సర్వసభ్య సమావేశము
కుమారుని యొక్క మిక్కిలి శ్రేష్టమైన వరము
అక్టోబరు 2020 సర్వసభ్య సమావేశము


కుమారుని యొక్క మిక్కిలి శ్రేష్టమైన వరము

యేసు క్రీస్తు ద్వారా, మన నైతిక వైఫల్యాల వలన పొందాల్సిన వేదనల నుండి మనం తప్పించుకోవచ్చు మరియు మన మర్త్య దురదృష్టాల యొక్క అవాంఛనీయ వేదనలు జయింపబడవచ్చు.

గత సంవత్సరం రండి, నన్ను అనుసరించండి కొరకు మోర్మన్ గ్రంథమును చదువుచుండగా, ఆల్మా తన పాపములన్నిటిని పూర్తిగా గుర్తు చేసుకొన్నప్పుడు అతడి నివేదిక చేత నేను చాలా ఆశ్చర్యపడ్డాను, “[అతడి] బాధలున్నంత తీవ్రము మరియు అంత చేదుగా మరేదీయు లేదు.” 1 ఆ వారము ఏడు మిల్లీ మీటర్ల మూత్రపిండాల రాయితో నా పోరాటము వలన పాక్షికంగా తీవ్రమైన బాధ గురించి మాట్లాడుట నా దృష్టిని ఆకర్షించిందని నేను ఒప్పుకుంటున్నాను. “సాధారణమైన చిన్న” విషయము “జరిగినప్పుడు” ఏ వ్యక్తి అయినా అటువంటి “గొప్ప విషయాలను ” 2 అనుభవించలేదు.

ఆల్మా ఎంపిక చేసిన మాటలందు నేను ఆసక్తి చెందాను, ఎందుకనగా తీవ్రమైన అనే మాట మోర్మన్ గ్రంథము ఆంగ్ల అనువాదములో, అసాధారణమైన అందము లేక అసమానమైన అద్భుతమైన విషయాలను సాధారణంగా వర్ణించింది. ఉదాహారణకు, మొరోనై దూత “అత్యధికముగా తెల్లని,” అంగీ ధరించాడని, “ఆ తెలుపు [అతడు] ఇప్పటివరకు చూచిన భూసంబంధమైన వాటన్నింటిని మించి మిక్కిలి తెలుపైయుండెను” అని జోసెఫ్ స్మిత్ గుర్తించాడు. 3 అయినప్పటికీ, తీవ్రమైన అనే పదము భయంకరమైన విషయాల గురించి కూడా మిక్కిలి తీవ్రతను తెలియజేస్తుంది. కాబట్టి ఆల్మా మరియు మంచి నిఘంటువులు తీవ్రమైన బాధకు “బాధింపబడెను,” “వేధింపబడెను” మరియు “వేదింపబడి,” “తీవ్రమైన స్థితికి” జోడిస్తాయి. 4

ఏదో ఒక సమయంలో మనం చేసే ప్రతి పాపానికి పూర్తి, విచారకరమైన అపరాధ భావనను, అనుభవించాలనే గంభీరమైన వాస్తవమును ఆల్మా యొక్క ఊహా చిత్రము ప్రతిఫలించును. న్యాయము దానిని కోరును, మరియు దేవుడు తానే దానిని మార్చలేడు. 5 ఆల్మా పాపములు “అన్నిటిని” —ప్రత్యేకంగా ఇతరుల విశ్వాసమును నాశనము చేసిన వాటిని జ్ఞాపకంముంచుకొన్నప్పుడు— అతడి బాధ వాస్తవంగా భరించలేనిది, మరియు దేవుని యెదుట నిలబడుట అనే ఆలోచన “చెప్పలేని భీతితో” అతడిని నింపెను. అతడు “ఆత్మ మరియు శరీరము రెండును నశించిపోయియుండ గలిగిన మేలు” 6 అని ఆపేక్షించాడు.

