సర్వసభ్య సమావేశము
ఒక సంఘము యొక్క అవసరము
2021 అక్టోబరు సర్వసభ్య సమావేశము


15:54

ఒక సంఘము యొక్క అవసరము

మన ప్రభువైన యేసు క్రీస్తు చేత మరియు ఆయన అధికారముతో నడిపించబడే సంఘము యొక్క మూలము మరియు అవసరాన్ని లేఖనాలు స్పష్టంగా బోధిస్తున్నాయి.

అనేక సంవత్సరాల క్రితం, పన్నెండు మంది అపొస్తలుల సమూహములో ఒక సభ్యుడైన ఎల్డర్ మార్క్ ఈ. పీటర్సన్ ఈ ఊహాత్మక ఉదాహరణతో ఒక ప్రసంగాన్ని ప్రారంభించారు.

“కెన్నెత్ మరియు అతడి భార్య లూసిల్లా మంచివారు, నిజాయితీ గలవారు మరియు న్యాయవంతులు. వాళ్ళు సంఘానికి వెళ్ళరు, అయినప్పటికీ అది లేకుండా వారు తగినంత మంచిగా ఉండగలరని వారు భావించారు. వారు తమ పిల్లలకు నిజాయితీ, సుగుణమును బోధించారు మరియు సంఘము వారి కోసం చేసేది అంతేనని వారికై వారు భావించారు.

“ఏదిఏమైనా, వారి వారాంతములు కుటుంబ వినోదము కోసము వారికి అవసరమని … [మరియు] సంఘానికి వెళ్ళడం వలన కుటుంబ వినోదానికి సమయముండదని వాళ్ళు పట్టుబట్టారు.”1

ఈరోజు, నా సందేశము వారి సంఘాలకు హాజరవటం లేక పాల్గొనడం మానివేసిన అటువంటి మంచి, మతపరమైన మనస్సుగల వ్యక్తులకు సంబంధించినది.2 నేను “సంఘాలు” అని చెప్పినప్పుడు, నేను సమాజ మందిరాలను, మసీదులను లేదా మిగిలిన మతపరమైన సంస్థలను చేరుస్తున్నాను. అంతర్జాతీయంగా వీటన్నిటిలో హాజరైనవారు, ప్రాముఖ్యంగా తగ్గిపోయారని మేము చింతిస్తున్నాము.3 ఏ కారణము చేతనైనా మనము మన సంఘాలకు విలువనివ్వడం మానినేసిన యెడల, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి ముప్పు తెచ్చుకుంటున్నాము మరియు గణనీయమైన సంఖ్యలో దేవుని నుండి తమను తాము వేరు చేసుకునేవారి వలన మన దేశాలకు ఆయన దీవెనలను తగ్గిస్తాయి.

ఒక సంఘములో హాజరవడం మరియు చురుకుగా పాల్గొనడం, మంచి జనులుగా మారడానికి మరియు ఇతరుల జీవితాలలో మంచి ప్రభావాలుగా ఉండటానికి మనకు సహాయపడతాయి. మతపరమైన సూత్రాలను ఎలా అన్వయించుకోవాలో సంఘములో మనము బోధింపబడతాము. మనము ఒకరినొకరి నుండి నేర్చుకుంటాము. ఒక ప్రసంగము వినుట కంటె ఇతరుల యొక్క మాదిరిని గమనించుట ఎక్కువ శక్తివంతమైనది. సంఘములో ఏకమనస్సు గల ఇతరులతో సహవాసము కలిగియుండుట ద్వారా మనము బలపరచబడతాము. సంఘానికి హాజరుగుట మరియు పాల్గొనుట వలన బైబిలు చెప్పినట్లుగా మన హృదయాలు “ప్రేమయందు ముడివేయబడతాయి.”4

I.

బైబిలులో దేవుడు క్రైస్తవులకు ఇచ్చిన లేఖనాలు మరియు ఆధునిక బయల్పాటు సంఘము యొక్క అవసరాన్ని స్పష్టంగా బోధిస్తున్నాయి. యేసు క్రీస్తు ఒక సంఘాన్ని స్థాపించారని మరియు ఒక సంఘము ఆయన తరువాత ఆయన కార్యమును కొనసాగిస్తుందని తలంచారని రెండూ చూపిస్తున్నాయి. ఆయన పన్నెండుమంది అపొస్తలులను పిలిచి, వారికి అధికారమిచ్చి, దానిని నడిపించడానికి తాళపుచెవులను ఇచ్చారు. క్రీస్తు “సంఘము యొక్క శిరస్సు”5 మరియు “పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకు”6 దాని అధికారులు ఇవ్వబడ్డారని బైబిలు బోధిస్తుంది. నిశ్చయముగా సంఘము యొక్క ప్రారంభముపై మరియు ఇప్పుడు దాని అవసరతపై బైబిలు స్పష్టముగా ఉన్నది.

