సమూహము: చేర్చబడు స్థలము
ఒక బలమైన సమూహమును మీరు స్థాపించాలని ప్రభువు కోరుచున్నారు. ఆయన తన బిడ్డలను సమకూర్చినప్పుడు, వారు చేర్చబడుటకు, వృద్ధి చెందుటకు ఒక స్థలము అవసరము.
2010లో, ఆండ్రి సెబాకో సత్యము కొరకు వెదకుచున్న ఒక యౌవనుడు. ఇదివరకెన్నడూ అతడు హృదయపూర్వకమైన ప్రార్థన చేయనప్పటికినీ, అతడు ప్రయత్నించాలని నిర్ణయించాడు. కొంతకాలం తరువాత, అతడు మిషనరీలను కలుసుకున్నాడు. వారు అతడికి మోర్మన్ గ్రంథము ఛాయాచిత్రముతో సమాచారముగల చిన్న కార్డును ఇచ్చారు. అండ్రి ఏదో అనుభూతి చెంది, మిషనరీలు ఆ గ్రంథమును తనకు అమ్ముతారా అని అడిగాడు. అతడు సంఘానికి వచ్చిన యెడల అతడు ఆ గ్రంథాన్ని ఉచితంగా కలిగియుండవచ్చని వారు చెప్పారు.1
ఆఫ్రికా, బోట్సావానాలో అప్పుడే క్రొత్తగా ఏర్పాటు చేయబడిన మోచుడి బ్రాంచికి ఆండ్రి ఒంటరిగా హాజరయ్యాడు. కానీ బ్రాంచి ప్రేమగల, బలమైన అనుబంధముచేత కలిసి కట్టబడియున్న గుంపు, దాదాపు 40 మంది సభ్యులను కలిగియున్నది.2 వారు ఆండ్రిని స్నేహ పూర్వకంగా స్వాగతించారు. అతడు మిషనరీ పాఠములను అంగీకరించాడు మరియు బాప్తీస్మము పొందాడు. అది అద్భుతమైనది!
కానీ తరువాత ఏమైంది? ఆండ్రి చురుకుగా ఎలా ఉన్నాడు? నిబంధన మార్గము వెంబడి అతడు అభివృద్ధి చెందుటకు అతడికి ఎవరు సహాయపడతారు? ఆ ప్రశ్నకు ఒక జవాబు అతడి యాజకత్వపు సమూహము!3
ప్రతీ యాజకత్వముగల వ్యక్తి, తన పరిస్థితిని లక్ష్యపెట్టకుండా, బలమైన సమూహము నుండి ప్రయోజనము పొందును. అహరోను యాజకత్వముగల నా యౌవన సహాదరులారా, ప్రతీ యువకుని కొరకు చేర్చబడు స్థలముగా, ప్రభువు యొక్క ఆత్మ హాజరయ్యే ఒక స్థలముగా, సమూహపు సభ్యులందరూ స్వాగతించబడి, విలువివ్వబడే ఒక స్థలముగా ఒక బలమైన సమూహముగా మీరు స్థాపించాలని ప్రభువు కోరుచున్నాడు. ప్రభువు తన బిడ్డలను సమకూర్చినప్పుడు, వారు చేర్చబడుటకు, వృద్ధి చెందుటకు ఒక స్థలము అవసరము.
కూటమి అధ్యక్షత్వ సభ్యులైన మీలో ప్రతీఒక్కరు ప్రేరేపణ4 వెదకి మరియు కూటమి సభ్యులందరి మధ్య ప్రేమ మరియు సహోదరత్వమును మీరు వెదకినప్పుడు మార్గమును నడిపిస్తారు. మీరు క్రొత్త సభ్యులకు, తక్కువ చైతన్యము గల వారికి, లేక ప్రత్యేక అవసరతలు గల వారికి ప్రత్యేక ఆసక్తిని చూపిస్తారు.5 యాజకత్వ శక్తితో, మీరు ఒక బలమైన సమూహమును నిర్మిస్తారు.6 ఒక బలమైన ఐకమత్యముగల సమూహము, ఒక యువకుని జీవితములో సమస్త ప్రత్యేకతను చూపును.
సంఘము సువార్త శిక్షణ పై క్రొత్త గృహము-కేంద్రీకరించబడిన దృష్టిని ప్రకటించినప్పుడు,7 కొందరు ఆండ్రి వంటి సభ్యులను గూర్చి ఆలోచించి, ఇలా అడిగారు, “సువార్త అధ్యయనము చేయని కుటుంబ పరిస్థితి నుండి మరియు గృహములో సువార్త నేర్చుకొను జీవించు వాతావరణములేని చోట నుండి వచ్చిన యౌవనుల విషయమేమిటి? వారు వెనుకకు వదిలివేయబడతారా?”
