క్రీస్తునందు సంతోషమును కనుగొనుట
ఈ జీవితంలో సంతోషమును కనుగొనుటకు నిశ్చయమైన విధానమేదనగా ఇతరులకు సహాయపడుటలో క్రీస్తుతో చేరుట.
ప్రభువు మన అహరోను యాజకత్వ యువతను ప్రతిదీ చేయమని అడగరు, కాని ఆయన అడుగుతున్నది విస్మయం కలిగిస్తుంది.
కొన్ని సంవత్సరాల క్రితం, ఈ పడిపోయిన లోకములో అనేక కుటుంబాలు ఎదుర్కొనే దానిని మా చిన్న కుటుంబము అనుభవించింది. మా చిన్న కుమారుడు, టాన్నర్ క్రిస్టియన్ లండ్ క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడయ్యాడు. తొమ్మది సంవత్సరాల వాళ్లు ఉన్నట్లుగా, అతడు అసాధారణమైన వ్యక్తి. అతను ఉల్లాసంగా ఉండే కొంటెవాడు, అదే సమయంలో ఆశ్చర్యకరముగా ఆత్మీయ విషయాలను ఎరిగినవాడు. పిల్ల దయ్యము, దేవదూత, కొంటెవాడు మరియు మంచివాడు. అతడు చిన్నవాడిగా ఉన్నప్పుడు ప్రతీరోజు తన సృజనాత్మకత, అల్లరితో మమ్మల్ని ఆశ్చర్యపరచేవాడు, అతడు పెద్దవాడయ్యాక ఒక ప్రవక్తగా కాని లేక ఒక బ్యాంకు దొంగగా మారతాడేమోనని మేము ఒప్పించబడ్డాము. ఎలాగైనా, అతడు ప్రపంచంపై ఒక ముద్ర వేయబోతున్నట్లు అనిపించింది.
తరువాత అతడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. తరువాత రాబోయే మూడు సంవత్సరాలు, రెండు మూలుగుల మార్పిడి కలిపి, ఆధునిక వైద్యము వీరోచిత చర్యలను ఉపయోగించింది, అక్కడ అతడికి న్యూమోనియో వచ్చి, అతడు వెంటిలేటర్ పై 10 వారాలు అపస్మారక స్థితిలో గడపాల్సి వచ్చింది. అద్భుతంగా, అతడు స్వల్ప కాలం ఉపశమనం పొందాడు, కానీ అతనికి క్యాన్సర్ తిరిగి వచ్చింది.
అతను చనిపోవడానికి కొంతకాలం ముందు, టాన్నర్ వ్యాధి అతని ఎముకలపై దాడి చేసింది, మరియు బలమైన నొప్పి నివారణ మందులు వాడినప్పటికి అతను నొప్పితో బాధపడ్డాడు. అతడు మంచం మీద నుండి లేవలేకపోయాడు. ఒక ఆదివారం ఉదయం, కుటుంబం సంఘానికి బయలుదేరే ముందు అతని తల్లి కలీన్ అతనిని చూడటానికి అతడి గదిలోకి వచ్చింది. అతడు ఎదోవిధంగా పైకిలేచి, తనకై తాను దుస్తులను వేసుకొన్నాడు, మరియు తన మంచం చివర కూర్చోని, షర్టు బటను పెట్టుకోవడానికి బాధాకరంగా ప్రయాసపడటం చూచి ఆమె ఆశ్చర్యపడింది. కలీన్ అతడి దగ్గర కూర్చోన్నది. “టాన్నర్,” “నీవు సంఘానికి వెళ్లేంత బలంగా ఉన్నావని ఖచ్చితంగా నీవనుకుంటున్నావా”? ఆమె అడిగింది. బహుశా ఈరోజు నీవు ఇంటిలోని ఉండి విశ్రాంతి తీసుకోవాలి.”
అతడు నేలవైపు తేరిచూసాడు. అతడు ఒక పరిచారకుడు. అతడికి ఒక సమూహమున్నది. అతడి ఒక పని ఉన్నది.