సంఘ సమావేశాలు వారికి సహాయపడటం లేదని కొందరు చెప్పుచున్నారు. కొందరు “ఈరోజు నేను ఏమీ నేర్చుకోలేదు” లేక “ఎవరూ నాతో స్నేహపూర్వకంగా లేరు” లేక “నాకు కోపం వచ్చింది” అని కొందరు చెప్తారు. సేవ చేయమని, సేవ చేయబడరాదని బోధించిన క్రీస్తు యొక్క సిద్ధాంతము నుండి వ్యక్తిగత నిరాశలు మనల్ని ఎన్నడూ నిలిపివేయరాదు.7 దీన్ని దృష్టిలో ఉంచుకుని, మరొక సభ్యుడు సంఘానికి తాను హాజరుకావడంపై తన దృష్టిసారింపును వివరించాడు:

“సంవత్సరాల క్రితం, నేను సంఘానికి వెళ్ళడం గురించి నా స్వభావాన్ని మార్చుకున్నాను. ఇక నాకోసం నేను సంఘానికి వెళ్ళడం లేదు, కానీ ఇతరుల గురించి ఆలోచించడానికి. ఒంటరిగా కూర్చోన్న వారిని పలకరించడానికి, క్రొత్త వారిని స్వాగతించడానికి, … ఒక పనిని స్వచ్ఛందంగా చేయడాన్ని నేను ముఖ్యాంశంగా చేసాను.

“క్లుప్తంగా, స్తబ్ధంగా కాకుండా, నేను చురుకుగా ఉండాలనే ఉద్దేశ్యంతో, మరియు జనుల జీవితాలలో సానుకూలమైన భిన్నత్వాన్ని కలిగియుండాలని ప్రతివారము నేను సంఘానికి వెళతాను .”8

సంఘములో ఆహ్వానించబడుట

అధ్యక్షులు స్పెన్సర్ డబ్ల్యు. కింబల్ ఇలా బోధించారు, “మనము విశ్రాంతిదిన సమావేశాలకు వినోదం కోసం లేదా కేవలం సూచనల కోసం వెళ్ళము. మనం ప్రభువును ఆరాధించడానికి వెళతాము. అది ఒక వ్యక్తిగత బాధ్యత. … సంఘ కూడికలు మీకు వైఫల్యమైతే, మీరు విఫలమయ్యారు. వేరొకరు మీకోసం ఆరాధించలేరు; మీరు ప్రభువు కొరకు మీ స్వంతంగా వేచియుండాలి.”9

సంఘానికి హాజరుగుట మన హృదయాలను తెరచి, మన ఆత్మలను పరిశుద్ధపరచగలదు.

వార్డు సలహామండలి కూడిక

సంఘములో మనము కేవలము ఒంటరిగా లేదా మన ఇష్టానుసారముగా లేదా సౌకర్యమును బట్టి సేవ చేయము. సాధారణంగా మనము ఒక జట్టుగా సేవ చేస్తాము. సేవలో మన కాలపు వ్యక్తివాదానికి పైగా పైకి లేచుటకు మనము పరలోకము నుండి పంపబడిన అవకాశాలను కనుగొంటాము. సంఘముచేత నడిపించబడు సేవ మన ఆత్మీయ ఎదుగుదలను ఆలస్యం చేయగల వ్యక్తిగత స్వార్ధాన్ని జయించడానికి మనకు సహాయపడుతుంది.

ఇంకా క్లుప్తంగా చెప్పడానికి ఇంకా ఇతర ముఖ్యమైన ప్రయోజనాలున్నాయి. సంఘములో మనము దేవునికి సేవ చేయడానికి ప్రయాసపడే అద్భుతమైన జనులతో సహవాసము కలిగియుంటాము. ఇది మన మతపరమైన కార్యకలాపాలలో ఒంటరిగా లేమని మనకు జ్ఞాపకం చేస్తుంది. మనందరికి ఇతరులతో సహవాసము అవసరము మరియు మనకు, మన భాగస్వాములకు మరియు పిల్లలకు సంఘ సహవాసాలు మనము అనుభవించగల శ్రేష్ఠమైన వాటిలో కొన్ని. ప్రత్యేకంగా పిల్లలు మరియు విశ్వాసులైన తల్లిదండ్రుల మధ్య ఈ సహవాసములు లేకుండా, తల్లిదండ్రులు తమ విశ్వాసములో పిల్లలను పెంచడానికి పెరుగుతున్న కష్టాన్ని పరిశోధన చూపిస్తుంది.10

II.

