ప్రతీ రాజ్యములు, జాతులు మరియు ఆయా భాషలు మాటలాడువారు
మనము మన స్వంత విధానములో ప్రభువు యొక్క ప్రవచనాలు , వాగ్దానాల యొక్క నెరవేర్పులో భాగము కావచ్చు—సువార్త లోకమును దీవించుటలో భాగము.
ప్రియమైన సహోదర, సహోదరిలారా, ఈమధ్య కోవిద్-19 సూచనలను అనుసరిస్తూ, నేను ఒక దేవాలయ ముద్రింపును నిర్వహించాను. సువార్త సేవ చేసి తిరిగివచ్చిన విశ్వాసులైన వధువరులతో వారి తల్లిదండ్రులు, వారి సహోదర, సహోదరీలున్నారు. ఇది సులభము కాదు. వధువు పదిమంది పిల్లలలో తొమ్మిదవ బిడ్డ. ఆమె తొమ్మిదిమంది తోబుట్టువులు పెద్దవారినుండి చిన్నవారి వరకు క్రమంగా సామాజిక దూరం పాటించి కూర్చున్నారు.
కుటుంబము ఎక్కడ నివసించినప్పటికీ వారు మంచి పొరుగువారిగా ఉండాలని కోరారు. అయినప్పటికీ, ఒక సమాజము వారిని స్వాగతించలేదు—ఎందుకంటే వారి కుటుంబము యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘ సభ్యులు అని పెండ్లి కుమార్తె తల్లి చెప్పింది.
ఆ కుటుంబము పాఠశాలలో స్నేహితులను చేసుకోవడానికి, తోడ్పడటానికి, మరియు అంగీకరించబడటానికి, శాయశక్తులా ప్రయత్నించారు, కానీ ఫలితం లేదు. హృదయాలు మృదువుగా చేయబడాలని కుటుంబము పదేపదే ప్రార్ధించింది.
ఒక రాత్రి, ఊహించనిరీతిలో వారి ప్రార్ధనలు జవాబివ్వబడినట్లు ఆ కుటుంబము భావించింది. వారి ఇంటికి నిప్పు అంటుకొని, పూర్తిగా నేలమట్టం అయ్యింది. కానీ మరేదో జరిగింది. అగ్ని వారి పొరుగువారి హృదయాలను మృదువుగా చేసింది.
సమస్తము కోల్పోయిన ఆ కుటుంబానికి వారి పొరుగువారు మరియు స్థానిక పాఠశాలవారు దుస్తులు, బూట్లు, మరియు అవసరమైన ఇతర అవసరాలను సేకరించారు. దయ అవగాహనకు దారితీసింది. కుటుంబము ఆశించినది లేక వారి ప్రార్ధనలు జవాబివ్వబడతాయని ఊహించిన విధానము ఇదికాదు. అయినప్పటికీ, కష్టమైన అనుభవాలు మరియు హృదయపూర్వకమైన ప్రార్థనలకు ఊహించని జవాబుల కొరకు వారు కృతజ్ఞత తెలిపారు.
నిజముగా, విశ్వాసముగల హృదయాలు చూచే కన్నులు గలవారికి, జీవితపు కష్టాలమధ్య ప్రభువు యొక్క మృదువైన కనికరాలు ప్రత్యక్షపరచబడతాయి. విశ్వాసముతో ఎదుర్కొను సవాళ్ళు మరియు త్యాగము పరలోకపు దీవెనలను తెచ్చును. ఈ మర్త్యత్వములో, కొంతకాలము కొన్ని విషయాలను మనము కోల్పోవచ్చు లేక వేచియుండవచ్చు, కానీ చివరికి ముఖ్యమైన దానిని మనము కనుగొంటాము. 1 అదే ఆయన వాగ్దానము. 2
మన 2020 ద్విశతాబ్ది ప్రకటన “ప్రపంచములోని ప్రతీ దేశములోని తన పిల్లలను దేవుడు ప్రేమిస్తున్నాడు,” అనే లోతైన వాగ్దానముతో ప్రారంభమగును. 3 ప్రతీ దేశము, రాజ్యము, ఆయా భాషలు, మరియు జనములలో, మనలో ప్రతీ ఒక్కరికి 4 దేవుడు వాగ్దానమిస్తున్నాడు, నిబంధన చేస్తున్నాడు, మరియు ఆయన సమృద్ధియైన సంతోషము, మంచితనములో పాల్గొనుటకు మనల్ని ఆహ్వానిస్తున్నాడు.
