2010–2019
క్రీస్తు యొక్క మాటలను విందారగించుట
2019 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము.


2:3

క్రీస్తు యొక్క మాటలను విందారగించుట

మన హృదయాలను మనము సిద్ధపరచిన యెడల, క్రీస్తు యొక్క మాటలను విందారగించుట ఎప్పుడైన, ఏ సందర్భములోనైన జరగవచ్చు.

మన పరలోక తండ్రి మనల్ని ప్రేమిస్తున్నారు. ఆయన తన దీవెనలు ఆనందించుటకు మన కొరకు ఒక పరిపూర్ణమైన ప్రణాళికను అందించాడు. ఈ జీవితంలో, మనమందరము క్రీస్తునొద్దకు వచ్చుటకు మరియు బాప్తీస్మము, పరిశుద్ధాత్మ యొక్క వరము పొందుట, సువార్తను విశ్వాసముగా జీవించుట ద్వారా పునఃస్థాపించబడిన యేసు క్రీస్తు యొక్క సువార్తను పొందుటకు ఆహ్వానించబడ్డాము. బాప్తీస్మము పొందుటకు మన ఒడంబడికను “ఇరుకైన మరియు సంకుచితమైన మార్గము” ప్రవేశించుటగా నీఫై వివరించాడు మరియు “క్రీస్తు నందు ఒక నిలకడతో . . . పరిపూర్ణమైన ప్రకాశవంతమైన నిరీక్షణ కలిగియుండి త్రోసుకు వెళ్ళవలెను, మరియు అంతము వరకు స్థిరముగా ” నుండుటకు కొనసాగించమని అతడు మనకు జ్ఞాపకము చేయుచున్నాడు (2 నీఫై 31:19–20).

మనము “క్రీస్తు యొక్క మాటలను విందారగించిన,” యెడల అవి “(మనము) చేయాల్సిన కార్యములన్నిటినీ (మనకు) బోధించును ”(నీఫై 32:3) మరియు “అపవాది యొక్క అగ్ని బాణములు ” (1 నీఫై 15:24) జయించుటకు మనము శక్తి ఇవ్వబడతాము.

విందారగించుట అనగా ఏమిటి?

నేను చిన్నవానిగా ఉన్నప్పుడు, విందారంగిచుట కేవలము అన్నము, సుషి, మరియు సోయా సాస్‌తో ఎక్కువ ఆహారము తినుట అని నేను అనుకున్నాను. విందారగించుట అనగా ఒక రుచికరమైన భోజనమును ఆనందించుట కంటే ఎక్కువని ఇప్పుడు నేను ఎరుగుదును. అది సంతోషము, పోషణ, వేడుక, పంచుకొనుట, కుటుంబాలు మరియు ప్రేమించిన వారితో ప్రేమను వ్యక్తపరచుట, దేవునితో మన కృతజ్ఞతను తెలుపుట మరియు సమృద్ధియైన, అనివార్యముగా రుచికరమైన ఆహారమును ఆనందించుచుండగా అనుబంధాలను నిర్మించుట యొక్క అనుభవము. మనము క్రీస్తు యొక్క మాటలను విందారగించినప్పుడు, మనము అదేవిధమైన అనుభవమును ఆలోచించాల్సియున్నదని నేను నమ్ముతున్నాను. లేఖనములపై విందారగించుట కేవలము వాటిని చదవటం కాదు. అది మనకు నిజమైన సంతోషమును తేవాలి మరియు రక్షకునితో మన అనుబంధమును నిర్మించాలి.

ఇది మోర్మన్ గ్రంథములో స్పష్టముగా బోధించబడింది. లీహై యొక్క దర్శనమును గుర్తు చేసుకొనుము, అక్కడ అతడు ఒక వృక్షమును చూసాడు, “దాని ఫలము ఒకరిని సంతోషపరచుటకు కోరదగినది.” ఈ ఫలము దేవుని యొక్క ప్రేమను సూచించును, మరియు లీహై ఫలమును రుచి చూసినట్లుగా, “అది … (అతడు) ఇంతకుముందు రుచి చూచిన వాటన్నిటి కంటే అతి మధురమైనది.” అది “(అతడి) ఆత్మను మిక్కిలి గొప్ప ఆనందముతో నింపెను” మరియు అతడు తన కుటుంబముతో దానిని పంచుకోవాలని కోరాడు (1 నీఫై 8:10–12).

