సర్వసభ్య సమావేశము
న్యాయముగా నడుచుకొనుము, కనికరమును ప్రేమించుము, దీనమనస్సు కలిగి దేవుని యెదుట ప్రవర్తించుము
అక్టోబరు 2020 సర్వసభ్య సమావేశము


13:27

న్యాయముగా నడుచుకొనుము, కనికరమును ప్రేమించుము, దీనమనస్సు కలిగి దేవుని యెదుట ప్రవర్తించుము

న్యాయముగా నడుచుకొనుట అనగా గౌరవంగా ప్రవర్తించుట. దీనమనస్సు కలిగి దేవుని యెదుట ప్రవర్తించుట ద్వారా మనము ఆయనతో గౌరవంగా ప్రవర్తిస్తాము. కనికరమును ప్రేమించుట ద్వారా మనము ఇతరులతో గౌరవంగా ప్రవర్తిస్తాము.

యేసు క్రీస్తు యొక్క అనుచరులుగా, మరియు కడవరి దిన పరిశుద్ధులుగా, మనము శ్రమిస్తాము—ఉత్తమంగా చేయడానికి, ఉత్తమంగా ఉండటానికి—శ్రమించుటకు ప్రోత్సహించబడ్డాము.1 బహుశా మీరు నాలాగా ఆశ్చర్యపడియుండవచ్చు, “నేను తగినంతగా చేస్తున్నానా?” “నేను ఇంకా ఏమి చేస్తుండాలి?” లేక “లోపభూయిష్టమైన వ్యక్తిగా నేను, ‘దేవునితో ఎన్నడును అంతముకాని సంతోషము యొక్క స్థితిలో నివసించడానికి’ ఎలా అర్హత పొందగలను?”2

పాత నిబంధన ప్రవక్త మీకా ఈవిధంగా ప్రశ్నను అడిగాడు: “ఏమి తీసికొని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసికొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును?”3 పాపానికి పరిహారం ఇవ్వడానికి అతిశయమైన నైవేద్యాలు కూడా సరిపోతాయా అని మీకా వ్యంగ్యంగా ఆశ్చర్యపడుతూ చెప్పాడు, “వేలకొలది పొట్టేళ్లును [వేలాది] పదులంత … విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా? నా ఆత్మ యొక్క అతిక్రమమునకై … నా జేష్టపుత్రుని నేనిత్తునా?”4

దానికి జవాబు లేదు. మంచి క్రియలు సరిపోవు. రక్షణ సంపాదించబడదు.5 మీకాకు తెలిసిన విస్తారమైన బలులు అతి చిన్న పాపమును కూడ విమోచింపలేవు. మన స్వంత సామర్ధ్యములపై ఆధారపడితే, దేవుని సన్నిధికి తిరిగి వెళ్లి జీవించే అవకాశము నిరాశజనకంగా ఉంటుంది.6

పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు నుండి వచ్చే దీవెనలు లేకుండా, మనము తగినంతగా చేయలేము లేక మనకై మనం తగినంత మంచిగా ఉండలేము. అయినప్పటికినీ, మంచి వార్త ఏమనగా యేసు క్రీస్తు వలన, ద్వారా మనము తగినంత మంచిగా కాగలము.7 సమస్త జనులు దేవుని కృప ద్వారా యేసు క్రీస్తు యొక్క పునరుత్థానము మరియు మరణము ద్వారా భౌతిక మరణము నుండి రక్షించబడతారు.8 దేవునికి మన హృదయాలను త్రిప్పిన యెడల, ఆత్మీయ మరణము నుండి రక్షణ “[యేసు] క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా … సువార్త యొక్క చట్టములు మరియు విధులకు విధేయత ద్వారా”9 అందరికీ లభ్యమవుతుంది. దేవుని యెదుట శుద్ధిగా, స్వచ్ఛముగా నిలబడుటకు మనము పాపము నుండి విమోచింపబడగలము. మీకా వివరించినట్లుగా, “మనుష్యుడా, యేది ఉత్తమమో, అది [దేవుడు] నీకు తెలియజేసాడు, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు?”10