జనులందరి కొరకు దేవుడు కలిగియున్న ప్రేమ లేఖనమంతటా ధృవీకరించబడినది. 5 ఆ ప్రేమ అబ్రహాము నిబంధన, చెదిరిన పిల్లలను ఆయన సమకూర్చుట, 6 మరియు మన జీవితాలలో ఆయన సంతోషము యొక్క ప్రణాళికను చుట్టుముట్టియున్నది.
విశ్వాస గృహములో పరజనులు పరదేశులు, 7 , ధనికులు, పేదవారు, 8 వెలుపల “ఇతరులు” ఉండకూడదు. “పరిశుద్ధులతో ఏక పట్టణస్తులుగా” 9 మనము ఒక సమయంలో ఒక వ్యక్తి, ఒక కుటుంబము, ఒక పొరుగువారు, చిన్న విభాగము నుండి పెద్ద విభాగాలను ప్రభావితం చేస్తూ మనము లోకమును ఉత్తమంగా మార్చటానికి ఆహ్వానించబడ్డాము.
మనము సువార్తను జీవించి, పంచుకొన్నప్పుడు ఇది జరుగుతుంది. ఈ యుగము ప్రారంభంలో, ప్రవక్తయైన జోసెఫ్ ప్రతీచోటా ప్రతిఒక్కరు దేవుని ప్రేమను కనుగొని, ఎదగడానికి, మారటానికి ఆయన శక్తిని అనుభవించమని పరలోక తండ్రి కోరుచున్నారనే ఒక అసాధారణమైన ప్రవచనాన్ని పొందాడు.
ఆ ప్రవచనము ఇక్కడ, న్యూయార్క్, పామైరాలో స్మిత్ కుటుంబపు చెక్క ఇంటిలో పొందబడినది. 10
1998 లో పూర్తి చేయబడిన, స్మిత్ గృహము దాని ప్రారంభపు పునాదిపై తిరిగి కట్టబడింది. రెండంతస్తుల పడకగది అదే 18x30x10 అడుగుల (5.5x9x3 మీ) భౌతిక స్థలాన్ని ఆక్రమించింది, ఇక్కడ దేవుని నుండి మహిమగల దూతగా మొరోనై 1823 సెప్టెంబరు 21 సాయంత్రం యువ జోసెఫ్ వద్దకు వచ్చాడు. 11
ప్రవక్త జోసెఫ్ వివరించిన విషయం మీకు గుర్తుందా:
“[మొరోనై] చెప్పాడు… అతడు దేవుని యొక్క సమక్షము నుండి నా యొద్దకు పంపబడిన దూతయని మరియు అతని పేరు మొరోనై అని, నేను చేయుటకు దేవుడు ఒక కార్యము కలిగియున్నాడని మరియు నా పేరు సమస్త జనములు, వంశములు మరియు భాషలయందు మంచిగాను, చెడుగాను చెప్పుకోబడునని చెప్పాడు.…
“ఒక గ్రంథము భద్రపరచబడి యున్నదనియు … శాశ్వతమైన సువార్త యొక్క పరిపూర్ణత దానియందు కలిగియున్నదని అతడు [మొరోనై] చెప్పాడు.” 12
ఇక్కడ మనము ఆగుదాం. మనము నిత్య తండ్రియైన దేవుడిని, ఆయన కుమారుడైన యేసు క్రీస్తును ఆరాధిస్తాము, ప్రవక్త జోసెఫ్ కాదు లేక మర్త్యులైన ఏ పురుషుడిని లేక స్త్రీని కాదు.
