2010–2019
ఆత్మీయత మరియు భద్రత యొక్క ఆశ్రయమును నిర్మించుట
2019 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము.


ఆత్మీయత మరియు భద్రత యొక్క ఆశ్రయమును నిర్మించుట

మనము యేసు క్రీస్తు యొక్క సువార్తను జీవించినప్పుడు, రక్షకుని యొక్క ప్రాయశ్చిత్తఃమును ఉపయోగించి, భయముతో కాదు, విశ్వాసముతో ముందుకు త్రోసుకొనిపోయినప్పుడు, అపవాదికి వ్యతిరేకంగా బలపరచబడతాము.

నా ప్రియమైన సహోదర, సహోదరిలారా, ఈ సమావేశము ముగింపుకు వచ్చినప్పుడు, గత రెండు రోజులుగా ఈ వేదికపై పంచుకోబడిన సలహా, సత్యములు, మరియు బయల్పాటుల కొరకు మన పరలోకమందున్న తండ్రికి నా కృతజ్ఞతలను తెలుపుతున్నాను. ఆయన పరిశుద్ధమైన మాటలను మాట్లాడుటకు పిలవబడిన దేవుని యొక్క సేవకుల చేత మనము బోధించబడ్డాము. “నా స్వంత స్వరము చేత అయినను లేక … నా సేవకుల స్వరము చేతనైనను, అది ఒక్కటే,”1 అని ప్రభువు కడవరి-దిన బయల్పాటులో మనకు జ్ఞాపకము చేసాడు.

ఈ పరిశుద్ధుల సమూహము వైపు చూస్తూ, మరియు ప్రపంచమంతటా సర్వసభ్య సమావేశమును చూస్తున్న సభ్యులను చిత్రీకరిస్తూ, నేను యేసు క్రీస్తు తాను సిలువ వేయబడిన తరువాత నీఫైయులకు ప్రత్యక్షమైనప్పుడు మోర్మన్ గ్రంథములో సమావేశమును గూర్చి నేను ఆలోచించాను. ఆయన వారికి సువార్తను బోధించాడు మరియు తరువాత ప్రోత్సహించాడు, “మీరు మీ గృహములకు వెళ్ళుడి మరియు నేను చెప్పిన ఆ విషయముల పైన యోచించుడి, మరియు మీరు గ్రహించునట్లు నా నామమందు తండ్రిని అడుగుడి మరియు రేపటి కొరకు మీ మనస్సులను సిద్ధము చేసుకొనుడి, మరియు నేను మీ యొద్దకు తిరిగి వచ్చెదను”2

ఈ పరిశుద్ధ సందర్భములో మాట్లాడబడిన ప్రవక్తలు మరియు సంఘ నాయకుల యొక్క మాటలను గంభీరముగా తీసుకొనుటలో తదుపరి మెట్టు “మీ గృహములకు వెళ్లి, మరియు ధ్యానించుట.” అపవాది “నరుల యొక్క సంతానము యొక్క హృదయములలో విజృంబించును మరియు వారిని మంచిదైన దానికి వ్యతిరేకముగా కోపమునకు పురిగొల్పును,”3 అని ప్రవచింపబడినట్లుగా, ఆ దినములో క్రీస్తు కేంద్రీకరించబడిన గృహాలు భూమిమీద దేవుని రాజ్యము కొరకు ఆశ్రయములుగా ఉంటాయి.

చరిత్ర అంతటా జనులు శత్రువును బయటకు వుంచుటకు కోటలను నిర్మించారు. తరచుగా ఆ కోటలు కావలివాని గోపురమును కలిగియుండును అక్కడ కావలివారు---ప్రవక్తల వలే---భయపెట్టే శక్తులు మరియు రాబోయే ముట్టడులను గూర్చి హెచ్చరిస్తారు.