“ఈ రోజు నేను సంస్కారము అందించాల్సియున్నది.”
“సరే, ఎవరైనా నీ కోసం దానిని చేయగలరని నా నిశ్చయం.”
“అవును,” “కానీ … నేను సంస్కారము అందించినప్పుడు జనులు నావైపు ఎలా చూస్తారో నేను చూసాను. అది వారికి సహాయపడుతుందని నేను అనుకుంటున్నాను.”
కనుక కల్లీన్ అతడు షర్టు వేసుకోవడానికి, టై కట్టడానికి సహాయపడింది, మరియు వారు కారులో వచ్చారు. స్పష్టంగా, ఎదో ముఖ్యమైనది జరగబోతున్నది.
నేను ఒక సమావేశం కోసం త్వరగా వచ్చాను మరియు పరిచారకుల వరుసలో టాన్నర్ కూర్చోవడం చూసి నేను చాలా ఆశ్చర్యపడ్డాను. అతడు ఎందుకు అక్కడున్నాడో, అతడు చెప్పిన దానిని కలీన్ నాతో నెమ్మదిగా చెప్పింది: “అది జనులకు సహాయపడుతుంది.”
పరిచారకులు సంస్కార బల్లవద్దకు అడుగుపెట్టినప్పుడు నేను గమనించాను. యాజకులు వారి రొట్టె పళ్ళెములు అందిస్తుండగా, అతడు బలము లేకపోవడం వలన మరొక పరిచారకునిపై మృదువుగా ఆనుకున్నాడు. టాన్నర్ కాళ్లు ఇడ్చుకుంటూ, తనకు నియమించబడిన చోటకు వచ్చాడు మరియు అతడు తన ముందున్న వ్యక్తికి సంస్కారమును అందించినప్పుడు, అతడు స్థిరంగా నిలబడడానికి చివర కుర్చీని పట్టుకొన్నాడు.
అతడు తన చిన్న పనిని చేసినప్పుడు, అతడు అణచుకొన్న బాధను గ్రహిస్తున్నట్లు సమావేశంలో ఉన్న ప్రతీ ఒక్కరి కళ్లు అతడిని చూచి, కదిలించబడినట్లుగా కనిపించింది. పరిచారకులు చేసే విధంగా రక్షకుడిని సూచిస్తూ— అతడి బట్టతల చెమటతో, అతడు గంభీరంగా వరుస నుండి వరుసకు కుంటుతూ వెళ్ళినప్పుడు—ఏదోవిధంగా టాన్నర్ మౌన ప్రసంగమును వ్యక్తపరిచాడు. అతడి ఒకప్పుడు లొంగని పరిచారకుని శరీరం, దానికదే కొద్దిగా గాయపడి, విరిగి మరియు చిరిగి మన జీవితాలలో రక్షకుడి ప్రాయశ్చిత్తం యొక్క చిహ్నాలను వహించుట ద్వారా సేవ చేయడానికి ఇష్టపూర్వకంగా బాధపడుతోంది.
ఒక పరిచారకునిగా ఉండుట గురించి అతడు ఎలా ఆలోచించగలిగాడో చూచుట—సంస్కారము గురించి, రక్షకుని గురించి, పరిచారకుని గురించి, బోధకులు మరియు యాజకులను గూర్చి మేము భిన్నంగా ఆలోచించునట్లు చేసింది.
ఆ రోజు ఉదయం, సేవ చేయడానికి ఆ చిన్న నిశ్శబ్ధమైన పిలుపుకు చాలా ధైర్యంగా స్పందించడానికి అతడిని ప్రేరేపించిన చెప్పబడని అద్భుతము గురించి మరియు దేవుని యొక్క సైన్యములో చేరడానికి రక్షణ మరియు మహోన్నతస్థితి యొక్క కార్యములో చేరడానికి ఒక ప్రవక్త పిలుపుకు స్పందించుటకు ఎదైనా సాధించుటకు వారు దృష్టి కేంద్రీకరించినప్పుడు మన ఉద్భవిస్తున్న యువకులందరి బలం మరియు సామర్థ్యాల గురించి నేను ఆశ్చర్యపడుచున్నాను.