ఇప్పటివరకు, నేను సాధారణంగా సంఘాలను గూర్చి మాట్లాడాను. పునఃస్థాపించబడిన యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘములో సభ్యత్వము, హాజరు మరియు పాల్గొనుటకు ప్రత్యేక కారణాల గురించి ఇప్పుడు నేను ప్రసంగిస్తాను.

సాల్ట్ లేక్ దేవాలయము

అవును, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అధికారముతో మరియు అధికారముచేత నడిపించబడిన సంఘము యొక్క అవసరతను, ప్రారంభాన్ని ప్రాచీన మరియు ఆధునిక లేఖనాలు స్పష్టంగా బోధిస్తున్నాయని మేము ధృవీకరిస్తున్నాము. పునఃస్థాపించబడిన యేసు క్రీస్తు యొక్క సంఘము ఆయన సంపూర్ణమైన సిద్ధాంతమును బోధించడానికి మరియు దేవుని రాజ్యములో ప్రవేశించడానికి అవసరమైన విధులను నెరవేర్చడానికి ఆయన యాజకత్వముతో కార్యనిర్వహణ చేయడానికి స్థాపించబడిందని కూడా మేము సాక్ష్యమిస్తాము.11 సంఘ హాజరును విడిచిపెట్టి వ్యక్తిగత ఆత్మీయతపై ఆధారపడిన సభ్యులు ఈ సువార్త సూత్రముల నుండి వారిని వారు దూరం చేసుకుంటారు: యాజకత్వము యొక్క శక్తి మరియు దీవెనలు, పునఃస్థాపించబడిన సంపూర్ణ సిద్ధాంతము, ఆ సిద్ధాంతము అన్వయించడానికి ప్రేరేపణలు మరియు అవకాశాలు. వారు నిత్యత్వము కొరకు తమ కుటుంబాన్ని శాశ్వతం చేయడానికి అర్హత పొందే అవకాశాన్ని కోల్పోయారు.

పునఃస్థాపించబడిన సంఘము యొక్క మరొక గొప్ప ప్రయోజనము ఏమిటంటే, అది మనము ఆత్మీయంగా ఎదగడానికి సహాయపడుతుంది. అభివృద్ధి అనగా మార్పు అని అర్థము. ఆత్మీయ పదాలలో దీని అర్థము పశ్చాత్తాపపడుట మరియు ప్రభువుకు దగ్గర కావడానికి కోరుకొనుట. పునఃస్థాపించబడిన సంఘములో సిద్ధాంతము, పద్ధతులు మరియు పశ్చాత్తాపపడుటలో మనకు సహాయపడటానికి ప్రేరేపించబడిన సహాయకులను మనము కలిగియున్నాము. సభ్యత సలహాసభలో కూడా వాటి ఉద్దేశ్యము క్రిమినల్ కోర్టులో ఇచ్చే తీర్పు వలె శిక్ష విధించడం కాదు. యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా సాధ్యము చేయబడిన కనికరముగల క్షమాపణకు మనము అర్హులు కావడానికి సంఘ సభ్యత్వపు సలహాసభలు సహాయపడటానికి ప్రేమతో కోరతాయి.

జంట సువార్తికులు
దేవాలయమువైపు నడుచుచున్నారు

పునఃస్థాపించబడిన సంఘము చేత అందించబడే నిస్వార్థ సేవ కొరకు ప్రేరేపణ మరియు నిర్మాణమును వ్యక్తిగత ఆత్మీయత ఎన్నడూ అందించదు. దీనికి గొప్ప మాదిరి ఏదంటే, యువతీ యువకులు, పెద్దవారు సువార్త పరిచర్య పిలుపులను అంగీకరించడానికి వారు చదువును లేక పదవీ విరమణ కార్యకలాపాలను ప్రక్కన పెడతారు. వారు ఎంచుకోని, పరిచయములేని స్థలాలలో పరాయివారికి సువార్తికులుగా పని చేస్తారు. “దేవాలయ కార్యము” అని మనము పిలిచే నిస్వార్థ సేవలో పాల్గొనే విశ్వాసులైన సభ్యుల విషయములో అదే వర్తిస్తుంది. సంఘము దానికి బాధ్యత వహించి, దానిని నిర్వహించి మరియు దానిని నడిపించకుండా అటువంటి సేవ ఏదీ సాధ్యము కాదు.

