపరాశిని కాల్చుట

అగ్గిపుల్లను గీయడం, ఆ చెక్కముక్కకు మంటపెడ్డడం చాలా చిన్న చర్యలు, అవి కలపలో ఉండే స్ధితిజ శక్తి విడుదల చేసేటట్టు చేయును. 5 ఆ కలపురాశి పరిమాణము ఎంత ఉన్నప్పటికి, అగ్గిపుల్ల గీయనంత వరకు ఏమి జరగదు. అగ్గిపుల్ల గీయబడింది కాని చెక్కముక్కకు అంటించబడకపోతే, ఆ అగ్గిపుల్లనుండి వచ్చే వెలుగు, వేడి సూక్ష్మమైవని మరియు కలపలో ఉన్న దహన శక్తి విడుదల చేయబడకుండా ఉంటుంది. ఏ స్థాయిలోనైనా ఆక్సిజన్ లభించకపోతే, దహన చర్య ఆగిపోతుంది.

అదేవిధంగా, దేవుడు మనకు ఇవ్వాలనుకొనే దీవెనలలో చాలావాటికి మన చర్య అనగా-యేసు క్రీస్తునందు విశ్వాసముపైన ఆధారపడు మన చర్య అవసరము. రక్షకునియందు విశ్వాసము అనేది చర్య యొక్క మరియు శక్తి యొక్క సూత్రము. 6 మొదట మనం విశ్వాసంతో చర్య చూపిస్తాము, తరువాత-దేవుని చిత్తము మరియు అనుకూల సమయమును బట్టి శక్తి వస్తుంది. ఆ క్రమము ఆవశ్యకమైనది. 7 అయినప్పటికి మనం చివరకు పొందే దీవెనలతో పోలిస్తే, మనం తీసుకోవలసిన చర్య చాలా చిన్నది. 8

వాగ్దాన దేశమునకు వెళ్లే మార్గములో ప్రాచీన ఇశ్రాయేలీయుల మధ్యలో తాపకరమైన ఎగిరే సర్పములు వచ్చినప్పుడు ఏమైయిందో ఆలోచించండి. విషకరమైన సర్పము యొక్క కాటు మరణకరమైనది. కాని మోషే రూపించి, స్తంభముమీద పెట్టిన ఇత్తడి సర్పము వైపు చూచుట ద్వారా కరవబడిన ప్రతివాడును స్వస్థపరచబడ గలిగెను 9 దేనినైనా చూచుటకు ఎంత శక్తి కావాలి? చూచిన వారందరు పరలోక శక్తులను అందుకొని, స్వస్థపరచబడ్డారు. ఆ ఇత్తడి సర్పమును చూచుటకు విఫలమైన సర్పము కరిచిన ఇతర ఇశ్రాయేలీయులు మరణించిరి. బహశా చూసే విశ్వాసము వారికి లేకపోయెను. 10 బహశా వాగ్దానము చేయబడిన స్వస్థత అటువంటి సరళమైన కార్యము ద్వారా జరుగునని వారు నమ్మకపోయి ఉండవచ్చు. లేదా వారు ఇష్టపూర్వకముగా తమ హృదయాలను కఠినపరచుకొని, దేవుని యొక్క ప్రవక్త సలహాను తిరస్కరించెను. 11