దేవునివైపు మన హృదయాలను త్రిప్పుట, రక్షణకు అర్హత పొందడంపై మీకా యొక్క నడిపింపు మూడు పరస్పర అనుసంధాన అంశాలను కలిగియున్నది. న్యాయముగా నడుచుకొనుట అనగా దేవునితో మరియు ఇతరులతో గౌరవంగా ప్రవర్తించుట. దీనమనస్సు కలిగి దేవుని యెదుట ప్రవర్తించుట ద్వారా మనము ఆయనతో గౌరవంగా ప్రవర్తిస్తాము. కనికరమును ప్రేమించుట ద్వారా మనము ఇతరులతో గౌరవంగా ప్రవర్తిస్తాము. న్యాయముగా నడుచుకొనుటకు మొదటి మరియు రెండవ గొప్ప ఆజ్ఞల యొక్క ఆచరించదగిన అన్వయము, “నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననుదియే … [మరియు] నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను.”11

న్యాయముగా నడుచుకొనుటకు, దేవునితో వినయముగా నడుచుకొనుట అనగా అన్యాయము చేయకుండా, ఆయన కట్టడలను గైకొనుట, మరియు యధార్ధముగా విశ్వాసపాత్రంగా నిలిచియుండుట.12 న్యాయవంతుడైన ఒక వ్యక్తి పాపమునుండి మరలిపోయి, దేవుని వైపు తిరిగి, ఆయనతో నిబంధనలు చేస్తాడు, మరియు ఆ నిబంధనలను పాటిస్తాడు. న్యాయవంతుడైన ఒక వ్యక్తి దేవుని యొక్క ఆజ్ఞలను విధేయుడగుటకు ఎంచుకొని, పాపము చేసినప్పుడు పశ్చాత్తపడి, మరియు ప్రయత్నించుటను కొనసాగిస్తాడు.

పునరుత్ధానము చెందిన క్రీస్తు నీఫైయులను దర్శించినప్పుడు, మోషే ధర్మశాస్త్రము ఉన్నతమైన చట్టము చేత ఉంచబడిందని ఆయన వివరించాడు. ఆయన వారికి సూచించాడు, “మీరు ఇక ఏమాత్రము … బలులు మరియు … మీ దహన బలి అర్పణములు, అర్పించవద్దు” కానీ “ఒక విరిగిన హృదయము మరియు నలిగిన ఆత్మను … అర్పించుము.” “మరియు ఎవడు నా యొద్దకు ఒక విరిగిన హృదయము మరియు ఒక నలిగిన ఆత్మతో వచ్చునో అతనికి నేను అగ్ని మరియు పరిశుద్ధాత్మతో బాప్తీస్మమిచ్చెదను”13 అని కూడ ఆయన వాగ్దానమిచ్చాడు. బాప్తీస్మము తరువాత పరిశుద్ధాత్మ యొక్క వరమును మనము పొంది, ఉపయోగించినప్పుడు, మనము పరిశుద్ధాత్మ యొక్క స్థిరమైన సహవాసమును అనుభవించగలము మరియు దీనమనస్సు కలిగి దేవుని యెదుట ఎలా ప్రవర్తించాలో కలిపి మనము చేయవలసిన కార్యములు అన్నీ బోధించబడతాము.14

పాపము మరియు ఆత్మీయ మరణము నుండి రక్షణ కొరకు యేసు క్రీస్తు యొక్క త్యాగము అటువంటి విరిగిన హృదయము మరియు ఒక నలిగిన ఆత్మగల వారందరికి లభ్యమవుతుంది.15 ఒక విరిగిన హృదయము మరియు ఒక నలిగిన ఆత్మ సంతోషంగా పశ్చాత్తాపపడటానికి, మన పరలోక తండ్రి మరియు యేసుక్రీస్తులాగా ఎక్కువగా మారటానికి ప్రయత్నించడానికి మనల్ని ప్రేరేపిస్తాయి. మనము ఆవిధంగా చేసినప్పుడు, మనం రక్షకుని యొక్క శుద్ధిచేయు, స్వస్థపరచు, మరియు బలపరచే శక్తిని పొందుతాము. మనము దీనమనస్సు కలిగి దేవుని యెదుట ప్రవర్తించుట మాత్రమే కాదు; పరలోక తండ్రి మరియు యేసుక్రీస్తు చేసిన విధంగా కనికరమును ప్రేమించుట కూడ మనము నేర్చుకుంటాము.

దేవుడు కనికరమందు ఆనందిస్తాడు మరియు దాని ఉపయోగమును అసంతృప్తి చెందడు. యెహోవాకు మీకా మాటలలో, “వారు చేసిన అతిక్రమము విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతోసముడైన దేవుడున్నాడా, … మనయందు జాలిపడును,” మరియు “పాపములన్నిటిని … సముద్రపు ఆగాధములో పడవేయును.”16 దేవుడు చేసినట్లుగా కనికరమును ప్రేమించుటకు ఇతరులతో న్యాయము ప్రవర్తించుట మరియు వారిని చెడుగా చూడకుండుట విడదీయరాని విధంగా కలపబడియున్నది.

