యేసు క్రీస్తు వైపు చూడుము
యేసు క్రీస్తు వైపు మనం చూచినట్లైతే, ఆయన మన నిబంధనలయందు జీవించుటకు సహాయము చేయును మరియు ఇశ్రాయేలు పెద్దలవలె మన పిలుపును ఘన పరచును.
కపెర్నహోము దగ్గర ఓక వీధిలో యేసు నడచుచుండగా1 గొప్ప జన సమూహము ఆయన చుట్టూనుండగా, ఒక స్త్రీ తీవ్రమైన స్థితిలో పన్నెండు ఏండ్లుగా బాధపడుచు ఆయన వస్త్రపు చెంగును అందుకొని తాకెను. వెంటనే ఆమె స్వస్థపరచబడెను.2
“[ప్రభావము] [తనలో]నుండి బయల్వెడలినదని యేసు గ్రహించి“3 జనులు త్రోయుచున్నప్పటికీ వెనుకకు తిరిగి“ 4 “ఇట్లు చేసిన ఆమెను దృష్టించి చూచెను.“ 5 తాను మరుగైయుండ లేదని ఆ స్త్రీ చూచి 6 “ఆయన ఎదుట సాగిలపడి నిజము అంతయు చెప్పెను.“ 7
యేసు ఆమెతో కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము కలదానవై పొమ్మని ఆమెతో చెప్పెను.“ 8
యేసు క్రీస్తు ఆ స్త్రీని రక్షించెను. ఆమె శారీరకముగా స్వస్థపరచబడెను కాని, యేసు ఆమె వైపు తిరిగి చూచినప్పుడు ఆయనయందు తన విశ్వాసమును ఆమె ప్రకటించెను మరియు అయన ఆమె హృదయమును స్వస్థపరచెను.9 ఆయన ఆమెతో ప్రేమగా మాట్లాడెను.,తన ఆమోదమును ధృవపరచెను, మరియు తన సమాధానముతో ఆశీర్వదించెను. 10
సహోదరులారా, పరిశుద్ధ యాజకత్వమును పొందిన మనము రక్షణ కార్యములో నిమగ్నమై యున్నాము. గత సంవత్సరములో ప్రభువు ఈ కార్యమునకు నాయకత్వమును ఇశ్రాయేలులోని పెద్దల భుజములపై తీర్మానించి నిలిపెను. 11 ప్రభువునుండి ఒక స్ఫూర్తిదాయకమైన బాధ్యత మనము పొందియున్నాము -- మన సహోదరీలతో పనిచేయునప్పుడుమనము మరింత పవిత్రమైన విధముగా పరిచర్య చేయవలసి యున్నది, తెరకు ఇరువైపుల ఇశ్రాయేలు కూడుకొనుటను వేగవంతము చేయుచు, మన గృహములను విశ్వాసమునకు, సువార్త జ్ఞానమునకు శరణ్యములుగా స్థాపించుచు, ప్రపంచమును యేసు క్రీస్తు రెండవ రాకడకు సిద్ధపరచవలసి యున్నది. 12
అన్ని విషయములలోనూ రక్షకుడు మనకు మార్గము చూపియున్నాడు. ఆయన తన తండ్రి వైపు చూఛి ఆయనకు సేవ చేసియున్నాడు కనుక మనము యేసు క్రీస్తు వైపు చూఛి సేవ చేయవలసి యున్నది. 13 రక్షకుడు ప్రవక్త జోసెఫ్ తో దీనిని ఈ విధముగా చెప్పియున్నాడు.
“భయపడకుడి, అనుమానించకుడి, ప్రతి ఆలోచన యందును, నా వైపు చూడుడి.
