2010–2019
ఇదిగో దేవుని గొఱ్ఱెపిల్ల
2019 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము.


ఇదిగో దేవుని గొఱ్ఱెపిల్ల

మన సవరించబడిన ఆదివారపు కార్యక్రమము ప్రభువు యొక్క సంస్కారమును పరిశుద్ధమైనదిగా మరియు మన వారంతపు ఆరాధనా అనుభవము యొక్క గుర్తించబడిన కేంద్ర బిందువుగా ఉద్ఘాటించును.

ఈ గాయకబృందములో ఆ యౌవనుల కళ్ళల్లో కన్నీళ్ళు చూసేవరకు నేను బాగానే ఉన్నాను. నేనెప్పటికి ఇవ్వలేనటువంటి మరింత స్పష్టమైన ప్రసంగమును ఆ కన్నీళ్ళు ఇచ్చెను.

నీటి అంచునుండి చూస్తూ, తన చేతి ద్వారా బాప్తీస్మము తీసుకొనుటకు కోరుతూ, ఆతృతగా ఉన్న సమూహములను దాటి, బాప్తీస్మమిచ్చు యోహాను దూరములో తన బంధువైన, నజరేయుడైన యేసు, అదే మనవిని చేయుటకు అతడివైపు నిశ్చయముగా నడుస్తూ వచ్చుట చూసాడు. భక్తిగల గౌరవముతో, కానీ దగ్గరున్న వారు వినగలిగినంత బిగ్గరగా, యోహాను ప్రశంసలను పలికాడు, అవి రెండు మిలియన్ల తరువాత ఇంకను ప్రేరేపించుచున్నవి: “ఇదిగో దేవుని గొఱ్ఱెపిల్ల.”1

చాలాకాలము ప్రవచించబడిన యేసుకంటే ముందుగా వచ్చినవాడు, ఆయనను “యెహోవా” లేక “రక్షకుడు” లేక “విమోచకుడు” లేక “దేవుని యొక్క కుమారుడు”—అని పిలవకపోవటం వివరణాత్మకంగా ఉన్నది—ఇవన్నియు సరైన శీర్షికలు. లేదు, యోహాను ప్రాచీనమైన మరియు తన జనుల యొక్క మతపరమైన ఆచారములో బహుశా చాలా మామూలుగా గుర్తించబడిన చిహ్న పదమును ఎన్నుకున్నాడు. పడిపోయిన లోకము మరియు దానిలోని పడిపోయిన జనులందరి యొక్క పాపములు మరియు విచారముల కొరకు ప్రాయశ్చిత్తమందు బలిగా ఇవ్వబడే గొఱ్ఱె పిల్ల యొక్క చిహ్నమును అతడు ఉపయోగించాడు.

ఆ చరిత్రలో కేవలము కొంత భాగము గుర్తు చేయుటకు దయచేసి నన్ను అనుమతించుము.

ఏదేను వనము నుండి బహిష్కరించబడి, ఆదాము మరియు హవ్వలు నాశనకరమైన భవిష్యత్తుకు ఎదురుచూడాల్సి వచ్చింది. మన కొరకు మర్త్యత్వమును మరియు తాత్కాలిక జీవితమును తెచ్చారు కనుక, వారు అమర్త్యత్వము మరియు నిత్య జీవము యొక్క స్థితిని తమకై తాము ముగించారు. ఉద్దేశ్యపూర్వకంగా వారు అతిక్రమము చేయుటకు ఎంపిక చేయుట వలన, వారు భౌతిక మరణమును మరియు ఆత్మీయ బహిష్కరణను, దేవుని యొక్క సమక్షము నుండి వేర్పాటును శాశ్వతంగా అనుభవించాల్సి వచ్చింది.2 వారు ఏమి చేయాలి? ఈ దుస్థితి నుండి బయటపడే మార్గము ఉన్నదా? ఇంకా వనములో ఉండగా వారు పొందిన ఉపదేశమును జ్ఞాపకముంచుకొనుటకు ఈ ఇద్దరూ ఎంత వరకు అనుమతించబడ్డారో మనకు ఖచ్చితంగా తెలియదు, కానీ వారు దేవునికి స్వచ్ఛమైన, మచ్చలేని గొఱ్ఱెపిల్లను, వారి మంద నుండి పుట్టిన తొలిచూలు మగదానిని క్రమముగా బలిగా ఇవ్వాలని వారు జ్ఞాపకముంచుకొన్నారు.3

తరువాత ఒక దేవదూత, ఈ త్యాగము రాబోయే లోక రక్షకుడు వారి తరఫున చేసే అర్పణ యొక్క రాబోయే సూచన, ఒక చిహ్నమని వివరించుటకు వచ్చెను. “ఈ విషయము తండ్రి యొక్క అద్వితీయుని త్యాగమునకు పోలికగా ఉన్నది,” అని దేవదూత చెప్పింది. “కాబట్టి … మీరు పశ్చాత్తాపపడి, శాశ్వతంగా కుమారుని నామములో దేవుని నామమును పిలవవలెను.”4 అదృష్టవశాత్తు, బయటకు వచ్చె మార్గము, పైకి వెళ్ళే మార్గము ఒకటి ఉండెను.