ఒక పరిచారకుడు సంస్కార పాత్రను పట్టుకొన్న ప్రతీసారి, ప్రభురాత్రి భోజనం, గెత్సేమనే, కల్వరి మరియు సమాధి తోట యొక్క పరిశుద్ధ వృత్తాంతమును గూర్చి మనము జ్ఞాపకం చేయబడతాము. “నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి,” 1 అని రక్షకుడు తన అపొస్తలులకు చెప్పినప్పుడు, ఆయన యుగముల గుండా మనలో ప్రతీఒక్కరితో మాట్లాడుతున్నాడు. భవిష్యత్ పరిచారకులు, బోధకులు మరియు యాజకులు ఆయన చిహ్నములను అందించి మరియు ఆయన ఇచ్చిన ప్రాయశ్చిత్త వరమును అంగీకరించుటకు ఆయన పిల్లలను ఆహ్వానించినప్పుడు ఆయన చేయబోయే అంతులేని అద్భుతమును గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు.
సంస్కార చిహ్నములన్నీ ఆ బహుమానమునకు మనల్ని సూచిస్తాయి. ఆయన ఒకసారి విరిచిన రొట్టెను—మనముందున్న యాజకులు ఇప్పుడు, తిరిగి ఆ రొట్టెను విరచుట మనము ధ్యానిస్తాము. సంస్కార ప్రార్థనలు యువ యాజకుల నోటి నుండి మన హృదయాల్లోకి మరియు పరలోకములకు వెళ్ళుచుండగా, క్రీస్తు యొక్క రక్షణకు సంబంధించిన శక్తులతో మనల్ని అనుసంధానించే ఒడంబడికలను క్రొత్తవిగా చేసినప్పుడు అప్పుడు, ఇప్పుడు అభిషేకించబడిన ద్రవం యొక్క అర్ధం గురించి మనం ఆలోచిస్తాము. ఒక పరిచారకుడు సంస్కార చిహ్నములను మన యొద్దకు తెచ్చినప్పుడు, మన భారములు మరియు మన బాధను పైకెత్తుటకు అడుగుతూ, యేసు అక్కడ ఉన్నయెడల ఆయన నిలబడి చేసినట్లుగా, వారు నిలబడినప్పుడు దాని అర్ధమేమిటో మనము ఆలోచించవచ్చు.
అదృష్టవశాత్తూ, యువతీ, యువకులు రక్షకునికి సేవ చేయడంలో సంతోషమును, ఉద్దేశ్యమును కనుగొనడానికి రోగులు కానవసరము లేదు.
వృద్ధి చెంది సువార్తికులుగా మారడానికి, సువార్తికులు చేసినట్లుగా మనము చేయాలని, మరియు అప్పుడు, “వరుస వెంబడి వరుస, సూత్రము వెంబడి సూత్రము, … రక్షకుడు ఆశించిన … సువార్తికునిగా క్రమంగా [మనము] మారవచ్చు,” 2 అని ఎల్డర్ డేవిడ్. ఎ. బెడ్నార్ బోధించారు.
అదేవిధంగా, మనము “యేసువలె ఉండుటకు కోరిన యెడల,” 3 యేసు చేసినట్లుగా మనము చేయాలి, ఒక ఆశ్చర్యపరిచే వాక్యములో, ప్రభువు తాను చేస్తున్నదో ఏమిటో వివరించెను: ఆయన ఇట్లనెను, “ఏలయనగా ఇదిగో, మానవుని యొక్క అమర్త్యత్వమును మరియు నిత్యజీవమును తెచ్చుటయే నా కార్యము మరియు నా మహిమయైయున్నది.” 4
రక్షకుని యొక్క నియమితకార్యము ఎల్లప్పుడు మరియు శాశ్వ తంగా ఆయన పిల్లలను రక్షించుట ద్వారా ఆయన తండ్రికి సేవ చేయుటగా ఉన్నది.
