మన తండ్రి సంతానం కొరకు అధికమైన ప్రేమ
మన ప్రియమైన ప్రవక్తచేత ప్రకటించబడి, మనం బాధ్యతతో చేయవలసిన ఆత్మీయ ఉద్దేశాలకు ప్రేమయే ప్రధాన విశేషణం, హేతువైయున్నది.
నా ప్రియ సహోదర సహోదరీల్లారా, ఇది చరిత్రలోనే అద్వితీయమైన, కీలకమైన సమయం. మనం రక్షకుని రెండవ రాకడకు ముందు చివరి యుగంలో నివసించుటకు దీవించబడ్డాం. ఈ యుగారంభమందు 1829లో, సంఘం లాంఛనంగా స్ధాపించబడుటకు ఒక సంవత్సరం ముందు, ఒక ప్రియమైన బయల్పాటులో “మహోన్నతమైన కార్యం“ “త్వరలో సంభవించబోతోందని“ ప్రకటించబడింది. ఈ బయల్పాటు ఎవరైతే దేవునికి సేవచేయుటకు కోరికను గలిగియుంటారో వారు ఆ సేవకు “విశ్వాసం, నిరీక్షణ, దాతృత్వం, ప్రేమ, దేవుని మహిమపరచు ఉద్దేశం కలిగియుండుట“1 ద్వారా అర్హులు కాగలరని ధృవపరచును. “క్రీస్తు యొక్క నిర్మలమైన ప్రేమయైన“ దాతృత్వం2 దేవుడు తన పిల్లల కొరకు కలిగియున్న నిత్యప్రేమను కలిగియున్నది.3
ఈ ఉదయమున దెైవసేవాకార్యంలో, దేవాలయ కుటుంబ చరిత్రలో, గృహం కేంద్రంగా, సంఘంచే సహాయం చేయబడే కుటుంబ మతాచారమందు అటువంటి ప్రేమ యొక్క ప్రాముఖ్యతను ఉద్ఘాటించుట నా ఉద్దేశమైయున్నది. రక్షకునిపై, మన తోటి వారిపై ప్రేమ4 2018లో మన ప్రియమైన ప్రవక్త, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ చే ప్రకటించబడిన, మనం బాధ్యతతో చేయవలసిన పరిచర్యకు మరియు ఆత్మీయ ఉద్దేశాలకు 5 ప్రధాన విశేషణం, హేతువైయున్నది.
చెదరిన ఇశ్రాయేలీయులను సమకూర్చు సువార్తపరిచర్య యత్నం
సువార్తపరిచర్యకు, ప్రేమల మధ్యనున్న సంబంధంను నేను నా జీవితంలో ముందుగానే తెలుసుకోగలిగాను. 11 సంవత్సరాల వయస్సున్నప్పుడు, నేను గోత్రజనకుడైన మా తాతయ్య నుండి గోత్రజనకుని దీవెనను పొందాను.6 ఆ దీవెన యొక్క ఒక భాగంలో, “నేను నిన్ను నీ తోటివారి కొరకు గొప్ప ప్రేమతో దీవిస్తున్నాను, నీవు లోకానికి సువార్త తీసుకొనిపోవుటకు...కీస్తు వద్దకు ఆత్మలను జయించుటకు7 పిలవబడుదువు“ అని చెప్పబడెను.
అంత చిన్నతనంలో కూడా సువార్తను ప్రకటించుట పరలోకతండ్రి యొక్క పిల్లలందరి కొరకు గల గొప్ప ప్రేమపై ఆధారపడి ఉందని అని నేను గ్రహించాను.