పరలోకములో మర్తత్యమునకు ముందు లోకపు సలహాసభలలో, దేవుడు తన పరిశుద్ధుడైన, మచ్చలేని, ప్రథమ పుత్రుడు, దేవుని యొక్క గొఱ్ఱెపిల్ల నుండి సహాయము వచ్చునని ఆదాము మరియు హవ్వకు (మరియు మిగిలిన మనందరికి) వాగ్దానమిచ్చాడు, తరువాత అపొస్తులుడైన యోహాను ఆయనను వర్ణించినట్లుగా, “జగదుత్పత్తి మొదలుకొని వధింపబడెను.”5 మర్త్యత్వములో వారి స్వంత చిన్న చిహ్నాత్మకమైన గొఱ్ఱెపిల్లను బలిగా ఇచ్చుట ద్వారా, ఆదాము మరియు అతడి సంతతి వారి జ్ఞానమును మరియు అభిషేకించబడిన యేసు యొక్క ప్రాయశ్చిత్త త్యాగముపై ఆధారపడుటను వ్యక్తపరుస్తున్నారు.6 తరువాత అరణ్యములో గుడారము ఈ విధి కొరకు నేపథ్యమగును, మరియు దాని తరువాత, సొలొమోను నిర్మించబోయే దేవాలయము అగును.

దురదృష్టవశాత్తు, మంచి పశ్చాత్తాపము మరియు విశ్వాసము-నిండిన జీవితము యొక్క చిహ్నముగా, పాత నిబంధనలో చాలావరకు బయల్పరచినట్లుగా మచ్చలేని గొఱ్ఱెపిల్ల యొక్క ఈ ఆచార విధి ప్రకారమైన అర్పణ సరిగా పని చేయలేదు. ఆ త్యాగములతో పాటు ఉండవలసిన నైతిక తీర్మానము, కొన్నిసార్లు రాళ్ళపైన రక్తము ఎండిపోయేంత వరకు ఉండవలసినంత సేపు కూడా ఉండలేదు. ఏ సందర్భములోనైనా, అది మొదటి తరములో కయీను తన తమ్ముడైన హేబేలును చంపుటతో, సహోదరుని హత్య చేయుటను ఆపుచేయుటకు అది చాలా సేపు కొనసాగలేదు.7

శతాబ్దములుగా అటువంటి పరీక్షలు మరియు ఇబ్బందులు సంభవించుటతో, చివరకు, సుదీర్ఘముగా వాగ్దానము చేయబడిన మెస్సయా---యేసు జన్మించినప్పుడు, పరలోకపు దేవదూతలు సంతషముతో పాడుట ఆశ్చర్యముకాదు. తరువాత ఆయన క్లుప్తమైన మర్త్య పరిచర్య తరువాత, యేసు క్రీస్తు తన శిష్యులను ఏదేను వనము బయట పరిచయము చేయబడిన విధి యొక్క మరింత వ్యక్తిగత రూపమైన, ప్రభురాత్రి భోజనము యొక్క సంస్కారమును పరిచయము చేయుట ద్వారా ఆయన మరణము కొరకు తన శిష్యులను సిద్ధపరిచారు. అక్కడ ఇంకను ఒక అర్పణ ఉంటుంది, అది ఇంకను ఒక త్యాగమును చేర్చును, కానీ అది ఎక్కువ లోతైనది, తొలిచూలు గొఱ్ఱెపిల్లను చంపుట కంటే మరింత లోతుగా ఆలోచింపజేసేది మరియు వ్యక్తిగతమైన చిహ్నముతో ఉండును. ఆయన పునరుత్థానము తరువాత, నీఫైయులకు, రక్షకుడు ఇలా చెప్పెను:

“మీరు నాకు ఇక ఏ మాత్రము రక్తము చిందించుటను చేయరు. …

“ … మీరు ఒక విరిగిన హృదయము మరియు ఒక నలిగిన ఆత్మను ఒక బలిగా నాకు అర్పించెదరు. ఎవడు నా యొద్దకు ఒక విరిగిన హృదయము మరియు ఒక నలిగిన ఆత్మతో వచ్చునో అతనికి నేను అగ్ని మరియు పరిశుద్ధాత్మతో బాప్తీస్మమిచ్చెదను. . .