అయినప్పటికీ దేవుడు తన సేవకులకు ఇచ్చిన ప్రవచనాలు ఎలా నెర్చవేర్చబడ్డాయో ఆలోచించండి. 13 కొన్ని ముందుగా, కొన్ని తరువాత, నెరవేర్చబడ్డాయి, కానీ అన్నీ నెరవేర్చబడ్డాయి. 14 ప్రభువు యొక్క ప్రవచన ఆత్మను మనము ఆలకించినప్పుడు, మనము మన స్వంత విధానములో ఆయన ప్రవచనాలు మరియు వాగ్దానముల యొక్క నెరవేర్పులో భాగము కావచ్చు—సువార్త లోకమును దీవించుటలో భాగము.
1823 లో, జోసెఫ్ క్రొత్తగా స్వతంత్ర దేశములో, ఒక మారుమూల గ్రామంలో నివసిస్తున్న ప్రసిద్ధికాని 17 సంవత్సరాల బాలుడు. అది నిజము కాకపోతే, అతడు దేవుని యొక్క కార్యములో సాధనముగా ఉంటానని, ప్రతిచోటా ప్రసిద్ధి చెందబోయే పరిశుద్ధ లేఖనమును దేవుని యొక్క వరము, శక్తి చేత అనువదిస్తానని ఎలా ఊహిస్తాడు?
అయినప్పటికీ, అది సత్యము కనుక ఆ ప్రవచనము నెరవేరుటలో సహాయపడుటకు మనము ఆహ్వానించబడినప్పుడు ఆ ప్రవచనము నెరవేర్చబడుట మీరు, నేను చూడగలము.
ప్రపంచమంతటా ఉన్న సహోదర, సహోదరీలు, 2020 అక్టోబరు సర్వసభ్య సమావేశంలో పాల్గొంటున్న మనలో ప్రతిఒక్కరం, చెప్పబడిన రాజ్యములు ప్రతి జనములు, మరియు ఆయా భాషలు మాటలాడువారి మధ్య ఉన్నాము.
ఈ రోజు యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘ సభ్యులు 90 దేశాలలో ఉన్న 3,446 సంఘ స్టేకులతో పాటు మొత్తం 196 దేశాలు మరియు భూభాగాలలో నివసిస్తున్నారు. 15 అనేక విభిన్న భౌగోళిక ప్రాంతాలను మరియు సంఘము యొక్క, బలమైన కేంద్రాలను మనము సూచిస్తాము.
1823లో, 2020 సంవత్సరంలో మూడు దేశాలైన అమెరికా సంయుక్త రాష్ట్రాలు, మెక్సికో, మరియు బ్రెజిల్—ఒక్కొక్కటి ఈ సంఘము యొక్క మిలియనుకు పైగా సభ్యులను కలిగి ఉంటాయని ఎవరు ఊహించి ఉంటారు?
లేదా 23 దేశాలు, ఒక్కొక్కటి 100,000 పైగా సంఘ సభ్యులతో—ఉత్తర అమెరికాలో మూడు, మధ్య మరియు దక్షిణ అమెరికాలో పధ్నాలుగు, ఐరోపాలో ఒకటి, ఆసియాలో నాలుగు మరియు ఆఫ్రికాలో ఒకటి? 16
అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మోర్మన్ గ్రంథమును “అద్భుతానికే అద్భుతము” అని పిలిచారు. 17 దాని చూచినవారు సాక్ష్యమిచ్చారు, “సమస్త జనములకు, వంశములకు, భాషలకు, జనులకు ఇది తెలియబడును.” 18 ఈరోజు, సర్వసభ్య సమావేశము 100 భాషలలో లభ్యమగుచున్నది. యేసు క్రీస్తు, ఆయన పునఃస్థాపించబడిన సువార్తను గూర్చి 138 దేశాలలో అధ్యక్షులు నెల్సన్ సాక్ష్యమిచ్చారు, మరియు హెచ్చగుట కొనసాగుతున్నది.