మనము విందారగించినప్పుడు, మన హృదయాలు కృతజ్ఞతతో నింపబడిన యెడల, మనము కలిగియున్న రకమైన ఆహారము లేక పరిమాణము ముఖ్యము కాదని కూడా మనము కనుగొంటాము. లీహై కుటుంబము అరణ్యములో పచ్చి మాంసముపై జీవించారు, కానీ నీఫై ఈ కష్టమును ఇలా చెప్పుచూ వర్ణించాడు, “ప్రభువు యొక్క దీవెనలు ఎంత గొప్పగా ఉండెననగా,” “మా స్త్రీలు … బలముగా ఉండిరి,” మరియు “సణుగకుండ వారి ప్రయాణములు నోర్చుకొన” (1 నీఫై 17:1–2) గలిగారు.

కొన్నిసార్లు విందారగించుట ప్రయోగము చేయుట మరియు రుచి చూచుటను కలిపియున్నది. మన హృదయాలలో ఒక మంచి విత్తనమును నాటుటను గూర్చి ఆల్మా మాట్లాడాడు. మనము దానిపై ప్రయోగము చేసినప్పుడు, ఆ విత్తనము “రుచికరముగా ఉండుట” (ఆల్మా 32:28–33 చూడండి) ప్రారంభించుట మనము గ్రహిస్తాము.

క్రీస్తు యొక్క మాటలపై విందారగించుట

క్రీస్తు యొక్క మాటలపై విందారగించుట యొక్క దీవెనలు శక్తివంతమైనవి మరియు జీవితమును మార్చివేసేవి. ప్రత్యేకంగా మూడు మీ జీవితంలో అన్వయించుటకు నేను మిమ్మల్ని ఆహ్వానించాలని కోరుచున్నాను.

మొదట, క్రీస్తు యొక్క మాటలు “బయల్పాటును పొందుటకు (మన) ఆత్మీయ సామర్ధ్యమును హెచ్చించును” (“సంఘము కొరకు బయల్పాటు, మన జీవితాల కొరకు బయల్పాటు,” ఎన్‌సైన్ లేక లియహోనా, మే 2018, 96) మరియు మన జీవితకాలమంతటా మనల్ని క్షేమంగా నడిపించును. క్రీస్తు యొక్క మాటలు “న్యాయమైన దానిని చేయుటకు జనులను నడిపించుటకు గొప్ప గుణము కలిగియుండెను,” మరియు అవి “ఖడ్గము” కంటే ఎక్కువ శక్తివంతమైనవి (ఆల్మా 31:5) అని మోర్మన్ బోధించెను. నా స్వంత సవాళ్ళతో వ్యవహరించుటలో దేవుని జ్ఞానము కొరకు నేను వెదకినప్పుడు, ఎల్లప్పుడు, “దేవుని వాక్యము యొక్క సుగుణమును” (ఆల్మా 31:5), ప్రయత్నించినప్పుడు, నేను ప్రేరేపించబడి మరియు తెలివైన నిర్ణయాలు చేయుటకు, శోధనలు జయించుటకు సాధ్యము చేయబడినట్లు భావించాను, మరియు క్రీస్తునందు హెచ్చించబడిన విశ్వాసముతో మరియు నా చుట్టూ ఉన్న వారి కొరకు ప్రేమతో నా జీవితమును దీవించెను. ముఖ్యంగా, మన ప్రవక్త రస్సెల్ ఎమ్. నెల్సన్ మనకిలా బోధించారు, “రాబోయే దినాలలో, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, మార్గదర్శకత, ఓదార్పు, మరియు నిరంతర ప్రభావము లేకుండా ఆత్మీయంగా బ్రతుకుట సాధ్యము కాదు ”(“సంఘము కొరకు బయల్పాటు, మన జీవితాల కొరకు బయల్పాటు,” 96). మనము “వాక్యము యొక్క సుగుణమును” ప్రయత్నించినప్పుడు అవసరమైన బయల్పాటు వచ్చును, మరియు ఆ వాక్యము మనము ప్రయత్నించు లేక ఊహించదగిన దేనికన్నా ఎక్కువ శక్తివంతమైనదిగా ఉండును.

రెండవది, మన స్వంత గుర్తింపుతో మనము పోరాడి, ఆత్మ గౌరవము కొదువుగా ఉన్నప్పుడు, లేఖనములలో, “దేవుని యొక్క ప్రీతికరమైన వాక్యము,” (జేకబ్ 2:8) మనము నిజముగా ఎవరమో తెలుసుకొనుటకు మనకు సహాయపడును మరియు మన స్వంత దానిని మించి బలమును మనకిచ్చును. దేవుని బిడ్డగా నా గుర్తింపును గుర్తించుట నేను ఎప్పటికీ అనుభవించే మధురమైన క్షణములలో ఒకటి. నా యౌవన కాలపు సంవత్సరాలలో, రక్షకుని యొక్క బోధనలను గూర్చి నాకేమి తెలియదు. క్రొత్త నిబంధనను నేను మొదట చదివినప్పుడు, క్రీస్తు యొక్క మాటలు నిజముగా నా గాయపడిన ఆత్మను స్వస్థపరచినవి. నేను ఒంటరిగా లేనని మరియు నేను దేవుని యొక్క బిడ్డనని నేను గ్రహించాను. దేవుని యెదుట నా నిజమైన గుర్తింపును నేను గుర్తించినప్పుడు, క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తఃము ద్వారా నా అంతములేని సాధ్యతను నేను గుర్తించాను.