“… కాబట్టి … పశ్చాత్తాపము పొంది, … మరియు రక్షింపబడుడి.”8

నా ప్రియమైన సహోదర, సహోదరీలారా, గృహములో హెచ్చించబడిన సువార్త శిక్షణపై ఉత్సాహకరమైన క్రొత్త ఉద్ఘాటనతో, మనమింకను “ప్రార్థనా మందిరమునకు వెళ్లి, నా పరిశుద్ధ దినమున మీ సంస్కారములు అర్పించుము,”9 అని ఆజ్ఞాపించబడ్డామని జ్ఞాపకముంచుకొనుట మనకు చాలా ముఖ్యమైనది. మరింత గృహము-కేంద్రీకృతమైన సువార్త సూచన కొరకు సమయాన్ని తీసుకొనుటకు అదనముగా, మన సవరించబడిన ఆదివారపు కార్యక్రమము ప్రభురాత్రి సంస్కారమును మన వారాంతపు ఆరాధనా అనుభవము యొక్క పరిశుద్ధమైన, గుర్తించబడిన కేంద్ర స్థానముగా, సరిగా ఉద్ఘాటించే విధానములో, సమావేశ ప్రణాళిక యొక్క సంక్లిష్టతను తగ్గించడానికి కూడ ఉన్నది. సమస్త మానవ కుటుంబము యొక్క పాపములు మరియు విచారములను పూర్తిగా మోయుట ద్వారా విరిగిన హృదయముతో క్రీస్తు చనిపోయాడని వీలైనంత వ్యక్తిగత విధానములో మనము జ్ఞాపకముంచుకోవాలి.

ఆ తీవ్రమైన భారమునకు మనము తోడ్పాడ్డాము కనుక, అటువంటి క్రియకు మనము తప్పకుండా గౌరవము చూపాలి. కాబట్టి, మన కార్యక్రమాలకు త్వరగా వచ్చి, భక్తిగల గౌరవముతో, పరిశుద్ధ విధి యందు పాల్గొనుటకు తగినట్లుగా దుస్తులు ధరించమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. “ఆదివారము మంచి దుస్తులను ధరించుట” మన కాలములో దాని అర్ధమును కోల్పోయింది, మరియు ఎవరి సమక్షమునకు మనము వచ్చామో ఆయన కొరకు గౌరవమును చూపుటకు ఎక్కడ, ఎప్పుడు వస్త్రధారణ మరియు మంచి దుస్తులను ధరించు ఆచారమును అనుసరించుటకు మనము తిరిగి వెళ్ళాల్సియున్నది.

(సంస్కార సమావేశమునకు) తగిన సమయానికి వెళ్ళుట గురించి, దీవించబడిన తల్లులకు ఆలస్యముగా వచ్చినా అనుమతించాలి, వారు పిల్లలతో, అల్పాహారముతో, మరియు డయపర్ల బ్యాగ్‌లతో అద్భుతమైన గందరగోళములో సాధ్యమైనంత త్వరగా సంఘానికి వెళ్ళటానికి త్వరగా కదిలి వెళ్ళే తల్లులు, దానిని చేరుకొనుటకు అదృష్టవంతులు. ఇంకను, విశ్రాంతి దినము ఉదయమున గుంటలో పడిన ఎద్దును అమిత ప్రయాసతో కనుగొను ఇతరులుంటారు. అయినప్పటికినీ, తరువాత గుంపుకు అప్పుడప్పుడు మందము గ్రహించదగినది, కానీ ప్రతీ ఆదివారము, ఏదైన అత్యవసరత మందమును కలిగించిన యెడల (ఎద్దు గుంటలో పడిన యెడల), అటువంటి ఎద్దును అమ్మి వేయండి లేక గుంటను పూడ్చండి.

అదే ఆత్మయందు, మన భవనాల యొక్క పవిత్ర స్థలములో గందరగోళం తగ్గింపు కొరకు మేము ఒక అపొస్తలత్వ మనవి చేస్తున్నాము. మనము ఒకరినొకరిని పలుకరించుట ప్రేమిస్తాము, మరియు మనము చేయాలి--అది సంఘ హాజరు యొక్క ఆనందములలో ఒకటి---కానీ అది ఆరాధన కొరకు ప్రత్యేకంగా సమర్పించబడిన సమయంలో అది చేయబడరాదు. ప్రార్థన, బయల్పాటు మరియు శాంతి చేత వర్ణించబడే నేపధ్యములో కొన్నిసార్లు బిగ్గరగా, వినసొంపుగా లేని అగౌరవము చేత మన విశ్వాసమునకు చెందని సందర్శకులు, విభ్రాంతి చెందవచ్చని నేను భయపడుతున్నాను. బహుశా పరలోకము అదేవిధంగా కాస్త విభ్రాంతి చెందవచ్చు.