“నా ప్రక్కలో పొడిచిన గాయములను చూడుడి, మరియు నా చేతులలో ను, పాదములలోను మేకుల గుర్తులు చూడుడి;విశ్వాసము కలిగి నా ఆజ్ఞలను పాటించూడి, మరియు మీరు పరలోక రాజ్యమునకు వారసులు కాగలరు.“ 14
మనకు రక్షకునిగాను మరియు విమోచకునిగాను తన తండ్రి చిత్తమును నేరవేర్చెదనని మర్త్య పూర్వపు రాజ్యములో యేసు తన తండ్రికి వాగ్దానము చేసెను “నేను ఎవరిని పంపుదును?“ అని ఆయన తండ్రి అడిగినపుడు 15 యేసు సమాధానమిచ్చెను:
“ఇదిగో నేనున్నాను, నన్ను పంపుము.“ అని యేసు ఉత్తరమిచ్చెను. 16
“తండ్రీ, నీ చిత్తము నెరవేరును గాక, మరియు ఆ ఘనత నిరంతరము నీకు చెందును.“ 17
యేసు తన మర్త్య జీవితమంతయు ఆ వాగ్దానము ప్రకారము జీవించెను. దీనత్వముతోను, సాత్వీకముతోను, మరియు ప్రేమతోను ఆయన తన తండ్రి సిద్దాంతములను బోధించెను మరియు తన తండ్రి ఇచ్చిన శక్తితోను, అధికారముతోను తన తండ్రి కార్యమును నెరవేర్చెను. 18
యేసు తన హృదయమును తన తండ్రికి సమర్పించెను ఆయన చెప్పెను:
“నేను తండ్రిని ప్రేమించుచున్నాను.“19
“నేను ఎల్లప్పుడూ ఆయన కిష్టమైన వాటిని చేయుదును.“20
“నా స్వంత చిత్తమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు కాని, నన్ను పంపిన తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చితిని.“ 21
“అయినను నా చిత్తము కాదు కాని, నీ చిత్తమే నెరవేరును గాక“ అని గెత్సెేమనే తోటలో వేదనపడుచు ఆయన ప్రార్దించెను. 22
“ప్రతి ఆలోచన యందును నా వైపు చూడుడి“ మరియు ఆయన పునరుత్థాన శరీరములోని “గాయములను చూడుడి“ అని ప్రభువు ఇశ్రాయేలు పెద్దలను పిలుచునపుడు అది పాపమునుండి మరియు ఇహలోకమునుండి మరలుకొని ఆయనవైపు తిరిగి మరియు ఆయనను ప్రేమించి విధేయులు కావలెనను పిలుపైయున్నది. ఆయన సిద్ధాంతమును బోధించుటకును ఆయన మార్గములోను ఆయన కార్యమును జరిగించుటకునైన పిలుపైయున్నది. ఆయనయందు పరిపూర్ణ విశ్వాసముతో మన చిత్తమును ఆయనకు లోబరచి మన హృదయములను ఆయనకు సమర్పించి, మరియు ఆయన యొక్క విమోచనా శక్తి ద్వారా ఆయనవలె పరివర్తన చెందవలెననుటకు ఒక పిలుపైయున్నది. 23
సహోదరులారా, మనము యేసు క్రీస్తు వైపు చూచిన యెడల ఆయన మనలను--వినయము, సాత్వీకము, అణకువ, ఆయన యొక్క ప్రేమతో నింపబడిన ఇశ్రాయేలు పెద్దలవలె అగునట్లు ఆశీర్వదించును. 24 ఆయన సువార్త యొక్కయు, ఆయన సంఘముయొక్కయు ఆనందమును, ఆశీర్వాదమును మన కుటుంబములకు మరియు ఆ తెరకు ఇరువైపులా నున్న సహోదరులకు మరియు సహోదరీలకు తీసుకొని వచ్చెదము.
ఈ విధంగా యేసు క్రీస్తు వైపునకు చూడాలని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మనకు పిలుపు ఇచ్చారు: “అటువంటి శక్తివంతమైన శిష్యులుగా మారాలంటే అంత సులభము కాదు లేదా దానికదే జరిగేది కాదు. రక్షకుని మీదను మరియు ఆయన సువార్తమీదను మన దృష్టి స్థిరపరచబడవలెను.. మానసికంగా ప్రతిఆలోచనలోను ఆయన వైపు చూచుటకు తీవ్రంగా శ్రమించవలసియుండును.. కాని మనము చేసినపుడు మన సందేహములు, భయములు ఎగిరిపోవును.25”
అతుకబడుట ఒక గొప్ప మాట. దాని అర్ధము స్థిరముగా అతుకబడుట, ఆకర్షింపబడి మరియు పూర్తిగా పట్టుకొనుట. 26 మన నిబంధనలో జీవించుటద్వారా మన దృష్టిని యేసు క్రీస్తు మీద మరియు ఆయన సువార్త మీద అతుక బడవలెను.