లేదు! ఏ ఒక్కరూ విడిచిపెట్టబడరు! ప్రభువు ప్రతీ యువకుడిని, ప్రతీ యువతిని ప్రేమిస్తున్నాడు. యాజకత్వ నాయకులుగా మనము, ప్రభువు హస్తములుగా ఉన్నాము. మనము గృహము-కేంద్రీకరించబడిన ప్రయత్నములకు సంఘ సహకారముగా ఉన్నాము. గృహములో పరిమితమైన సహాయము ఉన్నప్పుడు, యాజకత్వ సమూహములు మరియు ఇతర నాయకులు, స్నేహితులు అవసరమైనట్లుగా ప్రతీ వ్యక్తిని, మరియు కుటుంబమును కావలికాసి సహాయపడతారు.
అది పనిచేయుట నేను చూసాను. నేను దానిని అనుభవించాను. నాకు ఆరు సంవత్సరాలప్పుడు, నా తల్లిదండ్రులు విడిపోయారు మరియు మా నాన్న మా అమ్మను ఐదుగురు పిల్లలతో వదిలేసాడు. మాకు సమకూర్చుటకు మా అమ్మ పని చేయటం ప్రారంభించింది. ఆమెకు కొంత కాలము, రెండవ ఉద్యోగము, అదేవిధంగా అదనపు విద్య అవసరమయ్యింది. పోషించుటకు ఆమెకు తక్కువ సమయమున్నది. కానీ నా దేవదూత వంటి తల్లికి సహాయపడుటకు తాత మామ్మలు, మావయ్యలు, చిన్నమ్మలు, బిషప్పులు, మరియు గృహ బోధకులు ముందుకు వచ్చారు.
మరియు నేను ఒక సమూహమును కలిగియున్నాను. నన్ను ప్రేమించి మరియు సహాయపడిన నా స్నేహితులు-- నా సహోదరుల కొరకు నేను చాలా కృతజ్ఞత కలిగియున్నాను. నా సమూహము చేర్చబడిన ఒక స్థలము. నా కుటుంబ స్థితి వలన కొందరు నన్ను బలహీనునిగా, సఫలమవటానికి తక్కువ అవకాశము గలవానిగా భావించారు. నేను అయ్యుండవచ్చు. కానీ యాజకత్వ సమూహములు ఆ విజయావకాశాలను మార్చింది. నా సమూహములు నాకు సహాయపడినవి మరియు నా జీవితమును లెక్కలేనంతగా దీవించినవి.
మన చుట్టూ తక్కువ అవకాశాలు, బలహీనమైన పరిస్థితులుంటాయి. బహుశా మనమందరము తక్కువ అవకాశాలు, బలహీనమైన పరిస్థితులను కలిగియున్నాము. విధంగా ఉన్నాము. కానీ ఇక్కడ మనలో ప్రతీఒక్కరు, బలమును పొందటానికి, బలమును ఇవ్వటానికి ఒక స్థలమును, ఒక సమూహమును కలిగియున్నాము. సమూహము అనగా, “ప్రతీ ఒక్కరు ఐక్యమత్యము కలిగి, ఒకరినొకరికి సహాయపడుట.”8 అది మనము ఒకరినొకరం ఉపదేశించుకొని, ఇతరులకు సేవ చేసి, మరియు దేవునికి సేవ చేసినప్పుడు ఐక్యతను, సహోదరత్వమును నిర్మించు స్థలము.9 అది అద్భుతాలు సంభవించు స్థలము.
మోచుడిలో అండ్రి యొక్క సమూహములో జరిగిన అద్భుతాలలో కొన్నిటిని గూర్చి నేను మీకు చెప్తాను. ఈ మాదిరిని నేను పంచుకొన్నప్పుడు, అది వారికి అన్వయించు ప్రతీ యాజకత్వ సమూహమును బలపరచిన సూత్రముల కొరకు గమనించుము.
ఆండ్రి బాప్తీస్మము పొందిన తరువాత, మిషనరీలు మిగిలిన నలుగురు యువకులకు బోధిస్తున్నప్పుడు, అతడు వారితో వెళ్ళాడు, వారు బాప్తీస్మము కూడా పొందారు. ఇప్పుడు వారు ఐదుగురు యువకులు. వారు ఒకరినొకరిని మరియు బ్రాంచిని బలపరచుట ప్రారంభించారు.
ఆరవ యువకుడు, థుసో బాప్తీస్మము పొందాడు. థుసో తన స్నేహితులతో సువార్తను పంచుకున్నాడు, మరియు త్వరలో అక్కడ తొమ్మిది మంది ఉన్నారు.