క్రీస్తుకు ముందు మొదటి శతాబ్దంలో నివసించిన యూదుల పండితుడు హిల్లెల్ ది ఎల్డర్ గురించి ఒక కధనంలో ఇతరులతో చెడుగా వ్యవహరించకుండుట యొక్క ప్రాముఖ్యత నొక్కి చెప్పబడింది. హిల్లెల్ యొక్క విద్యార్ధులలో ఒకరు మోషే యొక్క ఐదు గ్రంధాలు, వాటి 613 ఆజ్ఞలు మరియు అనుబంధ రబ్బీల చేత వ్రాయబడిన వ్యాఖ్యానాలు—తోరా యొక్క సంక్లిష్టత వలన విసుగుచెందాడు. అతడు ఒక పాదంపై నిలబడగల సమయమును ఉపయోగిస్తూ మాత్రమే తన వివరణను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఆ విద్యార్ధి హిల్లెల్‌ను సవాలు చేసాడు. హిల్లెల్ గొప్ప సమతుల్యము కలిగిలేకపోవచ్చు కానీ సవాలును అంగీకరించాడు. “కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజలమీద కోపముంచుకొనక నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను”17 అని చెప్తూ, అతడు లేవియకాండము నుండి వ్యాఖ్యానించాడు. తరువాత హిల్లెల్ ముగించాడు: “నీకు అసహ్యకరమైన దానిని, నీ పొరుగువారికి చేయరాదు. ఇది తోరాలోని అత్యంత ముఖ్యమైన సందేశము; మిగిలినది వ్యాఖ్యానము. ముందుకు వెళ్లి అధ్యయనం చేయుము.”18

ఎల్లప్పుడు ఇతరులతో గౌరవంగా వ్యవహరించడం కనికరమును ప్రేమించుటలో భాగము. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో, మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌లో జాన్స్ హాప్కిన్స్ హాస్పిటల్ యొక్క అత్యవసర విభాగంలో దశాబ్దాల క్రితం నేను విన్న సంభాషణను పరిశీలించండి. మిస్టర్ జాక్సన్ అనే రోగి మర్యాదపూర్వకమైన, ఆహ్లాదకరమైన వ్యక్తి, అతను ఆసుపత్రి సిబ్బందికి బాగా తెలుసు. అతడు గతంలో మద్యపాన సంబంధిత వ్యాధుల చికిత్స కోసం అనేకసార్లు ఆసుపత్రి పాలయ్యాడు. ఈ సందర్భంగా, మిస్టర్ జాక్సన్ ఆల్కహాల్ త్రాగటం వలన కలిగిన క్లోమ గ్రంధి యొక్క నొప్పిగా గుర్తించబడే లక్షణాల కోసం ఆసుపత్రికి తిరిగి వచ్చాడు.

తన షిఫ్ట్ ముగిసే సమయానికి, డాక్టర్ కోహెన్, కష్టపడి పనిచేసి, మెచ్చుకోదగిన వైద్యుడు, మిస్టర్ జాక్సన్‌ను అంచనా వేసి, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉందని నిర్ధారించాడు. డాక్టర్. కోహెన్ మిస్టర్ జాక్సన్‌ను హాస్పిటలులో చేర్చడానికి మరియు అతని చికిత్సను పర్యవేక్షించడానికి ఆ షిఫ్టులో ఉన్న వైద్యురాలైన డాక్టర్ జోన్స్‌ను నియమించాడు.

డాక్టర్ జోన్స్ ఒక ప్రతిష్టాత్మక వైద్య పాఠశాలలో చదివింది మరియు ఆమె పోస్ట్-గ్రాడ్యుయేట్ చదువును అప్పుడే ప్రారంభించింది. ఈ తీవ్రంగా అలసిపోయే శిక్షణతో సంబంధించిన నిద్ర లేమి, అది డా. జోన్స్ యొక్క ప్రతికూల స్పందనకు బహుశా తోడ్పడియుండవచ్చు. రాత్రి ఆమె ఐదుగురిని చేర్చడంతో, డాక్టర్ కోహెన్‌తో ఆమె గట్టిగా ఫిర్యాదు చేసింది. అతడి కష్టమైన సమస్య అన్నిటికంటె అతడి స్వంత పొరపాటువలన కలిగినది కనుక, మిస్టర్ జాక్సన్‌ను చూసుకోవటానికి తాను అనేక గంటలు గడపవలసి రావడం అన్యాయమని ఆమె భావించింది.

