సర్వసభ్య సమావేశము
ఆయన వలే అగుట
అక్టోబరు 2020 సర్వసభ్య సమావేశము


10:21

ఆయన వలే అగుట

ఆయన రక్షకుని దైవిక సహాయముతో మాత్రమే మనమందరం ఆయనవలే మారుటకు వృద్ధి చెందెదము.

యేసు క్రీస్తు యొక్క జీవితము, పరిచర్యను సమగ్రంగా అధ్యయనం చేసిన వారికి కూడా, “నా వలే ఉండుడి” 1 అనే రక్షకుని యొక్క బోధ, కష్టమైనదిగా, సాధించలేనిదిగా అనిపిస్తుంది. బహుశా మీరు నావలే—మీ లోపాలు, వైఫల్యాల గురించి బాగా ఎరిగియున్నారు, కాబట్టి పెరుగుదల లేదా సౌకర్యం అవసరంలేని చదునైన మార్గంలో నడవడానికి మీకు మానసికంగా మరింత సౌకర్యంగా కనబడవచ్చు. తక్కువ నిరోధకత ఉన్న మార్గాన్ని మనం సౌకర్యంగా ఎంచుకొన్నప్పుడు, తద్వారా కావలసిన మార్పుకు చేయవలసిన అభ్యాసము చేయకపోయినప్పుడు “బహుశా, నిశ్చయముగా ఈ బోధన అవాస్తవమైనది, అతిశయోక్తమైనది” అని మనము సమర్ధించుకుంటాము.

అయితే మన మర్త్యత్వస్థితిలో కూడా “[ఆయన] వలే ఉండుట” అలంకారికమైనది కాకపోతే? ఒకవేళ అది, ఈ జీవితంలో కొంతవరకు సాధించగలిగేది, వాస్తవానికి మరలా ఆయనతో కలిసి ఉండటానికి ముందుగా కావాల్సినదైతే? “నా వలే ఉండుడి” అన్నది ఖచ్చితంగా, ఖండితమైన రక్షకుని ఉద్దేశ్యమైతే? అప్పుడు ఏమిటి? మన సహజమైన కోరికలను మనము మార్చుకోగలుగునట్లు మన జీవితాలలోనికి ఆయన అద్భుత శక్తిని ఆహ్వానించడానికి మనం ఏ స్థాయి ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉంటాము?

ఎల్డర్ నీల్ ఎ. మాక్స్వెల్ బోధించారు: “ఆయనవలే మారాలని యేసు చేత ఆజ్ఞాపించబడిన దానిని మనము ధ్యానించినప్పుడు, మనమున్న ప్రస్తుత పరిస్థితిలో మనం అవశ్యముగా దుర్మార్గులం కామని, కానీ బదులుగా, మనం పూర్తి నిజాయితీ కలిగియుండక, మన హేతువు కూడా అయిన ఆయన హేతువు కొరకు ఉత్సాహము కలిగిలేమని గ్రహిస్తాము! మనము స్తుతిస్తాము కానీ ఆయనను అరుదుగా అనుకరిస్తాము.” 2 ఒక యువ బోధకుడైన చార్లెస్ ఎమ్. షెల్డన్, అదేవిధమైన ఆలోచనలను ఈవిధంగా వ్యక్తపరిచాడు:” మన క్రైస్తత్వము దాని యొక్క తేలికైన, సౌకర్యమైన విషయాలను ఇష్టపడుట వలన, ఏదైనా సిలువ వంటి కఠినమైన, భారమైన వాటిని మోయుటకు కోరుకోము.” 3

వాస్తవానికి, తండ్రి వలే యేసు క్రీస్తు అయినట్లుగా, ఆయన వలే మారాలనే ఆజ్ఞ ప్రతీ ఒక్కరికి అన్వయిస్తుంది. 4 మనము అభివృద్ధి చెందుతున్నప్పుడు, మనము మరింత సంపూర్ణమైన, పరిపూర్ణమైన, పూర్తిగా అభివృద్ధి చెందిన వారమవుతాము. 5 ఈ బోధన ఏ సంఘ సిద్ధాంతములపై ఆధారపడిలేదు కానీ బోధకుని నుండే నేరుగా వచ్చుచున్నది. ఈ నిర్ధిష్ట కోణం ప్రకారం జీవితాలు గడపబడాలి, సంభాషణలు పరిగణించబడాలి, అనుబంధాలు వృద్ధి చెందాలి. నిజముగా, మనలో ప్రతీఒక్కరికి సమాధానకర్తను మరింత పరిపూర్ణంగా అనుకరించుట కంటె విరిగిన అనుబంధాల గాయాలను లేక విభజించబడిన సమాజము బాగు చేయడానికి ఇతర విధానమేది లేదు. 6

