2010–2019
మన ఆత్మీయ కండరాలకు వ్యాయామం
2019 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము.


2:3

మన ఆత్మీయ కండరాలకు వ్యాయామం

కండరాలను బలపరచుటకు కండరాలను గూర్చి చదువుట, నేర్చుకొనుట సరిపోనట్లుగా, విశ్వాసమును నిర్మించుటకు తగినంత క్రియను చేర్చకుండా విశ్వాసమును గూర్చి చదువుట మరియు నేర్చుకొనుట సరిపోదు.

ఒక భౌతిక శరీరమును కలిగియుండే దీవెన కొరకు నేను కృతజ్ఞత కలిగియున్నాను, అది మన పరలోక తండ్రి నుండి అద్భుతమైన బహుమానము. మన శరీరాలు 600 కండరాలను కలిగియున్నది.1 మన అనుదిన కార్యక్రమాలను నెరవేర్చుటకు పనిచేసే స్థితిలో ఉండుటకు బదులుగా అనేక కండరాలకు వ్యాయామం అవసరము. మన కండరాలను గూర్చి నేర్చుకోవటానికి మరియు చదవటానికి మనము ఎక్కువ మానసిక ప్రయత్నము చేస్తాము, కానీ ఇది వాటిని బలముగా చేస్తాయని మనము అనుకుంటే, మనము చాలా నిరాశ చెందుతాము. మనము వాటిని ఉపయోగించినప్పుడు మాత్రమే మన కండరాలు బలపడతాయి.

ఆత్మీయ వరములు అదేవిధంగా ప్రవర్తిస్తాయని నేను గ్రహించగలిగాను. బలపడుటకు వాటికి కూడ వ్యాయామం అవసరము. ఉదాహరణకు, ఆత్మీయ వరమైన విశ్వాసము, కేవలము ఒక భావన లేక మానసిక స్థితి కాదు; అది సాధన చేయు ప్రక్రియకు జతపరచబడి లేఖనములందు తరచుగా కనబడే క్రియ యొక్క సూత్రము.2 కండరాలను బలపరచుటకు కండరాలను గూర్చి చదువుట, నేర్చుకొనుట సరిపోనట్లుగా, విశ్వాసమును నిర్మించుటకు తగినంత క్రియను చేర్చకుండా విశ్వాసమును గూర్చి చదువుట మరియు నేర్చుకొనుట సరిపోదు.

నాకు 16 సంవత్సరాలప్పుడు, మా అన్న, ఆ సమయమందు 22 సంవత్సరాల ఇవాన్, ఒకరోజు ఇంటికి వచ్చి ఏదో వార్తను కుటుంబముతో పంచుకున్నాడు. అతడు యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘములో బాప్తీస్మము తీసుకోవాలని నిర్ణయించాడు. మా తల్లిదండ్రులు అతడివైపు అనుమానంగా చూసారు, మరియు ఏమీ జరుగుతుందో నాకు పూర్తిగా అర్ధము కాకపోవటం గుర్తున్నది. ఒక సంవత్సరము తరువాత, అతడు మాకు ఎక్కువ ఆశ్చర్యకరమైన వార్తను ఇచ్చాడు: అతడు సంఘము యొక్క మిషనరీగా సేవ చేయుటకు నిర్ణయించాడు, దాని అర్ధము మేము అతడిని రెండు సంవత్సరాలు చూడబోము. మా తల్లిదండ్రులు ఈ వార్తను విని పులకరించలేదు; అయినప్పటికినీ, అతడిలో ఒక స్పష్టమైన తీర్మానమును నేను చూసాను, అది అతడి కొరకు మరియు అతడు చేసిన నిర్ణయము కొరకు నా ప్రశంసను హెచ్చించింది.

నెలల తరువాత, ఇవాన్ తన మిషను సేవ చేస్తూండగా, కొందరు పాఠశాల సహచరులతో ఒక సెలవు దినమును ప్రణాళిక చేసే అవకాశము నాకు కలిగింది. మా ఉన్నత పాఠశాల సంవత్సరాల ముగింపును వేడుక చేసుకోవాలని, సముద్ర తీరమున కొన్నిరోజులు గడపాలని మేము కోరాము.

