2010–2019
ఆయన స్వరమును వినుట
2019 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము.


2:3

ఆయన స్వరమును వినుట

అనేకమైన పోటీపడే స్వరములు గల ప్రపంచములో, ఆయన స్వరమును విని, అనుసరించుటకు మన పరలోక తండ్రి దానిని మనకు సాధ్యపరిచారు.

ఈ తెల్లవారుజామున, నా భార్య సహోదరుడు తన తల్లికి అనేక సంవత్సరాల క్రితం ఆమె వ్రాసిన ఒక నోటును ఇచ్చాడు. ఆ సమయంలో, సహోదరి హోమోర్ కేవలము చిన్న బాలిక. ఆమె నోటులో, భాగము ఇలా చదవబడింది, “ప్రియమైన అమ్మా, ఈ రోజు నేను నా సాక్ష్యము చెప్పనందుకు నన్ను క్షమించు—కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను.” మేము భోజనానికి వెళ్ళినప్పుడు, అది ఆసక్తికరమైనదిగా నేను అనుకున్నాను. కనుక నేను కూర్చోని, “ప్రియమైన అధ్యక్షులు నెల్సన్ గారు, నన్ను క్షమించండి, ఈరోజు నేను నా ప్రసంగమును ఇవ్వలేను—కానీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను,” అని చెప్పబడిన నోటును నేను వ్రాసాను. ఎదోవిధంగా అది సరిగా అనిపించలేదు. ఇక్కడ మనమున్నాము, ఈరోజు సమావేశములో మాట్లాడబడిన వాటికి నా మాటలను చేరుస్తున్నాను.

అనేక సంవత్సరాల క్రితం, క్రొత్తగా సర్టిఫికెట్ పొంది విమానము నడుపుతున్న పైలట్‌తో ఒక చిన్న విమానముపై నేను ప్రయాణించాను. మా విమానము ముగింపులో, మేము దిగటానికి అనుమతించబడ్డాము. కాని మేము నేలను సమీపిస్తుండగా, కాక్ పిట్‌లో ఆలారమ్ “పైకి రమ్మని” పైలట్‌ను హెచ్చరించుట నేను విన్నాను. పైలట్ ఎక్కువ అనుభవము కలిగిన సహ పైలట్ వైపు చూసాడు, అతడు క్రింద వైపు రన్ వేకు దూరముగా, చూపించాడు, మరియు “ఈ దిశలో వెళ్ళు!” అన్నాడు.

మా విమానము కుడివైపుకు మరియు క్రిందకు వేగముగా కదిలింది, తరువాత పైకి తగినంత ఎత్తుకు పైకి ఎగిరి, క్రిందకు దిగే మాదిరిలో ప్రవేశించింది, మరియు క్షేమంగా మా గమ్యము చేరుకున్నది. తరువాత మేము మరొక విమానము పైకి వెళ్ళటానికి అనుమతించబడిందని తెలుసుకున్నాము. ఆలారమ్ యొక్క సూచనలను మేము అనుసరిస్తే, మేము రాబోయే విమానము నుండి దూరముగా వెళ్ళుటకు బదులుగా, మేము దూసుకొనిపోయి ఉండేవారము. ఈ అనుభవము నాకు రెండు ముఖమైన పాఠములను నేర్పింది: మొదటిది, మన జీవితాలలోని క్లిష్టమైన క్షణాలందు, మన ఆసక్తి కొరకు పోటీపడే అనేక స్వరాలను మనము వింటాము. రెండవది, మనము సరైన వాటిని వినుట ముఖ్యమైనది.