యేసు క్రీస్తు యొక్క శిష్యులు తరచుగా ఈ విధంగా సమావేశమయ్యారు---వారి స్నేహితుల చేత ఆహ్వానించబడినట్లుగా, ఒక సమయంలో కొందరు సమావేశమయ్యారు. ప్రాచీనముగా, అంద్రెయ రక్షకుని కనుగొన్నప్పుడు, అతడు వెంటనే తన సహోదరుడైన సీమోను వద్దకు వెళ్ళాడు, మరియు “యేసు నొద్దకు అతని తోడుకొని వచ్చెను.”10 అదేవిధంగా, ఫిలిప్పు క్రీస్తు యొక్క అనుచరుడైన తరువాత వెంటనే, అతడు తన స్నేహితుడు నతానియేలును “వచ్చి చూడుము,”11 అని ఆహ్వానించాడు.
మోచుడిలో, త్వరలో 10 వ యువకుడు సంఘములో చేరాడు. మిషనరీలు 11 వ వ్యక్తిని కనుగొన్నారు. మరియు 12 వ యువకుడు తన స్నేహితులపై సువార్త యొక్క ప్రభావము చూచిన తరువాత బాప్తీస్మము పొందాడు.
మోచుడి బ్రాంచి యొక్క సభ్యులు పులకరించారు. ఈ యువకులు “ప్రభువునకు పరివర్తన పొందిరి, మరియు … సంఘమునకు ఐక్యమైరి.”12
మోర్మన్ గ్రంథము వారి పరివర్తనలో ఒక ప్రముఖ పాత్ర వహించింది. 13 “నాకు ఖాళీ దొరికిన ప్రతీసారి, ఇంటిలో, పాఠశాలలో, ప్రతీచోట … నేను మోర్మన్ గ్రంథము చదవటం ప్రారంభించాను,”14 థుసో గుర్తు చేసుకుంటున్నాడు.
ఒరాటైల్ తన స్నేహితుల యొక్క మాదిరి వలన అతడు సువార్తకు ఆకర్షించబడ్డాడు. “[వారు] చాలా త్వరగా మారినట్లు కనిపించారు … అతడు వివరించాడు. పాఠశాల . . . చుట్టూ వారు మోయటం ప్రారంభించిన పుస్తకానికి . . . అది . . . సంబంధించినదని నేను అనుకున్నాను. వాళ్ళు ఎంత మంచి వ్యక్తులుగా మారారో నేను చూడగలిగాను. . . (నేను) కూడ మారాలని కోరాను.”15
12 మంది యువకులు సమావేశమయ్యారు మరియు రెండు సంవత్సరాలలోపు ఒకరి తరువాత ఒకరు బాప్తీస్మము పొందారు. ఒక్కొక్కరు తమ కుటుంబములో ఏకైక సభ్యులుగా ఉన్నారు. కానీ వారు తమ బ్రాంచి అధ్యక్షుడు అధ్యక్షులు రాక్వెలా,16 ఒక సీనియర్ దంపతులు ఎల్డర్ మరియు సహోదరి టేలర్,17 కలిపి తమ సంఘ కుటుంబము చేత మరియు ఇతర బ్రాంచి సభ్యుల చేత బలపరచబడ్డారు.
ఒక సమూహము నాయకుడు సహోదరుడు జూనియర్,18 ఆదివారము మధ్యాహ్నాములు యువకులను తన ఇంటికి ఆహ్వానించి వారికి బోధించాడు. ఆ యువకులు లేఖనాలను కలిసి అధ్యయనము చేసారు మరియు క్రమంగా గృహ సాయంకాలను జరిపారు.
సహోదరుడు జూనియర్ సభ్యులను, మిషనరీల చేత బోధింపబడిన జనులను, మరియు ఒక సందర్శనము అవసరమైన ఎవరినైనా దర్శించుటకు వారిని తీసుకెళ్ళాడు. 12 మంది యువకులు గుంపుగా సహోదరుడు జూనియర్ ట్రక్కు వెనుక ఎక్కేవారు. అతడు వారిని ఇద్దరు లేక ముగ్గురు సహవాసులుగా గృహాల వద్ద దించి, మరియు తరువాత వారిని ఎక్కించుకునేవాడు.
ఈ యువకులు అప్పుడే సువార్తను నేర్చుకుంటూ, వారికి ఎక్కువగా తెలియదని అనుకొన్నప్పటికినీ, వారు జనులను దర్శించినప్పుడు, వారికి తెలిసిన ఒకటి లేక రెండు విషయాలను పంచుకోమని సహోదరుడు జూనియర్ వారికి చెప్పాడు. యాజకత్వముగల ఈ యౌవనులు, బోధించారు, ప్రార్థించారు, మరియు సంఘము కావలికాయుటకు సహాయపడ్డారు.19 వారు తమ యాజకత్వ బాధ్యతలను నెరవేర్చారు మరియు సేవ చేయుటలోని సంతోషమును అనుభవించారు.