మన సభ్యుల మతపరమైన విశ్వాసము మరియు సంఘ సేవ పెద్ద సమాజానికి ప్రయోజనము చేకూర్చడానికి సహకార ప్రయత్నాలలో ఎలా పనిచేయాలో వారికి నేర్పించాయి. మన ప్రస్తుత సమాజంలో తమకు ప్రయోజనం కలిగించే విధంగా వ్యవహరించే ప్రబలమైన ప్రవర్తన ఉన్న వ్యక్తులున్నచోట అటువంటి రకమైన అనుభవము మరియు అభివృద్ధి జరగదు. మన స్థానిక వార్డుల భౌగోళిక సంస్థలో, మరొకవిధంగా మనము ఎన్నుకొనే వ్యక్తులు మనకు బోధించి, మనల్ని పరీక్షించే వ్యక్తులతో మనము సహవాసము కలిగియుంటాము మరియు పనిచేస్తాము.

ప్రేమ, కనికరము, క్షమాపణ, మరియు ఓపిక వంటి ఆత్మీయ లక్షణాలను నేర్చుకోవడానికి మనకు సహాయపడటానికి అదనంగా, అది చాలా భిన్నమైన నేపథ్యములు మరియు ప్రాధాన్యతలుగల వ్యక్తులతో ఎలా పనిచేయాలో నేర్చుకోవడానికి అవకాశాలను మనకిస్తుంది. ఈ ప్రయోజనము మన సభ్యులలో అనేకమందికి సహాయపడినవి మరియు వారు పాల్గొనుట ద్వారా అనేక సంస్థలు దీవించబడినవి. కడవరి దిన పరిశుద్ధులు సమన్వయ ప్రయత్నములందు ఐకమత్యంగా పనిచేసి, నడిపించుటకు వారి సామర్ధ్యము కొరకు ప్రసిద్ధి చెందారు. ఆ సంప్రదాయం మన ధైర్యవంతులైన అగ్రగాములలతో ఉద్భవించింది, వారు పశ్చిమ అమెరికా యొక్క భౌగోళిక ప్రాంతాన్ని వలసరాజ్యం చేసారు మరియు సమాజ శ్రేయస్సు కోసం నిస్వార్థమైన సహకారం అందించిన మన విలువైన సంప్రదాయాన్ని స్థాపించారు.

సహాయ హస్తములు ప్రాజెక్టు

వ్యక్తిగత వనరులను పెద్ద స్థాయిలో సమీకరించడం మరియు నిర్వహించడం ద్వారా అనేక మానవ సంక్షేమ మరియు దాతృత్వపు ప్రయత్నాలు నెరవేర్చబడాలి. పునఃస్థాపించబడిన సంఘము ప్రపంచవ్యాప్తంగా దాని విస్తారమైన మానవ సంక్షేమ ప్రయత్నాలతో దీనిని చేస్తుంది. ఇవి విద్య, వైద్యపరమైన సరఫరాలు, ఆకలిగొన్న వారికి ఆహారమివ్వడం, నిరాశ్రయుల కొరకు శ్రద్ధ తీసుకోవడం, వ్యసనాల ప్రభావాలను తిప్పికొట్టడానికి సహాయపడటం మరియు ఇంకా అనేక మానవ సంక్షేమ ప్రయత్నాలను కలిపియున్నది. ప్రకృతి వైపరీత్యములందు సంఘ సభ్యులు వారి సహాయక హస్తముల ప్రాజెక్టులు కొరకు ప్రసిద్ధి చెందారు. అటువంటి పెద్ద ఎత్తున ప్రయత్నములందు భాగముగా ఉండటానికి సంఘ సభ్యత్వము మనల్ని అనుమతిస్తుంది. సభ్యులు వారి మధ్య ఉన్న పేదలకు సహాయపడటానికి ఉపవాస కానుకలు కూడా చెల్లిస్తారు.

సంస్కారమందు పాలుపంచుకొనుట

ఆత్మ యొక్క సహవాసము ద్వారా శాంతిని మరియు ఆనందమును అనుభవించడానికి బదులుగా, మన సంఘానికి హాజరయ్యే సభ్యులు సువార్తను జీవించే ఫలములను ఆనందిస్తారు, అవి బుద్ధివాక్యమును జీవించుట వల దీవెనలు మరియు దశమభాగము చెల్లించుట వలన భౌతిక, ఆత్మీయ అభివృద్ధి వాగ్దానము చేయబడ్డాము. ప్రేరేపించబడిన నాయకుల నుండి సలహాను పొందే దీవెనను కూడా మనము కలిగియున్నాము.