చిత్రం
థామస్ రాస్‌బాండ్

పూర్వపు యూటా అగ్రగాముల సమయంలో, మా ముత్తాత థామస్ రాస్‌బాండ్ మరియు అతడి కుటుంబము యూటాకు చెందిన అందమైన వాసాచ్ కొండలలో హెబర్ వేలీలో ప్రవేశించిన మొదట స్థిరపడిన వారిలో కొందరు.

1859 లో, వారి భద్రత కొరకు కట్టబడిన హెబర్ కోటను కట్టటానికి థామస్ సహాయపడ్డాడు. అది ప్రత్తి దూది కలప దుంగలు కోట యొక్క చుట్టుకొలతను ఏర్పరుస్తూ, ఒక దానిప్రక్కన మరొకటి ఉంచబడిన సాధారణమైన నిర్మాణము. ఆ ఉమ్మడి గోడను ఉపయోగిస్తూ దుంగలతో చిన్న గదులు కోట లోపల కట్టబడినవి. ఆ అగ్రగామి కుటుంబాలు గృహాలను నిర్మించి, ప్రభువును ఆరాధించుటకు ఆ నిర్మాణము భద్రతను మరియు క్షేమమును రెండిటిని వారికి ఇచ్చెను.

చిత్రం
అగ్రగామి కోట

అది మనకు అదేవిధంగా ఉన్నది. మన గృహాలు లోకము యొక్క దుష్టత్వమునకు వ్యతిరేకముగా ఆశ్రయములుగా ఉన్నాయి. మన గృహాలలో, మనము ఆయన ఆజ్ఞలను పాటించుట ద్వారా, లేఖనాలను అధ్యయనము చేయుట ద్వారా, కలిసి ప్రార్థించుట ద్వారా, నిబంధన బాటపై నిలిచియుండుటకు ఒకరినొకరికి సహాయపడుట ద్వారా క్రీస్తు నొద్దకు వస్తున్నాము. రండి, నన్ను వెంబడించుము పాఠ్యప్రణాళిక ద్వారా గృహములో వ్యక్తిగత మరియు కుటుంబ అధ్యయనముపై క్రొత్త ఉద్ఘాటన “మన పరివర్తనను లోతుగా చేయుటకు మరియు యేసు క్రీస్తు వలే ఎక్కువగా అగుటకు మనకు సహాయపడుటకు,” ఉద్దేశించబడింది.4 ఆవిధంగా చేయుటలో, మన హృదయాలు మరియు ఆత్మలు దేవునితో ఏకమగుటతో పౌలు చెప్పినట్లుగా మనము “నూతన సృష్టి”5 అవుతాము. అపవాది యొక్క ముట్టడులను ఎదుర్కొని మరియు తప్పించుకొనుటకు మనకు ఆ బలము అవసరము.

యేసు క్రీస్తునందు విశ్వాసము వలన కలిగిన సమర్పణతో మనము జీవించినప్పుడు, మనము పరిశుద్ధాత్మ యొక్క శాంతికరమైన సమక్షమును అనుభవిస్తాము, ఆయన మనల్ని సత్యమునకు నడిపించును, ప్రభువు యొక్క దీవెనకు యోగ్యతగా జీవించుటకు మనల్ని ప్రేరేపించును, మరియు దేవుడు జీవిస్తున్నాడని, మనల్ని ప్రేమిస్తున్నారని సాక్ష్యమును వహించును. ఇదంతయు మన గృహముల యొక్క ఆశ్రయము లోపల జరుగును. కాని మన గృహాలు గోడల లోపల మనలో ప్రతీ ఒక్కరి యొక్క ఆత్మీయ బలమున్నంత శక్తివంతమైనవని మాత్రమేనని జ్ఞాపకముంచుకొనుము.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించారు, “రాబోయ దినములలో, పరిశుద్ధాత్మ యొక్క నడిపించి, దారిచూపి, ఆదరించే నిరంతర ప్రభావము లేకుండా, ఆత్మీయంగా బ్రతికియుండుట సాధ్యము కాదు.”6 ఈ కాలములో, ప్రభువు యొక్క ప్రవక్త, దీర్ఘదర్శి, మరియు బయల్పాటుదారునిగా, మన ఆశ్రయ దుర్గమైన యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము పైన కావలివానిగా, ఆయన అపవాది యొక్క కదలికలను చూచును.