15 సంవత్సరాల క్రితం Preach My Gospelపై పనిచేయుటకు నియమించబడిన ప్రధాన అధికారులుగా, ఎప్పటిలాగానే మన రోజులలో కూడా ప్రేమ యొక్క విశేషణం దైవసేవాకార్యంలో ప్రాముఖ్యమైనదని మేము గ్రహించాము. దాతృత్వం, ప్రేమలతో పాటు, క్రీస్తును పోలిన సుగుణాలు కలిగియున్న అధ్యాయం 6, దైవసేవకులలో మిక్కిలి ప్రసిద్ధిగల అధ్యాయమైయున్నది.
రక్షకుని ప్రతినిధులుగా, అనేక దైవసేవకులు ఇటువంటి ప్రేమను కలిగియున్నారు, వారు పనిచేసినప్పుడు, వారి ప్రయత్నాలు దీవించబడ్డాయి. ప్రభువుకు తన ఉద్ధేశ్యంలో సహాయపడుటకు ప్రాముఖ్యమైన ఇటువంటి ప్రేమ యొక్క దృష్ఠికోణాన్ని సభ్యులు పొందినప్పుడు, ప్రభువు కార్యం నెరవేర్చబడగలదు.
ఇటువంటి ప్రేమకు ఆశ్చర్యకరమైన ఒక ఉదాహరణలో చిన్న పాత్రను పోషించేందుకు నాకు ప్రత్యేకావకాశం ఇవ్వబడింది. నేను పసిఫిక్ దీవుల ఏరియా అధ్యక్షునిగా సేవచేస్తున్నప్పుడు, అధ్యక్షులు ఆర్. వెయిన్ ష్యూట్ నుండి ఒక పిలుపు వచ్చింది. యవ్వనుడిగా ఆయన సమోవాలో దైవసేవ చేసాడు. తర్వాత, సమోవా మిషను అధ్యక్షునిగా ఆయన తిరిగివచ్చారు.8 ఆయన నాకు ఫోనుచేసినప్పుడు, ఆయన అపియా సమోవా దేవాలయ అధ్యక్షునిగా ఉన్నారు. ఆయన మిషను అధ్యక్షునిగా సేవచేస్తున్నప్పుడు, ఆయన యొక్క యౌవన దైవసేవకులలో ఒకరైన ఎల్డర్ విన్స్ హేలెక్, ఇప్పుడు పసిఫిక్ ప్రాంతీయ అధ్యక్షునిగా ఉన్నారు. అధ్యక్షులు ష్యూట్, విన్స్ కొరకు, హేలెక్ కుటుంబమంతటి కొరకు గొప్ప ప్రేమను, గౌరవాన్ని కలిగియున్నారు. కుటుంబంలో చాలామంది సంఘసభ్యులైనప్పటికీ, విన్స్ తండ్రి, కుటుంబ గోత్రజనకుడైన (జర్మనీ, సమోవా వాసుల సంతతి వాడైన) ఒట్టో హేలెక్ మాత్రం సభ్యుడు కాలేదు. అధ్యక్షుడు ష్యూట్ నేను అమెరికన్ సమోవాలో స్టేకు సమావేశం ఇతర కూటములకు హాజరౌతున్నానని యెరిగి, నేను ఒట్టో హేలెక్ గృహంలో ఆయనకు సువార్తను పంచుకొను నిమిత్తం అక్కడ బస చేయుటకు పరిగణించగలనేమో అని నన్ను అడిగారు.
నా భార్య మేరి, నేను ఒట్టో, ఆయన భార్య డోరతీతో వారి సుందరమైన గృహంలో నివసించాము. ఉదయకాలభోజన సమయమందు నేను సువార్త సందేశాన్ని పంచుకొని ఒట్టోను దైవసేవకులతో కలుసుకొమ్మని నేను ఆహ్వానించాను. ఆయన దయతో, నా ఆహ్వానాన్ని గట్టిగా ధిక్కరించారు. ఆయన తన కుటుంబంలో అనేకమంది కడవరి-దిన పరిశుద్ధులుగా ఉండుటను బట్టి సంతోషిస్తున్నానని చెప్పారు. కానీ తన సమోవా తల్లి తరపు పితరులలో కొందరు సమోవాలోని ఆదికాలక్రైస్తవ దైవసేవకులని, వారి క్రైస్తవ ఆచార విశ్వాసంపై ఆయన గొప్ప భక్తిని కలిగియున్నడని బలంగా సూచించారు.9 అయినప్పటికీ, మేము మంచి స్నేహితులంగా విడిపోయాం.
