2010–2019
విశ్వాస నేత్రము
2019 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము.


2:3

విశ్వాస నేత్రము

ఆ ప్రకటనలో మనము దేనిని అంగీకరిస్తామో ఏరి, ఎంపిక చేసిన యెడల, ఇక్కడ మరియు ఇప్పుడు మన అనుభవముపై ఎక్కువ ప్రాముఖ్యతను ఉంచుతూ, మన నిత్య దృష్టిని మనము మసకగా చేస్తున్నాము.

ఆయన సిలువ వేయబడకముందు, యేసు తీర్పు తీర్చు గదిలో పిలాతు యెదుటకు తీసుకొనిపోబడెను. “యూదుల రాజువు నీవేనా?” పిలాతు ధిక్కారము లేదా అయిష్టతతో అడిగాడు. యేసు జవాబిచ్చాడు: “నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు. … సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను లోకమునకు వచ్చితిని. సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట వినుననెను.”

పిలాతు విమర్శనాత్మకంగా అడిగాడు, “సత్యమనగా ఏమిటి?”1

నేటి లోకములో, “సత్యమనగా ఏమిటి?” అనే ప్రశ్న మతమును నమ్మని వారికి చిక్కైనది కావచ్చు.

“సత్యమనగా ఏమిటి?” కొరకు ఇంటర్నెట్‌లో పరిశోధన మిలియన్ల కంటే ఎక్కువ జవాబులను తెచ్చును. ఇటుకలు మరియు సున్నముగల గ్రంథాలయములోని పుస్తకములన్నిటి లో కంటే మన సెల్ ఫోన్లలో ఎక్కువ సమాచారము లభ్యమగుచున్నది. మనము ఉపయోగించే దానికంటే ఎక్కువ సమాచారముతో మనము జీవిస్తున్నాము. మనము నిరంతరము శోధించే మరియు ఆకర్షించే ఎంపికల చేత ప్రభావితం చేయబడుతున్నాము.

నేటి కలవరములో పట్టబడి, 2500 సంవత్సరాల క్రితం, సోక్రటిస్‌తో ప్రోటాగొరస్ ఇలా అన్నాడు: “మీకు సత్యమనిపించేది,” “మీకు సత్యముగా ఉండును, మరియు నాకు సత్యమనిపించేది, నాకు సత్యముగా ఉండును,”2 అని చెప్పబడిన మాటలకు అనేకమంది తమను తాము అప్పగించుకొనుటలో ఆశ్చర్యము లేదు.

యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త ద్వారా సత్యము

యేసు క్రీస్తు యొక్క సువార్తతో దీవించబడి, కొన్ని విషయాలు పూర్తిగా మరియు ఖచ్చితంగా యదార్ధమైనవని మేము వినయముగా ప్రకటిస్తున్నాము. ఈ నిత్య సత్యములు దేవుని యొక్క ప్రతీ కుమారుడు మరియు కుమార్తె కొరకు అదేవిధంగా ఉన్నవి.

“సత్యము ఏదనగా, విషయముల యొక్క జ్ఞానము అవి ఉన్నట్లుగా, అవి ముందున్నట్లుగా, మరియు అవి రాబోవుతున్నట్లుగా ఉన్నాయి”3 అని లేఖనాలు బోధిస్తున్నాయి. సత్యము ఇదివరకే జరిగిన విషయాలను మరియు ఇంకా జరగని విషయాలను కలిగియున్నది.

“నేనే మార్గమును, సత్యమును, జీవమును: నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు”4 అని యేసు చెప్పెను. సత్యము నిత్య జీవమునకు మార్గమును మనకు చూపును, మరియు అది మన రక్షకుడైన, యేసు క్రీస్తు ద్వారా మాత్రమే వచ్చును. మరే ఇతర మార్గము లేదు.

ఎలా జీవించాలో యేసు క్రీస్తు మనకు బోధిస్తున్నారు, ఆయన ప్రాయశ్చిత్తము మరియు పునరుత్థానము ద్వారా, మన పాపమునుండి క్షమాపణ మరియు ఈ జీవితము తరువాత అమర్త్యత్వమును మనకిచ్చుచున్నారు. ఇది ఖచ్చితంగా సత్యమైనది.

