2010–2019
యేసు క్రీస్తు యొక్క నిజమైన, స్వచ్ఛమైన, సరళమైన సువార్త
2019 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము.


2:3

యేసు క్రీస్తు యొక్క నిజమైన, స్వచ్ఛమైన, సరళమైన సువార్త

దేవుని ప్రేమించడం, పొరుగువారిని ప్రేమించడమనేది పరిచర్య యొక్క సిద్ధాంతపరమైన పునాది; గృహ-కేంద్రీకృతమైన, సంఘ-సహకారమివ్వబడిన అధ్యయనము; సబ్బాతు-దిన ఆత్మీయ ఆరాధన; మరియు రక్షణ కార్యము.

నా ప్రియ సహోదర సహోదరీలారా, 71 సంవత్సరాల క్రితం, 1948లో నేను ఇంగ్లండులో మిషనరీగా ఉన్నానని, 44 సంవత్సరాల క్రితం నేను కెనడా టొరంటో మిషను అధ్యక్షునిగా ఉన్నప్పుడు నేను, బార్బరా మా కుటుంబాన్ని కెనడాకు తీసుకువెళ్ళామని నమ్మడం నాకు కష్టంగా ఉంది. 1976 ఏప్రిల్ లో అక్కడ సేవచేస్తుండగా నేను డెబ్బది యొక్క మొదటి సమూహానికి పిలువబడ్డాను. అనుకోకుండా 1985లో నేను పన్నెండుమంది అపొస్తలుల సమూహానికి పిలువబడ్డాను. భవిష్యత్తులో విడుదల కలిగిన నా మునుపటి పిలుపుల వలె కాకుండా, పన్నెండుమంది పిలుపునుండి నా విడుదల ఇప్పుడు సరైనది కాదు; అయినా, నేను చేయాలని ప్రభువు చెప్పిన వాటన్నింటిని పూర్తిచేసిన తర్వాత మాత్రమే ఆ రోజు రావాలని నేను ప్రార్థిస్తున్నాను.

ఒక ప్రధాన అధికారిగా నా గత 43 ఏళ్ళ సేవ గురించి, పరలోకతండ్రి పిల్లలకు పరిచర్య చేయడానికి నాకు కలిగిన విశేషాధికారం గురించి ఆలోచించినప్పుడు, తన పిల్లలందరు వారి జీవితాల్లో సమాధానము, ఆనందము, సంతోషాలను కనుగొనాలని ఆయన కోరుకుంటున్నారని ఎక్కువగా గ్రహించాను నేను.

“మనుష్యులు సంతోషము కలిగియుండునట్లు వారున్నారని,” ప్రవక్త లీహై బోధించారు. 1 పేదరికం, యుద్ధం, ప్రకృతి వైపరిత్యాలతో పాటు ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబ బంధాల్లో ఊహించని పరిణామాలు కలగలిసిన ఈ జీవితంలో సమాధానం, ఆనందం, సంతోషాలు మన నుండి తప్పించుకు పోవడానికి కారణాలు అనేకం.

భూమి మీద మన జీవితాలను ప్రభావితం చేసే బాహ్య శక్తులను మనం నియంత్రించలేక పోయినప్పటికీ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క విశ్వాసముగల శిష్యులయ్యేందుకు ప్రయత్నించినప్పుడు, లోక సమస్యలు మనల్ని చుట్టుముట్టినప్పటికీ మనం సమాధానము, ఆనందము, సంతోషాలను కనుగొనగలము.

మా పిల్లల్లో ఒకరు ఒకసారి, “నాన్నా, నేను ఎప్పటికయినా దీనిని చేయగలనా,” అన్నారు. “ప్రతి రోజు మనం చేయగలిగిన దానిని బాగా చేయమని మాత్రమే పరలోకతండ్రి మనల్ని అడుగుతున్నారని,” నేను చెప్పాను. సహోదర సహోదరీలారా, ప్రతీరోజు మీరు చేయగలిగినంత బాగా చేయండి, మీరు ఊహించేలోపు మీ పరలోకతండ్రి మిమ్మల్ని ఎరుగుదురని, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారని మీరు గ్రహించగలుగుతారు. మీరలా గ్రహించినప్పుడు--నిజంగా తెలుసుకున్నప్పుడు--మీ జీవితానికి నిజమైన అర్థం, పరమార్థం ఉంటుంది మరియు మీరు ఆనందం, సమాధానాలతో నింపబడతారు.

“నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచియుండకుండునట్లు,” నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నానని రక్షకుడు చెప్పారు. 2

“యేసు క్రీస్తు అను నామము తండ్రి చేత ఇవ్వబడెను, మనుష్యుడు రక్షించబడుటకు మరే ఇతర నామము ఇవ్వబడలేదు;

“కాబట్టి, తండ్రిచేత ఇవ్వబడిన నామమును మనుష్యులందరు తమపైకి తీసుకొనవలెను.3

సాతాను మనుష్యులను అంధకారములోనికి నడిపించాలని కోరుతున్నాడని లేఖనాలు మనకు బోధిస్తున్నాయి. యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త యొక్క వెలుగును, సత్యమును నిలిపివేయాలనేదే అతని ప్రయత్నము. లీహై తన పిల్లలకు బోధించినట్లుగా, “నరులందరు అతని వలె దౌర్భాగ్యులుగా ఉండవలెనని” అపవాది కోరుతున్నాడు.4 మనుష్యులందరికి అమర్త్యత్వమును, నిత్యజీవమును తెచ్చుటయే పరలోకతండ్రి కార్యము మరియు మహిమ అయినట్లయితే, 5 దేవుని పిల్లలందరికి కష్టాలను, అంతులేని దుఃఖమును తెచ్చుటయే లూసిఫరు కార్యమైయున్నది. పాపము, అతిక్రమము మన జీవితాల్లో క్రీస్తు యొక్క వెలుగును తగ్గిస్తాయి. అందుకే సమాధానము, ఆనందము, సంతోషాలను తెచ్చే క్రీస్తు యొక్క వెలుగులో నిలిచేందుకు మనం తపించాలి.

గత 18 నెలల కాలంలో, అనేక అద్భుతమైన సవరణలు చేపట్టడానికి ప్రభువు తన ప్రవక్తను, అపొస్తలులను ప్రేరేపించారు. అయితే, ఈ మార్పులను గురించిన అతి ఉత్సాహములో ఈ సవరణల యొక్క ఆత్మీయ ఉద్ధేశాలు కోల్పోబడతాయేమోనని నేను చింతిస్తున్నాను.

చాలా సంవత్సరాల క్రితం జోసెఫ్ ఎఫ్. స్మిత్ ఇలా చెప్పారు: “యేసు క్రీస్తు యొక్క నిజమైన, స్వచ్ఛమైన, సరళమైన సువార్త పునఃస్థాపించబడింది. భూమి మీద దానిని నిర్వహించే బాధ్యత మనది.”6 నిజమైన, స్వచ్ఛమైన, సరళమైన సువార్త, “క్రీస్తు యొక్క రక్షణ సిద్ధాంతమని” కూడా ఆయన చెప్పారు. 7

“క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా, సువార్త యొక్క నియమాలకు, విధులకు లోబడుట చేత మనుష్యులందరు రక్షింపబడగలరని“ 8 ప్రవక్త జోసెఫ్ స్మిత్ బోధించారు.

సువార్త యొక్క మొదటి సూత్రములేవనగా ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసము, పశ్చాత్తాపము, బాప్తీస్మము, పరిశుద్ధాత్మ వరము మరియు అంతము వరకు సహించుట. ఆయన తండ్రి హైరం స్మిత్ పదేపదే ఇలా చెప్పారు: “సువార్త యొక్క మొదటి సూత్రాలను బోధించండి--మళ్ళీ మళ్ళీ బోధించండి: రోజు రోజుకి వాటి గురించి క్రొత్త ఆలోచనలు, అదనపు వెలుగు మీకు బయల్పరచబడడాన్ని కనుగొంటారు. వాటిని స్పష్టంగా గ్రహించడానికి మీరు వాటి గురించి విస్తారంగా మాట్లాడవచ్చు. అప్పుడు మీరు బోధించే వారికి అవి సులువుగా అర్థమయ్యేలా మీరు చేయగలరు.”9

