2010–2019
దేవుని తక్షణపు మంచితనము
2019 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము.


దేవుని తక్షణపు మంచితనము

మనం సహనముగా ప్రభువు గురించి వేచి చూస్తున్నప్పటికి, కొన్ని నిర్ధిష్టమైన దీవెనలు మనకు వెంటనే వచ్చును.

అనేక సంవత్సరాల క్రితం, మా ఐదు సంవత్సరాల వయస్సుగల కుమారుడు, నా దగ్గరకు వచ్చి, “నాన్న నేను ఒక విషయాన్ని కనుగొన్నాను“ అని ప్రకటించాడు. నీకు త్వరగా అంటే నాకు చాలా ఎక్కువ సమయము అని నేను కనుగొన్నాను.“

ప్రభువు మరియు ఆయన సేవకులు “కొద్ది దినములలోగా“ లేదా “ఆ సమయము ఎంతో దూరములో లేదు“ అని చెప్పినప్పుడు, జీవితకాలము లేదా చాలాకాలము అని అర్థము కావచ్చును.1 ఆయన కాలము, ఆయన అనుకూల సమయము తరచు మనకంటే భిన్నముగా ఉంటాయి. సహనమే కీలకము. అది లేకుండా, మనము అభివృద్ధి చెందలేము లేదా జీవమునకు మరియు రక్షణకు కావలసిన దేవునియందు విశ్వాసమును చూపించలేము. నేడు నా సందేశము ఏమిటంటే, మనం సహనముగా ప్రభువు గురించి వేచి చూస్తున్నప్పటికి, కొన్ని నిర్ధిష్టమైన దీవెనలు మనకు వెంటనే వచ్చును.

ఆల్మా మరియు అతని జనులు లేమనీయుల చేత బంధింపబడినప్పుడు, విడుదల కోసం వారు ప్రార్థన చేసారు. వారు వెంటనే విడిపించబడ లేదు కాని, వారు సహనముతో విడుదల కోసం వేచి యున్నప్పుడు, కొన్ని నిర్ధిష్టమైన తక్షణ దీవెనలు ఇచ్చుట ద్వారా ప్రభువు ఆయన మంచితనమును చూపించెను. లేమనీయులు వారిని చంపకుండా వెంటనే ఆయన వారి హృదయాలను మృదువుగా చేసెను. ఆయన ఆల్మా జనులను బలపరచి, వారి భారాలను తేలిక చేసెను. 2 వారు చివరకు విడిపించబడినప్పుడు, వారు జారహెమ్లకు ప్రయాణము చేసి, అబ్బురపడుచున్న ప్రేక్షకులకు వారి అనుభవమును వివరించారు. జారహెమ్ల జనులు ఆశ్చర్యపడి, “దేవుని తక్షణపు మంచితనము మరియు . . . దాస్యము నుండి ఆల్మా మరియు అతని సహోదరులను విడిపించుటలో ఆయన శక్తిని వారు తలంచినప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుటలో వారు తమ స్వరములను ఎత్తిరి.“3

దేవుని తక్షణపు మంచితనము ఆయనను చిత్తశుద్ధితో, హృదయము యొక్క పూర్ణ ఉద్దేశముతో ప్రార్థించువారందరికి కలుగును. యధార్థముగా నిరాశలోనుండి, విడుదల సుదూరములో ఉన్నట్లు, బాధ దీర్ఘకాాలము, ఖఠినముగా ఉన్నట్లు అనిపించినప్పుడు మొరపెట్టుకొను వారికి కూడా ఇది వర్తించును.

భూచెరశాలలో చిత్తడినేల అంచున శ్రమపడుతు “ఓ దేవా, నీవెక్కడ ఉన్నావు?“ అని చివరకు మొరపెట్టకుముందు ఒక యౌవన ప్రవక్త పరిస్థితి కూడా విధముగానే ఉండెను. నీ హస్తము ఎంతకాలము సహాయము చేయకుండా ఉండును ...? అవును ప్రభువా, ఇది ఎంతకాలము వరకు ఉండును … ? 4 జవాబుగా ప్రభువు వెంటనే జోసెఫ్‌ను విడుదల చెయ్యలేదు కాని, ఆయన వెంటనే శాంతిని ప్రకటించెను. 5

తరువాత కలిగే విడుదలకు తక్షణపు నిరీక్షణను కూడా దేవుడు ఇచ్చును.6 ఏది, ఎక్కడ ఏమైనప్పటికి క్రీస్తులో, క్రీస్తు ద్వారా ఎల్లప్పుడు నిరీక్షణ మన యెదుట కాంతివంతముగా చిరునవ్వుతో ఉండును.7 తక్షణమే మన యెదుట ఉండును.

