2010–2019
యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము
2019 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము.


యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము

రక్షకుని ప్రాయశ్చిత్తము యొక్క పరిది అనంతమైనది మాత్రమే కాదు, ప్రతి ఒక్కరిని చేరుకోగలదు కూడా.

సంవత్సరము యొక్క ఈ కాలములో మనం ప్రత్యేకముగా రక్షకుని ప్రాయశ్చిత్తము పైన దృష్టిసారించి, ఆనందిస్తాము. ఈ లోకము లేదా విశ్వమునకు ఎప్పటికి తెలిసియున్న సిద్ధాంతములో ఇది అత్యంత దివ్యమైనది, మనస్సును వ్యాకోచింపజేసేది మరియు ప్రజ్వలితమైనది. మన జీవితాలకు నిరీక్షణను, ఉద్దేశాన్ని ఇచ్చేది ఇదే.

యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము అంటే ఏమిటి? ఒక అర్థములో, ఇది గెత్సేమనే తోటలో మొదలై, సిలువ వరకు కొనసాగి, సమాధినుండి రక్షకుని పునరుత్థానముతో చరమావస్థకు చేరుకొనిన దివ్యమైన సంఘటనల క్రమము. అది మనలో ప్రతి ఒక్కరియెడల ఉన్న అగమ్యగోచరమైన ప్రేమ వలన ప్రేరేపించబడింది. దానికి ఏ పాపమెరుగని వ్యక్తి కావలెను; ఆయనకు మరణముతో పాటు పంచభూతములపైన అనంతమైన శక్తిని కలిగియుండాలి, ఆయన మన పాపములు, రుగ్మతల యొక్క పర్యవసానములను అనుభవించుటకు అమితమైన సామర్థ్యము కలిగియుండాలి మరియు వాస్తవానికి అన్నిటికంటే తనను తాను తగ్గించుకొని ఉండాలి.1 యేసు క్రీస్తు యొక్క నియమిత కార్యము ఇదే-ఆయన ప్రాాయశ్చిత్తము ఇదే.

అయితే దీని ఉద్దేశమేమిటి? దాని ఉద్దేశము మనం దేవుని సన్నిధికి తిరిగివెళ్ళి, ఆయనవలె మరింతగా మారి, సంతోషము యొక్క సంపూర్ణత్వమును పొందుటకు మనకు సాధ్యము చెయ్యడం. ఇది నాలుగు అవరోధములను జయించడం వలన చేయబడింది.

  1. శారీరక మరణము

  2. ఆదాము మరియు మన పాపముల వలన కలుగు ఆత్మీయ మరణము.

  3. మన బాధలు మరియు అశక్తతలు

  4. మన బలహీనతలు మరియు లోపాలు

కాని న్యాయము యొక్క చట్టాలను అతిక్రమించకుండా రక్షకుడు దీనిని ఎలా చెయ్యగలరు?

చిత్రం
విమానము నుండి క్రిందకు పడుట

ఒక మనిషి ఉల్లాసకరముగా క్రిందకు పడిపోవడాన్ని ఊహించుకొని, తొందరపాటు నిర్ణయము తీసుకొని, ఒక చిన్న విమానము నుండి ఆకస్మికముగా దూకాడు అని ఒక్క క్షణం అనుకొందాం. ఆ విధంగా చేసిన తరువాత, అతడు వెంటనే తన చర్యల యొక్క మూర్ఖత్వమును తెలుసుకొనును. అతడు సురక్షితముగా క్రిందకు దిగాలనుకుంటాడు, కాని అతనికి ఒక అవరోధము కలదు- అదే భూమ్యాకర్షణ శక్తి . ఎగరాలనే ఆశతో అతడు తన చేతులను అత్యంత వేగముతో కదిలిస్తాడు కాని ప్రయోజనం ఉండదు. నెమ్మదిగా క్రిందకు దిగడానికి తన శరీరాన్ని సమాంతరముగా లేదా జారుడుగా ఉండేలా ప్రయత్నిస్తాడు కాని భూమ్యాకర్షణ శక్తి నిర్ల్యక్ష్యముగా, జాలిలేకుండా ఉండును. ఈ సహజమైన ప్రకృతి నియమముతో కారణము చెప్పుటకు ప్రయత్నిస్తాడు: “ఇది కేవలము ఒక తప్పిదము. ఇంకెప్పుడు నేను చెయ్యను.” కాని అతని విన్నపములు పెడచెవిని పెట్టబడతాయి. భూమ్యాకర్షణ శక్తికి జాలి అంటే ఏమిటో తెలియదు; అది ఎటువంటి మినహాయింపులను ఇవ్వదు. అదృష్టవశాత్తు, అతడు హఠాత్తుగా తన వెనుక ఏదో ఉన్నట్లు భావిస్తాడు. విమానంలో ఉన్న తన స్నేహితుడు, ఆ క్షణంలో అతని మూర్ఖత్వమును చూచి, అతడు దూకేముందు ప్యారాచూట్‌ను తన వెనుకు ఉంచెను. దానిని తెరిచే వదులు తాడును కనుగొని, క్రిందకు లాగుతాడు. ఉపసమనము పొంది, సురక్షితముగా అతడు నేలపైగి దిగుతాడు. మనము ఇలా ప్రశ్నించవచ్చు, “భూమ్యాకర్షణ శక్తి నియమము ఉల్లంఘించబడినదా లేదా సురక్షితముగా క్రిందకు దిగుటకు ఆ ప్యారాచూట్ నియమ పరిధిలో పనిచేసిందా?”