నా వేసవి సెలవు ప్రణాళికలను తెలియజేస్తూ నా మిషనరీ సహోదరునికి నేను ఒక లేఖ వ్రాసాను. నా గమ్యముకు దారిలో తాను సేవ చేస్తున్న నగరమున్నదని అతడు నాకు తిరిగి వ్రాసాడు. ఆగి, అతడిని సందర్శించుట ఒక మంచి ఆలోచనగా ఉంటుందని నేను నిర్ణయించాను. ఆ తరువాత కానీ మిషనరీలు కుటుంబ సభ్యులతో సందర్శించబడరాదని నేను తెలుసుకోలేదు.

నేను అన్ని ఏర్పాట్లు చేసాను. ఈ అందమైన కాంతివంతమైన దినమున ఇవాన్, నేను కలిసి కలిగియుండే సరదా గురించి ఆలోచిస్తూ బస్సులో కూర్చోవటం నాకు గుర్తున్నది. మేము అల్పాహారము తింటాము, ఇసుకలో ఆడుకుంటాము, సముద్ర తీరమున ఎండలో పడుకుంటాము---మేము ఎంత గొప్ప సమయాన్ని కలిగియుండబోతున్నాము.

బస్సు గమ్యము చేరినప్పుడు, ఇవాన్ మరొక యువకుని ప్రక్కన నిలబడియుండుట నేను చూసాను, ఇరువురు తెలుపు చొక్కాలు మరియు టైలు వేసుకున్నారు. నేను బస్సు దిగాను, మేమ ఒకరినొకరం హత్తుకున్నాము, మరియు అతడు తన సహవాసిని పరిచయము చేసాడు. మరొక నిముషము వృధా చేయకుండా, ఆ రోజు కోసం నా ప్రణాళికను మా అన్నతో చెప్పాను, కానీ ఇవాన్ యొక్క ప్రణాళిక గురించి కాస్త కూడ నాకు తెలియదు. అతడు నా వైపు చూసి, నవ్వి, “అలాగే! అన్నాడు. అయినప్పటికినీ, మేము మొదట కొన్ని పనులు చేయాలి. నీవు మాతో వస్తావా?” తరువాత సముద్ర తీరమును ఆనందించటానికి మాకు తగినంత సమయము ఉంటుందని ఆలోచిస్తూ, నేను అంగీకరించాను.

ఆ రోజు, 10 గంటల కంటే ఎక్కువగా నేను మా అన్న, అతడి సహవాసితో ఆ నగర వీధుల గుండా నడిచాను. రోజంతా జనులవైపు నేను చిరునవ్వు నవ్వాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని జనులను నేను పలుకరించాను. మేము ప్రతీఒక్కరితో మాట్లాడాము, క్రొత్తవారి తలుపులు తట్టాము, మరియు నా సహోదరుడు, అతడి సహవాసి బోధిస్తున్న జనులను దర్శించాము.

అటువంటి ఒక సందర్శన సమయములో, నా సహోదరుడు, అతడి సహవాసి యేసుక్రీస్తు మరియు రక్షణ ప్రణాళిక గురించి బోధిస్తున్నారు. హఠాత్తుగా, ఇవాన్ ఆగి, నా వైపు చూసాడు. నా ఆశ్చర్యానికి అతడు, బోధించబడిన దాని గురించి నా అభిప్రాయము చెప్పమని మర్యాదగా అడిగాడు. గది నిశ్శబ్దముగా మారింది, మరియు అందరి కళ్ళు నావైపు ఉన్నాయి. కొంత కష్టముతో, చివరికి నేను మాటలు కనుగొని రక్షకుని గురించి నా భావాలు తెలియజేసాను. నేను చెప్పినది సరైనది లేక తప్పో నాకు తెలియదు. మా అన్న నన్ను ఎన్నడూ సరిదిద్దలేదు; వ్యతిరేకంగా అతడు నా ఆలోచనలు, భావాలు పంచుకున్నందుకు నాకు కృతజ్ఞత తెలిపాడు.