అది ప్రారంభము కాకముందే, అధ్యక్షత్వము వహించు అధికారులు స్టేజిపై ఉండి, పల్లవి సంగీతమును వింటూ, మిగిలిన మనమందరము అనుసరించాల్సిన మాదిరిని భక్తిగల గౌరవముతో ఉంచిన యెడల, మన సంస్కార సమావేశాలకు భక్తిగల వైఖరిని చేర్చును. వేదికపై మాట్లాడుట ఉంటే, సమూహములో మాట్లాడుట ఉండుటలో మనము ఆశ్చర్యపడనవసరము లేదు. మన ఆరాధన యొక్క ఆత్మ నుండి దృష్టిని మళ్లించు ప్రకటనలను తీసివేయు బిషప్రిక్కులను మేము అభినందిస్తున్నాము. జెకర్యా వంటి ఒక యాజకుడు---ప్రభువు యొక్క ప్రాచీన దేవాలయములో, తన మొత్తము జీవితకాలములో అతడికి వచ్చు ప్రధాన యాజకునికి కలిగే బలిని అర్పించు విశేషాధికారములో దాదాపు పాల్గొనబోతూ---అతడు బలపీఠము యెదుట ఆగి, కబ్ స్క్వాట్ల ప్రోత్సాహకార్యక్రమమునకు ఆరు వారములు మాత్రమే ఉన్నదని మనకు గుర్తు చేయుట నేనూహించలేను మరియు ఊహించలేని వారిలో ఒకరిని.

సహోదర, సహోదరీలారా, ప్రభువు నియమించిన ఈ గడియ మన వారములో మిక్కిలి పరిశుద్ధమైన గడియ. ఆజ్ఞ చేత, మనము సంఘములో సభ్యులందరి చేత మిక్కిలి తరచుగా పొందబడే విధి కొరకు సమావేశమవుతాము. మన కోసం అది తొలగించబడదని ఆయన ఎరుగును కనుక, కొనసాగించుటకు మాత్రమే, తాను త్రాగబోయే గిన్నెను తొలగించమని అడిగిన ఆయన జ్ఞాపకార్ధముగా అది ఉన్నది. ఆ క్షణమందు, మన వైపు వరసకు నెమ్మదిగా వచ్చు ఆ గిన్నె యొక్క చిహ్నమును (ఆయన త్యాగము) మనము జ్ఞాపకముంచుకొన్న యెడల, అది సహాయపడును.

ప్రభువుకు మన బలి అర్పణ వరమును సమర్పించు పరిశుద్ధ గడియ వచ్చినప్పుడు, మనము మన స్వంత తప్పిదములను, పొరపాట్లను మరియు పరిష్కరించాల్సిన ఇబ్బందులను కలిగియున్నాము. కానీ మన చుట్టూ ఉన్న మిగిలిన విరిగిన హృదయములు మరియు విచారముగల ఆత్మలను మనము జ్ఞాపకముంచుకొన్న యెడల, అటువంటి పశ్చాత్తాపమునందు మనము ఎక్కువ సఫలము చెందుతాము. దగ్గరలో కూర్చోన్న కొందరు--- మొత్తము సంస్కార కీర్తన అంతా---ఇతరులు చూడగల విధానము లేక హృదయములో---దుఃఖించే వారున్నారు. ఆ విషయాన్ని నిశ్శబ్ధంగా గమనించి, మనము ఓదార్పు యొక్క రొట్టెముక్కను, మన జాలి యొక్క చిన్న గిన్నెను ఇచ్చి-దానిని వారికొరకు సమర్పించవలెనా? లేదా దుఃఖించుచున్న, ప్రయాసపడుచున్న సభ్యుడు ఆ సభలో లేకుండా మన వంతు కొంతవరకు విమోచన పరిచర్య చేస్తే తప్ప వచ్చేవారము అక్కడ ఉండని వానికా? లేదా మన సహోదరులు, సహోదరీలైయుండి కూడా సంఘ సభ్యులు కాని మన సహోదర, సహోదరీలకొరకా? సంఘము లోపల మరియు బయట ఈ లోకములో అత్యధికమైన భాధ ఉన్నది, కనుక ఏ వైపునైనా చూడుము మరియు భరించుటకు చాలా భారముగా కనబడుచున్న మరియు ఎప్పటికీ అంతముకాని హృదయ వేదనగా కనబడే ఎవరినైనా మీరు కనుగొంటారు. “ఎల్లప్పుడు ఆయనను జ్ఞాపకముంచుకొనుటకు”10 ఒక విధానము, భారము మోయుచున్న వారి నుండి భారమును తీసివేయుట మరియు నిరాశ చెందిన వారిని ఆదరించే ఎప్పటికీ-అంతము కాని కార్యమందు గొప్ప వైద్యునితో చేరుట.