చిత్రం
సురక్షితముగా క్రిందకు దిగుటకు ప్యారాచూట్

మనం పాపం చేసినప్పుడు విమానం నుండి దూకిన ఆ బుద్దిలేని వానివలె ఉన్నాము. మన స్వంతంగా ఏమి చేసినప్పటికి, కేవలం వినాశనకర అవరోహణము వేచియుండను. న్యాయము యొక్క చట్టమునకు మనం లోబడియున్నాము, అది భూమ్యాకర్షణ శక్తివలె కఠినమైనది, క్షమించలేనిది. మనం కేవలం రక్షకుని వలన ఆయన ప్రాయశ్చిత్తము ద్వారా రక్షించబడతాము, అది మనకు ఆత్మీయ ప్యారాచూట్‌లను కరుణతో సమకూర్చును. మనము యేసు క్రీస్తునందు విశ్వాసము కలిగి, పశ్చాత్తాపపడితే (అనగా మనం చెయ్యవలసింది చేసి, ఆ వదులు తాడును క్రిందకు లాగుతాము), అప్పుడు రక్షకుని యొక్క కాపాడు శక్తులు మన తరఫున విడుదల చెయ్యబడతాయి, మరియు మనం ఏ హాని లేకుండా క్రిందకు దిగుతాము.

ఐనప్పటికి, మన ఆత్మీయాభివృద్ధిని నిరోధించగల ఆ నాలుగు అవరోధములను రక్షకుడు జయించుట వలన మాత్రమే ఇది సాధ్యము.

1. మరణము. తన మహిమ గల పునరుత్థానము వలన ఆయన మరణమును జయించెను. “ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు”2 అని అపొస్తలుడైన పౌలు బోధించెను.

2. పాపము పశ్చాత్తాపము చెందినవారి కొరకు రక్షకుడు పాపమును, దోషమును జయించెను. ఆయన యొక్క శుద్ధీకరించు శక్తి ఎంత లోతైనది, విశాలమైనదంటే యెషయా ఇలా వాగ్దానము చేసెను, “పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమము వలె తెల్లబడును.” 3

ఒక సందర్భములో తమను తాము క్షమించుకొనుటకు ఇబ్బంది పడుచున్న మంచి పరిశుద్ధులను నేను కలిసాను, వారు రక్షకుని విమోచన శక్తులపట్ల అమాయకముగా, తప్పుగా పరిమితులను నియమించారు. వారు తెలిసితెలియక అనంత ప్రాయశ్చిత్తమును పరిమితమైనదిగా మార్చారు, అది కొంతవరకు వారి యొక్క నిర్థిష్టమైన పాపమును లేదా బలహీనతను జయించుటకు శక్తిలేనటువంటిది. కాని అది అనంతమైన ప్రాయశ్చిత్తము ఎందుకంటే అది ప్రతి పాపమును, బలహీనతను అదేవిధంగా ఇతరుల వలన కలిగించబడిన ప్రతి హింసను లేదా బాధను చుట్టిముట్టి, సరిహద్దులను ఏర్పరచును.

ట్రూమన్ మేడ్సన్ ఈ ఓదార్పును కలిగించు పరిశీలన చేసారు:

“మీలో కొందరు మీరు చాలా దూరం వెళ్ళారని కపటముగా నమ్మించబడి . . .మీరు ఏమి కాగలరో ఆవిధంగా అగుటకు మీలో నున్న పాపపు విషము దానిని అసాధ్యము చేస్తుందని మీరు ఒప్పించబడినట్లైతే-నేను చెప్పేది వినండి.

