క్రీస్తును పోలి నడుచుకొనుట
క్రీస్తును పోలి నడుచుకోవడానికి, మన క్రియలను, ప్రవర్తనను మరియు జీవితాలను రక్షకునికి అనుగుణంగా జీవించడానికి ప్రయాసపడుట.
నా వ్యక్తిగత లేఖన అధ్యయనములో, బైబిలులో వివరించబడినట్లుగా పౌలుగా తరువాత పిలవబడిన తర్షీషుకు చెందిన సౌలు యొక్క పరివర్తన చేత నేను ఆకట్టుకోబడ్డాను.
సంఘమును, క్రైస్తవులను హింసించడంలో పౌలు చురుకుగా ఉన్నాడు. పరలోకము యొక్క శక్తి మరియు యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము వలన, అతడు పూర్తిగా మారాడు మరియు దేవుని సేవకులలో ఒకరిగా మారాడు. రక్షకుడైన యేసు క్రీస్తు అతడి జీవితానికి మాదిరిగా ఉన్నారు.
కొరింథీయులకు పౌలు యొక్క బోధనలలో ఒకటి, అతడు క్రీస్తును పోలి నడుచుచున్న ప్రకారము క్రీస్తును పోలి నడుచుకోమని వారిని ఆహ్వానించాడు (1 కొరింథీయులకు 11:1). పౌలు కాలము నుండి నేటి వరకు ఇవ్వబడిన మనఃపూర్వకమైన, విలువైన ఆహ్వానము: క్రీస్తును పోలి నడుచుకొనుట.
క్రీస్తును పోలి నడుచుకొనువారిగా అగుట అనగా అర్థమేమిటని నేను ఆలోచించడం ప్రారంభించాను. మరి ముఖ్యమైనది, “ఏ విధానములో నేను ఆయనను పోలి నడుచుకోవాలి?” అని ప్రశ్నించుకోసాగాను.
క్రీస్తును పోలి నడుచుకోవాలంటే మన క్రియలను, ప్రవర్తనను మరియు జీవితాలను రక్షకునికి అనుగుణంగా జీవించడానికి ప్రయాసపడాలి. సుగుణాలను సంపాదించాలి. యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులుగా ఉండాలి.
నేను రక్షకుని జీవితములో కొన్ని అంశాలను అధ్యయనము చేసాను మరియు నేను అనుకరించడానికి ప్రయత్నించే ఆయన నాలుగు లక్షణాలను నేను ప్రత్యేకించి మీతో పంచుకుంటాను.
రక్షకుని యొక్క మొదటి లక్షణం వినయం. యేసు క్రీస్తు మర్త్యత్వముకు ముందు జీవితం నుండి చాలా వినయంగా ఉన్నారు. పరలోకములో సలహాసభలో, ఆయన మానవాళి రక్షణ ప్రణాళికయందు దేవుని చిత్తము ప్రబలము కావాలని గుర్తించి, అనుమతించారు. ఆయన ఇలా అన్నారు, “తండ్రీ, నీ చిత్తము నెరవేరును గాక మరియు ఆ ఘనత నిరంతరము నీకు చెందును“ (మోషే 4:2).
యేసు క్రీస్తు వినయమును బోధించారని మరియు తన తండ్రిని మహిమపరచుటకు తనను తాను తగ్గించుకున్నారని మనము ఎరుగుదుము.
అది శాంతిని తెస్తుంది గనుక మనము దీనమనస్సుతో జీవిద్దాము (సిద్ధాంతము మరియు నిబంధనలు 19:23 చూడండి). దీనమనస్సు మహిమకు ముందుంటుంది మరియు దేవుని యొక్క అనుగ్రహమును మనపైకి తెస్తుంది: “మీరందరు ఎదుటివారియెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి: దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.” (1 పేతురు 5:5). దీనమనస్సు మృదువైన జవాబులను తెస్తుంది. అది నీతిగల స్వభావము యొక్క ఆధారము.