అయినప్పటికీ, ప్రవచించబడిన “లోకము యొక్క పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయుటకు … యేసు క్రీస్తు యొక్క రాకడను గూర్చి” “జ్ఞాపకము చేసుకున్న” క్షణములో సమస్తము మారటం ప్రారంభమైందని ఆల్మా చెప్పాడు మరియు అతడు “[తన] హృదయములో మొరపెట్టెను: ఓ యేసు, దేవుని యొక్క కుమారుడవైన నీవు నాపై కనికరము చూపించుము.” ఆ ఆలోచన మరియు ఆ ఒక్క మనవితో, ఆల్మా “ [తన] బాధ కంటె మిక్కిలి ఎక్కువగా” “తీవ్రమైన ” 7 ఆనందముతో నింపబడ్డాడు.

పశ్చాత్తాపము యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యమేదనగా, నిర్ధిష్టమైన దుఃఖమును తీసుకొని, దానిని స్వచ్ఛమైన సంపూర్ణ ఆనందములోనికి మార్చుట అని మనము ఎన్నడూ మరచిపోరాదు. ఆయన “తక్షణపు మంచితనమునకు” 8 కృతజ్ఞతలు, ఆయనయందు విశ్వాసమును మరియు హృదయము యొక్క నిజమైన మార్పును నిరూపిస్తూ—మనము క్రీస్తునొద్దకు వచ్చిన వెంటనే—మనల్ని నలుగగొట్టె పాపముల బరువు మన వీపుల మీదనుండి ఆయనకు మారుట ప్రారంభమగును. పాపములేని ఆయన, ఆయన సమస్త సృష్టి, ఆయన సృష్టించిన విశ్వములో ప్రతీ పాపము కొరకు “అంతములేని, చెప్పనలవికాని వేదనను,“ 9 బాధను అనుభవించాడు—ఆ బాధ ఎంత తీవ్రమైనది అనగా, ఆయన ప్రతి రంధ్రమునుండి రక్తము బయటకు వచ్చెను. ప్రత్యక్షమైన, వ్యక్తిగత అనుభవాల నుండి, రక్షకుడు ఆధునిక లేఖనంలో, మనం పశ్చాత్తాపపడకపోతే మన “బాధలు” ఎంత “తీవ్రమైనవి”అవుతాయో మనకు తెలియదని మనల్ని హెచ్ఛరించెను. తరువాత, గ్రహింపశక్యముకాని ఔదార్యముతో ఆయన స్పష్టపరచెను, “ఇదిగో, దేవుడైన నేను అందరి కొరకు ఈ విషయాలను అనుభవించాను, ఆవిధంగా వారు పశ్చాత్తాపపడిన యెడల వారు బాధపడరు” 10 —ఆల్మా రుచి చూచిన “అమితమైన ఆనందమును” “రుచి చూచుటకు” పశ్చాత్తాపము మనకు సాధ్యపరచును. 11 ఈ ఒక్క సిద్ధాంతము కొరకు, “నేను ఆశ్చర్యంతో నిలిచాను.” 12 అయినప్పటికీ, విస్మయంగా క్రీస్తు ఇంకా ఎక్కువ ఇస్తున్నాడు.

కొన్నిసార్లు తీవ్రమైన బాధ పాపము నుండి రాదు కానీ ఉద్దేశ్యపూర్వకంగా చేయని తప్పులు, ఇతరుల చర్యలు, లేక మన అధీనంలో లేని శక్తులను మించి వస్తాయి. ఆ క్షణాలలో, మీరు నీతిగల కీర్తనాకారుని వలె దుఃఖించవచ్చు:

“నా గుండె నాలో వేదనపడుచున్నది: మరణభయము నాలో పుట్టుచున్నది.

“ … మహాభయము నన్ను ముంచివేసెను.