ఆ కలిసియున్న గడియలందు, నా సహోదరుడు, అతడి సహవాసి నాకు ప్రత్యేకంగా ఒక పాఠము బోధించుటకు ఒక్క నిముషము కూడ గడపలేదు, అయినప్పటికినీ, అతడితో నా ముందు సంభాషణలన్నిటి కంటే ఎక్కువ జ్ఞానమును నేను పొందాను. జనులు వారి జీవితాలలో ఆత్మీయ వెలుగును పొందినప్పుడు ముఖములు ఎలా మారాయో నేను ప్రత్యక్షంగా చూసాను. వారిలో కొందరు సందేశములలో నిరీక్షణను కనుగొనుట నేను చూసాను, మరియు ఇతరులకు ఎలా సేవ చేయాలి మరియు నా గురించి, నా స్వంత కోరికలను గూర్చి మరిచిపోవాలో నేను నేర్చుకున్నాను. రక్షకుడు బోధించిన దానిని నేను చేస్తున్నాను: “ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకోవాలి.”3

ఆ అనుభవము గురించి ఆలోచిస్తూ, ఆ రోజు నా విశ్వాసము వృద్ధి చెందుట నేను గ్రహించాను, ఎందుకనగా మా అన్న దానిని క్రియలో ఉంచుటకు నాకు అవకాశమిచ్చాడు. లేఖనముల నుండి మనము చదివినట్లుగా నేను దానిని సాధన చేసాను, బోధించుటకు జనుల కొరకు వెదికాను, సాక్ష్యమును చెప్పాను, ఇతరులకు సేవ చేసాను, మరియు మొదలైనవి ఆ రోజు ఎండలో సముద్ర తీరమున పడుకోవటానికి మాకు ఎన్నడూ సమయము దొరకలేదు, కానీ నా హృదయము పరలోకపు కాంతితో నింపబడింది. సముద్ర తీరమును ఒక్క ఇసుక రేణువును కూడ నేను చూడలేదు కాని, నా విశ్వాసము అవగింజంత చిన్న విత్తనము వలె ఎదుగుట నేను చూసాను.4 ఒక ప్రయాణికునిగా నేను కాంతివంతమైన దినమును గడపలేదు, కానీ నేను అద్భుతమైన అనుభవాలను సంపాదించాను, మరియు దానిని గ్రహించకుండానే, నేను సంఘ సభ్యుడిని కానప్పటికి కూడా---నేను ఒక మిషనరీగా ఉన్నాను!

ఆత్మీయ కండరాలను బలపరచుటకు అవకాశాలు

సువార్త యొక్క పునఃస్థాపన వలన, ఆత్మీయ వరములు వృద్ధి చేయుటకు మన పరలోక తండ్రి మనకు ఎలా సహాయపడతారో మనము గ్రహించగలము. కేవలము ఆత్మీయ మరియు శారీరక ప్రయత్నాలు లేకుండా వాటిని మనకు అనుగ్రహించుటకు బదులుగా ఆ వరములను వృద్ధి చేసే అవకాశాలను ఆయన మనకిస్తున్నట్లుగా అది ఉన్నది. మనము ఆయన ఆత్మతో అనుగుణముగా ఉన్నయెడల, ఆ అవకాశములను గుర్తించుటకు మనము నేర్చుకుంటాము మరియు తరువాత వాటిని అమలు చేస్తాము.

మనము ఎక్కువ సహనమును వెదకిన యెడల, ఒక జవాబు కొరకు వేచియుండగా, దానిని సాధన చేయాల్సిన అవసరము మనకుందని కనుగొనవచ్చు. మన పొరుగు వాని కొరకు మనము ఎక్కువ ప్రేమ కలిగియుండాలని కోరిన యెడల, సంఘములో క్రొత్తగా వచ్చిన వారి ప్రక్కన కూర్చోవటం ద్వారా దానిని మనము ప్రోత్సహించగలము. విశ్వాసముతో అదేవిధముగా ఉన్నది: మన మనస్సులలోనికి అనుమానము వచ్చినప్పుడు, ముందుకు సాగిపోవుటకు ప్రభువు యొక్క వాగ్దానములందు విశ్వసించుట అవసరమగును. ఈ విధానములో, మనము ఆత్మీయ కండరాలకు వ్యాయామము చేస్తాము మరియు మన జీవితాల బలము యొక్క ఆధారములుగా వాటిని వృద్ధి చేస్తాము.