సంఘము యొక్క ఆత్మీయ ఉద్దేశాలను చూడడానికి సరైన మార్గాలు క్రీస్తు యొక్క నిజమైన, స్వచ్ఛమైన, సరళమైన బోధనల ప్రకారం జీవించడం మరియు రక్షకుని యొక్క రెండు గొప్ప ఆజ్ఞలను అన్వయించడం, అవి: “మీ పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించవలెను. … నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలెను.”10

ఆ రెండు గొప్ప ఆజ్ఞలకు విధేయత చూపడం మరింత ఎక్కువ సమాధానము, ఆనందాలను అనుభవించడానికి మార్గాన్ని ఏర్పరుస్తుంది. మనము ప్రభువును ప్రేమించి, సేవించినప్పుడు మరియు మన పొరుగువారిని ప్రేమించి, సేవించినప్పుడు మరేవిధంగా రానంత ఎక్కువ సంతోషాన్ని మనం సహజంగానే అనుభవిస్తాము.

మన దేవుని ప్రేమించడం, మన పొరుగు వారిని ప్రేమించడం అనేవి పరిచర్య యొక్క సిద్ధాంతపరమైన పునాదులు; కుటుంబ కేంద్రీకృత, సంఘ సహకార అభ్యాసము; సబ్బాతు దిన ఆత్మీయ ఆరాధన; ఉపశమన సమాజము మరియు ఎల్డర్ల సమూహములలో బలపరచు తెరకు రెండువైపుల రక్షణ కార్యము. ఈ సంగతులన్నీ దేవుని ప్రేమించుము మరియు మీ పొరుగువారిని ప్రేమించుము అనే దివ్యమైన ఆజ్ఞలపైన ఆధారపడియుంటాయి. దీనికంటే మరింత మూలాధారమైనది, మరింత ప్రధానమైనది, మరింత సరళమైనది ఏదైనా ఉంటుందా?

నిజమైన, స్వచ్ఛమైన, సరళమైన సువార్త ప్రణాళికను జీవించడం, వితంతువులను, అనాథలను, ఒంటరివారిని, రోగులను, బీదవారిని దర్శించడానికి మనకు అధిక సమయాన్నిస్తుంది. ప్రభువును, మన పొరుగువారిని సేవించినప్పుడు జీవితంలో మనం సమాధానము, ఆనందము, సంతోషాలను కనుగొంటాము.

గృహ-కేంద్రీకృత, సంఘ-సహకార సువార్త అధ్యయనము మరియు అభ్యాసాలను నొక్కిచెప్పే సబ్బాతుదిన సవరణలు, మన ఇంటిలోపల దేవుని పట్ల మన భక్తిని, మన ఆత్మను పునరుద్ధరించుకోవడానికి గల అవకాశాలు. దీనికంటే సరళమైనది, మూలాధారమైనది, లోతైనది ఏమైయుంటుంది? సహోదర సహోదరీలారా, మన జీవితాల్లో ఆనందాన్ని, సంతోషాన్ని కనుగొనడానికి గల ముఖ్యమైన మార్గము మన కుటుంబాల్లో సువార్తను నేర్చుకోవడం మరియు బోధించడమని మీరు చూడగలుగుతున్నారా?

సబ్బాతు గురించి మాట్లాడుతూ రక్షకుడు, “నీ పనుల నుండి విశ్రాంతి పొంది, మహోన్నతునికి నీ భక్తిని చూపుటకు నిశ్చయముగా ఈ దినము నీ కొరకు నియమించబడినదని“ చెప్పారు.11 “నీ సంతోషము సంపూర్ణమగుటకు . . . ఆనందము మరియు ప్రార్థన ద్వారా. . .ఈ సంగతులన్నిటిని కృతజ్ఞతతోను, సంతోషకరమైన హృదయములు, ముఖములతోను ---సంతోషకరమైన హృదయము, సంతోషకరమైన ముఖముతో చేయవలెనని“ కూడా ఆయన చెప్పారు.12

దయచేసి ఈ బయల్పాటులోని ముఖ్య పదాలు కొన్నింటిని గమనించండి: ఆనందము, సంతోషపడుట, కృతజ్ఞత, సంతోషకరమైన హృదయాలు, సంతోషకరమైన, హృదయము మరియు సంతోషకరమైన ముఖము. దీనిని బట్టి సబ్బాతుదిన ఆచరణ మన ముఖాలపై చిరునవ్వులను తేవాలనిపిస్తోంది నాకు.