మనము ధనికులము లేక పేదవారము, ప్రసిద్ధి చెందిన లేక తెలియని, అధునాతనమైన వారము, లేక సాధారణమైన వారమైనా ముఖ్యము కాదని యేసు మనకు బోధిస్తున్నారు. దాానికి బదులు, మన మర్త్య అన్వేషణ ప్రభువైన యేసు క్రీస్తునందు మన విశ్వాసమును బలపరచుటకు, చెడుకు పైగా మంచిని ఎన్నుకొనుటకు, మరియు ఆయన ఆజ్ఞలను పాటించుటను కలిగియుండాలి. విజ్ఞానము మరియు వైద్యము యొక్క ఆవిష్కరణలను మనము వేడుక చేసుకొనుచుండగా, దేవుని యొక్క సత్యములు ఈ ఆవిష్కరణల కంటే అత్యధికమును కలిగియున్నవి.

నిత్యత్వము యొక్క సత్యములకు వ్యతిరేకముగా, సత్యము నుండి దేవుని యొక్క పిల్లలను అంతరాయపరచుటకు ఎల్లప్పుడు నకీలిలు ఉన్నవి. అపవాది యొక్క వాదనలు ఎల్లప్పుడు అదేవిధంగా ఉన్నవి. 2000 సంవత్సరములకు ముందు చెప్పబడిన వీటిని వినండి:

“[మీరు] చూడనివి [మీరు] తెలుసుకోలేరు. … (ఒక వ్యక్తి చేసేది ఏదైనా) నేరము కాదు.”

“[దేవుడు నిన్ను దీవించుట లేదు, కానీ] ప్రతీ [వ్యక్తి] తన [స్వంత] మేథస్సును బట్టి వర్ధిల్లును.”5

“ క్రీస్తు … వంటి వ్యక్తి … దేవుని యొక్క కుమారుడు(అగుట) తర్కించదగినదే కాదు.”6

“[మీరు నమ్మేది ఒక మూర్ఖపు సంప్రదాయము మరియు] మీ [మనస్సు] యొక్క వెఱ్ఱితనము.”7 నేటివలే అనిపిస్తుంది కదా?

సువార్త యొక్క పునఃస్థాపనతో, ఆవశ్యకమైన ఆత్మీయ సత్యములను నేర్చుకొని, తెలుసుకొను విధానమును దేవుడు మనకిచ్చాడు: పరిశుద్ధ లేఖనాలు, మన వ్యక్తిగత ప్రార్థనలు, మన స్వంత అనుభవాల ద్వారా, జీవిస్తున్న ప్రవక్తలు మరియు అపొస్తులుల ద్వారా, మరియు “అన్ని విషయముల యొక్క సత్యమును తెలుసుకొనుటకు” మనకు సహాయపడగలు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా వాటిని మనము నేర్చుకుంటాము.”8

సత్యము ఆత్మానుభవము చేతనే వివేచింపదగును

మనము వాటిని ఆత్మీయంగా వెదకినప్పుడు దేవుని యొక్క విషయాలను మనము తెలుసుకోగలము. పౌలు ఇలా చెప్పెను, “దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. … (ఏలయనగా) అవి ఆత్మీయంగా గ్రహించబడును.”9

0:38

మైఖెల్ మర్ఫీ చేత ఈ చిత్రలేఖనము చూడండి. ఈ దృష్టికోణము నుండి, అది ఒక మానవ నేత్రము యొక్క కళాత్మక చిత్రమని మీరు నమ్మలేరు. అయినప్పటికినీ, ఒక భిన్నమైన దృష్టికోణము నుండి చుక్కల వైపు మీరు చూసినప్పుడు, కళాకారుని సృష్టి యొక్క అందమును మీరు చూస్తారు.

అదేవిధంగా, మనము విశ్వాస నేత్రము యొక్క దృష్ఠికోణము ద్వారా దేవుని యొక్క ఆత్మీయ సత్యములను చూస్తాము. పౌలు ఇలా చెప్పెను: “ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతడికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అది ఆత్మానుభవము చేతనే వివేచింపదగును కనుక అతడు గ్రహింపజాలడు.” 10

లేఖనాలు, మన ప్రార్థనలు, మన స్వంత అనుభవాలు, ఆధునిక ప్రవక్తలు, మరియు పరిశుద్ధాత్మ యొక్క వరము భూమిపై మన ప్రయాణము కొరకు అవసరమైన సత్యము యొక్క స్పష్టమైన ఆత్మీయ దృష్టికోణమును మనకు తెచ్చును.