ఆ తర్వాత, అధ్యక్షులు గార్డెన్ బి. హింక్లీ సువా ఫిజీ దేవాలయం అంకితం చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు, ఆయన వ్యక్తిగత సహాయకుడైన సహోదరుడు డాన్ హెచ్. స్టహేలీ10 సన్నాహాలు చేయుటకు న్యూజిలాండ్ లోని నాకు ఫోను చేసారు. అధ్యక్షులు హింక్లీ ఫీజీ నుండి అమెరికన్ సమోవాకు ప్రయాణించి అక్కడి పరిశుద్ధులను కలుసుకోవాలని కోరారు. అంతకు ముందు దర్శించినప్పుడు ఉపయోగించబడిన హొటల్ సూచించబడింది. నేను వేరే సన్నాహాలు చేయవచ్చా అని అడిగాను. సహోదరుడు స్టహేలీ, “ప్రాంతీయ అధ్యక్షులు మీరే కాబట్టి; మీరు చేయవచ్చు“ అని చెప్పారు.
నేను తక్షణమే అధ్యక్షులు ష్యూట్ ను పిలచి, మన స్నేహితుడైన ఒట్టో హేలెక్ ను ఆత్మీయంగా దీవించడానికి మనం మరొక అవకాశం కలిగియున్నామని చెప్పాను. ఈసారి దైవసేవకులెవరంటే అధ్యక్షులు గార్డెన్ బి. హింక్లీ. అధ్యక్షులు హింక్లీ ప్రయాణబృందంలోనున్న మనల్నందరినీ హేలెక్ కుటుంబం ఆదరించడం సబబుగా భావిస్తున్నారా అని ఆయనను అడిగాను.11 అధ్యక్షులు హింక్లీ, ఆయన భార్య, వారి కుమార్తె జేన్, ఎల్డర్ జెఫ్రీ ఆర్. హోలెండ్ ఆయన భార్య కూడా ప్రయాణబృందంలో భాగంగా ఉన్నారు. అధ్యక్షులు ష్యూట్ ఆ కుటుంబంతో కలిసి పనిచేసి, అన్ని సన్నాహాలు పూర్తిచేసారు.12
దేవాలయ అంకితం పూర్తైన తర్వాత ఫీజీనుండి మేము చేరుకున్నప్పుడు, మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించారు.13 ఆ సాయంకాలం వేలమంది సమోవా సభ్యులతో మాట్లాడిన తర్వాత హేలెక్ గృహానికి వెళ్లాము. మరుసటి ఉదయకాలభోజనానికి కూడుకున్నప్పుడు, అధ్యక్షులు హింక్లీ, ఒట్టో హేలెక్ అప్పటికే మంచి స్నేహితులైపోయారు. నేను ఒట్టోతో సంవత్సరం క్రితం మాట్లాడిన విషయాన్నే వారు మాట్లాడుట నాకు చాలా ఆసక్తికరంగా ఉండింది. అయితే ఒట్టో మన సంఘంపై తనకు గల ఆదరణను తెల్పుచూ, తన ప్రస్తుతసంఘంపై తనకు గల ఒప్పుదలను పునరుద్ఘాటించారు, అధ్యక్షులు హింక్లీ తన చేతిని ఒట్టో భుజంపై వేసి, “ఒట్టో, అది సరిపోదు; నీవు తప్పక సంఘసభ్యునిగా అవ్వాలి.“ ఇది ప్రభువు యొక్క సంఘం“ అని చెప్పారు. మీరు ఒట్టో నుండి అభ్యంతరమైన కేడెము పడిపోయి, అధ్యక్షులు హింక్లీ చెప్పిన దానికి ద్వారము తెరచుకొనుట స్పష్టంగా చూడవచ్చు.