పోటీపడే స్వరములు

మన ఆసక్తిని కోరే అనేక స్వరములు గల ప్రపంచములో మనము జీవిస్తున్నాము. అత్యవసర వార్తలు, ట్వీట్స్, బ్లాగులు, పాడ్కాస్టుల వంటి సామాజిక మీడియా, మరియు ఆలెక్సా, సిరి మరియు మిగిలిన అనేక నిర్భంధించే సలహాతో , ఏ స్వరములను నమ్మాలో తెలుసుకొనుట కష్టముగా మనము కనుగొనవచ్చు. కొన్నిసార్లు మన జీవితాలలో మనం, సత్యము యొక్క శ్రేష్టమైన ఆధారమిచ్చునని ఆలోచిస్తూ, ఇంటర్నెట్‌తో సంబంధించిన గుంపు నడిపింపును తీసుకుంటాము. మిగిలిన సమయాలలో మనము “వేడిగా లేక చల్లగా లేకుండా”2 ఉండుటకు ఎంపిక చేస్తూ “రెండు అభిప్రాయాల మధ్య … ఆగుతాము.”1 మిగిలిన సమయాలలో సౌకర్యవంతమైన దానిని మనము అనుసరిస్తాము, మనల్ని నడిపించుటకు ఒకే స్వరముపై లేక సమస్య పై దృష్టిసారించుట, లేక ఆలోచించుటకు మన స్వంత సామర్ధ్యముపై అరుదుగా ఆధారపడతాము.

ఈ పద్ధతులలో ప్రతీది సహాయకరముగా ఉన్నప్పటికినీ, అవి ఎన్నడూ నమ్మకమైనవి కాదని అనుభవము బోధించును. ప్రసిద్ధి చెందినది ఏదీ ఎల్లప్పుడూ శ్రేష్టమైనది కాదు. రెండు అభిప్రాయాల మధ్య ఆగుట ఏ నడిపింపును ఇవ్వదు. సౌకర్యము అరుదుగా ముఖ్యమైన విషయాలకు నడిపించును. ఒకే స్వరముపై లేక సమస్యపై మాత్రమే ఆసక్తిని చూపుట మన సామర్ధ్యమును బలహీనపరచును. పూర్తిగా మన స్వంత ఆలోచనపై ఆధారపడుట, మూర్ఖమైన ఆలోచన ఆలోచించుటకు మన స్వంత సామర్ధ్యముపై అతిగా ఆధారపడుటకు మనల్ని నడిపించును. మనము జాగ్రత్తగా లేని యెడల తప్పుడు స్వరములు మనల్ని సువార్త సూత్రములందు బలమైన విశ్వాసము నుండి, సువార్త ఆమోదించుటకు కష్టమగు స్థలములకు దూరముగా నడిపించును, మరియు మనము శూన్యతను, ద్వేషమును, మరియు అసంతృప్తి కంటె ఎక్కువను కనుగొంటాము.

తప్పు స్వరమును వినుట

ఒక సాదృశ్యమును మరియు లేఖన మాదిరిని ఉపయోగించుట ద్వారా, నా ఉద్దేశమును నేను రుజువు చేస్తాను. కొండలను ఎక్కేవారు సాధారణంగా 8,౦౦౦ మీటర్లకు పైగా ఎత్తులను “మృత్యు జోన్” గా సూచిస్తారు, ఎందుకనగా ఆ ఎత్తులలో ప్రాణమును బలపరుచుటకు తగినంత ఆక్సిజను అక్కడ ఉండదు. ఆ మృత్యు జోన్‌కు ఆత్మీయంగా సమానమైనది ఉన్నది. విశ్వాసములేని స్థలములలో మనము ఎక్కువ సమయము గడిపిన యెడల, మంచి ఉద్దేశముగా కనబడే స్వరములు మనకవసరమైన ఆత్మీయ ఆక్సిజన్‌ను తీసివేస్తాయి.

మోర్మన్ గ్రంథములో, కొరిహోర్ అటువంటి అనుభవమును కలిగియున్నాడని మనము చదివాము. అతడు గొప్ప కీర్తిని ఆనందించాడు ఎందుకనగా అతడి బోధనలు “శరీర సంబంధమైన మనస్సుకు ప్రీతికరముగా నుండెను”3 తల్లిదండ్రులు, ప్రవక్తలు స్వేచ్ఛను పరిమితము చేసి మూర్ఖపు సాంప్రదాయములు బోధిస్తున్నారని మరియు అజ్ఞానమును వ్యాప్తి చేయుటకు ఉద్దేశింపబడినవని అతడు చెప్పాడు.4 జనులు వారేమి చేయాలని అనుకుంటున్నారో చేయుటకు స్వాతంత్ర్యము కలిగియుండాలని అతడు వాదించాడు, ఎందుకనగా ఆజ్ఞలు కేవలము సౌకర్యముగా చేయబడిన నిర్భంధాలు.5 అతడికి, యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తఃమునందు నమ్మకము, ఆయన చూడబడలేదు కనుక, ఉనికి లేని ఒక ప్రాణియందు నమ్మకము చేత కల్పించబడిన “వెర్రిపట్టిన మనస్సు యొక్క ఫలితము.”6