విశ్వాస నేత్రము ద్వారా ప్రకటన

కుటుంబముపై ప్రకటనను విశ్వాస నేత్రము ద్వారా మనము చూద్దాం.

అధ్యక్షులు గార్డన్ బి. హింక్లీ ఈ వ్యాఖ్యానముతో “కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటనను పరిచయము చేసారు: “సత్యముగా సమర్పించబడిన అత్యధికమైన అబద్ధపు వాదనలతో, ప్రమాణములు మరియు విలువను గూర్చి అత్యధిక మోసముతో, మిగిలిన ప్రపంచముతో అవినీతిగా మారుటకు అత్యధిక (అభిప్రాయముల) ఆకర్షణ మరియు శోధనతో, మేము (మిమ్మల్ని) హెచ్చరించాలని భావించాము.”11

ప్రకటన ప్రారంభించును: “పురుషుడు, స్త్రీ—మానవులందరు—దేవుని యొక్క స్వరూపములో సృజించబడిరి. ప్రతీఒక్కరు, పరలోక తల్లిదండ్రుల యొక్క ప్రియమైన ఆత్మ కుమారుడు లేక కుమార్తె, మరియు దీనివలన ప్రతీఒక్కరు ఒక దైవిక స్వభావమును మరియు గమ్యమును కలిగియున్నారు.”

ఇవి నిత్య సత్యములు. మీరు నేను ఆకస్మికమైన స్వభావమును కలిగిలేము.

ఈ మాటలను నేను ప్రేమిస్తున్నాను: “మర్త్యత్వమునకు ముందు లోకములో, ఆత్మ కుమారులు మరియు కుమార్తైలు, దేవుని తమ నిత్య తండ్రిగా ఎరిగి ఆరాధించారు మరియు ఆయన ప్రణాళికను అంగీకరించారు.”12

మన జననమునకు ముందు మనము జీవించాము. మన వ్యక్తిగత గుర్తింపు శాశ్వతముగా మనలో ఒక భాగము. మనము పూర్తిగా గ్రహించని విధానాలలో, అక్కడ మర్త్యత్వమునకు ముందు లోకములో మన ఆత్మీయ అభివృద్ధి ఇక్కడ మనము ఎవరిమో ప్రభావితం చేయును.13 మనము దేవుని యొక్క ప్రణాళికను అంగీకరించాము. భూమి మీద మనము కష్టములు, బాధ, మరియు విచారము అనుభవిస్తామని మనము ఎరుగుదుము.14 రక్షకుడు వస్తాడని మరియు మనల్ని మనం యోగ్యులుగా రుజువు చేసుకొన్నప్పుడు, “(మన) శిరస్సులపై శాశ్వతంగా, మరియు ఎప్పటికీ మహిమ చేర్చబడి”15 పునరుత్థానములో లేస్తామని కూడ మనము ఎరుగుదుము.

ప్రకటన సూటిగా ఉన్నది: “మర్త్య జీవితము సృష్టించబడిన ఆధారము దైవికంగా నియమించబడిందని మేము ప్రకటిస్తున్నాము. మేము జీవితము యొక్క పరిశుద్ధతను మరియు దేవుని యొక్క నిత్య ప్రణాళికలో దాని ప్రాముఖ్యతను నిర్ధారిస్తున్నాము.”

మన తండ్రి యొక్క ప్రణాళిక ఒక భర్త మరియు భార్య, పిల్లలను లోకములోనికి తెచ్చుటకు ప్రోత్సహించును మరియు పుట్టని పిలలను కాపాడుటలో మాట్లాడుటకు మనల్ని బద్ధుల్నిగా చేయుచున్నాడు.

ఆ ప్రకటన యొక్క సూత్రములు మనోహరముగా సంధించబడినవి

ఆ ప్రకటనలో మనము దేనిని అంగీకరిస్తామో ఏరి, ఎంపిక చేసిన యెడల, ఇక్కడ మరియు ఇప్పుడు మన అనుభవముపై ఎక్కువ ప్రాముఖ్యతను ఉంచుతూ, మన నిత్య దృష్టిని మనము మసకగా చేస్తున్నాము. విశ్వాస నేత్రముతో ప్రకటనను ప్రార్థనాపూర్వకంగా లోతుగా ధ్యానించుట ద్వారా, ఆయన పిల్లల కొరకు మన తండ్రి యొక్క ప్రణాళికను బయల్పరుస్తూ, సూత్రములు ఒక దానిని మరొకటి బలపరుస్తూ, ఎలా అందముగా జతపరచబడినవో మనము ఉత్తమంగా గ్రహిస్తాము.16