డాక్టర్ కోహెన్ యొక్క దృఢమైన ప్రతిస్పందన దాదాపు గుసగుసలో మాట్లాడబడింది. “డా. జోన్స్, నీవు ప్రజలకు సంరక్షించడానికి మరియు వారిని నయం చేయడానికి వైద్యురాలివి అయ్యావు. వారిని విమర్శించడానికి నీవు వైద్యురాలివి కాలేదు. తేడాను నీవు అర్థము చేసుకొనకపోతే, ఈ సంస్థలో శిక్షణ పొందే హక్కు నీకు లేదు.” ఈ దిద్దుబాటు తరువాత, హాస్పిటల్‌లో ఉన్నప్పుడు మిస్టర్ జాక్సన్‌ను డాక్టర్ జోన్స్ శ్రద్ధగా చూసుకున్నది.

ఈ కధనం జరిగిన తరువాత మి. జాక్సన్ చనిపోయాడు. డాక్టర్ జోన్స్ మరియు డాక్టర్ కోహెన్ ఇద్దరూ అనూహ్యంగా మంచి వృత్తిని కలిగి ఉన్నారు. కానీ ఆమె శిక్షణలో ఒక క్లిష్టమైన సమయంలో, డాక్టర్ జోన్స్ న్యాయంగా ప్రవర్తించమని, కనికరమును ప్రేమించాలని మరియు మిస్టర్ జాక్సన్‌ను విమర్శించకుండా చూసుకోవాలని జ్ఞాపకం చేయబడవలసిన అవసరం ఉన్నది.19

సంవత్సరాలుగా, ఆ జ్ఞాపిక నుండి నేను ప్రయోజనం పొందాను. కనికరమును ప్రేమించుట అనగా అర్థము, దేవుడు మనకు పొడిగించిన కనికరమును ప్రేమించుట మాత్రమే కాదు; ఇతరులకు దేవుడు పొడిగించిన అదే కనికరమును మనము ఆనందిస్తాము. మరియు మనము ఆయన మాదిరిని అనుసరిస్తాము. “అందరూ దేవునికి ఒకే రీతిగా ఉన్నారు,”20 మరియు మనందరికి సహాయము మరియు స్వస్థపరచబడుటకు ఆత్మీయ చికిత్స అవసరము. “మీరు ఒక మనుష్యుని మరియొకని కంటే హెచ్చుగా యెంచరాదు లేక ఒక మనుష్యుడు తనను తాను మరియొకని కంటే ఎక్కువగా తలంచరాదు.”21

న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట అనగా అర్థమేమిటో యేసు క్రీస్తు మాదిరిగా ఉన్నాడు. ఆయన పాపులను గౌరవంగా మరియు మర్యాదగా చూస్తూ స్వేచ్ఛగా సంబంధం కలిగి ఉన్నాడు. దేవుని ఆజ్ఞలను పాటించుట వలన ఆనందమును బోధించాడు మరియు ప్రయాసపడు వారిని నిందించుటకు బదులుగా పైకెత్తాలని కోరాడు. వారు అనర్హులుగా భావించిన జనులకు పరిచర్య చేసినందుకు ఆయనను విమర్శించిన వారిని ఆయన తప్పని ఖండించాడు.22 అటువంటి స్వనీతి ఆయనకు కోపం కలిగించింది మరియు ఇప్పటికి కలిగిస్తుంది.23

క్రీస్తు వలె ఉండటానికి, ఒక వ్యక్తి దేవునితో మరియు ఇతరులతో గౌరవంగా ప్రవర్తిస్తూ, న్యాయముగా నడుచుకుంటాడు. న్యాయమైన వ్యక్తి మాటలు మరియు క్రియలో నాగరికత కలిగి ఉంటాడు, దృక్పథం లేదా నమ్మకంలో తేడాలు నిజమైన దయ మరియు స్నేహాన్ని దూరంగా ఉంచదని గుర్తిస్తాడు. న్యాయముగా నడుచుకొనే వ్యక్తులు “ఒకరినొకరు గాయపరచుకొనుటకు కాక, ఒకరినొకరితో సమాధానముతో నివసించుటకు మనస్సు కలిగియుంటారు.”24

క్రీస్తు వలె ఉండటానికి, ఒక వ్యక్తి కనికరమును ప్రేమించును. కనికరమును ప్రేమించే వ్యక్తులు విమర్శించరు; వారు ఇతరులపై, ముఖ్యంగా తక్కువ అదృష్టం ఉన్నవారికి కనికరమును చూపిస్తారు; వారు కృపగల వారు, దయగల వారు మరియు గౌరవప్రదమైనవారు. ఈ వ్యక్తులు జాతి, లింగం, మతపరమైన అనుబంధం, లైంగిక ధోరణి, సామాజిక ఆర్థిక స్థితి మరియు గిరిజన, వంశం లేదా జాతీయ భేదాలు వంటి లక్షణాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ ప్రేమతో మరియు అవగాహనతో చూస్తారు. క్రీస్తువంటి ప్రేమ ముందుగా చెప్పబడిన విభిన్న లక్షణాల కంటే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంది.