సహోదర, సహోదరిలారా, మనుష్యుల ఆత్మల కొరకు సాతానుతో మనము యుద్ధములో ఉన్నాము. భూలోకమునకు ముందు లోకములో ఈ వివాదము యొక్క ప్రత్యర్ధి వర్గాలు నిర్ణయించబడినవి. సాతాను మరియు మన పరలోక తండ్రి యొక్క పిల్లలలో మూడవ భాగము ఆయన ఉన్నతస్థితి వాగ్ధానములను తిరస్కరించారు. అప్పటినుండి, అపవాది యొక్క అనుచరులు, తండ్రి యొక్క ప్రణాళికను ఎన్నుకొన్న విశ్వాసులతో పోరాడుచున్నారు.

సాతాను తన దినములు లెక్కించబడినవని, మరియు ఆవిధంగా చేయుటకు అతడికి ఎక్కువ సమయము లేదని ఎరుగును. అతడు ఎంత యుక్తిగల వాడైనను, అతడు గెలవడు. అయినప్పటికినీ, మనలో ప్రతీ ఒక్కరి ఆత్మల కొరకు అతడి యుద్ధము ఉధృతమగును.

మన భద్రత కొరకు, మనము దుష్టుని చేత ప్రవేశించబడని ఒక ఆశ్రయమును, మన ఆత్మల కొరకు ఆత్మీయత మరియు భద్రతగల ఆశ్రయమును తప్పక నిర్మించాలి.

సాతాను కపటమైన పాము, మన ఆశ్రయములను సడలించినప్పుడు, నిరాశను అనుభవించినప్పుడు, లేక నిరీక్షణను కోల్పోయినప్పుడు, మన మనస్సులు మరియు హృదయాలలోనికి దొంగతనముగా వచ్చును. అతడు మనల్ని ముఖస్తుతి, సులభమైన వాగ్దానము, ఓదార్పు, లేక మనము విచారముగా ఉన్నప్పుడు తాత్కాలికమైన మంచి భావనలతో శోధించును. అతడు గర్వము, నిర్దయ, అవినీతి, అసంతృప్తిని మరియు దుర్నీతినీ న్యాయమని ఒప్పించును మరియు చివరకు మనము “పరిశుద్ధాత్మ చేత ప్రభావితం చేయబడు సామర్ధ్యమును కోల్పోతాము.”7 ఆత్మ మనల్ని విడిచిపెట్టగలదు. “కాబట్టి అపవాది వారి ఆత్మలను మోసపుచ్చును మరియు వారిని జాగ్రత్తగా నరకములోనికి నడిపించి వేయును.”8

వ్యతిరేకముగా, మనము ఇటువంటి మాటలతో దేవునికి స్తుతులను పాడినప్పుడు, మనము తరచుగా ఆత్మను చాలా శక్తివంతముగా అనుభూతి చెందుతాము:

మన దేవుడు ఒక బలమైన దుర్గము.

ఎప్పటికీ విఫలముకానీ బలము యొక్క కోట.

మన దేవుడు ఒక బలమైన సహాయకుడు.

మన శ్రమల పైగా ప్రబలుటకు ఆయన మనకు సహాయపడును.9

మనము ఆత్మీయ బలము యొక్క కోటను నిర్మించినప్పుడు, మనము అపవాది యొక్క శోధనలను తప్పించుకోగలము, అతడిని పూర్తిగా తిరస్కరించగలము, మరియు ఆత్మ యొక్క శాంతిని అనుభవించగలము. మన ప్రభువును, రక్షకుని యొక్క మాదిరిని మనము అనుసరించగలము, ఆయన అరణ్యములో శోధించబడినప్పుడు, “సాతానా వెనుకకు పొమ్ము,”10 అని చెప్పెను. మనము ప్రతీఒక్కరం దానిని ఎలా చేయాలో జీవితపు అనుభవాల ద్వారా నేర్చుకోవాల్సియున్నది.