సంఘములో పలుకరింపు

మనము ఉన్నతమైన, పరిశుద్ధ విధానంలో పరిచర్య చేస్తున్నప్పుడు, మన సంఘ సమావేశాలకు వచ్చే ప్రతి ఒక్కరిని, ప్రత్యేకించి క్రొత్త సభ్యులను, సందర్శకులను పలుకరించడం ఎంత ముఖ్యమో దయచేసి ఆలోచించండి. కీర్తనలు పాడడాన్ని, విప్పారిన హృదయము, మనస్సులతో సంస్కార ప్రార్థనల పదాలను శ్రద్ధగా వినడాన్ని మనమందరం ఆస్వాదించాలి.

మన ఉపవాసము మరియు సాక్ష్యపు సమావేశాల్లో విశ్వాసభరిత సాక్ష్యాలు బిషప్రిక్కు యొక్క సభ్యునిచేత నడిపించబడతాయి, ఆయన సంతోష ప్రణాళికపై మరియు క్రీస్తు యొక్క నిజమైన, స్వచ్ఛమైన, సరళమైన సువార్తపై కేంద్రీకరించబడిన క్లుప్తమైన సాక్ష్యాన్ని పంచుకుంటారు. మిగతా వారందరు ఆ మాదిరిని అనుసరించాలి. కథలు చెప్పడానికి లేదా సాహసోపేత ప్రయాణాల గురించి పంచుకోవడానికి తగిన ప్రదేశాలు వేరే ఉన్నాయని మనం గుర్తుంచుకోవాలి. మన సాక్ష్యాలను సరళంగా ఉంచి, క్రీస్తు యొక్క సువార్త పైన కేంద్రీకరించినప్పుడు, ఒకరితో ఒకరం సాక్ష్యాన్ని పంచుకుంటున్నప్పుడు ఆయన ఆత్మీయ పునరుద్ధరణను అందిస్తారు.

దేవుని ప్రేమించడం, పొరుగువారిని ప్రేమించడం అనే భూతద్దం గుండా సమర్థవంతమైన పరిచర్య బాగా చూడబడుతుంది. సులువుగా చెప్పాలంటే, మన పరలోకతండ్రిని, ఆయన పిల్లల్ని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి మనం పరిచర్య చేస్తున్నాము. మన పరిచర్యను సరళంగా ఉంచినట్లయితే, మన పరిచర్య ప్రయత్నాలు మరింత సఫలమవుతాయి. జీవితంలో సరళమైన విషయాలనుండే అత్యంత ఆనందం కలుగుతుంది, కాబట్టి దేవుని పిల్లల హృదయాల్లో విశ్వాసాన్ని, బలమైన సాక్ష్యాలను పెంపొందించడానికి మనం పొందిన సవరణలకు అధికంగా జతచేయాలని ఆలోచించకుండా ఉండేందుకు మనం జాగ్రత్త వహించాలి.

అదనపు సమావేశాలు, అంచనాలు, లేక అవసరాలతో విషయాలను క్లిష్టంగా చేయవద్దు. సరళంగా ఉంచండి. నేను చెప్తున్న సమాధానము, ఆనందము, సంతోషాలను ఆ సరళత్వములోనే మీరు కనుగొంటారు.

ఏళ్ళ తరబడి సంఘము యొక్క నాయకత్వ ఉద్ధేశాలు చేతి పుస్తకము 2 లో చెప్పబడినట్లుగా స్పష్టమైన, సరళమైన ఫలితాలు.

దశమభాగ పరిష్కారములో కుటుంబము

“అవసరమైన యాజకత్వ విధులన్నీ పొందమని, సంబంధిత నిబంధనలను పాటించమని, ఉన్నతస్థితికి, నిత్యజీవితానికి అర్హులుగా ఉండమని నాయకులు ప్రతి సభ్యుడిని ప్రోత్సహిస్తారు. . . .

దేవాలయములో భార్యాభర్తలు

వయోజనులు: దేవాలయ విధులను పొందడానికి యోగ్యులుగా ఉండమని ప్రతి వయోజనుని ప్రోత్సహించండి. తమ పూర్వీకులను గుర్తించి, వారికి బదులుగా దేవాలయ విధులను నిర్వహించమని వయోజనులందరికి బోధించండి.