ఎల్డర్ డేల్ జి. రెన్లండ్ ఇలా బోధించారు:
“దీనమనస్సు కలిగి దేవుని యెదుట ప్రవర్తించు వ్యక్తులు పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు వారి కోసం చేసిన దానిని జ్ఞాపకముంచుకొంటారు.”
“ఆయనతో దీనమనస్సు కలిగి నడుచుకొనుట ద్వారా మనము దేవునితో గౌరవంగా వ్రవర్తిస్తాము” (“Do Justly, Love Mercy, and Walk Humbly with God,” Liahona, Nov. 2020, 111, 109).
రక్షకుని యొక్క రెండవ లక్షణం ధైర్యం. 12 సంవత్సరాలప్పుడు ధర్మశాస్త్రోపదేశకుల మధ్య దేవాలయములో కూర్చోని మరియు వారికి దైవిక విషయాలను బోధిస్తున్న యేసు క్రీస్తు గురించి నేను ఆలోచించినప్పుడు, ఆయన జీవితములో చాలా చిన్న వయస్సులో మంచి ధైర్యమును, ఒక ప్రత్యేకమైన ధైర్యమును కలిగియున్నారని నేను గమనించాను. ఆ చిన్న బాలుడు ధర్మశాస్త్రోపదేశకుల చేత బోధించబడాలని అనేకమంది చూస్తుండగా, “వారు ఆయనను వింటూ, ఆయనను ప్రశ్నలు అడిగినప్పుడు” ఆయన వారికి బోధిస్తున్నాడు (జోసెప్ స్మిత్ అనువాదము, లూకా 2:46, [in Luke 2:46, footnote c).
2016 నుండి 2019 వరకు మేము కాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ బుజి-మయి మిషనులో పూర్తికాల సువార్తసేవ చేసాము. మిషనులో ఒక మండలము నుండి మరొక దానికి ప్రయాణించడానికి ఒక రోడ్డు మార్గము ఉండెను. ఆ ప్రాంతంలో ఒక దృగ్విషయం తలెత్తింది, పదునైన ఆయుధాలతో ఆయుధాలు ధరించిన బందిపోట్లు రోడ్డుపైకి చొరబడి ప్రయాణికుల కదలికలకు భంగం కలిగిస్తున్నారు.
వేరొక ప్రాంతానికి బదిలీలో భాగంగా ఒక మండలము నుండి మరొక దానికి ప్రయాణిస్తున్న ఐదుగురు సువార్తికులు ఈ అల్లర్లకు బాధితులు. ముందు కొన్నిసార్లు, ఈ దృగ్విషయానికి మేము బాధితులమైనందు వలన మా అందరి ప్రాణము మరియు భద్రత కొరకు భయపడసాగాము, ఈ రోడ్లపై ప్రయాణించి సువార్తికులను సందర్శించడానికి మరియు మండల సమావేశాలను జరపడానికి ప్రయాణించడానికి కూడా సందేహించాము. అది ఎంతకాలము కొనసాగుతుందో మాకు తెలియదు. నేను ఒక నివేదిక రూపోందించాను, దానిని ప్రాంతీయ అధ్యక్షత్వానికి పంపాను మరియు మా సువార్తికులను చేరుకోవడానికి రహదారి ఒక్కటే మార్గము అయినప్పుడు ప్రయాణించడం కొనసాగించడం గురించి భయాన్ని వ్యక్తం చేసాను.
ఆఫ్రికా దక్షిణ తూర్పు ప్రాంతము యొక్క మా అధ్యక్షుడైన ఎల్డర్ కెవిన్ హమిల్టన్, తన జవాబులో నాకు ఇలా వ్రాసారు: “నా సలహా ఏమిటంటే, మీకు సాధ్యమైనది చెయ్యిండి. తెలివిగా, ప్రార్థనాపూర్వకంగా ఉండండి. తెలిసి మిమ్మల్ని లేక మీ సువార్తికులకు హాని కలిగించే స్థితిలో ఉంచుకొనవద్దు, కానీ అదే సమయంలో విశ్వాసమందు ముందుకు సాగండి. ‘ఏలయనగా దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహముగల ఆత్మనే యిచ్చెను; గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు’ (2 తిమోతి 1:7).”