దేవుని నుండి ప్రవహించు దీవెనలను చైతన్యము చేయు సూత్రము నిత్యమైనది. ఆ ప్రాచీన ఇశ్రాయేలీయుల వలె, మనం కూడా దీవించబడుటకు యేసు క్రీస్తునందు విశ్వాసముతో పనిచెయ్యాలి. “అన్ని దీవెనలు ఆధారపడియున్న ఒక ధర్మశాస్త్రము మార్పుచేయజాలని విధముగా ఈ లోకము పునాది వేయబడక మునుపు పరలోకములో ప్రకటించబడెను-మనము దేవుని నుండి ఏ దీవెనయైనను పొందిన యెడల, అది ఆధారపడియున్న ధర్మశాస్త్రమునకు విధేయత చూపుట ద్వారా అది జరుగును“ 12 అని దేవుడు బయలుపరచెను. ఈ విధంగా చెప్పినప్పటికి, మీరు దీవెనను సంపాదించరు-ఆ వాదన తప్పు-కాని మీరు దానికి అర్హత సంపాదించాలి. మన రక్షణ కేవలం యేసు క్రీస్తు యొక్క మంచితనము, కృప ద్వారా కలుగును. 13 అపారమైన ఆయన ప్రాయశ్చిత్త త్యాగము అంటే ఆ కలపరాశి అనంతమైనది అని అర్థము; మన అల్పమైన చర్యల ద్వారా దానిని సమీపించడం అనేది పోలికలో సున్నాతో సమానం. కాని అవి సున్నా కాదు, అవి ప్రాముఖ్యత లేనివి కాదు; చీకటిలో ఉన్నప్పుడు వెలిగించిన ఒక అగ్గి పుల్ల అనేక మైళ్ళ వరకు చూడవచ్చును. వాస్తవానికి, అది పరలోకములో చూడబడుతుంది ఎందుకంటే దేవుని వాగ్దానాలను వెలిగించుటకు చిన్న చిన్న విశ్వాసపు చర్యలు అవసరము.14

దేవుని యొద్దనుండి కోరుకున్న ఒక దీవెన పొందాలంటే, విశ్వాసముతో పనిచేసి, ఆ పరలోక దీవెనపై ఆధారపడియున్న ఉపమానరీతిగా చెప్పబడు ఆ అగ్గిపుల్లను వెలిగించాలి. ఉదాహరణకు, మనం ప్రార్థన చేయుటకు గల ఉద్దేశాలలో ఒకటి మనకు ఇవ్వాలని దేవుడు సమ్మతికలిగిన దీవెనలను పొందుట కాని అవి మనం అడుగుట అనే షరతుపై ఆధారపడియున్నవి. 15 కరుణ కొరకు ఆల్మా మొరపెట్టెను అప్పుడు ఆయన బాధలు తీర్చబడెను; ఆయన పాపముల యొక్క జ్ఞాపకముతో ఇంకెంత మాత్రము అతడు బాధింపబడలేదు. అతని సంతోషము అతని బాధను ముంచివేసెను-ఇదంతా కేవలం ఆయన యేసు క్రీస్తు నందు విశ్వాసముతో ప్రార్థించడం వలన జరిగెను. 16 మనకు కావలసిన ఉత్తేజపరచు శక్తి ఏదంటే, క్రీస్తు నందు తగినంత విశ్వాసము కలిగియుండి, దేవునిని మనఃపూర్వకముగా ప్రార్థించి, సమాధానము కొరకు ఆయన చిత్తమును, ఆయన అనుకూల సమయాన్ని అంగీకరించాలి.

దీవెనల కొరకు కావలసిన ఉత్తేజపరచు శక్తికి తరచుగా వేచిచూడటం లేదా అడగటం ఒక్కటే చాలదు; ఎడతెగక, పునరావృతమయ్యే, విశ్వాసముతో కూడిన చర్యలు అవసరము. 19వ శతాబ్ధం మధ్యలో కడవరి దిన పరిశుద్ధుల ఒక గుంపును ఉత్తర అమెరికాలో ఉన్న ఆరిజోనాను అన్వేషించి, అక్కడ స్థిరపడమని బ్రిగం యంగ్ నిర్దేశించారు. ఆరిజోనా చేరుకున్న తరువాత వారిదగ్గర నీళ్ళు అయిపోవడంతో చనిపోతారని ఆ గుంపువారు భయపడ్డారు. సహాయం కొరకు దేవుని వేడుకొన్నారు. వెంటనే వర్షము, మంచు కురిసి, వారి బానలను నీటితో నింపుకొనుటకు, పశుగణానికి ఇచ్చుటకు వారికి వీలుకల్పించింది. కృతజ్ఞత కలిగి, నూతన ఉత్సాహముతో వారు సాల్ట్ లేక్ సిటీకి తిరిగి వచ్చి దేవుని యొక్క మంచితనము కొరకు ఆనందించారు. వారు తిరిగి వచ్చిన తరువాత, వారి అన్వేషయాత్ర యొక్క వివరాలను బ్రిగం యంగ్‌ గారికి నివేదించి, ఆరిజోనా నివసించుటకు పనికిరాదని వారి తుది అభిప్రాయాన్ని తెలియజేసారు.