మోర్మన్ గ్రంథము యొక్క 1830 మొదటి ప్రచురణ యొక్క 5,000 ముద్రిత కాపీలతో ప్రారంభించి, మొత్తం మోర్మన్ గ్రంథము యొక్క 192 మిలియన్ ప్రతులు లేదా భాగం 112 భాషలలో ప్రచురించబడింది. మోర్మన్ గ్రంథ అనువాదములు డిజిటల్‌గా కూడ లభ్యమవుతున్నాయి. ప్రస్తుత మోర్మన్ గ్రంథ అనువాదాలు 50 మిలియన్ల ప్రజలు లేదా అంతకంటే ఎక్కువమంది మాట్లాడే 23 ప్రపంచ భాషలలో ఎక్కువ భాగమును, సమిష్టిగా దాదాపు 4.1 బిలియన్ ప్రజల మాతృభాషలు కలిగియున్నవి. 19
చిన్నవి, సాధారణమైన వస్తువుల ద్వారా— దానిలో పాల్గొనడానికి మనలో ప్రతిఒక్కరు ఆహ్వానించబడ్డారు—గొప్ప క్రియలు జరిగించబడును.
ఉదాహరణకు, 2,200 జనాభాగల యూటా మోన్రాయ్‌లో ఒక స్టేకు సమావేశమందు, ఎంతమంది సువార్త సేవ చేసారని నేను అడిగాను. దాదాపు ప్రతీ చేయి పైకెత్తబడింది. ఇటీవల సంవత్సరాలలో, ఆ ఒక్క స్టేకు నుండి, 564 సువార్తికులు అంటార్కిటాలో తప్ప—ప్రతీ ద్వీపములో 50 అమెరికా రాష్ట్రాలలో మరియు 53 దేశాలలో సేవ చేసారు.
అంటార్కిటికా గురించి మాట్లాడుతూ, అర్జెంటీనా యొక్క దక్షిణ కొన వద్ద ఉన్న ఉషుయాలో కూడా, మన సువార్తికులు యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్తను “భూమి యొక్క అంతము” 20 అని పిలవబడిన ప్రదేశంలో పంచుకున్నప్పుడు ప్రవచనం నెరవేరినట్లు నేను చూశాను.
యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల 21 సంఘ వృత్తాంతము యొక్క మన నాలుగు సంపుటల కవర్ల ద్వారా ఏర్పడిన కుడ్యచిత్రము సువార్తను జీవించుట వలన ప్రతిచోటా విశ్వాసులైన పరిశుద్ధులకు కలిగే మంచి ఫలితాలను ప్రపంచ వస్త్రం వర్ణిస్తుంది. ఎవరికైతే మొరోనై మోర్మన్ గ్రంథ పలకలను చూపించెనో ఆ నమ్మకమైన సహోదరి మేరీ విట్మెర్‌తో కలిపి, ప్రతి సభ్యుని యొక్క ప్రత్యక్ష సాక్ష్యం మరియు సువార్త ప్రయాణంలో మన సంఘ చరిత్ర పునాది వేయబడింది. 22
2021 జనవరిలో వచ్చే, మన మూడు ప్రపంచవ్యాప్త మాసపత్రికలు —స్నేహితుడు, యౌవనుల బలము కొరకు, మరియు లియహోనా—మన ప్రపంచవ్యాప్త సమాజము యొక్క విశ్వాసములో చేర్చబడి, అనుభవాలను, సాక్ష్యమును పంచుకోమని అందరిని ఆహ్వానిస్తున్నాయి. 23
సహోదర సహోదరిలారా, పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తునందు మన విశ్వాసమును మనము వృద్ధి చేసి, సజీవమైన పునఃస్థాపించబడిన సువార్త సత్యములు, పరిశుద్ధ నిబంధనలను జీవించుటలో మరియు కొనసాగుతున్న పునఃస్థాపన గురించి పంచుకొనుటలో కనుగొనబడిన దీవెనలు పొందినప్పుడు, మనము నెరవేర్చబడుచున్న ప్రవచనములో పాల్గొంటున్నాము.