అన్నిటికంటే శ్రేష్ఠమైనవి, ప్రతి విశ్రాంతిదినము మనము తీసుకొనే సంస్కారముతో కలిపి నిత్యత్వము కొరకు అవసరమైన విధులు. పునఃస్థాపించబడిన సంఘములో అత్యున్నతమైన విధి వివాహము యొక్క శాశ్వతమైన నిబంధన, అది మహిమకరమైన కుటుంబ అనుబంధాలు శాశ్వతంగా వృద్ధి చెందుటను సాధ్యపరచును. అధ్యక్షులు రస్సెల్ ఎం. నెల్సన్ ఈ సూత్రాన్ని చిరస్మరణీయమైన రీతిలో బోధించారు. ఆయన ఇలా అన్నారు: “దేవుని సన్నిదిలోనికి మన మార్గమును కోరుకొనుట వలన వెళ్ళలేము. మనము [ఆ దీవెన] ఆరోపించబడిన చట్టములకు లోబడాలి.” 12

ఆ చట్టములలో ఒకటి, ప్రతి విశ్రాంతిదినమున సంఘములో ఆరాధించుట.13 మన ఆరాధన మరియు నిత్య సూత్రములను అన్వయించుట దేవునికి మనల్ని దగ్గరగా చేసి, ప్రేమించడానికి మన సామర్థ్యాన్ని హెచ్చిస్తుంది. ఈ యుగములో తొలి అపొస్తులులలో ఒకరైన పార్లీ పి. ప్రాట్, ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ఈ సూత్రములను వివరించినప్పుడు అతడు ఎలా భావించాడో వివరించాడు: “వాస్తవానికి దేవుడు నా పరలోక తండ్రి అని, యేసు నా అన్న అని, నేను చట్టపరంగా వివాహము చేసుకొన్న నా భార్య, అమర్త్యత్వము, నిత్య సహవాసి అని భావించాను: ఆమె దయ కలిగి, పరిచర్య చేసే దూత, ఒక ఓదార్పుగా నాకివ్వబడింది మరియు శాశ్వతంగా ఎప్పటికీ మహిమ కిరీటముగా ఉంటుంది. క్లుప్తంగా, ఇప్పుడు నేను ఆత్మతో మరియు అవగాహనతో కూడా ప్రేమించగలను.” 14

ముగించేముందు, ఒక సంఘము ద్వారా మాత్రమే మంచి నెరవేర్చబడగలదని మేము నమ్మమని అందరికీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. సంఘము నుండి స్వతంత్రంగా ఉండి, విస్తారమైన మంచి కార్యములను చేస్తున్న మిలియన్ల జనుల సహకారమును మనము చూస్తున్నాము. వ్యక్తిగతంగా, కడవరి దిన పరిశుద్ధులు వాటిలో అనేకమైన వాటిలో పాల్గొంటున్నారు. మనము ఈ కార్యములను నిత్య సత్యము యొక్క ప్రత్యక్షతగా చూస్తున్నాము, అది లోకములోనికి వచ్చిన ప్రతీ వ్యక్తికి మంచి కార్యములు చేయడానికి ఆత్మ ప్రోత్సహిస్తుంది.”15

సంఘము లేకుండా నెరవేర్చబడగల మంచి కార్యములను లక్ష్యపెట్టకుండా, సంపూర్ణ సిద్ధాంతము, దానిని రక్షించి, ఉన్నత స్థితినిచ్చే విధులు పునఃస్థాపించబడిన సంఘములో మాత్రమే లభ్యమవుతాయి. అదనంగా, సంఘానికి హాజరు కావడం మనకు బలాన్ని, హెచ్చించబడిన విశ్వాసాన్ని ఇస్తుంది, అది ఇతర విశ్వాసులతో అనుబంధము కలిగి, నిబంధన మార్గములో నిలిచియుండి క్రీస్తు యొక్క ఉత్తమమైన శిష్యులుగా ఉండడానికి ప్రయాసపడే వారితో కలిసి ఆరాధించుట నుండి వస్తుంది. దేవుని యొక్క వరములన్నిటిలో మిక్కిలి గొప్పదైన నిత్య జీవమును వెదకినప్పుడు ఈ సంఘ అనుభవాలందు మనమందరం స్థిరంగా ఉంటామని నేను ప్రార్థిస్తున్నాను, యేసు క్రీస్తు నామములో, ఆమేన్.