చిత్రం
బ్రిగం యంగ్

వారి నివేదికను వినిన తరువాత బ్రిగం యంగ్ గారు ఆ గదిలో ఉన్న ఒక వ్యక్తితో వారి అన్వేషయాత్ర గురించి, ఆ అద్భుతకార్యము గురించి ఏమనకొనుచున్నవు అని అడిగారు. ఆ వ్యక్తి డానియేల్ డబ్ల్యూ. జోన్స్, అతడు క్లుప్తంగా, “నేను నీటిని నింపుకొని, ముందుకు కొనసాగి, మళ్ళీ ప్రార్థించేవాడిని“ అని సమాధానమిచ్చాడు. సహోదరుడు బ్రిగం సహోదరుడు జోన్స్‌పై తన చెయ్యివేసి, “ఆరిజోనాకు వెళ్ళే మరుసటి యాత్రకు ఈ వ్యక్తి బాధ్యత వహించును“17 అని చెప్పారు.

చిత్రం
డానియేల్ డబ్ల్యూ. జోన్స్

మనం ముందుకు సాగి, మళ్ళీ ప్రార్థించి-ఫలితంగా దీవెనలు కలిగిన గడియలను మనందరము కూడా గుర్తుచేసుకోగలము. మైఖెల్ మరియు మరియన్ హోమ్స్ యొక్క అనుభవము ఈ సూత్రములను వర్ణించును. నేను, మైఖెల్ కలిసి ప్రాంతీయ డెబ్బదులుగా పనిచేసాము. మా కూడికలలో ఆయన ఎప్పుడు ప్రార్థన చెయ్యడానికి పిలువబడినా, నేను అత్యుత్సాహము చూపిస్తాను ఎందుకంటే ఆయన లోతైన ఆత్మీయత ప్రస్పుటముగా కనిపించును; దేవునితో ఎలా మాట్లాడాలో ఆయనకు తెెలుసు. ఆయన ప్రార్థన వినడం నాకు చాలా ఇష్టం. వారి వివాహ ఆరంభములో మైఖెల్ మరియు మరయన్ ప్రార్థన చేసేవారు కాదు లేదా సంఘానికి హాజరయ్యేవారు కాదు. ముగ్గురు చిన్న పిల్లలతో, విజయవంతమైన భవన నిర్మాణ కంపెనీతో వారు తీరికలేకుండా ఉండేవారు. మతపరమైన వ్యక్తి అని మైఖెల్ ఎప్పుడు అనుకొనేవాడు కాదు. 1963లో ఒక సాయంకాలము వారి బిషప్పు వారి ఇంటికి వచ్చి ప్రార్థించుటకు మొదలు పెట్టమని వారిని ప్రోత్సాహించెను.

బిషప్పు వెళ్లిపోయిన తరువాత, మైఖెల్ మరియు మరియన్ ప్రార్థన చెయ్యాలని నిర్ణయించుకొన్నారు. పడుకొనేముందు వారు తమ మంచము ప్రక్కన మోకరించి, అసౌకర్యంగా మైఖెల్ మొదలు పెట్టెను. కొన్ని నేర్పులేని మాటలతో ప్రార్థించిన తరువాత, మైఖెల్ అమాంతంగా ప్రాార్థన ఆపి, “మరియన్, నేను చెయ్యలేను“ అని అన్నాడు. తను లేచి వెళ్లిపోతుంటే, మరియన్ తన చెయ్యి పట్టుకొని, మోకాళ్ళు వేయించి, “మైక్, నువ్వు చెయ్యగలము“ అని చెప్పింది. మళ్ళీ ప్రయత్నించు!“ ఈ ప్రోత్సాహముతో, మైఖెల్ క్లుప్త ప్రార్థన చేసాడు.