అంతేకాక “నా దయ నీ యెదుట నుండి తొలగిపోదు“ 8 అని ఆయన వాగ్దానము చేసెను.

అన్నింటికి మించి, దేవుని ప్రేమ తక్షణమైనది. ఏవియు “మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని“ 9 పౌలుతో పాటు నేను సాక్ష్యమిస్తున్నాను. మన పాపములు ఆయన ఆత్మనుండి వేరుచేయవచ్చునేమో గాని స్థిరమైన, తక్షణమైన ఆయన ప్రేమనుండి మనల్ని వేరు చెయ్యలేదు.

ఇవి “ఆయన తక్షణమే మనలను దీవించే“ 10 కొన్ని మార్గాలు, ఉపాాయాలు. ఈ సూత్రములు నేటికి దగ్గరగా తీసుకొని వచ్చుటకు, ఇద్దరి వ్యక్తుల అనుభవాలను నేను మీతో పంచుకుంటాను, వారి జీవితాలు దేవుని తక్షణపు మంచితనమునకు నిబంధనలుగా ఉంటాయి.

ఎమిలీ యౌవనము నుంచి కూడా మత్తుపదార్థాల వ్యసనముతో ప్రయాసపడింది. ప్రయోగము అలవాటుగా మారి, చివరకది వ్యసనముగా మారి, కొన్ని కాలవ్యవధులలో ఆరోగ్యముగా ఉండుట తప్ప అనేక సంవత్సరాలు ఆమెను బానిసత్వములో ఉంచిది. ఎమిలీ మరిముఖ్యముగా తాను భార్య మరియు తల్లి అయినప్పుడు జాగ్రత్తగా తన సమస్యను దాచిపెట్టింది.

ఆమె విడుదల యొక్క ఆరంభము, అసలు విడుదలలా అనిపించలేదు. ఒక్క నిమిషము ఎమిలీ నియమిత ఆరోగ్య పరీక్షను ఎదుర్కొన్నప్పుడు, ఆమె ఆంబ్యులెన్స్ ద్వారా ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందే సదుపాయముగల గదిలోనికి ఆమె తీసుకొని వెళ్ళబడింది. తన పిల్లలు, తన భర్త, తన గృహమునుండి వేరుచేయబడతాను అని ఆమె ఆలోచించినప్పుడు భయాందోళనకు గురైయింది.

ఆ రాత్రి ఎమిలీ ఒంటరిగా చలి, చీకటిగల ఆ గదిలో తన మంచముపైన మెలికలు తిరిగి ఎక్కి ఎక్కి యేడ్చింది. తర్కించు ఆమె సామర్థ్యము తగ్గిపోయి, చివరకు ఆందోళన, భయము మరియు ఆ గదలో ఆమె ఆత్మలో క్రూరమైన చీకటితో జయించబడి, వాస్తవానికి ఆ రాత్రి తాను చనిపోతానని ఎమిలీ అనుకొన్నది. ఆమె ఒంటరిగా ఉండెను.

ఆ నిరాశగల స్థితిలో తన బలాన్నంతా కూడగట్టుకొని మంచముపైనుండి క్రిందకు దొర్లి తన మోకాళ్లపై నిలబడెను. మన గత ప్రార్థనలలో కొన్నిసార్లు భాగమైన ఏవిధమైన భంగిమలో ఉండకుండానే, “ప్రియమైన దేవుడా, నువ్వు నాకు కావాలి“ అని నిరాశతో వేడుకొన్నప్పుడు పూర్తిగా తనను తాను ప్రభువుకు సమర్పించుకొనెను. నాకు సహాయము చెయ్యండి. నాకు ఒంటరిగా ఉండాలని లేదు. ఈ రాత్రినుండి బయట పడేలా చెయ్యండి.“