ఆయనలాగా మారాలనే ఆలోచనాత్మకమైన, మనఃపూర్వకమైన, ఉద్దేశపూర్వకమైన ప్రయత్నాన్ని యేసుక్రీస్తు యొక్క లక్షణాలను పొందడం ద్వారా ఎలా ప్రారంభించాలో పరిశీలిద్దాం.

తీర్మానించండి మరియు ఒడంబడిక చేయండి

కొన్ని సంవత్సరాల క్రితం, నేను, నా భార్య జపాన్ యొక్క ఎత్తైన పర్వతం, ఫుజి పర్వతం వద్ద నిలబడి ఉన్నాము. మేము పైకి ఎక్కుతున్నప్పుడు, మేము సుదూర శిఖరాన్ని చూశాము, మేము అక్కడికి చేరుకోగలమా అని ఆశ్చర్యపడ్డాము.

ఫూజి పర్వతం

మేము పైకి ఎక్కుచున్నప్పుడు ఆలసట, కండరాల నొప్పులు, ఎత్తు యొక్క రుగ్మతలు కలిగాయి. మానసికంగా, తరువాత అడుగుపై దృష్టిసారించుట మాకు చాలా ప్రాముఖ్యంగా మారినది. “నేను పైకి వెళ్లలేకపోవచ్చు, కానీ ఇప్పుడు ఈ తరువాత అడుగును వేయగలనని” మేము చెప్పుకున్నాము. ఒక్కొక్క అడుగుతో కాలక్రమేణా అసాధ్యమైన కార్యం సాధించబడింది.

యేసు క్రీస్తు వలె మారవలెనన్న ఈ మార్గములో మొదటి మెట్టు ఆవిధంగా చేయడానికి కోరికను కలిగియుండుట. ఆయనలాగే ఉండాలన్న ఆజ్ఞను అర్థం చేసుకోవడం మంచిది, కాని ఒక్కొక్క అడుగుతో, ప్రకృతి సంబంధియైన మనుష్యుని అధిగమించి, ఆ అవగాహన మనల్ని మార్చుకోవాలనే బలమైన ఆపేక్షతో జతపరచబడాలి. 7 ఆ ఆపేక్షను వృద్ధి చేసుకోవడానికి, ఆయన ఎవరో మనము తెలుసుకోవాలి. ఆయన స్వభావమును గూర్చి మనము తెలుసుకోవాలి, 8 లేఖనము, ఆరాధనా సేవలు, ఇతర పరిశుద్ధ స్థలములలో ఆయన లక్షణాల కోసం మనము వెదకాలి. ఆయనను గూర్చి మనం ఎక్కువగా తెలుసుకొనుట ప్రారంభించినప్పుడు, ఇతరులు ఆయన లక్షణాలలో కొన్ని కలిగియుండుటను మనము చూస్తాము. ఎందుకనగా ఆయన లక్షణాలలో కొన్ని కొంతవరకు ఇతరులు సంపాదించగలిగినప్పుడు, మన స్వంత అన్వేషణలో మనం కూడా సంపాదించగలమని మనల్ని ప్రోత్సహించును.

మనతో మనం నిజాయితీగా ఉన్న యెడల, మనలోని క్రీస్తు వెలుగు 9 క్రీస్తు కలిగియున్న నిర్ధిష్టమైన లక్షణాలకు మనకు మధ్య దూరం కలదని తెలియజేస్తుంది. 10 ఆయనలాగా మారుటలో మన అభివృద్ధికి అలాంటి నిజాయితీ చాలా అవసరము. వాస్తవానికి, నిజాయితీ ఆయన లక్షణాలలో ఒకటి.