0:23

ఆయన చిత్తమును ప్రభువు యొక్క జీవిస్తున్న ప్రవక్తలు ప్రకటించినప్పుడు, మరియు కొందరికి, ఇంకా దాని గురించి కలిగియున్న మిగిలిన ప్రశ్నలపై మనము నిజముగా ఆశ్చర్యపడాలా? అవును, కొందరు ప్రవక్తల స్వరమును వెంటనే తిరస్కరించినప్పటికినీ,17 ఇతరులు వారి నిజాయితీగల ప్రశ్నలను ప్రార్ధనాపూర్వకంగా లోతుగా ధ్యానిస్తారు,--- సహనముతో మరియు విశ్వాస నేత్రముతో ఆ ప్రశ్నలకు సమాధానాలు దొరకుతాయి. వేరే శతాబ్ధములో ప్రకటన బయల్పరచబడిన ఉన్నయెడల, అక్కడ ఇంకను అనేక ప్రశ్నలు ఉండవచ్చు, కేవలము నేటి ప్రశ్నల కంటే అవి భిన్నమైనవి. ప్రవక్తల యొక్క ఒక ఉద్దేశమేదనగా, నిజాయితీగల ప్రశ్నలను పరిష్కరించుటలో మనకు సహాయపడుట.18

సంఘ అధ్యక్షునిగా ఉండుటకు ముందు, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ చెప్పారు: “ప్రవక్తలు ముందున్నది చూస్తారు. వారు మన మార్గముపై అపవాది ఉంచిన లేక ఇకపై ఉంచబోవు హానికరమైన అపాయములను చూస్తారు. విధేయులు కావాలనే ఉద్దేశముతో విను వారికి ఎదురుచూచు గొప్ప సాధ్యతలు మరియు విశేషావకాశములను కూడ ప్రవక్తలు ముందుగా చూస్తున్నారు.”19

ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తులుల సమూహము యొక్క ఐక్యముగల స్వరము యొక్క సత్యము మరియు ఆత్మీయ శక్తిని గూర్చి నేను సాక్ష్యమిస్తున్నాను.

లోకము అనుసరించుట లేదు

నా జీవితకాలములో, ప్రకటనలో బోధించబడిన సూత్రములు అనేకము గురించి లోకము యొక్క నమ్మకములందు నాటకీయమైన మార్పును మనము చూసాము. నా యౌవనము మరియు వివాహమైన ప్రారంభ సంవత్సరాలలో, లోకములో అనేకమంది లైంగిక సంబంధాలు చట్టప్రకారము వివాహితులైన పురుషుడు, స్త్రీ మధ్య మాత్రమే జరగాలనే పవిత్రత చట్టముగా మనము పిలిచిన ప్రభువు యొక్క ప్రమాణమును అనుసరించలేదు. నా 20, 30 సంవత్సరాలలో, గర్భవిచ్ఛిత్తి ఎక్కువ అంగీకారమైనది కనుక, పుట్టని బిడ్డ యొక్క పరిశుద్ధమైన భద్రతను అనేకమంది విడిచిపెట్టారు. ఇటీవల సంవత్సరాలలో, అనేకమంది వివాహమనగా పురుషుడు మరియు స్త్రీ మధ్య ఒక పరిశుద్ధమైన కలయక అనే దేవుని యొక్క చట్టమును పాటించుట మానేసారు.20

0:20

ప్రభువు ఏర్పరచిన సరిహద్దుల నుండి అనేకమంది దూరముగా వెళ్లిపోవుటను గమనిస్తూ, రక్షకుడు తన దైవత్వమును ప్రకటించినప్పుడు, కపెర్నహూములో ఆ దినమును మనకు జ్ఞాపకము చేయును, విచారముగా, “ఆయన శిష్యులలో అనేకులు … వెనుకతీసి మరి ఎన్నడును ఆయనను వెంబడించలేదు.”

తరువాత రక్షకుడు వెనకకు తిరిగి, పన్నెండుమందిని అడిగాడు: “మీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా?”

పేతురు ఇలా సమాధానము చెప్పెను:

“ప్రభువా, యొవని యెద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు.

“నీవే జీవముగల దేవుని కుమారుడవని, క్రీస్తువని మేము విశ్వసించి యెరిగియున్నాము.”21

ఆ ప్రకటనలో అందరూ కూడా చక్కగా సరిపోరు.