ఈనస్ అదేవిధంగా క్రీస్తు యొక్క మాటలను ధ్యానించుట నుండి కలిగే జ్ఞానవృద్ధిని గూర్చిన తన వ్యక్తిగత అనుభవము పంచుకొన్నాడు. ఈనస్ తన తండ్రి “నిత్యజీవము, మరియు పరిశుద్ధుల యొక్క సంతోషమును గూర్చి పలుకగా వినిన మాటలు (అతడి) హృదయములో లోతుగా నాటుకున్నవి,” అతడి ఆత్మ “ఆకలిగొనెను మరియు (అతడు) బలమైన ప్రార్థనయందు … (తన) సృష్ఠిికర్త యెదుట మోకరించాడు,” (ఈనస్ 1:3–4). ఆ ప్రార్థనయందు, అతడు రక్షకుడిని తెలుసుకోగలిగాడు మరియు మనము గొప్ప విలువను కలిగియున్నామని, మనము ప్రేమించబడుచున్నామని మరియు మన తప్పులు క్షమించబడగలవని, మరియు నిజముగా దేవుని యొక్క పిల్లలమని తెలుసుకున్నాడు.

మూడవది, క్రీస్తు యొక్క మాటల ద్వారా ఇతరుల యొక్క జీవితాలను మనము పైకెత్తగలము. ఈనస్ తన స్వంత కాలములో మరియు స్థలములో క్రీస్తు యొక్క మాటలు అతడి హృదయమును స్పృశించినట్లుగా, మనము సువార్తను పంచుకొనుటకు కోరిన వారిని హృదయాలను స్పృశించుటకు ప్రభువు తన వంతు చేయును. సువార్తను వినుటకు మనము ఎవరినైనా ఆహ్వానించి, కోరిన ఫలితము రానప్పుడు, మనలో అనేకులు నిరాశగా భావించియుండవచ్చు. ఫలితమును లక్ష్యపెట్టకుండా, మన నోరు తెరచి మరియు సువార్త సందేశమును వారితో పంచుకోమని ప్రభువు మనల్ని ఆహ్వానిస్తున్నారు.

రెండు సంవత్సరాల క్రితం, నా ప్రియమైన తల్లి హృదయాన్ని ప్రభువు స్పృశించాడు, అది బాప్తీస్మము యొక్క విధిని పొందుటకు నిర్ణయించుటకు ఆమెకు సహాయపడింది. ఆ రోజు కోసము నేను దాదాపు 35 సంవత్సరాలు ఎదురుచూసాను. ఆ నిర్ణయము చేయుటకు బదులుగా, సంఘములోని అనేక సభ్యులు క్రీస్తు చేసినట్లుగా నిజముగా ఆమెకు పరిచర్య చేసారు. ఒక ఆదివారము, తాను సంఘానికి వెళ్ళాలని ఆమె భావించింది. ఆమె ప్రేరేపేణను అనుసరించింది. ఆమె మొదటి వరసలో కూర్చోని, సంస్కార కార్యక్రమము కొరకు ఎదురుచూస్తుండగా, ఒక నాలుగు సంవత్సరాల బాలుడు ఆమె ఎదురుగా నిలబడి, ఆమె వైపు చూసాడు. ఆమె చిరునవ్వుతో పలుకరించింది. ఆ బాలుడు హఠాత్తుగా ఆమె దగ్గర నుండి తన స్వంత సీటు వద్దకు నడిచి వెళ్ళాడు, అది మా అమ్మ కూర్చోన్న వరుసకు మరొక వైపున్నది. ఈ చిన్న బాలుడు తన సీటు నుండి ఏదో తీసుకొని తిరిగి మా అమ్మ వద్దకు వచ్చి ఒక కీర్తన పుస్తకము ఇచ్చి, తిరిగి తన సీటు వద్దకు నడిచి వెళ్ళాడు. సంఘములో ప్రతీ ఇతర కూర్చీ తరువాత ఒక కీర్తన పుస్తకము ఉంచబడుట మా అమ్మ గమనించింది. ఆమె తన ప్రక్కనున్న కుర్చీనుండి సులుభంగా ఒకటి తీసుకొనగలదు. అయినప్పటికినీ, బాలుని యొక్క అమాయకమైన దయగల చర్యతో ఆమె చాలా అకట్టుకోబడింది, దానిని అతడు తన ఇంటిలో మరియు సంఘములో నేర్చుకొన్నాడు. అది ఆమెకు మృదువైన క్షణము. వచ్చి రక్షకుని అనుసరించుమని దేవుడు ఆహ్వానిస్తున్నట్లుగా ఆమెకు బలమైన భావన కలిగింది. తాను బాప్తీస్మము పొందవలెనని ఆమె భావించింది. ఈ చిన్న బాలుడు తాను చేసిన దానికి గుర్తింపు కోరలేదు, కానీ అతడు దేవుని వాక్యము జీవించుటకు మరియు తన పొరుగువారిని ప్రేమించుటకు తనకు సాధ్యమైనంతగా చేసాడు. అతడి దయ నా తల్లి మనస్సులో ముఖ్యమైన మార్పును కలిగించింది.