సరదా గృహం అద్దాల వక్రీకరణ

ఇప్పుడు, మనలో ధైర్యం కలవారు విశ్వసనీయ కుటుంబ సభ్యుడిని, జీవిత భాగస్వామిని, స్నేహితుడిని లేదా ఆత్మీయ నాయకుడిని యేసు క్రీస్తు యొక్క ఏ లక్షణం మనకు అవసరమో అని అడగటానికి పరిగణించండి - మీరు వినబోయే జవాబు కోసం సిద్ధపడియుండండి! కొన్నిసార్లు మనల్ని మనం వక్రీకరించబడిన సరదా గృహం అద్దాలలో చూస్తాము, అవి మనల్ని వాస్తవంగా ఉన్న దానికంటే బాగా లావుగా లేక బాగా సన్నంగా చూపిస్తాయి.

నమ్మకస్తులైన స్నేహితులు మరియు కుటుంబము సభ్యులు మనల్ని మనం చాలా ఖచ్చితంగా గ్రహించడానికి సహాయపడగలరు, కానీ వారు కూడా, వారెంత ప్రేమ కలిగి, సహాయకరముగా ఉండాలనుకున్నప్పుడు కూడా, కొన్ని విషయాలను అసంపూర్తిగా చూడగలరు. ఫలితంగా, మనకు అవసరమైన వాటిని, మన ప్రయత్నాలను ఎక్కడ కేంద్రీకరించాలని మన ప్రేమగల పరలోక తండ్రిని అడగటం కూడా ప్రాముఖ్యమైనది. ఆయన మన గురించి పరిపూర్ణమైన అవగాహన కలిగియున్నారు, మన బలహీనతను ప్రేమతో మనకు చూపిస్తారు. 11 బహుశా మీకు మరింత ఓపిక, నమ్రత, దాతృత్వము, ప్రేమ, నిరీక్షణ, శ్రద్ధ, లేక విధేయత వంటివి కొన్ని అవసరం కావచ్చని మీరు తెలుసుకుంటారు. 12

కొంతకాలం క్రితం, ప్రేమగల సంఘ నాయకుడు నేను ఒక నిర్దిష్ట లక్షణంను అధికంగా ఉపయోగించవచ్చని సూటిగా సూచించినప్పుడు, నేను ఆత్మను విస్తరింపజేయు అనుభవాన్ని పొందాను. అతడు ఎలాంటి వక్రీకరణ లేకుండా ప్రేమతో చెప్పాడు . ఆ రాత్రి, ఈ అనుభవాన్ని నా భార్యతో పంచుకున్నాను. అతని సలహాను ఆమె అంగీకరించినప్పుడు ఆమె మిక్కలి దాతృత్వంతో ఉన్నది. వారి సలహా ప్రేమగల పరలోకతండ్రి నుండి అని పరిశుద్ధాత్మ నాకు నిర్ధారించింది.

నా సువార్తను ప్రకటించుడి లో 6 అధ్యాయములోని క్రీస్తు వంటి లక్షణము అనే ప్రోత్సాహకార్యమును నిజాయితీగా పూర్తి చేయుటలో కూడా సహాయకరంగా ఉండవచ్చు. 13

ఒక్కసారి మీరు నిజాయితీగా పరిశీలించుకొన్న తర్వాత, క్రీస్తు వలె ఉండాలనే కొండను ఎక్కుటను ప్రారంభించుటకు తీర్మానించినప్పుడు, మీరు పశ్చాత్తాపపడాలి. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ప్రేమగా బోధించారు: “మనము పశ్చాత్తాపపడుటకు ఎన్నుకొన్నప్పుడు, మనము మారటానికి ఎన్నుకుంటాము! రక్షకుడు మనలను శ్రేష్టమైన వ్యక్తులుగా మార్చుటకు మనం అనుమతిస్తాము. మనం ఆత్మీయంగా ఎదుగుటకు, ఆనందమును పొందుటకు అనగా ఆయన విమోచనయందు ఆనందమును పొందుటకు మనం ఎంచుకుంటాము. మనం పశ్చాత్తాపపడాలని ఎంచుకొన్నప్పుడు, మనం మరింతగా యేసు క్రీస్తువలే మారుటకు ఎన్నుకుంటాము!” 14

యేసు క్రీస్తువలే మారటానికి మన హృదయాలు, మనస్సులు వాస్తవానికి, మన స్వంత స్వభావాలు, లక్షణాలు మార్చుకొనుట అవసరము, ఆవిధంగా చేయుట యేసు యొక్క రక్షించే కృప ద్వారా మాత్రమే సాధ్యము. 15