మనము మన నిబంధనల కొరకు జీవింఛినపుడు అవి మనయొక్క ప్రతి మాటను, ప్రతి కార్యమును ప్రభావితం చేయును మనము నిబంధన జీవితము జీవించుచున్నాము.27 యేసు క్రీస్తు మీద కేంద్రీకరించు సామాన్యమైన అనుదిన విశ్వాస కార్యములతో నిండిన: హృదయపూర్వక ప్రార్ధన ఆయన నామమున, ఆయనయొక్క మాటలను విందారగించుచు , ఆయన వైపు తిరుగుచు, మన పాపముల కొరకు పశ్చాత్తాపపడుచు, ఆయనయొక్క ఆజ్ఞలు పాటించుచు, సంస్కారములో పాల్గొనుచు, మరియు ఆయన యొక్క సబ్బాతును పరిశుద్ధముగా ఆచరించుచు, ఆయన యొక్క పరిశుద్ధ ఆలయములో సాధ్యమైనంత తరచు ఆరాధించుచు, మరియు ఆయన యొక్క పరిశుద్ధ యాజకత్వమును దేవుని బిడ్డలకు సేవ చేయుటకు అభ్యసించుచునుండుట.
ఈ నిబంధన భక్తికార్యములు మన హృదయములను మరియు మన మనసులను రక్షకుని విమోచనా శక్తికి, మరియు పరిశుద్ధాత్మ యొక్క శుద్దీకరించు ప్రభావమునకు తెరచును. గీత వెంబడి గీత దాటుచు రక్షకుడు మన స్వభావమును మార్చివేయును, మనము మరి ఎక్కువ లోతుగా ఆయన వైపు మార్పుచెందుదుము. మరియు మన నిబంధనలు మన హృదయములలో జీవము నొందును. 28
మన పరలోకతండ్రికి మనముచేయు వాగ్దానములు రాతి వంటి గట్టి తీర్మానములు, మన లోతైన ఆశలు. మనలను కృతజ్ఞత మరియు ఆనందముతో నింపుటకు మన పరలోక తండ్రి మనకు వాగ్దానము చేయుచున్నాడు. 29 మన నిబంధనలు మనము అనుసరించవలసిన శాసనములవలె కాకుండును. మరియు మనలను ప్రేరేపించి నడిపించుచు మన దృష్టిని యేసు క్రీస్తు నందు స్థిరపరచు ప్రియమైన సూత్రములవలే మారును.30
ఈ భక్తి కార్యములు అందరికి అందుబాటులోనుండును, పడుచువారికిని మరియు వృద్ధులకును యువకులు మీలో ఎవరైతే పరిశుద్ధ ఆహారోను యాజకత్వము పొందియున్నారో వారికి ఈ రాత్రి నేను చెప్పిన ప్రతి విషయము వర్తిస్తుంది. మీ కొరకు దేవునికి కృతజ్ఞతలు. మీరు మిలియన్ల మంది కడవరి దిన పరిశుద్ధులకులభించు పవిత్రమైన విధులను, నిబంధనలను ఆచరించుదురు. మీరు సిద్ధపరచి, దీవించి, లేక, సంస్కారము అందించి; దేవాలయములో పరిచర్య;; చేసి బాప్తీస్మము ఆచరించి; స్నేహితులను సంఘములో ఇతర కార్యక్రమాలకు ఆహ్వానింఛి; లేక మీ కూటములో ఓక సభ్యునికి దారిచూపి నప్పుడు మీరు రక్షణ కార్యమును చేయుచున్నారు. మీరు కూడా యేసు క్రీస్తువైపు చూచి మీ నిబంధనలయందు జీవించ గలరు. మీరు ఆచరించినట్లయితే మీరు ప్రభువు యొక్క నమ్మకమైన సేవకులుగా ఇప్పుడు మరియు రాబోవు రోజున, ఘనులైన ఇశ్రాయేలు పెద్దలు అగుదురని మీకు వాగ్దానము చేయుచున్నాను.
సహోదరులారా, ఇవన్నీ భయపెట్టునట్లు ధ్వనిస్తున్నవని నాకు తెలుసును. ఐతే, దయచేసి రక్షకుని ఈ మాటలు జ్ఞాపకముంచుకొనుడి: “నేను ఒంటరిగా లేను, ఎందుచేతనంటే తండ్రి నాతో ఉన్నాడు.“ 31 అలాగే మనతోనూ. మనము ఒంటరిగాలేము. ప్రభువైన యేసు క్రీస్తు మరియు మన పరలోక తండ్రి మనలను ప్రేమించుచున్నారు. మరియు వారు మనతో నున్నారు.32 యేసు తన తండ్రివైపు చూచెను మరియు ఆ గొప్ప విమోచన బలిదానమును సంపూర్తి చేసెను. ఆయన మనకు సహాయము చేయుననెడి హామీతో యేసు క్రీస్తువైపు చూడవచ్చును.