ఇది సంవత్సరం తర్వాత ఒట్టో హేలెక్ ను బాప్తీస్మం పొందుటకు, నిర్ధారించబడుటకు అనుమతించిన అదనపు దైవసేవకుని బోధనకు, ఆత్మీయ తగ్గింపునకు ఆరంభము. ఒక సంవత్సరం తర్వాత, హేలెక్ కుటుంబం ఒక నిత్యకుటుంబంగా దేవాలయంలో ముద్రించబడింది.14
ఈ అద్భుతమైన అనుభవమంతటిలో అధ్యక్షులు వెయిన్ ష్యూట్ తన మునుపటి దైవసేవకుడైన, ఎల్డర్ విన్స్ హేలెక్ కొరకు ప్రదర్శించిన అమోఘమైన పరిచర్యాత్మక ప్రేమ, ఆయన హేలెక్ కుటుంబమంతటినీ ఒక్కటిగా మరియు నిత్యకుటుంబంగా చూడాలనే కోరిక నా హృదయాన్ని తాకాయి.15
ఇశ్రాయేలీయులను సమకూర్చుటకు, మన హృదయాలను ఇటువంటి ప్రేమతో సమలేఖనం చేసుకొని, కేవలం ఒక బాధ్యత16 లేదా అపరాధం వంటి భావాలనుండి దూరంగా, ప్రేమభావాలకు, రక్షకుని సందేశాన్ని, పరిచర్యను, లోకం కొరకు తన లక్ష్యాన్ని17 పంచే దైవికభాగస్వామ్యంలో పాలుపంచుకొనుటకు దగ్గరవ్వాలి.
సభ్యులుగా మనం రక్షకుని కొరకు, లోకమంతా ఉన్న మన సహోదర సహోదరీల పట్ల మన ప్రేమను సులువైన ఆహ్వానాలనివ్వడం ద్వారా చూపవచ్చు. క్రొత్త ఆదివార కూడిక కార్యక్రమ పట్టిక సభ్యులకు తమ స్నేహితులను, తోటివారిని రండి, చూచి, సంఘఅనుభవాన్ని18 భావించండి అని ఆహ్వానించుటకు ఇవ్వబడిన అసాధారణ అవకాశం. నిన్న ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలెండ్ వివరించినట్లుగా, రక్షకునిపై కేంద్రీకరించబడిన ఆత్మీయ సంస్కార కూడిక, క్రొత్తనిబంధనపై మరియు రక్షకునిపై కేంద్రీకరించబడిన లేదా రక్షకుడు ఆయన సిద్ధాంతాలపై కేంద్రీకరించబడి దానికి సంబంధించిన సమావేశ ప్రసంగాలతో కూడిన 50 నిముషాల కూడిక గూర్చి మనమెరుగుదుము.
కొంతమంది ఉపశమనసమాజ సహోదరీలు వారిని యాజకత్వ పూరక సభ్యులతో పాటు “సమకూర్చేందుకు“ ఎందుకు నియమించారని ఆశ్చర్యపడుతున్నారు. దీనికి గల కారణాలలో, చాలా వాటిని గత సర్వసభ్యసమావేశంలో అధ్యక్షులు నెల్సన్ వివరించారు. ఆయన, “మీరు లేకుండా ఇశ్రాయేలీయులను మేము సమకూర్చలేమని ముగించారు“.19 ఈ రోజు మన పూర్తికాల దైవసేవకులలో సుమారు 30 శాతం మంది సహోదరీలే ఉండుటకు మనం దీవించబడ్డాం. ఇది ఉపశమన సమాజ సహోదరీలకు ప్రేమతో సువార్తను పంచుటకు అధికమైన అవసరతను, ప్రేరేపణను కల్పిస్తుంది. అయితే మనలో ప్రతీ ఒక్కరు అనగా పురుషులు, స్త్రీలు, యువకులు, పిల్లలు అందరికీ యేసుక్రీస్తు సువార్తను పంచుకొనుటకు ప్రేమ, జాలి, ఆత్మీయ నిబద్ధత కలిగియుండవలెను. మన ప్రేమ, కనికరం, అణకువ చూపించినప్పుడు అనేకులు మన ఆహ్వానాన్ని అంగీకరిస్తారు. మన ఆహ్వాన్నాన్ని అంగీకరించని వారుకూడా మనకు స్నేహితులుగానే ఉంటారు.