అటువంటి నీతిగల ఉద్దేశము మోర్మన్ గ్రంథములో సరిగా వివరించబడింది. సేనాధిపతి మొరోనై నీఫైయులను మోసపూరితమైన, రక్తదాహము గల, మరియు ఆధిపత్య దాహముగల అమలిక్యా నుండి ముట్టడులను ఎదుర్కొనుటకు సిద్ధపరచెను. “వారి దేవుని కొరకు జీవించునట్లు మరియు క్రైస్తవుల యొక్క విశ్వాసమును వారి శత్రువుల చేత పిలువబడిన దానిని వారు నిలుపుకొనునట్లు”11 నీఫైయులను కాపాడుటకు మొరోనై కోటలను నిర్మించాడు. మొరోనై “క్రీస్తు యొక్క విశ్వాసమందు స్థిరముగా ఉన్నాడు,”12 మరియు “దేవుని యొక్క ఆజ్ఞలను పాటించుటలో … మరియు దుర్నీతిని ఎదుర్కొనుట యందు,”13 విశ్వాసముగా ఉన్నాడు.

లేమనీయులు యుద్ధమునకు వచ్చినప్పుడు, వారు నీఫైయుల సిద్ధపాటును చూసి విస్మయము చెందారు, మరియు వారు ఓడిపోయారు. నీఫైయులు “వారి శత్రువుల యొక్క చేతుల నుండి, వారిని విడిపించుటలో ఆయన సాటిలేని శక్తిని బట్టి నీఫై యొక్క జనులు ప్రభువైన వారి దేవునికి కృతజ్ఞత చెల్లించిరి.”14 వారు భద్రత కొరకు బయట కోటలను కట్టారు, మరియు వారి ఆత్మలందు లోతుగా---లోపల ప్రభువైన యేసు క్రీస్తునందు వారు విశ్వాసమును నిర్మించారు.

“ఈ గొప్ప పనిని తెచ్చుటకు దేవుని యొక్క చేతులలో మనము సాధనములుగా”15 చేయబడునట్లు కష్టకాలములందు, మనల్ని మనం పటిష్టపరచుకొనగల కొన్ని విధానములేవి? మనము లేఖనములు చూద్దాము.

మనము విధేయులుగా ఉన్నాము. తండ్రియైన లీహైను తన కుమారులను యెరూషలేముకు పంపి, “వృత్తాంతములను కోరి, మరియు వాటిని ఇక్కడకు అరణ్యములోనికి తీసుకొని రావలెనని,”16 ప్రభువు ఆజ్ఞాపించెను. లీహై ప్రశ్నించలేదు; అతడు ఎందుకు లేక ఏవిధంగా అని ఆశ్చర్యపడలేదు. “నేను వెళ్ళి ప్రభువు ఆజ్ఞాపించిన కార్యములను చేయుదును,”17 అని స్పందించిన నీఫై కూడ ప్రశ్నించలేదు.

నీఫై యొక్క సమ్మతిగల విధేయతతో మనము చేస్తామా? లేక ఎవరి విశ్వాసము కొదువుగా ఉండి చివరకు ప్రభువును తిరస్కరించేలా చేసిందో, ఆ నీఫై సహోదరుల వలే, దేవుని యొక్క ఆజ్ఞలను ప్రశ్నించుటకు మనము ఎక్కువ లోబడతామా? “హృదయము యొక్క పరిశుద్ధత,”18 తో సాధన చేయబడిన విధేయత, దానినే ప్రభువు మన నుండి అడుగుచున్నాడు.