తక్షణమే, పూర్వకాలపు పేతురుకు చేసినట్లే, యేసు తన చెయ్యి చాపి, మునిగిపోతున్న ఆమె ఆత్మను పట్టుకొనెను.11 ఎమిలీపైకి అద్భుతమైన నెమ్మది, ధైర్యము, అభయము మరియు ప్రేమ దిగివచ్చెను. ఆ గదిలో ఇంకేమాత్రము చలి లేదు, ఆమె ఒంటరిగా లేదని తనకు తెలుసు, ఆమెకు 14 సంవత్సరాల వయసున్నప్పటినుండి మొదటి సారిగా అంతా మంచిగా ఉంటుందని ఎమిలీ తెలుసుకున్నది. ఆమె “దేవునిలో మేల్కొనినప్పుడు“12 ఎమిలీ శాంతితో నిద్రలోకి జారుకొనెను. “మీరు పశ్చాత్తాపము పొంది, మరియు మీ హృదయములను కఠినపరుచకొనక యుండిన యెడల, వెంటనే విమోచన యొక్క గొప్ప ప్రణాళిక మీకు తేబడును.“13

చిత్రం
దేవాలయము వద్ద కుటుంబము

ఎమిలీ స్వస్థతకు, చివరకు విడుదలకు సమయము పట్టింది-నెలల తరబడి చికిత్స, తర్ఫీదు, సలహాసమావేశము, ఆ సమయములో ఆమె పడిపోకుండా నిలబడింది మరియు కొన్నిసార్లు ఆయన తక్షణపు మంచితనము వలన బలపరచబడింది. ఆమె తన భర్త మరియు ఇద్దరు పిల్లలతో నిరంతరము ముద్రించబడుటకు దేవాలయములో ప్రవేశించగా, ఆయన యొక్క మంచితనము ఆమె యెడల కొనసాగింది. జారహెమ్ల జనులవలె, ఎమిలీ ఇప్పుడు దేవుని తక్షణపు మంచితనమును, బానిసత్వము నుండి విడిపించుటలో ఆయన శక్తిని తలచుకున్నప్పుడు ఆమె కృతజ్ఞత తెలియజేయును.

ఇప్పుడు, ఇంకొక ధైర్యముగల విశ్వాసి యొక్క జీవితము నుండి తెలుసుకుందాం. 2013, డిసెంబర్ 27వ తేదీన, అలిషియా ష్రోడర్ తన ప్రియమైన స్నేహితులైన సీన్ మరియు షార్లా చిల్కోట్‌లు అనుకోకుండా తన తలుపు తట్టినప్పుడు ఆనందంగా వారిని ఇంటిలోనికి ఆహ్వానించింది. అలిషియా యొక్క బిషప్పు యైన సీన్, ఆయన సెల్ ఫోన్ ఆమెకు ఇచ్చి, “అలీషియా, మేము నిన్ను ప్రేమిస్తున్నాము“ అని చెప్పెను. నువ్వు ఈ ఫోన్లో ఉన్న వ్యక్తితో మాట్లాడాలి.“

అలిషియా భర్తయైన మారియో ఫోన్లో ఉన్నారు. ఆయన వారి పిల్లలలో కొందరితో ఎప్పటినుంచో అనుకుంటున్న మంచువాహన యాత్రలో మారుమూల ప్రాంతములో ఉండెను. అక్కడ భయంకరమైన ప్రమాదము జరిగెను. మారియో తీవ్రముగా గాయపడెను మరియు వారి 10 సంవత్సరాల కుమారుడైన కాలేబ్ మరణించెను. కాలేబ్ మరణము గురించి మారియో అలిషియాకు చెప్పినప్పుడు, మనలో కొంతమందికే తెలిసిన తీవ్ర విభ్రాంతి, దుఃఖమునకు ఆమె గురైయ్యెను. ఆ వార్త విని ఆమె కుప్పకూలిపోయింది. మాటలతో వర్ణించలేని వేదనతో పక్షవాతముతో అలిషియా మాట్లాడలేక, కదలలేక పోయింది.

బిషప్పు మరియు సహోదరి చిల్కోట్ ముందుకొచ్చి, ఆమెను లేపి పట్టుకొన్నారు. వారు ఏడ్చి, కొంతసేపు కలిసి తీవ్రంగా దుఃఖించారు. తరువాత బిషప్పు చిల్కోట్ అలిషియాకు దీవెన ఇస్తానని చెప్పారు.