“ … ఆహా గువ్వవలె నాకు రెక్కలున్నయెడల! నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే.” 13

వైద్య శాస్త్రము, నిపుణుల సలహా, లేదా చట్టపరమైన దిద్దుబాటు వంటివి అటువంటి బాధను తగ్గించడానికి సహాయపడగలవు. కాని వీటితో కలిపి, మంచి వరములన్నీ—రక్షకుని నుండి వచ్చినవని గమనించండి. 14 మన మిక్కిలి చెడ్డ గాయాలు, హృదయ వేదనలకు కారణాలతో సంబంధం లేకుండా, ఉపశమనము యొక్క అంతిమ ఆధారము ఒక్కటే: యేసు క్రీస్తు. ఆయన మాత్రమే ప్రతీ పొరపాటును సరిదిద్దుటకు, ప్రతీ తప్పును సరిచేయుటకు, ప్రతీ లోపమును సరిచేయుటకు, ప్రతీ గాయమును బాగు చేయుటకు, మరియు ఆలస్యము చేయబడిన ప్రతీ దీవెనను ఇచ్చుటకు సంపూర్ణ శక్తిని మరియు స్వస్థపరచు ఔషధమును కలిగియున్నాడు. “మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు,” 15 కానీ బదులుగా ఆయన పైన తన సింహాసనము మీదనుండి దిగివచ్చిన ప్రేమగల విమోచకుడు, “ప్రతిరకమైన బాధలు, శ్రమలు మరియు శోధనలు అనుభవించుచూ … ఆయన తన జనులను ఎట్లు ఆదరించవలెనో … ఆయన ఎరుగునట్లు, ” 16 ముందుకు వెళ్లునని పాత సాక్షుల వలె, నేను సాక్ష్యమిస్తున్నాను.

ఈ రోజు చాలా తీవ్రమైన లేదా ప్రత్యేకమైన నొప్పులతో ఉన్న ఎవరికైనా మరెవరూ వాటిని పూర్తిగా గ్రహించలేరని మీకు అనిపించినప్పుడు, ఒక విధంగా మీరు సరైనవారు కావచ్చు. ప్రతి ఒక్కరూ ఎంత సున్నితంగా మరియు మంచి విషయాన్ని చేయడానికి ప్రయత్నించినప్పటికీ—మీరు అనుభవిస్తున్న దానిని ఖచ్చితంగా ఎరిగిన వారు లేక స్వస్థపడుటకు మీకు సహాయపడుటకు ఖచ్చితమైన మాటలు గల—కుటుంబ సభ్యుడు, స్నేహితుడు లేదా యాజకత్వ నాయకుడు ఉండకపోవచ్చు. కానీ దీనిని తెలుసుకొనుము: మీరు అనుభవిస్తున్న దానిని పరిపూర్ణంగా గ్రహించేవారు ఒకరున్నారు, ఆయన “భూనివాసులందరికన్నను బలవంతుడు” 17 మరియు ఆయన “[మీరు] అడుగు వాటన్నిటికంటెను, లేక ఊహించు వాటన్నిటికంటెను అత్యధికముగా చేయు శక్తిగల వాడు.” 18 ఈ ప్రక్రియ ఆయన మార్గంలో మరియు ఆయన సమయంలో విప్పబడుతుంది, కానీ మీ వేదన యొక్క ప్రతీ ఔన్సు మరియు మీ వేదన యొక్క అంశమును స్వస్థపరచుటకు క్రీస్తు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు.

ఆవిధంగా చేయడానికి ఆయనను మీరు అనుమతించినప్పుడు, మీ వేదన వ్యర్ధముకాదని మీరు కనుగొంటారు. బైబిలు యొక్క గొప్ప నాయకులలో అనేకమంది, వారి విచారములను గూర్చి మాట్లాడుతూ, అపొస్తులుడైన పౌలు ఇలా చెప్పాడు, “దేవుడు … వారి బాధలు ద్వారా వారి కోసం కొన్ని మేలైన విషయాలను సమకూర్చాడు, ఏలయనగా బాధలు లేకుండా వారు పరిపూర్ణముగా చేయబడరు.” 19 మీరు చూడండి, దేవుని యొక్క స్వభావము మరియు మన భూలోక ఉనికి యొక్క లక్ష్యము సంతోషము కలిగియుండుట, 20 కాని మనల్ని పరీక్షించే అనుభవాలు, కొన్నిసార్లు మన సమస్త బలమును పూర్తిగా ఉపయోగించే కొన్ని శ్రమలు లేకుండా మనము దైవిక ఆనందము యొక్క పరిపూర్ణమైన ప్రాణులము కాలేము. రక్షకుడు కూడ తానే శాశ్వతంగా “శ్రమల ద్వారా సంపూర్ణునిగా [లేక పరిపూర్ణుడు]” చేయబడెనని పౌలు చెప్పాడు. 21 కనుక మీరు మంచి వారైతే, అటువంటి శ్రమలను తప్పించుకుంటారనే, సాతాను గుసగుస నుండి కాపాడుకొనుము.