కొరిహోర్ చాలా కలవరమును కలిగించాడు కనుక, అతడు ప్రధాన న్యాయవాది మరియు ప్రధాన యాజకుని యెదుట తేబడ్డాడు. అక్కడ, అతడు నాయకులను విమర్శిస్తూ, ఒక సూచనను కోరుతూ, “గొప్ప నేర్పయిన మాటలందు పైకి లేచెను.” ఒక సూచన ఇవ్వబడింది. అతడి నోరు మూయబడింది, ఆవిధంగా అతడు మాట్లాడలేకపోయాడు. కొరిహార్ తరువాత తాను మోసగించబడ్డానని, గ్రహించాడు, మరియు అతడు విసర్జించిన ప్రశస్తమైన సత్యములను గూర్చి ఆలోచిస్తూ, అతడిలా విలపించాడు, “నేను ఎల్లప్పుడు ఎరిగితిని.”7

అప్పటినుండి జోరమీయుల గుంపు చేత మరణించు వరకు త్రొక్కివేయబడేంత వరకు కొరిహోర్ ఆహారమును భిక్షమెత్తుకొనెను.8 అతడి వృత్తాంతములో చివరి వచనము ఈ వినయముగల లోతైన ఆలోచనను కలిగియున్నది: “మరియు ఆవిధముగా అంత్యదినమందు అపవాది అతని సంతానమునకు సహాయపడడని, కానీ వారిని వేగముగా నరకమునకు ఈడ్చుకు పోవునని మనము చూచుచున్నాము.”9

సరైన స్వరము

మన పరలోక తండ్రి మనకు శ్రేష్టమైనది కోరును కనుక, ఆయన తన స్వరమును వినుటకు మనకు సాధ్యపరచును. మిక్కిలి తరచుగా, మనము పరిశుద్ధాత్మ చేత ఇవ్వబడిన భావనల ద్వారా ఆయనను వింటాము. పరిశుద్ధాత్మ త్రియేక దేవునిలో మూడవ సభ్యుడు. అతడు తండ్రి మరియు కుమారుని గూర్చి సాక్ష్యమిచ్చును,10 “(మనకు) అన్ని విషయాలు బోధించుటకు,”11 పంపబడెను, మరియు “(మనము) చేయాల్సిన విషయాలన్నిటిని (మనకు) చూపును .”12

ఆత్మ వేర్వేరు విధానాలలో, వేర్వేరు జనులతో మాట్లాడును, మరియు ఆయన ఒకే వ్యక్తితో వేర్వేరు సమయాలలో వేర్వేరు విధానాలలో మాట్లాడవచ్చు. ఫలితంగా, ఆయన మనతో మాట్లాడు అనేక విధానాలను నేర్చుకొనుట జీవితకాల అన్వేషణ. కొన్నిసార్లు, ఆయన మన “మనస్సు మరియు (మన) హృదయములో”13, చిన్నది, అయినను శక్తివంతమైనది, “వినిన వారిని, … అది మధ్యకు” గ్రుచ్చుకొను 14 స్వరముతో మాట్లాడును. మిగిలిన సమయాలలో, ఆయన భావనలు “(మన) మనస్సులను ఆక్రమించును” లేక “(మన) భావనల పై … బలముగా ప్రభావితం చేయును.” 15 ఇతర సమయాలలో మనము “(మనలో) బలమైన భావావేశాలను అనుభవిస్తాము.”16 ఇంకను మిగిలిన సమయాలలో ఆయన మన ఆత్మలను సంతోషముతో నింపును, మన మనస్సులకు జ్ఞానవృద్ధి కలిగించును,17 లేక మన కలవరపడే హృదయాలతో శాంతిని మాట్లాడును.18

ఆయన స్వరమును కనుగొనుట

అనేక ప్రదేశాలలో మన తండ్రి యొక్క స్వరమును మనము కనుగొంటాము. మనము ప్రార్థించినప్పుడు, లేఖనాలను చదివినప్పుడు, సంఘానికి హాజరైనప్పుడు, విశ్వాసపూరితమైన చర్చలందు పూనుకొని, లేక దేవాలయమునకు వెళ్లినప్పుడు, దానిని మనము కనుగొంటాము. నిశ్చయముగా, మనము ఈ వారంతము సమావేశములో దానిని కనుగొంటాము.