“మేము కలిసి ఆడుకున్నాము, కలిసి నవ్వుకున్నాము, కలిసి దుఃఖించాము, మరియు ఒక సహోదరత్వముగా మారాము” 20 ఆండ్రి చెప్పాడు. వాస్తవానికి, వారిని వారు “సహోదరుల బృందము” అని పిలుచుకున్నారు.
వారందరు మిషను సేవ చేయాలని వారు కలిసి ఒక లక్ష్యముంచారు. వారి కుటుంబాలలో వారు మాత్రమే ఏకైక సభ్యులు కనుక, వారు అనేక అడ్డంకులను జయించాల్సి వచ్చింది, కానీ వాటి గుండా వారు ఒకరినొకరికి సహాయపడ్డారు.
ఒకరి తరువాత ఒకరు, యువకులు మిషను పిలుపులు పొందారు. మొదట వెళ్ళిన వారు అనుభవాలను పంచుకుంటూ, సేవ చేయుటకు వారిని ప్రోత్సహిస్తూ ఇంకా సిద్ధపడుచున్న వారికి ఉత్తరాలను వ్రాసారు. పదకొండు మంది యువకులు మిషను సేవ చేసారు.
ఈ యువకులు తమ కుటుంబాలతో సువార్తను పంచుకున్నారు. తల్లులు, సహోదరీలు, సహోదరులు, స్నేహితులు, అదేవిధంగా వారి మిషన్లు పై బోధించిన జనులు, మార్పు చెందారు మరియు బాప్తీస్మము పొందారు. అద్భుతాలు సంభవించాయి మరియు లెక్కలేనన్ని జీవితాలు దీవించబడినవి.
అటువంటి అద్భుతము ఇశ్రాయేలు యొక్క సమకూర్పు త్వరగా జరుగుచున్న ఫలవంతమైన ప్రాంతము, ఆఫ్రికా వంటి ప్రాంతంలో మాత్రమే జరగవచ్చని మీలో కొందరు ఆలోచించుటను నేను వినగలను. అయినప్పటికిని, మోచుడిలో అన్వయించబడిన సూత్రములు ఎక్కడైనా నిజమని నేను సాక్ష్యమిస్తున్నాను. మీరెక్కడ ఉన్నప్పటికినీ, మీ సమూహము చైతన్యము మరియు సువార్తను పంచుకొనుట ద్వారా ఎదగవచ్చును. ఒక శిష్యుడు ఒక స్నేహితుని సమీపించినప్పుడు కూడ ఒకరు ఇద్దరు కావచ్చు. ఇద్దరు నలుగురు కావచ్చు. నలుగురు ఎనిమిది కావచ్చు. ఎనిమిది పన్నెండుమంది కావచ్చు బ్రాంచీలు వార్డులుగా మారవచ్చు.
రక్షకుడు ఇలా బోధించాడు, “ఎక్కడ నా నామమున ఇద్దరు లేక ముగ్గురు కూడుకుంటారో, … ఇదిగో, అక్కడ నేను వారి మధ్య ఉన్నాను.”21 పరలోక తండ్రి మన చుట్టూ ఉన్న జనుల యొక్క మనస్సులు మరియు హృదయాలను సిద్ధపరచుచున్నారు. మనము ప్రేరేపేణలను అనుసరించవచ్చును, స్నేహ హస్తమును అందించవచ్చు, సత్యమును పంచుకొనవచ్చు, ఇతరులు మోర్మన్ గ్రంథమును చదువుటకు ఆహ్వానించవచ్చు, మరియు వారు మన రక్షకుడిని తెలుసుకున్నప్పుడు, వారిని ప్రేమించి, బలపరచవచ్చు.
మోచుడి సహోదరులు బృందము కలిసి తమ ప్రయాణమును ప్రారంభించినప్పటి నుండి దాదాపు 10 సంవత్సరాలైంది, మరియు వారింకను సహోదరుల బృందముగా ఉన్నారు.
“దూరము చేత మేము వేరు చేయబడవచ్చు, కానీ మేము ఇంకను ఒకరినొకరి కొరకు ఉన్నాము,”22 కాట్లెగో అన్నాడు.
మన యాజకత్వ సమూహములందు ఆయనతో ఏకమవ్వమన్న ప్రభువు యొక్క ఆహ్వానమును మనము అంగీకరించాలని నా ప్రార్థన, ఆవిధంగా ప్రతీ సమూహము ఒక చేర్చబడిన స్థలముగా, ఒక సమావేశమగు స్థలముగా, అభివృద్ధి చెందు స్థలముగా ఉండవచ్చు.
యేసు క్రీస్తు మన రక్షకుడు, మరియు ఇది ఆయన కార్యము. ఆవిధంగా నేను యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.