తరువాత ఏమి జరిగిందో తెలుసుకోవాలంటే యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము మరియు దేవుని తక్షణ మంచితనము గురించి కొంత అవగాహన లేకుండా అది సాధ్యము కాదు. బిషప్పు చిల్కోట్ మృదువుగా అలిషియా తలపై తనచేతులుంచి, వణుకుచున్న స్వరముతో మాట్లాడుట మొదలుపెట్టెను. దేవుడు ఆయనే స్వయముగా మాట్లాడుచున్నట్లు అలిషియా రెండు విషయాలను వినెను. మొదట ఆమె పేరు అలిషియా సూసన్ ష్రోడర్ అని వినెను. తరువాత సర్వశక్తిమంతుడైన దేవుని అధికారమును బిషప్పు ఆరోపించుటను ఆమె వినెను. ఆ క్షణములో-ఆమె పేరును, దేవుని శక్తిని కేవలం ఉచ్ఛరించుట ద్వారా-ఆలిషియా వర్ణించలేని శాంతి, ప్రేమ, సమాధానము మరియు ఏదోవిధంగా సంతోషముతో నింపబడెను. మరియు అది ఆమెతో ఉంటూ ఉండెను.

ఇప్పుడు, అలిషియా, మారియో మరియు వారి కుటుంబము కాలేబ్ గురించి ఇంకా దుఃఖిస్తారు మరియు అతనిని కోల్పోయినట్లు భావిస్తారు. ఇది చాల కష్టమైనది! నెనెప్పుడు వారితో మాట్లాడినను, ఆమె కళ్ళు కన్నీటితో నిండి, ఆమె తన అబ్బాయిని ఎంతగా ప్రేమించెనో, ఎంతగా తనను కోల్పోయెనో నాకు చెప్పును. ఆమె కఠిన పరీక్ష యొక్క ప్రతి అడుగులో ఆ గొప్ప విమోచనకర్త ఏవిధంగా తనను బలపరచెనో, ఆమె ఘోరమైన నిరాశ సమయంలో ఆయన తక్షణపు మంచితనముతో మొదలుకొని “ఇంకా ఎక్కువ దినాలు కాని“ మధుర కలయిక యొక్క ప్రకాశవంతమైన నిరీక్షణతో ఇప్పుడు కొనసాగు సమయము వరకు ఏవిధంగా తనను బలపరచెనో ఆమె చెప్పుచున్నప్పుడు ఆమె కంట తడి అలానే ఉంటుంది.

ఎమిలీ మరియు అలిషియాలకు కలిగిన ఉపశమనమును పొందుటకు లేదా అర్థము చేసుకొనుటకు కష్టతరముగా ఉండే అలజడి మరియు గందరగోళములను కొన్ని సార్లు జీవతపు అనుభవాలు తెచ్చునని నాకు తెలుసు. నేను అటువంటి సందర్భాలలో ఉన్నాను. అటువంటి సమయాలలో, కేవలం మనం పరిరక్షించబడటం అనేది దేవుని తక్షణపు మంచితనమునకు మృదువైన, శక్తివంతమైన ప్రత్యక్షతకు నిదర్శనమని నేను సాక్ష్యమిచ్చుచున్నాను. ప్రాచీన ఇశ్రాయేలీయులు వారిని అనుదినము 14 “కాపాడిన ఆ దేవుని వలననే“ చివరకు విడిపించబడ్డారని జ్ఞాపకము చేసుకోండి.

యేసు క్రీస్తు గొప్ప విమోచన కారుడని నేను సాక్ష్యమిచ్చుచున్నాను మరియు మీరు చిత్తశుద్ధితో, హృదయము యొక్క పూర్ణ ఉద్దేశముతో ఆయనవైపు తిరిగినప్పుడు, మీ జీవితమును లేదా మీ సంతోషమును అంధకారము లేదా నాశనము చేయునని భయపెట్టు సమస్తమునుండి మిమ్ములను విడిపించునని ఆయన నామములో వాగ్దానము చేయుచున్నాను. ఆ విడుదలకు మీరు అనుకున్నదానికంటే ఎక్కువ సమయము-అనగా జీవితకాలము లేదా ఎక్కువ సమయము పట్టవచ్చును. ఆ అంతిమ విడుదల దినము వరకు పడిపోకుండా మిమ్ములను నిలిపి, బలపరచి, మీకు ఓదార్పు, అభయము, నిరీక్షణ ఇచ్చుటకు దేవుని తక్షణపు మంచితనము మీకు సిఫారసు చేస్తూ, సాక్షమిస్తున్నాను, యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

ముద్రించు