ఈ జీవితంలో సంతోషమును కనుగొనుటకు నిశ్చయమైన విధానము ఇతరులకు సహాయపడుటలో క్రీస్తును చేరుట.
ఈ సాధారణమైన సత్యము పిల్లలు మరియు యువత కార్యక్రమాన్ని ప్రేరేపించింది.
పిల్లలు మరియు యువత ప్రోత్సాహ కార్యక్రమాలన్నీ, పిల్లలు మరియు యువత బోధనలన్నీ రక్షణ మరియు పైకెత్తబడే కార్యములో వారు ఆయనతో చేరుట ద్వారా, యేసువలె ఎక్కువగా మారటానికి యువ జనులకు సహాయపడుట గూర్చినవి.
పిల్లలు మరియు యువత (కార్యక్రమము) ప్రతీ ప్రాధమిక బిడ్డ, యువత శిష్యత్వమందు ఎదుగుటకు మరియు సంతోషము యొక్క విధానము ఎలా కనిపిస్తుందో విశ్వాసము-నిండిన దర్శనమును పొందడానికి సహాయపడే ఒక సాధనము. వారు సమూహములు, యువతుల తరగతులకు వారిని తీసుకువెళ్ళే ప్రయాణంలో ఆగే స్థానం మరియు నడిపించుటకు ఉపయోగించే సూచనల కోసం ఎదురుచూసి ఆరాటపడుట నేర్చుకొనవచ్చు, అక్కడ వారు బాప్తీస్మము పొంది, పరిశుద్ధాత్మ వరముతో నిర్ధారించబడతారు మరియు త్వరలో సమూహములు, యువతుల తరగతులకు చెందియుంటారు, అక్కడ వారు క్రీస్తులాంటి సేవా చర్యల వారసత్వము ద్వారా ఇతరులకు సహాయం చేసిన ఆనందాన్ని అనుభవిస్తారు. వారు చిన్నవి, పెద్ద లక్ష్యములను ఏర్పరుస్తారు, అది వారు రక్షకుని వలె ఎక్కువగా మారినప్పుడు వారి జీవితాలకు సమతుల్యతను తెస్తుంది. యౌవనుల బలము కొరకు సర్వసభ్య సమావేశాలు, మాసపత్రికలు, స్నేహితుడు, మరియు Gospel Living app (సువార్తను జీవించే యాప్) క్రీస్తునందు సంతోషమును కనుగొనుటలో వారిని కేంద్రీకరించడానికి సహాయపడతాయి. వారు పరిమితంగా ఉపయోగించే దేవాలయ సిఫారసులను పట్టుకొనుట వలన కలిగే దీవెనలు ముందుగా గ్రహిస్తారు, మరియు వారు దేవాలయము, కుటుంబ చరిత్ర కార్యము యొక్క దీవెనలను వెదకినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము ద్వారా ఏలీయా యొక్క ఆత్మను వారనుభవిస్తారు. గోత్ర జనకులని దీవెనల చేత వారు నడిపించబడతారు. కాలక్రమేణా, శక్తితో నింపబడుటకు, వారి కుటుంబాలతో కలిసి వారు శాశ్వతంగా అనుసంధానించబడినప్పడు అక్కడ ఆనందాన్ని పొందడానికి, వారు తమను తాము దేవాలయాలలోకి వెళ్ళడం చూస్తారు.
మహమ్మారి మరియు విపత్తు యొక్క తలనొప్పికి వ్యతిరేకంగా, క్రొత్త పిల్లలు మరియు యువత కార్యక్రమం యొక్క పూర్తి వాగ్దానాన్ని తీసుకురావడం ఇప్పటికీ పురోగతిలో ఉన్న కార్యము—కాని అత్యవసరత ఉన్నది. మన యువత రక్షకుని వద్దకు రాకముందు లోకము దానికదే సరిదిద్దుకొనేవరకు వాళ్లు వేచియుండలేరు. వారి నిజమైన గుర్తింపులు—ఆయనవి వారు ఎరిగిన యెడల వారు చేయని నిర్ణయాలను ఇప్పుడు కూడ చేస్తున్నారు.