హోమ్‌సెస్ క్రమం తప్పకుండా ప్రార్థన చెయ్యడం మొదలుపెట్టారు. సంఘానికి హాజరవ్వాలని ఒక పొరుగువాడు ఇచ్చిన ఆహ్వానాన్ని వారు అంగీకరించారు. ప్రార్థనామందిరములోనికి వారు ప్రవేశించి, ఆరంభపు కీర్తన వినగా, “ఇది సత్యము“అని ఆత్మ వారితో మెల్లగా చెప్పెను. తరువాత, ఎవరి చేత చూడబడకుండా, చెప్పబడకుండా, మైఖెల్ కొంత చెత్తను ఊడ్వడంలో సహాయపడెను. అలా చేసినప్పుడు, “ఇది నా గృహము“ అని ఒక నిర్ధిష్టమై భావనను అతడు భావించెను.

చిత్రం
యౌవనులైన మైఖెల్ మరియు మరియన్ హోమ్స్

మైఖెల్, మరియన్‌లు సంఘ పిలుపులను అంగీకరించి, తమ వార్డులోను, స్టేకులోను సేవచేసారు. వారు ఒకరికొకరు మరియు ముగ్గురు పిల్లలతో ముద్రింపబడ్డారు. వారికి ఇంకా ఎక్కువ పిల్లలు కలిగి, మొత్తం పన్నెండుమంది అయ్యారు. మిషను అధ్యక్షులు మరియు సహచరురాలిగా రెండుసార్లు హోమ్‌సెస్ సేవచేసారు.

చిత్రం
నేడు మైఖెల్ మరియు మరియన్ హోమ్స్

నేర్పులేని మొదటి ప్రార్థన చిన్నదే కాని విశ్వాస సహిత చర్య అది పరలోక దీవెనలు పొందెలా చేసెను. సంఘము హాజరగుట ద్వారా, సేవ చేయుట ద్వారా హోమ్‌సెస్ తమ విశ్వాస జ్వాలలకు ఆజ్యము పోసారు. సంవత్సరాల తరబడి వారి సమర్పిత శిష్యత్వము ప్రచండమైన అగ్నిజ్వాలలకు దారితీసెను అది నేటివరకు మనల్ని ప్రేరేపిస్తుంది.

చిత్రం
విస్తరించబడిన హోమ్స్ ఉమ్మడి కుటుంబము

అయినప్పటికి, కలప దాని పూర్తి సామర్థ్యము విడుదల చెయ్యబడాలంటే అగ్నికి స్థిరముగా ఆక్సిజన్ సరఫరా జరగాలి. మైఖెల్, మరియన్ హోమ్స్ పదర్శించినట్లుగా, క్రీీస్తునందు విశ్వాసమునకు అగ్ని జ్వాల కొనసాగాలంటే ఎడతెగని చర్య అవసరము. నిబంధన మార్గము వెంబడి నడుచుటకు చిన్న చర్యలు మన సామర్థ్యమునకు ఇంధనముగా పనిచేసి, దేవుడిచ్చు మిక్కిలి ఘనమైన దీవెనలకు దారితీయును. కాని ఉపమానరీతిగా మన పాదాలను కదుపుతూ ఉన్నప్పుడే ఆక్సిజన్ ప్రవహించును. మనం ఎక్కడ ఆహారము కొరకు వెదకాలో తెలియజేయు బయల్పాటు వచ్చుటకు ముందు కొన్నిసార్లు మనం విల్లు, బాణమును తయారు చేసుకోవాలి. 18 ఏవిధంగా ఓడ నిర్మించాలో తెలియజేయు బయల్పాటు వచ్చుటకు ముందు కొన్నిసార్లు మనం పనిముట్లను తయారు చేసుకోవాలి. 19 దేవుని ప్రవక్త యొక్క నడిపింపులో, తొట్టిలో ఉన్న పిండి తక్కువకాకుండా, బుడ్డిలో నూనె అయిపోకుండా ఉండాలంటే కొన్నిసార్లు కొంచెము పిండి, నూనేల నుండి చిన్న రొట్టెను మనం కాల్చాలి. 20 కొన్నిసార్లు మనం“ఊరకుండి [దేవుడే] దేవుడనని తెలిసికోవాలి“ మరియు ఆయన అనుకూల సమయమందు నమ్మకముంచాలి. 21

