2010–2019
ఆత్మ ద్వారా జ్ఞానమును వెదకుట
2019 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము.


ఆత్మ ద్వారా జ్ఞానమును వెదకుట

మన హేతుబద్ధమైన మనస్సుల ద్వారా మాత్రమే కాదు, కానీ ఆత్మ యొక్క మిక్కిలి నెమ్మదియైన, చిన్న స్వరము ద్వారా కూడా సత్యమును గ్రహించుట మనము నేర్చుకోవాలి.

ప్రియమైన సహోదర, సహోదరిలారా, “అధ్యయనము ద్వారా మరియు విశ్వాసము ద్వారా కూడ నేర్చుకొనుట వెదకుము,”1 అని ప్రభువు మనకు పలుమార్లు చెప్పారు. మన మనస్సుల యొక్క హేతుబద్ధమైన వాదన ద్వారా మాత్రమే కాదు, కానీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మరియు ప్రేరేపణ ద్వారా కూడా మనము వెలుగును మరియు జ్ఞానమును పొందగలము.

జ్ఞానమును గూర్చి పరిశుద్ధాత్మ నుండి ప్రేరేపేణ ఎల్లప్పుడు నా జీవితము యొక్క భాగముగా లేదు.

నా ప్రియమైన భార్య ఐరిన్, మరియు నేను 31 సంవత్సరాల క్రితం మేము క్రొత్తగా వివాహము చేసుకొన్నప్పుడు సంఘములో చేరాము. మేము ఇరువురము, కొలంబియాలో పెరిగి పెద్దయ్యాము, కానీ మా వివాహము జరిగిన కొన్ని నెలల తరువాత, నా వృత్తి మమ్మల్ని జర్మనీలో నివసించటానికి తీసుకొని వెళ్ళింది. మేము చాలా చిన్నవారము మరియు గొప్ప నిరీక్షణలు, ఆశలు కలిగియున్నాము; అది మాకు ప్రత్యేకంగా ఉత్సాహకరమైన మరియు సంతోషకరమైన సమయము.

చిత్రం
సహోదరి మరియు ఎల్డర్ హెల్డ్

నేను నా వృత్తిపై దృష్టిసారించినప్పుడు, ఐరిన్ ఎలా లేక ఎప్పుడని తెలియకుండా, మేము పరలోకము నుండి ఏదో విధమైన సందేశమును పొందుతామని, భావించింది. కనుక ఆమె ఆ ప్రత్యేక సందేశము కొరకు ఎల్లప్పుడు ఎదురుచూస్తూ, మా ఇంటిలోనికి, ఎన్‌సైక్లోపిడియా, వాక్యూమ్ క్లీనర్లు, వంట పుస్తకాలు, వంటగది వస్తువులు, మరియు మొదలైన వాటితో ఇంటింటికి వచ్చే అన్నిరకాల విక్రయదారులను అనుమతించసాగింది.

ఒక సాయంత్రము నల్లని సూట్లు ధరించిన ఇద్దరు యువకులు మా తలుపు తట్టారని మరియు వారిని లోపలికి రానివ్వాలనే చాలా స్పష్టమైన, ప్రత్యేకమైన భావనను తాను అనుభూతి చెందానని ఆమె నాతో చెప్పింది. వారు ఆమెతో దేవునిని గూర్చి మాట్లాడాలని కోరుతున్నారని కానీ నేను కూడా ఇంట్లో ఉన్నప్పుడు మరలా తిరిగి వస్తామని వారు చెప్పారు. ఎదురుచూడబడిన సందేశము ఇది కావచ్చా?

వారు మమ్మల్ని సందర్శించుట ప్రారంభించారు, మరియు వారి నడిపింపుతో, మేము లేఖనాలను చదివాము, మన రక్షకుడు మరియు విమోచకునిగా యేసు క్రీస్తు యొక్క కీలకమైన ప్రాముఖ్యతను అర్ధము చేసుకోగలిగాము. త్వరలో మేము పసివారిగా బాప్తీస్మము పొందినందుకు విచారించాము, ఆ బాప్తీస్మము సృహలో చేసిన నిబంధన కాదు. అయినప్పటికినీ, తిరిగి బాప్తీస్మము పొందుట అనగా ఈ క్రొత్త సంఘము యొక్క సభ్యులగుట అని కూడ అర్థము, కనుక మొదట మేము దాని గురించి సమస్తమును గ్రహించాల్సినవసరమున్నది.