క్రీస్తు యొక్క మాటలు హృదయాలను లోతుగా తాకును మరియు ఆయనను ఇంకను చూడని వారి కన్నులను తెరచును. ఎమ్మాయుకు దారిలో, ఇద్దరు శిష్యులు యేసుతో నడిచారు. వారు విచారముగా ఉన్నారు మరియు రక్షకుడు మరణమును జయించాడని గ్రహించలేదు. వారి వేదనలో, వారు జీవముగల క్రీస్తు వారితో నడుస్తున్నాడని గుర్తించలేదు. యేసు “తనను గూర్చిన సంగతులను లేఖనములన్నిటిలో వారికి విశదపరచినప్పటికిని,” వారు ఆయనతో కూర్చోని, రొట్టె విరిచేంత వరకు పునరుత్థానము చెందిన రక్షకునిగా ఆయనను వారు గుర్తించలేదు, అప్పుడు వారి “కన్నులు” తెరవబడినవి. మనము---లేక మన స్నేహితులు, సహవాసులు, మరియు పొరుగువారు--ఆయనతో విందారగించి రొట్టె విరచినప్పుడు, మన జ్ఞాన నేత్రములు తెరవబడతాయి. ఎమ్మాయు వద్ద శిష్యులు పునరుత్థానము చెందిన రక్షకునితో వారి సమయాన్ని ప్రతిఫలించినప్పుడు, ఆయన లేఖనములను వారికి తెరచినప్పుడు, వారి హృదయాలు వారిలో మండినవని వారు చెప్పారు (లూకా 24:27–32 చూడుము). ఇది మనందరి కొరకు యధార్ధమైనది.

ముగింపు

ముగింపులో, వాటిని పొందుటకు మన హృదయాలను సిద్ధపరచిన యెడల, క్రీస్తు యొక్క మాటలను విందారగించుట ఎప్పుడైన, ఏ సందర్భములోనైన జరగవచ్చని నేను సాక్ష్యమిస్తున్నాను. క్రీస్తు యొక్క మాటలను విందారగించుట జీవితమును-బలపరచు బయల్పాటును తెచ్చును, ఆయన బిడ్డగా దేవుని యెదుట మన నిజమైన గుర్తింపును మరియు విలువను తిరిగి నిర్ధారించును మరియు మన స్నేహితులను క్రీస్తు నొద్దకు మరియు నిత్యజీవమునకు నడిపించును. నీఫై ఇలా చెప్పినప్పుడు అతడి ఆహ్వానమును ప్రతిధ్వనించుట ద్వారా నన్ను ముగించనియ్యుము: “క్రీస్తునందు ఒక నిలకడతో పరిపూర్ణమైన ప్రకాశవంతమైన నిరీక్షణ కలిగియుండి మరియు దేవుని యొక్క మరియు మనుష్యులందరి యొక్క ప్రేమను కలిగి ముందుకు త్రోసుకు వెళ్ళవలెను. కాబట్టి, మీరు క్రీస్తు వాక్యమును విందారగించుచూ ముందునకు త్రోసుకొని వెళ్ళిపోయ, మరియు అంతము వరకు స్థిరముగా నుండిన యెడల, ఇదిగో మీరు నిత్యజీవమును పొందుదురని తండ్రి ఇట్లు చెప్పుచున్నాడు” (2 నీఫై 31:20). యేసు క్రీస్తు యొక్క నామములో, ఆమేన్.