ప్రియమైన స్నేహితులారా, సమస్త మానవాళికి క్రీస్తు యొక్క అద్భుతమైన ప్రాయశ్చిత్తః త్యాగమును హెచ్చైన పరిశుద్ధ అంగీకారముగా మనము ఆశించు దానిలో ప్రతీవారము ప్రపంచవ్యాప్తంగా మనము ఏకమైనప్పుడు, సంస్కారపు బలపీఠమువద్దకు మనము “ఆయన విచారమునకు ఎక్కువ కన్నీళ్లను (మరియు) ఆయన వేదనకు ఎక్కువ బాధను” తెస్తారని నేను ఆశిస్తున్నాను. తరువాత, మనము పర్యాలోచన చేసి, ప్రార్థించి, మరియు నిబంధనను క్రొత్తదిగా చేసినప్పుడు, ఆ పరిశుద్ధ క్షణము నుండి “బాధలో ఎక్కువ సహనమును . . . ఉపశమనమునకు ఎక్కువ స్తుతిని,”11 మనము తీసుకుందామా. అటువంటి సహనము మరియు ఉపశమనము కొరకు, అటువంటి పరిశుద్ధత మరియు నిరీక్షణ కొరకు మనందరి కొరకు క్షమాపణ యొక్క ప్రశస్తమైన రొట్టెను విరిచి, మరియు విమోచన యొక్క మొదటి ద్రాక్షారసమును పోసిన ఆయన, యేసు క్రీస్తు, దేవుని యొక్క ప్రశస్తమైన, కనికరముగల పరిశుద్ధ గొఱ్ఱెపిల్ల యొక్క నామములో నేను ప్రార్థిస్తున్నాను, ఆమేన్.

వివరణలు:

  1. యోహాను 1:29.

  2. 2 నీఫై 9:8–9 చూడుము.

  3. మోషే 5:5 చూడుము; నిర్గామకాండము 12:3-10 కూడా చూడుము.

  4. మోషే 5:7–8; మోషే 5:9 కూడా చూడుము.

  5. ప్రకటన 13:8.

  6. బైబిల్ నిఘంటువు, “అభిషక్తుడు“; లేఖన సూచిక “అభిషక్తుడు“ scriptures.ChurchofJesusChrist.org కూడా చూడుము.

  7. హాస్యాస్పదంగా, కయీను హెబేలును వధించుట, సాతాను చేత నడిపించబడిన అంతిమ చర్య, హెబేలు అర్పణ ప్రభువు చేత అంగీకరించబడగా, కయీను బలి అర్పణ తిరస్కరించబడినందుకు అతడి పాత కోపమునకు జతపరచబడియుండవచ్చు.

    “దేవుడు … ఆయన స్వంత కుమారుని యొక్క వరమందు ఒక త్యాగమును సిద్ధపరచెను, ఆయన … మనుష్యుడు ప్రభువు యొక్క సన్నిధిలో ప్రవేశించగలుగునట్లు ద్వారము తెరచును. …

    “ఈ ప్రాయశ్చిత్తఃమునందు లేక విమోచన యొక్క ప్రణాళికనందు విశ్వాసము ద్వారా, హెబేలు దేవునికి ఒక బలిని అర్పించాడు, అది అంగీకరించాడు, అది మంద యొక్క తొలుచూలు. కయీను నేలపై ఫలమును అర్పించాడు, మరియు అంగీకరించబడలేదు . . . (అతడి బలి) రక్తమును చిందించుటను కలిపియుండాలి” (Teachings of Presidents of the Church: Joseph Smith [2007], 48; 107–8 కూడా చూడండి)

  8. 3 నీఫై 9:19–20, 22.

  9. సిద్ధాంతము మరియు నిబంధనలు 59:9.

  10. మొరోనై 4:3; 5:2.

  11. “More Holiness Give Me,” Hymns, no. 131.

ముద్రించు