కాని మోర్మన్ గ్రంథము గురించి, జోసెఫ్ స్మిత్ గురించి, మరియు రక్షణ యొక్క ప్రణాళిక గురించి మిషనరీలు చెప్పుచున్నది వాస్తవముగా యదార్ధమని మేము ఎలా తెలుసుకోగలము? మంచిది, మేము “వారి ఫలముల ద్వారా వారిని ఎరుగుదుము,”2 అనిన ప్రభువు యొక్క మాటల నుండి మేము తెలుసుకోగలమని గ్రహించాము. అందుచేత, చాలా క్రమమైన పద్ధతిలో, మా చాలా హేతుబద్ధమైన మనో నేత్రములతో ఆ ఫలముల కొరకు వెదకుట ద్వారా మేము సంఘమును పరిశోధించుట ప్రారంభించాము. మేము చూసినదేమిటి? మంచిది, మేము దీనిని చూసాము:

  • స్నేహపూర్వకమైన, సంతోషముగల జనులు మరియు ఈ లోకములో సంతోషమును అనుభవించుటకు మనము ఉద్దేశించబడ్డామని, బాధ మరియు దుఃఖము మాత్రమే కాదని గ్రహించిన అద్భుతమైన కుటుంబాలు.

  • చెల్లించబడే మతాధికారులు లేని ఒక సంఘము, కాని దానిలోని సభ్యులు నియామకాలను మరియు బాధ్యతలను వారికై వారు అంగీకరిస్తారు.

  • యేసు క్రీస్తు మరియు కుటుంబాలు సమస్తమునకు కేంద్రముగా ఉన్న సంఘము, అక్కడ సభ్యులు నెలకు ఒకసారి ఉపవాసము చేసి, దానిని పేదవారికి, అవసరతలో ఉన్నవారికి సహాయపడుటకు విరాళమిస్తారు, అక్కడ హానికరమైన పదార్ధములను మానివేయమని మనకు ఆరోగ్యకరమైన అలవాట్లు ప్రోత్సహించబడినవి.

అదనముగా:

  • వ్యక్తిగత అభివృద్ధి పై, విద్య పై, కష్టపడి పనిచేయుట మరియు స్వయం-ఉపాధిపై నొక్కి చెప్పుట మేము ఇష్టపడ్డాము.

  • అసాధారణమైన మానవ సంక్షేమ కార్యక్రమము గురించి మేము నేర్చుకున్నాము.

  • అద్భుతమైన సంగీతము మరియు అక్కడ పంచుకోబోయే లోతైన ఆత్మీయ సూత్రములతో సర్వసభ్య సమావేశముల ద్వారా మేము ఆకట్టుకోబడ్డాము.

ఇవన్నీ చూసి, మేము సంఘములో ఏ లోపము కనుగొనలేకపోయాము. వ్యతిరేకంగా, మేము చూసిన సమస్తమును మేము చాలా ఇష్టపడ్డాము. అయినప్పటికినీ, ఇంకను మేము బాప్తీస్మము పొందటానికి నిర్ణయించుకోలేదు, ఎందుకనగా ఆవిధంగా చేయటానికి ముందుగా ప్రతీది తెలుసుకోవాలని మేము కోరాము.

కాని మా అనిశ్చయతలో కూడ, ప్రభువు మమ్మల్ని ఓపికగా సిద్ధపరిచాడు, ఆయన మమ్మల్ని పోతపోయుచున్నాడు, మరియు ఆయన మేము సత్యమును గ్రహించుటకు నేర్చుకొనుటకు మా హేతుబద్ధమైన మనస్సులతో మాత్రమే కాదు కానీ ప్రత్యేకంగా మన హృదయాలతో మాట్లాడే, ఆత్మ యొక్క మెల్లని, చిన్న స్వరము ద్వారా కూడా సత్యమును గ్రహించుట మేము నేర్చుకోవాలని గుర్తించుటకు మాకు సహాయపడుచున్నాడు.

10 నెలలు సువార్త నేర్చుకొనిన తరువాత ఒక సాయంత్రము, మేము మోషైయ 18 చదువుచున్నప్పుడు, ఆ స్వరము మరియు తత్ఫలితమైన భావన కలిగింది: “ఒకరి భారములు ఒకరు భరించుటకు … మీరు కోరినప్పుడు . . . మరియు ఆదరణ యొక్క అవసరములో ఉన్న వారిని ఆదరించుటకు … ఇది మీ హృదయముల యొక్క కోరిక అయిన యెడల, ప్రభువు నామమందు బాప్తీస్మము పొందుటకు వ్యతిరేకముగా మీరేమి కలిగియున్నారు?”3