ప్రతిచోట జీవితాలను దీవించునట్లు సువార్త నమూనాలో మనల్ని మనం, లోకమును మారుస్తున్నాము.
“నా భర్త యొక్క యాజకత్వ సేవ ఎక్కువ సహనము, దయగా అతడిని చేసిందని, ఒక ఆఫ్రికా సహోదరి చెప్పుచున్నది. నేను ఒక మంచి భార్యగా, తల్లిగా మారుతున్నాను.”
మధ్య అమెరికాలో ఇప్పుడు గౌరవనీయమైన అంతర్జాతీయ వ్యాపార సలహాదారుడు, దేవుని పునఃస్థాపించబడిన సువార్తను కనుగొనకముందు, లక్ష్యం లేకుండా వీధుల్లో జీవించానని అతడు చెప్పాడు. ఇప్పుడు అతడు, అతని కుటుంబము గుర్తింపు, ఉద్దేశము, మరియు బలమును కనుగొన్నారు.
దక్షిణ అమెరికాలో ఒక చిన్నబాలుడు తన కుటుంబము కట్టుచున్న ఇంటి కోసం కిటికీలను కొనుటకు సహాయపడటానికి కోళ్లను పెంచి, వాటి గుడ్లను అమ్ముతున్నాడు. అతడు తన దశమభాగాన్ని మొదట చెల్లిస్తాడు. పరలోకపు వాకిండ్లు తెరవబడుట అతడు అక్షరాలా చూస్తున్నాడు.
నైఋతి అమెరికాలోని నాలుగు మూలలలో, ఒక స్వదేశ నాలుగు మూలలలో, నైఋతి అమెరికాలో, ఒక స్వదేశ అమెరికా కుటుంబము సువార్త విశ్వాసము మరియు స్వశక్తిపై ఆధారపడుట యొక్క చిహ్నముగా ఎడారిలో వికసించుటకు అందమైన గులాబీ మొక్కను పెంచుతున్నారు.
భయంకరమైన పౌర యుద్ధము నుండి బ్రతికి బయపడిన ఆగ్నేయాసియాలో ఒక సోదరుడు జీవితానికి అర్థమే లేదని నిరాశపడ్డాడు. మాజీ తరగతి సహవాసి సంస్కార ట్రేను పట్టుకొని, రక్షించు విధులు మరియు యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తమును గూర్చి సాక్ష్యమిచ్చినట్లు వచ్చిన కలలో అతడు నిరీక్షణ కనుగొన్నాడు.
ఆయన ప్రేమను అనుభవించమని, విద్య, గౌరవప్రదమైన పని, స్వశక్తిపై ఆధారపడే సేవ, ఆయన పునఃస్థాపించబడిన సంఘములో మనము కనుగొనే మంచితనము యొక్క మాదిరులు మరియు సంతోషము ద్వారా వృద్ధి చెంది నేర్చుకోమని పరలోక తండ్రి మనలో ప్రతిఒక్కరిని ఆహ్వానిస్తున్నాడు.
దేవునిని మనము నమ్మగలిగినప్పుడు, కొన్నిసార్లు మన అంధకారమైన, ఒంటరియైన, మిక్కిలి అస్థిరమైన క్షణాలలో వేడుకొనుట ద్వారా, ఆయన మనల్ని బాగా ఎరుగునని మరియు మనము ఎరిగిన దానికంటే లేక మనల్ని మనం ప్రేమించే దానికంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నాడని మనము తెలుసుకుంటాము.