ఈ ప్రేరేపణ మమ్మల్ని బాగా బలపరిచింది మరియు మా సువార్త పరిచర్య ముగిసే వరకు ధైర్యంగా ప్రయాణం చేయడానికి మరియు సేవ చేయడాన్ని కొనసాగించడానికి మాకు అనుమతించింది, ఎందుకంటే ఆ లేఖనం ద్వారా మన పరలోకమందున్న తండ్రి నుండి నడిపింపును మేము విన్నాము.
ఆధునిక లేఖనములో, ప్రభువు యొక్క ప్రోత్సాహము గురించి ఆలోచించిన ప్రవక్త జోసెఫ్ స్మిత్ ఈ గొప్ప హేతువుయందు ముందుకు సాగవద్దా? అని మనల్ని ప్రేరేపించిన మాటలను చదువుతాము. వెనుకకు మరలక ముందుకు సాగుడి. ధైర్యము తెచ్చుకొనుడి, సహోదరులారా;… జయము పొందుటకు, ముందుకు సాగుడి!” (సిద్ధాంతము మరియు నిబంధనలు 128:22).
సరైనది చేయడానికి మనము ధైర్యము కలిగియుందాము, అది జనాదారణ పొందనప్పటికీ—మన విశ్వాసమును కాపాడటానికి మరియు విశ్వాసము ద్వారా వ్యవహరించడానికి ధైర్యము కలిగి ఉండండి. ప్రతిరోజు పశ్చాత్తాపపడడానికి ధైర్యమును, దేవుని చిత్తమును అంగీకరించడానికి మరియు ఆయన ఆజ్ఞలకు విధేయులు కావడానికి ధైర్యాన్ని కలిగియుందాము. నీతిగా జీవించడానికి మరియు మన వేర్వేరు బాధ్యతలు మరియు స్థానములందు మన నుండి ఆశించిన దానిని చేయడానికి ధైర్యము కలిగియుందాము.
రక్షకుని యొక్క మూడవ లక్షణం క్షమాపణ. ఆయన మర్త్య పరిచర్యయందు, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్ళతో కొట్టబడకుండా రక్షకుడు ఆపారు. “నీవు వెళ్లి ఇక పాపము చేయకుము” (యోహాను 8:11) ఆయన ఆమెకు ఆజ్ఞాపించారు. ఇది ఆమెను పశ్చాత్తాపము వైపు, చివరకు క్షమాపణవైపు కదిలించింది, లేఖనాలలో వ్రాయబడినట్లుగా, “ఆ గడియ నుండి ఆ స్త్రీ దేవునిని మహిమపరచింది మరియు ఆయన నామముపై విశ్వసించింది” (జోసెఫ్ స్మిత్ అనువాదము యోహాను 8:11, [in యోహాను 8:11, footnote c).
2018 డిసెంబరులో క్రిస్మస్ భక్తి సమావేశమందు, రక్షకుని నుండి మనము పొందిన నాలుగు వరములు గురించి మన ప్రియమైన అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మాట్లాడారు. రక్షకుడు మనకిచ్చే వరములో ఒకటి క్షమించగల సామర్థ్యమని ఆయన అన్నారు:
“ఆయన ప్రాయశ్చిత్త త్యాగము ద్వారా, మిమ్మల్ని గాయపరచిన వారిని మరియు మీపట్ల వారి క్రూరత్వము కోసం ఎన్నడూ బాధ్యతను అంగీకరించని వారిని మీరు క్షమించగలరు.