మోర్మన్ గ్రంధము నుండి ఈ వాక్యభాగము మా హృదయములు మరియు ఆత్మలలో ప్రవేశించింది, మరియు బాప్తీస్మము పొందకుండా ఉండటానికి నిజమైన కారణమేదీ లేదని హఠాత్తుగా మేము భావించాము మరియు ఎరిగియున్నాము. ఈ వచనములో చెప్పబడిన కోరికలు మా హృదయపు కోరికలని, మరియు ఆ విషయములు నిజముగా ముఖ్యమైనవని మేము గ్రహించాము. ప్రతీది గ్రహించుట కంటే అవి ఎక్కువ ముఖ్యమైనవి ఎందుకనగా మేము ఇదివరకే తగినంతగా ఎరుగుదుము. మేము ఎల్లప్పుడు ప్రేమగల పరలోకపు తండ్రి యొక్క నడిపించే హస్తముపై ఆధారపడ్డాము మరియు ఆయన మమ్మల్ని నడిపించుట కొనసాగిస్తాడని నమ్మకముగా ఉన్నాము.

కనుక, అదేరోజు, మేము మా బాప్తీస్మము కొరకు తేదీని నిర్ణయించాము, మరియు త్వరలో చివరికి, మేము బాప్తీస్మము పొందాము!

చిత్రం
ఎల్డర్ మరియు సహోదరి హెల్డ్ యొక్క బాప్తీస్మము

ఆ అనుభవము నుండి మేము ఏమి నేర్చుకున్నాము?

మొదట, మేము ప్రేమగల పరలోక తండ్రియందు పూర్తిగా విశ్వసించగలమని, మేము కావాలని ఆయన ఎరిగిన వ్యక్తిగా మారుటకు ఆయన మాకు సహాయపడుటకు నిరంతరము ప్రయత్నిస్తున్నాడని నేర్చుకున్నాము. ఆయన ఇలా చెప్పినప్పుడు ఆయన మాటలలోని లోతైన సత్యమును మేము నిర్ధారించాము: “నేను నరుల యొక్క సంతానమునకు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము ఇచ్చట కొంత అచ్చట కొంత ఇచ్చెదను, మరియు నా సూక్తులను ఆలకించు వారు, . . . ఏలయనగా వారు జ్ఞానము నేర్చుకొందురు, . . ఏలయనగా పుచ్చుకొను వానికి నేను మరి ఎక్కువ ఇచ్చెదను.”4

రెండవది, మన హేతుబద్ధమైన మనస్సులకు అదనముగా, జ్ఞానము సంపాదించుటకు మరొక పరిమాణము నడిపింపును మరియు గ్రహింపును మనకిస్తుందని మేము నేర్చుకున్నాము. అది మన హృదయాలు మరియు మన మనస్సులతో కూడా మాట్లాడే ఆయన పరిశుద్ధాత్మ యొక్క మెల్లని మరియు మృదువైన స్వరము.

ఈ సూత్రమును మన చూసే సామర్ధ్యముతో పోల్చుటకు నేనిష్టపడుతున్నాను. మన పరలోకమందున్న తండ్రి మనకు ఒక్కటి మాత్రమే కాదు, రెండు భౌతిక నేత్రములు ఇచ్చాడు. మనము సమృద్ధిగా ఒకే ఒక కన్నుతో చూడగలము, కానీ రెండవ కన్ను మరొక దృష్టికోణమును మనకిచ్చును. రెండు దృష్టికోణములు మన మెదడులో కలిపియుంచబడినప్పుడు, అవి మన పరిసరాల యొక్క మూడు పరిమాణముల రూపమునిచ్చును.

అదేవిధంగా, మన భౌతిక మరియు ఆత్మీయ సామర్ధ్యముల ద్వారా మనము సమాచారము యొక్క రెండు ఆధారములివ్వబడ్డాము. మన మనస్సు మన భౌతిక ఇంద్రియముల ద్వారా మరియు మన హేతుబద్ధత ద్వారా ఒక ఊహనిచ్చును. కానీ పరిశుద్ధాత్మ యొక్క వరము ద్వారా, తండ్రి రెండవ అవలోకనము కూడ మనకు ఇచ్చారు, అది నిజముగా అతి ముఖ్యమైనది మరియు యదార్ధమైనది, ఎందుకనగా అది నేరుగా ఆయన నుండి వచ్చును. కానీ ఆత్మ యొక్క ప్రేరేపణలు తరచుగా చాలా యుక్తిగా ఉంటాయి కనుక, అనేకమంది జనులు ఆ అదనపు ఆధారమును ఉద్దేశ్యపూర్వకంగా తెలుసుకోరు.