యౌవనులు మరియు వృద్ధులు, అనేకమంది వారి ప్రస్తుతపు స్వంత అనుభవము కుటుంబ ప్రకటన లోపల చక్కగా సరిపోనప్పటికినీ, ప్రవక్తల యొక్క బోధనలకు నమ్మకంగా, యదార్ధముగా ఉన్నారు: విడాకుల చేత కదిలించబడిన జీవితాలు గల పిల్లలు; పవిత్రత చట్టమును ఎగతాళి చేయు స్నేహితులు గల యువత; భర్త లేక భార్య యొక్క అవిశ్వాసము ద్వారా చాలా గాయపరచబడిన స్త్రీలు మరియు పురుషులు; పిల్లలు కనలేని భర్తలు మరియు భార్యలు; పునఃస్థాపించబడిన సువార్త యందు వారి విశ్వాసమును పంచుకోని భర్త లేక భార్యను వివాహము చేసుకొన్న స్త్రీలు మరియు పురుషులు; వేర్వేరు కారణముల వలన, వివాహము చేసుకోలేని ఒంటరి స్త్రీలు మరియు పురుషులు.

దాదాపు 20 సంవత్సరాలుగా ఒక స్నేహితుడు, నేను గొప్పగా మెచ్చుకొనే వ్యక్తి, స్వలింగ-ఆకర్షణ వలన వివాహము చేసుకోలేదు. అతడు తన దేవాలయ నిబంధనలకు యదార్ధముగా నిలిచియున్నాడు, అతడు తన సృజనాత్మక మరియు వృత్తిపరమైన ప్రతిభలను విస్తరింపచేసాడు, సంఘము మరియు సమాజము రెండిటిలో ఘనంగా సేవ చేసాడు. అతడు ఇటీవల నాతో చెప్పాడు, “నా పరిస్థితిలో ఉండి, మనము నివసించే లోకములో పవిత్రత చట్టమును పాటించుటకు ఎన్నుకోనివారికి నా సానుభూతి చూపగలను. కానీ క్రీస్తు మనల్ని ‘ఈ లోకమునకు చెందవద్దు’ అని అడగలేదా? దేవుని యొక్క ప్రమాణములు లోకము యొక్క వాటి నుండి భిన్నముగా ఉన్నవని స్పష్టమైనది.”

నరుని చట్టములు దేవుని చట్టములు ఏర్పరచిన సరిహద్దులను మీరి బయటకు పోవును. దేవుని సంతోషరచాలని అనుకొనేవారికి తప్పకుండా విశ్వాసము, సహనము మరియు శ్రద్ధ అవసరము. 22

నా భార్య, కాథీ, మరియు నేను ఒక ఒంటరి సహోదరిని ఎరుగుదుము, ఆమె వయస్సు ఇప్పుడు 40, 50 కి మధ్యలో ఉండి, తన వృత్తిపరమైన సామర్ధ్యములందు వరమివ్వబడినది మరియు తన వార్డులో సాహసముగా సేవ చేస్తున్నది. ఆమె కూడా దేవుని చట్టములను పాటిస్తున్నది. ఆమె ఇలా వ్రాసింది:

“ఒక భర్త మరియు పిల్లలతో దీవించబడే దినమును గూర్చి నేను కలగన్నాను నేనింకా ఎదురు చూస్తున్నాను. కానీ నాకు లేనివాటిపై నుండి దృష్టి మరల్చి, మరియు బదులుగా, నేను కలిగియున్న దానిపై, మరియు ఇతరులకు ఎలా సహాయపడగలనో దృష్టిసారించుటకు నేను ప్రయత్నిస్తాను.

“నా పొడిగించబడిన కుటుంబమునకు, నా వార్డుకు, మరియు దేవాలయములో సేవ నాకు సహాయపడినవి. నేను మరిచిపోబడలేదు మరియు ఒంటరిగా లేను, ఎందుకనగా, నేను మరియు మనమందరము ఒక పెద్ద కుటుంబము యొక్క భాగము.”