అందుకే మన గృహాలలో, సమాజములలో శాశ్వతమైన న్యాయము, సమానత్వము, నిష్పక్షపాతం, మరియు శాంతిని కల్పించుటకు మనకు దేవుని యొక్క సహాయము అవసరము. మనము దేవుని యొక్క విమోచించు ప్రేమను అనుభవించి, ఆయన కుమారుని యొక్క ప్రాయశ్చిత్త త్యాగము మరియు పరిశుద్ధ నిబంధనల ద్వారా కృపను, అద్భుతాలను కోరినప్పుడు శాశ్వతమైన అనుబంధాలను ఏర్పరచుకున్నప్పుడు మన నిజమైన, లోతైన, అత్యంత ప్రామాణికమైన కథనం, స్థలం మరియు చేర్చబడినది వచ్చును.
నేటి చిందరవందరయైన, ధ్వనిగల, కలుషితమైన ప్రపంచంలో, మతపరమైన మంచితనము మరియు తెలివి అవసరము. మరి ఏవిధంగా మానవ ఆత్మను మనము తాజాగా చేయగలం, ప్రేరేపించగలం, మరియు సవరించగలము? 24
హైతీలో చెట్లను నాటడం మంచి చేయడానికి కలిసి వచ్చిన జనుల యొక్క వందలాది మాదిరులలో ఒకటి మాత్రమే. చెట్లను విరాళమిచ్చిన మన సంఘము యొక్క 1,800 సభ్యులు కలిపి, స్థానిక సమాజము, దాదాపు 25,000 చెట్లను నాటడానికి సమకూడారు. 25 అడవులు పెంచే ఈ బహుళ-వార్షిక ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే 121,000 పైగా చెట్లను నాటారు. ఇంకా పదుల వేల చెట్లు నాటడానికి అంచనావేస్తున్నారు.
ఈ ఉమ్మడి ప్రయత్నము నీడను అందిస్తుంది, మట్టిని సంరక్షిస్తుంది, భవిష్యత్ వరదలను తగ్గిస్తుంది. అది పొరుగు ప్రాంతాన్ని అందముగా చేస్తుంది, సమాజమును నిర్మిస్తుంది, జనులకు ఆహారమిస్తుంది, మరియు ఆత్మను పోషిస్తుంది. ఈ చెట్లనుండి ఫలమును ఎవరు కోస్తారని హైతీయులను మీరు అడిగితే, “ఎవరికి ఆకలి వేస్తే వారు” అని వారు చెప్తారు.
ప్రపంచ జనాభాలో దాదాపు ఎనభై శాతం మంది మతపరంగా అనుబంధముగా ఉన్నారు. 26 ప్రకృతి వైపరీత్యాల తరువాత, అదేవిధంగా ఆహారం, ఆశ్రయం, విద్య, అక్షరాస్యత, మరియు ఉపాధి శిక్షణ కోసం దీర్ఘకాలిక అవసరాలకు మతపరమైన సమాజాలు తక్షణమే స్పందిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా, మన సభ్యులు, స్నేహితులు మరియు సంఘము శరణార్థులకు మద్దతు ఇవ్వడానికి సహాయపడుతున్నారు మరియు ఒక వ్యక్తి, ఒక గ్రామం, ఒక చెట్టుకు, ఒక సమయంలో—నీరు, పారిశుధ్యం, వికలాంగ చైతన్యం, కంటిచూపు సంరక్షణ అందిస్తున్నారు. 27 ప్రతీచోటా, కడవరి-దిన పరిశుద్ధుల స్వచ్చంధ సేవల ద్వారా, కలిపి, మన పొరుగు ప్రాంతాలకు మరియు సమాజములందు తోడ్పడుటకు మనము మంచి తల్లిదండ్రులు, మంచి పౌరులుగా ఉండటానికి కోరుతున్నాము. 28
దేవుడు మనకు నైతిక ప్రాతినిధ్యము—మరియు నైతిక ఉత్తరవాదిత్వము ఇచ్చాడు. “ఆయన మనల్ని స్వతంత్రులుగా చేస్తానని ప్రభువైన దేవుడు చెప్పాడు, కాబట్టి వాస్తవానికి [మనము] స్వతంత్రంగా ఉన్నాము.” 29 “చెరలోనున్నవారికి విడుదల” 30 ప్రకటిస్తూ ప్రభువు తన ప్రాయశ్చిత్తఃము మరియు సువార్త మార్గము భౌతికమైన మరియు ఆత్మ సంబంధమైన బంధకాలను విడిపిస్తాయని వాగ్దానమిచ్చాడు. 31 కనికరముగా, ఈ విమోచనా స్వాతంత్ర్యము మర్త్యత్వమునుండి వెళ్లిపోయిన వారికి విస్తరించబడింది.