ఇశ్రాయేలీయులను సమకూర్చుటకు దేవాలయ కుటుంబ చరిత్ర ప్రయత్నము
మన దేవాలయ కుటుంబచరిత్ర ప్రయత్నం ద్వారా తెరకు అవతల నున్న ఇశ్రాయేలీయులను సమకూర్చడానికి కూడా ప్రేమయే కేంద్రంగాయున్నది. మనం మన పితరులు అనుభవించిన కష్టాలను, శోధనలను తెలుసుకున్నప్పుడు, వారి పట్ల మనకున్న ప్రేమ, కృతజ్ఞత అధికమౌతాయి. మన దేవాలయ కుటుంబ చరిత్ర ప్రయత్నం ఆదివారపు కూడికల కార్యక్రమ పట్టిక, యవ్వనుల తరగతులలో పురోగమనము లందు క్రొత్తగా చేయబడిన సవరింపుల వలన చాలామట్టుకు పటిష్టం చేయబడింది. ఈ మార్పులు మన పితరులను గూర్చి నేర్చుకొనుటకు, తెరకు అవతలనున్న ఇశ్రాయేలీయులను సమకూర్చుటకు త్వరగా మరింత శక్తివంతంగా శ్రద్ధ పెట్టుటకు దోహదపడును. దేవాలయ పని, కుటుంబచరిత్ర కార్యములు రెండు గొప్పగా హెచ్చించబడతాయి.
ఇంటర్నెట్ అనేది ఒక బలమైన సాధనం; ఇప్పుడు గృహమే మన ప్రాథమిక కుటుంబచరిత్రా కేంద్రం. మన యవ్వన సభ్యులు కుటుంబచరిత్ర పరిశోధనలో అసమాన్యమైన నిఫుణులుగా, వారి పితరులను ప్రేమించుటకు, వారికి కృతజ్ఞత కలిగియుండుటకు నేర్చుకొని బాప్తీస్మములు ఇచ్చుటకు ఆత్మీయంగా ప్రేరేపించబడియున్నారు. ఆ మార్పు వలన అనేక 11 సంవత్సరాల వయస్సువారు మృతుల కొరకు బాప్తీసాలు ఇచ్చుటకు సాధ్యం చేసినప్పటినుండి, లోకవ్యాప్తంగా నున్న దేవాలయ అధ్యక్షులు హాజరులో గొప్ప ఎదుగుదలను నివేదించారు. ఒక దేవాలయ అధ్యక్షుడు “బాప్తీస్మం కొరకు వచ్చేవారిలో చెప్పుకోదగిన పెరుగుదల వచ్చింది ... అయితే 11 సంవత్సారాల వారి వల్ల వారి కుటుంబాలు అనేకంగా వస్తున్నాయి. … వారి యవ్వన వయస్సులో కూడా, వారు భక్తిభావాన్ని, వారు పాల్గొంటున్న విధుల ఉద్ధేశ్యాన్ని వారు యెరిగియున్నట్లుగా కనబడుతున్నారు. ఇది చూచుటకు మనోహరంగా ఉన్నది!“ 20 అని చెప్పారు.