అర్థము చేసుకొనేవారు ఒకరు ఉన్నారు

“మీరు నా పరిస్థితి అర్ధము చేసుకోరు,” అని కొందరు అంటారు. నేను గ్రహించలేకపోవచ్చు, కానీ అర్ధము చేసుకొనేవారు ఒకరున్నారని నేను సాక్ష్యమిస్తున్నాను.23 వనములో మరియు సిలువపై ఆయన త్యాగము వలన, మీ భారములను ఎరిగిన ఒకరున్నారు. మీరు ఆయనను వెదకి, ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు, ఆయన మిమ్మల్ని దీవిస్తారని, మరియు ఒంటరిగా మోయుటకు చాలా బరువైన భారములు పైకెత్తునని నేను మీకు వాగ్దానము చేస్తున్నాను. ఆయన మీకు నిత్య స్నేహితులను మరియు సేవ చేయుటకు అవకాశములనిచ్చును. మరి ముఖ్యముగా, ఆయన మిమ్మల్ని పరిశుద్ధాత్మ యొక్క శక్తివంతమైన ఆత్మతో నింపును మరియు ఆయన పరలోకపు ఆమోదమును మీపై ప్రకాశింప చేయును. పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును లేక నిత్యత్వము యొక్క దీవెనను నిరాకరించు ఏ ఎంపిక, ఏ ప్రత్యమ్నాయము మన ఆలోచనకు యోగ్యతగలది కాదు.

రక్షకుడు జీవిస్తున్నాడని నేను ఎరుగుదును. ఆయన నిజముగా ముఖ్యమైన సమస్త సత్యము యొక్క ఆధారమని, మరియు ఆయన ఆజ్ఞలను పాటించు వారికి ఆయన వాగ్ధానమిచ్చిన దీవెనలన్నిటినీ నెరవేర్చుననని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. యోహాను 18:33, 36–38.

  2. William S. Sahakian and Mabel Lewis Sahakian, Ideas of the Great Philosophers (1966), 28.

  3. సిద్ధాంతము మరియు నిబంధనలు 93:24.

  4. యోహాను 14:6.

  5. ఆల్మా 30:15, 17.

  6. హీలమన్ 16:18.

  7. ఆల్మా 30:14, 23, 27 చూడుము.

  8. మొరోనై 10:5.

  9. జోసెఫ్ స్మిత్ అనువాదము, 1 కొరింథీయులకు 2:11 [లో 1 కొరింథీయులకు 2:11, footnote c]; 1 కొరింథీయులకు 02:14.

  10. 1 కొరింథీయులకు 2:14.

  11. గార్డన్ బి. హింక్లీ, “Stand Strong against the Wiles of the World,” Ensign, నవం. 1995, 100. Insights from a Prophet’s Life: Russell M. Nelson (2019), 208 లో షెరి డ్యూ చేత సారాంశము వ్రాయబడిన విధముగా అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారు కుటుంబ ప్రకటన యొక్క చరిత్రనుఇటీవల వివరించారు:

    “1994లో ఒక రోజు కుటుంబము చుట్టూ ఉన్న సమస్యల గురించి చర్చిస్తూ పన్నెండు మంది అపొస్తలుల యొక్క పూరకము సాల్ట్ లేక్ దేవాలయములో వారి సలహాగదిలో ఒక రోజంతా గడివారు. హెచ్చగుతున్న అశ్లీల చిత్రముల యొక్క సర్వవ్యాప్తమైన స్వభావము నుండి సాధ్యమైన వివిధ రకాల కుటుంబ-వ్యతరేక చట్టము వరకు ప్రతీదానిని వారు పరిశీలించారు. ఇది ఒక క్రొత్త చర్చ కాదు, కానీ ఆ రోజు మొత్తము చర్చించవలసిన విషయములలో ఈ ఒక్క ముఖ్యమైన అంశముపై దృష్టిసారించబడింది.

    “మార్చబడని విషయాలు—సిద్ధాంతము— మరియు బహుశా కాబోయే ఆ విషయాలు—విధానములను ఆలోచిస్తూ, పన్నెండుమంది సిద్ధాంతము మరియు విధానములు రెండిటిని పునర్వీక్షించారు. స్వలింగ వివాహము మరియు లింగ మార్పిడి హక్కుల కొరకు తీవ్రమైన సామాజిక ఒత్తిడిని కలిపి, రాబోతున్నవని చూసిన సమస్యలను వారు చర్చించారు. ‘కానీ అది వారు చూసిన దాని యొక్క ముగింపు కాదు,’ అని ఎల్డర్ నెల్సన్ వివరించారు. ’లైంగిక కార్యముపై అన్ని ప్రమాణములు మరియు పరిమితులను తీసివేయుటకు వివిధ వర్గాల ప్రయత్నాలను మేము చూడగలిగాము. లింగ బేధము యొక్క కలవరమును మేము చూసాము. అది అంతా వచ్చుటను మేము చూడగలిగాము.’