వాగ్దాన దేశమునకు ఇశ్రాయేలును నడిపించుటకు యెహోషువా సిద్ధపడినప్పుడు, అతడితో చెప్పిన ప్రభువును మనము నమ్ముతాము, “నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును.”19 యెహోషువా ఆ మాటలను నమ్మాడు మరియు జనులకు సలహా ఇచ్చాడు, “ రేవు యెహోవా మీ మధ్య అద్భుతకార్యములను చేయును, గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి.”20 ప్రభువు యొర్దాను నీళ్ళను వేరు చేసాడు, మరియు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యములో సంచరించుట ముగిసింది.

మోర్మన్ గ్రంధములో ప్రవక్త అబినడై చేసినట్లుగా, సత్యము కొరకు మనము నిలబడదాము. పట్టుకోబడి, రాజైన నోవహు యెదుట మరియు అతడి చెడ్డవారైన యాజకుల యెదుట తేబడి, అబినడై పది ఆజ్ఞలను బోధించాడు మరియు క్రీస్తు “నరుల సంతానము మధ్యకు దిగివచ్చునని, మరియు … తన జనులను విమోచించును,”21 అని శక్తివంతముగా బోధించాడు. తరువాత, అతడు తనలోని లోతైన విశ్వాసముతో, “ఓ దేవా నా ఆత్మను తీసుకొనుము,”22 ప్రకటించాడు మరియు అబినడై “అగ్ని చేత మరణమును అనుభవించెను,”23

చిత్రం
రోమ్, ఇటలీ దేవాలయము

సంస్కారములో పాల్గొనుట మరియు దేవాలయములో ఆరాధించుట ద్వారా మనము నిబంధనలను చేస్తాము మరియు క్రొత్తవిగా చేస్తాము. సంస్కారము మన ఆదివారపు ఆరాధన యొక్క అత్యంత ముఖ్యమైన భాగము, అక్కడ “ఆయన ఆత్మను ఎల్లప్పుడు (మనతో) కలిగియుండుటకు,”24 వాగ్దానమును పొందుతున్నాము. ఆ పరిశుద్ధ విధితో మనము యేసు క్రీస్తు నామమును మనపై తీసుకొనుటకు, ఆయనను వెంబడించుటకు, మరియు ఆయన చేసిన విధానములో ఈ దైవిక కార్యములో మన బాధ్యతలను అంగీకరించుటకు మనము ఒడంబడిక చేస్తున్నాము. దేవాలయమలో మనము “ఈ లోక విషయములను గూర్చి చింతించకుండా ఉండగలము,”25 మరియు ప్రభువు యొక్క సన్నిధిని మరియు ఆయన అత్యంత గొప్ప శాంతిని అనుభవిస్తాము. మనము మన పూర్వీకులు, మన కుటుంబాలు, మరియు తండ్రి యొక్క సన్నిధిలో నిత్యజీవముపై దృష్టిసారించగలము. ఇటీవల రోమ్‌లో అధ్యక్షలు నెల్సన్ ఇలా వ్యాఖ్యానించుటలో ఆశ్చర్యము లేదు, “ఈ దేవాలయము నుండి వచ్చు మేలు మనకు లెక్కలేనంత గొప్పది.”26

మనము చేయు సమస్తములో మనము న్యాయబుద్ధిని కలిగియుండాలి. మనము వివేకమును మరియు క్రమశిక్షణను వృద్ధి చేయాలి ఆవిధంగా మనము ఏది మంచిది, ఏది చెడ్డదో నిరంతరము తీర్మానించనవసరము లేదు. ప్రాచీన సంఘ అపొస్తులుడైన పేతురు హెచ్చరికను మనము స్థిరముగా నమ్మాలి, అతడిలా హెచ్చరించాడు, “నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలే ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.”27

మన కట్టడలను మనము శ్రద్ధగా బలపరచినప్పుడు, ఆయన భద్రతలో మన ఆత్మలతో, ఆయన నిజమైన శిష్యులుగా, మనము యేసు క్రీస్తు వలే అవుతాము.