మన ప్రాథమిక, యువకుల నాయకులు కుటుంబచరిత్ర, దేవాలయ పనిని ఒక ముఖ్యమైన కార్యముగా చేస్తున్నారని, చేస్తూనే ఉంటారని నేనెరుగుదును. ఉపశమన సమాజ సహోదరీలు, యాజకత్వ సహోదరులు ప్రేమతో వారి దేవాలయ కుటుంబ చరిత్ర బాధ్యతను వ్యక్తిగతంగా నిర్వర్తిస్తూ, తెరకు అవతల నున్న ఇశ్రాయేలీయులను సమకూర్చడానికి పిల్లలకు, యవ్వనులకు సహాయపడుతూ, ప్రేరేపించాలి. ఇది మరిముఖ్యంగా సబ్బాతు దినాన్న గృహంలో చేయుట ప్రాముఖ్యమైనది. పితరులకు విధులను ప్రేమతో నిర్వహించడం దుష్టత్వం పెరుగుతున్న లోకంలో మన యవ్వనులను, కుటుంబాలను సంరక్షిస్తుంది. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ దేవాలయాల గురించి, దేవాలయ పని గురించి మహా ప్రాముఖ్యమైన బయల్పాటులను పొందారని నేను వ్యక్తిగతంగా సాక్ష్యమిస్తున్నాను.
నిత్య కుటుంబాలను, వ్యక్తులను దేవునితో జీవించుటకు సిద్దపరచుట
గృహ-కేంద్ర సువార్త పఠనం మరియు జీవించుటపై గల నూతన ఉద్ఘాటన, సంఘంచే సిద్ధం చేయబడిన వనరులు ప్రేమతో నిత్యకుటుంబాలను, వ్యక్తులను దేవునిని కలుసుకొని ఆయనతో జీవించుటకు21 గొప్ప అవకాశమైయున్నది.
ఒక పురుషుడు, స్త్రీ దేవాలయంలో ముద్రించబడినప్పుడు, వారు యాజకత్వక్రమమైన నూతన నిత్యనిబంధనలోని పరిశుద్ధ వివాహ క్రమంలో ప్రవేశించెదరు.22 వారు కలిసి యాజకత్వ దీవెనలను పొందుటకు, వారి కుటుంబ వ్యవహారాలను నిర్ధేశించుటకు శక్తిని పొందెదరు. “కుటుంబం: ప్రపంచానికి ఒక ప్రకటన“23 లో వివరించబడినట్లుగా స్త్రీ, పురుషులు అసమానమైన పాత్రను కలిగియున్నారు, కానీ వారి నిర్వహణాధికారం దాని విలువ, ప్రాముఖ్యతలలో సరిసమానంగా ఉన్నది.24 వారిరువురూ వారి కుటుంబం కోసం బయల్పాటు పొందుటకు సరిసమాన శక్తిని కలిగియున్నారు. వారు ప్రేమ, నీతిమత్వంలో కలిసి పనిచేసినప్పుడు, వారి నిర్ణయాలు పరలోకంచే ఆశీర్వదించబడతాయి.
వ్యక్తులు వారి కుటుంబాల కొరకు ప్రభువు చిత్తాన్ని తెలుసుకొనుటకు ప్రయత్నించినప్పుడు, వారు నీతిమత్వం, సాత్వీకం, కనికరం, ప్రేమల కొరకు ప్రయాసపడవలెను. దేవుని చిత్తాన్ని వెదికే వారికి, ప్రత్యేకంగా వారి కుటుంబానికి అణకువ, ప్రేమ ప్రమాణచిహ్నలు కాగలవు.