ఈరోజు మనము 15 మంది పురుషులను ప్రవక్తలు, దీర్ఘదర్శులు, మరియు బయల్పాటుదారులుగా ఆమోదించాము. వారి ఆత్మీయత మరియు అనుభవము మనకు చాలా అవసరమైన ప్రత్యేకమైన దృష్టికోణమును వారికిచ్చును. వారి సందేశములు ఖచ్చితమైన స్పష్టతతో కనుగొనబడును మరియు మాట్లాడబడును. అది ప్రసిద్ధి చెందినా లేక లేకపోయినా మనము తెలుసుకోవాలని దేవుడు కోరిన దానిని వారు మనకు చెప్తారు.19

ఈ స్థలములలో ఏ ఒక్క దానిలోనైనా, ఆయన స్వరమును వెదకుట మంచిది, కానీ వీటిలో అనేకమైన వాటిలో దానిని వెదకుట ఇంకా మేలైనది. మనము దానిని విన్నప్పుడు, ఇవ్వబడిన నడిపింపును వెంబడించుట మనకు అవసరము. అపొస్తులుడైన యాకోబు చెప్పాడు, “మీరు వినువారు మాత్రమైయుండక, వాక్యప్రకారము ప్రవర్తించువారునై యుండుడి.”20 అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ ఒకసారి బోధించారు: “మనము చూస్తాము. మనము ఎదురుచూస్తాము. ఆ మెల్లని, చిన్న స్వరము కొరకు మనము వింటాము. అది మాట్లాడినప్పుడు, తెలివైన పురుషులు మరియు స్త్రీలు విధేయులవుతారు.“21

నడిపింపు వచ్చుట నెమ్మదియైనప్పుడు

నా వృత్తిపరమైన జీవితము ప్రారంభములో, సహోదరి హోమెర్, నేను ఉద్యోగ నియామకములో ఒక మార్పును అంగీకరించుటకు అడగబడ్డాము. ఆ సమయమందు, అది మాకు పెద్ద నిర్ణయముగా కనబడింది. మేము అధ్యయనము చేసాము, ఉపవాసమున్నాము, మరియు ప్రార్థించాము, కానీ జవాబు రావటం ఆలస్యమైంది. చివరకు, మేము ఒక నిర్ణయము చేసి, ముందుకు సాగాము. మేము చేసినప్పుడు, మేము స్థిరపడినట్లుగా భావించాము, మరియు త్వరలో అది మేము ఎప్పటికీ చేసుకున్న ఉత్తమమైన నిర్ణయాలలో ఒకటని తెలుసుకొన్నాము.

ఫలితంగా, కొన్నిసార్లు జవాబులు ఆలస్యంగా వస్తాయని మేము తెలుసుకున్నాము. ఇది సరైన సమయము కానందున కావచ్చు, ఒక జవాబు అవసరము లేదు కనుక, లేక మనకై మనము నిర్ణయము చేయుటకు దేవుడు మనల్ని నమ్ముతున్నాడు కనుక. అటువంటి సమయాల కొరకు మనము కృతజ్ఞత కలిగియుండాలని ఎల్డర్ రిచర్డ్ జి. స్కాట్ ఒకసారి బోధించారు మరియు ఈ వాగ్దానము చేసారు: “మీరు యోగ్యత కలిగి జీవించినప్పుడు, రక్షకుని బోధనలతో మీ ఎంపిక ఏకరీతిగా ఉన్నప్పుడు, మీరు అమలు చేయాలి, నమ్మకముతో ముందుకు సాగాలి. … మీరు తప్పు నిర్ణయము చేసినప్పుడు హెచ్చరిక భావన లేకుండా చాలా దూరము వెళ్ళుటకు దేవుడు మిమ్మల్ని అనుమతించడు.”22