తరువాత ఈ రెండు దృష్టికోణములు మన ఆత్మలందు జతపరచబడినప్పుడు, ఒక సంపూర్ణ చిత్రము, అవి నిజముగా ఉన్నట్లుగా విషయముల యొక్క యదార్ధతను చూపును. వాస్తవానికి, పరిశుద్ధాత్మ యొక్క అదనపు దృష్టికోణము ద్వారా, మన మానసిక అవగాహన ద్వారా ప్రత్యేకంగా చిత్రీకరించబడినట్లుగా నిర్ధిష్టమైన “వాస్తవములు,” మోసగించబడినట్లుగా, లేక స్పష్టముగా తప్పుగా బహిర్గతం చేయబడవచ్చు. మొరోనై యొక్క మాటలను జ్ఞాపకముంచుకొనుము: “పరిశుద్ధాత్మ యొక్క వరము ద్వారా మీరు అన్ని సంగతుల యొక్క సత్యమును తెలుసుకొనగలరు.”5

సంఘ సభ్యునిగా నా 31 సంవత్సరాలలో, మన హేతుబద్ధమైన మనస్సుపై మనము ఆధారపడిన యెడల, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపేణలు మరియు భావనల ద్వారా మనము పొందగల ఆత్మీయ అవగాహనను నిర్లక్ష్యము చేసిన యెడల, అది ఒకే కన్నుతో జీవితము గుండా మనము ప్రయాణిస్తున్నట్లుగా ఉంటుందని, నేను అనేకసార్లు అనుభవించాను. కానీ అలంకారముగా మాట్లాడుతూ, మనము వాస్తవానికి “రెండు కళ్ళు” ఇవ్వబడ్డాము. రెండు దర్శనముల యొక్క కలయక మాత్రమే మన జీవితాలలో సమస్త సత్యములను గూర్చి మరియు మనము అనుభవించే సమస్తము యొక్క నిజమైన మరియు పూర్ణ చిత్రమును, అదేవిధంగా జీవిస్తున్న పరలోక తండ్రి యొక్క బిడ్డలుగా మన గుర్తింపు మరియు ఉద్దేశమును గూర్చి పూర్తిగా, లోతైన అవగాహనను మనకిచ్చును.

ఒక సంవత్సరం క్రితం అధ్యక్షులు నెల్సన్ మనకు బోధించిన దాని గూర్చి నేను జ్ఞాపకం చేయబడ్డాను, “రాబోయే దినాలలో, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, మార్గము చూపు, ఆదరణ, మరియు నిరంతర ప్రభావము లేకుండా ఆత్మీయంగా బ్రతుకుట సాధ్యము కాదు,”6 అని ఆయన అన్నారు.

నేను ఖచ్చితమైన నిర్ధారణతో వీటిని తెలుసుకోగలిగాను:

  • మనము ప్రేమగల పరలోకమందున్న తండ్రిని కలిగియున్నాము, మరియు దైవిక ప్రణాళికలో భాగముగా ఈ భూమి మీదకు వచ్చుటకు మనమందరము సమ్మతించాము.

  • యేసే క్రీస్తు; ఆయన జీవిస్తున్నాడు, నా రక్షకుడు మరియు విమోచకుడు.

  • జోసెఫ్, వినయముగల వ్యవసాయ బాలుడు, పిలవబడి మరియు బలమైన ప్రవక్తగా మారాడని, అతడు దేవుని యొక్క పరిశుద్ధ యాజకత్వమును, దాని సమస్త తాళపు చెవులు, శక్తి మరియు అధికారముతో కాలముల యొక్క సంపూర్ణ యుగమును ప్రారంభించాడు.

  • మోర్మన్ గ్రంథము యేసు క్రీస్తు యొక్క రెండవ సాక్ష్యము మరియు కుటుంబాలు కలిసి శాశ్వతంగా నిలిచియుండుటకు ఉద్దేశించబడినవి.

  • మన ప్రభువైన యేసు క్రీస్తు, తన పునఃస్థాపించబడిన సంఘమును ఈ రోజు మన జీవిస్తున్న ప్రవక్త, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ద్వారా నడిపిస్తున్నారు.

ఇవి మరియు అనేక ఇతర ప్రశస్తమైన సత్యములు దేవుడు కావాలన్నట్లుగా మారుటకు నాకు సహాయపడుతున్న ఆత్మీయముగా ఆవశ్యకమైన సూత్రములు అయినవి. ఈ అద్భుతమైన జీవితము గుండా మనము ప్రయాణిస్తున్నప్పుడు మరియు “అధ్యయనము ద్వారా మరియు విశ్వాసము ద్వారా కూడ . . . నేర్చుకోవాలని” మరియు ఇంకను అనేక క్రొత్త బోధనలను పొందమని ఆయన నన్ను—మిమ్మల్ని కోరుతున్న వాటి కొరకు నేను ఎదురుచూస్తున్నాను.

ఈ విషయాలు సత్యమని నేనెరుగుదును మరియు వాటిని గూర్చి యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

ముద్రించు