గుర్తించండి మరియు అమలు చేయండి

ఇప్పుడు మారటానికి, పశ్చాత్తాపపడటానికి మీరు తీర్మానించి, ప్రార్ధన ద్వారా నడిపింపును వెదకి, నిజాయితీగా ధ్యానించి, సాధ్యమైతే ఇతరులతో సంప్రదించాక, మీరు ప్రత్యేకంగా దృష్టిసారించునట్లు ఒక లక్షణాన్ని ఎంపిక చేయాల్సియున్నది. అర్ధవంతమైన ప్రయత్నం చేయడానికి మీరు కట్టుబడియుండాలి. ఈ లక్షణాలు తేలికగా లేక హఠాత్తుగా రావు, కానీ ఆయన కృప వలన సాధించడానికి కష్టపడి ప్రయత్నించినప్పుడు అవి క్రమంగా వృద్ధిచెందుతాయి.

క్రీస్తు వంటి లక్షణాలు మనల్ని, మన చుట్టూ ఉన్నవారిని దీవించడానికి ప్రేమగల పరలోకతండ్రి నుండి వరములు. ఆ ప్రకారము, ఈ లక్షణాలను పొందటానికి మన ప్రయత్నాలకు ఆయన దైవిక సహాయము కొరకు మన హృదయపూర్వకమైన మనవులు అవసరము. ఇతరులకు బాగా సేవ చేయడానికి ఈ వరములను మనము వెదకినప్పుడు, మన ప్రయత్నములందు ఆయన మనల్ని దీవిస్తాడు. దేవుని నుండి ఒక వరమును స్వార్ధపూరితంగా వెదకుట నిరాశ మరియు భంగపాటుతో ముగిస్తుంది.

అవసరమైన ఒక లక్షణంపై దృష్టిసారించుట ద్వారా, ఆ లక్షణాన్ని పొందడంలో మీరు వృద్ధి చెందినప్పుడు, అదేవిధంగా మీరు ఇతర లక్షణాలను కూడా పొందడం ప్రారంభిస్తారు. దాతృత్వమును వృద్ధి చేయడానికి ప్రయత్నించే వారు గొప్ప ప్రేమ మరియు దీనమనస్సునందు వృద్ధి చెందరా? విధేయతను వృద్ధి చేయడానికి ప్రయత్నించే వారు గొప్ప శ్రద్ధ మరియు నిరీక్షణయందు వృద్ధి చెందరా? ఒక లక్షణము పొందడానికి మీ ప్రాముఖ్యమైన ప్రయత్నాలు కేవలము ఒక ప్రత్యేక విషయానికి బదులుగా అనేక విషయాలను మెరుగుపరచుకోవడానికి సహాయపడతాయి.

వ్రాయండి మరియు కొనసాగించండి.

ఆయన వలె మారటానికి నేను ప్రయాసపడినప్పుడు నా అనుభవాలను, నేను నేర్చుకొన్నదానిని వ్రాయడం నాకు ముఖ్యమైనది. ఆయన లక్షణాలలో ఒకదానిని నా మనస్సులో లోతుగా అధ్యయనం చేసినప్పుడు, ఆయన బోధనలు, ఆయన పరిచర్య, ఆయన శిష్యులలో ఈ లక్షణము యొక్క మాదిరులను నేను చూసినప్పుడు, లేఖనాలలో క్రొత్త విషయాలను నేను నేర్చుకున్నాను. ఇతరులలో ఆ లక్షణాన్ని గుర్తించుటపై నేను ఎక్కువగా దృష్టిసారించాను. ఆయనను అనుకరించే లక్షణాలు కలిగిన సంఘ సభ్యులైన వారు, సభ్యులు కానివారు ఇరువురు అద్భుతమైన వ్యక్తులను నేను గమనించాను. ఆయన ప్రేమగల కృప ద్వారా మర్త్యులైన జనులలో ఆ లక్షణాలు ఎలా వ్యక్తమవుతాయో తెల్పుటకు వారు శక్తివంతమైన మాదిరులు.