మీరు దేవుని నుండి ఏ దీవెనయైనను పొందిన యెడల, అది ఆధారపడియున్న ధర్మశాస్త్రమునకు విధేయత చూపుట ద్వారా అది జరిగెనని మీరు నిశ్చయించుకొనవచ్చును. 22 కాని “మార్పుచేయజాలని విధముగా ప్రకటించబడిన“ ధర్మశాస్త్రము, సమయముతో సంబంధములేనిది అనగా ఆ దీవెన దేవుని కాలపు పట్టీ ప్రకారము వచ్చును. ప్రాచీన ప్రవక్తలు తమ పరలోక గృహమును వెదకుచూ 23“ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి ... వందనముచేసి, [మరియు]ఒప్పకొని... విశ్వాసముగలవారై మృతినొందిరి.“24 దేవుని నుండి కోరుకున్న దీవెన ఇంకా పొందకపోయిన యెడల, ఇంకేమి చెయ్యాలని ఆలోచిస్తూ పిచ్చివారు కాావద్దు. దానికి బదులు ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ఉపదేశమును ఆలకించుడి, “[మీ] సామర్థ్యము మేరకు అన్నింటిని సంతోషముతో చేయుడి; అప్పుడు [దేవుని] బాహువు బయలుపరచబడుట కొరకు . . . మిక్కిలి నిశ్చయముతో నిలిచియుండుడి.“ 25 దేవుని పిల్లలలో మిక్కిలి పరాక్రమవంతులైన వారికి కూడా తరువాత ఇవ్వబడుటకు కొన్ని దీవెనలు దాచబడినవి. 26

సిద్ధాంతము నేర్చుకొనుటకు, విశ్వాసము బలపరచుటకు, వ్యక్తులు, కుటుంబాలు పటిష్ఠము చేయబడుటకు ఆరు నెలల క్రితం, కుటుంబ-కేంద్రిత, సంఘ-సహకార ప్రణాళిక పరిచయం చేయబడినది. ఈ మార్పులు ఆత్మీయంగా బ్రతికియుండుటకు, మన సువార్త ఆనందమును పెంచుటకు, పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు యందు మన పరివర్తన అధికమగుటకు మనకు సహాయపడునని అధ్యక్షులు రస్సల్ ఎమ్. నెల్సన్ వాగ్దానము చేసారు.27 ఈ దీవెనలు ఆరోపించుట అనేది మనపై ఆధారపడి ఉంది. మనలో ప్రతి ఒక్కరము లేఖనములు మరియు ఇతరమైన “నన్ను వెంబడించండి“ పాఠ్యాంశములతో పాటు నన్ను వెంబడించండి-వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు కరదీపికను తెరచి, పఠించుటకు బాధ్యులమై ఉన్నాము. 28 వాటిని మన కుటుంబము, స్నేహితులతో చర్చించి, ఉపమానరీతిగా నిప్పును అంటించి మన సబ్బాతు దినమును ఏర్పాటుచెయ్యాలి. లేదా ఈ వనరులను వాటిలో ఉన్న సామర్థ్యము లోపలే సమాధి చేసి, గృహాలలో గుట్టగా పేరుకొనిపోయి ఉన్నవాటిపై మనం వదిలిపెట్టవచ్చును.

దేవుని నుండి నిర్దిష్టమైన దీవెనలు పొందుటకు నమ్మకముగా పరలోక శక్తిని ఉత్తేజపరచమని నేను మిమ్ములను ఆహ్వానిస్తున్నాను. అగ్గిపుల్ల గీయుటకు, నిప్పు అంటించుటకు విశ్వాసమును సాధన చెయ్యండి. మీరుదేవుని దీవెనలు పొందుటకు సహనముతో వేచియుండగా అవసరమయ్యే ఆక్సిజన్ సరఫరా చెయ్యండి. ఈ ఆహ్వానములతో పరిశుద్ధాత్మ మిమ్మును నడిపించి, దారిచూపించాలని నేను ప్రార్థిస్తున్నాను తద్వారా సామెతలలో వివరించబడిన “నమ్మకమైనవానివలె దీవెనలు మెండుగా కలుగును“ 29 మన పరలోక తండ్రి, ఆయన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సజీవులని, మన సంక్షేమం కొరకు చింతకలిగి యున్నారని, మనల్ని దీవించుటకు ఆనందిస్తారని నేను సాక్ష్యమిస్తున్నాను, యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

ముద్రించు