కొన్ని సంవత్సరాల క్రితం, మధ్య అమెరికాలో ఒక యాజకుడు, తాను కడవరి-దిన పరిశుద్ధుని “మృతిచెందిన వ్యక్తుల కొరకు బాప్తీస్మము” అధ్యయనం చేస్తున్నానని నాతో చెప్పాడు. “వారు ఎప్పుడు లేక ఎక్కడ నివసించినప్పటికినీ, ‘క్రీస్తునందు సజీవులైన’ 32 చిన్నబిడ్డలు తప్ప బాప్తీస్మము పొందటానికి ప్రతిఒక్కరికి దేవుడు అవకాశమిచ్చుట,” “న్యాయమైనదిగా కనబడుచున్నది” అని యాజకుడు చెప్పాడు. అపొస్తులుడైన పౌలు, “మృతులు బాప్తీస్మము, పునరుత్థానము కొరకు వేచియుండుటను గూర్చి మాట్లాడాడని,” యాజకుడు గమనించాడు. 33 ప్రాతినిధ్య దేవాలయ విధులు ఏ ఒక్కరు “మరణము, నరకము, లేక సమాధి యొక్క బానిసలుగా నిలిచియుండాల్సిన” అవసరం లేదని “ప్రతీరాజ్యములకు, జనమునకు, మరియు ఆయా భాషలు మాటలాడువారికి” వాగ్దానమిచ్చును. 34
మనము దేవునిని కనుగొన్నప్పుడు, కొన్నిసార్లు ప్రార్ధనలకు ఊహించని జవాబులు నిరాశ్రయులైన వ్యక్తి ఆశ్రయము కనుగొనుటకు సహాయపడుట మనల్ని కష్టమైన పరిస్థితుల నుండి తీసివేయుటకు మనకు సహాయపడును, సమాజ భావన కనుగొనుటకు సహాయపడును, మన ఆత్మల నుండి చీకటిని తరిమివేయును, మరియు ఆయన నిబంధనల యొక్క మంచితనము మరియు శాశ్వత ప్రేమయందు ఆత్మీయ ఆశ్రయమును మరియు చేర్చబడుటను కనుగొనుటకు మనల్ని నడిపించును.
గొప్ప విషయాలు తరచుగా చిన్న వాటితో ప్రారంభమవుతాయి, కానీ దేవుని యొక్క అద్భుతాలు ప్రతిరోజు ప్రత్యక్షపరచబడతాయి. పరిశుద్ధాత్మ యొక్క దివ్యమైన వరము, యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తఃము మరియు ఆయన నామములో పిలవబడిన, ఆయన పునఃస్థాపించబడిన సంఘములో కనుగొనబడిన, ఆయన బయల్పరచిన సిద్ధాంతము, విధులు మరియు నిబంధనల కొరకు మనము ఎంత కృతజ్ఞత కలిగియున్నాము.
ప్రతీరాజ్యములకు, ప్రతి జనమునకు, మరియు ఆయా భాషలు మాటలాడు వారందరికీ, ఆయన వాగ్ధానము చేసిన, ప్రవచించిన దీవెనలు పొందుటకు మరియు నెరవేర్చుటకు సహాయపడుటకు దేవుని యొక్క ఆహ్వానమును మనము సంతోషకరంగా అంగీకరిద్దామా, యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన, పవిత్రమైన నామములో నేను ప్రార్ధిస్తున్నాను, ఆమేన్.