దేవుడు ఏర్పరచుకొనిన వారు సంతోషమును, దీవెనలు మాత్రమే ఆనందిస్తారని, ఎన్నడూ కష్టమైన సమయాలను కలిగియుండరని, వారిలో మీరు భాగముగా లేరని ఏదోవిధంగా మీ బాధలు సూచిస్తున్నాయనే సంబంధిత అబద్ధాన్ని కూడ మీరు ఎదిరించాలి. బదులుగా, కడవరి దినాలను గూర్చి అతడి ఘనమైన ప్రకటనలో ప్రకటనకారుడైన యోహాను మిమ్మల్ని చూసినట్లుగా మిమ్మల్ని మీరు చూడండి. ఏలయనగా యోహాను “ప్రతి జనములో నుండియు, ప్రతి వంశములో నుండియు, ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడు వారిలోనుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను, వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై, సింహాసనము ఎదుటను, గొఱ్ఱెపిల్ల యెదుటను నిలువబడి, … [వారు] మన దేవునికి రక్షణ అని మహా శబ్ధముతో ఎలుగెత్తి చెప్పిన [వారిని]” చూసెను.” 22

“ఈ తెల్లటి వస్త్రాలను ధరించిన వారు ఏమిటి? మరియు వారు ఎక్కడి నుండి వచ్చారు?” అని అడగబడినప్పుడు: యోహాను జవాబు పొందాడు: “వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసికొనిరి.” 23

సహోదర, సహోదరిలారా, నీతియందు బాధపడుట, దేవుని యొక్క ఏర్పరచబడిన వారి నుండి మిమ్మల్ని ప్రత్యేకించుటకు బదులుగా, మిమ్మల్ని యోగ్యులుగా చేయుటకు సహాయపడుతుంది. మరియు అది వారి వాగ్దానములు మీ వాగ్దానములుగా చేస్తుంది. యోహాను ప్రకటించినట్లుగా, మీకు “ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను [మీకు] తగులదు. ఏలయనగా సింహాసనం మధ్యనుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు [మిమ్మల్ని] నడిపించును: దేవుడే [మీ] కన్నులనుండి ప్రతి భాష్పబిందువును తుడిచి వేయును.” 24

“మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనయైనను ఇక ఉండదు.” 25

యేసు క్రీస్తు యొక్క మిక్కిలి గొప్ప మంచితనము—ఆయన ప్రాయశ్చిత్త త్యాగము ద్వారా—మన మర్త్య వైఫల్యముల వలన పొందాల్సిన వేదనలు మరియు మన జీవితంలో దురదృష్టకరంగా కలిగిన వేదనలు జయింపబడగలవని నేను మీకు సాక్ష్యమిస్తున్నాను. ఆయన నడిపింపు క్రింద, మీ దైవిక గమ్యము అసమానమైన అద్భుతాలలో మరియు వర్ణనకతీతమైన ఆనందంలో ఒకటిగా ఉండును—అది మీకు చాలా ప్రబలమైన మరియు చాలా ప్రత్యేకమైన ఆనందం, మీ ప్రత్యేకమైన “బూడిదలు” “భూసంబంధమైన దేనినైనా మించిన” 26 అందమైనవి మారతాయి. ఇప్పుడు ఈ సంతోషమును మీరు అనుభవించి, దానితో శాశ్వతంగా నింపబడతారని నేనాశిస్తున్నాను, ఆల్మా చెప్పిన దానిని చేయమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను: ఆయన నిజమైన, జీవిస్తున్న సంఘములో, ఆయన సువార్త ద్వారా బయల్పరచబడినట్లుగా, దేవుని కుమారుని యొక్క శ్రేష్టమైన వరముపై మీ మనస్సు పట్టుకోనియ్యుడి. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

ముద్రించు