యేసు క్రీస్తును గూర్చి మీ సాక్ష్యము మీ వ్యక్తిగత ఆశ్రయము, మీ ఆత్మ కొరకు భద్రత. మా ముత్తాత మరియు అతడి సహ అగ్రగాములు హెబర్ దుర్గమును కట్టినప్పుడు, వారు “చక్కగా అమర్చబడేంత వరకు”28 ఒక్కొక్క దుంగను ఒక్కొక్కసారి ఉంచారు మరియు వారు కాపాడబడ్డారు. అది సాక్ష్యముతో ఆవిధముగా ఉన్నది. “అంతరంగములో సత్యమును ”29 బోధిస్తూ, మన స్వంత ఆత్మతో ఆయన మాట్లాడినప్పుడు, ఒకరి తరువాత ఒకరు మనము పరిశుద్ధాత్మ నుండి ఒక సాక్ష్యమును పొందుతాము. మనము యేసు క్రీస్తు యొక్క సువార్తను జీవించినప్పుడు, రక్షకుని యొక్క ప్రాయశ్చిత్తఃమును ఉపయోగించి, భయముతో కాదు, విశ్వాసముతో ముందుకు త్రోసుకొనిపోయినప్పుడు, అపవాది యొక్క వలలకు వ్యతిరేకంగా బలపరచబడతాము. మన సాక్ష్యములు మనల్ని పరలోకములతో జతపరచును, మరియు మనము “అన్ని సంగతుల యొక్క సత్యముతో” దీవించబడతాము.”30 మరియు, ఒక కోట ద్వారా అగ్రగాములు కాపాడబడినట్లుగా, మనము రక్షకుని యొక్క ప్రేమగల బాహువులందు క్షేమముగా చుట్టబడతాము.

ప్రవక్త ఈథర్ బోధించాడు, “అందువలన, దేవుని యందు విశ్వాసముంచు వాడెవడైనను, నిశ్చయముతో ఒక మేలైన లోకము అవును, దేవుని యొక్క కుడిచేతి వైపున ఒక స్థలము కొరకు కూడ నిరీక్షించును. ఆ నిరీక్షణ విశ్వాసమును బట్టి వచ్చును. మనుష్యుల యొక్క ఆత్మలకు లంగరును చేయును. అది వారిని నిశ్చయము మరియు నిలకడగా ఎల్లప్పుడు సత్‌క్రియలలో వృద్ధి పొందుచూ దేవునిని మహిమపరచుటకు నడిపింపబడునట్లు చేయును.”31

నా ప్రియమైన సహోదర, సహోదరిలారా, ప్రభువు మరియు ఆయన సువార్తయందు విశ్వాసముతో ముందుకు సాగిపోవుటకు నా దీవెనను మీతో వదలుచున్నాను. తొట్రిల్లు వారి చుట్టూ మీ చేతులను ఉంచుము, మీలోపల ఉన్న ఆత్మ యొక్క బలముతో, వారిని ఆత్మీయత మరియు భద్రత యొక్క కోటకు ప్రేమగా వెనుకకు నడిపించుము. మీరు చేయు సమస్తములో, “యేసు వలే ఉండుటకు”32 కోరుము, చెడును మరియు శోధనలను తిరస్కరించుము, హృదయములో నిజాయితీగా ఉండుము, నీతిగా, శుద్ధిగా ఉండుము, కనికరమును మరియు దాతృత్వమును చూపుము, మరియు ఒక నిజమైన శిష్యుని యొక్క సమర్పణతో మీ దేవుడైన ప్రభువును ప్రేమించుము.

యేసు క్రీస్తు యొక్క సువార్తను గూర్చి మన సాక్ష్యములు, మన గృహాలు, మన కుటుంబాలు, మరియు యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘములో మన సభ్యత్వము మనల్ని చుట్టుకొని మరియు దుష్టుని యొక్క శక్తి నుండి మనల్ని కాపాడుతూ, మన భద్రత యొక్క వ్యక్తిగత ఆశ్రయములుగా ఉండగలవు. దీనిని గూర్చి, మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా గంభీరమైన సాక్ష్యమిస్తున్నాము, ఆమేన్.

ముద్రించు