    “కొంతకాలం పాటు, మిగిలిన వాటితో పాటు ఈ విస్తృతమైన చర్చ, పన్నెండుమంది కుటుంబముపై ఒక సంఘ ప్రమాణమును రూపొందించి, ఒక పత్రమును, బహుశా, ఒక ప్రకటనను సిద్ధపరచి, పరిశీలన కొరకు ప్రథమ అధ్యక్షత్వమునకు సమర్పించాలనే ముగింపుకు నడిపించెను.”

  12. కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటనLiahona, మే 2017, 145.

  13. అధ్యక్షులు డాల్లిన్ హెచ్. ఓక్స్ చెప్పారు: “ఈ భూమి మీద పుట్టిన అనేకనేకమంది మర్త్యులందరు తండ్రి యొక్క ప్రణాళికను ఎంపిక చేసారు మరియు దాని కొరకు పోరాడారు. మనలో అనేకులు మర్త్యత్వములో చేయాల్సిన దాని గురించి తండ్రితో నిబంధనలు కూడా చేసారు. బయల్పరచబడని విధానములలో, ఆత్మ లోకములో మన క్రియలు మర్త్యత్వములో మన క్రియలను ప్రభావితం చేస్తాయి” (“The Great Plan of Happiness,” Ensign, నవం. 1993, 72).

  14. డాల్లిన్ హెచ్. ఓక్స్, “Truth and the Plan,” Liahona, Nov. 2018, 25–28 చూడుము.

  15. అబ్రహాము 3:26.

  16. అధ్యక్షులు డాల్లిన్ హెచ్. ఓక్స్ చెప్పారు:

    “మార్పు చెందిన కడవరి-దిన పరిశుద్ధులు కుటుంబ ప్రకటన దాదాపు పావు శతాబ్ధము క్రితం జారీ చేయబడిందని నమ్ముతారు, మరియు ఇప్పుడు లెక్కలేనన్ని భాషలలో అనువదించబడింది, అది కుటుంబమునకు ప్రస్తుత సవాళ్ల గుండా మనల్ని బలపరచుటకు మనకవసరమైన సువార్త సత్యములపై ప్రభువు యొక్క పునరుద్ఘాటనను కలిగియున్నది. …

    “కుటుంబముపై ప్రకటన శాశ్వత సత్యము యొక్క ప్రకటన, నిత్యజీవమును కోరు ఆయన పిల్లలకు ప్రభువు యొక్క చిత్తమని నేను సాక్ష్యమిస్తున్నాను. గత 22 సంవత్సరాలుగా అది సంఘ బోధన మరియు ఆచరణ యొక్క ఆధారముగా ఉన్నది మరియు భవిష్యత్తులో ఆవిధంగా కొనసాగును. దానిని పరిగణించండి, దానిని బోధించండి, దాని ప్రకారము జీవించుము, మరియు నిత్య జీవము వైపు మీరు ముందుకు సాగినప్పుడు మీరు దీవించబడతారు. . . .

    “… కుటుంబ ప్రకటన వైపు మన వైఖరి మరియు దాని ఉపయోగము ఈ తరము యొక్క పరీక్షలలో ఒకటని నేను నమ్ముచున్నాను. ఆ పరీక్షలో స్థిరముగా నిలిచియుండుటకు కడవరి-దిన పరిశుద్ధులందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను” (“The Plan and the Proclamation,” Liahona, నవం. 2017, 30–31).

  17. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ చెప్పారు: “మనల్ని మూఢ విశ్వాసులుగా పేరుపెట్టిన వారున్నారు, కానీ మూఢ విశ్వాసులు మనము భావించునట్లు భావించుటకు వారు అనుమతించరు కానీ వారు భావించినట్లు భావించుటకు మనము అనుమతించాలని కోరతారు. మన వైఖరి చివరకు పవిత్రత చట్టముపై ఆధారపడియున్నది. పది ఆజ్ఞలు ఇంకను చలామణిలో ఉన్నవి. అవి ఎన్నడూ రద్దు చేయబడలేదు. . . . దేవుడు శాసించిన చట్టములను మార్చుటకు మనకు హక్కు లేదు” (in Dew, Insights from a Prophet’s Life: Russell M. Nelson, 212).