యాజకత్వ నియామకము
దేవాలయ విధి కార్డులతో యువతులు

యౌవనులు: మెల్కీసెదకు యాజకత్వాన్ని పొందడానికి, దేవాలయ విధులను పొందడానికి, పూర్తి-కాల మిషను సేవకు యోగ్యులుగా ఉండేందుకు ప్రతి యువకుడు సిద్ధపడేందుకు సహాయపడండి. పరిశుద్ధ నిబంధనలు చేసి పాటించడానికి, దేవాలయ విధులను పొందడానికి యోగ్యులుగా ఉండేందుకు ప్రతి యువతి సిద్ధపడేందుకు సహాయపడండి. అర్థవంతమైన కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయడం ద్వారా యువతను బలపరచండి.

వార్డు సలహాసభ

సభ్యులందరు: యాజకత్వ మరియు సహాయక నాయకులకు, వార్డు సలహాసభలకు, వార్డు మరియు పూర్తి-కాల మిషనరీలకు సహాయమందించాలి. వ్యక్తులను కాపాడేందుకు, కుటుంబాలను, సంఘ విభాగాలను బలపరచడానికి, యాజకత్వ కార్యకలాపాలను పెంచడానికి మరియు మార్పిడి, నిలుపుదల, క్రియాశీలతల ద్వారా ఇశ్రాయేలును సమకూర్చడానికి సరితూగే ప్రయత్నాలలో సభ్యులు సహకరించుకుంటూ పనిచేయాలి. తమకోసం, తమ కుటుంబాల కోసం సమకూర్చుకుంటూ ప్రభువు విధానంలో పేదలకు, అవసరంలోనున్న వారికి సహాయపడమని సభ్యులకు బోధించండి.”13

సంఘములో నా సేవ అనేక విశేషమైన మరియు ప్రత్యేకమైన ఆత్మీయ అనుభవాలతో నన్ను దీవించింది. ఆయన ఉద్దేశాలను సాధించేందుకు ప్రభువు తన సంఘాన్ని నడిపిస్తారనడానికి నేనొక సాక్ష్యం. నా సామర్థ్యాన్ని మించి నేను దైవిక నడిపింపును పొందాను. నా మట్టుకు సువార్త జీవనం యొక్క ఆనందము, యేసు క్రీస్తు యొక్క నిజమైన, స్వచ్ఛమైన, సరళమైన సిద్ధాంతము మరియు సువార్తపైన కేంద్రీకరించబడింది.

స్పెన్సర్ డబ్ల్యు. కింబల్ నుండి రస్సెల్ ఎమ్. నెల్సన్ వరకు ఆరుగురు ప్రవక్తలు మరియు సంఘ అధ్యక్షుల తాళపుచెవులు మరియు నడిపింపు క్రింద నేను సేవచేసాను. వారిలో ప్రతిఒక్కరు దేవునిచేత ఎన్నుకోబడిన ప్రవక్తయని నేను సాక్ష్యమిస్తున్నాను. సంఘము, సువార్త మరియు క్రీస్తు యొక్క సిద్ధాంతం గురించి ఆవశ్యకమైన సూత్రాలను వారు మనకు బోధించారు. అధ్యక్షులు నెల్సన్ గారు ప్రభువు కార్యాన్ని ఉత్కంఠభరితమైన వేగంతో ముందుకు తీసుకువెళ్తున్నారు. “ఉత్కంఠభరితమైన” అన్నాను, ఎందుకంటే అపొస్తలులలో నా కంటే వయస్సులో పెద్దవారు ఆయన ఒక్కరే, ఆయనతోపాటు ముందుకు సాగడం నాకు కష్టమవుతోంది. యాజకత్వపు తాళపుచెవులు మరియు దేవుని ప్రవక్త యొక్క బాధ్యత ఆయనపై ఉన్నాయనడానికి నేనొక సాక్ష్యం. అధ్యక్షులు నెల్సన్ గారు యేసు క్రీస్తు యొక్క నిజమైన, స్వచ్ఛమైన, సరళమైన సువార్తను బోధిస్తారు. యేసే క్రీస్తు, ఇది ఆయన సంఘము--అని యేసు క్రీస్తు నామమున సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.