మనలో ఎవరును పరిపూర్ణులు కారు. కొన్నిసమయాలలో మనము ఇరుకున పడతాము.. మనము గురితప్పిపోవుదుము లేక నిరుత్సాహపడుదుము. మనము తొట్రిల్లుదుము. కాని మనము యేసు క్రీస్తు వైపు పశ్చాత్తప్త హృదయముతో చూచినయెడల ఆయన మనలను లేవనెత్తును,పాపమునుండి కడిగి, క్షమించును, మరియు మన హృదయములను స్వస్థ పరచును. ఆయన సహనము, దయకలవాడు; ఆయన యొక్క విమోచించు ప్రేమ ఎన్నడును అంతము కాదు మరియు భంగము కాదు. 33 ఆయన మన నిబంధనలయందు జీవించుటకు సహాయము చేయును మరియు ఇశ్రాయేలు పెద్దలవలె మన పిలుపును ఘన పరచును.
మరియు మనము ఆయన ఉద్దేశ్యము నెరవేర్చుటకు కావలసిన వాటన్నిటితో: “పరలోకమునందు మరియు భూమియందు రెండు చోట్లను తండ్రి యొక్క చిత్తము చొప్పున ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా పంప బడిన జీవము మరియు వెలుగు , ఆత్మ మరియు శక్తితో ఆ తండ్రి మనలను దీవించును.“ 34
దివ్యకాంతి, మరియు శక్తి మన జీవితాలలోనికి ప్రవహించునప్పుడు మూడు అద్భుతమైనవి జరుగును.
మొదట మనము చూడగలము! యేసు ఆ స్త్రీని పై స్వరూపమునకు మించి ఆమె హృదయములోనికి చూచినట్లు బయల్పాటు ద్వారా మనము చూచుట మొదలు పెట్టుదుము.35 యేసు చూచునట్లు మనము చూచునప్పుడు, మనము సేవ చేయు వారిని ఆయన యొక్క ప్రేమతో ప్రేమించుటకు ఆయన మనలను దీవించును. ఆయన సహాయముతో మనము సేవ చేయు వారు ఆ రక్షకుని చూచి ఆయన ప్రేమ యొక్క అనుభూతిని పొందగలరు. 36
రెండవది, మనకు యాజకత్వశక్తి కలదు! యేసు క్రీస్తు నామమున ప్రవర్తించుటకు, ఇతరులను “దీవించుటకు, నడిపించుటకు, సంరక్షించుటకు, బలపరచుటకు మరియు స్వస్థపరచుటకు“ మరియు మనము ప్రేమించు వారి కొరకు అద్భుతములు తెచ్చుటకు మరియు మన వివాహములను మరియు కుటుంబములను సురక్షితముగా నుంచుకొనుటకు మనకు అధికారమును మరియు శక్తి యు కలదు.37
మూడవది, యేసు క్రీస్తు మనతో వచ్చును! మనము ఎక్కడికి వెళ్ళినను, ఆయన అక్కడికి వచ్చును. మనము బోధించునప్పుడు, ఆయన బోధించును. మనము ఆదరించునప్పుడు, ఆయన ఆదరించును. మనము దీవించునప్పుడు, ఆయన దీవించును. 38
సహోదరులారా, ఉల్లసించుటకు మనకు కారణము లేదా? మనకున్నది! మనము దేవుని పవిత్ర యాజకత్వమును కలిగియున్నాము. యేసు క్రీస్తు వైపు మనము చూచునప్పుడు, మన నిబంధనలలో జీవించునప్పుడు, మరియు మన దృష్టిని ఆయనపై స్థిరపరచినప్పుడు, మనము మన సహోదరీలతో కలిసి పవిత్రమైన విధంగా పరిచర్య చేయుదుము, తెరకు ఇరువైపులా చెదరియున్న ఇశ్రాయేలును ప్రోగుచేయుదుము, మన కుటుంబములను బలపరచి ముద్రించెదము, మరియు ప్రపంచమును ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపరచుదుము. అది జరుగును. అని నేను సాక్ష్యమిచ్చుచున్నాను.
మనమందరమూ, ప్రతి ఒక్కరము, ప్రతి ఆలోచనయందును యేసు క్రీస్తు వైపు చూచుదుమని నా హృదయములోనుండి ఈ ప్రార్ధనతో నేను ముగిస్తున్నాను. సంశయించకుడు. భయపడకుడు. యేసు క్రీస్తు నామమున, ఆమేన్.