క్రీస్తు వలె ఉండటానికి, ఒక వ్యక్తి దేవునిని ఎన్నుకుంటాడు,25 ఆయనతో దీనమనస్సు కలిగి ప్రవర్తిస్తాడు, ఆయనను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తాడు మరియు ఆయనతో నిబంధనలను కాపాడుకుంటాడు. దీనమనస్సు కలిగి దేవుని యెదుట ప్రవర్తించు వ్యక్తులు పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు వారి కోసం చేసిన దానిని జ్ఞాపకముంచుకొంటారు.

నేను తగినంతగా చేస్తున్నానా? నేను ఇంకా ఏమి చేయాల్సియున్నది? ఈ ప్రశ్నలకు ప్రతిస్పందనగా మనం తీసుకునే చర్య ఈ జీవితంలో మరియు నిత్యత్వములో మన ఆనందానికి ప్రధానమైనది. రక్షణ యొక్క ప్రాముఖ్యతను ఆలోచించకుండా ఉండమని రక్షకుడు మనల్ని కోరటంలేదు. మనము పరిశుద్ధమైన నిబంధనలు చేసిన తరువాత కూడా, మనం “కృప నుండి పతనమై, జీవముగల దేవుని నుండి వెళ్ళిపోయే”అవకాశం ఉంది. కనుక మనము “శోధనలోనికి” పడిపోకుండా తప్పించుకొనుటకు, “జాగ్రత్తగా ఉండి, ఎల్లప్పుడు ప్రార్ధన చేయవలెను.”26

అదే సమయంలో, మన పరలోకపు తండ్రి మరియు యేసుక్రీస్తు మన మర్త్య ప్రయాణంలో రక్షింపబడటానికి మరియు పైకెత్తబడటానికి మనం తగినంతగా చేశామా అని ఆశ్చర్యపోతూ నిరంతర అనిశ్చియత చేత మనం స్తంభించిపోవాలని కోరుకొనరు. ఎన్నడూ స్వస్థపడని గాయములుగా,27 వాటిని గూర్చి ఆలోచిస్తూ మనం పశ్చాత్తాపపడిన తప్పుల చేత హింసించబడాలని లేదా మనం మళ్లీ పొరపాట్లు చేస్తామని మితిమీరిన భయంతో ఉండాలని వారు ఖచ్చితంగా కోరుకొనరు.

మన స్వంత అభివృద్ధిని మనము లెక్కించగలము. మనము న్యాయముగా నడుచుకొని, కనికరమును ప్రేమించి, దీనమనస్సు కలిగి మన దేవుని యెదుట ప్రవర్తించినప్పుడు, “[మనము] అనుసరిస్తున్న జీవిత గమనము, దేవుని చిత్రప్రకారమైనదని”28 మనము తెలుసుకోగలము. పరలోక తండ్రి మరియు యేసుక్రీస్తు యొక్క లక్షణాలను మన స్వభావములోనికి ఏకీకృతం చేస్తాము, మరియు మనము ఒకరినొకరం ప్రేమించుకుంటాము.

మీరు ఈ విషయాలను చేసినప్పుడు, మీరు నిబంధన బాటను అనుసరిస్తారు మరియు “దేవునితో ఎన్నడును అంతముకాని సంతోషము యొక్క స్థితిలో నివసించెదరు.”29 మీ ఆత్మలు దేవుని యొక్క మహిమతో మరియు నిత్యజీవము యొక్క వెలుగుతో నిండియుంటాయి.30 మీరు గ్రహింపశక్యముకాని ఆనందముతో నింపబడతారు,31 దేవుడు జీవిస్తున్నాడని, యేసే క్రీస్తని, మన రక్షకుడు మరియు మన విమోచకుడని, మనందరికి ఆయన ప్రేమగా, సంతోషంగా కనికరమును అందిస్తున్నారని నేను సాక్ష్యమిస్తున్నాను. మీరు దానిని ప్రేమించటం లేదా? యేసు క్రీస్తు నామములో, ఆమేన్.