“సాధారణంగా నిజాయితీగా, దీనమనస్సుతో మీ క్షమాపణ కోరే ఒకరిని క్షమించడం సులభమైనది. కానీ ఏ విధంగానైనా మిమ్మల్ని తప్పుగా చూసిన వారెవరినైనా క్షమించడానికి సామర్థ్యాన్ని రక్షకుడు మీకు దయచేస్తాడు” (“Four Gifts That Jesus Christ Offers to You” [First Presidency Christmas devotional, Dec. 2, 2018], broadcasts.ChurchofJesusChrist.org).Fourth, sacrifice.
తండ్రి యొక్క క్షమాపణను పొందడానికి మనము ఒకరినొకరం క్షమించుకోవాలి. క్షమాపణ మనల్ని స్వతంత్రులనుగా చేస్తుంది మరియు ప్రతీ ఆదివారము సంస్కారములో పాల్గొనడానికి మనల్ని యోగ్యులుగా చేస్తుంది. యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులుగా ఉండటానికి మనలో క్షమాపణ అవసరము.
రక్షకుని యొక్క నాల్గవ లక్షణం త్యాగం. అది యేసు క్రీస్తు యొక్క సువార్తలో భాగము. మనము విమోచించబడుటకు మన కోసం రక్షకుడు తన ప్రాణమును అత్యున్నతమైన త్యాగముగా ఇచ్చారు. త్యాగము యొక్క బాధను అనుభవిస్తూ, ఆయన గిన్నెను తొలగించమని తన తండ్రిని అడిగారు, కానీ ఆయన నిత్య త్యాగము నెరవేర్చడానికి ఆయన చేయవలసిన సమస్తమును చేసారు. ఇది యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త త్యాగము.
అధ్యక్షులు ఎమ్. రస్సెల్ బాల్లార్డ్ దీనిని బోధించారు: “త్యాగము శుద్ధమైన ప్రేమ యొక్క నిదర్శనము. ప్రభువు కోసం, సువార్త కోసం, మన పొరుగువారి కోసం మన ప్రేమ స్థాయిని వారి కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నదాని ద్వారా కొలవవచ్చు” (“The Blessings of Sacrifice,” Ensign, May 1992, 76).
మనము పరిచర్య చేయడానికి, ఇతరులకు సేవ చేయడానికి, మేలు చేయడానికి, కుటుంబ చరిత్ర కార్యము చేయడానికి, మన సంఘ పిలుపును నెరవేర్చడానికి మన సమయాన్ని త్యాగము చేయగలము.
భూమి మీద దేవుని రాజ్యమును నిర్మించడానికి దశమభాగము, ఉపవాస అర్పణలు మరియు ఇతర విరాళాలు చెల్లించుట ద్వారా మన ఆర్థిక వనరులను మనము ఇవ్వగలము. రక్షకునితో మనము చేసిన నిబంధనలు పాటించడానికి మనము త్యాగము చేయాలి.
యేసు క్రీస్తును అనుసరించి, ఆయన ప్రాయశ్చిత్త దీవెనలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మనము మరి ఎక్కువ దీనమన్సు గల వారిగా కావాలని, మనము ఎక్కువ ధైర్యము కలిగియుండాలని మనము మరి ఎక్కువ క్షమించేవారిగా ఉండాలని మరియు ఆయన రాజ్యము కోసం మనము ఎక్కువ త్యాగము చేయాలని నేను ప్రార్థిస్తున్నాను.
మన పరలోక తండ్రి జీవిస్తున్నారని, ఆయన మనలో ప్రతిఒక్కరిని ఎరుగునని, యేసే క్రీస్తని, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ నేడు దేవుని యొక్క ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు యొక్క కడవరి పరిశుద్ధుల సంఘము భూమి మీద దేవుని రాజ్యమని మరియు మోర్మన్ గ్రంథము సత్యమని నేను సాక్ష్యమిస్తున్నాను. మన విమోచకుడైన యేసు క్రీస్తు నామములో, ఆమేన్.