మనము తప్పక ఎంపిక చేయాలి

కనుక, మనము అన్ని స్వరముల మధ్య, ఏ స్వరమునకు లోబడాలో మనము నిర్ణయించుకోవాల్సిన అవసరమున్నది. లోకము చేత బలపరచబడిన స్వరములను మనము అనుసరిస్తామా, లేక మన నిర్ణయాలందు మనల్ని నడిపించుటకు మరియు అపాయము నుండి మనల్ని కాపాడుటకు నడిపించుటకు మన తండ్రి యొక్క స్వరమును అనుమతించుటకు అవసరమైన కార్యమును చేస్తామా? ఆయన స్వరమును మనము శ్రద్ధగా వెదికే కొద్ది, అది వినుట సులభమగును. ఆయన స్వరము బిగ్గరగా మారదు, కాని దానిని వినుటకు మన సామర్ధ్యము హెచ్చించబడింది. మనము “(ఆయన) సూక్తులను ఆలకించి, మరియు (ఆయన) సలహాకు చెవి యొగ్గిన” యెడల, ఆయన “(మనకు) ఎక్కువ ఇచ్చెదనని,” 23 రక్షకుడు వాగ్దానము చేసాడు. ఈ వాగ్దానము--మనలో ప్రతీ ఒక్కరి కొరకు యదార్ధమైనదని నేను సాక్ష్యమిస్తున్నాను.

దాదాపు ఒక సంవత్సరం క్రితం, మేము ఒక దురదృష్టకరమైన వాహన ప్రమాదంలో మా అన్నను కోల్పోయాము. జాన్ యొక్క ప్రారంభ సంవత్సరాలు వాగ్దానము మరియు నెరవేర్పుతో నిండియున్నవి. కానీ అతడు పెద్దవాడైనప్పుడు, విరిగిన శరీరము మరియు సహకరించని మనస్సు జీవితమును చాలా కష్టమైనదిగా చేసింది. అతడు ఆశించిన స్వస్థత ఈ జీవితంలో రానప్పటికిని, జాన్ తన విశ్వాసమును పట్టుకొని, తనకు సాధ్యమైనంత ఉత్తమంగా అంతము వరకు సహించుటకు తీర్మానించాడు.

జాన్ పరిపూర్ణుడు కాదని నాకు తెలుసు, కాని అటువంటి సహనము అతడికి ఏది ఇచ్చిందని నేను ఆశ్చర్యపడ్డాను. అనేక స్వరములు అతడిని విరక్తిగా ఉండుటకు మరియు సువార్త సూత్రములు పాటించకుండా ఉండుటకు ఆహ్వానించాయి, కానీ అతడు వెళ్లకుండా ఉండుటకు ఎన్నుకున్నాడు. బదులుగా, అతడు సువార్త సూత్రముల ప్రకారము ఎల్లప్పుడు జీవించుటకు తనకు శాయశక్తులా చేసాడు. అతడు తన జీవితమును సువార్త సూత్రముల ప్రకారం జీవించాడు, ఎందుకనగా దీనిని చేయుట ద్వారా అతడు తన బోధకుని స్వరమును కనుగొంటాడని ఎరుగును; అదే మార్గమని, తాను బోధింపబడతానని అతడు ఎరుగును కనుక అతడు సువార్త సూత్రముల ప్రకారం తన జీవితమును జీవించాడు.

ముగింపు

సహోదర, సహోదరిలారా, అనేకమైన పోటీపడే స్వరములు గల ప్రపంచములో, ఆయన స్వరమును విని, అనుసరించుటకు మన పరలోక తండ్రి మనకు సాధ్యపరిచారని నేను సాక్ష్యమిస్తున్నాను. మనము శ్రద్ధ కలిగియున్న యెడల, ఆయన మరియు ఆయన కుమారుడు మనము వెదకు నడిపింపును, మనకవసరమైన బలమును, మరియు మనమందరం కోరుతున్న సంతోషమును మనకిచ్చును. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.