మనలను పరిపూర్ణులుగా, నిబంధన ఆశీర్వాదాలకు అర్హులుగా చేసుకొనుట , దేవునిని కలుసుకొనుటకు సిద్ధపడుట వ్యక్తిగత బాధ్యతలు. మనం స్వయంసమృద్ధితో, మన గృహాలను మనలను చుట్టుముట్టే తుఫానుల25 నుండి ఒక ఆశ్రయంగా, “విశ్వాస మహాప్రస్థానంగా“26 చేసుకొనుటకు ఆతురతతో పూనుకొనవలెను. తల్లిదండ్రులు వారి పిల్లలకు ప్రేమతో బోధించే బాధ్యతను కలిగియున్నారు. ప్రేమతో నింపబడిన గృహాలు సంతోషం, ఆహ్లాదంతో, భూమిపై నిర్మించబడిన పరలోకం వలే కాగలవు.27
నా తల్లి యొక్క ప్రియమైన కీర్తన “గృహములో ప్రేమ.“28 ఆమె దాని మొదటి చరణం, “గృహములో ప్రేమ ఉన్నప్పుడు చూట్టూ అందంగా ఉంటుంది“ విన్న ప్రతీసారి, స్పష్టంగా తాను స్పర్శించబడి, కన్నీళ్లపర్యంతమయ్యేది. పిల్లలమైన మేము అటువంటి గృహంలో నివసిస్తున్నామని తెలుసుకున్నాం, అది ఆవిడ యొక్క అత్యధికమైన ప్రాధాన్యతైయుండెను.29
గృహంలో ప్రేమగలిగిన వాతావరణానికి అధనంగా అధ్యక్షులు నెల్సన్ మన ప్రాథాన ఉద్ధేశ్యాలను30 అభ్యంతరపరచే ప్రసారసాధనాల వినియోగాన్ని తగ్గించమని స్పష్టం చేశారు. ఏ కుటుంబానికైనా ప్రయోజనాన్ని కలిగించే ఒక సవరణ ఏమిటంటే ఇంటర్నెట్ ను, సామాజిక ప్రసారమాధ్యాలను, దూరదర్శనిని ఒక వ్యాకులతగా లేదా ఇంకా అధ్వాన్నమైన ఒక యజమానిగా కాకుండా ఒక సేవకునిగా చేయాలి. అందరి ఆత్మలు, మరిముఖ్యంగా పిల్లల ఆత్మల కొరకైన యుద్ధం, ఎల్లప్పుడూ గృహంలోనే జరుగుతుంది. తల్లిదండ్రులుగా మనం ప్రసారమాధ్యాల భావం హితంగా, వయస్సుకు తగినదిగా, మరియు మన తయారుచేస్తున్న ప్రేమగలిగిన వాతావరణానికి అనుగుణంగా ఉండేలా చూడాలి.
మన గృహాలలో బోధన స్పష్టంగా, బలంగా31, అంతేకాకుండా ఆత్మీయంగా, ఆనందమైనదిగా, ప్రేమతో నింపబడినదైయుండాలి.
రక్షకుని కొరకు, ఆయన ప్రాయశ్చిత్తము కొరకు మన ప్రేమను కేెంద్రీకరించినప్పుడు, మనం ఆయనను తెరకు ఇరవైపులా నున్న ఇశ్రాయేలీయులను సమకూర్చే ప్రయత్నాలలో, ఇతరులకు పరిచర్య చేయుటలో, దేవునిని కలుసుకొనుటకు వ్యక్తిగత సిద్ధపాటులో ప్రధానభాగంగా ఉంచినప్పుడు, అపవాధి ప్రభావం తగ్గి, సంతోషం, ఆనందం, సువార్త శాంతి మన గృహాలలో క్రీస్తును పోలిన ప్రేమతో నింపివేయును.32 ఈ సిద్ధాంత వాగ్ధానాలను గూర్చి సాక్ష్యమిస్తూ, యేసుక్రీస్తు, మనకు బదులుగా ఆయన యొక్క ప్రాయశ్చిత్త బలిని గూర్చిన నా బలమైన సాక్ష్యాన్ని యేసుక్రీస్తు నామంలో ముగిస్తున్నాను, ఆమెన్.