“యేసు క్రీస్తు యొక్క వెలుగు మరియు విశాలమైన జ్ఞానము చేరగలిగే దానికంటే ఎక్కువ దూరములో మీరు పడలేరని నేను సాక్ష్యమిస్తున్నాను. పశ్చాత్తాపపడాలని, ఆయనను చేరుకోవాలని చిన్న మెరుపంత కోరిక మీలో ఉన్నంతవరకు ఆయన మీకు అందుబాటులో ఉండునని నేను సాక్ష్యమిస్తున్నాను. కేవలం మీ స్థాయికి ఆయన దిగిరాలేదు, దానికంటే క్రిందకే ఆయన దిగివచ్చారు తద్వారా ఆయన అన్ని విషయాలలో, అన్ని విషయాలగుండా సత్యమునకు వెలుగుగా ఉండగలరు.’ [సిద్ధాంతము మరియు నిబంధనలు 88:6.]”4

రక్షకుని ప్రాయశ్చిత్తము మరియు దాని యొక్క అనంతమైన పరిణామాలను మనం అర్థం చేసుకొనుట మిక్కిలి ఆవశ్యకము అనుటకు ఒక కారణమేమంటే, ఎంత ఎక్కువ అవగాహన కలిగియుంటే అంత ఎక్కువ మనకుమనము మరియు ఇతరులను క్షమించగలుగుతాము.

క్రీస్తు యొక్క శుద్ధీకరించు శక్తులయందు నమ్మకముంచినప్పటికి, తరచు మనకు ఎదురయ్యే ప్రశ్న: “నా పాపములు క్షమించబడ్డాయని నేనెలా తెలుసుకోగలను?” మనం ఆత్మను భావించినట్లైతే, మనం క్షమించబడ్డామని లేదా శుద్ధీకరణ ప్రక్రియ జరుగుతుందని అది మనకు ఒక సాక్ష్యము. అధ్యక్షులైన హెన్రీ బి. ఐరింగ్ ఇలా బోధించారు, ”మీరు పరిశుద్ధాత్మ యొక్క ప్రభావాన్ని భావించినట్లైతే, ప్రాాయశ్చిత్తము మన జీవితములో పనిచేస్తుందని దానిని మీరు ఒక రుజువుగా తీసుకొనవచ్చును.”5

చిత్రం
అంతమయ్యే రహదారి

”నేను క్షమించబడినట్లైతే, నేనెందుకు ఇంకా నిందాభావముతో ఉన్నాను?” అని కొంతమంది అడిగారు. బహుశా దేవుని కరుణను బట్టి, ఆ నిందాభావము ఒక హెచ్చరిక, ఒక ఆత్మీయ ”ఆగుము అనే చిహ్నము” వంటిది, కనీసం కొంత కాలము వరకు అది మరిన్ని శోధనలు వచ్చినప్పుడు ”ఆ మార్గములో వెళ్లవద్దు” అని గట్టిగా మనకు చెప్పును. అది తెచ్చే బాధ నీకు తెలుసు.” ఈ అర్థములో అది మనకు రక్షణగా ఉండును కాని శిక్షగా కాదు.

మన పాపములను జ్ఞాపకముంచుకొని కూడా నిందాభావము లేకుండా ఉండటం సాధ్యమా?

ఆల్మా పశ్చాత్తాపపడిన అనేక సంవత్సరాల తరువాత కూడా తన పాపములను జ్ఞాపకముంచుకొనెను. కాని ఆయన కరుణ చూపించమని యేసును వేడుకొన్నప్పుడు, ఆయన ఇలా చెప్పారు, ”నేను నా బాధలను ఇక ఏ మాత్రము జ్ఞాపకము చేసుకొనక యుంటిని, అవును నేను నా పాపముల యొక్క జ్ఞాపకము చేత ఇక ఏ మాత్రము బాధింపబడ లేదు.”6

ఆయన తన పాపములను జ్ఞాపకము చేసుకొని, ఎటువంటి బాధ లేదా నిందాభావము లేకుండా ఎలా ఉండగలరు? ఎందుకంటే పశ్చాత్తాప పడినప్పుడు మనము ”దేవుని వలన జన్మించినవారము.”7 లేఖనములు చెప్పునట్లు మనం క్రీస్తులో ”నూతన సృష్టి” అవుతాము.8 పరిపూర్ణ నిజాయితీతో ”ఆ గత పాపములు చేసిన పురుషుడు లేదా స్త్రీని నేను కాదు” అని ఇప్పుడు మనం చెప్పగలం. నేను నూతన, రూపాంతరము చెందిన వ్యక్తిని.”