కనుక “అందరూ ఏదైనా సాధించడానికి!” విధిలేని శిక్షణలో దేవుని యొక్క సైన్యముల నుండి అత్యవసర పిలుపు ఉన్నది.
అమ్మలు నాన్నలు, మీ కొడుకులు గతములో బ్యాడ్జ్‌లు, పిన్నులు వంటి తక్కువ ప్రాముఖ్యతగల విషయాలను గూర్చి చింతించినప్పుడు చేసినట్లుగా, మీరు ఇప్పుడు ఉద్రేకంతో వారికి మద్ధతు ఇవ్వాల్సిన అవసరమున్నది. అమ్మలు నాన్నలు, యాజకత్వము మరియు యువతుల నాయకులారా, మీ యువత ప్రయాసపడుతున్న యెడల, పిల్లలు మరియు యువత వారిని రక్షకుని వద్దకు తెచ్చుటకు సహాయపడుతుంది, మరియు రక్షకుడు వారికి శాంతిని అనుగ్రహించును. 5
సమూహము మరియు తరగతి అధ్యక్షత్వములారా, బాధ్యత వహించి, ప్రభువు యొక్క కార్యములో మీ హక్కుగా గల స్థానమును తీసుకొనండి.
బిషప్పులు, ఆ సమూహపు అధ్యక్షులతో సన్నిహితంగా మీ యాజకత్వపు తాళపుచెవులను ఉపయోగించండి—మీ సమూహములు—మీ వార్డులు శాశ్వతంగా మారతాయి.
వృద్ధి చెందుతున్న యువతరమైన మీకు, మీరు దేవుని యొక్క ప్రియమైన కుమారులు మరియు కుమార్తెలని, మీరు చేయడానికి ఆయన ఒక కార్యమును కలిగియున్నారని తెలిసిన ఒకరిగా నేను సాక్ష్యమిస్తున్నాను.
మీ ముఖ్యమైన స్థానములను మీ పూర్ణ హృదయాలు, శక్తి, మనస్సు, మరియు బలముతో మీ శక్తి మేరకు నెరవేర్చినప్పుడు, మీ స్వంత గృహాలలో ప్రారంభించి, ఇతరులను దీవించుటకు మీరు పనిచేసినప్పుడు, మీరు దేవుని ప్రేమను పొందుతారు, మీ నిబంధనలను పాటిస్తారు మరియు ఆయన యాజకత్వమునందు విశ్వసిస్తారు.
యేసు క్రీస్తు యొక్క సువార్త ద్వారా మాత్రమే వచ్చే దేవాలయ దీవెనలు మరియు శాశ్వతమైన ఆనందమును పొందుటకు అర్హులగుటకు రెట్టింపైన శక్తితో మీరు ప్రయాసపడి, ఈ సమయముకు యోగ్యులుగా, సేవ చేయుటకు విశ్వాసమును సాధన చేసి, పశ్చాత్తాపపడి, ప్రతీరోజు మెరుగుపరచుకొంటారని నేను ప్రార్ధిస్తున్నాను. ఆ శ్రద్ధగల సువార్తికునిగా మారడానికి, నమ్మకమైన భర్త లేక భార్య, ప్రియమైన తండ్రి లేక తల్లిగా ఉండటానికి మీరు సిద్ధపడతారని నేను ప్రార్ధిస్తున్నాను, యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులుగా మారుట ద్వారా చివరకు మీరు కాగలరని మీరు వాగ్దానము చేయబడ్డారు.
అందరినీ క్రీస్తుయొద్దకు రమ్మని, ఆయన ప్రాయశ్చిత్త శక్తి యొక్క దీవెనలు పొందమని ఆహ్వానించుట ద్వారా రక్షకుని యొక్క రాకడ కొరకు లోకమును సిద్ధపరచుటకు మీరు సహాయపడెదరు గాక. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.