  18. “ప్రపంచము నలువైపుల నుండి కుటుంబము ముట్టడి చేయబడుచుండగా, కుటుంబ ప్రకటన యొక్క సత్యములు మిమ్మల్ని బలపరచును.

    “ఘనమైన జన్మ హక్కుగల యువజనులైన మీరు, వివాహము యొక్క నిర్వచనముపై సమాజపు ప్రస్తుత వాగ్వివాదన యొక్క చాలా ముఖ్యమైన పర్యవసానములను గ్రహించుట అవసరము. ప్రస్తుతపు వాదన ఒకే లింగమునకు చెందిన ఇద్దరు జనుల వివాహము చేసుకోవచ్చా అన్న ప్రశ్నను కలిగియున్నది. దీనిపై సంఘము యొక్క స్థానమును లేక ఇతర ముఖ్యమైన సమస్యపై మీకు ఒక ప్రశ్న ఉన్న యెడల, దానిని ప్రార్థనాపూర్వకంగా ధ్యానించండి, తరువాత సంఘము యొక్క రాబోయే అక్టోబరు సర్వసభ్య సమావేశమందు ప్రవచనాత్మక సందేశాలను ఆలకించుము. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపేణతో కలిపి, ఆ ప్రేరేపించబడిన ప్రసంగాలు మీ మెదడుకు సంపూర్ణ జ్ఞానమును తెచ్చును”(రస్సెల్ ఎమ్. నెల్సన్, “Youth of the Noble Birthright: What Will You Choose?” [Church Educational System devotional for young adults, Sept. 6, 2013], broadcasts.broadcasts.ChurchofJesusChrist.org).

  19. రస్సెల్ ఎమ్. నెల్సన్, “Stand as True Millennials,” Liahona, అక్టో. 2016, 53.

  20. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ చెప్పారు: “పౌర ప్రభుత్వాలు సామాజిక పోకడలు మరియు అవి వ్రాయబడి, తిరిగి వ్రాయబడి, మరియు చట్టాలు అమలు చేసినప్పుడు లౌకిక తత్వాల చేత అత్యధికంగా ప్రభావితం చేయబడినవి. పౌర శాసనము దేనిని అమలు చేసినప్పటికినీ లక్ష్యపెట్టకుండా, వివాహము మరియు నైతికత గూర్చి ప్రభువు యొక్క సిద్ధాంతముమార్చబడదు. జ్ఞాపకముంచుకొనుము: పాపము మనుష్యుని చేత చట్టబద్ధముగా చేయబడినా కూడ, అది దేవుని దృష్టిలో ఇంకను పాపమే!” (“Decisions for Eternity,” Liahona, Nov. 2013, 108).

  21. యోహాను 6:66–69.

  22. ఆల్మా 32:41-43 చూడండి; ఈ గొప్ప అధ్యాయములో మన విశ్వాసమును, విశ్వాస సుగుణాలను, సహనము మరియు శ్రద్ధను వృద్ధిచేసుకొనుట గురించి అన్నిటిని కలిపి చివరి మూడు వచనాలలో ప్రస్తావించబడిందని నేను ఎప్పుడు ముగ్దుడనౌతూనే ఉంటాను.

  23. ఆల్మా 7:12 చూడండి; యేసు క్రీస్తు మన పాపముల కొరకే కాదు మన బలహీనతల గురించి కూడా శ్రమపడ్డారు: “ఆయన జనులను కట్టి ఉంచు మరణ బంధకములను వదులు చేయునట్లు ఆయన మరణమును తనపైన తీసుకొనును. మరియు శరీరమును బట్టి ఆయన ప్రేగులు కనికరముతో నిండునట్లు, వారి బలహీనతలను బట్టి తన జనులను ఎట్లు ఆదరించవలెనో శరీరమును బట్టి ఆయన ఎరుగునట్లు, ఆయన వారి యొక్క బలహీనతలను తన పైన తీసుకొనును.“ (బలహీనతలకు పర్యాయపదాలేవనగా రోగము, బలహీనత, శ్రమ, లోపము.) సిద్ధాంతము మరియు నిబంధనలు 88:6: “ఆయన అన్ని విషయములను గ్రహించుటకు, ఆయన అన్నిటిలోను, అన్నిటియందు ఉండుటకు, సత్యమునకు వెలుగైయుండుటకు ఆయన పైకి ఆరోహణమైనట్లుగానే అన్నింటికంటే క్రిందకు కూడా దిగెను.“