3. బాధలు మరియు అశక్తతలు. క్రీస్తు ”ప్రతి రకమైన బాధలు మరియు శ్రమలు మరియు శోధనలు అనుభవించుచు ముందుకు వెళ్ళును” అని ఆల్మా ప్రవచించెను. ఎందుకు? ”శరీరమును బట్టి ఆయన ప్రేగులు కనికరముతో నిండవలెనని, . . . వారి యొక్క బలహీనతలను బట్టి తన జనులను ఎట్లు ఆదరించవలెనో శరీరమును బట్టి ఆయన ఎరుగును.”9

దీనిని ఆయన ఏవిధంగా సాధించారు? కొన్ని సార్లు ఆయన మన శ్రమలను తొలగిస్తారు, కొన్నిసార్లు వాటిని సహించుటకు మనల్ని బలపరుస్తారు మరియు కొన్నిసార్లు వాటి యొక్క తాత్కాలిక స్వభావమును శ్రేష్టముగా అర్థము చేసుకొనునట్లు నిత్య దృష్టికోణాన్ని ఆయన మనకు ఇస్తారు. జోసెఫ్ స్మిత్ లిబర్టి చెరశాలలో రెండు నెలలు క్షీణించినప్పుడు, చివరకు ఆయన ”ఓ దేవా, నీవెక్కడ ఉన్నావు?” అని ప్రార్థించెను.10 దేవుడు తక్షణ ఉపశమనమును ఇవ్వకుండా, ”నా కుమారుడా, నీ ఆత్మకు శాంతి కలుగును గాక; నీ లేమి నీ కష్టములు కొంతకాలమే ఉండును; దానిని నీవు సహించిన యెడల, దేవుడు నిన్ను ఉన్నతమునకు హెచ్చించును; నీ శత్రువులందరి పైన నీవు జయము పొందెదవు.”11

ఈ చేదు అనుభవము నిత్య వర్ణపటములో కేవలం చిన్న బిందువని అప్పుడు జోసెఫ్ అర్థము చేసుకొనెను. ఈ హెచ్చించిన దర్శనముతో, ఆ చెరశాల గదినుంచే పరిశుద్ధులకు ఆయన ఇలా వ్రాసారు, ”కాబట్టి, మిక్కిలి ప్రియమైన సహోదరులారా, మన సామర్థ్యము మేరకు అన్నింటిని సంతోషముతో చేయుదము; అప్పుడు దేవుని రక్షణను చూచుటకును, ఆయన బాహువు బయలుపరచబడుట కొరకును మనము మిక్కిలి నిశ్చయముతో నిలిచియుండెదము.”12 రక్షకుని ప్రాాయశ్చిత్తము వలన మనము నిత్య దృష్టికోణమును కలిగియుందుము అది మన శ్రమలకు అర్థాన్ని, ఉపశమనము కొరకు నిరీక్షణను ఇచ్చును.

4. బలహీనతలు మరియు లోపాలు. ఆయన ప్రాయశ్చిత్తము వలన రక్షకుడు సాధ్యపరచు శక్తులను కలిగియున్నారు, వాటిని కొన్నిసార్లు కృప అని సూచిస్తారు13, అది మన బలహీనతలను, లోపాలను జయించుటకు సహాయపడగలదు, తద్వారా ఆయన వలె మరింతగా అవ్వాలనే మన అన్వేషణలో సహాయపడగలదు.

మొరోనై కూడా ఇలానే బోధించారు, ”అవును, క్రీస్తు నొద్దకు రమ్ము, మరియు ఆయనలో పరిపూర్ణుడవు కమ్ము, ... ఆయన కృప ద్వారా మీరు క్రీస్తునందు పరిపూర్ణులగుదురు.” 14 మనలను శుద్ధిచేయు-లేదా పరిపూర్ణులను కూడా చేయు ఆ సాధ్యపరచు శక్తులను పొందాలంటే కనీసం రెండు దారులు లేదా ఉపాయాలు ఉన్నట్లు కనిపిస్తున్నది.

మొదటిది, రక్షించు విధులు. ”ఆ విధులలో, దైవత్యము యొక్క శక్తి ప్రత్యక్షపరచబడుచున్నది”15 అని లేఖనములు బోధించుచున్నవి. కొన్నిసార్లు మనం విధులను మహోన్నతస్థితికి ఆవశ్యకమగు ప్రాధమిక జాబితాగా యోచించవచ్చును, కాని వాస్తవానికి ప్రతి ఒక్కటి ఒక దైవిక శక్తిని విడుదల చేస్తుంది అది ఆయనవలె మరింతగా అగుటకు మనకు సహాయపడుతుంది. ఉదాహరణకు:

  • మనం బాప్తీస్మము పొంది, పరిశుద్ధాత్మ వరమును పొందినప్పుడు, మనం పవిత్రము చేయబడ్డాము-తద్వారా దేవుని వలె మరింత పరిశుద్ధముగా అవుతున్నాము.