అది ప్రారంభములో అంత సులభము కాకపోవచ్చు, మరియు అది ఒక పెద్ద సవాలు కూడా కావచ్చు. ప్రవక్త మొరోనై ద్వారా, ప్రభువు యొక్క మాటలు నేడు మనకు అన్వయిస్తాయి: “మరియు మనుష్యులు నా యొద్దకు వచ్చిన యెడల, నేను వారికి వారి బలహీనతలను చూపెదను. వారు తగ్గించుకొనునట్లు నేను మనుష్యులకు బలహీనతనిచ్చెదను, మరియు నా యెదుట తమను తగ్గించుకొను మనుష్యులందరికి నా కృప చాలును. ఏలయనగా నా యెదుట వారు తమను తగ్గించుకొనిన యెడల మరియు నా యందు విశ్వసించిన యెడల, అప్పుడు నేను బలహీనమైన సంగతులను వారికి బలమైనవిగా చేస్తాను.”5

మా అన్న ఇవాన్‌కు నేను కృతజ్ఞత కలిగియున్నాను, అతడు సువార్తను నాతో పంచుకొనుట మాత్రమే కాదు, కానీ దానిని జీవించుటకు మరియు నా బలహీనతలు గుర్తించుటకు కూడా నన్ను పరోక్షంగా ఆహ్వానించాడు. బోధకుని యొక్క ఆహ్వానమును అంగీకరించుటకు అతడు నాకు సహాయపడ్డాడు: రక్షకుడు నడిచినట్లుగా నడుచుటకు, రక్షకుడు వెదకినట్లుగా వెదకుటకు, మరియు రక్షకుడు ప్రేమించినట్లుగా ప్రేమించుటకు—“రండి, నన్ను వెంబడించుము.”6 నెలల తరువాత, నా మిషనరీ అనుభవము తరువాత, నేను బాప్తీస్మము తీసుకోవటానికి, నా స్వంత మిషను సేవ చేయుటకు నిర్ణయించుకున్నాను.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ యొక్క ఆహ్వానము మనము అంగీకరిద్దాము మరియు ఎక్కువ ఆత్మీయ క్రియాశీలత అవసరమైన ఆ కండరాలను గుర్తించి, వాటికి వ్యాయామం చేయుట ప్రారంభించుట ద్వారా ఉద్దేశ్యపూర్వకంగా రక్షకుని వద్దకు వద్దాము.7 ఇది స్వల్ప దూరపు పరుగు కంటే, సుదూరపు పెద్ద పరుగు పందెము, కనుక ఆ ముఖ్యమైన ఆత్మీయ కండరాలను బలపరచే స్వల్పమైనవి కాని స్థిరమైన ఆత్మీయ క్రియలను మరచిపోవద్దు. మన విశ్వాసమును వృద్ధి చేయాలని మీరు కోరిన యెడల, అప్పుడు దానికి విశ్వాసము అవసరమైన క్రియలను చేద్దాము.

మనము ప్రేమగల పరలోక తండ్రి యొక్క పిల్లలమని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన కుమారుడు, యేసు క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనకు మార్గమును చూపుటకు ఈ లోకమునకు వచ్చాడు మరియు మనకు నిరీక్షణను ఇచ్చుటకు స్వచ్ఛంధంగా తన ప్రాణమును ఇచ్చాడు. ఆయన పరిపూర్ణమైన మాదిరిని అనుసరించుటకు, ఆయన యందు, ఆయన ప్రాయశ్చిత్తఃమునందు మన విశ్వాసమును సాధన చేయుటకు, మనము దీవించబడిన ఆత్మీయ వరములన్నిటినీ విశదపరచుటకు రక్షకుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఆయనే మార్గము. యేసు క్రీస్తు నామములో ఇది నా సాక్ష్యము, ఆమేన్.