నిజమైన అభివృద్ధిని చూడటానికి, మీరు నిరంతర కృషి చేయాలి. ఒక కొండను ఎక్కడానికి ముందు సిద్ధపాటు, ఎక్కుచుండగా సహనము, పట్టుదల అవసరమైనట్లుగా, ఈ ప్రయాణమునకు కూడా నిజమైన ప్రయత్నము, త్యాగము అవసరము. నిజమైన క్రైస్తవత్వానికి, దానిలో మన బోధకునివలే మారటానికి మనము ప్రయాసపడేదానికి, ఎల్లప్పుడు మన శ్రేష్టమైన ప్రయత్నాలు అవసరము. 16

ఇప్పుడు ఒక క్లుప్తమైన హెచ్చరిక ఆయనవలే ఉండాలనే ఆజ్ఞ మిమ్ములను అపరాధిలా, అయోగ్యలుగా, లేక ద్వేషించబడినట్లు మీరు భావించునట్లు చేయుటకు ఉద్దేశించబడలేదు. అభివృద్ధి చెందుట, ప్రయత్నించుట, విఫలమగుట, విజయాన్ని పొందుటే మన పూర్తి మర్త్యత్వ అనుభవమైయున్నది. నేను, నా భార్య, మా కళ్లు మూసుకొని, అద్భుతంగా కొండ శిఖరానికి మోసుకొనిపోబడాలని కోరుకున్నప్పటికినీ, కానీ జీవితం యొక్క ఉద్దేశము భిన్నముగా ఉండెను.

మీరు మంచిగా చేస్తున్నారు, మీరు ప్రేమించబడుతున్నారు, కానీ దాని అర్ధము ఇంక మీరు పరిపూర్ణులని కాదు. ఈ జీవితంలో, జీవితానంతరం చేయాల్సిన కార్యమున్నది. ఆయన దైవిక సహాయముతో మాత్రమే మనమందరం ఆయనవలే మారుటకు వృద్ధిచెందుతాము.

“అన్ని విషయాలు గందరగోళంగా [కనిపిస్తున్నాయి]; మరియు … జనులందరిపై భయమున్నట్లు [కనిపిస్తున్నప్పుడు] ,” 17 ఈ సమయాలలో ఏకైక విరుగుడు, ఏకైక పరిహారమేదనగా, రక్షకుడు, 18 సమస్త మానవాళి యొక్క విమోచకుడు 19 లోకము యొక్క వెలుగు 20 లాగా ఉండటానికి ప్రయాసపడుట మరియు “నేనే మార్గమును” 21 అని ప్రకటించిన ఆయనను వెదకుట.

విమోచకుడు:

ఆయన దైవిక సహాయము, బలము ద్వారా ఆయనవలే మారటం మెట్టు వెంబడి మెట్టు సాధించబడుతుందని నేను ఎరుగుదును. అది సాధ్యం కాని యెడల, ఆయన మనకు ఈ ఆజ్ఞను ఇచ్చియుండేవాడు కాదు. 22 ఇది నాకు తెలుసు-ఎందుకంటే మీలో అనేకమందిలో ఆయన లక్షణాలను నేను చూస్తున్నాను. ఈ సంగతుల గురించి యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. 3 నీఫై 27:27. రక్షకుని నుండి సంబంధిత బోధనల కొరకు, మత్తయి 5:48 చూడండి, (“మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు గనుక, మీరును పరిపూర్ణులుగా ఉండెదరు”); 1 యోహాను 2:6 (“ఆయనయందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో ఆలాగే తానును నడుచుకొన బద్ధుడైయున్నాడు.”); మోషైయ 3:19 “ఏలయనగా పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణలకు లోబడి మరియు ప్రకృతి సంబంధియైన మనుష్యుని విసర్జించి మరియు ప్రభువైన క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తఃము ద్వారా ఒక పరిశుద్ధుడై మరియు విధేయుడు, సాత్వికుడు, వినయము, సహనము కలిగి ప్రేమతో నిండి ఒక పిల్లవాడు తన తండ్రికి లోబడునట్లు కూడ అతనిపై చేయుటకు తగినవని ప్రభువు చూచు విషయములన్నిటికి లోబడుటకు ఇష్టపడు ఒక పిల్లవాని వలే అయితేనే తప్ప ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవునికి ఒక శత్రువైయున్నాడు మరియు ఆదాము యొక్క పతనము నుండి ఉండియున్నాడు మరియు ఎప్పటికి నిరంతరముండును”); ఆల్మా 5:14 (“మరియు ఇప్పుడు ఇదిగో, సంఘము యొక్క నా సహోదరులారా నేను మిమ్మలను అడుగుచున్నాను, మీరు దేవుని ద్వారా ఆత్మీయముగా జన్మించియున్నారా? మీ ముఖముల యందు ఆయన స్వరూపమును మీరు పొందియున్నారా?”); 3 నీఫై 12:48 (“కాబట్టి, నేను లేక పరలోకమందున్న మీతండ్రి పరిపూర్ణుడైయున్నట్లు, మీరును పరిపూర్ణులు కావలెనని నేను కోరుచున్నాను”).