  • దీనికి అదనముగా పరిశుద్ధాత్మ ద్వారా మన మనస్సులు వెలిగింపబడతాయి, మన హృదయాలు మృదువుగా అవుతాయి, అందువలన మనం మరింతగా ఆయనకు వలె ఆలోచించగలము, భావించగలము.

  • సహచరులుగా మనం ముద్రింపబడినప్పుడు, ”సింహాసనములను, రాజ్యములను, ప్రధానులను, అధికారములను”16 దేవుని యొద్దనుండి బహుమానములుగా పొందే హక్కును స్వాస్థ్యముగా పొందుతాము.

సాధ్యపరచు ఈ శక్తులకు రెండవ ఉపాయమేదనగా ఆత్మ వరములు. క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము వలన, పరిశుద్ధాత్మ వరమును, దాని అనుబంధిత ఆత్మీయ వరాలను పొందుటకు మనం అర్హులము. ఈ వరాలు దైవత్వము యొక్క లక్షణాలు; కాబట్టి, ప్రతిసారి మనం ఒక ఆత్మ వరమును సంపాదించినప్పుడు, మనం దేవునివలె మరింతగా అవుతాము. ఇందువలనే ఈ వరాలను అపేక్షించమని అనేక సందర్భాలలో లేఖనాలు మనల్ని ఆదేశిస్తాయి అనుటలో సందేహము లేదు. 17

అధ్యక్షులు జార్జ్ క్యూ. కేనన్ ఇలా బోధించారు: ”ఏ మనిషి కూడా, ‘నేను ఈ విషయంలో ఏమీ చెయ్యలేను; నా స్వభావము ఇంతే అని చెప్పకూడదు.‘ అతడు ఈ విషయంలో నీతిమంతుడుగా ఎంచబడడు, ఎందుకంటే [మన బలహీనతలను] నిర్మూలించే వరాలను ఇస్తానని దేవుడు మనకు వాగ్దానము చేసెను… మనలో ఎవరైనా అసంపూర్ణులైతే, మనల్ని పరిపూర్ణులుగా చేసే వరం కొరకు ప్రార్థించుట మన బాధ్యత.”18

సారాంశము ఏమంటే, రక్షకుని ప్రాయశ్చిత్తము - మరణమునకు ప్రతిగా జీవమును, ”బూడిదెకు ప్రతిగా పూదండను,”19 గాయమునకు ప్రతిగా స్వస్థతను, బలహీనతకు బదులుగా పరిపూర్ణతను ఇచ్చును. ఈ లోకము యొక్క అడ్డంకులు, కష్టాలకు అది పరలోకము ఇచ్చే విరుగుడు.

రక్షకుని మర్త్యత్వము యొక్క ఆఖరి వారములో, ఆయన ఇలా చెప్పారు, ”లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.”20 రక్షకుడు ప్రాయశ్చిత్తమును చేసెను గనుక, మనం దేవుని ఆజ్ఞలను పాటించినట్లైతే, ఏ బాహ్య బలము లేదా సంఘటన లేదా వ్యక్తి-ఏ పాపము లేదా మరణము లేదా విడాకులు-మనం మహోన్నత స్థితిని పొందకుండా నిరోధించలేవు. ఆ జ్ఞానముతో, ఈ పరలోక అన్వేషణలో దేవుడు మనతో ఉన్నాడను ఖచ్చితమైన అభయముతో, సంతోషముతో ముందుకు సాగిపోగలము.

రక్షకుని ప్రాయశ్చిత్తము యొక్క పరిది అనంతమైనది మాత్రమే కాదు, ప్రతి ఒక్కరిని చేరుకోగలదు కూడా-అది మనల్ని దేవుని యొద్దకు తిరిగి తీసుకొని వెళ్ళడమే కాదు, ఆయన వలె అగుటకు మనల్ని సాధ్యంచేస్తుంది-క్రీస్తు ప్రాయశ్చిత్తము యొక్క అత్యున్నతమైన లక్ష్యము ఇదే. దీని గురించి నా కృతజ్ఞతగల, నిశ్చయమైన సాక్ష్యమును యేసు క్రీస్తు నామములో ఇస్తున్నాను, ఆమేన్.

ముద్రించు