  2. Neal A. Maxwell, Even As I Am (1982), 16.

  3. Charles M. Sheldon, In His Steps (1979), 185.

  4. సిద్ధాంతము మరియు నిబంధనలు 93:12–17 చూడండి.

  5. మత్తయి 5:48, పుట వివరణ b. చూడండి.

  6. యెషయా 9:6; 2 నీఫై 19:26 చూడండి.

  7. 1 కొరింథీయులకు 2:14; మోషైయ 3:19 చూడండి.

  8. మత్తయి 7:23; 25:12; మోషైయ 26:24 చూడండి; David A. Bednar, “If Ye Had Known Me,” Liahona, Nov. 2016, 102–5 ప్రతీ లేఖనమునకు పుట వివరణ కూడ చూడండి.

  9. సిద్ధాంతము మరియు నిబంధనలు 93:2 చూడండి.

  10. మొరోనై 7:12–19 చూడుము.

  11. ఈథర్ 12:27 చూడుము.

  12. Preach My Gospel: A Guide to Missionary Service, rev. ed. (2019), chapter 6, “How Do I Develop Christlike Attributes?” చూడండి. రక్షకుని యొక్క ఇతర లక్షణాలకు సూచనలు లేఖనములలో ఇతర భాగాలలో ఉంచబడినవి. కొన్ని ఉదాహారణలు మోషైయ 3:19; ఆల్మా 7:23; విశ్వాస ప్రమాణములు 1:13 కలిగియున్నవి.

  13. Preach My Gospel, 132 చూడండి.

  14. రస్సెల్ ఎమ్. నెల్సన్, “We Can Do Better and Be BetterLiahona, మే 2019, 67.

  15. Bible Dictionary, “Grace” చూడుము; Guide to the Scriptures, “Grace,” scriptures.ChurchofJesusChrist.org కూడా చూడుము.

  16. See Sheldon, In His Steps, 246: “క్రైస్తవునిగా ఉండటానికి మన నిర్వచనం ఆరాధనా హక్కులను ఆస్వాదించుట మాత్రమే అయితే, మనము ఎటువంటి ఖర్చు లేకుండా ఉదారంగా ఉండి, మంచి, ఆహ్లాదకరమైన స్నేహితుల ద్వారా, సౌకర్యవంతమైన వస్తువుల చేత చుట్టబడి, మంచి, సుఖమైన సమయాన్ని కలిగి ఉండి, గౌరవప్రదంగా జీవించండి, కానీ అదేసమయంలో లోకము యొక్క గొప్ప పాపపు ఒత్తిడిని నివారించండి, ఎందుకనగా అది భరించుటకు చాలా నొప్పియైనది—ఇది క్రైస్తవత్వమును గూర్చి మన నిర్వచనము అయితే, లోక పాపముల కొరకు రక్షకుడు అనుభవించిన బాధను, నొప్పులు, ఎవరి చెమట గొప్ప రక్త బిందువుల వలే ఉన్నదో ఆయన, మేకులు కొట్టబడిన సిలువపై వ్రేలాడుతూ ‘నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి’” అని కేకలు వేసిన క్రీస్తు యొక్క మాదిరిని అనుసరించునట్లు అదే విషయాలను నిశ్చయముగా మనము చేయడంలేదు.

  17. సిద్ధాంతము మరియు నిబంధనలు 88:91.

  18. యెషయా 43:3 చూడండి.

  19. యాకోబు 19:25 చూడండి.

  20. యోహాను 8:12 చూడుము.

  21. యోహాను 14:6.

  22. 1 నీఫై 3:7 చూడండి.